breaking news
YS Jagan Mohan Reddy
-
‘ఎమ్మార్’ పేరిట ప్రజలను ఏమార్చే కుట్ర... ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం
-
పచ్చి అబద్ధం.. పచ్చ కుతంత్రం
సాక్షి, అమరావతి: టీడీపీ కరపత్రిక, నిత్యం అసత్యాలు కొంగొత్తగా వల్లించే విష పుత్రిక ‘ఈనాడు’ మరోసారి బరితెగించింది. దశాబ్దాలుగా తనకు అలవాటైన రీతిలో ఉషోదయాన్నే అవాస్తవ సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరి తెగించింది. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారానికి తెగబడింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నిందితుల జాబితాలోనే లేని వైఎస్ జగన్‌ను.. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా(ఏ–1) పేర్కొంటూ ఓ అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పాత్రికేయ విలువలను మరోసారి దిగజార్చింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు డైరెక్షన్లో డైవర్షన్ రాజకీయానికి పాల్పడింది. నిస్సిగ్గుగా ‘ఈనాడు’ తప్పుడు రాతలుచంద్రబాబు కుట్రలో భాగంగా ఈనాడు 2010–11 నాటి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును ఉద్దేశ పూర్వకంగా తెరపైకి తీసుకువచ్చింది. ఆ కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన నిందితుడు (ఏ1) అంటూ ప్రముఖంగా ప్రచురించింది. ఈ కేసులో ఏ–7గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ తరఫున సునీల్ రెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని.. విదేశాలకు అక్రమంగా నిధులు తరలించారని కూడా అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రచురించింది. కనీసం అటువంటి కథనాన్ని ప్రచురించే ముందు ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు పూర్వాపరాలు తెలుసుకోవాలని కూడా యత్నించ లేదు. కనీసం ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిశీలించినా అసలు వాస్తవాలు వెల్లడవుతాయి. కేవలం చంద్రబాబు చెప్పినట్టు వైఎస్ జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు పత్రిక అవేమీ పట్టించుకోలేదు. అసత్య సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. అయితే ‘ఈనాడు’ ప్రచురించిందంతా వాస్తవం అని అమాయకంగా నమ్మేందుకు ఇవి 1995 వైస్రాయ్ హోటల్ కుట్ర నాటి రోజులు కావు. ఈనాడు పత్రిక బండారం ఎప్పుడో బట్టబయలైంది.ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో వైఎస్ జగన్‌కు సంబంధమే లేదు 2010–11లో సీబీఐ నమోదు చేసిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు. ఆ కేసులో ఆయన ప్రధాన నిందితుడు కాదు కదా.. సాధారణ నిందితుడు కూడా కాదు. అసలు ఆ కేసులో నిందితుల జాబితాలో వైఎస్ జగన్ పేరు లేనే లేదు. ఆయనపై సీబీఐ ఆ కేసు నమోదు చేయనే లేదు. 14 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నిందితుల జాబితా ఇదే.. ఇందులో వైఎస్ జగన్ పేరు లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితులు వీరే..బీపీ ఆచార్య (ఏ1), ఎమ్మార్ ప్రాపర్టీస్ (ఏ2), ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్ (ఏ3), ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ (ఏ4), స్టైలిష్ హోల్మెస్ అండ్ రియల్ ఎస్టేట్స్ (ఏ5), కోనేరు రాజేంద్ర ప్రసాద్ (ఏ6), నర్రెడ్డి సునీల్ రెడ్డి (ఏ7), జీవీ విజయ్ రాఘవ్ (ఏ8), శ్రీకాంత్ జోషి (ఏ9), బోల్డర్ హిల్స్ లీషూర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ10), ఎల్వీ సుబ్రహ్మణ్యం (ఏ11), విశ్వేశ్వరరావు (ఏ12), మధు కోనేరు (ఏ13), టి.రంగారావు(ఏ14) నిందితులుగా ఉన్నారు. వీరిలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, మధు కోనేరులపై అభియోగాలను న్యాయస్థానం ఇప్పటికే కొట్టి వేసింది. కేసు విచారణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 19న న్యాయస్థానంలో తదుపరి విచారణ ఉంది. దీన్నిబట్టి ఈ కేసులో నిందితుల జాబితాలో ఎక్కడా లేనప్పటికీ వైఎస్ జగన్‌ను ఏ1గా పేర్కొంటూ ఈనాడు కుట్ర పూరితంగానే అవాస్తవ కథనాన్ని ప్రచురించిందని స్పష్టమవుతోంది.బాబు డైరెక్షన్లోనే ‘ఈనాడు’ యాక్షన్⇒ చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈనాడు అసత్య కథనాన్ని ప్రచురించింది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తగానే మద్యం విధానంపై అక్రమ కేసు పేరిట సిట్ రంగంలోకి దిగుతుంది.. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తుంది.. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఈనాడు, ఇతర ఎల్లో మీడియా తోక పత్రికలు వెంటనే రంకెలు వేస్తాయి. మోకాలికీ బోడి గుండుకు ముడి పెడుతూ అసత్య కథనాలు ప్రచురిస్తాయి.⇒ ఈ కేసులో సిట్ ఎవర్ని అరెస్టు చేయనుందో ముందే లీకులు ఇస్తుంది. ఆ వెంటనే ఆయనే ఈ కేసులో అత్యంత కీలకం అంటూ ఈనాడు, ఇతర తోక పత్రికలు కథనాలు ప్రచురిస్తాయి. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు అని పేర్కొంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అనిల్ రెడ్డి.. ఇలా వీరందరిపై ఎల్లో మీడియా బురదజల్లడమే పనిగా పెట్టుకుంటుంది. ⇒ ఆ జాబితాలో తాజాగా చేరిన పేరు సునీల్ రెడ్డి. న్యాయవాది, చిన్న వ్యాపారస్తుడైన ఆయన వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడంటూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా వక్రభాష్యం చెబుతున్నాయి. ఆయన గత పదేళ్లలో వైఎస్ జగన్‌ను కలిసిందే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా విజయవాడకు గానీ, అమరావతికి గానీ వచ్చిందే లేదు. కానీ ఆయన వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడంటూ ఉద్దేశ పూరక్వంగా దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డికి సొంతంగా కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఎంతో మంది వృత్తి నిపుణులు పని చేస్తున్నారు. వైఎస్ జగన్ తమ వ్యాపారాలను వారి ద్వారా నిర్వహిస్తారు. అంతే గానీ, సిట్ చెప్పినట్టుగా ఇతరులెవరితోనో వ్యవహారాలు నిర్వహించాల్సిన అవసరం ఆయనకు ఏమాత్రం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపేందుకే సిట్, ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తున్నాయన్నది సుస్పష్టం. ⇒ మద్యం అక్రమ కేసులో అక్రమంగా అరెస్టు అయిన నిందితుల బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ ఇదే కుట్రను అమలు చేస్తున్నారు. ఎవరు ఆఫ్రికా దేశాల్లోనో మరెక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నా.. ఈ అక్రమ కేసుకు ముడి పెడుతున్నారు. అవన్నీ అక్రమ పెట్టుబడులే అంటూ బురద జల్లుతున్నారు.చంద్రబాబు, రామోజీ కుటుంబ ట్రేడ్ మార్క్ కుట్ర⇒ పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా చంద్రబాబు– ఈనాడు వ్యవహారం సాగుతోంది. తమ రాజకీయ స్వార్థం, ఆర్థిక దోపిడీ కోసం తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తూ.. రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతూ కుట్రలకు పాల్పడేందుకు చంద్రబాబు, రామోజీ కుటుంబ మార్కు కుతంత్రం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. ఆ క్విడ్ ప్రోకో కుట్రల్లో చంద్రబాబు, రామోజీ కుటుంబాలే లబ్ధిదారులు అన్నది బహిరంగ రహస్యం.⇒ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో చంద్రబాబు సీఎం అయిన వైస్రాయ్ హోటల్ కుట్రలో ఈనాడు పత్రిక ప్రధాన భాగస్వామి. 1995లో సీఎంగా ఉన్న ఎన్టీరామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా కథనాలతో దుష్ప్రచారం చేసి పాత్రికేయ విలువలకు పాతరేసింది. ⇒ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రామోజీ కుటుంబ అక్రమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు పూర్తిగా సహకరించారు. ఎన్టీ రామారావు అమలు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించారు. రామోజీ ఫిల్మ్ సిటీ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇదంతా చేశారు. టీడీపీ ప్రభుత్వ అండతోనే రామోజీ రావు కుటుంబం రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను చెరబట్టి ఫిల్మ్ సిటీ నిర్మించింది. ⇒ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిటర్స్ వేల కోట్ల రూపాయాల అక్రమ డిపాజిట్లు సేకరించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. క్విడ్ ప్రో కో కుట్రలో భాగస్వాములు అంటే చంద్రబాబు, రామోజీ కుటుంబాలే అన్నది బహిరంగ రహస్యం. కానీ తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడు పత్రిక ద్వారా దుష్ప్రచారం చేయడం చంద్రబాబు, రామోజీ కుటుంబాల మార్కు కుతంత్రం. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ జగన్‌ను ఆ కేసులో ప్రధాన నిందితుడు అని ఈనాడు పత్రిక ప్రచురించిన అసత్య కథనమే అందుకు తాజా తార్కాణం. -
జగన్ మీద విషం.. అడ్డంగా బుక్కైన ఈనాడు
కూటమి పాలనలో ఎల్లో మీడియా రెచ్చిపోతూనే ఉంది. తాజాగా.. టీడీపీ కరపత్రిక ఈనాడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి విషం చిమ్మింది. తీవ్ర ఆరోపణలు.. పచ్చి అబద్ధాలతో.. నిసిగ్గుగా ఓ కథనం ఇచ్చింది. ఈ క్రమంలో.. సంబంధం లేని అంశాలను జోడించి ప్రజల్లో అపోహలు కలిగించే తీవ్రంగా ప్రయత్నం చేసింది. లాయర్, ప్రముఖ వ్యాపారవేత్త అయిన సునీల్ రెడ్డిని మద్యం కేసులో సిట్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన కార్యాలయాల్లో సోదాల పేరుతో హైడ్రామా నడిపించింది. సోదా సమయంలో సిట్ సభ్యులు తమతో పాటు లోపలికి ఓ బ్యాగ్ తీసుకెళ్లడం, అలాగే ఓ ప్రైవేట్ వాహనం రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాహనంలో ఉన్న వస్తువులను కార్యాలయంలోకి చేరవేసి.. మద్యం కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారనే ఆ అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. ఒకవైపు తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్ నానాతిప్పలు పడుతుంటే.. మరోవైపు తప్పుడు కేసు కోసం ఈనాడు పచ్చి అబద్ధాలు రాస్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ పదవులు చేపట్టని సునీల్‌రెడ్డి అనే వ్యక్తిని.. జగన్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన కోసం డొల్ల కంపెనీలు సృష్టించారంటూ కథనాలు అచ్చేసింది. ఇక.. చంద్రబాబు విసిరే బిస్కెట్ల కోసం ఇంతకు ముందూ జగన్, వైఎస్సార్సీపీ నేతలపై పలు అవాస్తవ కథనాలు ప్రచురించింది. మార్గదర్శి అక్రమాలపై చంద్రబాబు విచారణ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాబు ప్రాపకం కోసం ఈనాడు బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తాజా కథనం కూడా బాబుకు అనుకూలంగా, జగన్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అల్లేసిందనేనని వైఎస్సార్సీపీ అంటోంది.మీడియా స్వేచ్ఛ అనే పదాన్ని ప్రత్యర్థులపై విషం చిమ్మేందుకు వేదికగా మార్చుకున్న ఈనాడు.. రాజకీయ అనుకూలత కోసం నిజాన్ని వక్రీకరించడంలో మరోసారి తన పాత్రను బహిరంగం చేసుకుందనే విమర్శ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. -
జనసేన గూండాల దాడి: గాయపడ్డ పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,తాడేపల్లి: జనసేన గూండాల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలు గిరిధర్ (ఆర్ఎంపీ డాక్టర్),సతీష్‌లకు.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్త అని సూచించారు. గతరాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు గిరిధర్,సతీష్‌లపై జనసేన గూండాలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వైఎస్సార్సీపీ కార్యాకర్తలపై దాడి గురించి సమాచారం అందుకున్న వైఎస్ జగన్ వారిని ఫోన్లో పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. తనని కులం పేరుతో దూషించి కొట్టారని, షాపును ధ్వంసం చేశారంటూ తనకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్‌కు సతీష్ చెప్పుకున్నారు. దాడిపై ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. దాడి ఘటన చాలా బాధ కలిగించింది. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం బాధాకరం. వాళ్లు చేయకూడని తప్పులు చేస్తున్నారు. మనకు టైం వస్తుంది.. మంచి జరుగుతుందని’వ్యాఖ్యానించారు. -
తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : వైఎస్సార్సీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతిపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం దిగ్శ్రాంతికి గురి చేసిందని, క్రమ శిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు.‘ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్. మా పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డిగారి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివి. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని,… pic.twitter.com/oypzFBZ9ui— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2025 కాగా, శుక్రవారం(సెప్టెంబర్ 12) మధ్యాహ్న సమయంలో తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. భాస్కర్ రెడ్డి మృతిపట్ల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన చిన్నాన్న భాస్కర్‌రెడ్డి మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారాయన. -
జగన్ ప్రభుత్వంలో ఈ కష్టాల్లేవ్: రైతులు
సాక్షి, కృష్ణా: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు ఎరువుల కొరత(Urea Crisis) అనే మాటే వినిపించలేదు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థ.. అదే అధికారులు ఉన్నా.. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందాతో నిస్సహాయంగా మిగిలిపోయారు. దీంతో రైతులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉయ్యూరు మండలం ముదునూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కొందరిని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌పై వాళ్లు దుమ్మెత్తిపోశారు. ‘‘అర్ధరాత్రి నుంచి సొసైటీ గేట్ ఎదురు పడిగాపులు కాస్తున్నాం. మొదటి కోట యూరియా ఇంకా వెయ్యలేదు. రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం చేయటం దుర్భరంగా మారింది.బ్లాక్‌లో యూరియా రూ.800 పైగా అమ్ముతున్నారు. 10 ఎకరాలకు 2 కట్టలు ఇస్తున్నారు. యూరియా కోసం ఇంతకు ముందెప్పుడూ రోడ్లపైకి ఎప్పుడు రాలేదు. జగన్ ప్రభుత్వంలోనూ ఈ పరిస్థితి లేదు. సకాలంలో ఎరువులు, పంట సాయం అందేవి. ఇప్పుడు యూరియా వాడితే చంద్రబాబు క్యాన్సర్ వచ్చింది అంటున్నాడు. చంద్రబాబుకు రైతులు అంటే అంత చులకన?. ఇకనైనా ప్రభుత్వం రైతును ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న అవస్థలపై తాజాగా ప్రెస్మీట్లో కూటమి సర్కార్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Press Meet On Urea Troubles) చురకలంటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ యూరియా కొరత రాలేదు. అధికారులు కూడా రైతుల పక్షాన ఉండేవారు. ఇప్పుడు మాత్రం యూరియాను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించి, రూ. 250 కోట్ల స్కాం చేశారు. రైతులు బారులు తీరుతున్నారు, కానీ అధికార పార్టీ క్యాడర్‌కు మాత్రం యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. MSP (మద్దతు ధర) కూడా ఇవ్వకుండా, రైతులను ఆత్మహత్యల దిశగా నెట్టుతున్నారు. మేము తిరిగి అధికారంలోకి వస్తే, ఈ దందా అంతా బయటపెడతాం. రైతులకు న్యాయం చేస్తాం అని అన్నారాయన. గత వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాల) ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో అదే అధికారులు ఉండి, అదే వ్యవస్థ ఉండి.. అప్పుడు లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? అని చంద్రబాబును నిలదీశారాయన. ఇదీ చదవండి: ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్ -
నాపై నమ్మకముంచి ఈ పదవి ఇచ్చిన జగనన్నకు నా ధన్యవాదాలు
-
హిట్టా? ఫట్టా.. ప్రజలకు తెలుసులే బాబు!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు విచిత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూండటం, సూపర్ సిక్స్ హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై జగన్ విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అదే రోజు ఇంకో సమావేశంలో చంద్రబాబు యథాప్రకారం జగన్ దూషణకు పరిమితమయ్యారు. జగన్ సంధించిన నిర్దిష్ట ప్రశ్నలు ఒక్కదానికి కూడా నేరుగా చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. కూటమి అట్టర్ ఫ్లాఫ్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలా అన్న జగన్ ప్రశ్న వాస్తవానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే.. సూపర్‌సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో జరిపిన హడావుడికి చాలాచోట్ల నుంచి ప్రజలను బలవంతంగా తీసుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. స్కీములు కావాలంటే సభకు రావాల్సిందేనని కొన్ని గ్రామాల్లో చాటింపు వేశారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కొందరు అధికారులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు, ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారు సభకు రాకపోతే రూ.200 జరిమానా పడుతుందని హెచ్చరించారట. ఇక వేల ఆర్టీసీ బస్సులతో జనాన్ని బలవంతంగా తరలించారు. ఈ నేపథ్యంలోనే జగన్ బలవంతపు విజయోత్సవాలు అన్న వ్యాఖ్య అర్ధవంతంగానే ఉందనిపిస్తుంంది. బలవంతపు విజయోత్సవాలు అనేదానికి.. చంద్రబాబు దీనిపై ఎక్కడా స్పందించలేదు. సూపర్ సిక్స్ హిట్ అయినందుకే జనం తరలి వచ్చారన్నట్లుగా బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. సూపర్ సిక్స్ హిట్ అయిందా? లేదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించినప్పుడు జనం ననుంచి పెద్దగా స్పందన రాలేదు. చప్పట్లు కొట్టాలని ఒకటి రెండుసార్లు సార్లు ఆయనే అడిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 👉చంద్రబాబు చేసిన మోసాలు ఇవి అంటూ జగన్ కొన్ని అంశాలను ఉదహరించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా చంద్రబాబూ అని ఆయన అడిగారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోయారు. 👉నిరుద్యోగ యువతకు నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలి కదా! రెండేళ్లకు రూ.72 వేలు బాకీ పడుతున్నావు కదా? అని జగన్ వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమే లేదు. 👉సూపర్ సిక్స్‌తోపాటు టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉన్న ఇతర హామీల మాటేమిటి అని అంటూ ఏభై ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారికి నెలకు రూ.నాలుగు వేల ఫించన్ ఇస్తానన్న వాగ్ధానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదన్న జగన్ వ్యాఖ్యకు చంద్రబాబు నుంచి బదులు లేదు. 👉వృద్ధాప్య ఫించన్‌లో సుమారు 5 లక్షల మందికి కోత పెట్టారని జగన్ చేసిన ఆరోపణపైన చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయారు. సూపర్ సిక్స్ కు సంబంధించి ఎన్నికల ముందు టీడీపీ మీడియాలో ఇచ్చిన ప్రకటనల్లోని అంశాలకు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఇస్తున్న ప్రచార ప్రకటనలలోని తేడాలను చూపించి జగన్ కూటమిని నిలదీశారు. ఆడబిడ్డ నిధి, ఏభై ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను ఇప్పుడు హామీల ప్రచార ప్రకటన నుంచి తొలగించడాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు ఆడతారని అంటూ, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు, ఇప్పుడు చెబుతున్న మాటలతో పోల్చి జగన్ ఆధారసహితంగా విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు ఇచ్చారని, మెహరాజ్ బేగం షేక్ అనే ఆమె కుటుంబానికి 2024 జూన్ నుంచి వివిధ స్కీముల కింద రూ.3.34 లక్షల ఆర్థిక సాయం అందుతుందని చంద్రబాబు సంతకం చేసి ఇచ్చిన బాండ్ ఉందని, ఆ మేరకు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ఇవ్వకపోవడం జనాన్ని మోసం చేయడం కాదా? అని నిలదీశారు. తల్లికి వందనం స్కీమ్ లో కోతలు పెట్టడం, వంట గ్యాస్ సిలిండర్లు గత ఏడాది ఒకటే ఇవ్వడం, ఈ ఏడాది ఇంకా ఇవ్వకపోవడం మొదలైన విషయాలను లేవనెత్తారు. చంద్రబాబు మాత్రం ఈ స్కీములను కొన్నిటిని ప్రస్తావిస్తూ అవన్ని అమలు చేసేసినట్లు, సూపర్ హిట్ అయిపోయినట్లు ప్రజలలో భ్రాంతి కల్పించే యత్నం చేశారు. ఉదాహరణకు అన్నా క్యాంటిన్లలో 5.60 కోట్ల మంది భోజనం చేశారని ఆయన అన్నారు. అవి కాకిలెక్కల్లా కనిపిస్తున్నాయన్నది పలువురి భావన. అయినా అది అమలు చేశారని అనుకున్నా, మిగిలినవాటి సంగతేమిటి? తల్లికి వందనం లో రూ.15 వేలు ఇస్తానని ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది రూ.13 వేలు చొప్పునే ఇచ్చింది వాస్తవమా? కాదా? అందులోను చాలామందికి కోత పడిందా? లేదా? అన్న జగన్ ప్రశ్నకు జవాబు రాలేదు. ఉచిత బస్సు గురించి మీరు ఇచ్చిన హామీ ఏమిటి? ఎక్కడికైనా రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ఆర్టిసి బస్ ప్రయాణం చేయవచ్చని చెప్పారా?లేదా? అని అంటూ, అప్పట్లో చంద్రబాబు దానికి సంబందించి చేసిన ప్రసంగం క్లిప్పింగ్ ను కూడా జగన్ చూపించారు. ఆ విషయానికి చంద్రబాబు బదులు ఇవ్వకుండా, ఫ్రీ బస్ హిట్ అయిందని, ఐదు కోట్ల మంది ప్రయాణాలు చేసేశారని సభలో తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు కేవలం కూటమి ప్రభుత్వమే రైతులకు ఇస్తుందని ఎన్నికలకు ముదు హామీ ఇచ్చి ,ఒక ఏడాది ఇవ్వకుండా, ఈ ఏడాది రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చింది నిజం కాదా అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సమాధానం రాలేదు. తొలివిడతలో రూ.ఏడు వేలు ఇచ్చామని సభలో చెప్పారు. మరి హామీ నెరవేర్చినట్లు అవుతుందా? అందువల్ల ఇది హిట్టా? ఫట్టా అని అంటే ఫట్ కాకపోయినా, రైతులను మోసం చేసినట్లే అవుతుందన్న విశ్లేషణ వస్తుంది. ఇక మెడికల్ కాలేజీల గురించి జగన్ మాట్లాడుతూ తమ హయాంలో 17 కాలేజీలు తెచ్చిన వైనం, అందులో కొన్నిటిని పూర్తి చేసిన సంగతి చెప్పారు. సంబంధిత కాలేజీల భవనాలు,క్లాస్ రూమ్‌ల ఫోటోలను ,వీడియో క్లిప్పింగ్ లను కూడా ఆయన చూపించారు. ఈ అంశంలో చంద్రబాబు ఏకంగా అబద్దం చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీనే ఈ మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పేశారు. కాలేజీలకు భూమి ఇచ్చి శంకుస్థాపన చేస్తే సరిపోతుందా? అని మరోసారి అన్నారు. అయితే సమాచార శాఖ మంత్రి పార్థసారథి క్యాబినెట్ సమావేశం తర్వాత గత ప్రభుత్వం 17 కాలేజీలను కేంద్రం ద్వారా తీసుకు వచ్చిందని వెల్లడించి, అందులో ఏడు పూర్తి అయ్యాయని, పదింటిని పీపీపీ పద్దతిలోకి మార్చుతున్నామని చెప్పారు. ఈ వీడియో క్లిప్పింగ్‌ను ,చంద్రబాబు అనంత సభలో చెప్పిన అబద్దాన్ని కలిపి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఇలా అసత్యాలు కాకుండా, జగన్ ప్రభుత్వం వీటిని తెచ్చిందని, వాటిని ఎందువల్ల తాము పిపిపి మోడల్ గా మార్చుతున్నామో వివరించి ఉంటే గౌరవంగా ఉండేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం ఏభై సీట్లు ఇస్తే, తమకు వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దుర్మార్గం కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడనే లేదు. యూరియా కొరత లేదని తొలుత కొన్నాళ్లపాటు డబాయించిన చంద్రబాబుఈ సభలో మాత్రం యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పడం గమనించదగ్గ విషయమే. ఏది ఏమైనా జగన్ తనదైన శైలిలో పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే , వాటికి చంద్రబాబు జవాబులు ఇవ్వలేకపోయారు.తమ సూపర్ సిక్స్ హిట్ కాదని కూటమి నేతలకు కూడా తెలుసు. ప్రజలలో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు అనంతపురంలో సూపర్ హిట్ అంటూ సభ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు కామన్ మ్యాన్ కాదు కార్పొరేట్ మ్యాన్
సాక్షి, అనకాపల్లి: ‘‘సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్’’ అంటూ అనంతపురంలో నిర్వహించిన సభలో చంద్రబాబు చెప్పుకొన్నట్లు సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు.. కేపిటలిస్ట్ మ్యాన్ (పెట్టుబడిదారీ మనిషి), కార్పొరేట్ మ్యాన్.. ఆయన ఆ వర్గాలకే వత్తాసు పలుకుతారు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తయిన, సగానికి పైగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ కుట్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు తమ నాయకుడు వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ హయాంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో సగానికిపైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీని గురువారం వైఎస్సార్సీపీ నేతలు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, ఏరువాక సత్యారావు, తదితరులతో కలిసి అమర్నాథ్ పరిశీలించారు. వేరొకరి పనికి క్రెడిట్ తీసుకోవడం బాబు నైజం ‘‘కూటమి ప్రభుత్వం 15 నెలల్లో రూ.1.95 లక్షల కోట్లు అప్పు చేసింది. వీటిలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించినా... కూటమి ప్రభుత్వం తమకి అవసరం లేదంటూ అత్యంత అన్యాయంగా లేఖ రాసింది. అయినా అనంతపురం సభలో మెడికల్ కాలేజీలు తానే తీసుకొచ్చానని చంద్రబాబు చెప్పుకొంటున్నారు. ఎవరో చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం ఆయనకు బాగా అలవాటు’’ అని అమర్నాథ్ విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా నియంత కిమ్ తరహాలో ఆంధ్రాలో పాలన సాగిస్తున్న లోకేశ్ ఆంధ్రా కిమ్ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే వైద్యరంగంలో సంస్కరణలు ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించి రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని అమర్నాథ్ తెలిపారు. ‘‘ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని, ఒక్కో మెడికల్ కాలేజీకి సుమారు రూ.500 కోట్లు వెచ్చించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. విజయనగరం, మచిలీపట్నం సహా ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు నడుస్తున్నాయి. 150 చొప్పున 750 మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో 2022 డిసెంబరు 30న అప్పటి సీఎం వైఎస్ జగన్ మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మెడికల్ కాలేజీ మూడు, ఆసుపత్రి రెండు అంతస్థులు నిర్మాణం పూర్తయ్యాయి. హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. కూటమి సర్కారు వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’’ అని విమర్శించారు. -
‘బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమే’
తాడేపల్లి : బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 11) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీసీ విభాగం అధ్యక్షుడు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెండ్ నౌడు వెంకట రమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకం రెడ్డి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆలూరు సాంబ శివారెడ్డి సహా బీసీ కులాల సాధికర అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మేరకు మాట్లాడిన సజ్జల ఏమన్నారంటే.. ‘ బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమే. అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పోరేషన్లు సైతం ఏర్పాటు చేయించారు. ఒక సమగ్ర విధానం ద్వారా బీసీలందరికీ అభివృద్ధి ఫలాలను అందించారుబీసీలందరినీ చైతన్య పరిచి మళ్లీ ఏకతాటి మీదకు తీసుకు రావాలి. మన హయాంలో జరిగిన అభివృద్ధిని అందరికీ వివరించాలి. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై విసుగు చెందారు. టీడీపీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలి’ అని సూచించారు. -
లోకేశ్‌ను ఆ ఒక్క ప్రశ్న అడిగి ఉండాల్సింది!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ తాజాగా ఒక వ్యాఖ్య చేశారు. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదట. కావాలనుకుంటే జగన్‌ను ఎప్పుడో జైలుకు పంపి ఉండేవారట!. జాతీయ టీవీ చానల్ ఏర్పాటు చేసిన సదస్సులో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలలో ఎంతవరకు నిజం ఉందన్నది చర్చనీయాంశం. ఒక్కసారి రెండేళ్లు వెనక్కు వెళదాం.. ..అప్పట్లో లోకేశ్ ప్రతిపక్ష పార్టీ నేత. రాష్ట్రమంతటా యువగళం పేరుతో పడుతూ లేస్తూ ఓ యాత్ర లాంటిది చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని గ్రామాలను చుట్టేసి వచ్చారు కానీ.. తనతోపాటు ఓ ఎర్రటి పుస్తకాన్ని మోసుకెళ్లారాయన. జేబులో ఉంచుకున్నాడా? లేదు.. ఎక్కడికక్కడ సమావేశాల్లో పైకెత్తి అందరికీ చూపించాడు. శత్రువుల జాబితా సిద్ధం చేస్తున్నాని.. వాళ్ల భరతం పడతానని సవాళ్లూ విసిరారు. ఈ క్రమంలో బట్టలిప్పిస్తానని.. అదని ఇదనీ అవాకులు, చెవాకులు చాలానే మాట్లాడారులెండి. ఎన్నికలొచ్చాయి. సూపర్ సిక్స్‌ను నమ్మారో.. ఈవీఎంల గందరగోళమో తెలియదు కానీ..జాతీయ స్థాయి విశ్లేషకులు, ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ తెలుగుదేశం, జనసేన బీజేపీల కూటమి అధికారంలోకైతే వచ్చింది. రాష్ట్రంలో అరాచకానికి, అవ్యవస్థకు నాందీ పడింది కూడా అప్పుడే!.. .. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయో లేదో రెడ్‌బుక్ పేరుతో టీడీపీ రాజ్యాంగం మొదలైంది. ఒకట్రెండు చోట్ల హోర్డింగ్‌లు పెట్టిమరీ తాము వైసీపీ వారిపై కక్ష తీర్చుకోబోతున్నామని ప్రకటించారు కూడా. అందుకు తగ్గట్టుగానే టీడీసీ కార్యకర్తలు వైసీపీ వారి ఇళ్లపై, ఆస్తులపై విరుచుకుపడ్డారు. దాడులు చేశారు. పల్నాడు ప్రాంతంలో కొంతమంది వైసీపీ నేతలు వీరి ఆగడాలను తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. తప్పుడు కేసుల బనాయింపు, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కొత్త కేసు పెట్టడం వంటి కొత్త కొత్త మార్గాలు సృష్టించి మరీ అమలు చేశారు టీడీపీ పెద్దలు. కొందరిని సుదూర ప్రాంతాలలోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి నరకయాతన పెట్టారు. వైసీపీ నేతలపై అక్రమ కేసు బనాయించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చిందంటే ఏపీలో కక్ష రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని దూషించిన టీడీపీ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనం. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలను వేధించినా కేసులే కట్టరు. ఇతర అరాచకాల సంగతి సరేసరి. నేతల పరిస్థితి ఇలా ఉంటే.. సోషల్ మీడియా వారినైతే దారుణంగా హింసించే విధంగా అక్రమ అరెస్టులు సాగించారు. అదే టీడీపీ, జనసేనలకు చెందిన వారు హింసకు పాల్పడినా, అరాచక పోస్టులు పెట్టినా చూడనట్టు వ్యవహరించడం ఇంకో విచిత్రం. నామ్ కా వాస్తే ఒకటి, అరా కేసులు పెట్టినా అవి తూతూ మంత్రం కేసులే. పోలీసు రాజ్యం ఎలా నడపాలో, కక్షలు ఎలా తీర్చుకోవాలో భవిష్యత్తు ప్రభుత్వాలకు కూటమి సర్కార్ తీరు మార్గదర్శకం అయ్యే ప్రమాదం కనిపిస్తుంది.చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఏ రకంగా దూషించారో అందరికి తెలుసు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి, అధికారుల పేర్లు కూడా రెడ్‌బుక్ లో రాస్తున్నామని బెదిరిస్తూ లోకేశ్ ప్రచారం చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ఇంత ఘోరంగా లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మీద చంద్రబాబు పట్టు ఏమీ లేదని, మొత్తం కథ లోకేశే నడిపిస్తున్నారని, పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు ఇస్తూ ఎవరెవరిని హింసించాలో సూచిస్తుంటారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అక్కడక్కడా తిరుగుతూ ప్రసంగాలకే పరిమితం అవుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలన్నిటిని లోకేశ్ హాండిల్ చేస్తున్నారని అంటున్నారు. దానికి తగినట్లే లోకేశ్ ప్రధాని హోం మంత్రులను కలిశారు. జాతీయ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రభుత్వ విధానాలపైన, అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక పద్దతిగా వ్యవహరించవలసిన లోకేశ్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ అసత్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది విమర్శ.. .. రాజ్‌దీప్ సర్దేశాయి నిర్వహించిన సమావేశలో చంద్రబాబును జగన్ జైలులో పెట్టారు కాబట్టి జగన్‌ను జైలుకు పంపుతారా అన్న ప్రశ్నకు లోకేశ్ జవాబిస్తూ, 'అది మా ఎజెండా కాదు. చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. మా ప్రాధాన్యం ఏపీ అభివృద్ది. చట్టాన్ని ఉల్లంఘిస్తే నాతోపాటు ఎవరైనా దాని పర్యవసానం అనుభవించాల్సిందే. నేను తప్పు చేసినా మా నాన్న నన్ను జైలుకు పంపుతారు. మరో ఆలోచన లేదు" అని లోకేష్ చెప్పారట. ఈ వ్యాఖ్యలలో నిజమెంత అన్నది ఆయన ఆత్మకు స్పష్టంగా తెలుసు. కావాలంటే జగన్‌ను ఎప్పుడో జైలుకు పంపేవాళ్లమన్నది అహంభావంతో కూడిన సమాధానం కాక మరేమిటని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. జగన్‌పై కక్షతోనే లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి పలువురిని జైలుపాలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ కేసులో జగన్‌ను కూడా జైలుకు పంపించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజూ తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. దీనిని ప్రతీకార రాజకీయం అనరా? రాజ్ దీప్ సర్దేశాయికు ఏపీలో ఏమి జరుగుతున్నదో తెలియకపోవచ్చు. లోకేశ్ జవాబు విన్నవెంటనే మరి రెడ్‌బుక్ మాటేమిటి అని ప్రశ్నించి ఉండాల్సింది..!! కొద్ది రోజుల క్రితం కడపలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ తాను ఏదీ మర్చిపోలేదని, తన తండ్రిని 53 రోజులు అక్రమంగా నిర్భంధిస్తే కుమారుడిగా మర్చిపోతానా? తప్పు చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది అని లోకేశ్ చెప్పారు. నిజానికి లోకేశ్ ప్రస్తుతానికి మంత్రి మాత్రమే. కాకపోతే సకల శాఖల మంత్రిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది ప్రశ్న. మిగిలిన మంత్రులను డమ్మీలుగా మార్చారా?లోకేశ్ చెప్పే దానినే పరిగణనలోకి తీసుకుంటే తండ్రి మీద వచ్చిన కేసులను నీరు కార్చకుండా చట్టం తన పని తాను చేసుకుపోయేలా వ్యవహరించే ధైర్యం ఉందా? అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా ప్రతీకార రాజకీయాలు, రెడ్‌బుక్ గోల మానుకుని, హుందాగా నడిస్తే మంచిది. లేకుంటే ఆయన ప్రత్యర్థులపై వేస్తున్న ఉచ్చులో తానే పడిపోయే అవకాశం ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
YS జగన్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పు చంద్రబాబు
-
ప్రజలు కష్టాల్లో ఉంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు సంబరాలా..?
