సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి..
కొత్తకోట రూరల్: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, మదనాపురం, అమరచింత మండలాల్లో పర్యటించి సమస్యాత్మక గ్రామాలైన చిట్యాల, రాజపేట, కానాయిపల్లి, మదనాపురం, జూరాల పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించి పోలింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో సర్పంచ్ ఎన్నికలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, క్యూలైన్‌లో ఉండేలా చూడాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీస్ విభాగం హైఅలర్ట్‌లో కొనసాగాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరారు. 5 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట వికారాబాద్ రీజినల్ ఇంటలిజెన్స్ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, స్పెషల్ బ్రాంచ్ సీఐ న రేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, వనపర్తి రూరల్, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్ ఎస్‌ఐలు జలంధర్‌రెడ్డి, ఆనంద్, శేఖర్‌రెడ్డి, జయన్న ఉన్నారు.


