ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి..
ఆత్మకూర్: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని ఆయనతో పాటు జెడ్పీ సీఈఓ రాంమహేశ్వర్‌రెడ్డి, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ పరిశీలించారు. ఎన్నికల నియమావళి పాటిస్తూ విధుల్లో పాల్గొనాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న 37 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి తదితరులు ఉన్నారు.


