Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేసింది. ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు, అలాగే జీఎహెచ్‌ఎంసీ  జోనల్ కమిషనర్లను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. 

    గురువారం ప్రభుత్వం విడుదల చేసిన నోటిషికేషన్‌లో జయేష్ రంజన్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ, మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్‌మెంట్   బాధ్యతలు అప్పగించారు. ఆయనకు యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్‌ కల్చర్, స్పోర్ట్స్, అలాగే ఆర్కియాలజీ డైరెక్టర్ పదవుల అదనపు బాధ్యతలు కొనసాగుతాయి.

    అదే సమయంలో, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లకు కమిషనర్లను నియమించారు. సిరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్, ఎల్.బి.నగర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్ జోన్లకు కొత్త ఐఏఎస్‌ అధికారులు, అదనపు కలెక్టర్లు నియమితులయ్యారు. వీరిలో భోర్కాడే హేమంత్ సహదేవరావు, అపూర్వ్ చౌహాన్, సందీప్ కుమార్ ఝా, ప్రియాంకా అలా, అనురాగ్ జయంతి, సచిత్ గంగ్వార్, రాధికా గుప్తా వంటి అధికారులు ఉన్నారు.

    ఇక, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ హరితను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో గరిమా అగర్వాల్  తాత్కాలికంగా కలెక్టర్ బాధ్యతలు చేపడతారు. అదేవిధంగా, ఈ.వి. నరసింహా రెడ్డిను మూసి రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. అదనంగా, పలు కీలక విభాగాల్లో తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. భవేష్ మిశ్రాకు ఇండస్ట్రీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈవో బాధ్యతలు అప్పగించగా, నిర్మల కన్తి వెస్లీను డైరెక్టర్, ఎంప్లాయ్‌మెంట్ అండ ట్రైనింగ్ ఎఫ్‌ఏసీఎస్‌గా నియమించారు.

  • సాక్షి,హైదరాబాద్‌: వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరుపుకునే కైట్‌ ఫెస్టివల్‌ను చెరువుల వద్ద ప్రత్యేకంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఆదేశాలు జారీ చేశారు.

    గురువారం  జూబ్లీహిల్స్ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలపై  కమిషనర్ వివరాలు అందించారు. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణలో ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరిస్తూ, ప్రజలకు అందించే ప్రయోజనాలను వివరించారు.

    అనంతరం,సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చెరువుల వద్ద ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు టూరిజం శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.  ప్రజలతో పాటు ఐటీ రంగ ప్రముఖులు, ఉద్యోగులు పాల్గొనేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని  సూచించారు.

    అలాగే, కూకట్‌పల్లి నల్లచెరువు వద్ద సినిమా ప్రముఖులతో, రాజేంద్రనగర్ బురుకుద్ఫిన్ చెరువు వద్ద క్రీడాకారులతో కలిసి కైట్ ఫెస్టివల్ జరపాలని ఆదేశించారు. ఈ ఉత్సవాన్ని జనవరి 11, 12, 13 తేదీలలో నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలిపారు. చెరువుల పునరుద్ధరణతో పాటు ప్రజలలో అవగాహన పెంచేందుకు, పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు ఈ కైట్ ఫెస్టివల్ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • సాక్షి,హైదరాబాద్: జీహెచ్‌ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్‌ (ORR) వరకు విస్తరించడంతో పాటు, జోన్లు సర్కిల్స్ సంఖ్యను పెంచుతూ అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

    ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు పెంచుతూ, 30 సర్కిల్స్‌ను 60కు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది.

    జీహెచ్‌ఎంసీ వార్డుల డీ లిమిటేషన్‌పై కూడా ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు ఖరారు చేశారు. ఈ నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు, పదిరోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సమయంలో 6 వేలకు పైగా అభ్యంతరాలు అందాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఈరోజు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

    ఈ నిర్ణయంతో GHMC పరిధిలో పరిపాలన మరింత విస్తృతమవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఉండటం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

     

  • సాక్షి, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 198 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను, 114 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (TGPRB) తీసుకుంది.

    ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ నెల (డిసెంబరు) 30వ తేదీ నుంచి 2026 జనవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించే ముందు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో అర్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు సూచించారు. 
     

    జీతభత్యాల విషయానికి వస్తే, ఎంపికైన ట్రాఫిక్, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీలకు నెలకు రూ. 27,080 నుంచి రూ. 81,400 వరకు పే స్కేల్ వర్తిస్తుంది. దరఖాస్తు రుసుముగా ఎస్‌సీ, ఎస్టీ, తెలంగాణ స్థానిక అభ్యర్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన కేటగిరీల అభ్యర్థులందరికీ రూ. 800 ఫీజుగా నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

  • కరీంనగర్: సైదాపూర్ మండలం శివరాంపల్లిలో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిందని, పదవ తరగతి చదివే విద్యార్థినిని బలవంతంగా పురుగుల మందు తాగించి గొంతు నులిమి తల్లిదండ్రులే హత్య చేశారు. ఆ తరువాత కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఈ ఘటన గత నెల 14న జరిగింది. పోలీసుల విచారణ అనంతరం తల్లిదండ్రులే హత్య చేశారని నిర్థారించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హుజూరాబాద్ ఏసీపీ మాధవి వెల్లడించారు.

  • సికింద్రాబాద్‌: కంటోన్మెంట్‌లను మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దుతామని 2020లో చట్టంలో మార్పులు చేస్తూ నూతన చట్టానికి రూపకల్పన చేశారు. రెండేళ్లపాటు పార్లమెంట్‌ సమావేశాల ఎజెండాలో చేర్చినప్పటికీ, ఈ బిల్లుకు ఆమోదం లభించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే కంటోన్మెంట్‌లను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తామంటూ కేంద్రం సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇంతలోనే రెండేళ్ల క్రితం కంటోన్మెంట్‌ బోర్డుల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. తీరా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందనే లోపే ఎన్నికల నోటిపికేషన్‌ను ఉపసంహరించుకుంది.

    అటు కొత్త చట్టం లేదు.. ఇటు విలీనం లేదు.. నాలుగేళ్లుగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ప్రజాస్వామ్యమే లేదు. ఇదేమని అడిగితే ప్రతిసారీ ఏదో ఒక సాకుతో దాటవేయడమే తప్ప ఒక్కడ అడుగు కూడా ముందుకు పడలేదు. కంటోన్మెంట్‌లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కొందరు కోర్టుకెళ్లినా ప్రయోజనం లేదు. తాజాగా ఢిల్లీ హైకోర్టు బోర్డు ఎన్నికలపై తేల్చాలంటూ కేంద్రానికి స్పష్టమైన సూచన చేసింది. ఈ నేపథ్యంలోనైనా కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.  

    నాలుగేళ్లుగా వెరీడ్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలోనే... 
    దేశంలోనే అతిపెద్దదైన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌తోనే (Secunderabad cantonment board) విలీన ప్రక్రియను మొదలు పెట్టి 2023 జనవరి 4న కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఒక్కసారి మాత్రమే ఈ కమిటీ భేటీ జరగ్గా, ఆ సమావేశం మినిట్స్‌ ఏంటో ఇప్పటికీ బహిర్గతం కాలేదు. ఇదిలా ఉండగా కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలు జరిగి వచ్చే నెలకు  (జనవరి 11, 2015) సరిగ్గా పదకొండేళ్లు పూర్తవుతుంది. ఐదేళ్ల సాధారణ పదవీకాలంతో పాటు ఏడాది పొడిగింపుతో సాధారణ బోర్డు పదవీకాలం పూర్తయి ఐదేళ్లు  అవుతోంది. ప్రజా ప్రతినిధులు లేకండానే ఐదేళ్లుగా బోర్డులో అధికారుల పాలనే కొనసాగుతోంది. బోర్డులో ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ, ప్రత్యేక పాలన కొనసాగించడంపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నా కేంద్రం స్పందించడం లేదు.

    ఎనిమిది మంది అధికారులు ఎనిమిది మంది ప్రజాప్రతినిధులతో కూడిన బోర్డు స్థానంలో నాలుగేళ్లుగా వెరీడ్‌ బోర్డునే కొనసాగిస్తున్నారు. స్థానిక మిలిటరీ స్టేషన్‌ కమాండర్‌ అధ్యక్షుడిగా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సభ్య కార్యదర్శిగా వ్యవహరించే బోర్డులో కేంద్ర ప్రభుత్వం నియమించే సివిలియన్‌ నామినేటెడ్‌ మెంబర్‌ మరో సభ్యులుగా ఉంటారు. కేంద్రం బీజేపీకి చెందిన సభ్యులను మాత్రమే నామినేటెడ్‌ సభ్యులుగా నియమిస్తూ వస్తోంది. తొలి మూడేళ్లు రామకృష్ణ నామినేటెడ్‌ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది జనవరి నుంచి భానుక నర్మదా (Banuka Narmada) నామినేటెడ్‌ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ఆమె పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఈ పదవి కోసం బీజేపీ నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి.

    నాలుగేళ్లుగా ఎన్నికలు జరపకుండా నామినేటెడ్‌ సభ్యులతోనే పాలన సాగించడాన్ని స్థానికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్‌ సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తక్షణమే కంటోన్మెంట్‌ బోర్డ్‌ ఎన్నికల నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. లేనిపక్షంలో జీహెచ్‌ఎంసీలో విలీన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. 

    2015లో చివరి ఎన్నికలు.. 
    రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కంటోన్మెంట్‌లో ది కంటోన్మెంట్స్‌ యాక్ట్‌ –1924 పేరిట బ్రిటీష్‌ జమానాలోనే ప్రత్యేక పాలన మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి అనేక చట్టాలు అమల్లోకి వచ్చినా, కంటోన్మెంట్‌లలో మాత్రం ఎలాంటి మార్పుల్లేవు. దాదాపు 80 ఏళ్ల తర్వాత 2006లో పురాతన చట్టంలో కొద్దిపాటి మార్పులతో నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. 1987 వరకు కంటోన్మెంట్‌ బోర్డుకు మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగ్గా, 1992 నుంచి ఐదేళ్లకోసారి నిర్వహిస్తూ వచ్చారు.

    చ‌ద‌వండి: సెల‌వులు పెట్టి.. చెక్కేస్తున్నారు!

    2015 జనవరి 11న చివరిసారిగా కంటోన్మెంట్‌కు ఎన్నికలు జరిగాయి. 100 ఏళ్లకు పైబడిన పురాతన చట్టాల్లో మార్పులు చేపట్టిన మోడీ సర్కారు, కంటోన్మెంట్‌ చట్టంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ది కంటోన్మెంట్‌ బిల్‌–2020 పేరిట ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టి, పార్లమెంట్‌ ఆమోదం కోసం ఎజెండాలో చేర్చారు. రెండేళ్లపాటు ఎజెండాకే పరిమితమైన ఈ బిల్లు పేరు మార్పు మినహా నేటికీ ఆమోదానికి నోచుకోలేదు.  

    విలీనం పేరిట కాలయాపన..  
    దేశవ్యాప్తంగా కంటోన్మెంట్‌లను సమీప స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని మూడేళ్ల క్రితమే కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖలు రాయగా, తెలంగాణ ప్రభుత్వం భేషరతుగా అంగీకరిస్తూ తక్షణమే స్పందించింది. దీంతో 2023 జనవరి 4న ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విధి, విధానాలపై చర్చించింది. వివిధ రాష్ట్రాల్లో కంటోన్మెంట్‌ల విలీనానికి సంబంధించిన ప్రక్రియ వేగంగా సాగుతున్నప్పటికీ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ విలీనం ఊసే లేకుండా పోయింది. 2024 జూన్‌లో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మరోసారి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇదిలా ఉండగా, 2023 ఫిబ్రవరిలో కంటోన్మెంట్‌లకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం, అర్ధంతరంగా ఉపసంహరించుకుంది. 

  • ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్‌లో హనుక్కా వేడుకలో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదుల జరిపిన మారణ కాండలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి వార్తల్లో నిలిచారు. బాధితుల్లో ఎక్కువ మందిని కాపాడి పాషా రహమత్‌ హైదరాబాద్‌కు చెందిన వారు. పాషా ధైర్యం, తెగువ తెలుగు వారికి గర్వకారణంగా నిలిచింది. ఆరేళ్లకు పైగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రహమత్ పాషా, సిడ్నీలో జరిగిన బాండీ బీచ్ ఉగ్రవాద దాడి సందర్బంగా చూపిన ధైర్యసాహసాలకు ప్రశంసలు అందుకుంటున్నారు. తీవ్రంగా గాయపడిన దాదాపు 20 మంది బాధితులను రక్షించడంలో, వారికి సహాయం చేయడంలో పాషా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. అత్యంత క్లిష్ట సమయాల్లో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శించిన ఈ యువకుడిని వీరుడిగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో సైతం ప్రశంసలు వెల్లువెత్తాయి. 'హైదరాబాద్‌కి షాన్‌' పాషాతో సాక్షి ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..

    మానవత్వమే ముఖ్యమ‌నుకున్నా
    ‘‘ఇండియా నుంచి వచ్చిన చాలా మంది లాగానే నేను కూడా క్యాబ్‌  డ్రైవర్‌గా పనిచేస్తున్నా.‌ సండే కనుక బీచ్‌ చాలా సందడిగా ఉంది. ఉన్నట్టుండి శబ్దం వినిపించింది. ముందు ఏవో క్రాకర్లు అనుకున్నాను. కానీ అవి తుపాకీ కాల్పుల శబ్దాలు అని తరువాత తెలిసింది. దుండగుడికి సమీపంలోనే తను వెనుకనే నేను ఉన్నా. ముందు నాకు చాలా భయమేసింది. ఎక్కడ చూసినా అరుపులు కేకలు. అందరి ఎవరికి వారు పారిపోతున్నారు. ఒక పెద్దావిడ‌ సాయం అడుగుతున్నపుడు నేను కాదనలేకపోయాను. అపుడు ఆమెకు కాపాడటమే ముఖ్యం అనుకున్నాను. ఆమెను రక్షించడంలో సాయపడ్డాను. నా కళ్లముందే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో పడిపోయారు. 

    దేశం, కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నింటికంటే మానవత్వం ముఖ్యం అనుకున్న. నాకు నా మతం కూడా అదే నేర్పించింది. అలా నన్ను సాయం అడిగిన మహిళతో పాటు, ఒక పోలీసు సహా 20 మంది వ‌ర‌కు గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించాము. అర్థరాత్రి దాకా వారిని అంబులెన్స్‌లో తరలిస్తూనే ఉన్నాం. ఆ తరువాత ఒక్కసారిగా నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఎపుడూ ఇలాంటి దుర్ఘటనలు చూడలేదు. అందుకే చెప్పలేనంత దుఃఖం పొంగుకొచ్చింది. బాధితుల ఆర్తనాదాలు,పచ్చని పరిసరాలు రక్తం మరకలతో నిండిపోయిన దృశ్యాలు కళ్ల ముందు కదలాడాయి. నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోలేని విషాదంగా మిగిలిపోతుంది. నా కళ్లముందు అలా మనుషులు చనిపోవడం తట్టుకోలేనంత బాధను మిగిల్చింది.

    ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్‌ క్రిస్మస్‌ కానుక

    నిద్ర రావడంలేదు
    ఈ దుర్ఘటనను తలచుకుంటే నా మనసంతా కకావికలమైపోతుంది. నిద్ర రావడంలేదు. మరీ ముఖ్యంగా నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వాడు కావడంతో నా కుటుంబానికి, నా భార్య, బిడ్డకు ఏదైనా హాని చేస్తాడేమోనని చాలా భయమేస్తోంది. అందుకే మానసిక చికిత్స తీసుకుంటున్నాను. నా పాపకు స్టడీ, మంచి జీవితం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను అంటూ తన అనుభవాలను షేర్‌చేసుకున్నారు పాషా. 2019 నుండి ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రహమత్ పాషాకు హైదరాబాద్‌లో కుటుంబం ఉంది. తల్లి దండ్రులు, భార్య చిన్న పాప ఉన్నారు.

    కాగా, ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత కిరాతకంమైన ఘటనగా నిలిచిన బాండీ బీచ్‌ కాల్పుల ఘటన నిందితుల మూలాలు హైదరాబాద్‌లో తేలడం కలకలం రేపింది. తండ్రీకొడుకులైన సాజిద్‌ అక్రమ్‌ (50), నవీద్‌ అక్రమ్‌ (24) పక్కా వ్యూహంతోనే ఈ మారణహోమానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. 

  • 2026 నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో ఈ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన పోలీసులు.. బుధవారం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు డిసెంబర్ 31 వరకు కొనసాగనున్నాయి.

    పోలీసులు నిర్వహించిన స్పెషల్ తనిఖీలలో తొలిరోజే.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్టులో 304 మంది పట్టుబడ్డారు. ఇందులో ఓ మైనర్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించినవారి వాహనాలు స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా.. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    మద్యం మత్తులో వాహనాలను నడిపి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని సూచిస్తూ.. వాహదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఉద్దేశ్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.

  • హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కొట్టడంతో భార్య మృతి చెందిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన రారాజు,  విజయలక్ష్మి
    దంపతులు నగరానికి వచ్చి గోకుల్‌ ప్లాట్స్‌లో ఉంటున్నారు. రారాజు స్థానికంగా ఇసుక, ఇటుక వ్యాపారం చేస్తున్నాడు. గత కొంతకాలంగా రారాజు మద్యానికి బానిస కావడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 

    మంగళవారం మధ్యాహ్నం వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన రారాజు భార్య  విజయలక్ష్మి మొఖంపై రారాజు బలంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మియాపూర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు.  

  • సాక్షి, హైదరాబాద్‌: సన్న బియ్యం తిన్నగా లబ్ధిదారులకే చేరాలి. లేదంటే.. మూడోకన్ను ఉంది జాగ్రత్త! విజి‘లెన్స్‌’ఫోకస్‌కు చిక్కితే ఇక అంతే! బియ్యం బదులుగా అక్రమంగా నగదు బదిలీ ఇక సాగదు! మహా హైదరాబాద్‌ పరిధిలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంపై పౌర సరఫరాల శాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. రేషన్‌ డీలర్లు సన్న బియ్యాన్ని బహిరంగంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తుండటంతో ప్రత్యేక బందాలను రంగంలోకి దింపింది. అక్రమాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం కొన్ని నెలలుగా రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యం మాదిరిగానే సన్నబియ్యం విషయంలోనూ డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా ఈ బియ్యాన్ని మిల్లర్లకు అక్రమంగా సరఫరా చేసి డీలర్లు లాభాలు ఆర్జించడం సర్వసాధారణమైంది. 

    బాహాటంగా నగదు... 
    రేషన్‌ షాపుల్లో ఉచిత సన్నబియ్యం బదులు బాహాటంగా నగదు పంపిణీ సాగుతోంది. లబ్ధిదారుల సమ్మతితోనే నగదు పంపిణీ చేస్తుండటంతో వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. డీలర్లు కిలో బియ్యానికి రూ. 11 నుంచి 14 వరకు అందజేస్తున్నారు. ఆ తర్వాత ఆ బియ్యం స్టాక్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు చేరవేస్తున్నారు.రేషన్‌కార్డులోని సభ్యుల(యూనిట్‌)కు ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తోంది. కొందరు కార్డుదారులు ఇడ్లీ, దోసల కోసం ఒకటి రెండు యూనిట్ల కోటా బియ్యం తీసుకొని మిగతా యూనిట్ల కోటాకు సంబంధించి బియ్యం బదులు నగదు పుచ్చుకుంటున్నారు. లబ్ధి కుటుంబాలు మొత్తం కోటా డ్రా చేస్తున్నట్లు బయోమెట్రిక్‌పై వేలిముద్ద పెడుతున్నారు. తూకంపై మాత్రం మొత్తం యూనిట్లకు కోటా బరువు పెట్టి తీసేయడం బాహాటంగా సాగుతోంది. మరోవైపు డీలర్లు ఉచిత బియ్యం పంపిణీలో సరికొత్త టెక్నిక్‌ ఉపయోగిస్తున్నారు. పీడీఎస్‌ ట్రక్కులకు అమర్చిన జీపీఎస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లతో ట్యాంపరింగ్‌ చేయడం, స్థానిక అధికారులతో కుమ్మక్కు, రికార్డులు ఫాల్సిఫై చేయడం వంటి అక్రమాలు ఇటీవల బయటపడ్డాయి. 

    ఇక రేషన్‌ షాపుల అకస్మిక తనిఖీ 
    విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు వచ్చే నెల రేషన్‌షాపుల్లో ఆకస్మిక తనిఖీలకు సిద్ధమవుతున్నాయి. బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన మొదటి వారంలో షాపులను తనిఖీ చేసి స్టాక్‌ రిజిస్టర్, నిల్వ స్టాక్‌ను పరిశీలించనున్నాయి. మరోవైపు డిజిటల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని పౌర సరఫరాల శాఖ యోచిస్తోంది.   

Movies

  • కూటికోసం కోటి తిప్పలు. కొందరు సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలోకి రాకముందు ఇతరత్రా పనులు చేసినవారే! మలయాళ నటుడు అజీస్‌ నెదుమంగడ్‌ కూడా ఒకప్పుడు డ్రైఫ్రూట్‌ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. అది కూడా భారత్‌లో కాదు, బహ్రెయిన్‌లో! ఇటీవల బహ్రెయిన్‌ వెళ్లిన అజీస్‌ తను పనిచేసిన షాపును గుర్తుపెట్టుకుని మరీ అక్కడకు వెళ్లాడు. 

    18 ఏళ్ల కిందట..
    తనతో పాటు పనిచేసిన స్నేహితుడిని అదే షాపులో కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరి బాగోగులను మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 18 ఏళ్ల కిందట అదే షాపులో పనిచేసిన అజీస్‌ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో టాప్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.

    కెరీర్‌
    అజీస్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే! దీంతో అతడు ఇంజనీరింగ్‌ పట్టా చేతికి రాగానే గల్ఫ్‌ దేశానికి వలస వెళ్లి షాపులో పనిచేశాడు. కానీ, అక్కడ ఎక్కువకాలం ఉండలేక మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించాడు. పలు స్టేజీలపై మిమిక్రీ చేస్తూ కామెడీ పండించేవాడు. తర్వాత టీవీ షోలలోనూ పాల్గొనడంతో కమెడియన్‌గా మంచి గుర్తింపు లభించింది. 

    ప్రాధాన్యమున్న పాత్రలు
    అలా 'కుంజలియన్‌' సినిమాలో నటించే ఆఫర్‌ వచ్చింది. అది చిన్న అవకాశం. తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు, కానీ పెద్దగా చెప్పుకునే పాత్రలైతే కాదు. చేస్తే మంచి క్యారెక్టర్సే చేయాలి... జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కాదని తీర్మానించుకున్నాడు. అలా యాక్షన్‌ హీరో బిజు మూవీతో క్లిక్‌ అయ్యాడు. వాళా, మిన్నాల్‌ మురళి, కన్నూర్‌ స్క్వాడ్‌, ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌, జయజయజయహే వంటి సినిమాలతో మరింత పాపులర్‌ అయ్యాడు. దాదాపు 30కి పైగా సినిమాలు చేశాడు.

    దాడిలో తీవ్రగాయాలు
    అయితే అజీస్‌ (Azees Nedumangad) జీవితంలో ఓ చేదు ఘటన జరిగింది. 2017 ఏప్రిల్‌లో ఓ స్టేజీ షోకు ఆలస్యంగా వెళ్లాడు అజీస్‌. అంతే.. అక్కడున్న కొంతమంది ఆగ్రహంతో నటుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అజీస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఏకంగా 70% వినికిడి శక్తిని కోల్పోవడం బాధాకరం! అవమానాలను సైతం దాటుకుని నేడు మలయాళ ఇండస్ట్రీలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు అజీస్‌. ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌ నటుడిగా కొనసాగుతున్నాడు.

  • సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్‌ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.

    గతంలో తప్పులు
    తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్‌ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్‌ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్‌ఫుల్‌ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

    అలాంటి పాత్రలు చేయాలనుంది
    ఉదాహరణకు రజనీకాంత్‌ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్‌, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి!

  • బిగ్‌బాస్‌ షోను ఇష్టపడేవాళ్లు, తిట్టేవాళ్లు.. ఇద్దరూ ఉన్నారు. తిడుతూనే చూసేవాళ్లు మూడోరకం! అయితే ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలకు పెద్దపీట వేస్తారు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒకరిద్దరు కామనర్లను దింపుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు కూడా సోషల్‌ మీడియాలో సుపరిచితులైనవారే ఉంటారు! అయితే ఈసారి ఏకంగా ఏడుగురు మంది సామాన్యులు హౌస్‌లో అడుగుపెట్టారు. కాకపోతే అంత ఈజీగా కాదు, అగ్నిపరీక్షను దాటుకుని వచ్చారు.

    అగ్నిపరీక్ష
    ఎన్నడూ లేనిది ఈసారి షో ప్రారంభమవడానికి ముందు బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించారు. దీనికోసం పెద్ద ప్రక్రియే జరిగింది. ముందుగా షోకి రావాలనుకునేవారు ఒక నిమిషం వీడియో షూట్‌ చేసి బిగ్‌బాస్‌ టీమ్‌కు పంపారు. వేలల్లో వచ్చినవాటిని ఫిల్టర్‌ చేసి వందల్లో ఎంపిక చేస్తారు. వారికి గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, ఎగ్జామ్‌ ఇలా అన్నీ పెట్టి చివరకు 40 మందిని ఎంపిక చేశారు.

    అలాంటివారికి నో ఛాన్స్‌
    వారిలో నుంచి మంచి కంటెస్టెంట్లను జల్లెడ పట్టాల్సిన బాధ్యతను నవదీప్‌, బిందుమాధవి, అభిజిత్‌కు అప్పజెప్పారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్‌ చేసింది. బిగ్‌బాస్‌కు రావాలన్న పిచ్చితో కొందరు పాదయాత్రలు చేస్తారు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తారు. అలాంటివారికి షోలో చోటు లేదని అగ్నిపరీక్ష షోలో కరాఖండిగా చెప్పేశారు. ఆ కేటగిరీలో వచ్చిన అందర్నీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.

