జనరల్‌లో బీసీల హవా!
మొత్తంగా 41.82 శాతం..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని 24 మండలాల్లో తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దఫాకు సంబంధించి 237 అన్‌రిజర్వ్‌డ్ (జనరల్, మహిళ కలిపి) సర్పంచ్ స్థానాల్లో 116 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పాటు 114 బీసీ రిజర్వ్ (బీసీ జనరల్, బీసీ మహిళ కలిపి) స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 550 సర్పంచ్‌లకు గాను 230 మంది (41.82 శాతం) బీసీలు ఎన్నికయ్యారు.
తొలివిడతలోసర్పంచ్‌లుగా విజయం
237 అన్‌రిజర్వ్‌డ్ స్థానాల్లో 116 మంది జయకేతనం
మొత్తంగా 550 పంచాయతీల్లో 230 మంది గెలుపు
బీసీలు పోటీలో ఉన్న జనరల్ స్థానాలపై సంఘాల ప్రత్యేక నజర్
ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం


