హ్యాండ్‌బాల్ ఫైనల్‌కు పాలమూరు జట్లు
● బాల, బాలికల విభాగాల్లో జిల్లా జట్ల సత్తా
● నేడు ముగియనున్న అండర్– 19 టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్– 19 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో ఆతిథ్య ఉమ్మడి పాలమూరు జట్లు సత్తా చాటి ఫైనల్‌కు చేరుకున్నాయి. బాలుర విభాగం మ్యాచ్‌లను హీరా మోడల్ స్కూల్ మైదానం, బాలికల మ్యాచ్‌లను మహబూబ్‌నగర్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన బాలుర విభాగం సెమీఫైనల్ మ్యాచ్‌లో జిల్లా జట్టు 13–6 గోల్స్ తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. మరో సెమీఫైనల్‌లో వరంగల్ జట్టు 14–6 తేడాతో రంగారెడ్డిపై గెలుపొందింది. బాలికల విభాగం సెమీఫైనల్‌లో మహబూబ్‌నగర్ జట్టు 5– 2 గోల్స్ తేడాతో కరీంనగర్ జట్టుపై, మరో సెమీస్‌లో వరంగల్ జట్టు 14– 6 తేడాతో ఖమ్మం జట్టుపై గెలుపొందాయి. టోర్నమెంట్ నేటి(ఆదివారం)తో ముగియనుంది.
లీగ్ మ్యాచ్‌ల వివరాలు..
బాలుర విభాగం లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 10– 4 గోల్స్ తేడాతో నిజామాబాద్ జట్టుపై గెలుపొందగా, మరో మ్యాచ్‌లో జిల్లా జట్టు 15– 8 తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. ఇతర మ్యాచుల్లో ఖమ్మం జట్టు 13– 10 గోల్స్ తేడాతో మెదక్‌పై, రంగారెడ్డి జట్టు 8– 7 తేడాతో నిజామాబాద్‌పై, మెదక్ జట్టు 7– 2 తేడాతో నల్లగొండపై, హైదరాబాద్ జట్టు 7– 6 తేడాతో ఆదిలాబాద్‌పై, వరంగల్ జట్టు 13– 1 తేడాతో నల్లగొండపై, కరీంనగర్ జట్టు 14– 6 తేడాతో ఖమ్మంపై, వరంగల్ జట్టు 13– 8 తేడాతో ఖమ్మంపై, కరీంనగర్ జట్టు 7– 1 తేడాతో మెదక్‌పై, హైదరాబాద్ జట్టు 6– 4 తేడాతో నిజామాబాద్‌పై గెలుపొందాయి. బాలికల విభాగం లీగ్ మ్యాచుల్లో మహబూబ్‌నగర్ జట్టు 12– 5 గోల్స్ తేడాతో మెదక్‌పై, మరో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 5– 0 గోల్స్ తేడాతో నిజామాబాద్‌పై విజయం సాధించింది. ఇతర మ్యాచుల్లో ఖమ్మం జట్టు 8– 5 గోల్స్ తేడాతో మహబూబ్‌నగర్ జట్టుపై, కరీంనగర్ జట్టు 17– 0 తేడాతో నల్లగొండపై, ఖమ్మం జట్టు 13– 2 తేడాతో మెదక్‌పై, ఆదిలాబాద్ జట్టు 9– 6 తేడాతో నల్లగొండపై, రంగారెడ్డి జట్టు 2– 1 తేడాతో నిజామాబాద్‌పై, వరంగల్ జట్టు 13– 5 తేడాతో హైదరాబాద్‌పై, ఖమ్మం జట్టు 12– 3 తేడాతో రంగారెడ్డిపై, వరంగల్ జట్టు 9– 0 తేడాతో నల్లగొండపై విజయం సాధించగా ఆదిలాబాద్– కరీంనగర్ జట్లు చెరో 5 గోల్స్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.


