పల్లె పోరులో ఏఐ
ప్రచారాన్ని కొత్త పుంతలు
తొక్కిస్తున్న అభ్యర్థులు
చిన్నశంకరంపేట(మెదక్): ఏఐ (ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్) పంచాయతీ ఎన్నికల్లోనూ హల్‌చల్ చేస్తోంది. అభ్యర్థులు సరికొత్త వీడియోలతో ఓటర్లకు గాలం వేస్తున్నా రు. నార్సింగి మండల బీజేపీ సీనియర్ నాయకుడు శిర్న కృష్ణమూర్తి నాలుగేళ్ల క్రి త ం మరణించారు. తాజాగా జరుగుతున్న స ర్పంచ్ ఎన్నికల్లో ఆయన కోడలు శిర్న సంధ్య పోటీ చేస్తున్నారు. ఏఐ సాయంతో కృష్ణమూర్తి మా ట్లాడినట్లు వీడియోను రూపొందించారు. సంధ్యను సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ ఆ యన ఇచ్చిన సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన కుమారులు చంద్రశేఖర్, లవన్‌కుమార్ ఆ వీడియో సందేశంతో విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే శేరిపల్లిలో సర్పంచ్ అభ్యర్థి బండారు భాగ్యలక్ష్మి ఏఐ సహాయంతో వీడియో తయారు చేశారు. గ్రామాభివృద్ధికి తాను చేయబోయే పనులను ప్రచారం చేశారు. గ్రామంలో వాటర్ ప్లాంట్, సీసీ రోడ్డు తదితర అభివృద్ధి పనులు తాను దగ్గర ఉండి చేయిస్తున్నట్లు రూపొందించిన వీడియో ఆకట్టుకుంది.