-
చంద్రబాబు సర్కార్ సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, చంద్రబాబు ముఠా ఆదాయం పెరుగుతోంది... వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
Big Question: మోసగాళ్ల బండారం బయటపెట్టిన జగన్
-
భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు
సాక్షి, అమరావతి : ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ (భావ ప్రకటనా స్వేచ్ఛ) అందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ హక్కుకు ఎవరూ విఘాతం కల్పించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందించారు. సోషల్ మీడియా అంశం రాష్ట్ర పరిధిలో లేదని గుర్తు చేశారు. అది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నందున దాన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో ఆ చట్టం (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్–2000)లోని సెక్షన్–66–ఏ కు కేంద్రం ఒక సవరణ చేస్తే.. దాన్ని సుప్రీంకోర్టులో శ్రేయ సింఘాల్ సవాల్ చేశారని గుర్తు చేశారు. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. ఆ సవరణ వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ లోని భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు అని స్పష్టం చేసిందని వివరించారు. అసెంబ్లీలో తగినంత సమయం ఇస్తేనే ప్రజా సమస్యలు ప్రస్తావించగలుగుతామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘అసెంబ్లీలో ఉన్నది ఒకటే ప్రతిపక్షం. అది మాదే. అయినా మాకు ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. ఆయనకు అది ఇష్టం లేదు. అందుకు కారణం ప్రజల సమస్యలు కనిపించకూడదు.. ప్రజల గొంతు వినిపించకూడదు అనేదే ఆయన ఉద్దేశం’ అంటూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘మమ్మల్ని ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించడం లేదన్న దానిపై హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. దానికి ఇప్పటికీ స్పీకర్ సమాధానం చెప్పడం లేదు’ అంటూ గుర్తు చేశారు.కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరగాలిస్థానిక ఎన్నికల్లో అక్రమాలకు ఈవీఎంలు పరిష్కారం కాదని.. మొన్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో చూశామని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల ద్వారా రిగ్గింగ్ చేయించిందని ఎత్తి చూపారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక సంస్థలు నిర్వహిస్తేనే పారదర్శకంగా జరుగుతాయని పునరుద్ఘాటించారు. ‘యూరియా కొరత వల్ల రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. అసలు ప్రభుత్వానికి ప్రణాళిక ఉందా? ఖరీఫ్‌లో పంట చేలకు ఎన్నిసార్లు, ఎంత యూరియా వేస్తారో తెలియదు.. కనీసం దాన్నయిన అచ్చెన్నాయుడును తెలుసుకోమనండి’ అంటూ మరో ప్రశ్నకు బదులిచ్చారు. ‘తురకపాలెంలో వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం ఏ విషయమూ స్పష్టంగా చెప్పడం లేదు. నేను ఎక్కడికైనా వెళ్తానంటే అర్థం లేని విమర్శలు చేస్తూ నిందలు వేస్తున్నారు. అందుకే అక్కడ ఏం జరిగిందనేది స్పష్టంగా తేలితే నేను వెళ్తాను’ అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. -
మోసాలు, అబద్ధాలతో.. అట్టర్‌ఫ్లాప్ సినిమాకు 'బలవంతపు విజయోత్సవాలా'?: వైఎస్ జగన్
ఈ రోజు (బుధవారం) ఈనాడులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెలనెలా రూ.1500.. ఏడాదికి రూ.18 వేలు హామీ మాయమైంది. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఎగిరిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటనలకు.. ఇప్పుడిచ్చిన ప్రకటనలకు పొంతనే లేదు. చంద్రబాబు మాదిరిగా కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ప్రపంచంలో మరొకరు ఉంటారా? వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా, ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం, అగచాట్లు పడటం చూశారా? ఇప్పుడే ఎందుకిలా జరుగుతోంది? అప్పుడు, ఇప్పుడు అదే ముఖ్యమంత్రి పదవే. అప్పుడున్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు. కానీ అప్పుడు ఈ దుస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు సీఎంగా జగన్ ఉన్నాడు. జగన్ అనే వ్యక్తికి రైతులు కష్టాలు పడకూడదు అనే తపన, తాపత్రయం ఉంది. రైతులకు మంచి చేయాలి అనే ఆలోచనలు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అదే అప్పటికీ, ఇప్పటికీ తేడా. –మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్.. సినిమా అట్టర్ ఫ్లాప్ అని ప్రజలందరికీ అర్థమైంది. ఇలాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాకు అనంతపురంలో బలవంతపు విజయోత్సవాలు చేస్తున్నారు’ అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక వైపు దారుణమైన పాలన సాగిస్తూ, మరో వైపు మోసం చేస్తూ హామీలన్నీ ఎగ్గొడుతున్నారంటూ ఎత్తిచూపారు. కళ్లార్పకుండా జంకు బొంకు లేకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు అత్యంత నేర్పరి అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు చేసిన మోసాలు, చెప్పిన అబద్ధాలు, పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్టుగా చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో బలవంతపు సంబరాలు చేసుకుంటున్నారని ఏకి పారేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలపై ‘ఈనాడు’లో ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ (ప్రకటన)ను.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం సంచికలో ఇచ్చిన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను చూపిస్తూ.. వాటిలో ఎగ్గొట్టిన హామీలను ఎత్తిచూపుతూ.. చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతారో, ఏ స్థాయిలో మోసం చేస్తారో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమేనంటూ తూర్పారబట్టారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలపై చంద్రబాబు మాట్లాడిన మాటల వీడియోలు, ఆ హామీల అమలు వల్ల ఒనగూరే ప్రయోజనంపై ఇంటింటికీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇచ్చిన బాండ్లను, ఇప్పుడు ఆ హామీల అమలు తీరును ఎత్తిచూపుతూ చంద్రబాబు మోసాలను సాక్ష్యాధారాలతో వివరించారు. సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ఆరోగ్యశ్రీకి మంగళం పాడటం.. యూరియా, ఇతర ఎరువులు దొరక్క రైతుల కష్టాలు.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక పోవడం, ఉచిత పంటల బీమాను ఎగ్గొట్టడంపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా నాణేనికి ఒక వైపు మాత్రమే చెబుతోందని.. మరో వైపు ఏం జరుగుతోందో ప్రజలకు వివరించడానికే మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రపంచంలో చంద్రబాబులా అబద్ధాలు చెప్పగలిగే నైపుణ్యం ఎవరికైనా ఉందా?⇒ చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో, ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్పై ఎన్నికలకు ముందు 2024 మే 9న ఈనాడులో ఇచ్చిన ప్రకటనలో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి.. స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం, ప్రతి ఇంటికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ఆ ప్రకటనలో ప్రచారం చేశారు. ⇒ ఈ రోజు (బుధవారం) అదే ఈనాడులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెలనెలా రూ.1500.. ఏడాదికి రూ.18 వేలు హామీ మాయమైంది. ఆ స్థానంలోకి 204 అన్న క్యాంటీన్లు వచ్చాయి. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఎగిరిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటనలకు.. ఇప్పుడిచ్చిన ప్రకటనలకు పొంతనే లేదు. చంద్రబాబు మాదిరిగా కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ప్రపంచంలో మరొకరు ఉంటారా? అన్న క్యాంటీన్లు సూపర్ సిక్స్ హామీల్లో గతంలో ఇచ్చినట్టు మనం అనుకోవాలట! ⇒ ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల ప్రకటనతో మోసం చేయడమే కాకుండా ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. ప్రతి ఫోన్‌కు మెసేజ్ పంపించారు. అందులో ముందుగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో బటన్ నొక్కితే ఆ కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాల వల్ల ఒనగూరే ప్రయోజనం ఎంత అన్నది వస్తుంది. మెహరాజ్ బేగం షేక్‌కు ఇచ్చిన బాండుకు సంబంధించి బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీలో మీ నమోదు సంఖ్య ఇది.. మీ సంక్షేమ వివరాలకు బటన్ నొక్కండి.. అని ఉంది. మెహరాజ్ బేగం షేక్ యూనిక్ కోడ్.. వయసు, లింగం, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యుల వివరాలు వచ్చాయి. వారికి ఆడబిడ్డ నిధి కింద రూ.1,500.. అంటే ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నందున ఏటా రూ.36 వేలు, తల్లికి వందనం రూ.15 వేలు చొప్పున ఇద్దరికి రూ.30 వేలు, అన్నదాత సుఖీభవ కింద రైతులు లేరు కాబట్టి సున్నా.. యువగళం కింద ఎవరూ లేరు కాబట్టి సున్నా.. అని పెట్టారు. మొత్తంగా ఆ కుటుంబంలో రూ.3.33 లక్షలు లబ్ధి పొందేందుకు అర్హత సాధించారని.. 2024 జూన్ నుంచి ఈ మొత్తం వారి అకౌంట్లలో జమ చేయడం ప్రారంభమవుతుందని గ్యారంటీ ఇస్తూ.. వాటిని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని ప్రమాణం చేస్తూ బాబు సంతకం చేసి మరీ ఇచ్చారు. ఇలా ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ⇒ టీడీపీ, జనసేన కూటమి సంయుక్తంగా ఓ వైపు చంద్రబాబు ఫొటో.. మరో వైపు పవన్ కళ్యాణ్ ఫొటో ముద్రించిన బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో కూటమి నేతలు ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ⇒ టీడీపీ కూటమి నేతలు ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లలు కన్పిస్తే నీకు రూ.15 వేలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు కనపడితే నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు.. చిన్నపిల్లల అమ్మమ్మలు కనిపిస్తే మీ వయసు 50 ఏళ్లు కాబట్టి మీకు రూ.48 వేలు, 20 ఏళ్ల పిల్లోడు బయటకొస్తే నీకు రూ.36 వేలు, రైతు కనిపిస్తే పీఎం కిసాన్ కింద ఇచ్చేది కాక అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇస్తూ బాండ్లు ఇచ్చారు. ఇంటిలో ఎవరు కనపడితే వాళ్లకు ప్రతి ఒక్కరికీ బాండ్లు చూపించి మోసం చేశారు.నాడు చంద్రబాబు ఏమన్నారో వినండి⇒ ‘ఒకటే హామీ ఇస్తున్నా. జగన్మోహన్రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా’ ⇒ ‘రైతులకు సంవత్సరానికి ఇప్పుడిచ్చేది కాకుండా రూ.20 వేలు ఇస్తాం. దీనిని టీడీపీలో నిర్ణయించాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు.. ఆంక్షలు లేవు.. కటింగ్‌లు లేవు. పూర్తిగా మా ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత మాది’. ⇒ ‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని.. సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే.. ఒక్కటే చెప్పండి.. మా చంద్రన్న చెప్పాడు.. నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వు ఏమీ అడగడానికి వీలులేదు. ఇది చంద్రన్న నాకిచ్చిన హక్కు అని గట్టిగా చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు’. ⇒ ‘నా ఆడ బిడ్డల కష్టాలు చూసి ఆలోచించా. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఆలోచించా. మీ ఖర్చులు పెరిగాయి. దుర్మార్గుడు దీపం ఆర్పేస్తున్నాడు. అందుకే మళ్లీ దీపం వెలిగిస్తా. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా’. ⇒ ‘ప్రతి ఒక్క మహిళను మహా శక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలని నా ఆలోచన. అందుకే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 నేరుగా మీ అకౌంట్లో వేస్తాం’. ⇒ ‘ఇప్పుడు హామీ ఇస్తున్నా.. ఏపీలోని యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాం. ఇక్కడికి పరిశ్రమలు తెస్తాం. ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీది. అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం. ఎంత తమ్ముళ్లూ.. ఎంత.. రూ.3 వేలు ఇస్తాం’.చంద్రబాబూ.. ఇవన్నీ మోసాలు కావా?⇒ ఈ రోజు (బుధవారం) అనంతపురంలో సూపర్‌హిట్ పేరుతో సభ పెట్టావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను.. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా? ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ పడ్డావు. ఇది మోసం కాదా? ⇒ నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ పడ్డావు. అవి ఇవ్వక పోవడం మోసం కాదా? అది నీ సూపర్‌సిక్స్ హామీ కాదా? ⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా? పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈ నెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?. ⇒ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా బస్సుల్లో ఫ్రీ (ఉచితం) అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతివ్వడం మోసం కాదా?⇒ ప్రతి ఇంటికీ ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ (ఉచితం) అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గాను, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా? ⇒ పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?⇒ తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి కోతలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏడాదికి రూ.15 వేలు ఇస్తానన్నావు. తొలి ఏడాది రూ.15 వేలు ఎగ్గొట్టావు. రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టావు. మిగిలిన వారికి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా? ⇒ గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యా దీవెన, వసతి దీవెన, పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ రద్దు చేశావు. ఇది మోసం కాదా?యథేచ్ఛగా దోపిడీతో సంపద పెంచుకుంటున్న చంద్రబాబు ముఠా⇒ ఇసుకతో పాటు లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కళ్లెదుటే దోచుకుంటోంది. ప్రతి గ్రామంలోనూ బెల్ట్‌షాపులు వెలిశాయి. అనధికారిక పర్మిట్ రూములు నడుస్తున్నాయి. అక్కడ ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్ , లేటరైట్ ఇలా అన్ని వనరులను మింగేస్తూ చంద్రబాబు ముఠా సొంత సంపదను పెంచుకుంటోంది. ⇒ అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. నిజానికి చదరపు అడుగు రూ.4500తో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో ఫైవ్ స్టార్ వసతులతో లగ్జరీ నిర్మాణాలు చేయొచ్చు. కానీ.. రాజధాని అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.పది వేలు వెచ్చిస్తూ దోచుకుంటున్నారు. ⇒ ఇంకా శనక్కాయలు, పప్పు బెల్లాలకు ఇష్టం వచ్చినట్లుగా లూలూ ఉల్లూ.. ఉర్సా బర్సా.. అంటూ ఇష్టం వచ్చినోళ్లకు చంద్రబాబు భూములు పంచి పెడుతున్నారు. కుడి, ఎడమల దోపిడీ సాగిస్తున్నారు. రాష్ట్రంలో దోపిడీకి పరాకాష్ట 17 మెడికల్ కాలేజీలను స్కామ్‌లకు పాల్పడుతూ అమ్మేయడం. ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుతోంటే.. మరోవైపు చంద్రబాబు ఆదాయం, ఆయన అనుయాయుల సంపద పెరుగుతోంది. చంద్రబాబు ముఠా దోచేస్తోంది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది.రికార్డు స్థాయిలో అప్పు.. అది ఎవరి జేబులోకి వెళ్తోంది? ⇒ 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇది ఎవరి జేబులోకి పోతోంది? ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే లేవు. ⇒ 2014లో రాష్ట్రం విడిపోయే నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన, ఇవ్వని అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.1,40,717 కోట్లు.. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఆ అప్పు ఏకంగా రూ.3,90,247 కోట్లకు చేరింది. అంటే 2014–19 మధ్య రూ.2,49,350 కోట్ల అప్పు చేశారు. ఏటా అప్పుల్లో వార్షిక సగటు వృద్ధి రేటు (సీఏజీఆర్) 22.63 శాతం.⇒ మా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు రూ.3,90,247 కోట్లు కాగా, గత ఏడాది మేము దిగిపోయే నాటికి ఆ మొత్తం రూ.7,21,918 కోట్లకు చేరుకుంది. అంటే మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. ఏటా అప్పుల సగటు పెరుగుదల (సీఏజీఆర్) 13.57 శాతం మాత్రమే.⇒ మా ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో మేము చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. అంటే మేము ఐదేళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం చంద్రబాబు కేవలం ఈ 15 నెలల్లోనే చేశారు. ⇒ రికార్డు స్థాయిలో అప్పు చేసినా, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ⇒ మా ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. మరి అప్పుగా తెచ్చిన రూ.1,91,361 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో చంద్రబాబు ముఠా జేబులోకి వెళ్లాయి. -
మేం రాగానే..ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్ కాలేజీలు
‘‘మా హయాంలో కొత్త మెడికల్ కాలేజీలే కాకుండా దాదాపు రూ.100 కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాశ్వత పరిష్కారం చూపాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. నాడు ృ నేడు కింద జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అభివృద్ధి, ఆధునికీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశాం’’ ‘‘ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా బస్సులు.. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే.. ఇవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకుంటే పేద, మధ్య తరగతివారు ప్రైవేట్ దోపిడీకి బలైపోతారు. ఆ దోపిడీకి చెక్ పెట్టడంతో పాటు ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’’‘‘చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడంటే.. పులివెందుల నూతన మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి ఎన్ఎంసీ గతేడాది అనుమతులిస్తే, ఆ సీట్లు మాకు వద్దంటూ ఆయన లేఖ రాశాడు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉన్నాడా? అంతుచిక్కని వ్యాధితో 43 మంది చనిపోతే గుర్తించలేని పరిస్థితుల్లోకి చంద్రబాబు ఇవాళ ఆరోగ్య రంగాన్ని దిగజార్చారు’’ -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అవినీతికి ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పరాకాష్ట అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సూపర్ స్పెషాలిటీ వసతులతో ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో తాము చేపట్టిన కొత్త మెడికల్ కాలేజీలను కమీషన్లకు ఆశపడి తన మనుషులకు చంద్రబాబు దోచిపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసే టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దంటూ హెచ్చరించారు. ఒకవేళ టెండర్లలో ఎవరైనా పాల్గొని ఆ మెడికల్ కాలేజీలను చేజిక్కించుకున్నా.. తాము అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ ఆ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం స్వాదీనం చేసుకుని నిర్వహిస్తుందని పునరుద్ఘాటించారు. సంపద సృష్టిస్తాననే హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లా అమ్మేసే కుంభకోణానికి పాల్పడుతూ సొంత ఆస్తులు పెంచుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 2019 నాటికే మూడు సార్లు సీఎంగా పనిచేసి ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయని చంద్రబాబు ఇప్పుడు తమ ప్రభుత్వంలో చేపట్టిన కొత్త కళాశాలలను ఏకంగా అమ్మేస్తున్నారని, వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. కూటమి సర్కారు ఆరోగ్యశ్రీకి రూ.నాలుగు వేల కోట్లు బిల్లులు బకాయిలు పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోగులకు సేవలు అందడం లేదని.. ఈ పథకం కోసం ఏటా రూ.3,600 కోట్లు ఇవ్వటానికి మనసురాని చంద్రబాబు రూ.25 లక్షల ఇన్సూరెన్స్‌కు ప్రీమియం కింద రూ.ఐదారు వేల కోట్లు కడతారా? ఇదంతా డ్రామా కాదా? అని నిలదీశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఒక్క మెడికల్ కాలేజీ ఆలోచనైనా చేశావా బాబూ..?ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడమంటే... ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం ఒక కారణమైతే, రెండోది తారస్థాయికి చేరిన ఆయన అవినీతి. 1923 నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 మాత్రమే ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడు సార్లు సీఎంగా 14 ఏళ్లు పాలించారు. ఆ సమయంలో ఆయన ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? కనీసం ఆ ఆలోచన అయినా చేశాడా? 2019లో మా ప్రభుత్వం వచ్చాక జిల్లాల సంఖ్యను 26కి పెంచి, ఐదేళ్ల అతి కొద్ది సమయంలోనే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ, బోధనాస్పత్రి తెచ్చేందుకు కృషి చేశాం. డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సింగ్ విద్యార్థులు, పీజీ స్టూడెంట్లు.. ఇలా అందరూ అక్కడ పనిచేస్తారు. దీంతో వారి ద్వారా జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు ఉచితంగా అందుతాయి. కళాశాల, బోధనాస్పత్రి మెడికల్ హబ్‌గా పనిచేస్తూ జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు మార్గనిర్దేశం చేస్తుంది. పేదలకు అత్యాధునిక వైద్యం పూర్తి ఉచితంగా అందుతుంది. ప్రైవేట్ ఆస్పత్రులు అనైతిక విధానాలతో ప్రజలను దోపిడీ చేయకుండా ఈ వ్యవస్థ కాపాడుతుంది. తద్వారా ప్రైవేట్‌లో అధిక ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. మన తెలివైన, పేద విద్యార్థులకు అదనంగా మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒకవైపు మెడికల్ సీట్లు పెరిగి నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడంతోపాటు ఇంకోపక్క ఉచిత వైద్యం అందుతుంది. తద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది. ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేయలేరా..?కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు ఆలోచన, ఆచరణ, భూముల సేకరణ, నిధుల సమీకరణ.. అన్నీ మేమే చేసిపెట్టాం. చంద్రబాబు దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు? మేం దిగిపోయే నాటికి దాదాపుగా రూ.3 వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగిలిన రూ.5 వేల కోట్లకు నాబార్డు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, వివిధ రూపాల్లో నిధులు టైఅప్ అయ్యాయి. ఈ క్రమంలో ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్ల నిధులు ఖర్చు చేయలేరా? స్కామ్‌లు చేస్తూ, గవర్నమెంట్ ఆస్తులు ప్రైవేట్‌పరం చేయడానికి సిగ్గుండాలి. మంగళగిరి ఎయిమ్స్ కట్టడానికి 9 ఏళ్లు పట్టాయని నెట్లో చూశా. కళ్లముందే ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఎందుకు స్కామ్‌లు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు? భవిష్యత్‌లో ఆ 17 మెడికల్ కాలేజీల విలువ రూ.లక్ష కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడగలుగుతాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతుల వ్యవహారంలో నాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన్ను పదవి నుంచి బలవంతంగా తప్పించే వరకూ తీసుకువెళ్లింది. ప్రస్తుతం చంద్రబాబు సిగ్గూ ఎగ్గూ, భయం లేకుండా 10 కొత్త మెడికల్ కాలేజీలను ఆయనకు కావాల్సిన వాళ్లకు పప్పు, బెల్లానికి ఇచ్చేస్తున్నాడు. రూ.25 లక్షల ఇన్సూరెన్స్ ఓ డ్రామా..చంద్రబాబు పాలనలో వైద్య, ఆరోగ్య రంగం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పేందుకు ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితే నిదర్శనం. ఈ పథకానికి గత 15 నెలలుగా రూ.4,500 కోట్ల మేర చంద్రబాబు బకాయి పెట్టారు. ఆయన ఇచ్చింది రూ.600 కోట్లు. మిగిలిన దాదాపు రూ.4 వేల కోట్లు ఎగ్గొట్టాడు. నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు రాకపోవడంతో బోర్డు తిప్పేశారు. రోగులకు వైద్యం అందడం లేదు. ఇక ఆరోగ్య ఆసరాను మా ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టాం. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా నెలకు రూ.5 వేలు చొప్పున ఇచ్చాం. ఈ కార్యక్రమం కోసం సంవత్సరానికి రూ.450 కోట్లు ఖర్చవుతుంది. 15 నెలలంటే.. దాదాపు రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. మా హయాంలో క్యూఆర్ కోడ్‌తో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు ఇచ్చాం. వైద్యం ఖర్చు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ పథకమని అంటున్నారు. అది రూ.2.50 లక్షల వరకే ఇస్తారట. 3,257 ప్రొసీజర్లను 2,500కు తగ్గించేశారు. అంటే ఖరీదైన ప్రొసీజర్లకు కోత పెడుతున్నారు. నెలకు రూ.300 కోట్లు చొప్పున సంవత్సరానికి రూ.3,600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి మనసురాని చంద్రబాబు రూ.25 లక్షలు, రూ.2.5 లక్షలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు. నిజంగానే రూ.25 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేస్తే ప్రీమియం రూ.ఐదారు వేల కోట్లు అవుతుంది. మరి ఇదంతా మోసం కాదా?మేం చేసింది ఎక్కువ.. చెప్పుకుంది మాత్రం తక్కువ..గత 15 నెలల పాలనలో వైద్య ఆరోగ్య రంగంలో చంద్రబాబు ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు. ప్రివెంటివ్ కేర్ కింద దేశంలో ఎక్కడా లేని విధంగా మేం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం అయిపోయాయి. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, టెస్టులు లేవు. చివరికి దూదికి కూడా దిక్కులేని దుస్థితి. మిగిలిపోయిన నాడు – నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. మా హయాంలో మేం చేసింది ఎక్కువ.. కానీ చెప్పుకున్నది మాత్రం తక్కువ. చెప్పుకోవడం మాకు చేతకాలేదు! మావాళ్లది కూడా తప్పు ఉంది... మెడికల్ కాలేజీలు కాకుండా దాదాపు రూ.100 కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాశ్వత పరిష్కారం చూపాం. నాడు–నేడులో వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రులు, ఇతర వనరులను బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. నాడు – నేడు కింద జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అభివృద్ధి, ఆధునికీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేసినా వాటిని చెప్పుకోవడం మాకు చేత కాలేదు. ఇప్పటికి కూడా మావాళ్లు ఇంకా గేర్‌లోకి రాలేకపోతున్నారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం..వైఎస్సార్సీపీ హయాంలో జిల్లాల సంఖ్యను పెంచి ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. ఒక్కో కాలేజీకి కనీసం 50 ఎకరాల స్థలం ఉండేలా ఒక్కో కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేసి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌లు డెవలప్ చేశాం. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి తరగతులు కూడా మొదలు పెట్టాం. ఇవి కాకుండా ఎన్నికలు వచ్చేనాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. మానవత్వం ఉన్నోళ్లు చేసే పనేనా..?చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడంటే.. పులివెందుల నూతన మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గతేడాది అనుమతులిస్తే, ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్ఎంసీకి లేఖ రాశాడు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉన్నాడా? (ఎన్ఎంసీ లేఖను ప్రెస్మీట్లో ప్రదర్శించారు). మెడికల్ కాలేజీ వస్తే పేదలకు మంచి జరుగుతుంది. మేం నిర్దేశించిన ప్రకారం చంద్రబాబు ముందుకు వెళ్లి ఉంటే 2024–25 విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మదనపల్లి, మార్కాపురం కొత్త మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చేవి. 2025–26లో మరో ఏడు కాలేజీలు అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండ, పిడుగురాళ్లలో కూడా ప్రారంభం అయ్యేవి. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 ఉండగా కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగితే మొత్తం 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. మేం ప్రారంభించిన మెడికల్ కాలేజీల్లో అప్పటికే వాటి ద్వారా 800 సీట్లు భర్తీ చేశాం. పులివెందులలో కూడా చంద్రబాబు అంగీకరించి ఉంటే మరో 50 మెడికల్ సీట్లు వచ్చేవి. కానీ ఎక్కడ జగన్‌కు క్రెడిట్ వస్తుందోనని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం? -
ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్
గిట్టుబాటు ధరలు, ఇంకా మరేదైనా సమస్య అయినా సరే తొలుత అసలు ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా అంటే ఉన్నాయంటాడు. అంతా భేషుగ్గా ఉందని వాదిస్తాడు. రైతులు కేరింతలు కొడుతున్నారని గొప్పలకు పోతాడు. చివరకు సమస్య ఉందని ఒప్పుకోక తప్పదని నిర్ధారించుకున్నాక మోసం చేసేందుకు తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా.. చంద్రబాబు ఇంద్రుడు.. చంద్రుడు.. ఆదేశాలిచ్చేశాడంటూ ఆకాశానికెత్తేస్తాయి. తాటికాయంత అక్షరాలతో రాసేస్తారు. ఇదంతా ఓ బూటకం. ఏ రైతుకూ సమస్యలు తీరవు. మిర్చి, పొగాకు, మామిడి, చివరకు ఉల్లి విషయంలోనూ అదే జరిగింది.రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం.. ఆర్బీకేలు, ఈృక్రాప్, పీఏసీఏఎస్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటుకు ఎక్కువ యూరియా, ఎరువులు కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు ధరల స్థిరీకరణ నిధి లేదు. సీఎం యాప్ మూలన పడిపోయింది. ఈ క్రాప్‌ను నిర్వీర్యం చేశారు. ఉచిత పంటల బీమాకు పాతరేశారు. ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీకి మంగళం పాడేశారు. సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. ఇదంతా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఖరీఫ్‌లో ఇప్పటికే రైతులకు 6.65 లక్షల టన్నుల యూరియా సరఫరా చేశామని, గతేడాది కంటే 97 వేల టన్నులు అధికంగా అందించామని మీరు గొప్పగా ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం అవసరమైన మేరకు యూరియా, ఎరువులు అందించి ఉంటే రాష్ట్రంలో ఏ రైతూ రోడ్డెక్కడు కదా?’ అని సీఎం చంద్రబాబు నాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటన చూస్తుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. రైతులకు అందించాల్సిన ఎరువులు, యూరియాను దారి మళ్లించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతూ అధికార పార్టీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు కూడా భాగస్వామి అని దునుమాడారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర దక్కక రైతులు పడుతున్న ఇబ్బందులను ఆధారాలతో ఎత్తిచూపుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం తెచి్చన విప్లవాత్మక పథకాలను గుర్తు చేస్తూ చంద్రబాబు సర్కార్ తీరును కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ఇంకా ఏమన్నారంటే.. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా? రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా? అన్న సందేహాలు సామాన్యుల్లోనూ తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నొక్కేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అభివృద్ధి, సంక్షేమం లేకుండా పోయింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా తిరోగమనం పట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ప్రస్తుతం మన కళ్ల ఎదుటే ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతున్నాయి. అసలు రాష్ట్రంలో పాలన ప్రజల కోసం సాగుతోందా? లేక దోపిడీదారుల కోసం సాగుతోందా? రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలి పోవడంతో కుంభకోణాలు కనిపిస్తున్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీ రైతుల పక్షాన మంగళవారం ‘అన్నదాత పోరు’ చేపడితే కేసులు పెడతామంటూ బెదిరించి నోటీసులు ఇచ్చారు. వారంతా ఏం తప్పు చేశారు? రైతుల పక్షాన నిలబడితే తప్పా? రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యానికి ఇవన్నీ నిదర్శనాలు. చంద్రబాబు బావిలో దూకితే మేలు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రభుత్వం సరిపడా ఎరువులు అందించి ఉంటే అసలీ పరిస్థితే ఉండేది కాదు కదా.. మీరు ఎరువుల విషయంలో కుంభకోణాలు చేయకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా.. ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు. రెండు నెలలుగా కనిపిస్తోంది. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎరువులు దొరక్క కృష్ణా జిల్లా ఘంటశాల మండలం లంకపల్లి పీఏసీఎస్, పార్వతీపురం మన్యం జిల్లాలో, విజయనగరం జిల్లా ఎస్ కోటలో బారులు తీరిన రైతులు, రాజాంలో ఎరువుల కోసం కొట్లాట, అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాట్లు, తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో, ఏలూరు జిల్లా నూజివీడులో, ఎన్టీఆర్ జిల్లా గొళ్లపూడిలో ఎరువుల కోసం పాదరక్షలను క్యూలో పెట్టిన రైతులు.. గుంటూరు జిల్లా రేపల్లె గోడౌన్ వద్ద రైతుల ఆందోళన.. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతుల ఇబ్బందులు కళ్లకు కట్టాయి. ప్రకాశం జిల్లా పామూరు మండలం కురమద్దాలి, సత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఏసీఎస్, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రైతులు బారులు తీరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కూడా ఎరువులు దొరకని పరిస్థితి. సొంత నియోజకవర్గంలోనూ ఎరువులు సక్రమంగా పంపిణీ చేయలేని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులు ఏదైనా బావి చూసుకుని దూకితే మేలు. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి మా ఐదేళ్ల పాలనలో రైతులకు ఈ కష్టాలు లేవు. ఇప్పుడు రైతులకు అందించే ఎరువుల్లో కూడా కుంభకోణాలు చేసి, డబ్బు ఎత్తాలన్న ఆలోచన చేస్తున్నారు కాబట్టే దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారని లెక్క కడతారు కదా? దాని ఆధారంగా ఎంత ఎరువులు కావాలని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అంచనాకు వస్తుంది. ఆ లెక్కలన్నీ మనదగ్గర కూడా ఉంటాయి కదా? మరి అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకొచ్చింది? ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు » రాష్ట్రంలో రైతులు పండించే వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కోకో, పొగాకు, మామిడి, ఉల్లి, టమాటా ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు పట్టించుకోరు. తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తారు. » ఉల్లి విషయంలో ఆగస్టు 29న క్వింటా రూ.1200కు కొనుగోలు చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చినట్టు ఈనాడు రాసింది. మళ్లీ సెప్లెంబర్ 7న అంటే 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే క్వింటా రూ.201, 300, 400, 600 ఇలా రకరకాలుగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు రాస్తుంది. అంటే.. దాని అర్థం రూ.1,200కు కొనుగోలు చేశారంటే ఒట్టిమాటే కదా? అన్నీ తూతూ మంత్రాలే.. అబద్ధాలు, మోసాలు. » ఈ రోజు ఉల్లి.. క్వింటా రూ.200 నుంచి రూ.400. అదే ఉల్లి బహిరంగ మార్కెట్లో (బిగ్ బాస్కెట్) కేజీ రూ.34. అంటే క్వింటా 3,400. రైతులకు క్వింటా రూ.300–400 వస్తున్నట్టు ఈనాడు రాస్తోంది. రేటు పడిపోయినా పట్టించుకునే నాథుడే లేడు. మా పాలనలో కేజీ ఉల్లి రూ.40 నుంచి రూ.125 వరకు పలికింది. ఒకసారి మధ్యలో ఒడిదుడుకులు వస్తే రూ.9 వేల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కోవిడ్ లాంటి సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. చినీ ధర ఈ రోజు టన్ను రూ.7–8 వేలు..బాగా వస్తే రూ.12–14 వేలు. అదే మా హయాంలో కనిష్ట ధర రూ.30 వేలు. గరిష్ట ధర రూ.లక్ష. నాడు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి వైఎస్సార్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీని పెంచాం. రైతులకు తోడుగా నిలబడేందుకు రూ.7,802 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ పెట్టాం. అక్కడే ఈ క్రాప్ జరిగేది. దాంతో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వివరాలను ఆ యాప్‌లో అప్లోడ్ చేసేవారు. ఇది కంటిన్యూస్ మానిటరింగ్ అగ్రికల్చరల్ ప్రాసెస్ అండ్ ప్రొక్యూర్ మెంట్ (సీఎంయాప్) ద్వారా కచ్చితంగా పని చేసేది. ఆర్బీకేలో కనీస గిట్టుబాటు ధరలు తెలిసేలా బోర్డులో పెట్టేవారు. ఆ ధరల కంటే ఎక్కడన్నా పంట ధర పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఈ రోజు ఆర్బీకేలను గాలికొదిలేశారు. ఈ క్రాప్‌ను నిర్వీర్యం చేశారు. సీఎం యాప్ మూలన పడిపోయింది. ఉచిత పంటల బీమాకు పాతరేశారు. ఇన్ పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారానికి మంగళం పాడేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. మేము క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చేవాళ్లం. ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందేది.. ఇవన్నీ ఎత్తేశారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది రూ.5 వేలు ఇచ్చారు. అంటే రూ.40 వేలకు గాను రూ.5 వేలు ఇచ్చారు. అది కూడా సుమారు 7 లక్షల రైతు కుటుంబాలకు అర్హత జాబితా నుంచి తీసేశారు. ఇవాళ ప్రతిదీ స్కామే. ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే కనిపిస్తోంది. ఇది రూ.250 కోట్ల కుంభకోణం » అసలు రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం.. ఆర్బీకేలు, ఈ–క్రాప్, పీఏసీఏఎస్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటుకు ఎక్కువ యూరియా, ఎరువులు కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. » ఉదాహరణకు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారి మళ్లిన యూరియా.. పల్నాడు జిల్లా దాచేపల్లిలో 165 బస్తాల ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు.. నంద్యాల జిల్లా డోన్‌లో 70 టన్నుల యూరియా మాయం.. ఒకవైపు ప్రభుత్వం నుంచి వెళ్లిన యూరియా, ఎరువులను టీడీపీ నేతలు దారి మళ్లించి అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటుకు అధికంగా కేటాయించిన ఎరువులను బ్లాక్ చేసి కొరత సృష్టించడం ద్వారా బస్తా యూరియా ధర రూ.267 ఉంటే దానికంటే రూ.200 నుంచి 250 అధికంగా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. » ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకాలను చంద్రబాబు ప్రొత్సహించడం, నేరుగా భాగస్వామి కావడంతో దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల కుంభకోణం జరిగింది. రైతులను పీడించి కుంభకోణాలు చేసి, కింది నుంచి పైదాక అందరూ పంచుకున్నారు. » మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు, ఎస్పీలతో తరచూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే వాడిని. ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ కనిపిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని ఎస్పీలు, కలెక్టర్లకు బలంగా హెచ్చరికలు ఉండేవి. ఈ రోజు అది లేకుండా పోయింది. ఎవరి మీదా చర్యలు ఉండవు. నికింత– నాకింత అని.. దోచుకో పంచుకో తినుకో విధానంలో సిస్టమేటిక్ పద్ధతుల్లో వెళుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ కుంభకోణాలు చేస్తున్న వాళ్లు అసలు మనుషులేనా? -
YS జగన్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పు చంద్రబాబు
-
మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రదర్శించిన వీడియోలు
-
YS Jagan: ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం లేదు
-
బాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్‌పై జగన్ అదిరిపోయే సెటైర్లు
-
పవన్ పై వైఎస్ జగన్ లాస్ట్ పంచ్ వేరే లెవల్
-
సంపద సృష్టి అంటే.. నీ ఆస్తులు పెంచుకోవడం కాదు!
-
ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం
-
YS Jagan: 15 నెలల్లో రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేశారు
-
ఈవీఎంలు, ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాల పోరాటాలు చేస్తామన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. తాను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానానని వైఎస్ జగన్ తెలిపారు. ఇదేస సమయంలో పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రైవేటీకరణపై అన్నిరకాల పోరాటం చేస్తాం. ఆందోళనలు, నిరసనలు చేస్తాం. చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాలుగా పోరాడుతాం. నేను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాను. రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతీ ఒక్కరికీ ఇందులో కలిసి రావాలని పిలుపు ఇస్తున్నాం. అయినా బరి తెగిస్తే.. ఊరుకోం. ఎవరు టెండర్లలో పాల్గొంటారో పాల్గొండి.. మేం చూస్తాం. మేం అధికారంలోకి వచ్చాక అన్నింటినీ రద్దు చేస్తాం.. గుర్తు పెట్టుకోండిప్రతిపక్ష హోదాపై..18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాలోనే ఆ అవకాశం ఉంటుంది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీనే. మా పార్టీని కూడా ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు. ఆ సమయంలో ప్రజా సమస్యలపై ఏం చెప్పగలుగుతాం. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభాధ్యక్షుడితో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మాకు హోదా ఇవ్వడం లేదు. గతంలో సభలో జరగిని దాడికి చంద్రబాబు ఏడ్చేసి నానా యాగి చేశారు. చంద్రబాబు ఎన్ని రోజులు సభకు వచ్చారు అని ప్రశ్నించారు.ఎన్నికల విషయమై..స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ సిక్స్ అనే.. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారు. అనంతపూర్‌లో ఇవాళ ఇదే చెప్పచోతున్నారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఒక స్థాయిలోనే ఉంటాయి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అని ప్రజలకు అర్ధమైంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్.. ఇది ఏ లెవల్ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్టైజ్మెంట్లను చూడండి. 50 ఏళ్ల వాళ్లకు పెన్షన్ తీసేశారు. ఆడబిడ్డ నిధి ఎగిరిపోయింది. మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి.. కనిపించడం లేదు. క్యాంటీన్లను ఇప్పుడు కొత్తగా సూపర్‌సిక్స్‌లో చేర్చారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలతో పాటు అదనంగా ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.సూపర్ సిక్స్‌కు పొంతనేది..ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్‌కు ఈరోజు సూపర్ సిక్స్ పొంతన లేదు. ఇప్పుడు ఇచ్చేది కాకుండా రైతులకు అదనంగా రూ.20వేలు ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఆంక్షలు లేకుండా ప్రతీ బిడ్డకు రూ.15వేలు ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏ ఊరికి పోవాలన్నా ఉచితం అని చెప్పారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. గతేడాది ఎన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు. ఆడబిడ్డ ధి పేరుతో నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో ప్రతీ మహిళకు 36వేలు ఇచ్చారా?.నిరుద్యోగ భృతి కింద రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72వేలు బాకీ పడ్డారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు గతేడాది 48వేలు, ఈ ఏడాది 48 వేలు పెన్షన్లకు ఎగనామం పెట్టారు. మేము దిగిపోయే నాటికి 66,34,742 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. ఇప్పుడు 61,91,864 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. ఇది మోసం కాదా? చంద్రబాబు అని అడుగుతున్నాను. పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20వేలు ఇస్తామన్నారు. గతేడాది, ఈ ఏడాది కలిపి రైతులకు రూ.40వేలు బాకీపడ్డారు. తల్లికివందనం కింద 15వేలు ఇస్తామన్నారు. రూ.8వేలు, 9వేలు, 13వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?.ఉచితం పేరిట.. ఇసుక దోపిడీ నడుస్తోంది. లిక్కర్ మాఫియా నడుస్తోంది. అమరావతి పేరిట మాపియా జరుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. చంద్రబాబు, ఆయన మాఫియాకు ఆదాయం పెరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది. ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమన్ చక్రవర్తి నీరోలా చంద్రబాబు ఫిడేల్ వాయిస్తున్నారు. సూపర్‌సిక్స్ పేరిట బలవంతపు సంబురాలు చేయిస్తున్నాడు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని అధ్యయం ఇది. చంద్రబాబు హయాంలో అప్పులు ఎగబాకాయి అని చెప్పుకొచ్చారు. -
కేవలం పులివెందుల అనే... మానవత్వం ఉన్నోడెవడైనా అలా చేస్తాడా?
-
రైతులతో పెట్టుకోకు స్కామ్ సీఎంకు జగన్ వార్నింగ్..
-
'అన్నీ చేశామని డబ్బా కొట్టుకుంటారు..! బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్
-
ప్రజల, ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలకు,బెల్లానికి అమ్ముతున్నాడు
-
ఏపీ ఆర్థిక వ్యవస్థపై 30 వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
యూరియా పంపిణీలో TDP కోట్ల స్కామ్
-
చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే.. వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఆసుప్రతులు లేకుంటే ప్రైవేటు దోపిడీని ఆపేది ఎవరు? అని చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారు. కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా?. మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి, దుర్మార్గుడు అయిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. 26 జిల్లాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలని ప్రయత్నించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది అని చెప్పుకొచ్చారు.ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ప్రభుత్వ ఆసుపత్రులను నడపడం ప్రభుత్వం బాధ్యత. ప్రైవేటు దోపిడీకి చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రైవేట్ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుంది. ఆ దోపిడీని సామాన్యుడు భరించలేడు. అందుకే ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను బాధ్యతగా తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలలు లేకపోతే పేదలు దోపిడీకి బలవుతారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ సంస్థలు నడిపిస్తే.. సామాన్యుడు బస్సు ఎక్కగలడా?.ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు లేకపోతే పేదలు దోపిడీకి బలవుతారు. 2019కి ముందు చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారు. కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా?. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. మేం వచ్చాక ప్రతీ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తేవాలని ప్రయత్నించాం. 26 జిల్లాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలని ప్రయత్నించాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో.. ఉచితంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. ప్రైవేట్ దోపిడీకి చెక్ పడుతుంది అని అన్నారు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే.. పులివెందుల మెడికల్ కాలేజీ 50 ఎంబీబీఎస్ సీట్లతో భర్తీకి అనుమతులు మంజూరయ్యాయి. చంద్రబాబు మాకు ఆ సీట్లు వద్దని లేఖ రాశారు. కేవలం పులివెందుల మెడికల్ కాలేజ్ అనే ఉద్దేశంతోనే అలా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. పేదవాళ్లకు, మధ్యతరగతి మంచి జరుగుతుందటే అడ్డుకుంటారా?. మానవత్వం ఉన్నోడెవడైనా ఇలా చేస్తాడా?. చంద్రబాబు సక్రమంగా పని చేసి ఉంటే.. ఈ ఏడాదిన్నర పాలనలో మరో నాలుగు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయ్యేవి. రాబోయే విద్యా సంవత్సరానికి మరో నాలుగు కాలేజీలకు చెందిన పనులు దగ్గర పడి ఉండేవివైఎస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు..వైఎస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. పేదలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు అందించాలనుకున్నాం. ఇవి ప్రారంభమైతే.. పేద ప్రజలకు ఉచితంగా అత్యాధునిక వైద్యం అందుతుంది. మా హయాంలో ఒక్కొక్కటిగా తరగతులు ప్రారంభించాయి. ఎన్నికల నాటికే పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. మా హయాంలో 17లో ఏడు మెడికల్ కాలేజీలను క్లాస్‌లతో సహా అందుబాటులోకి తెచ్చాం. ఏడు కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. 800 సీట్లు అప్పటికే భర్తీ కూడా అయ్యాయి అని చెప్పుకొచ్చారు.చంద్రబాబుకి సిగ్గుండాలి.. ఆలోచన మాది.. ఆచరణ మాది.. భూముల, నిధుల సమీకరణ మాది.. అన్నీ రెడీ అయ్యాయి. మరి చంద్రబాబు ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు?. మిగిలిన రూ.5 వేల కోట్ల పనులకు ఆర్థిక సాయం కూడా వచ్చింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో కొన్ని లక్షల మందికి మేలు జరిగేది కదా. వైద్య విద్య కోసం జార్జియా, ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. సిగ్గుండాలి.. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడానికి!. మేం అధికారంలోకి వచ్చేనాటికి 2,360 సీట్లు ఉండేవి. కొత్త మెడికల్ సీట్ల ద్వారా 2550కు మెడికల్ సీట్లు పెంచే ప్రయత్నం చేశాం. మా హయాంలో 800 సీట్లు కొత్తగా తీసుకొచ్చాం. ఎక్కడ జగన్‌కు క్రెడిట్ దక్కుతుందో అని.. మెడికల్ కాలేజీల నిర్మాణాలను చంద్రబాబు ఇలా దెబ్బ తీస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
ఇదీ మీ నియోజకవర్గాల్లో పరిస్థితి.. ఏదైనా బావి చూసుకొని ఇద్దరు దూకెయ్యండయ్యా..!
-
ర్యాలీలు చేస్తే కేసులు పెడ్తావా?.. బాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబే భాగస్వామి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే మీకు పట్టదా చంద్రబాబు అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సమయానికి ఎరువులు అందిస్తే రైతులు రొడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది?. సీఎం సొంత జిల్లా, కుప్పంలో కూడా రైతులు ఆగచాట్లు పడుతున్నారు. దీనిపై చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబే భాగస్వామి అని చెప్పుకొచ్చారు.ఏపీలో యూరియా కొరత, రైతుల అవస్థలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ైవైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రైతులు రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా?. మా హయంలో రైతులకు ఇబ్బంది అనేదే రాలేదు. చంద్రబాబు సొంత జిల్లాలోనే రైతులు ఆగచాట్లు పడుతున్నారు. మా పాలనలో.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారు. అప్పుడు రాని సమస్య.. ఇప్పుడు ఎందుకు వచ్చింది?. జగన్ అనే వ్యక్తి రైతులకు ఇబ్బంది కలగకూడదని ఆలోచించారు. ఇప్పుడు ఎరువుల దగ్గర కూడా స్కామ్‌లకు పాల్పడుతున్నారు. ీజన్ ప్రారంభంలోనే ఎంత విస్తీర్ణం సాగు అవుతుంది. ఎంత మొత్తంలో ఎరువులు కావాలో తెలియదా?. చంద్రబాబు చెప్పినట్టు యూరియా సరఫలా జరిగిందా.?రైతుల అవస్థలకు కారణం.. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువుల్ని టీడీపీ నేతలు దారి మళ్లించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అధికంగా కేటాయించిన ఎరువుల్ని బ్లాక్ చేసి.. బ్లాక్‌లో అమ్మేసుకుంటున్నారు. చంద్రబాబే ఇందులో భాగస్వామి రైతులను పీడించి.. స్కామ్‌లు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకుంటున్నారు. దాచుకో.. దోచుకు. యూరియా విషయంలో రూ.250 కోట్ల స్కామ జరిగింది’ అని ఆరోపించారు. చిత్తశుద్ధి లేని చంద్రబాబు వల్లే.. మా హయాంలో గట్టి హెచ్చరికలు వెళ్లేవి. తప్పు చేయాలంటే భయపడేవాళ్లు. అందుకే ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు చంద్రబాబే దగ్గరుండి స్కాంలు నడిపిస్తున్నారు. చంద్రబాబుకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎవరి మీద చర్యలు లేవు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ.. స్కాంలు చేస్తున్నారు.. వీళ్లు మనుషులేనా?. రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ల తరఫున మాట్లాడకూడదా?. ఉల్లి, టమాటా, చీనీ పంటలకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు సున్నా వడ్డీ పథకం ఎత్తేశారు అని ఆరోపించారు. -
బాబు ప్రైవేట్ పిపాసకు ఏపీలో వైద్యం బలి!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒట్టి అమాయకులన్న మాటలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. కొందరు నేతల చేతిలో పదే పదే మోసపోతూంటారు మరి. ఒకసారైతే ఏమో అనుకోవచ్చు కానీ.. పదే పదే మోసపోతూంటే అది ప్రజల తప్పే కదా? ప్రస్తుత ముఖ్యమంత్రి.. గతంలోనూ ఈ పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడినే ఉదాహరణగా తీసుకోండి. రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఈయన చెప్పేదొకటి. చేసేది ఇంకోటి. మూడుసార్లు సీఎంగా ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చిన రికార్డు మాత్రం లేదీయనకు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కాంక్షించి వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన పది వైద్య కళాశాలలను అప్పనంగా ప్రైవేటు వారి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారానే నడపాలని నిర్ణయించారు. మెరుపువేగంతో పలు కళాశాలల నిర్మాణమూ సాగింది. ఐదింటిని ప్రారంభించగా మిగిలిన వాటిని కూడా మొదలుపెట్టే క్రమంలో ఎన్నికలకొచ్చాయి. అధికారం జగన్ చేజారింది. చంద్రబాబు అధికారం చేపట్టింది మొదలు ఈ వైద్యకళాశాలలపై పగబట్టినట్టు వ్యవహరించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన 50 సీట్లు వద్దనేశారు. ప్రజల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శలను బేఖాతరు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఫలితంగా వందల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు పరం కానుంది. అయితే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని, తమది సంపద సృష్టించే పార్టీ అని ఎన్నికల సమయంలో ఊరంతా ఊదరగొట్టిన ఇదే చంద్రబాబు ఇప్పుడు సంపదను అప్పనంగా ఇంకొకరికి ధారాదత్తం చేస్తున్నారు. ఒక్కో మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వం యాభై ఎకరాల భూమి కేటాయించింది. శాశ్వత నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్! ఎకరాకు వంద రూపాయల లీజంట. కాకపోతే ఆయన సంపద సృష్టిస్తానన్నారే గానీ.. పేదల కోసమని చెప్పారా ఏంటి? చెప్పలేదు లెండి! ఇంకో విచిత్రమూ ఉందిక్కడ. చంద్రబాబు ఈ మధ్య పదే పదే వల్లెవేస్తున్న పీ-4కు ఈ వైద్య కళాశాలల అమ్మకానికి లింకు పెట్టడం! ప్రభుత్వం నుంచి చౌక ధరలకు ఆస్తులు ఆస్తులు పొందిన వారు లేదంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లు పీ-4 కింద పేదలను దత్తత తీసుకుని వారిని ఉద్ధరిస్తారని బాబు చెబుతున్నారు. పైగా సంపన్నులు-పేదల మద్య లింక్ పెట్టడానికి పి-4 విధానం తెస్తానని అన్నారు. అదేమిటో తొలుత చాలామందికి అర్ధం కాలేదు. ప్రభుత్వంలోకి వచ్చాక తన స్కీములు కొన్నిటిని ముఖ్యంగా ఆడబిడ్డ నిధి బదులు పి-4 తో సరిపెట్టుకోవాలని ఆయన ప్రత్యక్షంగా,పరోక్షంగా చెప్పారు. అంటే ఆయన ప్రైవేటువారికి సంపద సృష్టిస్తారు.ఆ తర్వాత వారు దయతలచి పేదలకు ఏదో కొంత విదిలిస్తారన్నమాట. 2024లో అనూహ్యంగా ఎన్నికై ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని విషయాలలో చంద్రబాబు యు-టర్న్ తీసుకున్నారో చెప్పనవసరం లేదు. బాబు ప్రైవేట్ పక్షపాతి అనేందుకు వైద్య కళాశాలల ఉదంతం తాజాది మాత్రమే. గతంలోనూ ఎన్నో కనిపిస్తాయి. అత్యంత విలువైన విశాఖ భూములను అణా, కాణికి తెగనమ్ముతూండటం గురించి చెప్పుకోవాలిక్కడ. గత ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ కోసం టాటా కన్సెల్టెన్సీ సంస్థ భూమి లీజుకు అడిగింది. వ్యవహారం ముందు నడుస్తూండగానే అధికార మార్పిడి జరిగింది. టీడీపీ ప్రభుత్వం లీజుమాటను పక్కకు పెట్టేసి చాలా ఉదారంగా సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకు ధారాదత్తం చేస్తామని ప్రకటించింది. అయితే న్యాయస్థానాలు, ప్రజాసంఘాల విమర్శల నేపథ్యంలో దీన్ని లీజుగా మార్చారేమో తెలియదు. పనిలో పనిగా తమకు కావాల్సిన మరో కంపెనీకి 60 ఎకరాలు ఇదే పద్ధతిలో ఇవ్వాలనుకున్నారు కానీ.. వివాదం కావడంతో ఎకరా అర కోటికి ఇస్తున్నట్లు చెబుతున్నారు. పరోక్షంగా రూ.వంద కోట్ల లాభం చేసి పెట్టారన్నమాట. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారు. వాటిలోని ఉద్యోగులందరికి వీఆర్ఎస్ ఇచ్చి పంపేశారు. ఆ సంస్థలను పొందిన కొన్ని కంపెనీలు అక్కడి భూమితోనే సంపద సృష్టించుకోగలిగాయి. విశాఖ స్టీల్‌ను ఎట్టి పరిస్థితిలోను ప్రైవేట్ పరం కానివ్వమని ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు 34 విభాగాల ప్రైవేటీకరణను ఖండించకపోగా తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు సందర్భంలోనూ బోలెడంత ఆదా అవుతుంందని, ఛార్జీలు తగ్గించవచ్చని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అనేవారు. కానీ వాస్తవానికి చేసింది సున్నా. మోపెడైన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగితే బషీర్ బాగ్ కాల్పులు జరిపించిన చంద్రబాబు నలుగురు యువకుల మరణానికి కారణమయ్యారు. ఉచిత విద్యుత్తునిస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన ఘనుడు చంద్రబాబు. ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారు. తదనంతర కాలంలో తన సంస్కరణల వల్లే ఉచిత విద్యుత్తు ఇవ్వడం సాధ్యమైందని ప్రచారం చేసుకోగలిగారు నిస్సిగ్గుగా! అంతెందుకు! గత జగన్ టర్మ్‌లో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లెక్కించడానికి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే టీడీపీ పూర్తిగా వ్యతిరేకించింది. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని లోకేశ్ పిలుపు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే అవే స్మార్ట్ మీటర్లను ఇళ్లకు కూడా బిగిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీల పరం చేస్తున్నారు. దీనివల్ల బీమా కంపెనీలకు ప్రభుత్వం సుమారు రూ.వెయ్యి కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు ఆ సంస్థలకు సంపద అంటే ప్రజల ధనం చేరుతుందన్నమాట. జగన్ ప్రభుత్వం ద్వారా మద్యం షాపులను ఊరుబయట నడిపిస్తే, చంద్రబాబు సీఎం కాగానే వాటన్నిటిని తీసేసి ప్రైవేటు వారికి, ముఖ్యంగా తన పార్టీ వారికి ఆదాయ వనరుగా మార్చారు. అది సంపద సృష్టి అన్నమాట.పలు రోడ్లను ప్రైవేటు పరం చేస్తారట. ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి కూడా ఎల్లో మీడియా అండతో సమర్థించుకోవడం ఆరంభమైంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, ప్రభుత్వ రంగంలో అయితే బాగా నడవవని కూడా ప్రచారం చేయిస్తారు. ప్రభుత్వ ప్రచారం కోసం రూ.2300 కోట్లతో ఫైబర్ నెట్ సంస్థను అభివృద్ది చేసి, నిర్వహణను ప్రైవేటు వారికి అప్పగిస్తారని ఎల్లో మీడియానే రాసింది. సూపర్ సిక్స్ వంటివాటి అమలుపై పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం అని కూడా చంద్రబాబు కొన్నిసార్లు అన్నారు. అయినా ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపధ్యంలో కొన్ని హామీలనైనా కొంతమేరకైనా అమలు చేయక తప్పడం లేదు. వైద్య కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఘాటు ప్రకటన చేశారు. ‘‘కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందేరం చేస్తారా’’ అని ప్రశ్నించారు. 2019కి ముందు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వరంగంలో తెచ్చారా అని ఆయన చంద్రబాబును అడిగారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ వైద్య కళాశాలలను మళ్లీ ప్రభుత్వ రంగంలోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.టీడీపీ మద్దతుదారుల్లోనూ చాలామందికి వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నచ్చడం లేదు. ఈ మధ్య లోకేశ్ విజన్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా అదే తరహా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆ ప్రసంగం చూస్తే ఆయన ప్రస్తుత మంత్రి నారాయణ ద్వారా బ్రిడ్జి కోర్స్ చదివారట. మొత్తం ప్రైవేటు విద్యా సంస్థలలోనే ఆయన చదువు కొనసాగింది. ప్రైవేటు యూనివర్శిటేలే బెటర్ అని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న ఆయన ప్రస్తుత విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇవేవి పట్టవు కాబట్టి వీరికి ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు పేదల సంక్షేమానికి పుట్టిన పార్టీగా చెప్పేవారు. చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక అది కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంపద సృష్టించే పార్టీగా గుర్తింపు పొందుతోంది. సినిమాల ద్వారా ధనికుడు అయిన ఎన్టీఆర్. పేదల సంక్షేమం గురించి స్కీములు తెచ్చారు. అలాగే సంపన్న కుటుంబంలో పుట్టిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ లు పేదల పక్షపాతులుగా పేరు తెచ్చుకున్నారు. పేదరికం నుంచే వచ్చిన చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ఉన్నారన్న విమర్శకు గురి అవుతున్నారు.. ప్రస్తుతం ఆయన దేశంలోనే అత్యంత సంపన్న సి.ఎమ్.గా రికార్డు సాధించారు. ఆయన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల డార్లింగ్ గా గుర్తింపు పొందారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వైద్య కళాశాలలను పిపిపి పేరుతో ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిది తప్పు?ఆంధ్ర ప్రజలదా? లేక చంద్రబాబుదా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Watch Live: కూటమి అరాచకాలపై వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్
-
చంద్రబాబువన్నీ మోసాలే.. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో.. యూరియా కొరత, గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న అవస్థలు, 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి వైద్య రంగాన్ని దెబ్బ తీయడం.. అలాగే సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకపోయినా, సూపర్‌హిట్ పేరుతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం గురించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీడియా ద్వారా సుదీర్ఘంగా మాట్లాడారు. రైతులకు అందాల్సిన ఎరువులు, యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తూ స్కామ్‌కు పాల్పడుతున్నారు. దాన్ని నిరసిస్తూ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ, వారి పక్షాన వారితో కలిసి ఆర్డీఓలకు అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. దాన్ని కూడా అడ్డుకుంటూ, పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులకు నోటీసులు ఇచ్చారు. (అంటూ, పోలీసులు ఇచ్చిన నోటీసులు మీడియాకు పీపీటీలో చూపారు) యూరియా కోసం రైతులతో కలిసి ఆర్డీఓకు అర్జీలు ఇవ్వడం తప్పా? రైతుల తరపున మాట్లాడొద్దా? ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. అసలు మీరు అవసరమైన ఎరువులు అందిస్తే, ఏ రైతు కూడా రోడ్డెక్కడు కదా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు స్కామ్‌లు చేశారు. అందుకే ఈ పరిస్థితి. ఏకంగా రెండు నెలల నుంచి రైతులు యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు. అది మీ దారుణ పాలనకు సాక్ష్యం కాదా?. మీ అవినీతి పాలనకు నిదర్శనం కాదా? (అంటూ.. యూరియా కోసం అనేక చోట్ల రైతులు బారులు తీరిన ఫోటోలు ప్రదర్శన. చివరకు కుప్పం, టెక్కలిలో కూడా అదే స్థితి).నేను ఒకటే అడుగుతున్నాను. ప్రజలంతా ఆలోచించాలి. మా పాలనలో 5 ఏళ్లలో ఎక్కడైనా, ఎప్పుడైనా రైతులు ఇలా ఎరువుల కోసం అగచాట్లు పడ్డారా? రోడ్డెక్కారా? అప్పులు ఆ పరిస్థితి ఎందుకు రాలేదు?. ఇప్పటి పరిస్థితికి కారణం.. జగన్ అనే వ్యక్తికి రైతుల మీద ఆపేక్ష. వారికి మంచి చేయాలన్న తపన, తాపత్రయం. నాటి సీఎంకు, ఇప్పటి సీఎంకూ అదే తేడా. ఎరువుల సరఫరాలో కూడా స్కామ్ చేస్తున్నారు. అందుకే ఈ దుస్థితి. ఇందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి.చంద్రబాబు నోట అబద్ధాలు..ఈనెల 3న మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఈ ఖరీఫ్‌లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియ సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 97 వేల టన్నులు ఎక్కువ సరఫరా చేశామని చెప్పారు. మరి చంద్రబాబుగారు చెబుతున్నట్లుగా ఎరువులు అంది ఉంటే, రైతులు రోడ్కెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? వారికి యూరియా అందలేదు కాబట్టే, ఈ పరిస్థితి వచ్చింది కదా?. రాష్ట్రానికి వస్తున్న యూరియాను టీడీపీ నాయకులు దారి మళ్లించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులకు ఎక్కువగా ఇచ్చేశారు. వారు కొరత సృష్టించి బస్తాకు రూ.200 వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా బ్లాక్మార్కెట్లో ఎరువులు అమ్ముతూ దాదాపు రూ.250 కోట్ల వరకు స్కామ్ చేస్తున్నారు. రైతులను పీడించి, స్కామ్‌లు చేసి అందరూ పంచుకుంటున్నారు.మరోవైపు, ఏ ఒక పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, చీనీ.. ఏది చూసినా. ఇప్పుడు కూడా ఉల్లి, టమోటా పరిస్థితి కూడా అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, సీఎం చంద్రబాబు పట్టించుకోడు. తూతూ మంత్రంగా ప్రకటన చేస్తాడు. అసలు ముందు వాస్తవాలు ఒప్పుకోడు. తప్పదనుకుంటే, ఒక ప్రకటన చేస్తాడు. దాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తుంది. ఈరోజు ఉల్లి క్వింటాలు ధర రూ.200 నుంచి రూ.300 ఉంటే, బహిరంగ మార్కెట్లో కేజీ రూ.34. అంటే క్వింటాలుకు రూ.3400.మా ప్రభుత్వ హయాంలో రూ.7,802 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో జోక్యం చేసుకున్నాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. మార్కెట్లో పంటల ధరలు తగ్గితే.. సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా ప్రభుత్వం రంగంలోకి దిగి, కొనుగోలు చేసేది. కానీ, ఇప్పుడవేవీ లేవు. మా ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలకు మంగళం పాడేశారు.ప్రజారోగ్య రంగం నిర్వీర్యం.. సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలు, బెల్లానికి అమ్ముకంటున్నారు. తన మనుషులకు దోచి పెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. తారాస్థాయికి చేరిన చంద్రబాబు అవినీతి, స్కామ్‌లకు పరాకాష్ట. 2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 11. పద్మావతి వర్సిటీ కాలేజీ కూడా కలుపుకుంటే వాటి సంఖ్య 12. చంద్రబాబు తన అన్నేళ్ల పాలనలో కనీసం ఒక్కటంటే, ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? కనీసం ఆ ఆలోచన అయినా చేశాడా?. అదే మా ప్రభుత్వంలో కేవలం 5 ఏళ్ల అతికొద్ది కాలంలోనే, ప్రతి జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకురావాలని, ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చూశాం. జిల్లాలు 13 నుంచి 26కు పెంచి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక జిల్లాలో మెడికల్ కాలేజీలో భాగస్వామ్యంగా టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటైతే, అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఆ స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారు. మా హయాంలో 17 మెడికల్ కాలేజీల పనులు చేపట్టాం. ఒక్కో దానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కాలేజీని 50 ఎకరాల్లో చేపట్టాం. అన్ని హంగులతో వాటి నిర్మాణం చేపట్టాం. అంకితభావంతో పని చేశాం కాబట్టే.. 2023–24లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. తరగతులు మొదలయ్యాయి. అవే కాకుండా, గత ఏడాది ఎన్నికల నాటికి, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తైంది. అడ్మిషన్లకు సిద్ధం చేశాం. పులివెందుల కాలేజీని ప్రారంభించాను. ఎన్నికలు ముగిశాక, పాడేరు మెడికల్ కాలేజీ మొదలైంది. అడ్మిషన్లు జరిగి, క్లాస్‌లు కూడా ప్రారంభం అయ్యాయి. అంటే, మా హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి చేసి, ప్రారంభించాం. మెడికల్ కాలేజీలే కాదు.. మా హయాంలో ఎంతో చేశాం. కానీ చేసింది చెప్పుకోలేకపోయాం.. అదే తప్పైంది మెడికల్ సీట్లు వద్దన్న చంద్రబాబుచంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ (జాతీయ వైద్య కమిషన్) 50 సీట్లు కేటాయించి, భర్తీ చేయడానికి అనుమతి ఇస్తే, ఆ సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాశాడు. అలాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. చంద్రబాబు అసలు మనిషా? లేక రాక్షసుడా? ఆలోచించండి.మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, చంద్రబాబు చొరవ చూపి ఉంటే.. 2024–25లో మరో 4 కాలేజీలు.. అదోని, మదనపల్లె, మార్కాపురం, పిడుగురాళ్లలో క్లాస్‌లు మొదలై ఉండేవి. ఆ మేరకు నిర్మాణాలు కొనసాగించాం. (అంటూ ఆ కాలేజీల ఫోటోలు కూడా చూపారు). ఇంకా మా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే, మరో 6 మెడికల్ కాలేజీలు.. అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో మెడికల్ కాలేజీలు 2025–26 విద్యా సంవత్సరంలో మొదలై ఉండేవి. ఆ ప్రకారం మేము పనులు చేశాం. మా ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న మెడికల్ సీట్లు 2360. కొత్త కాలేజీల ద్వారా మరో 2550 మెడికల్ సీట్లు పెరిగేవి. మొత్తం 4,910కి మెడికల్ సీట్లు చేరుకునేవి. మా హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల ద్వారా 800 సీట్లు భర్తీ అయ్యాయి. వైద్య విద్యలో ఇది అద్భుత ఘట్టం. నాకు క్రెడిట్ వస్తుందని, దెబ్బ తీయడం, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత వరకు ధర్మం?మేం దిగిపోయే నాటికి దాదాపు రూ.3 వేల కోట్ల పనులు జరగ్గా, మిగిలిన రూ.5 వేల కోట్లకు కూడా నాబార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా కానీ, ఇతర సంస్థల ద్వారా నిధులకు ఓకే అయింది. కొత్త కాలేజీల వల్ల భూమలు విలువ బాగా పెరిగింది. మొత్తం కాలేజీల విలువ కూడా పెరిగింది. భవిష్యత్తులో దాని విలువ లక్ష కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడబడతాయి.ఇంకా చంద్రబాబునాయుడుగారి హయాంలో వైద్య రంగం నిర్వీర్యం అయింది. మా ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో 3,257 ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు వ్యయ పరిమితి. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారికి కూడా పథకాన్ని వర్తింప చేయడం వల్ల 95 శాతం కవర్ అయ్యారు. దాని నిర్వహణకు నెలకు రూ.300 కోట్లు కావాలి. 15 నెలలకు రూ.4500 కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు ఇచ్చింది రూ.600 కోట్లు మాత్రమే. దాంతో కార్పొరేట్ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు. ఇన్ని చేసిన చంద్రబాబు, ఇంకా మరో మోసం. డ్రామా చేస్తున్నాడు. కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకొచ్చాడు. దానిలో వైద్యం ఖర్చును కేవలం రూ.2.5 లక్షలకే పరిమితం చేయడంతో పాటు, ప్రొసీజర్లను 2500కు తగ్గించారు. చంద్రబాబు వైద్య రంగాన్ని నాశనం చేసిన తీరుకు.. తురకపాలెం ఉదాహరణ. 2 నెలల్లో 45 మంది చనిపోతే, ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితి. ఇది సీఎం ఇంటికి చాలా చేరువ.సూపర్‌హిట్ ఫ్లాప్ సంబరాలు:చంద్రబాబుకు ఉన్న నైపుణ్యం. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఒకవైపు పథకాల అమలు లేదు. మరోవైపు మోసం. అయినా సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అంటూ వేడుక. ఇది అట్టర్‌ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవం చేసినట్లు ఉంది. చంద్రబాబు అబద్దాలు, మోసాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. ఒకసారి చూడండి. (అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన అడ్వరై్జజ్మెంట్స్. సూపర్‌సిక్స్‌పై ప్రదర్శన). ఇంకా ఎన్నికల ముందు సూపర్‌సిక్స్ గురించి చంద్రబాబు ఏమన్నారనేది చూద్దాం. (అంటూ ఆ పత్రికా ప్రకటనలు. అప్పుడు ఇంటింటికీ పంపించిన బాండ్లు. వాటిలో ఏమేం చెప్పారు?. బాబు ష్యూరిటీ. భవిష్యత్తు గ్యారెంటీ. దీనిపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ ఫోటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఇంకా పథకాలపై చంద్రబాబు హామీల ప్రచార వీడియోల ప్రదర్శన).ఇప్పుడు నేను అడుగుతున్నాను.. ఇవన్నీ మోసాలు కావా?:18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా?. ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ. ఈరోజు అనంతపురంలో సూపర్‌హిట్ పేరుతో సభ పెట్టావు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అవి ఇవ్వనప్పుడు మోసం కాదా? అది నీ సూపర్‌సిక్స్ హామీ కాదా?.. 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా?. పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈనెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా మహిళలకు ఫ్రీ అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతి. ఇది మోసం కాదా?. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గానూ, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా?. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?. తల్లికి వందనం కింద రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యాదీవెన, వసతిదీవెన, పిల్లలకు ట్యాబ్‌లు రద్దు చేశావు. ఇది మోసం కాదా?.. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, ఆయన చేసిన మోసంతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. ఆయన సూపర్‌హిట్ పేరుతో బలవంతపు వేడుకలు. ఇది దారుణం.15 నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులుఒక్కటే అడుగుతున్నాను. 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఎవరి జేబులోకి పోతోంది ఆ మొత్తం. ఇది రాష్ట్ర చరిత్రలోనే లేదు. రాష్ట్రం విభజించిన రోజు, మొత్తం అప్పులు కలిపి రూ.140,717 కోట్లు ఉంటే ఆయన దిగిపోయేనాటికి రూ,3,90,247. అంటే 22.63 శాతం సీఏజీఆర్. అది మా హయాంలో అది 13.57 శాతం మాత్రమే. ఇక మా ప్రభుత్వ హయాంలో అప్పు రూ.3,90,247 కోట్ల నుంచి రూ.7,21,918 కోట్లకు పెరిగింది. అంటే మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం ఈ 15 నెలల్లోనే చేశారు.ఈ ప్రభుత్వంలో ఇసుక, మట్టి దోచేస్తున్నారు. ఉచితం లేనే లేదు. లిక్కర్ మాఫియా. పర్మిట్‌రూంలు, బెల్టు షాప్‌లు విచ్చలవిడిగా. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్ దోపిడి. అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. అదో దోపిడి. శనక్కాయలు, బెల్లానికి ఇష్టం వచ్చినట్లుగా.. ఉర్సా, లులూకు భూముల కేటాయింపు. రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. మీ ఆదాయం, మీ అనుయాయుల సంపద పెరుగుతోంది.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం స్కామ్‌ల్లో పరాకాష్ట. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీన్ని అడ్డుకుంటాం. నిరసనలు, ర్యాలీలు చేస్తాం. నేనూ అక్కడక్కడా పాల్గొంటా. – రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పార్టీని కోరుతున్నా. అందరూ కలిసి రండి. కొత్త మెడికల్ కాలేజీలు మన సంపద. రాష్ట్ర సంపద. అందరం కలిసి పోరాడుదాం. వాటిని కాపాడుకుంటాం. అయినా ఈ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే, రేపు మా ప్రభుత్వం రాగానే, వాటన్నింటినీ రద్దు చేస్తాం. ఆ కాలేజీలు వెనక్కు తీసుకుంటాం.మీడియాతో జగన్ చిట్‌చాట్ 👉స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. 👉ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలకు స్పందిస్తూ.. అలాంటిదేం లేదు, అదంతా ఉత్త ప్రచారమే.. 👉18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాతోనే ఆ అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకూడదన్న రీతిలో సభను నడిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నిరోజులు అసెంబ్లీకి వచ్చారు. జరగనిదాన్ని జరిగిందని రాద్ధాంతం చేశారు.👉సోషల్ మీడియా తప్పుడు ప్రచారం పేరిట ఏపీ ప్రభుత్వ తీసుకోబోయే కఠిన నిర్ణయంపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం ఉండదు. అది కేవలం కేంద్ర పభుత్వ పరిధిలో ఐటీ చట్టాల పరంగా జరగాలి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. 👉వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలో ఎలా వస్తుందో చూస్తాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్‌కు స్పందిస్తూ.. ‘‘ఈయనేంది చూసేది.. పైన దేవుడు చూస్తాడు’’ -
నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్
-
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. -
సీపీ రాధాకృష్ణన్‌కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రడ్డి అభినందనలు తెలియజేశారు. ‘ రాధాకృష్ణన్ జీ.. మీరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు నా అభినందనలు. దేశానికి మీరు చేసే సేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ అంకితభావం, సుదీర్ఘ అనుభవం మన దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశంగా పని చేస్తాయి అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Congratulations Shri C. P. Radhakrishnan Ji on being elected as the Vice President of India!Wishing you all the success in your service to the Nation. Your dedication and experience will surely guide our country.@CPRGuv pic.twitter.com/QRJ8SUEixe— YS Jagan Mohan Reddy (@ysjagan) September 9, 2025 కాగా, ఉపరాష్ట్రపతి ఎంనిక కోసం ఈరోజు(మంగళవారం సెప్టెంబర్ 9వ తేదీ) జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం, సెప్టెంబర్ 10వ తేదీ) ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం గం.11 కి వైఎస్ జగన్ ప్రెస్మీట్లో మాట్లాడనున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ, వేల కోట్ల రూపాయిల విలువైన భూములను బినామీలకు దోచిపెట్టడం సహా అనే అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. -
టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఆంధ్రప్రదేశ్-ఏఐటీయూసీ) ప్రతినిధుల బృందం మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసింది. కూటమి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులు, బాధలను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏపీ పర్యాటక అభివృద్ది సంస్ధలోని 22 హోటల్స్, రిసార్ట్స్‌లను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు వీలుగా ఇచ్చిన జీవో నెంబర్ 23 తీసుకొచ్చింది. దానిని అడ్డుకోవాలని కోరుతూ ప్రతినిధుల బృందం వైఎస్ జగన్‌కు ఓ వినతి పత్రం సమర్పించింది. ‘‘గత పాతికేళ్ళుగా టూరిజం సంస్ధలో కాంట్రాక్ట్ పద్దతిలో 504 మంది, ఔట్‌సోర్సింగ్‌లో 488 మంది ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ ఈ జీవోతో మాకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారు. టూరిజం ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా మా కుటుంబాలు రోడ్డున పడతాయి’’ అని జగన్ వద్ద కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టికి వచ్చిన విషయాలను పరిశీలించిన వైఎస్ జగన్.. టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. -
Perni Nani: మా ప్రభుత్వంలో రైతు కంట్లో నుంచి ఒక్క కన్నీటి బొట్టు రానివ్వలేదు..
-
‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్
Annadata Poru Updates: వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ లైవ్ అప్డేట్స్.. -
Annadata Poru: నేడే రైతన్న రణభేరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు మంగళవారం శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, సరిపడా అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు ఆర్డీవోలకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేయనున్నారు.ఎమ్మార్పీపై బస్తాకు రూ.200 అధికంకూటమి ప్రభుత్వంలో యూరియా కొరత రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోంది. వ్యవసాయ సీజన్లో ఒక్క యూరియా కట్ట కోసం గంటల తరబడి ప్రైవేట్ దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ముందు పడిగాపులు కాస్తున్న దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. నల్ల బజార్లో కనీసం రూ.200 అధికంగా చెల్లిస్తే గానీ బస్తా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగు మందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు.కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన నేతలు నల్లబజార్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క యూరియా రూపంలోనే దాదాపు రూ.200 కోట్ల మేర రైతులపై భారం మోపి కాజేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ విమర్శించింది. పలుచోట్ల అక్రమంగా తరలిపోతున్న యూరియాను రైతులే పట్టుకుని పోలీసులకు అప్పగించినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దీన్ని బలపరుస్తోంది. కృష్ణా జిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాలకు అద్దం పడుతున్నాయి. సర్కారు కళ్లు తెరిపించేలా ’అన్నదాత పోరు’.. రైతాంగం డిమాండ్లపై కూటమి సర్కారు దిగి వచ్చేలా అన్నదాత పోరును వైఎస్సార్సీపీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ కోసం శ్రేణులు కదం తొక్కనున్నాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపించనుంది. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేయనుంది. వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు మార్కెట్లో పోటీ పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గళమెత్తనుంది.ప్రైవేట్ వ్యాపారులతో ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఒప్పించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేయనుంది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అన్నదాత పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో, 7న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ, 8న మండల కేంద్రాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదుకోవాల్సింది పోయి బెదిరిస్తున్న బాబు.. ఒకవైపు యూరియా సమస్యతో అన్నదాతలు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు వారిని బెదిరిస్తూ మాట్లాడటం, అసలు సమస్యే లేదని కొట్టిపారేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు కనిపిస్తున్నా మభ్యపుచ్చేలా, బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. రైతుల ఇక్కట్లను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్‌పై రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. సీజన్‌కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, ఎరువుల అవసరంపై ప్రణాళికలు లేకపోవడం, సమీక్షలు నిర్వహించకపోవడం కూటమి సర్కారు బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయి.అన్నదాత కన్నెర్రతో కలవరం..అన్నదాతలకు అండగా నిలవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్సార్ సీపీ ఆందోళనలకు సిద్ధం కావడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే విఫల ప్రభుత్వం, పాలన చేతగాని సర్కారుగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంతో కూటమి సర్కారు పాలనను రైతన్నలు పోల్చి చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవడం, అప్పుల పాలు కాకుండా అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అన్ని రకాల పంటలను మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం, సీఎం యాప్ ద్వారా నిరంతరం ధరలను పర్యవేక్షించడం లాంటి చర్యల ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో ధరలు పతనమైతే కూటమి సర్కారు రైతుల గోడు పట్టించుకోకుండా వదిలేయడంపై మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు అసమర్థ పాలనపై వైఎస్సార్సీపీతో కలిసి భారీ ఎత్తున కదం తొక్కేందుకు సిద్ధమమయ్యారు. -
'అన్నదాత పోరు' కార్యక్రమంపై కూటమి ప్రభుత్వ ఆంక్షలు
'అన్నదాత పోరు', నిరసనలు, ర్యాలీలకు కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ పోలీసులు అమల్లోకి తెచ్చారు.యూరియా పై వైసిపి తలపెట్టిన నిరసనతో కూటమి ప్రభుత్వంలో కలవరం మొదలైంది. పోలీసులను ఉపయోగించి వైసిపి నిరసనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వ యత్నం. రేపు వైసిపి తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమం పై పోలీసుల ఆంక్షలు. అన్నదాత పోరు నిర్వహణకు, ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు ఎలాంటి అనుమతులు లేవంటూ పోలీసులు ప్రకటించారు. నిరసనలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు.ఏపీ వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. -
Annadata Poru: గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించిందా?
