సిలిండర్ పేలిన ఘటనలో మరో మహిళ మృతి
ధరూరు: మండల కేంద్రంలో ఈ నెల 6న గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మరో మహిళ కుర్వ సునీత (23) శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. చికిత్స పొందుతున్న ముగ్గురూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు సునీత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త వెంకటేష్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ డీఆర్ విజయ్‌కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదే ప్రమాదంలో గాయపడిన తల్లీకొడుకులు (అశ్విని ఆమె ఏడాదిన్నర కుమారుడు) ఈ నెల 10న కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
మూడుకు చేరిన మృతుల సంఖ్య