    తొలిసారి ఏడుగురు కామనర్స్‌
    మిగతావారి టాలెంట్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, నాలెడ్జ్‌.. ఇలా అన్నింటినీ పరిశీలించి ఓ లిస్ట్‌ ఫైనల్‌ చేస్తారు. అలా కొందరు జడ్జిలను మెప్పించి, మరికందరు ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో అడుగుపెట్టారు. వాళ్లే ప్రియ, శ్రీజ, దివ్య, కల్యాణ్‌, పవన్‌, మనీష్‌, హరీశ్‌. వీరిలో కల్యాణ్‌ ఏకంగా టైటిల్‌ విన్నర్‌ కాగా పవన్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. 

    సామాన్యుడి చేతికి ట్రోఫీ
    సామాన్యుడు బిగ్‌బాస్‌కు వెళ్లడం కాదు, ఏకంగా ట్రోఫీ ఎత్తగలడని కల్యాణ్‌ నిరూపించాడు. అయితే అగ్నీపరీక్ష రెండో సీజన్‌ కోసమే అతడికి కప్పు కట్టబెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్నిపరీక్ష ఫస్ట్‌ సీజన్‌పై పెద్దగా బజ్‌ లేదు. ఇప్పుడు కల్యాణ్‌ గెలుపు వల్ల అగ్నీపరీక్ష రెండో సీజన్‌పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. 

    బిగ్‌బాస్‌ ప్లాన్‌ సక్సెస్‌
    ఈసారి ఎవరు వస్తారు? ఎవర్ని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. కామనర్స్‌ను ఏదో కొన్నాళ్లపాటు హౌస్‌లో ఉంచి పంపించేయకుండా.. వారికి టాలెంట్‌ ఉంటే చివరి వరకు ఉంచుతారన్న నమ్మకం కుదిరింది. ఈ లెక్కన ఈసారి అగ్నిపరీక్షకు అప్లికేషన్లు భారీగా పోటెత్తే అవకాశముంది. అదే గనక నిజమైతే బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అయినట్లే! ఈ అగ్నిపరీక్ష రెండో సీజన్‌ 2026 సెకండాఫ్‌లో ప్రారంభం కానుంది.

    చదవండి: వినాయకన్‌కు తీవ్ర గాయం.. కాస్త లేట్‌ అయ్యుంటే పక్షవాతం!

  • హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి నటించిన థ్రిల్లర్ మూవీ మదం. చిత్రానికి వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్య దేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమా జనవరి 1 థియేటర్లలో సందడి చేయనుంది.

    చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీ సర్టిఫికేట్ మంజూరు చేసింది సెన్సార్ బోర్డ్. కాగా.. సినిమాకు కథ, సంభాషణలను రమేష్ బాబు కోయ అందించారు. ఈగల్ ఫేమ్ డేవ్‌జాండ్ (DavZand) సంగీతం అందించారు. ఈ న్యూ ఇయర్‌కు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు థియేటర్లకు రానుంది.

     

  • వెంకటేశ్‌, ఆర్తి అగర్వాల్‌ హీరో, హీరోయిన్లుగా బ్లాక్బస్టర్మూవీ నువ్వు నాకు నచ్చావ్. చిత్రానికి కె విజయభాస్కర్‌ దర్శకత్వం వహించారు. సినిమాకు త్రివిక్రమ్‌ కథ, డైలాగ్స్‌ అందించగా.. స్రవంతి రవికిశోర్‌ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్‌ 6న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.

    దాదాపు 25 ఏళ్ల తర్వాత మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్‌తో ప్రపంచవ్యాప్తగా రీ రిలీజ్‌ చేయనున్నారు. సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. 4కె వర్షన్లో రిలీజైన ట్రైలర్ వెంకీ మామ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

    తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రమని నిర్మాత రవికిశోర్‌ అన్నారు. నువ్వు నాకు నచ్చావ్‌. ఇది కేవలం రీ రిలీజ్‌ మాత్రమే కాదని.. నూతన సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అన్నారు.

  • మలయాళ నటుడు, జైలర్‌ విలన్‌ వినాయకన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. ఆడు 3 సినిమా కోసం కేరళలోని తిరువనంతపురంలో యాక్షన్‌ సన్నివేశాల షూటింగ్‌ చేస్తుండగా వినాయకన్‌ ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన శనివారంనాడు కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన తాజాగా డిశ్చార్జ్‌ అయ్యాడు. 

    తప్పిన ప్రమాదం
    ఈ సందర్భంగా వినాయకన్‌ మాట్లాడుతూ.. నా మెడ నరానికి దెబ్బ తగిలింది. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నరాల డ్యామేజ్‌ను ముందుగానే గుర్తించకపోయుంటే నా శరీరం చచ్చుబడిపోయేది అన్నాడు. డాక్టర్లు ఆయన్ను కనీసం ఆరువారాలపాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఆడు 3 సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

    ఆడు 3 మూవీ
    ఆడు సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగమే ఆడు 3. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వినాయకన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిధున్‌ మాన్యుల్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026లో మార్చి 19న రిలీజ్‌ చేయనున్నారు. వినాయకన్‌ విషయానికి వస్తే.. ఇతడు 1995లో వచ్చిన మాంత్రికం చిత్రంతో తన యాక్టింగ్‌ జర్నీ ప్రారంభించాడు. 

    సినిమా
    'కమ్మట్టి పాదం' మూవీలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర అవార్డును గెల్చుకున్నారు. మలయాళంతోపాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఆయనకు రజనీకాంత్‌ జైలర్‌ ఊహించని స్థాయి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. కేరళ పోలీస్‌స్టేషన్‌లో, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన గొడవతో.. అలాగే ఓ హోటల్‌లో మద్యం మత్తులో వీరంగం సృష్టించి వార్తల్లోకెక్కాడు.

    చదవండి: అమ్మ బిల్డింగ్‌పై నుంచి దూకుతానంది: ఏడ్చేసిన నందు

  • హైదరాబాద్విమానాశ్రయంలో సినీనటుడు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందితో గొడవకు దిగారు. విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా తీసుకెళ్లడంపై ఆయన మండిపడ్డారు. తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థ నిర్లక్ష్యపూరిత తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్లో ఫోటోలు పంచుకున్నారు.

    నరేశ్ తన ట్వీట్లో రాస్తూ..'ఇండిగో ఎయిర్‌లైన్స్ బస్సు ప్రయాణం చిత్ర హింసకు గురిచేసింది. విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి సాక్ష‍్యమిదే. మమ్మల్ని పశువుల్లా ఒక లారీలో క్కించినట్లు విమానం వద్దకు తీసుకెళ్లారు. అందులో వృద్ధులు, చక్రాల కుర్చీలలో ఉన్న కొందరు నిలబడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎక్కువ మందిని ఎక్కించవద్దని నేనే గట్టిగా అరిచా. బస్సులకు ఒక నిర్దిష్ట పరిమితి ఉండాలి. వృద్ధుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలి. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి నా న్యాయ బృందంతో మాట్లాడుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో నరేశ్మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

     

  • నటి దీప్‌శిఖ 'మార్క్‌ మూవీ'తో కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ  ఇచ్చింది. ఈ మూవీ నేడు (డిసెంబర్‌ 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకుంది. ఇది దీప్‌శిఖ సినీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. అరంగేట్రానికి ముందే సోషల్‌ మీడియాలో తన పేరు మారుమోగిపోతోంది. సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్‌, ట్రైలర్‌లో దీప్‌శిఖ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 

    ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా..
    దీంతో అభిమానులు ఆమెకు “మార్క్ క్వీన్” అనే బిరుదును ఇచ్చారు. ఇక దీప్‌శిఖ మాట్లాడుతూ.. కిచ్చా సుదీప్‌తో కలిసి పనిచేయడం వల్ల నా కల నెరవేరింది. ఆయన దగ్గరి నుంచి క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం నేర్చుకున్నాను. ఇవి నా నటనను మరింత మెరుగుపర్చేందుకు ప్రోత్సహించాయి. అలాగే ప్రతిష్టాత్మక సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్‌లో పనిచేసినందుకు సంతోషంగా ఉంది. 

    ఎంతో ప్రేమ 
    ఇలాంటి గొప్ప నిర్మాణ సంస్థతోనే నా కన్నడ ప్రయాణం ప్రారంభం కావడం నా కెరీర్‌కు మరింత విలువ, ధైర్యాన్ని ఇచ్చింది. ఈ అవకాశం లభించడం నా అదృష్టం. సినిమా విడుదలకంటే ముందే నాపై ఎంతో ప్రేమ చూపించారు. మీ ప్రేమే నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుంది అని పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, సిబ్బంది, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

  • తెలుగు నటుడు, యాంకర్‌ నందు ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లవుతోంది. అయినా ఇప్పటికీ తనకు సరైన సక్సెస్‌ లేదు. ఆ ఒక్క విజయం కోసం ఏళ్లకొద్దీ పరితపిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో సెకండ్‌ హీరోగా చేసిన నందు తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ మంచి విజయం మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడితడు సైక్‌ సిద్దార్థ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

    ఉన్నచోటే ఆగిపోయా..
    ఈ చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నందు తన కష్టాల్ని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. నందు మాట్లాడుతూ.. నాతో కలిసి నటించిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రియదర్శి, విజయ్‌ దేవరకొండ.. వీళ్లంతా ఎక్కడికో వెళ్లిపోయారు. నేను మాత్రం ఉన్నచోటే ఉండిపోయాను. లోపం నాలోనే ఉంది. అది ఈ మధ్యే తెలుసుకున్నాను.

    లోపం నాలోనే..
    కథలో లోపాలున్నాయని తెలిసినా సరే.. డబ్బు వస్తుందన్న ఆశతో సినిమాలు ఒప్పేసుకునేవాడిని. అలా నన్ను నేనే మోసం చేసుకున్నాను. దానివల్ల వీడి సినిమాలన్నీ ఇంతేరా.. అన్న మార్క్‌ పడిపోయింది. దాన్నుంచి బయటకు రావడానికే మూడునాలుగేళ్లు సమయం తీసుకుని మంచి సినిమా చేశాను.

    చేదు సంఘటనలు
    సవారి మూవీ తర్వాత పెద్ద బ్యానర్‌లో హీరోగా సినిమా ఆఫర్‌ చేశారు. అనుపమ హీరోయిన్‌ అన్నారు. అంతా ఓకే అనుకున్నాక సడన్‌గా నా స్థానంలో మరొకర్ని తీసుకున్నారు. కానీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరో సంఘటనలో ఏం జరిగిందంటే.. ఒక పెద్ద నిర్మాత తన కొడుకును హీరోగా పెట్టి మూవీ తీశారు. హీరోతోపాటు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్ర నాకిచ్చారు. పైసా తీసుకోకుండా రెండున్నర నెలలు షూటింగ్‌ చేేశాను. 

    ఘోర అవమానం
    తీరా ఓ డిస్ట్రిబ్యూటర్‌ మూవీ చూసి నాకెందుకు అంత ప్రాధాన్యతనిచ్చారని అడిగారట! దాంతో నాకు ఒక్కమాటైనా చెప్పకుండా నా సీన్స్‌ అన్నీ ఎత్తేశారు. అది తెలియక ఆడియో లాంచ్‌కు పిలవకపోయినా వెళ్లాను. అక్కడికి వెళ్లాక కనీసం నేను ముందు వరుసలో కూర్చునేందుకు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను.

    తల్లితోడుగా చెప్తున్నా..
    అనవసరమైన విషయాల్లో నా పేరు ఇరికించినప్పుడైతే కుమిలిపోయాను. తల్లితోడుగా చెప్తున్నా.. అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామా? అని గీత, నేను  అనుకున్నాము. వేరే దేశం వెళ్లి ఏదైనా హోటల్‌లో పని చేసుకుందాం అని గీతయే ముందుగా అడిగింది. తను సక్సెస్‌ఫుల్‌ స్టార్‌ సింగర్‌.. అయినా సరే నాకోసం తన కెరీర్‌ వదిలేసి, వేరే దేశం వెళ్లి హోటల్‌లో పనిచేసుకుందామంది. అది ఇప్పుడు తల్చుకున్నా ఏడుపొస్తుంది. 

    ఏడ్చేసిన నందు
    నేను ఈ ఫీల్డ్‌లో లేకపోతే నాపై అలాంటి రూమర్సే రావు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చినవారిని బలిపశువును చేస్తారు. ఈ విషయం జనాలకు తెలియదు. లేనిపోనివాటిలో నన్ను ఇరికిస్తే బిల్డింగ్‌ పై నుంచి దూకేస్తానంది అమ్మ. అలా నేను చేయని తప్పుకు వార్తల్లో నా పేరు రావడం చూసి ఇంట్లో అందరూ నలిగిపోయారు అని చెప్తూ నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

  • టైటిల్: వృషభ

    నటీనటులు: మోహన్ లాల్, సమర్జీత్‌ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్‌ సారిక, అజయ్, నేహా సక్సేనా, అజయ్ తదితరులు

    దర్శకత్వం: నందకిశోర్‌

    విడుదల తేదీ..డిసెంబర్ 25, 2025

    మలయాళ స్టార్మోహన్‌ లాల్‌ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రియుల గుండెల్లో నిలిచిపోయారు. ఏడాది తుడురమ్, ఎంపురాన్-2, హృదయపూర్వం చిత్రాలతో అలరించారు. తాజాగా మోహన్ లాల్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓకేసారి తెలుగు, మలయాళ భాషల్లో వచ్చిన సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    వృషభ కథేంటంటే..

    గత జన్మలు కూడా ఉన్నాయనిమనందరం వింటుంటాం. అయితే జన్మలో మనం ఎలా పుట్టాం.. అసలేం జరిగింది కేవలం ఊహాజనితమే. అసలు గత జన్మలు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. అయితే రెండు జన్మలను ఓకేసారి చూపిస్తూ అద్భుతమైన ఎక్స్పీరియన్స్అందించే చిత్రమే మోహన్ లాల్ వృషభ.

    కథ రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు మహిళ పెట్టే శాపంతో మొదలవుతుంది. గత జన్మలో జరిగిన సంఘటనలతో కథను ప్రారంభించాడు. బిజినెస్లో ఆదిదేవ వర్మ(మోహన్ లాల్) కింగ్. ప్రతి ఏడాది ఉత్తమ బిజినెస్మెన్గా అవార్డ్ ఆయనకు రావాల్సిందే. అలా ఇది నచ్చని మరో వ్యాపారవేత్త అవార్డ్ బహుకరించే రోజే ఆదిదేవ వర్మపై దాడికి ప్లాన్ చేస్తాడు. కానీ ఆది దేవ వర్మ కుమారుడు తేజ్(సమర్జీత్‌ లంకేశ్) ఎంట్రీతో ప్లాన్ తిప్పికొడతాడు. అలా వర్తమానంలో తండ్రీ, తనయులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తేజ్ పెళ్లి చేసుకోవాలనేది తండ్రి బలమైన కోరిక. విషయాన్ని పదే పదే తన కొడుకుతో చెబుతుంటాడు.

    అదే సమయంలో గత జన్మ అనుభవాలతో ఆది దేవ వర్మ సతమతమవుతుంటాడు. విషయం తెలుసుకున్న తేజ్ తండ్రి కోసం మంచి సైక్రియాటిస్ట్ను కలవాలనుకుంటాడు. ఇదే క్రమంలో దామిని(నయన్‌ సారిక) అతనికి పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ‍అలా ఇద్దరు కలిసి ఆదిదేవ వర్మ సమస్యకు పరిష్కారం కోసం బయలుదేరతారు. నాన్నకు ఉన్న ప్రాబ్లమ్గురించి ఇంట్లో పనిచేసే వంటమనిషి పప్పు.. తేజ్తో ఆసక్తికర విషయం చెబుతాడు. ఇది విన్న తేజ్ తండ్రికి చెప్పకుండానే వెంటనే సొంత గ్రామమైన దేవనగరికి బయల్దేరతాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అసలు తేజ్ ఊరికి ఎందుకు వెళ్లారు? తండ్రి కోసం వెళ్లిన తేజ్ఎందుకలా మారిపోయాడు. అసలు తండ్రీ, కొడుకుల మధ్య ప్రతీకారానికి కారణమేంటి? ఆది దేవ వర్మకు గత జన్మలో అసలేం జరిగింది? జ్ఞాపకాలు ఇంకా ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు మహిళ పెట్టిన శాపం ఏంటి? అనేది తెలియాలంటే వృషభ చూడాల్సిందే.

    ఎలా ఉందంటే..

    మామూలుగా గత జన్మలో ఏం జరిగింది అనేది మొదట చూపించి కథను మొదలెడతాం. అలానే గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు జరిగిన సంఘటనలను పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు. గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ అసమాన యోధుడిగా తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు అయితే వృషభ చేసిన పొరపాటు వల్ల మహిళ ఆయనకు శాపం పెడుతుంది. అదే శాపం వర్తమానంలోనూ ఆదిదేవ వర్మ(మోహన్ లాల్)ను వెంటాడుతుంది. అయితే కుమారుడి కోసం తాపత్రయ పడుతున్న ఆదిదేవకు..

    దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్పాతదే కావొచ్చు. కానీ స్క్రీన్ప్రజెంట్చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. తాను అనుకున్నట్లుగానే కథను ప్రేక్షకులను పరిచయం చేశాడు. ప్రారంభంలోనే రాజుకు పెట్టే శాపం రివీల్ చేసి ఆసక్తి క్రియేట్ చేశాడు. తర్వాత వర్తమానంలోకి తీసుకెళ్లాడు. తండ్రి, కుమారుల మధ్య బాండింగ్‌.. కొడుకు కోసం తండ్రి.. తండ్రి కోసం కుమారుడు పడే తపన చూపించాడు. అమ్మాయితో పరిచయం కావడం.. వెంటనే ఇద్దరి మధ్య లవ్.. చకాచకా ఓకే చెప్పడం.. అలా కథను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఫస్ట్‌ హాప్ మొత్తం ఆదిదేవ వర్మ(మోహన్ లాల్), సమర్జీత్ లంకేశ్(తేజ్) బాండింగ్.. దామినితో లవ్లో పడడం అంతా రోటీన్‌గా సాగుతుంది. తేజ్‌ ఎప్పుడైతే తండ్రి సొంత గ్రామమైన దేవనగరి గ్రామానికి వెళ్లాడో అక్కడి నుంచే కథలో వేగం పుంజుకుంది. ఫస్ట్ హాఫ్లో కథ ప్రేక్షకుడి ఊహకందేలానే సాగుతుంది. కానీఅలా ప్రేక్షకుడు కథలో లీనమవ్వగానే.. ఇంటర్వెల్కు ముందు ఇచ్చే ట్విస్ట్అస్సలు ఊహించలేరు. బిగ్ ట్విస్ట్థియేటర్లో చూసి సగటు ప్రేక్షకుడు షాకవ్వాల్సిందే. అలా ప్రథమార్థాన్ని వర్తమానంతోనే ముగించాడు.

     

    సెకండాఫ్లో గత జన్మలో జరిగిన పరిణామాలు.. రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) త్రిలింగ రాజ్యం గురించే ఉంటుంది. రాజ్యంలో జరిగే సంఘటనలు చుట్టే తిరుగుతుంది. కానీ త్రిలింగ రాజ్యంలోని స్ఫటిక లింగం దొంగతనం చేసేందుకు వచ్చిన హయగ్రీవా(సమర్జీత్ లంకేశ్) వస్తాడు. తర్వాత వృషభ రాజుకు.. హయగ్రీవాకు మధ్య జరిగే పోరాటం సెకండాఫ్లో హైలెట్. యుద్ధ ఫైట్సీన్లో జరిగిన సంఘటన తర్వాతే కథ ఏంటనేది ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అప్పటిదాకా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. సెకండాఫ్లో అలీ కామెడీ కొద్దిసేపే అయినా నవ్వులు తెప్పించింది. ఇందులో గత జన్మకు.. వర్తమానానికి ముడిపెట్టడం వల్ల ప్రేక్షకుడిని కాస్తా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. గత జన్మ కాన్సెప్ట్తో వచ్చిన కథలో క్లైమాక్స్లో ఫుల్ ఎమోషన్క్రియేట్ చేశాడు. తండ్రీ, తనయుల మధ్య పోరాటాన్ని భావోద్వేగానికి ముడిపెడుతూ మలిచిన తీరు ప్రతి ఒక్కప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. కథలో ప్రేక్షకుడి ఊహకందని బిగ్ట్విస్ట్లు ఇచ్చాడు డైరెక్టర్. కథలో కొత్తదనం లేకపోయినా విజువల్స్, స్క్రీన్ ప్లేతో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నారు. ఆడియన్స్కు ఎక్కడా బోరింగ్అనిపించకుండా కథను ముందుకు తీసుకెళ్లడం ప్లస్‌. భారీ ఫైట్స్ లేకున్నా..కథకు తగినట్లుగా ప్లాన్ చేశాడు.

    ఎవరెలా చేశారంటే..

    మోహన్ లాల్ఆదిదేవ వర్మగా, రాజా విజయేంద్ర వృషభగా రెండు పాత్రల్లో తనలోని టాలెంట్తో ఆకట్టుకున్నారు. సమర్జీత్ లంకేశ్యంగ్హీరోగా అదరగొట్టేశాడు. గత జన్మ హయగ్రీవా పాత్రలో డిఫరెంట్గా కనిపించాడు. నయన సారిక తన గ్లామర్తో ఆకట్టుకుంది. రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా, గ‌రుడ రామ్‌, విన‌య్ వ‌ర్మ‌, అలీ, అయ‌ప్ప పి.శ‌ర్మ‌, కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. బీజీఎం అంత కాకపోయినా ఫర్వాలేదనిపించింది. సామ్ సీఎస్ నేపథ్యం సంగీతం బాగుంది. కృతి మహేశ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా గ్రాండ్గా ఉన్నాయి. ఓవరాల్గా వీకెండ్లో డిఫరెంట్సినిమాటిక్ ఎక్స్పీరియన్స్అవ్వాలంటే వృషభ చూడాల్సిందే.

  • ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేం ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)’.రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    ఈ సినిమా కథంతా హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉంటున్న నలుగురు అమ్మాయిలు రోజీ రెడ్డి, మల్లీశ్వరి, మెర్సీ, వెంకట్ లక్ష్మిల చుట్టూ తిరుగుతుంది. అందులో ఇద్దరికీ జాన్, నాయుడు అనే వ్యక్తులలతో ఎంగేజ్‌మెంట్‌ అవుతుంది. పెళ్లికి ముందు ఒక ఫారిన్‌ ట్రిప్‌ వేయాలని స్నేహితులంతా అనుకుంటారు. క్క స్రవంతి సహాయంతో మలేషియా ట్రిప్‌కి ప్లాన్‌ వేస్తారు. అదే సమయంలో అనకొండ అనే పేరుమోసిన టెర్రరిస్ట్‌  మలేషియాలో బాంబు దాడిని ప్లాన్ చేస్తాడు. అంతే కాకుండా ఈ నలుగుర్ని కిడ్నాప్ చేయాలని ఉమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కూడా రెడీ అవుతుంది. మరి వారి సరదా ప్రయాణం చివరకు ఎలా ముగిసింది? ఈ క్రమంలో ఆ అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడతారు? అన్నదే అనేది మిగిలిన కథ.

    ఎలా ఉందంటే.. 
    సరదాగా సాగిపోయే ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కి వెళ్లడం.. అనుకోని సమస్యలు రావడం..చివరకు ఓ సందేశం ఇవ్వడం.. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. బ్యాడ్ గాళ్స్ స్టోరీ కూడా అలానే సాగుతుంది. నలుగురు స్నేహితులు బయటకు వెళ్లాలని అనుకోవడం, అమ్మాయిలు ఇలా బయటకు వస్తే ఎదురయ్యే పరిస్థితులు వంటి వాటితో ప్రథమార్దాన్ని సరదా సరదాగా సాగించారు. నలుగురు స్నేహితులు ఉన్నప్పుడు పుట్టే  హాస్యం, వచ్చే సంఘటనల్ని చక్కగా చూపించాడు. అవన్నీ కూడా నేటి ట్రెండ్‌కు తగ్గట్టే ఉంటాయి.అయితే కథనం నెమ్మదిగా సాగడం.. పలు సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులో రిపీట్‌ కావడంతో ఫస్టాఫ్‌ సాగదీతగా అనిపిస్తుంది.  ఇంటర్వెల్‌కు మాత్రం మంచి ట్విస్ట్ ఇచ్చి ముగించేస్తాడు.

    ఇక సెకండాఫ్‌లో కథ రకరకాల జానర్లోకి వెళ్తుంది. అప్పటి వరకు కామెడీ జానర్ అని అనుకుంటారు. కానీ థ్రిల్లింగ్, క్రైమ్ అని తరువాత తెలుస్తుంది. కామెడీ, థ్రిల్లర్ అంశాల కలయికతో దర్శకుడు సెకండాఫ్‌ను బాగానే లాగాడు. మలేషియా గ్యాంగ్, ఉమెన్ ట్రాఫిక్ గ్యాంగ్, ఈ నలుగురు స్నేహితుల చుట్టూనే ఈ కథను ప్రీ క్లైమాక్స్ వరకు తిప్పాడు. ఇక చివర్లో దర్శకుడు తన సందేశాన్ని ఇచ్చాడు. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గానే టచ్ చేసినట్టు అనిపిస్తుంది. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి స్క్రీన్‌ప్లే, కామెడీ పంచ్‌లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

    ఎవరెలా చేశారంటే.. 
    నలుగురు ప్రధాన పాత్రలు - అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న ఎంతో ఎనర్జీగా కనిపించారు. వారి వారి పాత్రల తీరుకు తగ్గట్టుగా తెరపై చక్కగా నటించారు. నలుగురి మధ్య మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని చూపెట్టారు. మోయిన్, రోహన్ సూర్య పాత్రలు కూడా బాగుంటాయి. ఈ రెండు పాత్రలతో కావాల్సినంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు. అలా మిగిలిన వారిలో రేణు దేశాయ్ బలమైన పాత్రలో, మలేషియా పోలీసుగా రాజా రవీంద్ర, రెండు సన్నివేశాలలో తాగుబోతు రమేష్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.

    సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం , నేపథ్య సంగీతం బాగుంటుంది. ఆస్కార్ చంద్ర బోస్ రాసిన సాహిత్యం ఆలోచింపజేసేలా ఉంటుంది. అర్లి గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే.నిర్మాణ విలువలు బాగున్నాయి.
    రేటింగ్‌ : 2.5/5

  • సెలబ్రిటీల ముఖంలో కాస్త తేడా కనిపించినా నెటిజన్లు ఇట్టే పసిగడతారు. అది మేకప్‌ మహిమో? లేక డైట్‌ వల్ల అలా అయిందో అనడానికి బదులుగా ఏకంగా సర్జరీ చేయించుకుందని ఈజీగా అనేస్తారు. మరింత అందంగా కనిపించడం కోసం ముక్కుకు, ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందని కామెంట్లు చేస్తారు. బుల్లితెర నటి ప్రియాంక చాహర్‌ చౌదరిపై కూడా కొంతకాలంగా ఇలాంటి రూమర్లే వస్తున్నాయి.

    ప్లాస్టిక్‌ సర్జరీ రూమర్స్‌
    తాజాగా వీటిపై ప్రియాంక స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చాలారోజులుగా నాపై ఎన్నో రూమర్స్‌ వైరల్‌ అవుతున్నాయి. గతేడాది నా ఆరోగ్యం బాగోలేక ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాను. ఎక్కువ డోస్‌ ఉన్న యాంటిబయాటిక్స్‌ వాడాను. చాలామంది జనాలకు ఈ విషయం తెలియనే తెలియదు. ఆ సమయంలో బరువు తగ్గిపోయాను కానీ ముఖం మాత్రం కాస్త ఉబ్బింది. 

    కళ్లకు కాటుక రుద్దినా..
    అంతదానికే జనాలు ఏదేదో ఊహించుకున్నారు. అయినా అందాన్ని మెరుగుపర్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నేనేం చేయాలనుకున్నా, చేసినా అది నా ఇష్టం. ఇప్పుడు నేను కళ్లకు కాటుక రుద్దినా, లెన్స్‌ పెట్టుకున్నా సరే.. ముఖానికి ఏదో చేయించుకున్నానని మాత్రమే అంటారు. అందుకే నేను చెప్పేదేంటంటే.. నా ముఖం.. నా ఇష్టం! 

    సీరియల్‌
    అయినా నా ఫేస్‌కు మేకప్‌ వేయడం తప్ప ఏదీ చేయలేదు. అయినప్పటికీ జనాలు అది మేకప్‌ అని నమ్మరు.. ఇంకా ఏదో ఉందని మాట్లాడుతూనే ఉంటారు. అది కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చింది. ప్రియాంక చౌదరి.. 'ఉడారియాన్‌' సీరియల్‌తో బాగా పాపులర్‌ అయింది. ప్రస్తుతం 'నాగిని 7' సీరియల్‌ చేస్తోంది. ఏక్తా కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సీరియల్‌ డిసెంబర్‌ 27న ప్రారంభం కానుంది.

  • నిర్మాలా కాన్వెంట్‌ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్‌ మేకా..పెళ్లి సందడి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నా.. బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘ఛాంపియన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘ఛాంపియన్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రోషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    ఈ సినిమా కథంతా 1747-48 ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్‌(రోషన్‌)కి ఫుట్‌బాల్‌ ఆట అంటే చాలా ఇష్టం. ఈ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్‌ వెళ్లి..అక్కడే సెటిల్‌ అవ్వాలనుకుంటాడు. ఓసారి ఇంగ్లాండ్‌ వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అతని తండ్రి చేసిన ఓ పని వల్ల వెళ్లలేకపోతాడు. దొంగమార్గాన ఇంగ్లాండ్‌ వెళ్లాలనుకుంటాడు. దాని కోసం కొన్ని తుపాకులను ఒక చోటుకి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసుల కంటపడతారు. వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్‌పల్లి అనే గ్రామానికి వస్తాడు. అదే ఊరికి చెందిన చంద్రకళ(అనస్వర రాజన్‌)తో  పరిచయం..  నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? పోలీసు అధికారి బాబు దేశ్‌ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్ గొడవ ఏంటి?   బైరాన్‌పల్లి ప్రజల కోసం మైఖేల్‌ చేసిన త్యాగమేంటి? అనేదే మిగతా కథ. 

    ఎలా ఉందంటే..
    ప్ర‌పంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి చాలా ప్రత్యేకత ఉంది. అందులో బైరాన్‌పల్లి గ్రామస్తులు చేసిన పోరాటం మరింత ప్రత్యేకం. ప్రాణాలు పోతాయని తెలిసినా.. నిజాం పాలకులపై ఎదురుదాడి దిగారు. ఒకనొక దశలో రజాకార్లకే ముచ్చమటలు పట్టించారు. ఆ ఊరి ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్నే ‘చాంపియన్‌’లో మరోసారి చూపించారు దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చినప్పటికీ..  ఓ ఆటగాడి కోణంలో సాయుధ పోరాటాన్ని చూపించడం.. అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చెప్పడం  ‘ఛాంపియన్‌’ స్పెషల్‌.  అది తప్పితే ఈ సినిమా కథంతా రొటీన్‌గానే సాగుతుంది. పైగా చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. 

    ఆపరేషన్‌ పోలోకి దారి తీసిన సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రజాకార్ల అరచకాలు.. బైరాన్‌పల్లి ప్రజల పోరాటాన్ని చూపించి.. కథను సికింద్రాబాద్‌కి మార్చాడు. అక్కడ ఆంగ్లో ఇండియన్‌ కుర్రాడిగా హీరో పరిచయం..  ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌, కోవై సరళ, వెన్నెల కిశోర్‌ సన్నివేశాలన్నీ కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. హీరో ఎప్పుడైతే బైరాన్‌ పల్లి గ్రామానికి వస్తాడో.. అప్పటి  నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది.  హీరోయిన్‌తో పరిచయం..  నాటక ప్రదర్శన.. 'గిర్రా గిర్రా.. పాట ఇవన్నీ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతాయి. 

    బైరాన్‌పల్లిపై రజాకార్ల దాడి జరగడం.. హీరో  ఊరి పోరాటంలో భాగమవ్వడం.. అవ్వడంతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే ద్వితియార్థంలోనూ డ్రామాపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్‌ చేశాడు.   కథనాన్ని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఎమోషనల్‌ సన్నివేశాలనే హైలెట్‌ చేశాడు. కానీ అవి పూర్తిగా వర్కౌట్‌ కాలేదు.  ప్రేమ కథ ఒకవైపు.. సాయుధ పోరాటం మరోవైపు.. ఈ రెండిటిలో దేనికి ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్‌ కాలేదు. రజాకార్లలో అసలు పోరాటం మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్‌ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి నేపథ్యం.. ఆయన చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. హీరో తండ్రి పాత్రలో ఓ స్టార్‌ హీరో కనిపించడం ప్రేక్షకులకు మంచి కిక్‌ ఇస్తుంది. భావేద్వేగానికి గురి చేసేలా క్లైమాక్స్‌ ఉంటుంది. 

    ఎవరెలా చేశారంటే..
    మైఖేల్‌ సి విలియమ్స్‌ పాత్రలో రోషన్‌ ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్‌ని అదరగొట్టేశాడు. డ్యాన్స్‌ కూడా ఇరగదీవాడు. యాక్షన్‌ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. తాళ్లపూడి చంద్రకళగా అనస్వర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. రాజిరెడ్డి పాత్రకు నందమూరి కల్యాణ్‌ చక్రవర్తి అంతగా సెట్‌ అవ్వలేదు. తెలంగాణ యాసను పలకడంలో ఆయన తడబడ్డాడు.  పాత్ర  సుందరయ్యగా మురళీశర్మ ఆకట్టుకుంటారు. రచ్చరవి, మురళీధర్‌ గౌడ్, బలగం సంజయ్, అర్చనతో పాటు మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది.  మిక్కీ జే మేయర్‌ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తోటతరణి ఆర్ట్‌ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • హారర్ సినిమాలు తీయాలంటే హాలీవుడ్ దర్శకుల తర్వాత ఎవరైనా. ఎందుకంటే చాలా రియలస్టిక్‌గా ఉంటాయి. చూస్తున్నప్పుడు భయపెడతాయి. ఈ ఏడాది అలా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని భయపెట్టిన ఓ సినిమా ఓటీటీలో ఉచితంగా అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?)

    ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన హాలీవుడ్ మూవీ 'వెపన్స్'. రూ.335 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.2400 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. విడుదల తర్వాత కొన్ని వారాలకే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు గూగుల్ వీడియోప్లేలోకి వచ్చింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఎక్కువమంది చూడలేకపోయారు. ఇప్పుడు కొత్తగా హాట్‌స్టార్‌లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 8 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చారు. తెలుగులోనూ  అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

    'వెపన్స్' విషయానికొస్తే.. మేబ్రూక్ అనే ఊరిలో ఓ రోజు రాత్రి 2:17 గంటలకు 17 మంది చిన్నారులు వాళ్ల ఇంట్లో నుంచి బయటకెళ్లిపోతారు. ఎంత వెతికినా కనిపించరు. వీళ్లంతా ఒకే స్కూల్‌ ఒకే క్లాస్‌లో చదువుతుంటారు. ఇదే క్లాస్‌కి చెందిన ఓ పిల్లాడు మాత్రం బాగానే ఉంటాడు. దీంతో ఊరందరి అనుమానం క్లాస్ టీచర్ జస్టిన్(జూలియా గార్నర్)పై పడుతుంది. అసలు ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇ‍ప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర)

  • ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. ఒకసారి వేరే హీరో అనుకున్న తర్వాత లేదు లేదు మళ్లీ పాత హీరోతోనే మూవీ చేయడం లాంటివి మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో అదే జరగనుందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తద్వారా అల్లు అర్జున్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు. ఇంతకీ ఏంటి విషయం?

    అల్లు అర్జున్‌ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ పడ్డాయి. అలా వీళ్లిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారని ఏడాది-ఏడాదిన్నర క్రితం తెగ మాట్లాడుకున్నారు. అదో భారీ మైథలాజికల్ సబ్జెక్ట్ అనే టాక్ బయటకొచ్చింది. లెక్క ప్రకారం 'పుష్ప 2' తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో ఈ మూవీ చేస్తారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ తన కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా తారక్‌తో ఈ ప్రాజెక్ట్ చేస్తారని న్యూస్ బయటకొచ్చింది.

    (ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)

    ఇందుకు తగ్గట్లే ఎన్టీఆర్ కూడా 'ద గాడ్ ఆఫ్ వార్' పుస్తకం పట్టుకుని ఒకటి రెండుసార్లు కనిపించాడు. నిర్మాత నాగవంశీ కూడా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ ఎ‍త్తున ఈ సినిమా ఉండబోతుందన్నట్లు పరోక్షంగా ట్వీట్స్ చేశాడు. తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. కొన్ని సందర్భాల్లో సినిమాలు చేతులు మారుతుంటాయని అన్నాడు. ఇది బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమేనని నెటిజన్ల అంటున్నారు.

    ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో కొత్త మూవీస్ ఏం లేవు. అట్లీది వేసవికల్లా పూర్తవుతుంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్‌తోనూ బన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో బన్నీతో చేసేవారిలో ఎవరు ముందు ఎవరు వెనక అనేది చూడాలి? పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్.. మరోసారి తారక్‌కి హ్యాండ్ ఇచ్చాడా అనిపిస్తుంది. గతంలో 'ఆర్ఆర్ఆర్' తర్వాత కూడా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మూవీ ప్రకటించారు. కానీ దాన్ని పట్టాలెక్కించలేకపోయారు.

    (ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇ‍ప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర)

  • టాలీవుడ్ నటి అనసూయ మరో పోస్ట్ చేసింది. ఇప్పటికే శివాజీ కామెంట్స్కు కౌంటరిచ్చిన అనసూయ తాజాగా ట్వీట్ చేసింది. ఇది కేవలం మహిళల గురించి మాత్రమే కాదని తెలిపింది. పాత తరాలు నేర్చుకున్నవి, అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొంతమంది పురుషులు, మహిళలు కూడా నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.

    అనసూయ తన ట్వీట్లో రాస్తూ..' కొంతమంది పురుషులు, మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది అందరి పురుషుల గురించీ లేదా అందరి మహిళల గురించీ కాదు.. కానీ నేను పురుషులు.. మహిళలు.. అందరికీ విన్నపం చేస్తున్నాను.. దయచేసి విస్తృతంగా ఆలోచించండి.. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని' తెలిపింది.

    ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని తెలిపింది. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది.. మరే దానితో కాదని హితవు పలికింది. అంతేకాకుండా కొంతమంది మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. మీ పని బాధ్యతతో చేయాలి.. ఈ విధమైన మహిమాపరచడం (గ్లోరిఫికేషన్) సమంజసం కాదని ట్వీట్లో రాసుకొచ్చింది.

     

  • పట్టుమని పాతికేళ్లు లేవు. అయితేనేం సొంత భాషలో హీరోయిన్‌గా స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఆపై బాలీవుడ్‌లోనూ ఓ మూవీ చేసింది. ఇప్పుడు 'ఛాంపియన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇంతకీ ఈ మలయాళ బ్యూటీ ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ ఏంటి?

    పైన చెప్పిందంతా కూడా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ గురించే. కేరళలోని కరివెల్లూరులో పుట్టిన ఈమెకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ 15 ఏళ్ల వయసులో 'ఉదాహరణం సుజాత' అనే మూవీలో మంజు వారియర్ కూతురిగా నటించింది. 2019లో వచ్చిన 'తన్నీర్ మథన్ దినంగళ్' చిత్రం అనస్వరకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇదే ఏడాది వచ్చిన 'అధ్యరాత్రి'లో ఈమె తల్లి, కూతురిగా ద్విపాత్రాభినయం చేసింది. ఈ రోల్స్ చేసేనాటికి ఈమె వయసు 17 ఏళ్లే కావడం విశేషం.

    (ఇదీ చదవండి: హారర్ సినిమా 'ఈషా' రివ్యూ)

    2022లో వచ్చిన 'సూపర్ శరణ్య' సినిమా అనస్వరకు చాలా పేరు తీసుకొచ్చింది. ఇందులోనే మమిత బైజు కూడా యాక్ట్ చేసింది. ఇదే ఏడాది తమిళంలోకి 'రాంగీ'తో ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే వర్కౌట్ కాలేదు. 2023లో 'యారియన్ 2'తో బాలీవుడ్‌కి కూడా పరిచయమైంది. ఇది కూడా కలిసి రాలేదు. దీంతో తమిళ, హిందీలో మరో చిత్రంలో నటించలేదు. కేవలం మలయాళానికి మాత్రమే పరిమితమైపోయింది.

    2023లో వచ్చిన 'నెరు' సినిమాతో అనస్వర ఎంత మంచి నటి అనేది అందరికీ తెలిసింది. కళ్లు లేని అమ్మాయిగా, తనపై అత్యాచారం చేసివాడిని పట్టించే పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీకిగానూ ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డ్స్ ఈమెని వరించాయి. గతేడాది వచ్చిన 'గురువాయూర్ అంబలనడయిల్', ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'రేఖాచిత్రం' ఈమెలోని ప్రతిభని మరింత బయటపెట్టాయి.

    శ్రీకాంత్ కొడుకు హీరోగా చేసిన 'ఛాంపియన్‍'తో అనస్వర.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. కానీ అంతకంటే ముందే తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయం. నెరు, రేఖాచిత్రం, సూపర్ శరణ్య తదితర చిత్రాల్ని ఓటీటీల్లో మనోళ్లు ఇప్పటికే చూశారు. వాళ్లందరికీ ఈ బ్యూటీ టాలెంట్ ఏంటనేది తెలుసు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా అన్నీ అదరగొట్టే ఈమెకు 'ఛాంపియన్' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి?

    (ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)

Sports

  • బంగ్లాదేశ్‌లో ఓ వైపు అల్లర్లు కొనసాగుతుంటే.. మరోవైపు క్రికెట్ అభిమానులను అలరించేందుకు బీపీఎల్ 12వ సీజ‌న్ సిద్ద‌మైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025-26 శుక్ర‌వారం(డిసెంబ‌ర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఆరంభం రోజే రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా సిల్హెట్ టైటాన్స్, రాజ్‌షాహి వారియర్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

    ఆ త‌ర్వాతి మ్యాచ్‌లో నోఖాలి ఎక్స్‌ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. నోఖాలి ఎక్స్‌ప్రెస్.. బీపీఎల్‌లో చేరిన కొత్త ఫ్రాంచైజీ. ఈ జ‌ట్టుకు ఇదే తొలి సీజ‌న్‌. అయితే నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్.. ఛటోగ్రామ్ రాయల్స్‌తో తమ మొదటి మ్యాచ్‌కు స‌న్న‌ద్ద‌మ‌య్యేందుకు  గురువారం  సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెల్ళింది.

    అలిగిన కోచ్‌లు..
    అయితే ప్రాక్టీస్ మధ్యలోనే హెడ్ కోచ్ ఖలీద్ మహముద్, అసిస్టెంట్ కోచ్ తల్హా జుబేర్ బయటకు వచ్చేయడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్రాక్టీస్ సెషన్‌లో కనీసం సరిపడా క్రికెట్ బంతులు కూడా లేకపోవడంతో వారిద్ద‌రూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. బంగ్లాదేశ్ మాజీ పేస‌ర్ అయిన ఖలీద్ మహముద్ గ‌త సీజ‌న్ వ‌ర‌కు ఢాకా క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్‌గా ప‌నిచేశాడు. అయితే ఈ సీజ‌న్‌లో ఫ్రాంచైజీ నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్‌తో జ‌త క‌ట్టాడు.

    కానీ అత‌డికి ఆరంభంలోనే చేదు అనుభ‌వం ఎదురైంది. ప్రాక్టీస్‌కు జ‌ట్టుతో పాటు వెళ్లిన ఖలీద్ మహముద్‌తో బీసీబీ అధికారి ఒక‌రు దురుసుగా ప్రవర్తించిన‌ట్లు స‌మాచారం. దీంతో ఖలీద్,జుబేర్ ఇద్ద‌రూ స్టేడియం బ‌య‌ట‌కు వ‌చ్చి ఆటోలో వెళ్లిపోయారు. ఈ సంద‌ర్భంగా జుబేర్ మీడియాతో మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఎన్నో బీపీఎల్ సీజ‌న్ల‌ను చూశాను. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ప‌రిస్ధితి ఎప్పుడూ ఎదురు కాలేదు. మిగతా వారు గురుంచి నాకు అన‌వ‌స‌రం. ఇలాంటి ప‌రిస్థితుల్లో నేను కొనసాగలేను పేర్కొన్నారు.

    అదేవిధంగా హెడ్ కోచ్ ఖలీద్ మహముద్ స్పందిస్తూ.. నేను బీపీఎల్ నుంచి వైదొల‌గాల‌నుకుంటున్నాను. ఇటువంటి ప‌రిస్థితి ఎప్పుడూ చూడ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అయితే కొన్ని గంటల తర్వాత మహమూద్, జుబేర్ తిరిగి మైదానంకు వ‌చ్చారు.

    ఇద్దరి సన్నిహితుడు ఒక‌రు జోక్యంతో వారు మ‌న‌సు మార్చుకున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మ‌రోషాక్ త‌గిలింది. ఛటోగ్రామ్ రాయల్స్ జట్టు యాజ‌మాన్యం టోర్నీ ఆరంభానికి ముందు తప్పుకొంది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఆ ఫ్రాంచైజీ బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది.
    చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్‌..
     

  • టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ పేలవ ఫామ్‌తో స‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కెప్టెన్‌గా జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపిస్తున్న‌ప్ప‌టికి..వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌రంగా మాత్రం దారుణంగా విఫ‌ల‌మవుతున్నాడు. 

    2025 ఏడాది అత‌డి కెరీర్‌లో ఒక పీడ‌క‌ల‌ల మిగిలిపోనుంది. ఆసియాక‌ప్‌ వంటి మేజ‌ర్ టైటిల్స్ సాధించిన‌ప్ప‌టికి.. ఒక ఆట‌గాడిగా మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ ఏడాది కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించ‌లేక‌పోయాడు. ఈ ఏడాది మొత్తంగా  21 అంతర్జాతీయ టీ20లు ఆడిన సూర్యకుమార్‌.. 13.62 సగటుతో కేవలం 218 పరుగులు చేశాడు. 

    అత్యధిక స్కోర్‌ 47గా ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కూడా కేవలం 34 పరుగులు (12, 5, 12, 5) మాత్రమే చేశాడు. దీంతో  టీ20 వరల్డ్‌కప్‌-2026 తర్వాత సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ముందే సూర్యపై వేటు వేయాలని సెలక్టర్లు భావించినప్పటికి.. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ముందు ప్రయోగాలు ఎందకని తమ నిర్ణయాన్ని మార్చుకున్నారంట.

    కెప్టెన్‌గా బుమ్రా..!
    అయితే భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తదుపరి కెప్టెన్‌గా బుమ్రా పేరును సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బుమ్రాకు కెప్టెన్‌గా పెద్ద‌గా అనుభ‌వం లేన‌ప్ప‌టికి.. నాయ‌కత్వ ల‌క్ష‌ణాలు మాత్రం పుష్క‌లంగా ఉన్నాయి.

    రోహిత్ శర్మ తరహాలోనే బుమ్రా మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడి సమయాల్లో ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకోవాలో ఒక బౌల‌ర్‌గా అత‌డికి బాగా తెలుసు.  2022లో ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో భార‌త జ‌ట్టుకు బుమ్రా నాయ‌క‌త్వం వ‌హించాడు.  ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 35 పరుగులు చేసి చ‌రిత్ర సృష్టించాడు.

    టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు బుమ్రా నెలకొల్పాడు. ఆ తర్వాత 2023లో ఐర్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించాడు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన బుమ్రా.. ఆ సిరీస్‌లో కెప్టెన్‌గా, బౌలర్‌గా దుమ్ములేపాడు.

    అయితే రోహిత్ శర్మ రిటైర్మ్ తర్వాత బుమ్రా టెస్టు కెప్టెన్‌గా ఎంపిక అవుతాడని అంతా భావించారు. కానీ బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడే కీలక బౌలర్ కావడంతో.. అతడికి కొన్ని సిరీస్‌లకు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంగ్లండ్ పర్యటనలో అతడు కేవలం మూడు టెస్టులు ఆడాడు.  

    మిగితా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అందుకే అతడికి టెస్టుల్లో జట్టు పగ్గాలను అప్పగించలేదు. కానీ అతడు ఇప్పుడు దాదాపుగా అన్ని టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటున్నాడు. వన్డే, టెస్టులకు విశ్రాంతి తీసుకుంటున్నప్పటికి పొట్టి ఫార్మాట్‌లో మాత్రం ఆడేందుకు బుమ్రా సముఖత చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టీ20 కెప్టెన్సీ అప్పగించాలని బీసీసీఐ సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.
    చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్‌..

  • న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యాటర్‌, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు.

    దాదాపు రెండు నెలల విరామం తర్వాత అయ్యర్ బుధవారం(డిసెంబర్ 24)  తన మొదటి బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోన్నట్లు సమాచారం. సుమారు గంటసేపు నెట్స్‌లో గడిపిన శ్రేయస్.. ఎలాంటి  ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

    అతడు ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. శ్రేయస్‌ ఒకట్రెండు రోజుల్లో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ ముంబై ఆటగాడు 4 నుంచి 6 రోజుల పాటు ప్రత్యేక శిక్షణలో పాల్గోనున్నాడు.

    అనంతరం అతడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృంది ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించింది. ఒకవేళ ఈ పరీక్షలో అయ్యర్ పాసైతే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది. కివీస్‌తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు.

    అయ్యర్‌కు ఏమైందంటే?
    అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అత‌డి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంట‌నే అత‌డిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు. 

    మూడు రోజుల త‌ర్వాత అయ్య‌ర్ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంత‌రం ముంబైకు తిరిగొచ్చిన అయ్య‌ర్‌.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు. అత‌డికి దాదాపు నాలుగు ఐదు వారాల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని పార్దివాలా సూచించారు.

    ఇప్పుడు అత‌డు పూర్తిగా కోలుకోవ‌డంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఒక‌వేళ అయ్య‌ర్ త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే.. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.
    చదవండి: ఐపీఎల్‌ వద్దు పొమ్మంది.. కట్‌చేస్తే.. డబుల్‌ సెంచరీతో దుమ్ములేపాడు!

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్‌.. యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు ఇదే వేదికపై సత్తాచాటి క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఆటగాడు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్‌లో భాగం కావాలని భాగం కావాలని కలలు కంటాడు.

    అలా కలలు కంటున్న వారిలో ఒడిశాకు చెందిన స్వస్తిక్ సామల్ ఒకరు. 25 ఏళ్ల స్వస్తిక్ సామల్ ఐపీఎల్‌లో ఆడేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తాడు. కానీ ప్ర‌తీసారి అత‌డికి నిరాశే ఎదురు అవుతోంది. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో కూడా అత‌డు త‌న పేరును రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌తో రిజిస్ట‌ర్ చేసుకున్నాడు.

    అయితే దుర‌దృష్టవశాత్తూ తుది వేలం జాబితాలో (369 మంది) అతడికి చోటు దక్కలేదు. కానీ అతడు కొంచెం కూడా దిగులు చెందలేదు. తన సత్తాను మైదానంలోనే చూపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టు ఏకంగా డబుల్ సెంచరీతో మెరిశాడు.

    డబుల్ సెంచరీతో వీర వీహారం..
    విజ‌య్ హాజారే ట్రోఫీ-2025లో భాగంగా అలూర్ వేదిక‌గా సౌరాష్ట్ర‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్వస్తిక్ సామ‌ల్ డబుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన  సామ‌ల్.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. అలూర్ మైదానంలో బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. కేవ‌లం 169 బంతుల్లో 21 ఫోర్లు, 8  సిక్స‌ర్ల‌తో ఏకంగా 212 ప‌రుగులు చేశాడు. ఫ‌లితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఏకంగా 6 వికెట్ల న‌ష్టానికి 345 ప‌రుగులు చేసింది.

    అయితే ఈ ల‌క్ష్యాన్ని సౌరాష్ట్ర 5 వికెట్లు కోల్పోయి చేధించేసింది. ఒడిశా ఓడిపోయిన‌ప్ప‌టికి స్వస్తిక్ సామ‌ల్  ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అంతేకాకుండా లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఒడిశా ప్లేయ‌ర్‌గా స్వస్తిక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ సాధించిన ఐద‌వ ఆట‌గాడిగా ఏకంగా సంజూ శాంసన్ (212*) రికార్డును సమం చేశాడు. దీంతో సామ‌ల్ గురుంచి తెలుసుకోవడానికి నెటిజ‌న్లు ఆస‌క్తిచూపుతున్నారు.

