ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
వనపర్తి రూరల్: వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో ఐకేపీ ద్వారా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీయడంతో పాటు ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. నిబంధనల మేరకు ఉన్న ధాన్యాన్ని జాప్యం లేకుండా సేకరించాలని.. ట్యాగ్ చేసిన మిల్లులకు వెంటనే తరలించి, ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని కేంద్రం ఇన్‌చార్జికి సూచించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట సివిల్ సప్లయ్ డీఎం జగన్మోహన్ ఉన్నారు.
నేడు ఎస్‌జీఎఫ్‌బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో నేడు (మంగళవారం) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ ఒరిజినల్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఉదయం 9 గంటలకు పీడీ సాదత్‌ఖాన్‌కు రిపోర్టు చేయాలని, మిగతా వివరాల కోసం 89198 71829 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.
18న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
కందనూలు: ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు కోసం క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్టు ఎంపికను ఈ నెల 18న నాగర్‌కర్నూల్‌లోని నల్లవెల్లి రోడ్డులో గల క్రికెట్ మైదానంలో ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఉదయం 10 గంటల వరకు క్రీడా మైదానానికి చేరుకోవాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 26 వరకు 4 లీగ్ మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఆసక్తిగల క్రీడాకారులు పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 89193 86105, 98854 01701లను సంప్రదించాలని సూచించారు.


