ప్రవాహం.. ప్రమాదం
ఈత సరదాతో..
● ఈత సరదా, దుస్తులు శుభ్రం
చేసేందుకు వెళ్లి గల్లంతు
● అవగాహన కల్పించడంలో
విఫలమవుతున్న అధికారులు
●
ప్రాజెక్టు అధికారులు తమ సిబ్బంది ద్వారా కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని సమీప గ్రామాల ప్రజలు, రైతులకు తెలియపర్చాలి. వారబందీ విధానంలో వారంలో ఎన్ని రోజులు నీటిని వదులుతారు.. ఎన్ని రోజులు నిలిపివేస్తారన్న విషయాలను తెలియజేస్తే ప్రాణహానిని నివారించవచ్చు.
– హన్మంతు,
ఎంపీటీసీ మాజీ సభ్యుడు, నందిమళ్ల
జూరాల ప్రధాన ఎడమ కాల్వ వెంట లష్కర్లను నియమించాలి. రోజు కాల్వ గట్లపై తిరుగుతూ అటుగా తిరిగే వారిని హెచ్చరించాలి. వేసవిలో చిన్నారులు, యువత ఈత సరదా కోసం కాల్వలోకి దిగే ప్రయత్నం చేస్తుంటారు. వారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. – వెంకటేష్,
విద్యార్థి సంఘం నాయకుడు నందిమళ్ల
నందిమళ్లలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించాం. ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులను కాల్వ వద్దకు తీసుకెళ్లరాదని తల్లిదండ్రులకు సూచించాం. తీర గ్రామాల్లోని ప్రజలు కాల్వలోకి దిగరాదని.. అత్యుత్సాహం చూపుతే ప్రాణాలు కోల్పోయి కుటుంబాలకు శోకం మిగిల్చిన వారవుతారని అవగాహన కల్పించేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం.
– శివకుమార్, సీఐ, ఆత్మకూర్
అమరచింత: ఆయకట్టుకు సాగునీటితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీరు అందిస్తున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ ప్రమాదకరంగా మారింది. కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేని రైతులు, ప్రజలు నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి విలువైన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వలో నీటి ప్రవాహ తీవ్రత, ప్రవహించే నీటితో కలిగే నష్టాల గురించి అవగాహన లేక అమాయక ప్రజలు, విద్యార్థులు, చిన్నారులు ఈత సరదాతో ప్రాణాలు కోల్పోతున్నారు. నందిమళ్ల సమీప కాల్వలో ఇలాంటి మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నా.. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
రామన్‌పాడు వరకు..
జూరాల ఎడమ కాల్వ ద్వారా రామన్‌పాడు ప్రాజెక్టుకు నీటిని క్రమం తప్పకుండా వదులుతుంటారు. కాల్వ సమీపంలో ఉన్న నందిమళ్ల, మూలమళ్ల, జూరాల గ్రామాల ప్రజలు నిత్యం కాల్వలో దిగి తమ అవసరాలను తీర్చుకుంటారు. ఈ క్రమంలోనే పలువురు కాల్వలో కొట్టుకుపోయి రామన్‌పాడు రిజర్వాయర్‌లో మృతదేహాలు కనిపించడం సర్వసాధారణంగా మారింది. ఐదేళ్లుగా జూరాల కాల్వలకు ప్రతి సీజన్‌లో వారబందీ విధానంలో నీటిని వదులుతున్న విషయం రైతులకు తప్ప ఇతరులకు తెలియకపోవడమే ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. జూరాల గ్రామ సమీపంలోని ప్రధాన ఎడమ కాల్వ లోతుగా భయంకరంగా ఉండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనన్న ఆందోళనలో ఇక్కడి ప్రజలు కాలం గడుపుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి కొత్తకోట, మదనాపురం, పెబ్బేరు, వీపనగండ్ల మండలాల వరకు ప్రధాన ఎడమ కాల్వ ప్రవహిస్తుండటంతో ప్రజలు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఒక్క నందిమళ్లలోనే..
పదేళ్లలో నందిమళ్ల గ్రామంలోనే 17 మంది సమీపంలోని జూరాల ఎడమ కాల్వలో కొట్టుకుపోయి మృతిచెందారు. మూడేళ్లలో పెబ్బేరు సమీపంలోని కాల్వలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
ప్రాణాలు హరిస్తున్న జూరాల ఎడమకాల్వ
కృష్ణానది అందాలు తిలకించడానికి వస్తున్న పర్యాటకుల్లో అధికంగా విద్యార్థులు, యువత కాల్వలో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. కాల్వ పక్కనే చేప వంటకాలు వండి వడ్డించే గుడారాలు ఉండటం, అక్కడే మద్యం దొరకడంతో మత్తులో సరదా కోసం దూకుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం విక్రయాలను అరికట్టాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా అటు పోలీసులు, ఇటు అబ్కారీశాఖ వారు పట్టించుకోకపోవడంతో జోరుగా సాగుతోంది.
ప్రవాహం.. ప్రమాదం
ప్రవాహం.. ప్రమాదం