    ఎవ‌రీ స‌మాల్‌?
    25 ఏళ్ల స్వస్తిక్ సామ‌ల్‌.. ఒడిశాలోని కోరాపుట్‌లో జ‌న్మించాడు. అయితే అత‌డికి చిన్న‌తనం నుంచే క్రికెట్‌పై మ‌క్కువ ఎక్క‌వ‌. 10 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ఆ త‌ర్వాత స్ధానికంగా ఓ క్రికెట్ అకాడ‌మీలో అత‌డు చేరాడు.

    అనంతరం ఒడిశా అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అత‌డికి 2019లో  ఒడిశా సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌పున ఆడే అవ‌కాశ‌ముంది. తొలుత అత‌డు స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మిజోరంపై టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది లిస్ట్‌-ఎ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 

    టీ20, లిస్ట్‌-ఎలో అద్భుతంగా రాణించ‌డంలో అత‌డు రెండేళ్ల కింద‌ట ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అత‌డు ఇప్పుడు ఒడిశా జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు. ఓపెన‌ర్‌గా వ‌చ్చి దూకుడ‌గా ఆడ‌డం అత‌డి స్పెషాలిటి. 

    ముఖ్యంగా టీ20 టీ20 ఫార్మాట్‌లో పవర్ ప్లే ఓవర్లను అద్భుతంగా ఉప‌యోగించుకునే స‌త్తా అత‌డికి ఉంది. గ్రౌండ్ నలుమూలలా కూడా అత‌డు షాట్లు ఆడ‌గ‌ల‌డు. స్వస్తిక్ సామల్ అండర్-16, అండర్-19 ,అండర్-23 స్థాయిలలో ఒడిశా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతడు ఇప్పటివరకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 686 పరుగులతో పాటు లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 521 రన్స్‌ నమోదు చేశాడు. అదేవిధంగా టీ20ల్లో 13 మ్యాచ్‌లు 362 పరుగులు చేశాడు. అయితే మూడు ఫార్మాట్లలోనూ అతడి పేరిట సెంచరీ ఉంది.
     

  • టీ20 వరల్డ్‌కప్‌-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర  చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనుహ్యంగా గిల్  స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో కిషన్ రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. 

    అయితే సడన్‌గా కిషన్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ చేరాడు. గిల్ స్ధానంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. కాగా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రిటైర్మెంట్ తర్వాత టీ20ల్లో జైశ్వాల్‌కు ఓపెనర్‌గా చోటు దక్కుతుందని అంతా భావించారు.

    కానీ అతడిని పూర్తిగా జట్టు నుంచే తప్పించారు. గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత జట్టు ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్‌-అభిషేక్ శర్మలకు అవకాశం దక్కింది. ఆ తర్వాత గిల్ తిరిగి జట్టులోకి రావడంతో శాంసన్ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. 

    అయితే తన పునరాగమనంలో గిల్ విఫలం కావడంతో సెలక్టర్లు వేటు వేశారు.మళ్లీ అభిషేక్‌-సంజూనే భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. అయితే జైశ్వాల్‌కు కూడా ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌తో పాటు టెస్టు క్రికెట్‌లో కూడా ఓపెనర్‌గా తన మార్క్ చూపించాడు.

    "టీ20 ప్రపంచకప్ టోర్నీకి సెలక్టర్లు అత్యుత్తమ జట్టును ఎంపిక చేశారు. కానీ ఈ జట్టులో యశస్వి జైశ్వాల్ లేకపోవడం తీవ్ర నిరాశపరిచింది. అతడు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికి అతడిని జట్టులోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం.

    జైశూ టీ20 జట్టులోకి తిరిగి రావాలంటే ఇంకా ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్ టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు. గిల్ ఫామ్‌లో లేనందున పక్కన పెట్టడం సరైన నిర్ణయమే. 

    ఈ విషయంలో నేను సెలక్షన్ కమిటీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాను. కానీ గిల్ స్ధానంలో  జైశ్వాల్‌కు అవకాశమిచ్చి ఉంటే బాగుండేది. అతడికి ఓపెనర్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మెరుపు ఆ​రం‍భాలను అందించే సత్తా అతడికి ఉంది అని వెంగ్‌సర్కార్ పిటిఐతో పేర్కొన్నాడు.

    కాగా జైశ్వాల్ గత కొంత కాలంగా టెస్టు జట్టులో మాత్రం రెగ్యూలర్‌గా సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తన దక్కిన అవకాశాన్ని జైశ్వాల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. గిల్ గైర్హజరీలో జట్టులోకి వచ్చిన జైశూ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.
    చదవండి: 'అతడు సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్‌ టోర్నీకి రెడీ'

  • టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి ప్ర‌స్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లి.. తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు.

    బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి శతక్కొట్టాడు. 299 పరుగుల భారీ లక్ష్య చేధనలో కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఢిల్లీ బాయ్ కేవ‌లం 101 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్ల‌తో 131 ప‌రుగులు చేశాడు. 

    కోహ్లికి ఇది 58వ లిస్ట్‌-ఎ సెంచ‌రీ. అదేవిధంగా ఇదే మ్యాచ్‌లో16,000 లిస్ట్-ఏ పరుగుల మైలురాయిని కూడా కోహ్లి అధిగ‌మించాడు. ఇప్పటికే టీ20, టెస్టుల‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్ర‌స్తుతం కేవ‌లం వ‌న్డే ఫార్మాట్ల‌లో మాత్రమే కొన‌సాగుతున్నాడు. 

    అయిన‌ప్ప‌టికి త‌నలో ఏ మాత్రం జోరు త‌గ్గ‌లేద‌ని కింగ్ నిరూపించుకుంటున్నాడు. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2027కు తాను సిద్దంగా ఉన్నానని త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తోనే సాటిచెబుతున్నాడు. 2025లో కోహ్లి 13 వన్డేల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

    ఈ నేప‌థ్యంలో కోహ్లి చిన్న‌నాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.  "విరాట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కనబరిన జోరునే విజయ్ హాజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.. తన అసాధారణ ప్రదర్శనతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. 

    చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినప్పటికి.. ఎక్కడా కూడా అతడిలో తడబాటు కన్పించలేదు. విరాట్ భారత జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు. అతడు వరల్డ్‌కప్ టోర్నీలో ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లి దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లి 302 పరుగులు చేశాడు.
    చదవండి: అదరగొట్టిన రింకూ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌.. చెలరేగిన జీషన్‌ అన్సారీ

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆడే భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్‌ దేశీ వన్డే టోర్నీలో శుభారంభం అందుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ నయా ఫినిషర్‌.. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌ను విజయంతో ఆరంభించాడు.

    ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్‌ 84 పరుగుల తేడాతో హైదరాబాద్‌ (HYD vs UP)పై గెలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసింది ఉత్తరప్రదేశ్.‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 324 పరుగులు సాధించింది. 

    అదరగొట్టిన జురెల్‌, ఆర్యన్‌, రింకూ
    ధ్రువ్‌ జురేల్‌ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆర్యన్‌ జుయల్‌ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్‌), అభిషేక్‌ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ రింకూ సింగ్‌ (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో కదంతొక్కారు.

    ఇక హైదరాబాద్‌ బౌలర్లలో అర్ఫాజ్‌ అహ్మద్‌ 2 వికెట్లు పడగొట్టగా... రక్షణ్‌ రెడ్డి, తనయ్‌ త్యాగరాజన్, నితిన్‌ సాయి యాదవ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ 43 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. 

    ఫలితంగా 84 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్‌ జట్టు చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (53; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ సాధించగా... రాహుల్‌ బుద్ధి (47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), వరుణ్‌ గౌడ్‌ (45; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు.

    జీషాన్‌ అన్సారీకి 4 వికెట్లు
    ఉత్తరప్రదేశ్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జీషాన్‌ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జమ్మూకశ్మీర్‌ 10 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై... బరోడా 5 వికెట్ల తేడాతో అస్సాంపై... బెంగాల్‌ 3 వికెట్ల తేడాతో విదర్భపై విజయాలు సాధించాయి. 

    ఇక ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో హిమాచల్‌ ప్రదేశ్‌ 95 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై... గోవా 6 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై... పంజాబ్‌ 51 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందాయి.

    మరోవైపు.. గ్రూప్‌ ‘ఎ’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో కేరళ 145 పరుగుల తేడాతో త్రిపురపై... తమిళనాడు 101 పరుగుల తేడాతో పాండిచ్చేరిపై... మధ్యప్రదేశ్‌ 99 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై విజయాలు సాధించాయి.

    చదవండి: ప్రపంచకప్‌ జట్టులో జైస్వాల్‌, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్‌!

  • ‘‘ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కటె జన్మస్థానమంటూ.. కొత్త కథలాగా మొదలైతదమ్మా’’.. ఇటీవలి కాలంలో ప్రేమికులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా పాటలోని పంక్తులు అమెరికా టెన్నిస్‌ దిగ్గజం వీనస్‌ విలియమ్స్‌- ఇటలీ నటుడు ఆండ్రియా ప్రెటీకి సరిగ్గా సరిపోతాయి.

    వేర్వేరు దేశాలకు చెందిన వీనస్‌- ఆండ్రియా రంగాలూ, పైకి కనిపించే సోకాల్డ్‌ ‘రంగు’లూ భిన్నమైనవే. సంపాదనలోనూ భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా. వయసులోనూ ఎనిమిదేళ్ల వ్యత్యాసం. అయితేనేం వారి హృదయాంతరాల్లో ఉన్న స్వచ్చమైన ప్రేమకు ఈ అంతరాలు అడ్డంకి కాలేదు. ఏడాదిన్నర కాలంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న ఈ జోడీ.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది.

    ఇటలీలో ఈ సెప్టెంబరులోనే వీనస్‌- ఆండ్రియా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఇటలీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వీనస్‌ విదేశీయురాలు కాబట్టి ఈ వివాహం అధికార ముద్ర పొందేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. అందుకే తాజాగా తన స్వస్థలం ఫ్లోరిడాలోని బీచ్‌లో వీనస్‌ మరోసారి తన భర్తతో పెళ్లినాటి ప్రమాణాలు చేసింది.

    ఇంతకీ ఈ ఆండ్రియా ప్రెటీ ఎవరు?
    డానిష్‌ సంతతికి చెందిన ఆండ్రియా ఇటలీలో పెరిగాడు.మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి.. నటుడిగా, నిర్మాతగా కొనసాగుతన్నాడు. సినిమాలు, టీవీ షోలు, రియాల్టీ షోలతో బోలెడంత పాపులారిటీ సంపాదించిన ఆండ్రియా.. విలక్షణ రీతిలో కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

    చక్కటి అందగాడు మాత్రమే కాదు.. నిరాడంబరంగా జీవించేందుకే ఆండ్రియా ఇష్టపడతాడని అతడి సన్నిహితులు చెబుతుంటారు. వీనస్‌తో డేటింగ్‌ మొదలుపెట్టిన కొద్దికాలంలోనే ఆమె కుటుంబంతో చక్కగా కలిసిపోయాడు ఆండ్రియా.

    ప్రేమకథ అలా మొదలైంది
    కెరీర్‌కు ప్రాధాన్యం ఇచ్చే వీనస్‌ విలియమ్స్‌ నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి మాట ఎత్తలేదు. స్వాతంత్ర్యంగా జీవించేందుకు ఇష్టపడే వీనస్‌... గతేడాది వరకూ సింగిలే. అయితే, 2024లో మిలాన్‌లో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌.. ఆమె జీవితంలోని నవ వసంతానికి నాంది పలికింది.

    అక్కడే తన కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన 37 ఏళ్ల ఆండ్రియా ప్రెటీ తొలి చూపులోనే వీనస్‌ దృష్టిని ఆకర్షించాడు. అతడిది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. మాటలు కలిశాయి. మనసులు ఒక్కటయ్యాయి. స్నేహం ప్రేమగా మారి పరిణయానికి దారి తీసింది.

    ఎవరి నెట్‌వర్త్‌ ఎంత?
    మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకున్న వీనస్‌ విలియమ్స్‌.. డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కలిపి మరో పదహారు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల వాషింగ్టన్‌ డీసీ ఓపెన్‌లో గెలిచిన 45 ఏళ్ల వీనస్‌.. ఈ టైటిల్‌ గెలుచుకున్న రెండో అతిపెద్ద వయస్కురాలిగా చరిత్రకెక్కింది.

    చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకుని దిగ్గజంగా ఎదిగిన వీనస్‌ విలియమ్స్‌.. ఇటు టెన్నిస్‌ టైటిళ్ల ద్వారా వచ్చే ప్రైజ్‌మనీ.. అటు ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీ మొత్తమే కూడబెట్టింది. అంతేకాదు ఇంటీరియర్‌ రంగంలో అడుగుపెట్టిన వీనస్‌కు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి.

    వంద రెట్లు ఎక్కువ
    ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న వీనస్‌ విలియమ్స్‌ నికర ఆస్తుల విలువ తొంభై ఐదు మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపు 851 కోట్ల రూపాయలకు పైమాటే.

    మరోవైపు.. వీనస్‌ భర్త ఆండ్రియా ప్రెటీ.. మోడలింగ్‌, నటన, సినిమా ప్రొడక్షన్‌ ద్వారా సుమారుగా 1- 2 మిలియన్‌ డాలర్లు సంపాదించినట్లు అంచనా (భారత కరెన్సీలో దాదాపు రూ. 8- 17 ​కోట్లు). దీనర్థం భర్త కంటే వీనస్‌ ఆస్తుల విలువ రమారమి వంద రెట్లు ఎక్కువ. అందుకే మరి అనేది.. ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కటె జన్మస్థానమంటూ.. కొత్త కథలాగా మొదలైతదమ్మా!!

    చదవండి: David Beckham: భార్యే సర్వస్వం.. చీలిన కుటుంబం

  • సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను సొంతం చేసుకుని జోష్‌లో ఉంది ఆస్ట్రేలియా. పెర్త్‌, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నామమాత్రపు నాలుగో, ఐదు టెస్టులలోనూ సత్తా చాటి వైట్‌వాష్‌ చేయాలని పట్టుదలగా ఉంది.

    మరోసారి స్మిత్‌ సారథ్యంలో 
    కాగా ఆసీస్‌- ఇంగ్లండ్‌ మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా బాక్సింగ్‌ డే టెస్టు (Aus Vs Eng Boxing Day Test) జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ నుంచి రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins)కు విశ్రాంతినివ్వగా.. మరోసారి స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) సారథిగా వ్యవహరించనున్నాడు. తొలి రెండు టెస్టుల మాదిరే ఈసారీ గెలుపు రుచి చూడాలని స్మిత్‌ భావిస్తున్నాడు.

    ఆ ముగ్గురి మధ్య పోటీ
    అయితే, కమిన్స్‌తో పాటు వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ సైతం నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై కెప్టెన్‌ స్మిత్‌ అంచనాకు రాలేకపోయాడు. దీంతో పన్నెండు మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించారు. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో రెండు స్థానాల కోసం పేసర్లు బ్రెండాన్‌ డాగెట్‌, మైకేల్‌ నాసర్‌, జే రిచర్డ్‌సన్‌ మధ్య పోటీ ఉందని స్మిత్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

    పిచ్‌కు అనుగుణంగా
    పచ్చగా ఉన్న మెల్‌బోర్న్‌ పిచ్‌ను నిశితంగా పరిశీలించిన తర్వాతే తాము తుదిజట్టును ఎంపిక చేసుకుంటామని స్మిత్‌ స్పష్టం చేశాడు. తద్వారా స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీకి మరోసారి మొండిచేయి తప్పదని సంకేతాలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో 82, 40 పరుగులతో ఆకట్టుకున్న ఉస్మాన్‌ ఖవాజా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.

    బాక్సింగ్‌ డే టెస్టు (డిసెంబరు 26-30)కు ఆస్ట్రేలియా ప్లేయింగ్‌ XII
    ట్రవిస్‌ హెడ్‌, జేక్‌ వెదరాల్డ్, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా , అలెక్స్‌ క్యారీ (వికెట్‌ కీపర్‌), కామెరాన్‌ గ్రీన్‌, మిచెల్‌ స్టార్క్‌, స్కాట్‌ బోలాండ్‌, బ్రెండాన్‌ డాగెట్‌, మైకేల్‌ నాసర్‌, జే రిచర్డ్‌సన్‌.

    బాక్సింగ్‌ డే టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు
    స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, బ్రెండాన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, టాడ్ మర్ఫీ, మైకేల్‌ నాసర్‌, జే రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.

    మరోవైపు ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టుకు ఇంగ్లండ్‌ తమ తుదిజట్టును ప్రకటించింది. జోఫ్రా ఆర్చర్‌ పక్కటెముకల నొప్పితో దూరం కాగా.. ఓలీ పోప్‌ను తప్పించింది. వీరి స్థానాల్లో గస్‌ అట్కిన్సన్‌, జేకబ్‌ బెతెల్‌ వచ్చారు.

    ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టుకు ఇంగ్లండ్‌ తుదిజట్టు
    జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్‌ బెతెల్‌, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌ కీపర్‌), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్.

    చదవండి: ప్రపంచకప్‌ జట్టులో జైస్వాల్‌, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్‌!

International

  • ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి అంతకంతకూ ఆందోళనకరంగా మారుతోంది. మైమెన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ అనే  యువకుడిని హత్యచేసి.. మృతదేహాన్ని దహనం చేసిన ఘటన మరువక ముందే.. తాజాగా రాజ్‌బారి జిల్లాలో మరో హిందూ యువకుడు మూకదాడికి బలయ్యాడు. బుధవారం రాత్రి పాంగ్షా ఉపజిల్లా హోసైన్‌డంగా పాత మార్కెట్ వద్ద 29 ఏళ్ల అమృత్ మండల్ (సామ్రాట్) అనే యువకుడిని కొందరు కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపింది.

    పోలీసుల కథనం ప్రకారం.. అమృత్ మండల్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతడిపై దాడి చేసి, హత్య చేశారు. మృతుడు ‘సామ్రాట్ బహినీ’ అనే స్థానిక బృందానికి నాయకుడని పాంగ్షా పోలీస్ స్టేషన్ అధికారి షేక్ మొయినుల్ ఇస్లాం తెలిపారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, అల్లర్లు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో మూకహత్య కావడం గమనార్హం. డిసెంబర్ 18న మైమెన్‌సింగ్‌లోని భలుకాలో దీపు చంద్ర దాస్ అనే ఫ్యాక్టరీ కార్మికుడిని ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే నెపంతో కొట్టి చంపారు.  మరోవైపు, దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు  పతాక స్థాయికి చేరాయి. విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత ఢాకాలో హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. కొందరు యువ నేతలు భారత వ్యతిరేక ప్రకటనలు చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.

  • బ్యాంకాక్‌: థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లొ విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేతపై థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ చర్య భద్రతా కారణాలతో కూడుకున్నదని, మతపరమైన ఉద్దేశాలు ఏవీ లేవని అధికారులు తెలిపారు.  సరిహద్దు నిర్వహణ, నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్-కంబోడియన్ సరిహద్దు ప్రెస్ సెంటర్ మీడియాకు వెల్లడించింది.

    2014లో నిర్మితమైన ఈ విగ్రహాన్ని థాయ్ సైనిక సిబ్బంది బ్యాక్‌హో లోడర్‌తో కూల్చివేస్తున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఈ నిర్మాణం తమ భూభాగంలోని చోంగ్ అన్ మా ప్రాంతంలో ఉందని, సార్వభౌమత్వాన్ని తెలియజేసేందుకే కంబోడియా సైనికులు దీనిని నిర్మించారని థాయ్ అధికారులు చెబుతున్నారు. హిందూ మతంతో తమకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గౌరవిస్తామని, అయితే సరిహద్దు ఉద్రిక్తతలను పెంచే చిహ్నాలను నిరోధించడమే తమ ప్రాధాన్యతని వారు తెలిపారు.

    ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. థాయిలాండ్ మరియు కంబోడియా దేశాలు రెండూ సంయమనం పాటించాలని, వివాదాలను చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.

    మరోవైపు, కంబోడియా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ భూభాగంలోని ప్రీహ్ విహార్ ప్రావిన్స్‌లో ఉన్న విగ్రహాన్ని థాయ్ దళాలు ధ్వంసం చేశాయని ఆరోపించింది. ఈ సరిహద్దు వివాదం కారణంగా గతంలో ఘర్షణలు ఏర్పడి పలువరు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, మతపరమైన కట్టడాల రక్షణపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. 

    ఇది కూడా చదవండి: టీచర్‌పై తూటాల వర్షం.. వర్శిటీలో దారుణం

  • సిడ్నీ: ఆస్ట్రేలియాలో యూదు సమాజం లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆ దేశంలోని శాంతిభద్రతలను ప్రశ్నిస్తున్నాయి. సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే, మెల్‌బోర్న్‌లో మరో విద్వేషపూరిత ఘటన వెలుగుచూసింది. హనుక్కా పండుగ గుర్తు ఉన్న ఒక కారుపై దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఇంటి డ్రైవ్‌వేలో పార్క్ చేసి ఉన్న కారుపై జరిగిన ఈ దాడిని యూదు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి, గత రెండేళ్లుగా పెరుగుతున్న యూదు వ్యతిరేకతే ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు.

    డిసెంబర్ 14న బాండీ బీచ్ సమీపంలోని యూదుల సమావేశంపై జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని ఒక్కసారిగా వణికించింది. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ జరిపిన ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 38 మందికి పైగా గాయపడ్డారు. 1996 తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన అత్యంత భయంకరమైన  కాల్పుల ఘటనగా దీనిని అధికారులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఈ తండ్రీకొడుకులు మారుమూల ప్రాంతాల్లో ముందస్తుగా తుపాకీ ప్రాక్టీస్ చేసినట్లు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

    ఈ విపత్కర పరిస్థితులపై ఆస్ట్రేలియన్ జ్యూయిష్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం  కారణంగానే మత విద్వేషాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెల్‌బోర్న్ కారు దహనం వెనుక మతపరమైన కోణాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, స్థానిక యూదు సమాజం మాత్రం తమ భద్రతపై  ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూదు వ్యతిరేక సంక్షోభం  ఆస్ట్రేలియాలో ఒక సవాలుగా మారిందని వారు పేర్కొన్నారు.

    కాగా ఈ దాడుల సమయంలో ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడిన వారిని గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ గురువారం ఒక కొత్త ‘జాతీయ ధైర్యసాహసాల అవార్డు’ను ప్రకటించారు. అసాధారణ ధైర్యం ప్రదర్శించిన పౌరులు, అత్యవసర సేవా సిబ్బందికి ఈ గౌరవం దక్కుతుందని ఆయన తెలిపారు. సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

    ఇది కూడా చదవండి; ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్‌ క్రిస్మస్‌ కానుక

  • ప్రళయాన్ని మానవమాత్రులైనా అంచనా వేయగలరా?.. అదేం సినిమానా? పోస్ట్‌పోన్‌ కావడానికి అనుకుంటున్నారా?. లక్షల మందిని మోసం చేసిన ఓ వ్యక్తి మాటల గురించే ఇక్కడ చెప్పబోతున్నాం. డిసెంబర్‌ 25వ తేదీన పెద్ద ప్రళయం పుట్టుకొస్తుందని.. దాని ప్రభావంతో యుగాంతం తప్పదని ప్రచారం చేసిన ఆ వ్యక్తి ఇప్పుడేమో మాట మార్చేశారు మరి!.. 

    ఘనాకు చెందిన మత గురువు ఎబో(Eboh Noah) లెక్క తప్పింది. క్రిస్మస్‌ నాడే మహా జలప్రళయం మొదలుకాబోతోందని హెచ్చరికలు జారీ చేసిన ఇతగాడు.. ఇప్పుడు అబ్బే దేవుడు కొంతకాలం దానిని వాయిదా వేశాడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. తనను తాను దైవ దూతగా ప్రకటించుకున్న నోహా.. ఈ ప్రళయం పేరు చెప్పుకునే లెక్కలేనంత విరాళాలు సేకరించడం ఈ ఎపిసోడ్‌లో కొసమెరుపు. 

    30 ఏళ్ల ఎబో.. ఈ ఏడాది ఆగస్టులో ‘‘జరిగేది.. జరగక మానదు’’ అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ఈ క్రిస్మస్‌ తేదీన ప్రపంచమంతా జోరు వాన మొదలవుతుందని.. అది మూడేళ్లపాటు ఆగకుండా కురిసి  ప్రపంచం మునిగిపోతుందని, అయితే ఆ జల ప్రళయంలో మూడేళ్లపాటు తట్టుకోగలిగే పడవలను నిర్మించే బాధ్యత దేవుడు తనకు(నోహానని చెబుతూ) అప్పగించాడని అనుచరుల్ని నమ్మ బలికాడు. 

    ఆ అనుచరులు ఆ ప్రచారం విస్తృతంగా జరపడంతో..  ఎబోకి ఎబో జీససగా, ఎబో నోహాగా పేరు దక్కింది. ఈ మాటలు నమ్మిన లక్షల మంది తమ వద్ద ఉన్నవాటిని అమ్మేసి డబ్బులు ఇచ్చారు. తీరా.. ఆ తారీఖు వచ్చేసరికి.. ఆ యుగాంతం వాయిదా పడిందని చెబుతున్నాడు. దేవుడు మానవాళికి ఇంకొంత సమయం ఇచ్చాడని.. అలాగే మరింత మందిని రక్షించేలా ఆర్క్‌ ప్రాజెక్టు(భారీ పడవల నిర్మాణం) విస్తరించాలని ఆదేశించాడని చెబుతున్నాడు. 

    అయితే ఎబో డూమ్స్‌డే హెచ్చరికలపై పలువురు మండిపడుతున్నారు. బైబిల్‌ ప్రకారం.. ప్రళయం ఏనాడో వచ్చిందని, మరొకటి వచ్చే ప్రసక్తే లేదని.. మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని జనాలను మోసం చేయడం సరికాదని ఎబోకు హితవు పలుకుతున్నారు. ఇంకోవైపు.. జనాల నుంచి సేకరించిన సొమ్ముతో ఎబో విలాసాలు అనుభవిస్తున్నాడంటూ పలువురు మండిపడుతున్నారు. 

Andhra Pradesh

  • సాక్షి, తిరుమ‌ల‌: మూడు రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల‌ జారీని ర‌ద్దు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు. తిరుమ‌ల‌లో నెల‌కొన్న అనూహ్య ర‌ద్దీ కార‌ణంగా డిసెంబ‌ర్ 27, 28, 29వ‌ తేదిల‌కు (శ‌ని, ఆది, సోమ‌వారం) సంబంధించి శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీ ర‌ద్దు చేశారు. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కౌంట‌ర్ లో, తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యంలో శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్లు జారీ చేయ‌రు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించికోవాల‌ని భ‌క్తుల‌కు టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది.

    అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలోమార్పు
    తిరుమల అంగప్రదక్షణ టోకెన్ల జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పుడు అమల్లో ఉన్న లక్కీ డిప్‌ విధానాన్ని రద్దు చేసి FIFO(First In First Out)పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
     

  • రాజకీయ నాయకులు, ప్రముఖులకు వివిధ సందర్భాల్లో అనుచరగణం భారీ పూలమాలలు వేస్తుంటారు. అయితే ఒకటి, రెండు రోజుల్లో అవి చెత్తకుప్పలోదర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కరెన్సీ నోట్లతో చేసిన మాలలను నేతలకు వేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కావాల్సిన పనులు చేయించుకునేందుకు ఇదొక మార్గమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

    నెల్లూరులోని మినీబైపాస్‌ రోడ్డు జేమ్స్‌ గార్డెన్‌ వద్ద పూల దుకాణాల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లే వారిని ఈ డ‌బ్బుల దండ‌లు (Currency Garlands) ఆక‌ర్షిస్తున్నారు. చాలా మంది వీటిని ఆశ్చ‌ర్యంగా తిల‌కిస్తున్నారు. కొంత మంది త‌మ సెల్‌ఫోన్ల‌తో ఫొటోలు కూడా తీసుకుంటున్నారు. ఈ దండ‌ల ధ‌ర‌లు అందులో పొందుప‌రిచిన నోట్ల‌కు అనుగుణంగా ఉంటాయ‌ని తెలుస్తోంది.                          
    – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు 

     

    చ‌ద‌వండి: రఘురామకృష్ణరాజుతో కాస్త జాగ్రత్త 

  • సాక్షి, అమరావతి: సీబీఐతో 420 ముద్ర వేయించుకున్న డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు వంటి వ్యక్తులతో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులైన కనకమేడల రవీంద్రకుమార్‌ కాస్త జాగ్రత్తగా ఉండాలని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ సూచించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలోని తన ఖాతాలో బుధవారం ఆయన ఓ పోస్టు పెట్టారు.

    కనకమేడల రవీంద్ర కుమార్‌తో గతంలో తీసుకున్న ఫొటోను ప్రస్తుతం రఘురామకృష్ణరాజు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడాన్ని సునీల్‌కుమార్‌ ప్రస్తావించారు. మనీలాండరింగ్‌ ఆరోపణల్లో ఈడీతో నేరం నిరూపితమైన రఘురామకృష్ణరాజు ఆ ఫొటోను ఎలా దుర్వియోగం చేయగలరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. ఆయన్ని కనమేడల రవీంద్రకుమార్‌ తన కార్యాలయం పొలిమేరల వరకు కూడా రానివ్వకూడదని సూచించారు. 

    రఘురామకృష్ణరాజు అరాచ‌కాల‌ను గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియా వేదికగా పీవీ సునీల్‌ కుమార్ (PV Sunil KUmar) ఎండ‌గ‌డుతున్నారు. బ్యాంకుల‌ను మోసం చేసిన కేసులో ఆయ‌న త్వ‌ర‌లోనే జైలుకు వెళ‌తార‌ని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు బ్యాంకుల‌ను రూ. 2 వేల కోట్ల మేర మోసం చేసిన వ్య‌వ‌హారానికి సంబంధించి త‌న వ‌ద్ద ఆధారాలున్నాయ‌ని సునీల్ కుమార్ చెప్పారు.

     చ‌ద‌వండి: బ్యాంకుల‌కు రఘురామకృష్ణరాజు టోక‌రా

  • పాలకొండ రూరల్‌/సాలూరు: వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చి తిరుగు ప్రయాణంలో గుండె పోటుకు గురై ఓ వ్యక్తి ఊపిరి ఆగిపోయింది. ఆ కుటుంబాన్ని ఉన్నపలంగా అంధకారంలోకి తోసేసిన ఘటన పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. మృతుని బంధువులు, స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణ పరిధి జగన్నాథపురంలో నివాసముంటూ కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు నడిపిల్లి జగదీష్‌ (40). ఈయన మధుమేహంతో కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్నాడు. 

    ఈ క్రమంలో వైద్య సేవలు పొందేందుకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల బలగ ఆస్పత్రికి వచ్చిపోతుంటారు. ఇదే క్రమంలో  ఇటీవల చేయించుకున్న రక్త పరీక్షల ఫలితాలు పోగొట్టుకోవటంతో మరోమారు పరీక్షలు చేయించుకునేందుకు బుధవారం ఆర్టీసీ బస్సులో శ్రీకాకుళం వెళ్లారు. వైద్య సేవలు, పరీక్షలు పూర్తి చేసుకుని సాయంత్రం తిరుగు ప్రయాణంలో భాగంగా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు 6 గంటల సమయంలో చేరుకుని పార్వతీపురం బస్సు కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కాలేజీ పిల్లలు, సహ ప్రయాణికులతో మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్య గూర్చి వివరించారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోవటంతో అక్కడి వారు గుండెపోటుగా గుర్తించి సహకరించే యత్నం చేశారు. అప్పటికే జగదీష్‌ అపస్మారక స్థితికి చేరుకున్నారు. 

    ఆర్టీసీ వర్గాలు, స్థానికుల సమాచారంతో 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా మరణించినట్టు ధ్రువీకరించారు. అప్పటి వరకూ తన ఆరోగ్య సమస్యలు చెబుతూనే తోటి ప్రయాణికుడు ఈ విధంగా మరణించటంతో అక్కడి వారు అయ్యో పాపం.. అంటూ ఆవేదనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పాలకొండ పోలీసులు కాంప్లెక్స్‌కు చేరుకుని మృతుని సెల్‌ఫోన్‌ ఆధారంగా పూర్తి వివరాలు సేకరించారు. ఈయన స్వస్థలం సాలూరు మండలం  కూర్మరాజుపేటగా గుర్తించారు. ఈయనకు భార్య సింహాచలం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పాలకొండ చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నిబంధనల మేరకు వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని వారి కుటంబ సభ్యులకు అప్పగించారు.     

  • సాక్షి, హైదరాబాద్: ఏపీలో నియంత పాలన నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్‌) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి. కూటమి పాలనలో వ్యవస్థలు కీలుబోమ్మలుగా మారాయని ఆరోపించారు. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేసులు కొట్టివేయించుకుంటున్నారు. చంద్రబాబుపై కొట్టివేసిన కేసులన్నింటిపై ఉన్నత న్యాయస్థానంలో కొట్లాడుతాం అని హెచ్చరించారు.

    వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులన్నీ ఒక్క నెలలో ఎలా కొట్టివేశారో అర్థం కావడం లేదు. కేసు పెట్టిన వ్యవస్థలే చంద్రబాబు నీతిమంతుడు అని క్లీన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సీఐడీ, సిట్ సాక్షాదారాలు లేవని చంద్రబాబుపై ఉన్న కేసులు కొట్టివేశారు.

    స్కీల్ డెవలప్‌మెంట్‌ కేసులో వందల మందిని విచారించి ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలు అన్ని ఏమయ్యాయి?. ఏపీలో దొంగా పోలీసు ఆట నడుస్తుంది.. దొంగలు వారే.. న్యాయ నిర్ణేతలు వారే. కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనే కోర్టు చంద్రబాబును జైలులో వేసింది. మరి ఇప్పుడు ఆధారాలు ఏమయ్యాయి?. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులు భవిష్యత్‌లో దోషులుగా నిలబడక తప్పదు. చంద్రబాబుపై కొట్టివేసిన కేసులపై మళ్లీ ఉన్నత న్యాయస్థానాల్లో కొట్లాడుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

     

  • సాక్షి, తిరుపతి: టీటీడీ నిర్లక్ష్యంతో.. ఈ ఏడాది ప్రారంభంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలిపిరి వద్ద గురువారం దాదాపు తొక్కిసలాట మాదిరి పరిస్థితులే కనిపించాయి. 

    అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల జారీ నేపథ్యంలో భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో.. క్యూలైన్‌లో తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. భక్తుల్ని అదుపు చేసే పేరుతో లాఠీఛార్జ్‌కి దిగారు. అయితే.. 

    పోలీసుల దురుసు ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపటికి భక్తులే నియంత్రించుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకున్నారు. టీటీడీ నిర్లక్ష్య ధోరణితోనే తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని భక్తులు ఈ సందర్భంగా వాపోయారు.

    టీటీడీపై భక్తుల ఆగ్రహం.. 
    తోపులాట ఘటనతో భక్తులు టీటీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీటీడీ మేనేజ్‌మెంట్‌ సరిగా లేదు. వీఐపీల సేవల్లో అధికారులు మునిగిపోతున్నారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోవడం లేదు. స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం మాకు ఉండకూడదా?.. భక్తులు రద్దీ దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు ఇచ్చే సర్వదర్శనం టికెట్లు పెంచాలి’’ అని డిమాండ్‌ చేస్తున్నారు.

    సాక్షి సిబ్బందిపై దౌర్జన్యం.. 
    అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద పరిస్థితులను కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి సిబ్బందితో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. సాక్షి ఫోటో గ్రాఫర్ కృష్ణను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అడ్డుకోగా.. అక్కడికి వచ్చిన అలిపిరి ఎవీఎస్వో రమేష్‌ ఫొటోగ్రాఫర్‌ కృష్ణ ఫోన్‌ లాక్కుని దురుసుగా ప్రవర్తించారు. 

    అంత విషాదం జరిగినా.. నిర్లక్ష్యమా?
    ఈ ఏడాది ప్రారంభంలో.. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర విషాదానికి దారి తీసింది. బైరాగిపట్టెడ వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యూలైన్లో ఉన్నవాళ్లను ఒక్కసారిగా ఏదో పశువుల మాదిరి విడిచిపెట్టారని.. అందుకే తోపులాట జరిగిందని ఆ సమయంలో భక్తులు టీటీడీ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

Business

  • సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వెండి గుర్తుకొస్తాయి. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువై.. రేటు కూడా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రాగి ధరలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ రేటు 12000 డాలర్లు దాటేసింది.

    2025లో బంగారం, వెండి ధరలు వరుసగా 70 శాతం, 140 శాతం పెరిగాయి. ఇదే సమయంలో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగిపోయింది. 2009 తరువాత కాపర్ రేటు ఇంతలా పెరగడం బహుశా ఇదే మొదటిసారి. దీంతో నిపుణులు దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు.

    రాగి ధరలు భారీగా పెరగడానికి కారణాలు

    • మార్కెట్లో రాగి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం..భౌగోళిక, రాజకీయ కారణాలు.

    • రాగిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, డేటా సెంటర్లలో, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో వినియోగించడం

    • అమెరికా విధించిన సుంకాలు కూడా రాగి ధర పెరగడానికి ఓ కారణం అనే చెప్పాలి. సుంకాల కారణంగా.. రాగి రేటు భవిష్యత్తులో పెరుగుతుందేమో అని చాలామంది దీనిని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో సరఫరా తగ్గిపోయి.. డిమాండ్ పెరుగుతోంది. డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం వల్ల.. ధర పెరిగింది.

    • రాగి ఉత్పత్తి తగ్గడం కూడా సరఫరా తగ్గడానికి కారణమైంది. 

  • దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.

    ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..

    ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్‌ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్‌లెస్, బ్రాంచ్‌లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.

    ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.

    అంతేకాకుండా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

    డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్‌లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

  • సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా అమెజాన్‌ ఇంటర్‌స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ డెలివరీ (ఐఎక్స్‌డీ) ప్రోగ్రాంలో చేరినట్లు ఈకామర్స్‌ సంస్థ నిహార్‌ ఇన్ఫో గ్లోబల్‌ ఎండీ దివ్యేష్‌ నిహార్‌ తెలిపారు. ఐఎక్స్‌డీ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లు పొందినట్లు పేర్కొన్నారు.

    ఇప్పటివరకు కంపెనీ రెండు వేర్‌హౌస్‌లతో కార్యకలాపాలు సాగిస్తుండగా, ప్రోగ్రాంలో చేరడంతో సదరు రాష్ట్రాల్లోని 20కి పైగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను ఉపయోగించుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు.

    సమర్ధవంతంగా నిల్వలను పాటించేందుకు, వ్యయాల భారాన్ని తగ్గించుకుని దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్, పంపిణీ సామర్థ్యాలను పెంచుకునేందుకు, వేగవంతంగా డెలివరీలు చేసేందుకు ఇది తోడ్పడుతుందని వివరించారు. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు మొదలైనవి ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌లలో విక్రయిస్తోంది.

  • వ్యాపారం చేసి రాణిద్దామనుకున్నాడు. ప్రారంభించిన నెల‌ల వ్య‌వ‌ధిలోనే భారీగా న‌ష్ట‌పోయి, అప్పుల పాల‌య్యాడు. ఎలాగైనా అప్పు తీర్చి.. మ‌రోసారి వ్యాపారం చేయ‌డానికి పెట్టుబ‌డి సిద్ధం చేసుకోవాల‌నే దృఢ సంక‌ల్పంతో అడుగులు ముందుకు వేశాడు. కేవ‌లం ఐదేళ్ల వ్య‌వ‌ధిలో కోటీశ్వ‌రుడ‌య్యాడు. అప్పు తీర్చ‌డ‌మే కాకుండా.. కొత్త ఏడాదిలో కోటి రూపాయ‌ల‌తో రెండు టిఫిన్ సెంట‌ర్లు కూడా ప్రారంభిస్తాడ‌ట‌. నిరాశ‌తో కూరుకుపోయిన జీవితాన్ని స్వ‌యంకృషితో ముందుకు సాగిన చైనాకు చెందిన పాతికేళ్ల కుర్రాడి గురించి అక్క‌డి మీడియాలో ప్ర‌శంస‌లు వెలువెత్తుతున్నాయి. ఫుడ్‌డెలివ‌రీ బాయ్‌గా కోట్లు ఎలా సంపాదించాడో గ‌ర్వంగా చెప్పుకుంటున్నాడు. శ్ర‌మ‌, ప‌ట్టుద‌ల ఉంటే అసాధ్య‌మేదీ కాద‌ని నిరూపించిన చైనా యువ‌కుడు జాంగ్ జుకియాంగ్ గురించి తెలుసుకుందాం.

    వ్యాపారంలో నష్టం
    ద‌క్షిణ చైనాలోని షాంఘై న‌గ‌రానికి చెందిన పాతికేళ్ల 'జాంగ్ జుకియాంగ్' 2020లో ఓ వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభించిన కొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలోనే న‌ష్టాల్లో కూరుకుపోయి వ్యాపారం మూసివేశాడు. న‌ష్టంతో పాటు అప్ప‌టికే అత‌నికి 50వేల యువాన్‌లు ఇక్క‌డి క‌రెన్సీ ప్ర‌కారం. సుమారు ఆరున్న‌ర ల‌క్ష‌లు అప్పు కూడా అయింది. స‌ర్దుకున్న జాంగ్ నిరాశ‌ప‌డ‌లేదు. ఎలాగోలా ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకుని షాంఘైలో ఓ పెద్ద ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్‌లో చేరాడు. ఫుడ్ ఆర్డ‌ర్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌సాగాడు. తోటి డెలివ‌రీ బాయ్స్‌లా కాకుండా.. త‌న‌కంటూ ఓ ల‌క్ష్యాన్ని పెట్ట‌కున్నాడు. నెల‌కు క‌నీసం ఇక్క‌డి క‌రెన్సీలో చూస్తే మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

    365 రోజులు ప‌ని & రోజుకు 300 పార్శిళ్లు
    ఏడాది మొత్తంలో 365 రోజులు ప‌ని చేయ‌డం,  రోజూ కేవ‌లం విశ్రాంతి, తిన‌డానిక‌య్యే స‌మ‌యాన్ని మిన‌హాయించి మిగ‌తా స‌మ‌యం అంతా ఫుడ్ డెలివ‌రీ కోసం కేటాయించాడు. నిత్యం ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి ఒంటి గంట వ‌ర‌కు అంటే సుమారు 14 గంట‌లు ఫుడ్ డెలివ‌రీ కోసం తిరిగాడు. రోజూ క‌నీసం 300 పార్శిళ్ల‌ను ల‌క్ష్యంగా పెట్ట‌కుని వాటిని క‌స్ట‌మ‌ర్ల‌కు అంద‌జేశాడు. ప్ర‌తిరోజు సుమారు 9 గంట‌ల పాటు విశ్రాంతి తీసుకునే వాడు. చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవుల్లో కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకుని మిగ‌తా స‌మ‌యాన్ని ఫుడ్ డెలివ‌రీకి కేటాయించాడు.

    డ‌బ్బు సంపాద‌న ధ్యేయంగా ప‌ని చేసిన జాంగ్ రోజూ 300 పార్శిళ్లు ఇవ్వ‌డం... ప్ర‌తి పార్శిల్‌కు అత్య‌ధికంగా 20 నుంచి25 నిముషాలకు మించి స‌మ‌యం తీసుకోకుండా త్వ‌రిత‌గ‌తిన డెలివ‌రీ చేయడంలోనూ ఫుడ్ డెలివ‌రీ కంపెనీలో రికార్డు సృష్టించాడు. ఐదేళ్ల వ్య‌వ‌ధిలో జాంగ్ డెలివ‌రీ కోసం 3ల‌క్ష‌ల 24వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌డంతో పాటు ల‌క్ష‌న్న‌రకు పైగా ఫుడ్ డెలివ‌రీ పార్శిళ్ల‌ను అంద‌జేశాడు. అత‌ని అంకిత‌భావాన్ని చూసి తోటి ఉద్యోగ‌లు అత‌నికి ఆర్డ‌ర్ కింగ్ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఐదేళ్ల కాలంలో జాంగ్ మొత్తం కోటి 80ల‌క్ష‌లు సంపాదించి.. వాటిలో కోటి 42 ల‌క్ష‌లు పొదుపు చేయ‌గ‌లిగాడు. ఆ డ‌బ్బుతో తిరిగి వ్యాపారం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుత‌న్నాడు.

  • ప్రభుత్వ రంగ దిగ్గజం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ 115 వ్యవస్థాపక దినోత్సవాన్ని ముంబైలో జరుపుకొంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు పాల్గొన్నారు.

    తొలి స్వదేశీ బ్యాంక్‌ అయిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్టం చేయడంలో, సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. బ్యాంకు రుణాల్లో ఆర్‌ఏఎం (గ్రామీణ, వ్యవసాయ, చిన్నమధ్య తరహా సంస్థలకు లోన్స్‌) వాటా 72 శాతంగా ఉండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

    మరోవైపు, దేశవ్యాప్తంగా 4,556 శాఖలు, 21,492 టచ్‌ పాయింట్లతో విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లు బ్యాంకు ఎండీ కల్యాణ్‌ కుమార్‌ తెలిపారు. వ్యాపార పరిమాణం రూ. 7,37,938 కోట్లకు చేరినట్లు వివరించారు.

    భారతదేశంలో తొలి స్వదేశీ బ్యాంకుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) పేరుగాంచింది. 1911లో పూర్తిగా భారతీయుల యాజమాన్యంలో, నిర్వహణలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడింది. సోరాబ్జీ పోచ్‌ఖానావాలా దీనిని స్థాపించారు.

  • ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రజలు రెండు గుర్తింపు కార్డులను లింక్ చేయడానికి తొందరపడుతున్నారు. 2025 డిసెంబర్ 31లోపు తమ పాన్ & ఆధార్ కార్డులను లింక్ చేయని వారికి రూ.1000 ఆలస్య రుసుము విధించనున్నారు.

    ఆధార్‌తో పాన్‌ కార్డులు లింక్‌ చేసుకోనివారు.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ను ఫైల్‌ చేయలేరు. ట్యాక్స్‌ రిఫండ్‌ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్‌, షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు. పన్ను ఎగవేతలను.. అక్రమాలను అరికట్టడానికి ఆధార్‌, పాన్‌ కార్డులను లింక్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడో నిబంధన తెచ్చింది. కాబట్టి అందరూ తమ పాన్, ఆధార్ కార్డులను తప్పకుండా లింక్ చేసుకోవాలి.

    ఆన్‌లైన్‌లో పాన్-ఆధార్ లింక్ చేసుకోవడం ఎలా

    • అధికారిక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.

    • "లింక్ ఆధార్"పై క్లిక్ చేసి మీ పాన్, ఆధార్ నంబర్, మొబైల్ నంబరును నమోదు చేయండి.

    • ఇప్పుడు మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి వివరాలను వెరిఫై చేయండి.

    • లింకింగ్ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి, వెబ్‌సైట్లో ‘క్విక్ లింక్స్‌’కు వెళ్లి ఆధార్ స్టేటస్ లింక్‌పై క్లిక్‌ చేయండి.

  • ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ ‌బజాజ్ ఆటో తమ పాపులర్‌ పల్సర్ 150 బైక్‌ను మరింత ఆకర్షణీయంగా అప్ డేట్ చేసింది. దాని మెకానికల్ సెటప్‌లో ఎలాంటి మార్పులు లేకుండా చిన్నపాటి డిజైన్,  ఫీచర్ మెరుగుదలలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పల్సర్ 150 ఇప్పుడు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌తో వస్తోంది. కాగా బైక్‌లో ఇప్పుడున్న వేరియంట్‌లు అలాగే ఉంటాయి.

    బజాజ్ 2026 ద్వితీయార్ధంలో పల్సర్ క్లాసిక్ శ్రేణిలో మార్పులు చేస్తుందని ఓవైపు ఊహాగానాలు నడుస్తుండగానే బజాజ్ ఆటో తన అత్యంత ఐకానిక్ మోటార్ సైకిళ్లలో ఒకటైన పల్సర్ 150ను రిఫ్రెష్ చేసింది. అప్‌డేటెడ్‌ పల్సర్ 150 శ్రేణి ధర రూ. 1.08 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. పల్సర్ 150 ఎస్‌డీ ధర రూ .1,08,772, పల్సర్ 150 ఎస్‌డీ యూజీ ధర రూ. 1,11,669లుగా ఉంది. ఇక టాప్-స్పెక్ అయిన పల్సర్ 150 టీడీ యూజీ ధర రూ. 1,15,481. (ఇవన్నీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు).

    ఏం మారాయి..? 
    సమకాలీన మోడల్‌ బైక్‌లతో పోటీపడేలా బజాజ్‌ పల్సర్‌ 150లో అప్ డేటెడ్‌ గ్రాఫిక్స్‌ తో డీటైల్స్‌ను కాస్త మెరుగుపరిచి కొత్త కలర్ ఆప్షన్లు తీసుకొచ్చింది. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌ను జోడించడం అత్యంత ముఖ్యమైన ఫంక్షనల్ అప్ గ్రేడ్. ఇది బైక్‌కు విజిబులిటీని పెంచడమే కాకుండా మొత్తం డిజైన్‌కే మోడ్రన్‌ టచ్‌ ఇస్తుంది.

    పల్సర్ 150 బైకులోని 149.5 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పీఎం వద్ద 13.8 బీహెచ్‌పీ పవర్, 6,500 ఆర్‌పీఎం వద్ద 13.25 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

    ఇక బ్రేకింగ్ హార్డ్ వేర్ విషయానికి వస్తే 260 మి.మీ ఫ్రంట్ డిస్క్, సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో రియర్ డ్రమ్ సెటప్ ఉన్నాయి. కాగా సస్పెన్షన్ పనిని టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు,ట్విన్ గ్యాస్-ఛార్జ్‌డ్ రియర్ షాక్ అబ్జార్బర్లు చూసుకుంటాయి.

  • ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైన నేపథ్యంలో.. బీఎస్4 వాహనాలను నగరంలో ప్రవేశించకుండా నిషేధించారు. అయితే ఇప్పుడు ఆ ఆంక్షలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గాలి నాణ్యత మెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

    డిసెంబర్ 13న, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 స్థాయిని దాటిన తర్వాత.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ IV అమలులోకి వచ్చింది. ఈ సమయంలోనే రాజధానిలో కొన్ని నిర్దిష్ట వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఇప్పుడు గాని నాణ్యత మెరుగుపడటంతో.. ఈ నిషేధం తొలగించారు.

    బీఎస్ 6 వాహనాలు మాత్రమే నగరంలోకి ప్రవేశించాలనే నియమం అమలు చేసిన సమయంలో.. సుమారు 1.2 మిలియన్ వాహనాలను నిషేధించారు. అయితే ఇప్పుడు ఆంక్షలు నిషేధించబడినప్పటికీ..  ఢిల్లీలో రిజిస్టర్ చేసుకున్న BS4 వాహనాన్ని కలిగి ఉంటే, మీ PUC చెల్లుబాటు అయితే, GRAP స్టేజ్ IV సమయంలో.. ఢిల్లీ NCRలో ఉపయోగించవచ్చు. ఢిల్లీలో రిజిస్టర్ కానీ బీఎస్3, బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదు. నియమాలను అతిక్రమించిన వాహనదారులు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

  •  సాక్షి, ముంబై:  సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు క్రిస్మస్‌  కానుక అందించింది.  ఫ్రెషర్లకు ఎంట్రీ-లెవల్ జీతాలను పెంచింది,  స్పెషల్‌  టెక్నాలజీ రోల్స్‌కు ఏడాది  రూ. 21 లక్షల దాకా పరిహార ప్యాకేజీలను అందిస్తోంది. AI-ఫస్ట్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి,డిజిటల్‌గా స్థానిక ప్రతిభను ఆకర్షించేందుకు   సంస్తలో  నియామకాలను పెంచుతుంది.ఇది ఇండియాలో మిగిలిన  ఐటీ కంపెనీలతో పోలిస్తే ఇదే  అత్యధిక ఎంట్రీ-లెవల్ వేతనంగా నిలిచింది.

    ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు ఆఫర్‌ ఎంత? 
    మనీకంట్రోల్  అందించిన సమచారం ప్రకారం  ఇన్ఫోసిస్ 2025 ఇంజనీరింగ్  అండ్‌ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేక టెక్నాలజీ  ఉద్యోగాల ఎంపికకోసం  ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్‌ను ప్రారంభించనుంది.  దీని వార్షిక పరిహారం రూ. 7 లక్షల నుండి రూ. 21 లక్షల వరకు ఉంటుంది.

    ఈ ఆఫర్‌లో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (L1 నుండి L3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ) ఉన్నాయి .అ లాగే  కంప్యూటర్ సైన్స్, ఐటీ,ఈఈఈ, ఈసీఈలాంటి ఎంపిక చేసిన సర్క్యూట్ బ్రాంచ్‌ల నుండి BE, BTech, ME, MTech, MCA ,ఇంటిగ్రేటెడ్ MSc గ్రాడ్యుయేట్‌లకు అవకాశం ఉంది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L3 (ట్రైనీ): రూ. 21 వార్షిక ప్యాకేజీని (ఎల్‌పీఏ) స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L2 (ట్రైనీ): రూ. 16 LPA, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1 (ట్రైనీ): రూ. 11 LPA, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ): రూ. 7 ఎల్‌పీఏ అందిస్తుంది.

    AI-ఫస్ట్ విధానంలో భాగంగా క్యాంపస్‌, ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాల్లో సంవత్సరానికి రూ. 21 లక్షల వరకు ప్యాకేజీలతో ఉద్యోగులను ఎంపిక చేస్తామని ఇన్ఫోసిస్ గ్రూప్ CHRO షాజీ మాథ్యూ  తెలిపారు.

    భారతదేశంలోని అగ్ర ఐటీ సంస్థలలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎంట్రీ-లెవల్ జీతాలు  దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉంది.అయితే, ప్రత్యేక నైపుణ్యాలతో వచ్చే గ్రాడ్యుయేట్ల విషయంలో ఈ ట్రెండ్ మారుతోందంటున్నారు నిపుణులు.

     

  • సరిగ్గా ఏడాది కిందట.. ఏఐని ఒక డిజిటల్ విజ్ఞాన సర్వస్వంలా చూశాం. ఏదైనా సమాచారం కావాలన్నా చాట్ జీపీటీని అడిగేవాళ్లం. కానీ 2025కు వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఏఐ (జనరేటివ్‌ ఏఐ), నేడు మన పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్‌గా రూపాంతరం చెందింది. గతంలో ఏఐ కేవలం ఒక రియాక్టివ్ అసిస్టెంట్. అంటే మనం అడిగితేనే సమాధానం చెప్పేది. కానీ 2025 ఏఐ టూల్స్ ప్రోయాక్టివ్ పార్ట్‌నర్స్‌(మీరు ఒక చిన్న మాట చెబితే మీ అవసరాలను ఊహించి, మీ ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేసే ఒక తెలివైన భాగస్వామి)గా మారాయి.

    సాంకేతిక నిపుణులు 2025వ సంవత్సరాన్ని  ఏఐ ఇయర్‌గా అభివర్ణిస్తున్నారు. 2024లో కేవలం మాటలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) 2025లో చేతల్లోకి వచ్చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాకుండా మన పనులను స్వయంగా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది కీలకంగా మారాయి. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, టూల్స్ పై ప్రత్యేక కథనం.

    తొలి త్రైమాసికంలో..

    చైనాకు చెందిన డీప్‌సీక్‌ ఆర్‌1 మోడల్ విడుదల కావడంతో ఏఐ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఆలోచనా సామర్థ్యం అందించడంతో ఓపెన్ సోర్స్ ఏఐ ఊపందుకుంది. ఇదే నెలలో ఓపెన్‌ఏఐ ఓ3-మినీని విడుదల చేసింది.

    ఆంథ్రోపిక్ Claude 3.7 Sonnetను, ఎలాన్ మస్క్ గ్రోక్‌ 3ని లాంచ్ చేశారు. వీటితో పాటు ఓపెన్‌ఏఐ కంప్యూటర్లను స్వయంగా ఆపరేట్ చేయగల Operator అనే ఏజెంట్‌ను పరిచయం చేసింది. గూగుల్ తన అత్యంత వేగవంతమైన Gemini 2.5 Flash, రోబోటిక్స్ కోసం ప్రత్యేకమైన ఏఐ మోడల్స్‌ను తెచ్చింది.

    రెండో త్రైమాసికంలో..

    ఏప్రిల్‌లో మెటా Llama 4 మోడల్స్‌ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ సోర్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మేలో ఆంథ్రోపిక్ నుంచి Claude 4 విడుదలయ్యింది. ఇది మనుషుల లాగా వరుసగా ఏడు గంటల పాటు స్వయంగా పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. జూన్‌లో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో ఏఐ మోడ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.

    మూడో త్రైమాసికం

    జులైలో ఓపెన్‌ఏఐ తన ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఏఐ మార్కెట్ సత్తాను చాటింది. ఆగస్టులో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జీపీటీ-5 విడుదలైంది. ఇది మునుపటి మోడల్స్ కంటే రెట్టింపు తెలివితేటలతో, కోడింగ్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సెప్టెంబర్‌లో వీడియో జనరేషన్ రంగంలో ఓపెన్‌ఏఐ Sora యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన వీడియో మోడల్ Veo 2తో దీనికి పోటీనిచ్చింది.

    నాలుగో త్రైమాసికం

    అక్టోబర్‌లో ఓపెన్‌ఏఐ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకుని పూర్తి లాభాపేక్ష కలిగిన కంపెనీగా అవతరించింది. నవంబర్‌లో గూగుల్ Gemini 3.0ని విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో పర్సనల్ అసిస్టెంట్‌గా మారింది. డిసెంబర్‌లో GPT-5.2 అప్‌డేట్‌తో పాటు, గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అత్యంత కచ్చితమైన ఏఐ అనువాద ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

    ఇదీ చదవండి: చెక్‌ పవర్‌ తగ్గిందా?

  • ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ కొత్త రికార్డు స్థాయికి దూసుకెళ్తోంది. ఔన్స్‌కు 72 డాలర్ల మార్కును దాటింది. దాదాపు 140% లాభాలతో, వెండి అనేక ఇతర అసెట్‌లను గణనీయంగా అధిగమించింది. ఈ నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఫియట్ కరెన్సీ, హార్డ్ అసెట్స్‌పై వ్యాఖ్యానానికి ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

    పారిశ్రామిక డిమాండ్, స్థూల ఆర్థిక ఆందోళనల మధ్య సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా భావిస్తూ పెట్టుబడులు పెంచుతుండటంతో వెండి ధరలు తారస్థాయికి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాబర్ట్‌ కియోసాకి ( Robert Kiyosaki) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్‌’లో తనదైన శైలిలో స్పందించారు.

    ‘వెండి 70 డాలర్లు దాటింది.
    బంగారం, వెండి పొదుపు చేసేవారికి గొప్ప వార్త.
    ఫేక్‌ మనీ (డాలర్లు) దాచుకునే వాళ్లకు బ్యాడ్‌ న్యూస్‌’ అంటూ పోస్టును ‍‍ప్రారంభించిన కియోసాకి అధిక ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, డాలర్ విలువను కోల్పోతూనే ఉన్నందున 2026 నాటికి వెండి ఔన్స్ కు 200 డాలర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.

    ‘న‍ష్టపోకండి.. వెండి ధర 2026 నాటికి 200 డాలర్లకు చేరుకుంటున్న క్రమంలో ఆ ఫేక్‌ డాలర్‌ (డబ్బు విలువ ఉండదనేది ఆయన అభిప్రాయం) కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తుంది’ అంటూ ముగించారు. రాబర్ట్‌ కియోసాకి అంచనా కాస్త అతిశయోక్తిలా అనిపించినా వెండి ధర అత్యంత వేగంగా పెరుగుతోందనే విషయం మాత్రం వాస్తవం.

     

  • సామాన్య ప్రజల దైనందిక అవసరాలలో చిల్లర నోట్లకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అలాగే విద్యార్థుల అవసరాలకు, చిన్న చిన్న ఒప్పందాల లావాదేవీలలో ఉపయోగించే 10 రూపాయల స్టాంప్‌ పేపర్ల పాత్ర ప్రాధాన్యమైంది. ఉదయం పాల నుంచి మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లలో పది రూపాయల నోట్ల ప్రాధాన్యత మామూలుది కాదు. అయితే కొన్నేళ్లుగా రూ.10 నోట్లు కనుమరుగవుతున్నాయి. 

    నోట్లకు బదులు విడుదల చేసిన రూ.10 నాణేలు చెల్లుబాటు కావని పలు వదంతులు రావడంతో వాటి చెలామణిలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రూ.10 నాణెం తయారీ కంటే 10 నోట్ల ముద్రణ తక్కువ ఖర్చవుతున్నా వాటి జీవిత కాలం తక్కువగా ఉండటంతో నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసినట్లు తెలుస్తోంది. వేయి రూ.10 నోట్లు ముద్రించడానికి ఆర్‌బీఐకి 966(ప్రతీ నోటుకు 1.01 రూ) రూపాయలు ఖర్చవుతుండగా. 10 నాణెం తయారీకి 5.54 రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. నోట్ల ముద్రణ తక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినా వాటి జీవితకాలం కూడా తక్కువగానే ఉంటున్నది. 10 రూపాయల నోటు ఏడాదిలోపే శిథిలమవుతుండగా నాణాలు మాత్రం జీవితకాలం పాడవకుండా ఉంటాయి. 

    ఇదే కారణంగా ప్రతి ఏడాది నోట్ల ముద్రణ కంటే నాణాల ముద్రణకే ఆర్‌బీఐ మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. మార్కెట్లో 10 నాణాలపై వస్తున్న వదంతులను ఖండిస్తూ ఆర్‌బీఐ కచ్చితమైన ప్రకటనలు చేసింది. 10 నాణాలను (10 Rupees Coins) ఎవరైనా నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చని సంబంధిత అధికారుల ఫోన్‌ నెంబర్లను సామాజిక మాధ్యాల ద్వారా పోస్టర్ల ద్వారా బ్యాంకుల్లో ప్రదర్శించింది. వదంతులకు గురైన పాత రూ.10 నాణాలతో పాటు, గత సంవత్సరం కొత్త రూ.10 నాణాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. రూ.10 నోట్ల కొరత కారణంగా ప్రస్తుతం రూ.10 నాణాల పట్ల మార్కెట్లో తిరస్కరణ ఉండటం లేదని పలువురు అంటున్నారు.

    రూ.10 స్టాంప్‌ పేపర్ల కొరత
    విద్యార్థుల, సామాన్యుల అవసరాలలో ప్రాధాన్యత కలిగిన రూ.10 స్టాంప్‌ పేపర్లు కూడా కనుమరుగయ్యాయి. కొద్ది కాలం క్రితం వరకు వాహనాల నెలవారీ కిరాయిలు, ఇళ్లు, దుకాణాల కిరాయినామా లావాదేవీలు, చిన్న చిన్న అఫిడవిట్లు పూర్తిగా రూ.10 స్టాంప్‌ పేపర్ల పైనే జరిగేవి. విద్యార్థుల స్టైఫండ్‌ల రెన్యూవల్స్, ఆదాయ, కుల ధృవీకరణాల పత్రాల కోసం ఈ స్టాంప్‌ పేపర్లనే వాడే వారు. కల్యాణల‌క్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులకు రూ.10 స్టాంప్‌ పేపర్లపైనే అందజేసేవారు. కొద్ది కాలంగా స్టాంప్‌ పేపర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.10 స్టాంప్‌లు లభించకపోవడంతో రూ.20, రూ.50, రూ.100 స్టాంప్‌ పేపర్లను వాడాల్సి వస్తోంది. సాధారణ అవసరాలకు కూడా ఎక్కువ విలువ గల స్టాంప్‌ పేపర్లను వాడుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఏడాది క్రితమే రూ.10 స్టాంప్‌ పేపర్ల ముద్రణ కూడా ఆగిపోయిందని అధికారులు అంటున్నారు.

    ఫ్రాంకింగ్‌ మెషిన్ల ద్వారా..
    స్టాంప్‌ పేపర్ల కొరతను అధిగమించేందుకు ప్రతి రిజి్రస్టార్‌ కార్యాలయాల్లో ఫ్రాంకింగ్‌ మెషిన్లను అందుబాటులోకి తెచ్చినట్లు సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారులు తెలిపారు. ఈ మెషిన్ల ద్వారా తెల్ల కాగితంపై వినియోగదారులకు ఎంత విలువ స్టాంప్‌ పేపర్లు (Stam Papers) అవసరమో ఆ విలువను ముద్రించి ఇస్తున్నామని వారు అంటున్నారు.

  • రెండు దశాబ్దాల క్రితం.. బ్యాంకుకి వెళితే పెద్ద క్యూ లైన్, చేతిలో చెక్కు పుస్తకం, సంతకం వెరిఫికేషన్ కోసం ఎదురుచూపులు. అప్పట్లో ఒకరికి డబ్బు పంపాలంటే చెక్కు రాసి ఇవ్వడమే అత్యంత సురక్షితమైన, ఏకైక మార్గం. ఇరవై ఏళ్ల క్రితం దేశంలోని మొత్తం ఆర్థిక లావాదేవీల విలువలో 98.8 శాతం వాటా చెక్కులదే. కానీ, కాలం మారింది.. టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు అదే బ్యాంకు మన అరచేతిలోకి వచ్చేసింది. ఒకప్పుడు సంతకం కోసం నిమిషాలు వేచి చూసిన మనం, ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో పని ముగిస్తున్నాం. ఈ మార్పు వెనుక చాలానే కారణాలున్నాయి.

    ఆర్థిక లావాదేవీల పరిణామం

    భారతీయ బ్యాంకింగ్ రంగంలో గత ఇరవై ఏళ్లుగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. జరుగుతున్న మార్పులు విస్మయానికి గురిచేస్తాయి. ఒకప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలంటే కేవలం చెక్కులే దిక్కు. కానీ నేడు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఒక్క క్లిక్‌తో క్షణాల్లో పని పూర్తవుతోంది. కొన్ని సర్వేల ప్రకారం మొత్తం వార్షిక లావాదేవీల విలువలో చెక్కుల వాటా ఎలా పడిపోయిందో చూద్దాం.

    సంవత్సరంలావాదేవీల విలువలో చెక్కుల వాటా (%)
    200598.8%
    201092.5%
    201550.7%
    202015.4%
    20248.5%

     

    2005లో దాదాపు పూర్తి స్థాయిలో (98.8%) రాజ్యమేలిన చెక్కులు, 2024 నాటికి కేవలం 8.5 శాతానికి పడిపోయాయి. అంటే ప్రజలు, వ్యాపార సంస్థలు పేపర్‌ ఆధారిత లావాదేవీల కంటే ఎలక్ట్రానిక్ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది.

    మార్పునకు కారణాలు

    • పెద్ద నోట్ల రద్దు.. 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థకు ఒక టర్నింగ్ పాయింట్. నగదు కొరత ఏర్పడటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. ఇది డిజిటల్ వాలెట్లు, కార్డ్ పేమెంట్స్ వాడకాన్ని ఒక్కసారిగా పెంచింది.

    • యూపీఐ విప్లవం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) చెక్కుల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. చెక్కు రాసి బ్యాంకుకు వెళ్లి, అది క్లియర్ అవ్వడానికి రెండు రోజులు వేచి చూసే బదులు సెకన్లలో డబ్బు పంపే సౌలభ్యం యూపీఐ కల్పించింది.

    • డిజిటలైజేషన్, ఇంటర్నెట్ వ్యాప్తి.. చౌకైన డేటా ధరలు, స్మార్ట్‌ఫోన్ల లభ్యత పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు సాధారణమయ్యాయి. నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ వంటి సేవలు చెక్కుల అవసరాన్ని భారీగా తగ్గించాయి.

    భవిష్యత్తు అంచనాలు

    భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు మరింత వినూత్నంగా మారబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ‘ఈ-రూపాయి’(e-Rupee) రాబోయే రోజుల్లో ఫిజికల్‌ క్యాష్‌, చెక్కుల అవసరాన్ని మరింత తగ్గిస్తుంది. భవిష్యత్తులో కేవలం ముఖ గుర్తింపు లేదా వేలిముద్రలతో మరింత సురక్షితమైన లావాదేవీలు జరగనున్నాయి. యూపీఐ సేవలు ఇప్పటికే ఇతర దేశాలకు (సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్ వంటివి) విస్తరిస్తున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ లావాదేవీల్లో కూడా చెక్కులు లేదా డ్రాఫ్టుల వాడకం కనుమరుగవుతుంది. ఫిజికల్ బ్యాంక్ బ్రాంచ్‌లతో పనిలేకుండా ‘నియో బ్యాంక్స్(డిజిటల్ బ్యాంకులు)’ ప్రాధాన్యత పెరగనుంది.

    ఇదీ చదవండి: పదవి పట్టాభిషేకం కాదు.. ప్రజాసేవకు పునాది!

Family

  • సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్‌ నెల అంటే హైద‌రాబాద్‌ నగర వాసులకు ప్రత్యేకమైన క్రేజ్‌.. ఏడాది చివరి నెలగా మాత్రమే కాకుండా లాంగ్‌ లీవ్స్‌ ఫెస్టివల్‌గా మారింది. ఏడాదిగా దాచుకున్న లీవ్స్‌ను ఐటీ ఉద్యోగులు ఈ ఒక్క నెలలోనే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడా కొన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులతో పాటు ఐటీ సంస్థల్లో ఈ కల్చర్‌ స్పష్టంగా కనిపిస్తోంది.

    హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌వంటి ప్రాంతాల్లోని ఐటీ ఆఫీసుల్లో డిసెంబర్‌ మొదలవుతూనే లీవ్‌ అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. చాలా కంపెనీల్లో ఈ సమయంలో లీవ్స్‌కు పెద్దగా అభ్యంతరాలు ఉండవు. దీనికి ప్రధాన కారణం.. క్రిస్మస్‌ పండుగ. నగరంలో పనిచేస్తున్న అనేక విదేశీ ఎమ్‌ఎన్‌సీ కంపెనీలు క్రిస్మస్‌ను (Christmas) ప్రధాన పండుగగా భావిస్తాయి. అందువల్ల ఈనెల చివరి రెండు వారాలు ఆఫీసుల్లో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది.

    ట్రావెల్‌ ట్రిప్స్‌.. డేట్స్‌ ఫిక్స్‌ 
    ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఐటీ ఉద్యోగులు లాంగ్‌ లీవ్స్‌ (Long Leaves) ప్లానింగ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కొందరు వారం నుంచి పది రోజులు లీవ్స్‌ కలిసొచ్చేలా ముందుగానే ప్లాన్‌ చేసుకుని, దేశవ్యాప్తంగా ట్రావెల్‌ ట్రిప్స్‌కు బయలుదేరుతున్నారు. గోవా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి టూరిస్ట్‌ డెస్టినేషన్స్‌కు నగరం నుంచి భారీగా బుకింగ్స్‌ పెరిగాయి. ఫ్లైట్స్, ట్రైన్స్, హోటల్స్‌ ఫుల్‌ అవుతున్నాయి.

    ఇంకొందరు ఉద్యోగులు తమ కుటుంబంతో కలిసి స్వగ్రామాలకు వెళ్లి పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏడాదంతా నగర జీవనశైలిలో బిజీగా ఉండే వారికి, ఈ లాంగ్‌ లీవ్స్‌ కుటుంబంతో గడిపే అమూల్యమైన సమయంగా మారుతోంది. మరోవైపు యువత మాత్రం ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్స్, బీచ్ పార్టీలు, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు (New Year Celebrations) ప్రాధాన్యత ఇస్తున్నారు.

    సిటీ లైఫ్‌ ఆస్వాదించొచ్చు.. 
    లాంగ్‌ లీవ్‌ కల్చర్‌లో (Long Leave Culture) అందరూ నగరం విడిచి వెళ్లిపోతున్నారు అనుకోవడం కూడా తప్పే. భాగ్య‌నగరంలోనే ఉండి సెలబ్రేషన్స్‌ చేసుకునే బ్యాచ్‌ కూడా ఉంది. ఈనెలలో నగరమంతా ఈవెంట్స్‌తో కళకళలాడుతుంది. మాల్స్, పబ్బులు, క్యాఫేలు, క్లబ్బులు ప్రత్యేక క్రిస్మస్, న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నాయి. లైవ్‌ మ్యూజిక్, డీజే నైట్స్, ఫుడ్‌ ఫెస్టివల్స్‌ నగర యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్‌ వల్ల నగర లైఫ్‌ స్టైల్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ట్రాఫిక్‌ కొంతమేర తగ్గడం, ఐటీ ఏరియాల్లో ఆఫీసుల హడావుడి తగ్గిపోవడం సాధారణంగా మారింది. చాలా మంది ఉద్యోగులు ఈ నెలను వర్క్‌ ఫ్రీ మంత్‌గా అభివర్ణిస్తున్నారు. వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌కు డిసెంబర్‌ ఒక బ్రేక్‌లా ఉపయోగపడుతోందని ఉద్యోగులు భావిస్తున్నారు.

    నగర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం.. 
    డిసెంబర్‌ నెల (December Month) ఇప్పుడు కేవలం క్యాలెండర్‌ చివరి నెల మాత్రమే కాదు. ఐటీ ఉద్యోగుల జీవితాల్లో ఇది రిలాక్సేషన్, ట్రావెల్, సెలబ్రేషన్స్‌కు సంకేతంగా మారింది. కొత్త ఉత్సాహంతో న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు టెకీలు సిద్ధమవుతున్నారు. లాంగ్‌ లీవ్స్‌ ట్రెండ్‌ సిటీ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ట్రావెల్‌ ఏజెన్సీలు, టూర్‌ ఆపరేటర్లు, హోటల్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫాంలకు ఈ నెల పీక్‌ సీజన్‌గా మారింది.

    చ‌ద‌వండి: ఆహా అనిపించే సినిమా లొకేష‌న్లు

    అలాగే నగరంలోని కెఫేలు, పబ్బులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లలో ఫుట్‌ఫాల్‌ గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు కంపెనీలు కూడా టీమ్‌ అవుటింగ్స్, ఇయర్‌ ఎండ్ పార్టీలు నిర్వహిస్తూ ఉద్యోగుల్లో మోరల్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తానికి డిసెంబర్‌ నెల సిటీలో కేవలం సెలవుల సీజన్‌ మాత్రమే కాదు, వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌కు ప్రతీకగా మారుతోంది. 

  • చాలామంది విదేశీయలు మన మాతృగడ్డపై మమకారం పెంచుకుని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఫిదా అంటూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. పైగా వాళ్ల సతంతి కూడా ఇక్కడ పెరిగితేనే మంచిదని భావిస్తుండటం విశేషం. ఆ కోవలోకి తాజాగా మరో రష్యన్‌ తల్లి వచ్చి చేరింది. ఆ పిల్లల తల్లి పోస్ట్‌లో పేర్కొన్న విషయాలు వింటుంటే మన గడ్డపై మమకారం, ప్రేమ రెట్టింపు అవవ్వడమే కాదు భారతీయులుగా గర్వం ఉప్పొంగుతుంది కూడా. మరి ఇంతకీ ఆమె ఆ పోస్ట్‌లో ఏం చెప్పుకొచ్చిందంటే..

    బెంగళూరులో నివశిస్తున్న ఈ రష్యన్‌ మహిళ తాను తన భర్త భారతదేశాన్ని కేవలం పర్యాటక ప్రదేశంగా కాకుండా శాశ్వత నివాసంగా ఎందుకు మార్చుకున్నామో వెల్లడించింది పోస్ట్‌లో. ఈ గడ్డపై ఉంటేనే తన పిల్లలు మంచిగా పెరుగుతారని, ఇది పిల్లల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణమని, విశాల దృక్పథంతో వ్యవహరించడం అలవడుతుందని అటోంది. 

    ఈ భారతదేశం తమ కుటుంబానికి ఎన్నో నేర్పించిందంటూ ఇలా వివరించింది. వేగాన్ని తగ్గించడం దగ్గర నుంచి తొందరపడకుండా ఉండటం, మాటకు స్పదించడం, శ్రద్ధగా వినడం వంటివి తమ కుటుంబం నేర్చుకుందని తెలిపింది. అలాగే తాము ఇక్కడ భారతీయులను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని, వారి కపటం లేని మనసు, దయ, ప్రతిఫలాప్రేక్ష లేని హెల్పింగ్‌ నేచర్‌ మమ్మల్ని ఎంతగానో కట్టిపడేశాయని చెప్పుకొచ్చింది. 

    ముఖ్యంగా పొరుగువారితో సత్సంబంధాలు చాలా బాగుంటాయని, ఇక్కడ చిరునవ్వే అందరి కామన్‌భాష అని అంటోంది. అందువల్లే తన పిల్లలను ఇక్కడే పెంచాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యానంటోంది ఈ తల్లి. ఈ బహుళ సంస్కృతి, బహుభాషా వాతావరణంలో ఎన్నో నేర్చుకోగలరు, ముఖ్యంగా గౌరవించడం, చిన్న చిన్న వాటికి ప్రశంసించడం వంటివి నేర్చుకుంటారని చెబుతోంది. ఈ వెచ్చని వాతావరణం ఎంజాయ్‌ చేయడం ఓ థ్రిల్‌, అలాగే ఏడాది పొడవునా కాలానుగుణ తాజా పండ్లను ఆస్వాదించడంలో ఓ మజా ఉందంటోంది. 

    అందువల్లే తాము భారతదేశాన్ని తమ నివాస స్థలంగా మార్చుకున్నామంటూ పోస్ట్‌ని ముగించింది. అయితే నెటిజన్లు స్పందిస్తూ..మా భారత్‌కి స్వాగతం, మా మృతృభూమి చాలా అందమైనది, ఎవరినైనా తనలో ఇట్టే కలిపేసుకుంటుంది అని ఆమెకు సాదారంగా ఆహ్వానం పలుకుతూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్‌ఆర్‌ఐ పోస్ట్‌)

     

  • ఇప్పటివరకు పరిపాలనా విభాగానికి సంబంధించిన అత్యతున్నత బ్యూరోక్రాటిక్‌ పదవులను పురుషులు మాత్రమే చేపట్టారు. అలాంటి పదవులు మహిళల వరకు చేరువ్వడం లేదా ఆ స్థాయికి చేరుకునేలా ప్రతిభా చాటిన మహిళలు చాలా అరుదు. అలాంటి మూసధోరణిని బద్దలు కొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించారు ఐఏఎస్‌ అధికారిణి అనుగార్గ్‌. ఎవరీమె? ఈ అరుదైన ఘనతను ఎలా సాధించారామె..?

