రెండో పోరుకు రెడీ
6 వార్డులు ఖాళీగానే..
మొత్తం 8,33,132 మంది ఓటర్లు..
ఉదయం 7 గంటలకు షురూ..
నేడు 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్ సామగ్రిని అందజేశారు.
520 సర్పంచ్‌లకు 1,709 మంది పోటీ..
ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రెండో విడతలో ఇలా..
జిల్లా జీపీలు ఏకగ్రీవ పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో
సర్పంచ్‌లు స్థానాలు ఉంది.. స్థానాలు ఉంది..
మహబూబ్‌గర్ 151 9 142 474 1,334 267 1,065 2,811
నాగర్‌కర్నూల్ 151 4 147 473 1,412 143 1,269 3,228
నారాయణపేట 95 10 85 268 900 224 672 1,755
వనపర్తి 94 5 89 294 850 148 702 1,769
జో. గద్వాల 74 17 57 200 716 222 494 1,263
మొత్తం 565 45 520 1,709 5,212 1,004 4,202 10,826
2వ విడతలో ఎన్నికల్లో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు..
2వ విడతలో జిల్లాలు, మండలాల వారీగా ఇలా..
జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
మహబూబ్‌నగర్ 94,975 96,998 4 1,91,977
నాగర్‌కర్నూల్ 1,27,142 1,26,602 5 2,53,749
జో.గద్వాల 55,710 57,094 3 1,12,807
వనపర్తి 61,553 62,726 2 1,24,281
నారాయణపేట 73,674 76,642 2 1,50,318
మహబూబ్‌గర్: 6 (చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మిడ్జిల్,
హన్వాడ, కోయిల్‌కొండ)
నాగర్‌కర్నూల్: 7 (బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్,
పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజీపేట)
నారాయణపేట: 4 (దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్)
వనపర్తి: 5 (వనపర్తి,
కొత్తకోట, మదనాపూర్,
ఆత్మకూర్, అమరచింత)
జోగుళాంబగద్వాల: 4 (మల్దకల్, అయిజ,
వడ్డేపల్లి, రాజోలి)
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ జీపీలో పది వార్డులు ఉండగా.. రెండు, ఆరు, తొమ్మిది, పదో వార్డు స్థానాలు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. అయితే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు.
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. నాలుగు, ఆరో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా అభ్యర్థులకు వయసు అడ్డంకిగా మారడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా వార్డులకు పోలింగ్ నిర్వహించడం లేదు.
ఉమ్మడి జిల్లాలో
45 మంది సర్పంచ్‌లు,
1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం
520 జీపీలు..
4,202 వార్డులకు పోలింగ్
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
రెండో విడతలో పోలింగ్ జరగనున్న గ్రామాల్లో మొత్తంగా 8,33,132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 4,13,054 మంది కాగా.. మహిళలు 4,20,062, ఇతరులు 16 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 7,008 మంది అధికంగా ఉండగా.. వారి ఓట్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.
ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
రెండో పోరుకు రెడీ


