ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
వనపర్తిటౌన్: గెలిచిన అభ్యర్థులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో మొదటి విడత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డుసభ్యులను ఆయన శాలువాలు, పూలమాలలతో సత్కరించి మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే ప్రత్యర్థులని.. గెలిచిన తర్వాత అందరూ తమవారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అధికారం లేదన్న దిగులు వీడి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, రాబోయేది బీఆర్‌ఎస్ పాలనేనని భరోసా కల్పించారు. మొదటి విడతలో 34 మంది బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచులు కావడం కాంగ్రెస్ ధౌర్జన్యాలు, అన్యాయానికి నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీనర్సింహస్వామి హుండీ లెక్కింపు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో భక్తులు కానుకలుగా సమర్పించిన 5 నెలల హుండీ డబ్బులను శుక్రవారం దేవాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ సమక్షంలో లెక్కించారు. ఈ ఏడాది జూన్ 24 నుంచి ఈ నెల 12 వరకు సంబంధించిన డబ్బులను లెక్కించగా.. రూ.10,75,733 ఆదాయం వచ్చింది. అలాగే మిశ్రమ వెండి 1.25 కిలోలు వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ మదన్‌కుమార్, ఈఓ రంగారావు, జూనియర్ అసిస్టెంట్ జయపాల్‌రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి


