నవోదయ పరీక్ష ప్రశాంతం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
83.44 శాతం హాజరు
పర్యవేక్షించిన డీఈఓ, ఇతర అధికారులు
వర్గల్(గజ్వేల్)/మెదక్‌కలెక్టరేట్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 2026–27 విద్యాసంవత్సరంలో వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతి ప్రవేశానికి 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,754 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సిఉండగా 3,967 మంది పరీక్షకు హాజరైనట్లు వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగిందన్నారు. 83.44 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నా రు. సమర్థంగా పరీక్ష నిర్వహణకు సహకరించిన ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, జిల్లావిద్యాధికారులు, సిబ్బంది, పోలీస్ యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాల వారీగా విద్యార్థుల హాజరు


