గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు
నర్సాపూర్‌రూరల్/శివ్వంపేట/వెల్దుర్తి(తూప్రాన్): గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు వస్తాయని ఎంపీ రఘనందర్‌రావు అన్నా రు. శనివారం మండలంలోని గొల్లపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న బీజేపీ బలపరిచిన అభ్యర్థి మాధవి నవీన్‌గౌడ్‌ను గెలిపిస్తే గ్రామానికి రూ. 25 లక్షల ఎంపీ నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి విడతలో బీజేపీ ఎక్కడ ప్రచారం చేయకున్న 26 మంది అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన వారు బీజేపీలో చేరేందుకు టచ్‌లో ఉన్నారన్నారు. అలాగే శివ్వంపేట మండల పరిధి పిల్లుట్లలో బీజేపీ బలపరిచిన ఆభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఖాజనా ఖాళీగా ఉందని సీఎం రే వంత్‌రెడ్డి అన్నారని, అలాంటప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న విషయం గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్ బీజేవైఎం రాష్ట్ర నాయకుడు అరవింద్‌గౌడ్, ఉదయ్‌గౌడ్, నవీన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వెల్దుర్తి మండలంలోని యశ్వంతరావుపేట, వెల్దుర్తి, శేరీల, బండపోసాన్‌పల్లి గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ ప్రచారం నిర్వహించారు.
ఎంపీ రఘునందన్‌రావు


