ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు
చిన్నంబావి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం చిన్నంబావిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో రెండో విడత 78 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. మిగతా స్థానాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పోటీ చేశాయన్నారు. మూడో వంతు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలు అంతర్గతంగా సహకారం అందించుకుంటున్నాయని పంచాయతీ ఎన్నికలతో బహిర్గతం అయిందన్నారు. మూడో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. అనంతరం కొప్పునూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమావేశంలో నాయకులు కల్యాణ్‌రావు, బీచుపల్లి యాదవ్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, పెరుమాల శ్రీనివాసులు, నర్సింహ, వడ్డెమాన్ బిచ్చన్న ఉన్నారు.