    56 ఏళ్ల అనుగార్గ్‌ ఒడిశాలో అదనపు ప్రధాన కార్యదర్శి హోదాతో అభివృద్ధి కమిషనర్‌గా పనిచేస్తూ.. జల వనరుల విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1991 బ్యాచ్‌​ ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అధికారిణి అయిన అనుగార్గ్‌ బుధవారమే ఒడిశా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 

    ఇలా రాష్ట్రంలో అత్యున్నత బ్యూరోక్రాటిక్‌ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఘనత సృష్టించారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ప్రధాన కార్యదర్శి మనోజ్‌ అహుజా డిసెంబర్‌ 31 పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఒడిశా సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం అను గర్గ్‌కి నియామక ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. 

    ఇన్నాళ్లు అనుగర్గ్‌ డెవలప్‌మెంట్‌ కమ్‌ అదనపు ప్రధాన కార్యదర్శిగా ప్లానింగ్‌ అండ్‌ కన్వర్జెన్సీ విభాగంలో పనిచేస్తూ..జనవనరుల విభాగానికి అదనపు భాధ్యతలను కూడా నిర్వహించారామె. ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన అత్యున్నత బ్యూరోక్రాటిక్‌ పదవిని అనుగర్గ్‌ చేపట్టి ఒడిశా పరిపాలన చరిత్రలో ఒక సరొకొత్త మైలు రాయిని సృష్టించారు. అయితే ఒడిశాలో గతంలో ఇలాంటి అత్యుతన్న పరిపాలనాధికారంలో 1972లో నందిని సత్పతి మహిళా సీఎంగా ఉన్నారన్నది గమనార్హం.

    మరో విశేషం ఏంటంటే అనుగార్గ్‌ ఒడిశా రాష్ట్రంలో డెవలప్‌మెంట్‌ కమిషనర్‌గా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్‌ అధికారిణి కూడా ఆమెనే. దీన్ని అను ప్రస్తుతం చేపట్టనున్న అత్యున్న పదవి తర్వాత రెండో అత్యున్నతి పదవిగా పేర్కొనవచ్చు. ఇక ఈ అత్యున్న బ్యూరోక్రాటిక్‌ పదవిని అలంకరించనున్న అనుగర్గ్‌ మార్చ్‌2029లో పదవీవిరమణ చేయనున్నారు. 

    నిజానికి కొత్తేడాది నేపథ్యంలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్‌ ప్రతిపాదనలు అమలకు సిద్ధమవుతన్న తరుణంలో అనుగార్గ్‌ ఈ ఉన్నతి పదవిని చేపట్టడం హర్షించదగ్గ విషయం. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుగార్గ్‌ సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే మూడు దశాబ్దాలకు పైగా సివిల్‌ సర్వీస్‌లో పనిచేసి మహిళా అధికారిణి కూడా.

    (చదవండి: ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్‌ ఫోనులే! ఎందుకో తెలుసా?)

     

  • ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతి పండుగ, ప్రత్యేక రోజుల సమయంలో ఆయా ఇతి వృత్తంతో కూడిన సైకత శిల్పంతో మన ముందుకు వస్తుంటారు. ఈసారి అచ్చం అలానే అత్యంత ఆకర్షణీయమైన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ డిసెంబర్‌ 25 క్రిస్మస్‌ పండుగ పురస్కరించుకుని అతి పెద్ద శాంతాక్లాజ్‌ని రూపొందించారు. అయితే దేనితో తెలిస్తే షాకవ్వడం ఖాయం. మరి ఆ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.

    పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పూరీలోని నీలాద్రి బీచ్‌లో 1.5 టన్నుల ఆపిల్ పండ్లు, ఇసుకతో అతిపెద్ద శాంతాక్లాజ్‌ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. 

    ఇది ఏకంగా 60 అడుగుల పొడవు, 22 అడుగుల ఎత్తు. దీన్ని సుమారు 30 మంది విద్యార్థుల సాయంతో తీర్చిదిద్దారు. క్రిస్మస్‌ శుభాకాంక్షల తోపాటు ప్రపంచ శాంతి, ఐక్యత సందేశాన్ని ఇస్తూ ఈ భారీ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. అంతేగాదు యాపిల్స్‌తో రూపొందించిన అతిపెద్ద శాంతాక్లాజ్‌ సైకత శిల్పంతో ప్రపంచ రికార్డు సృష్టించనుంది కూడా. 

    దీన్ని పట్నాయక్‌ 22వ పూరీ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్‌లో భాగంగా, క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో రూపొందించారు. తన సాండ్ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 30 మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.

     

    (చదవండి:  ఆ దేశాలు డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?)

     

National

  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కమ్ముకున్న దట్టమైన పొగమంచు, తక్కువ దృశ్యమానత కారణంగా దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు భారీ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. గురువారం ఒక్కరోజే వివిధ విమానాశ్రయాల నుండి ఏకంగా 67 విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేసింది.  బెంగళూరు, వారణాసి, అగర్తల, చండీగఢ్ తదితర నగరాల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. డిసెంబర్ 10 నుండి పొగమంచు కారణంగా ఇండిగో తరచూ అంతరాయాలను ఎదుర్కొంటోంది.

    పొగమంచు పరిస్థితుల్లో విమానాల ల్యాండింగ్ కోసం  పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. దీని ప్రకారం 50 మీటర్ల కంటే తక్కువ దృశ్యమానత ఉన్నప్పుడు కూడా ల్యాండ్ చేయగల అధునాతన విమానాలను, ప్రత్యేక శిక్షణ పొందిన పైలట్లను మాత్రమే విమానయాన సంస్థలు ఉపయోగించాలి. అయితే ఈ నిబంధనలను పాటించడంలో, వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో ఏర్పడిన వైఫల్యాలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇండిగో కేవలం వాతావరణం వల్లే కాకుండా, అంతర్గత కార్యాచరణ లోపాలతోనూ సతమతమవుతోంది.

    ఇటీవల పైలట్ల విశ్రాంతి నిబంధనలు,  సిబ్బంది కొరత కారణంగా తలెత్తిన గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపధ్యంలో సంస్థ శీతాకాలపు షెడ్యూల్‌ను 10 శాతం మేరకు కోత విధించి, రోజువారీ విమానాల సంఖ్యను 1,930కి పరిమితం చేసింది. డిసెంబర్ ఆరంభంలో ఒకే రోజు 1,600 విమానాలు రద్దు  అయిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వరుస వైఫల్యాల వెనుక ఉన్న మూల కారణాలను అన్వేషించేందుకు డీజీసీఏ ఇప్పటికే నలుగురు సభ్యుల ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది, ఈ కమిటీ ఈ వారంలో తన నివేదికను సమర్పించనుంది.

    మరోవైపు, గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి చూస్తున్న ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఐదు గంటలకు పైగా ఆలస్యమవుతున్న విమానాలు, సరైన సమాచారం లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో ప్రయాణించే వారు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వాతావరణం అనే సాకు చెప్పకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణికులు తమ విమాన రాకపోకల స్థితిని తనిఖీ చేసుకుని బయలుదేరాలని ఇండిగో సూచించింది. 

    ఇది కూడా చదవండి: విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ

  • పెళ్లి అంటే పందిళ్లు, సందళ్లు తప్పెట్లు.. తాళాలు... తలంబ్రాలు ఉండాలి. అంతేనా కట్నాలు, కానుకలు, ప్రీవెడ్డింగ్‌ షూట్‌లు ఘనంగా జరగాలి. కానీ ఒక జంట మాత్రం అక్షరాలా గ్యాస్‌  స్టవ్‌ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఎక్కడో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.

    పెళ్లిసందడి, హంగూ ఆర్బాటం, మూడు ముళ్లు లాంటి హడావిడి లేకుండానే బిహార్‌లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న ఘటన నెట్టింట సందడిగా మారింది. అబ్బాయిలంటే ఇష్టంలేకనే తాము ఈ పెళ్లి చేసుకున్నామని ఆ యువతులు ప్రకటించారు. బిహార్‌లోని సుపాల్‌లో, ఇద్దరు యువతులు ప్రత్యేకంగా వివాహ వేడుకను నిర్వహించారు. మగాళ్లపై ఆసక్తిలేకనే ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. గ్యాస్ స్టవ్‌ను సాక్షిగా ఏడడుగులు వేయడం విశేషం.

    ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్‌ క్రిస్మస్‌ కానుక
     

     

  • అలీఘడ్‌: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం రాత్రి దారుణం జరిగింది. యూనివర్సిటీ పరిధిలోని పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీలో రాష్ట్ర శాంతిభద్రతల గురించి ప్రశంసలు కురిపించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం.  

    సహచరులతో కలిసి వెళ్తుండగా.. 
    క్యాంపస్‌లోని ఏబీకే హైసూ్కల్‌లో 11 ఏళ్లుగా డానిష్‌ రావు కంప్యూటర్‌ సైన్స్‌ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి 8.50 గంటల సమయంలో ఆయన తన ఇద్దరు సహచరులతో కలిసి వర్సిటీ సెంట్రల్‌ లైబ్రరీ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో స్కూటర్‌పై వచి్చన ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. కాల్పులు జరపడానికి ముందు ఒక నిందితుడు డానిష్ తో ‘నేనెవరో నీకింకా తెలియదు.. ఇప్పుడు తెలుస్తుంది’.. అంటూ హెచ్చరించి, పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ‘లైబ్రరీ సమీపంలో కాల్పులు జరిగినట్లు మాకు రాత్రి 9 గంటలకు సమాచారం అందింది. ఏబీకే స్కూల్‌ ఉపాధ్యాయుడు డానిష్‌ రావు తలపై కాల్పులు జరగడం వల్ల ఆయన మరణించారు’.. అని వర్సిటీ ప్రోక్టర్‌ మొహమ్మద్‌ వసీం అలీ వెల్లడించారు. 

    ఆసుపత్రికి చేరేలోపే.. 
    దుండగులు డానిష్ పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో రెండు బుల్లెట్లు ఆయన తలలోకి దూసుకుపోయాయి. రక్తపు మడుగులో పడిపోయిన డానిష్ ను వెంటనే జవహర్‌లాల్‌ నెహ్రూ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

    నిందితుల కోసం ఆరు బృందాలు 
    ఈ ఘటనపై సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నీరజ్‌ జాదన్‌ స్పందిస్తూ.. ‘నిందితులు ఇద్దరూ డానిష్ ను లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిపారు. నిందితులను పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. క్యాంపస్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం’.. అని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడానికి కారణం ఇక్కడి భద్రతేనని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీలో ప్రసంగించిన రోజే, ఒక విద్యాలయంలో ఉపాధ్యాయుడిని కాల్చి చంపడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అలీఘడ్‌ వర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.   
      

    ఇది కూడా చదవండి: మహనీయుల భారీ స్మృతి చిహ్నం.. ‍ప్రారంభించిన ప్రధాని మోదీ

  • లక్నో: భారత రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా నేడు (గురువారం) దేశానికి ఒక అద్భుతమైన కానుక లభించింది. యూపీలోని లక్నో నగరంలో సుమారు 65 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, రూ. 230 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘రాష్ట్రీయ ప్రేరణా స్థల్’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ  కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్  తదితరులు పాల్గొన్నారు.

    ఈ స్మారక చిహ్నంలో ప్రధాన ఆకర్షణ.. ఆకాశాన్ని తాకేలా నిలుచున్న మూడు భారీ కాంస్య విగ్రహాలు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిల 65 అడుగుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. ఈ విగ్రహాలు  భారతదేశ రాజకీయ విలువలకు, నిస్వార్థ ప్రజా సేవకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ,  సందర్శకులలో దేశభక్తిని పెంపొందిస్తున్నాయి.
     

    సుమారు 98 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యంత కళాత్మకంగా కమలం ఆకారంలో ఈ మ్యూజియాన్ని రూపొందించారు. ఇందులో అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించారు. తద్వారా ఈ  నాయకుల జీవిత ప్రయాణాన్ని, వారు దేశం కోసం చేసిన పోరాటాలను సందర్శకులు కళ్లకు కట్టినట్లు చూడవచ్చు. ఇది కేవలం స్మారక చిహ్నంగానే కాకుండా ఒక గొప్ప విద్యా కేంద్రంగా కూడా రూపొందింది. 

    ఇది కూడా చదవండి: చారిత్రాత్మక విజయం : మార్చి 31 నాటికి నక్సలిజం అంతం
     

  • సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతిని పురస్కరించు కుని, ఢిల్లీ  ప్రభుత్వం 'అటల్ క్యాంటీన్' పథకాన్ని ప్రారంభించింది.  పేదలు, కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల ఆహారం అందించే లక్ష్యంతో 100 అటల్ క్యాంటీన్‌లను ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రారంభించారు. ఈ క్యాంటిన్‌లలో  కేవలం రూ. 5కే పోషకమైన భోజనం అందిస్తారు.


    అటల్‌  క్యాంటీన్లు
    ఢిల్లీలో ఆర్‌కె పురం, జంగ్‌పురా, షాలిమార్ బాగ్, గ్రేటర్ కైలాష్, రాజౌరి గార్డెన్, నరేలా, బవానా, ఇతర ప్రదేశాలలో విస్తరించి ఉన్న 45 అటల్ క్యాంటీన్లు అందుబాటులో వచ్చాయి.  మిగిలిన 55 క్యాంటీన్లను రాబోయే రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లు రోజుకు రెండు పూటలా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య భోజనం మరియు సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 గంటల మధ్య రాత్రి భోజనం దాదాపు 500 మందికి అందిస్తాయి. ఈ థాలి (ప్లేట్)లో పప్పు (చిక్కుళ్ళు), బియ్యం, చపాతీ, సీజనల్ కూరగాయలు ,  ఒక చట్నీ ఉంటాయి.

    భోజన పంపిణీ కోసం డిజిటల్ టోకెన్ వ్యవస్థ
    ఢిల్లీ ప్రభుత్వం భోజనం పంపిణీ చేయడానికి మాన్యువల్ కూపన్ల స్థానంలో డిజిటల్ టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.  సీసీటీవీ కెమెరాలు ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు (DUSIB) డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని కేంద్రాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తాయి. పప్పు (చిక్కుళ్ళు), బియ్యం, చపాతీ, కర్రీ,  చట్నీతో కూడిన రుచికరమైన భోజనం రెస్టారెంట్ రకం, ప్రాంతాన్ని బట్టి  ఢిల్లీలో ఒక్కోథాలీ ధర రూ. 500 నుండి రూ. 2,000 వరకు ఉంటుంది. దీని ప్రకారం ఒక్క పూటైనా నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లలేని పేదలకు  కేవలం పదో వంతు ధరకే  సంతృప్తికరమైన భోజనం లభించనుంది. 

     

  • సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత మావోయిస్ట్‌ పార్టీకి  భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన  భారీ ఎన్‌ కౌంటర్‌లో ఒడిశా ఇన్‌ఛార్జ్ గణేష్ ఉయికే (69) సహా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం కంధమాల్-గంజాం జిల్లా సరిహద్దులోని దట్టమైన రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్)లతో కూడిన ఉమ్మడి భద్రతా దళంతో జరిగిన ఎన్‌కౌంటర్‌గణేష్ ఉయికేతో పాటు ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

    మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. గణేష్‌ ఉయికే  మృతిని ధృవీకరించిరిన అమిత్‌షా  2026 మార్చి 31 నాటికి  నక్సలిజాన్ని నిర్మూలిస్తాం అంటూ హోం మంత్రి ట్వీట్‌ చేశారు.  ‘‘నక్సల్ రహిత భారత్ దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి"గా  హోంమంత్రి అభివర్ణించారు. అటు ఇది మన దళాలకు చారిత్రాత్మక విజయం. రూ. 1.1 కోట్ల రివార్డు ఉన్న నాయకుడి నిర్మూలనతో ఈ ప్రాంతంలోని మావోయిస్టుల నడ్డి విరిచినట్టేనని ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ ఆపరేషన్ భారత ప్రభుత్వాన్ని మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశాన్ని చేయాలనే తన లక్ష్యానికి దగ్గరి చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో జనరల్ సెక్రటరీ బసవరాజ్,నవంబర్‌లో కమాండర్  హిడ్మాలను  మట్టు బెట్టడంతో కేంద్ర కమిటీ కుప్పకూలింది. అటు అగ్ర మావోయిస్టు నాయకులతోపాటు లొంగిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది.

    జిరామ్ ఘాటి మాస్టర్‌ మైండ్‌ 
    2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జిరామ్ ఘాటి మారణకాండ వెనుక గణేష్ ఉయికే  ప్రధాన సూత్రధారి.  ఈ ఘటనలో అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరణించారు. అంతేకాదు  అనేక హై ప్రొఫైల్ మావోయిస్టు దాడులలో  ఆయనదే కీలక పాత్రం నమ్ముతారు. గతమూడేళ్లుగా గణేష్‌ ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, గెరిల్లా కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, మావోయిస్టు నెట్‌వర్క్‌లను బలోపేతం చేస్తున్నాడు.
     

  • భువనేశ్వర్‌: మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో తెలుగు మావోయిస్టు కమాండర్‌, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్‌ గణేష్‌ మృతి చెందాడు. కాగా, గణేష్‌పై రూ.25 లక్షల రివార్డు కూడా ఉండటం గమనార్హం. 

    వివరాల ప్రకారం.. ఒడిశాలోని కందమాల్‌ జిల్లా బెల్‌ధర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్‌ గణేష్‌ మృతి చెందాడు. కాగా, గణేష్‌ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని పుల్లెమ్ల గ్రామం. గణేష్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం గణేష్‌పై ఈ రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా  గణేశ్‌ అలియాస్‌ హనుమంతు ఎన్కౌంటర్‌ను  స్పెషల్ ఆపరేషన్స్ ఏడీజీపీ సందీప్ పాండా ధృవీకరించారు. కంధమల్ - గంజాం పరిధి రాంభా అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు.  ఘటనా స్థలంలో 2 ఇన్సాస్ లు, ఒక 303 రైఫిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. 2 సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ టీంలతో కలిసి ఒరిస్సా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ 20 పోలీసు బృందాల జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.  గతంలో ఛత్తీస్ ఘడ్ లో  హన్మంతు పనిచేశారు.  3 ఏళ్ల క్రితం కేరళ, తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో దళాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.  కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా గణేష్ కదలికలను  భద్రతా బలగాలు తెలుసుకున్నాయి.  ఎస్ఓజీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా  ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 


     

  • సాక్షి,ముంబై: జీతం, భద్రతా  ప్రమాణాలు, సామాజిక భద్రత డిమాండ్లతో  గిగ్‌ వర్కర్లు జాతీయ సమ్మెకు పిలుపునిచ్చారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ఫుడ్ డెలివరీ, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోని డెలివరీ  పార్టనర్స్‌ డిసెంబర్ 25 నుంచి 31వ తేదీవరకు  అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారు. పని పరిస్థితులు, సామాజిక భద్రత పరిస్తితులు మరింత దిగజారుతున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా "10 నిమిషాల డెలివరీ" లాంటి వాటిని ఉపసంహరించుకోవాలనేది  ముఖ్యమైన డిమాండ్.

    తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్‌, కర్ణాటక యాప్ ఆధారిత వర్కర్స్ యూనియన్‌తో సహా , ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. మెట్రో,  టైర్-2 నగరాల్లో డెలివరీ భాగస్వాములు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. భారతదేశం అంతటా డెలివరీ కార్మికులు అఖిల భారత సమ్మెను ప్రకటించినందున, క్రిస్మస్ రోజు (డిసెంబర్ 25),నూతన సంవత్సర వేడుకల (డిసెంబర్ 31) నాడు ఆన్‌లైన్ ఫుడ్‌, కిరాణా,  ఇ-కామర్స్ డెలివరీలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

    కంపెనీలు కార్మికులకు న్యాయమైన వేతనాలు, భద్రత, గౌరవం, సామాజిక భద్రతను కల్పించడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఎక్కువ పని గంటలు,  హై-రిస్క్ డెలివరీలు ముఖ్యంగా గరిష్ట డిమాండ్ సమయాల్లో, ప్రాథమిక కార్మిక రక్షణ వ్యవస్థ లేవని కార్మికులు ఆరోపిస్తున్నారు.  పది నిమిషాల్లో డెలివరీ సర్వీసుతో కార్మికుల్లో  ఒత్తిడి తీవ్రమవుతోందంటున్నారు. అంతేకాదు ఇది  తమ ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తుందని కార్మికులు చెబుతున్నారు. ఇతర డిమాండ్లలోయు పారదర్శకమైన ఆర్డర్‌కు చెల్లింపు, మెరుగైన ప్రోత్సాహక నిర్మాణాలు, తప్పనిసరి విశ్రాంతి విరామాలు, సహేతుకమైన పని గంటలు  లాంటివి ఉన్నాయి. అదనపు డిమాండ్లలో మెరుగైన భద్రతా చర్యలు, బలమైన సాంకేతిక ,యాప్ మద్దతు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, ప్రమాద కవరేజ్, పెన్షన్ ప్రయోజనాలు ,కార్యాలయంలో గౌరవప్రదమైన చికిత్స ఉన్నాయి. యూనియన్లలో చేరినందుకు లేదా పని సంబంధిత సమస్యలపై స్వరం పెంచినందుకు కొంతమందిని బ్లాక్‌మెయిల్, లేదా వేధిస్తున్నారని కూడా కార్మికులు ఆరోపించారు.

    అలాగే డెలివరీ ఐడిలను ఏకపక్షంగా బ్లాక్ చేయడం, అక్రమంగా  విధించిన జరిమానాలను నిలిపివేయాలని కూడా కార్మికులు డిమాండ్ చేశారు. సరైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు లేకపోవడం, రూటింగ్ మరియు చెల్లింపులను ప్రభావితం చేసే యాప్ లోపాలు మరియు అల్గారిథమ్ ఆధారిత వివక్ష కారణంగా అస్థిరమైన పని కేటాయింపుపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, ఆయా ప్లాట్‌ఫామ్ కంపెనీలను నియంత్రించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, గిగ్ కార్మికులకు సామాజిక భద్రతా చట్రాలను అమలు చేయాలని  కార్మికులు కోరుతున్నారు.
     

  • భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడిగా, రాజకీయాల్లో అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న ఆయన.. సాహితి లోకానికి కవిగా, ఆరేళ్లపాటు ప్రధానిగా, బీజేపీకి ముఖ్యనేతగా సేవలందించారు. అయితే చివరిసారిగా ఆయన పబ్లిక్‌కు కనిపించింది ఎప్పుడో, అదీ ఏ సందర్భంలోనో తెలుసా?..

    గెలుపు-ఓటమి ఈ రెండింటినీ నవ్వుతూ స్వీకరించే నైజం వాజ్‌పేయిది. 2004లో దారుణ ఓటమి తర్వాత కూడా.. ఎలా ఓడిపోయారు? అంటే.. ‘ఓడిపోయాం.. అంతే’ అంటూ చిరునవ్వు విసిరారు ఆయన. అందుకే అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. అయితే ఆయన పాలనను, ఆదర్శాలను పొగిడేటోళ్లే తప్పించి.. వాటిని ఆచరించే నేతలు ఈరోజుల్లో లేరనే అంటారు రాజకీయ విశ్లేషకులు.

    2004 ఓటమి తర్వాత వాజ్‌పేయి.. పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా, బీజేపీ కీలక సమావేశాల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. అయితే 2005 డిసెంబర్‌లో పుట్టినరోజు దగ్గరపడుతుండగా.. రాజకీయాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించి, అభిమానులకు, కార్యకర్తలకు పెద్ద షాక్‌ ఇచ్చారు ఆయన. ఇక ఎన్నికల బరిలోకి దిగనప్పటికీ.. పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తానని పార్టీ సారధ్య బాధత్యల నుంచి తప్పుకున్నాడాయన. ఆపై అనారోగ్యంతో ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు.

    ఫిబ్రవరి 11, 2007.. పంజాబ్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశం. బీజేపీ టికెట్‌తో అమృత్‌సర్‌ నుంచి లోక్‌ సభ స్థాన ఉప ఎన్నిక కోసం నవజోత్‌ సింగ్‌ సిద్దూ పోటీకి దిగాడు. ఆ ప్రచార సభకు ప్రధాన ఆకర్షణ ఎవరో కాదు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి. చాలా గ్యాప్‌ తర్వాత ఆయన ఓ బహిరంగ సభకు వస్తుండడంతో వేలమంది ఆ సభకు హాజరయ్యారు. టెంట్ల కింద జనం కిక్కిరిసి పోవడంతో.. బయట ఉండేందుకు వీలుగా సుమారు 10 వేల మందికి గొడుగుల్ని అందజేసింది బీజేపీ కమిటీ. కుర్చీలోనే కవితతో మొదలుపెట్టిన ఆయన ఉపన్యాసాన్ని .. ఎలాంటి కోలాహలం లేకుండా ఆసక్తిగా తిలకించారు ఆ జనం. ఆ రాజకీయ ఉద్దండుడి చివరి సభ అదేనని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

    చలించిన పోయిన మీడియా ప్రతినిధులు
    ఎంతటి విపత్కర పరిస్థితినైనా జర్నలిజం క్యాష్‌ చేసుకుంటుందనే ఒక అపవాదు ఉంది. అందుకు తగట్లు కొందరు జర్నలిస్టులు ప్రవర్తించడమే అందుకు కారణం. సాధారణంగా.. నేతలను ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం.. ఇరకాటంలో పడేయడం జాతీయ మీడియా చానెల్స్‌ జర్నలిస్టులకు వెన్నతో పెట్టిన విద్యం. కానీ, వాజ్‌పేయి విషయంలో మాత్రం వాళ్లు అలా చేయలేకపోయారు.

    2007, డిసెంబర్‌ 25న పుట్టినరోజు సందర్భంగా కొందరు జర్నలిస్టులు వాజ్‌పేయిను కలవాలనుకున్నారు. ‘2009లో మరోసారి రాజకీయ పోరాటానికి ఆయన సిద్ధమేనా? ప్రచారంలో అయినా పాల్గొంటారా? లేదంటే ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటారా? అద్వానీకి పగ్గాలు అప్పజెప్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనే ఉద్దేశంతో ఓ జర్నలిస్ట్‌ బృందం అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూశారు.

    వాళ్ల అజెండాపై స్పష్టత లేని బీజేపీ నేత షానవాజ్‌ హుస్సేన్‌ దగ్గరుండి 10 మంది జర్నలిస్టులను విజయ్‌ మీనన్‌ మార్గ్‌లో ఉన్న వాజ్‌పేయి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ కొద్దినిమిషాల మీటింగ్‌ అరేంజ్‌ చేయించాడు హుస్సేన్‌. లోపలికి వెళ్లిన జర్నలిస్టులు.. వాజ్‌పేయి చూడగానే ఆశ్చర్యపోయారు.

    ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే వాజ్‌పేయి.. కుర్చీలో కూర్చుకుని పాలిపోయిన ముఖంతో కదల్లేని స్థితిలో కనిపించేసరికి షాక్‌ తిన్నారంతా. చుట్టూ చేరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా ‘నమస్కార్‌’ అనే మాట మాత్రమే వచ్చింది ఆయన నోటి నుంచి. అంతే.. వాజ్‌పేయి పరిస్థితి అర్థం చేసుకుని అంతా బయటకు వచ్చేశారు.

    ఇంటికెళ్లి మరీ..
    2009లో ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయి..కాస్త కొలుకున్నాక ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో 2009 ఎన్నికల క్యాంపెయిన్‌కు హాజరు కాలేదు. కానీ, ఆయన పేరు మీద లేఖలు మాత్రం విడుదల చేసింది బీజేపీ. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం అస్సలు సహకరించకపోవడంతో..  కీలక నేతలే అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా ఆయన్ని ఇంటికి వెళ్లి ప్రైవేట్‌గా కలుస్తూ వచ్చారు.

    వాజ్‌పేయికి కేంద్రం 2015లో భారతరత్న ప్రకటించింది. మార్చిన ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ స్వయంగా వాజ్‌పేయి ఇంటికి వెళ్లి మరీ భారత రత్న అందుకున్నారు. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్‌లోనే అందుకోవాలి. కానీ, వాజ్‌పేయి ఆరోగ్య దృష్ట్యా, ప్రైవసీని కాపాడాలన్న ఉద్దేశంతో.. స్వయంగా రాష్ట్రపతే వెళ్లి అందించారు. చివరి రోజుల్లో.. ఆ రాజకీయ ఉద్దండుడు మతిమరుపు, కిడ్నీ సమస్యలు.. డయాబెటిస్‌, కదల్లేని స్థితిలో కనిపించిన ఫొటోలు చాలామందిని కదిలించివేశాయి. అందుకే.. 2018 ఆగస్టు 16వ తేదీన మరణించేంతవరకు ఆయన్ని మీడియా కంటపడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు.

    ఇవాళ భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి 

Politics

  • చంద్రబాబు నేడు ఏ అంశాన్ని గట్టిగా విమర్శిస్తున్నారంటే నాలుగు రోజుల తరువాత అదే అంశాన్ని ఫాలో అవుతారని అర్థం. వైయస్ జగన్ ఆనాడు అమలు చేసిన సచివాలయ వ్యవస్థను విమర్శించిన బాబు.. నేడు మళ్లీ అదే వ్యవస్థపై ఆధారపడి పాలన సాగిస్తున్నారు. నాడు వైయస్ జగన్ తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు అయిన గ్రామ సచివాలయాలు నేడు పాలనకు పట్టుగొమ్మలైనాయి.

    ఇది వందల కోట్లు పెట్టి కట్టిన ప్రాసాదం.. ఇది ప్రభుత్వ ఆస్తి కానే కాదు.. వైయస్ జగన్ విలాసాల కోసం నిర్మించుకున్న ప్యాలెస్. ఇందులో బోలెడు లొసుగులున్నాయి. నిబంధనల అతిక్రమణ ఉంది. పర్యావరణానికి విఘాతం కలిగించి.. కొండలు తొలిచి మరీ నిర్మించారు.. ఇలాంటి భవనాన్ని మనం నిర్వహించలేం. కరెంటు బిల్లులు ఎక్కువైనాయి.. ఇది ఎందుకు పనికొస్తుందో తెలియదు. దీన్ని పిచ్చాసుపత్రిగా మార్చాలి అంటూ చంద్రబాబు ఏదేదో చెప్పడం.. దాన్ని ఎల్లో మీడియా మక్కికిమక్కీ ప్రసారం.. ప్రచారం చేయడం ఈ ఏడాదిన్నరలో చూస్తూ వస్తున్నాం. చూసే జనాలకు కూడా అదేదో వైయస్ జగన్ సొంత ఆస్తి అన్నట్లుగా అనుమానాలు.. కాదు ఏకంగా నమ్మకం కలిగించేలా చంద్రబాబు ఆయన అనుచరులు మాట్లాడారు.

    ఏకంగా దాన్ని రుషికొండ జగన్ ప్యాలెస్ అని ప్రచారం చేసారు.. అయితే అదే ఇప్పుడు విశాఖ నగరానికి తలమానికం అయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన జాగాలో గతంలో ఉన్న కాటేజీల స్థానంలో ఈ అధునాతన భవంతిని తక్కువ బడ్జట్లో వైయస్ జగన్ నిర్మించారు. అయితే దాన్ని రకరకాలుగా వక్రీకరించి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరింత గొప్పగా వినియోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఋషికొండ భవనాలపైన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన , స్మార్ట్ మీటర్లపైన, తిరుమల లడ్డూపైన, వివేకా హత్య కేసుపైన, ముఖ్యంగా ఏపీ అప్పులపైన... పనిగట్టుకుని పుకార్లు.. అబద్ధాలు ప్రచారం చేసిన బాబు నేడు అదే రుషికొండ ప్యాలెస్‌పై ప్రభుత్వ ఆస్తిగా చూపుతూ దాన్ని ఇంకోరకంగా వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

    దాన్ని లీజుకు ఇవ్వాలంటూ టాటా గ్రూపుకు చెందిన తాజ్ హోటల్స్.. లీలా గ్రూప్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ హోటళ్ల వారు ఈ ప్యాలెస్‌లను అడుగుతున్నారు. దాన్ని వారు స్టార్ హోటళ్లుగా మార్చుకుని ప్రభుత్వానికి నెలనెలా అద్దె చెల్లించే ప్రాతిపదికన ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఇన్నాళ్లూ తెలుగుదేశం.. తమ అనుకూల మీడియా ప్రచారం చేస్తూ వచ్చినట్లు ఇది నిరర్ధక భవనం కాదని.. అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే హోటల్ లేదా ప్రభుత్వ గెస్ట్ హౌస్ వంటి వాటికి ఎంతగానో పనికొస్తుందని అర్థమవుతోంది.

    మరోవైపు ఈ భవనం మీద మరో రెండు అంతస్తులు నిర్మించడం ద్వారా దాన్ని మొత్తం 150 గదుల హోటల్‌గా మారిస్తే దానికి పూర్తి సార్థకత వస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అంటే వైయస్ జగన్ ఆనాడు నిర్మించిన భవనం ఇప్పుడు ఒక స్థిరమైన ఆస్తిగా మారి విశాఖకు వన్నె తెచ్చిందన్నమాట. మరి ఇన్నాళ్లుగా అది వైయస్ జగన్ సొంత ఆస్తిగా ప్రచారం చేస్తూ వచ్చిన మీడియా.. తెలుగుదేశం నాయకులూ.. దీనిపై ఏమంటారు.. అది జగన్ ఆస్తిగా చెప్పారు కదా మరి దాన్ని ఆయనకు ఇచ్చేస్తారా? లీజు డబ్బు జగన్ కుటుంబానికి అందజేస్తారు అంటూ ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎదురుదాడి ప్రశ్నల పరంపర మొదలైంది. అప్పుడు ఈ భవనం మీద ఇష్టానుసారం మాట్లాడిన చంద్రబాబు నేడు మళ్ళీ అదే భవనాన్ని గొప్పగా వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించడం ఆయన అవకాశవాద తీరుకు నిదర్శనం అని అంటున్నారు

    - సిమ్మాదిరప్పన్న

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యల చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్‌ తప్పుబట్టారు. కేసీఆర్‌పై రేవంత్‌ మాట్లాడిని భాష సరికాదని వ్యాఖ్యలు చేశారు. దీంతో, బండి సంజయ్‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

    కేంద్రమంత్రి బండి సంజయ్‌ తాజాగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘మనం మాట్లాడే భాష ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా ఉండకూడదు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై మాట్లాడిన భాష సరికాదు. సీఎం రేవంత్ తన భాషపై పునరాలోచన చేయాలి. రేవంత్ భాషతో ఆయనకే నష్టం జరుగుతుంది. ప్రతీ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ ధర్మం కోరుకుంటుంది అని చెప్పుకొచ్చారు.

    ఇదే సమయంలో కృష్ణా జలాలపై స్పందిస్తూ..‘కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నది కేసీఆర్. ఆ విషయాన్ని బయట పెట్టింది నేను. ముడుపుల కోసం కేసీఆర్ 575 టీఎంసీలు కావాలని అడగలేదు. కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదు. కాళేశ్వరం దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాలు అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారు. తెలంగాణకు కేసీఆర్‌ ద్రోహి. ఇందుకే కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఏం సరిపోతాయి. ప్రతీ గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు ఇవ్వాలి. మార్చి నాటికి మూడువేల కోట్లు ఇస్తామని రేవంత్ అంటున్నారు.. అవి కేంద్రం ఇచ్చే నిధులే. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులు వేల కోట్లు సంపాదిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించుకున్నారు. భూములు కొల్లగొడుతున్న ఇద్దరు, ముగ్గురు మంత్రులు భవిష్యత్‌లో జైలుకు వెళ్లడం ఖాయం. వారిపై నివేదిక తయారు చేస్తున్నాం. 

    గెలిస్తే కాంగ్రెస్‌ పార్టీనా?
    పార్టీ గుర్తుపై జరిగే MPTC, ZPTC ఎన్నికలకు వెళ్లకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళను తమ వాళ్ళే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పినా స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నిజాయితీ పరులు.. వారికి స్వేచ్ఛ ఇవ్వండి. మావోయిస్టుల లిస్టులో పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఆధారాలు లేవు’ అని కామెంట్స్‌ చేశారు. 

    బీజేపీ బలంగానే ఉంది.. 
    మా పార్టీ నేతలమంతా కలిసికట్టుగానే ఉన్నాం. మేం కలిసి భోజనాలు కూడా చేశాం. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం జీవోలను దాచిపెడుతోంది. ఆరు గ్యారెంటీలు చర్చ జరగకుండా చేస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద ఎన్ని ఇళ్లు ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రంగారెడ్డి జిల్లాలో నలుగురు రోహింగ్యాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఓట్ల కోసం వారిని ప్రోత్సహిస్తున్నారు. భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ మేయర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. గతంలో కొద్ది తేడాలో మేయర్ స్థానం పోగొట్టుకున్నాం. ఈసారి సింగిల్‌గా  మేయర్ పీఠం మాదే. ఎంఐఎంకు అనుకూలంగా హైదరాబాద్‌లో డివిజన్ల డీలిమిటేషన్ చేశారు.

    కాంగ్రెస్ పార్టీ మాయలో ఉంది. భాగ్యనగరంలో ఎంఐఎంతో సహవాసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎవరూ వేయడానికి సాహసం చేయరు.  జూబ్లీహిల్స్ ఓటమితో కార్యకర్తలు ఆవేదన చెందారు. ఖైరతాబాద్‌లో కార్యకర్తలు కసితో ఉన్నారు. ఈ దేశంలో మైనార్టీ ప్రజలంతా క్షేమంగా ఉన్నారు. ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో మాత్రం హిందువులను హతమారుస్తున్నారు’ అని అన్నారు. 

  • ‘‘మన పాలనను జనం మెచ్చడం లేదు.. బాగానే పని చేస్తున్నామని మనం అనుకుంటున్నా ఎండ్ రిజల్ట్ రావడం లేదు..’’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో చేసిన ఒక వ్యాఖ్య ఇది. కుమారుడు, మంత్రి లోకేశ్‌ చేస్తున్న బెదిరింపు రాజకీయాలను తెలుసుకుంటే బాబుగారికి ‘ఎండ్‌ రిజల్ట్‌’ ఎందుకు రావడం లేదో తెలిసొచ్చేదేమో. ‘రెడ్‌బుక్‌లో మూడు పేజీలే అయ్యాయి. ఇంకా ఉన్నాయి. ఎవరికి, ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు’’ అని లోకేశ్‌ చేసిన వ్యాఖ్య అర్థమేమిటి? ప్రభుత్వాన్ని, విధానాలను ప్రశ్నించేవారిని వేధిస్తామనడమేగా? అధికారంలో వచ్చింది మొదలు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్ధులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారనే కదా? ఇలాంటి ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలు మెచ్చుకుంటారని ఎలా అనుకున్నారు? ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. అయితే లోకేశ్‌ వంటి నేతలు అధికారం రాగానే తాము ఏమి చేసినా చెల్లిపోతుందని భ్రమపడుతున్నారు. నిజమే..ఈ మధ్య  ఎవరో చెప్పారు. చంద్రబాబుకు పాలనపై పట్టు తగ్గుతోందట. అంతా ఆయన కుమారుడే ఆదిపత్యం చెలాయిస్తున్నారట. 

    చంద్రబాబు కూడా లోకేశ్‌ను పొగడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట. గతంలో చంద్రబాబు పాలన మరీ ఇంత అధ్వాన్నంగా ఉందని ఆయన ప్రత్యర్దులు సైతం చెప్పరు. ఈ విషయం ఆయకూ తెలుసు. రెడ్‌బుక్ అంటూ ఎవరినైనా పోలీసుల ద్వారా వేధించే అధికారం లోకేశ్‌కు ఎలా వచ్చింది? ఆయన కనీసం హోం మంత్రి కూడా కాదు! అయినా మొత్తం పోలీసు వ్యవస్థను ఆయనే ఎందుకు నడుపుతున్నారు? చివరికి కొంతమంది పోలీసులు కిడ్నాపర్లుగా మారుతున్నారని కొంతమంది సాక్షాత్తూ హైకోర్టుకు ఫిర్యాదు చేశారే! లేదంటే గంజాయి అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది.

    సోషల్ యాక్టివిస్ట్ సవిందర్ రెడ్డిపై పెట్టిన గంజాయి కేసుపై న్యాయ వ్యవస్థ మండిపడింది కదా! ఫ్యాక్షనిస్టులకు ప్రోత్సాహం ఇచ్చేలా లోకేశ్‌ మాట్లాడడమంటే ఇంతకంటే ఏమి చెప్పాలి. ఫ్యాక‌్షన్‌ గొడవల్లో హత్యకు గురైన తోట చంద్రయ్య తనకు ఆదర్శమంటే ఏం చెబుతాం? హత్యను సమర్థించరు కానీ.. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెరదీసిందా? లేదా? కందుకూరులో జరిగిన మరో హత్యకు టీడీపీ నేత కారణమన్న ఆరోపణలున్నాయి. అది కులపరమైన వివాదంగా మారడంతో హతుని కుటుంబానికి భారీగా పరిహారం, భూమి ఇవ్వడాన్ని టీడీపీని సమర్థించే ఒక  మాజీ డీజీపీ స్థాయి అధికారే విమర్శించారే. నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు ఆంజనేయులును  కొందరు నేరస్తులు హత్య చేస్తే ఈ ప్రబుత్వం పట్టించుకోలేదు. 

    మాచర్ల ప్రాంతంలో రెండు టీడీపీ వర్గాలు ఘర్షణ పడి హత్యలు జరిగితే  దానిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరులకు పులిమి జైలుకు పంపించడం రెడ్‌బుక్‌లో భాగమైతే  ప్రజలు అంగీకరిస్తారా? చంద్రబాబును స్కిల్  స్కామ్ కేసులో గత ప్రభుత్వం అరెస్టు చేయడంపై లోకేశ్‌, ఇతర నేతలు విమర్శలు చేశారు. ఇది అక్రమ అరెస్టు  అని చెబుతున్నారే తప్ప, అందులో అవినీతి జరగలేదని రుజువు చేసే విధంగా ఒక్కసారైనా మాట్లాడలేకపోయారే! పైగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కేసును దర్యాప్తు  చేసిన అధికారులపై కేసులు పెట్టి వేధించి ఇది రెడ్‌బుక్ అని చెబితే ప్రజలు ఎందుకు మెచ్చుకుంటారు? ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్  ఉద్యమం నడుపుతున్నారు. 

    ఆ క్రమంలో గవర్నర్‌ను కలిశాక ఈ ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, ఆ కాలేజీలు పొందే వారిపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి జైలుకు పంపుతామని ఆయన అన్నారు.  ఈ అంశంపై లోకేశ్‌ రాజకీయ విమర్శ చేయవచ్చు. కాని అంతకు ముందు తాను ఈ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురంచి ఏమి చెప్పింది? అసలు ప్రభుత్వ వైద్యం గురించి ఎంత గంభీర ప్రకటనలు యువగళం సభలలో చేసింది గుర్తుకు తెచ్చుకుని బదులు ఇవ్వాలి కదా! అది చేయకుండా రెడ్‌బుక్ మూడులో  పేజీలే అయ్యాయని, ఇంకా చాలా ఉన్నాయని చెప్పడం ద్వారా ఇది అహంభావ ప్రభుత్వమని, మూర్ఖంగా వ్యవహరిస్తోందన్న విమర్శలక ఆస్కారం ఇవ్వడం లేదా? ఇప్పుడే హుందాతనం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే, భవిష్యత్తులో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని జనం అనుకోరా? 

    లోకేశ్‌ యువగళం టీమ్ ఒకటి ఉంటుందట. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఆయా శాఖలను పర్యవేక్షిస్తుంటారట. విపక్ష  వైఎస్సార్‌ కాంగ్రెస్ వారిని ఎలా వేధించాలి?వారి ఆర్థిఖ మూలాలను ఎలా దెబ్బకొట్టాలి? అధికారులను అడ్డం పెట్టుకుని ఎలా డబ్బులు సంపాదించాలి అన్నవాటిపైనే దృష్టి పెడుతుంటారట. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉన్నా అది లోకేశ్‌కే పెద్ద సమస్య అవుతుంది. సూపర్ సిక్స్, ఎన్నికల మానిఫెస్టోలని 150 హామీలను అమలు చేయలేదు.రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారు. ప్రజల జీవన ప్రమాణాలు  దెబ్బతింటున్న  సంగతి అందరికి తెలుస్తూనే ఉంది. అందువల్లే జనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు. 

    ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూ మాఫియా గురించి ఏమి చెప్పారు? పేకాట క్లబ్లుల గురించి ఏమని తెలిపారు.ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంది? అప్పుడప్పుడూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నా, ప్రభుత్వం 15 ఏళ్లు  ఉండాలని అంటూ పవన్ చిటికెలు వేస్తున్నారని సోషల్  మీడియాలో చెణుకులు వస్తున్నాయి. అది వేరే సంగతి. కేంద్ర హోం శాఖ నుంచి ఏపీకి ఏ రకమైన ఉత్తరం వచ్చింది? పది జిల్లాలలో నేరాల రేటు పెరిగిందని పోలీసు నివేదికే వెల్లడిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎన్నికైన నియోజకవర్గాలు ఉన్న జిల్లాలలోనే శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఈ నివేదిక చెబుతోంది కదా! టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలే ఈ అరాచకాలకు కారకులవుతున్నారని అనేక మంది వాపోతున్నారు. 

    టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమ పార్టీవారు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నది వివరంగా చెబితే ప్రభుత్వం ఏమి చేసింది? ఎదుటి వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అదే టీడీపీ వారు ఎంత విశృంఖలంగా ప్రవర్తించినా వారి జోలికి వెళ్లకపోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయా? లేదా? ఇదంతా రెడ్‌బుక్‌ ప్రభావమని లోకేశ్‌ సంతోషిస్తే సంతోషించవచ్చు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు దీని ఫలితం తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసు.ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవడం ధర్మం. అలా కాకుండా ఏకపక్షంగా సాగుతున్న ఈ ప్రభుత్వ పాలనను జనం ఎందుకు మెచ్చుకుంటారు. 

    అసలు ఈ ప్రభుత్వం ఆరంభమైందే ఈ రకమైన అరాచకాలతో. దానికి రెడ్‌బుక్ పేరుతో లోకేశ్‌ బృందం చేసిన నిర్వాకమే  కారణమన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. మొత్తమ్మీద  జనం తన  ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోవడానికి ప్రధాన కారణం తన కుమారుడి లోకేశ్‌ పెత్తనం, పిచ్చి రెడ్‌బుక్ అరాచకాలు, హామీలు అమలు చేయయకుండా ప్రజలను భ్రమలలో ఉంచాలన్న యత్నం వంటివి అన్న సంగతిని చంద్రబాబు గుర్తించి సకాలంలో జాగ్రత్తపడకపోతే అదే  రెడ్‌బుక్ ఏదో రోజు టీడీపీ నేతల మెడకే చుట్టుకుంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తమ  పాలనను జనం మెచ్చడం లేదన్న సంగతి తెలుసుకోవడం కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి.

    కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

  • సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ది కంపు నోరు.. మురుగు కాల్వ కంటే అధ్వాన్నం అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

    మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు అవసరం ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రజలకు లేదు. కేసీఆర్ స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బండ రాయి కట్టి మూసీ నదిలో పడేస్తారు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ తోలు కాదు, ప్రభుత్వం తోలు వలుస్తాం.

    కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే తమ బట్టలు ఇప్పుతాడనే భయంతోనే ఫ్రస్టేషన్‌లో రేవంత్ మాట్లాడుతున్నాడు. రేవంత్ భాషకి ప్రజాక్షేత్రంలో తప్పక శిక్ష పడుతుంది. ప్రజలే రాజకీయ సమాధి చేస్తారు. కేసీఆర్ ముందు రేవంత్ బచ్చా. ఇరిగేషన్ మంత్రి ఒక అజ్ఞానపు మంత్రి. ఉత్తమ్ కుమార్‌కు కనీస అవగాహన లేదు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత’ అని వ్యాఖ్యలు చేశారు. 

  • సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అధికార టీడీపీకి ఏపీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మంత్రి సంధ్యా రాణి పీఏ సతీష్‌.. మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా? అని ప్రశ్నించారు.

    ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌ వ్యవహారంలో బాధితురాలిపై తిరిగి కేసు పెట్టారు.. మంత్రి డైరెక్షన్‌లోనే ఆమెపై కేసు నమోదు చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని మంత్రి, సతీష్‌ ఇలా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళను, మరొక మహిళా మంత్రి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం. టీడీపీ తొత్తుల్లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మంత్రి పీఏ మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా?.

    బాధితురాలి దగ్గర సతీష్ డబ్బులు తీసుకోవడం నిజం కాదా?. ఇప్పటికైనా సతీష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. ఇంతా జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు?. హోం మంత్రిగా అనిత విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. 

NRI

  • సంపాదన కంటే ప్రశాంతమైన జీవితం మంచిది అనే సూక్తులు వినడానికే బాగుంటాయి. నిజజీవితంలో కాస్త కష్టమే అంత ఈజీ కూడా కాదు. పోనీ అలాంటి సాహసం చేస్తే..సమాజంలో, బంధువుల్లో మన స్థాయి తక్కువుగా ఉంటే మనం తట్టుకున్నా.. మన కుటుంబసభ్యలు అందుకు సిద్ధంగా ఉంటారా అంటే సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ నార్వేలో నివశిస్తున్న భారత యువకుడు అదే మంచిదంటూ తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా అంటూ పెట్టిన పోస్ట్‌ తెగ వైరల్‌ అవ్వడమే కాదు..అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.

    అందులోనూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంతో విసిగివేశారిన వారికి ఈ పోస్ట్‌ ఓ మంచి ఎన​‍ర్జిటిక్‌గా కనిపించింది. పైగా ఆయన ఏం చెబుతున్నాడో అంటూ  ఆ వీడియోని అంతా ఆస్తక్తిగా చూసేశారు కూడా. ఇంతకీ ఈ నార్వే యుకుడు ఆ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో పోస్ట్‌లో ఏం చెప్పాడంటే..

    తన పేరు సచిన్‌ అని తాను నార్వేలో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను దాదాపు 35 దేశాలకు పైగా పర్యటించాక ఓ విషయాన్ని గ్రహించానానని  అంటూ చెప్పుకుంటూ రావడం వీడియోలో చూడొచ్చు. జీవితానికి ఎల్లప్పుడూ డబ్బు అవసరం లేదని, జీవించడానికి కేవలం సమయమే కావలని అన్నాడు. ఇక్కడ నార్వేలో ఉద్యోగం మనిషి విలువను ప్రతిబింబించదని, కేవలం వాళ్లు మనుషులుగా చూడటం అత్యంత ప్రశంసించదగ్గ విషయమని అన్నాడు. 

    అక్కడ జీతం, హోదా, జెండర్‌, ఎక్కడ నుంచి వచ్చారు వంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వరని అన్నాడు. అక్కడ కుటుంబం, ఆరోగ్యం, అభిరుచులు, పర్యటనలు, మానసిక ప్రశాంతత తదితరాలే ముఖ్యమనే విషయం ఇక్కడకు వచ్చాక తప్పక గుర్తిస్తారని అన్నాడు. కేవలం జీవన నాణ్యత, భద్రత, శాంతి అనేవి ఎంత ముఖ్యమో కచ్చితంగా తెలుస్తుందంటున్నాడు. 

    అలాగని నార్వే ఏదో గొప్పదని చెప్పుకురావడం తన ఉద్దేశ్యం మాత్రం కాదని, కేవలం నిజంగా మనం కోసం మనం జీవించే జీవితాన్ని ఎంచుకోవడానికి మించిన ప్రశాంతత మరొకటి ఉండదని తెలియజేసేందకేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు నార్వేలో పని అనేది జీవితంలో ఒక భాగమేనని, అక్కడ ప్రజలు కుటుంబం, పర్యటనలు, అభిరుచులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పాడు. 

    అంతేగాదు ఇక్కడ ప్రజలు మనుగడ కోసం జీవించరని, పూర్తి స్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు సచిన్‌. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి బ్రదర్‌ మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు, అలాంటి మంచి భారతీయ కమ్యూనిటీ ఉంటే కచ్చితంగా మేము అక్కడకి వచ్చేస్తాం అంటూ కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. 

     

    (చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గర్గ్‌..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..)