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ముందు వేచి ఉండాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే యరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు చేరుతోంది. నల్లబజార్లో రూ.200 అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్‌కు తరలిస్తూ, కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క యూరియా ద్వారానే దాదాపు రూ.200 కోట్ల మేరకు అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఇప్పటికే వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి రుజువుగా పలుచోట్ల యూరియా అక్రమంగా తరలిస్తుండటం, రైతులే దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కనీసం కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాజిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగి వచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీ పెంచాలి. ప్రైవేటు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ఒప్పించి రైతులకు అండగా నిలబడాలి. తదితర రైతాంగ డిమాండ్లపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరును ముందకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దీనిపై రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే 7వ తేదీన అన్ని నియోజకర్గ కేంద్రాల్లోనూ, 8న అన్ని మండల కేంద్రాల్లోనూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించిన తీరు, బెదిరిస్తూ మాట్లాడటం, సమస్యే లేదని చెప్పడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు ఉన్నా కూడా రైతుల్ని బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో సమస్యే లేదని దబాయించి మాట్లాడుతున్న వైనంపై సమస్య లేదని, వైఎస్సార్ సీపీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్‌పై రైతుల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే, ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వంలోనే సరైన సమాధానం లేదు. సీజన్‌కు సంబంధించి ముందుగా పంటల సాగు, ఎరువుల అవసరంపై ఎందుకు ప్రణాళికలను సిద్దం చేసుకోలేకపోయారు, ముందస్తుగా సమీక్షా సమావేశాలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వంలో కలవరం!అన్నదాత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు సిద్దం కావడంతో కూటమి సర్కార్‌లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రైతుల విషయంలో ఇదొక విఫల ప్రభుత్వం, పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటోంది. కూటమి పాలనకు ముందు.. గత అయిదేళ్ళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో రైతులు పోల్చి చూస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీనీ సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే అవసరమైన మేరకు ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయానిన్ని అందించడం ద్వారా అప్పుల పాలు కాకుండా రైతులకు అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన అన్ని రకాల పంటలకు మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం ఇలా అనేక అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో రేటు లేని పరిస్థితుల్లో రైతులను పట్టించుకోకుండా వదిలేసిన కూటమి సర్కార్ నిర్వాకాన్ని రైతులు పోల్చి చూస్తున్నారు. వైఎస్సార్సీపీతో కలిసి తమ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి చూపించేందుకు అన్నదాత పోరులో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనేందుకు సిద్దమైంది.రైతులకు అండగా వైఎస్సార్సీపీ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అన్నదాత పోరు కార్యక్రమంతో.. రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తడం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం ద్వారా అడుగడుగునా అండగా నిలబడ్డ జగన్ ప్రభుత్వంగత 15 నెలల పాలనలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కూటమి. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు పడిగాపులు పడ్డా ఉత్త చేతులేరైతులకు పార్టీ ముద్ర వేస్తూ.. యూరియా కొరత లేదని చెబుతున్న చంద్రబాబు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను హేళన చేస్తున్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ హయాంలో ఎక్కడా ఆర్బీకే సెంటర్ల ముందు క్యూలైన్లు కనిపించిన ఫొటో ఒక్కటైనా చూపించగలరా?ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు -
‘అసుర.. అసుర.. భూబకాసుర’..400కోట్ల విలువైన ఆలయ భూములపై కన్నేసిన చంద్రబాబు
సాక్షి,తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు భూబకాసురుడుగా మారాడని, ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.400 కోట్ల విలువైన ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ప్క్లబ్ల ముసుగులో కావాల్సిన వారికి దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూసమాజం సహించదని హెచ్చరించారు. ఆలయ భూములను కాజేసేందుకు రాత్రికి రాత్రే చదును చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం దారుణమని అన్నారు. చంద్రబాబు అండతో, ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న ఈ దురాగతాన్ని న్యాయపోరాటం ద్వారా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, విలువైన ఆలయ భూములను పద్ధతి ప్రకారం తమ వారికి దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది. మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ప్ క్లబ్‌లకు ఎలా కేటాయిస్తారు? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శిధిలావస్థకు చేరిన ఈ ఈ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షలు కేటాయించి వైయస్ జగన్ జీర్ణోద్దరణ చేశారు. నేడు కూటమి ప్రభుత్వం మాత్రం విలువైన ఆ ఆలయ భూములు కబ్జా చేసేందుకు కలెక్టర్‌ని అడ్డం పెట్టుకుని పావులు కదుపుతోంది. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు కౌలుకిచ్చిన ఈ భూముల్లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో రాత్రికిరాత్రే కంకర, మట్టి, ఇసుక తరలించి లెవలింగ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా చేసిన ఈ భూకేటాయింపులను హిందూ ధర్మపరిరక్షణ సంఘాలు చూస్తూ ఊరుకోవు. ఒక్క గజం భూమి కూడా కబ్జా కానివ్వం. ఈ భూముల వ్యవహారంపై అవసరమైతే న్యాయస్థానాల్లోనే వైఎస్సార్సీపీ పోరాడుతుంది. సనాతన ధర్మ పరిరక్షకులు దీనిపై స్పందించాలి:మచిలీపట్నంలో గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన సుమారు 40 ఎకరాల భూమిని దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగా 35 ఎకరాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పేరిట, మరో 5 ఎకరాలను గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు పేరిట భారత్ గోల్ఫ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కేటాయించాలని సూచిస్తూ స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు అండతో స్థానిక ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో కలెక్టరే ఈ భూపందేరం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. కూటమి నాయకులు ఆలయ భూములను కాజేస్తున్నారని మేం చేసే ఆరోపణలు కాదు.. టీడీపీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతిలో కూడా 'అయ్యో సామీ' పేరిట కథనం ప్రచురించింది. విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం దేవాదాయ శాఖ భూములిచ్చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేసుకునే బీజేపీ నాయకులు, ఆలయ భూములను అప్పనంగా కట్టబెట్టేస్తుంటే చోద్యం చూడటం ఆశ్చర్యకరమైన విషయం. దీనికి బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురంధీశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమాధానం చెప్పాలి. రిక్రియేషన్ ముసుగులో పేకాట ఆడుకోవడం కోసం భూములు కట్టబెట్టేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? ఎన్నికల్లో ఓట్ల కోసమే దేవుడి పేరు వాడుకుంటారా? ఆలయ అభివృద్ధికి రూ.1.80 కోట్లు కేటాయించిన వైఎస్ జగన్:కలెక్టర్ లేఖ రాసిందే తడవుగా రాత్రికి రాత్రే ఈ ఆలయ భూములను చదును చేసేశారు. ఇప్పటికే ఆ భూములను వేలం ద్వారా పలువురు రైతులు కౌలుకు పొందారు. బొర్రా రవికి ఏడెకరాలు, అబ్బూరి శ్రీనివాసరావు, అనుముల రామారావుకి, ఈపూరు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తులకు వ్యవసాయం చేసుకోవడానికి మే 15న కౌలుకు అనుమతులు ఇచ్చారు. వారి కౌలు గడువు ముగియక ముందే ఆఘమేఘాల మీద ఈ భూములను స్వాధీనం చేసుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, గోల్ప్కోర్ట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. 2017 లోనే ఈ ఆలయ భూములు కాజేయాలని టీడీపీ నాయకులు స్కెచ్ వేసుకున్నారు. అందులో భాగంగానే శ్రీ వేకంటేశ్వరస్వామి ఆలయాన్ని విజయవాడ దుర్గగుడికి అడాప్ట్ చేశారు. ఈ నేపథ్యంలో 2019లో టీడీపీ ఓడిపోవడంతో ఈ దోపిడీకి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత నాటి మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం పరిధి నుంచి తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి ఈ భూములను తీసుకొచ్చారు. పాడుపడిపోయి, దూపదీప నైవేద్యాలకే కరువైన ఈ గుడికి నాటి సీఎం వైయస్ జగన్ రూ.1.80 కోట్లు కేటాయించి చినజీయర్ స్వామితో అభివృద్ధి పనులు ప్రారంభింపజేశారు. ఒకపక్క మేం హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా ఆలయాల అభివృద్దికి నిధులు కేటాయిస్తుంటే, కూటమి నాయకులు మాత్రం ఆలయాల పేరిట ఉన్న విలువైన భూములపై కన్నేసి దోచుకునే పనిలో పడ్డారు.ఆలయ భూముల పరిరక్షణకు న్యాయపోరాటం:ఏదైనా భూకేటాయింపులు నిబంధనల ప్రకారం జరగాల్సిందే. ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేస్తామంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. బీజేపీ, వీహెచ్‌పీ మాతో కలిసొచ్చినా రాకోపోయినా పర్లేదు.. భూకేటాయింపులు ఆగేదాకా పోరాడతాం. జరగని తప్పులు జరిగినట్టుగా చూపించడానికి దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్, తాను భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే చూస్తూ కూర్చోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై వైయస్సార్సీపీ తరఫున న్యాయపరంగా పోరాడతాం. భూమిని చదును చేయడానికి ఇసుక, కంకర, మట్టి తరలించిన వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఒక్క గజం స్థలం అన్యాక్రాంతమైనా ఊరుకునేది లేదు. పనులను అడ్డుకుంటున్న దేవాదాయ శాఖ అధికారులను ఎంపీ కేసినేని చిన్ని మనషులు బెదిరిస్తున్నారు. పోలీసులు దీనిపై తక్షణం కలగజేసుకుని చదును చేసే పనులు ఇక్కడితే ఆపేయించాలి. -
భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
-
గణేశ్ నిమజ్జనంలో దుమ్మురేపుతున్న జగన్ పాటలు
-
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.జోన్-1 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొంటు రఘురామ్ (శ్రీకాకుళం), జోన్-2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బూరుగుపల్లి సుబ్బారావు (తూర్పుగోదావరి), జోన్-3 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సింహాద్రి రమేష్ బాబు (కృష్ణాజిల్లా), జోన్-4 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎనుముల మారుతి ప్రసాద్‌రెడ్డి (ప్రకాశం), జోన్-5 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వంగల భరత్ కుమార్‌రెడ్డి (కర్నూలు), ఆక్వా కల్చర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురామ్ (పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు. -
రాష్ట్రం మీ జాగీరా?.. కమీషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు అప్పగిస్తారా?... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
రాష్ట్రం మీ జాగీరా?
ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం ఘన కార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా? మా ప్రభుత్వ హయాంలోనే ఏటా రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపచేశాం. తద్వారా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా? లేక రూ.25 లక్షలకా? ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.3,600 కోట్లు ఖర్చు చేయలేని మీరు రూ.5 వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : ‘మా ప్రభుత్వ హయాంలో మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కక్కుర్తితో మీ వాళ్లకు పందేరం చేస్తారా? ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా?’ అని సీఎం నారా చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 కంటే ముందు మూడు దఫాలుగా సీఎం ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా.. అని నిలదీశారు. కనీసం ఆ ఆలోచనైనా చేశారా అంటూ నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వ ఐదేళ్ల అతి కొద్ది కాలంలోనే తాము ప్రభుత్వ రంగంలో పెట్టిన 17 కాలేజీల్లో ఐదు చోట్ల క్లాసులు ప్రారంభమయ్యాయని, ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు జరిగాయని గుర్తు చేశారు. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే గతేడాది మరో ఐదు.. ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యేవి కాదా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. తాము పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాంల కోసం నిన్న (గురువారం) కేబినెట్లో ప్రైవేటుపరం చేస్తారా..? ఇది అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం కాదా? అంటూ దెప్పి పొడిచారు. దీంతో మీరు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని స్పష్టం చేశారు. ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. తాము అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేస్తామని, ఈ కాలేజీలను మళ్లీ ప్రభుత్వ రంగంలోకే తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. అనుకున్నంత పని చేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీ వాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాంల కోసం కేబినెట్లో ప్రైవేటుపరం చేస్తూ నిర్ణయం తీసుకోవడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీంతో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు గారూ. ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా ఉంది.» 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు మూడు దఫాలు సీఎంగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా? కనీసం ఆ ఆలోచన చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా ఐదేళ్ల అతికొద్ది కాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తయి, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే, గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా? మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ప్రస్తుతం ఈ కాలేజీల రాకతో అక్కడ అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది? అవినీతి కోసం ఇంతగా తెగిస్తారా? » మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తి చేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భుత కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బ తీయడం ఎంత వరకు సమంజసం? రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగా, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా? కళ్ల ముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక పోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడ ప్రయివేటు మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్, రష్యా, పిలిప్ఫైన్స్ లాంటి ఇతర దేశాలకు పంపిస్తున్న మాట వాస్తవం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కౌన్సిల్) మెడికల్ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడింది. పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బ కొడుతున్నారెందుకు చంద్రబాబు గారూ?» ప్రతి జిల్లాలో వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ రంగం కూడా ఉండాలని, అప్పుడే అక్కడ ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని తెలియదా? అప్పుడే ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు.. రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పని చేస్తాయన్న కనీస జ్ఞానం లేదా? లంచాల కోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా? ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా?» రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదా చంద్రబాబు గారూ.. నెట్వర్క్ ఆస్పత్రులకు నెలకు ఇవ్వాల్సిన దాదాపు రూ.300 కోట్ల చొప్పున ఈ 15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చారు. దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజల కోసం తీసుకొచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీ పథకాన్ని నాశనం చేశారు. చివరకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు అందించే ‘ఆరోగ్య ఆసరా’ను కూడా సమాధి చేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, ఈ 15 నెలలకుగాను దాదాపుగా రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. » ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘన కార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా? మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారందరికీ వర్తింప చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇది వాస్తవం కాదా? ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి? ఒక్కోచోట, ఒక్కోమాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా? లేక రూ.25 లక్షలకా? అసలు ఈ 3,257 ప్రొసీజర్లు అంటే.. ఆపరేషన్ల ఖర్చు రూ.25 లక్షలదాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ రూ.5 వేల కోట్లో దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే మనసు లేనివారు... ఇక రూ.5 వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్లీ మోసం. » ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది కదా చంద్రబాబు గారూ. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా? లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తారా? కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తే.. రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా? చికిత్సల జాబితాలో లేకపోయినా, ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా.. కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికే మీ ఈ నిర్ణయాలనే ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? » చంద్రబాబు గారూ.. ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఇప్పటికే మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేస్తాం. ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం. -
చంద్రబాబు అనుకున్నంత పనీ చేశారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.‘‘చంద్రబాబు అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంల కోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం.’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు. ప్రజలకోసం కాకుండా దోపిడీకోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా మీ తీరు ఉంది. 1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా ఉన్న సీఎంగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘కనీసం ఆ ఆలోచన చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతికొద్ది కాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తై, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎన్నికలు ముగిశాక మరోచోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే, గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా?. మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు?. ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది?. అవినీతికోసం ఇంతగా తెగిస్తారా?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.1.@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం… pic.twitter.com/oBXj40vmOP— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2025‘‘మా ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తిచేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం?. రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగానూ, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా?. కళ్లముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘ఇక్కడ సరిపడా మెడికల్ సీట్ల లేకపోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఇక్కడ ప్రయివేటు మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్, రష్యా, పిలిప్ఫైన్స్ లాంటి ఇతర దేశాలకూ పంపిస్తున్న మాట వాస్తవం కాదా?. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి NMC మెడికల్ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడింది చంద్రబాబూ?. పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్ స్పెషాల్టీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బకొడుతున్నారు కదా చంద్రబాబూ?..ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో, ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వరంగం కూడా ఉండాలని, అప్పుడే, అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు, ఈ రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పనిచేస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా, లంచాలకోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా?ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా?. రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదా చంద్రబాబూ?. ఈ 15 నెలల కాలంలో నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన, దాదాపు రూ. 300 కోట్లు, అంటే 15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే, 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజలకోసం తీసుకు వచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారు...చివరకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేలు అందించే “ఆరోగ్య ఆసరా’’ను కూడా సమాధిచేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, ఈ 15 నెలలకుగానూ దాదాపుగా రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా?. మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం కాదా?...ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి?. ఒక్కోచోట, ఒక్కోమాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా లేక రూ.25 లక్షలకా?. అసలు ఈ 3257 ప్రొసీజర్లు అంటే, ఆపరేషన్ల ఖర్చు రూ.25 లక్షలదాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ రూ.5వేల కోట్లో దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే మనసు లేనివారు, ఇక రూ.5వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా?. ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్లీ మోసం...ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది కదా చంద్రబాబూ. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా?. లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తారా?. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా?. చికిత్సల జాబితాలో లేకపోయినా, ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా?..కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికి మీ ఈ నిర్ణయాలంటున్న ఆరోపణలకు, మీ సమాధానం ఏంటి? ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు చంద్రబాబూ. ఇప్పటికే మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దుచేస్తాం. ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
విద్యారంగంలో జగన్ సంస్కరణలు.. పిల్లల కోసం గోరుముద్ద పథకం
-
‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసే నీచ చరిత్ర చంద్రబాబుది’
సాక్షి,శ్రీకాకుళం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.మెడికల్ కాలేజీను ప్రైవేట్‌పరం చేసే దౌర్భాగ్యపు చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు తోడు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను చంద్రబాబు అమ్మేస్తున్నారు. మెడికల్ కాలేజీను చంద్రబాబు ప్రైవేట్‌పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే దరిద్రపు చరిత్ర చంద్రబాబుది. ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో ఉంచుకుంటున్నారా? లేదంటే అమ్ముకుంటున్నారో చెప్పండి’అని ప్రశ్నించారు. -
ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: ఉపాధ్యాయులందరికీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాంకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో.. మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు’అని పేర్కొన్నారు.మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు.#TeachersDay pic.twitter.com/wlXHnhvKor— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2025 -
‘ఆరోగ్యం’ హరీ!
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త కాలేజీల్లో మెరుగైన నిర్వహణ కోసం గత ప్రభుత్వంలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు నాడు నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వారికి వంత పాడే ‘ఈనాడు’.. వైద్య విద్యనూ అమ్మేశారు.. వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్.. అంటూ కట్టుకథలు రాసుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ఆ హామీని తుంగలో తొక్కి ఇప్పుడు ఏకంగా వైద్య కళాశాలలనే అమ్మకానికి పెట్టేశారు!!సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 10 కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి ఏపీ కేబినెట్ ఇప్పుడు వేదికైంది! ఏ ప్రభుత్వమైనా పోరాడి మరీ మెడికల్ కాలేజీలను సాధించుకుంటుంది. అలాంటిది అన్ని హంగులతో సిద్ధమైన వాటిని చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌పరం చేస్తుండటంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో సాకారమైన మెడికల్ కాలేజీలను కక్షపూరితంగా అడ్డుకుని పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. కూటమి సర్కారు అనాలోచిత చర్యలతో మన రాష్ట్రం మెడికల్ సీట్లను కోల్పోవడంతోపాటు నాణ్యమైన వైద్యం పేదలకు దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉంటే టీచింగ్ ఆస్పత్రి ద్వారా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థుల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిలా నిర్వహించడం ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పోటీతత్వం పెరిగి రేట్లు తగ్గుతాయి. నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. ప్రజలకు వైద్యం భారం కాకుండా ఉంటుంది. ఇప్పుడు మెడికల్ సీట్లు కోల్పోవడమంటే పేదలకు నాణ్యమైన వైద్యం దూరమైనట్లే! ఇక ప్రజల ఆరోగ్యంతోనూ చంద్రబాబు సర్కారు ఆటలాడుతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిన కూటమి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చొప్పున 15 నెలల్లో నెట్వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.4,500 కోట్లు బిల్లులు బకాయిలు పెట్టడం, ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టడంతో వైద్య సేవలు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. బిల్లులు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను చేర్చుకోవడం లేదు. ఇక 108, 104 వాహనాల పరిస్థితి దారుణంగా ఉంది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించి ప్రజారోగ్యానికి భరోసా కల్పించగా కూటమి సర్కారు మోసపూరితంగా వ్యవహరిస్తూ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తూ.. అటు ఆరోగ్యశ్రీని బీమా కంపెనీ చేతుల్లో పెట్టి వైద్య రంగాన్ని స్కామ్‌ల మయంగా మారుస్తోంది. సంపద సృష్టి అంటే.. స్కామ్‌లు చేయడం.. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేట్‌కి దోచిపెట్టి కమీషన్ల రూపంలో డబ్బులు వసూలు చేసుకోవటమా? అని వైద్య రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1992 నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు అనుమతించడంలో అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో పదవికి రాజీనామా చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ రంగంలో అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్న వాటిని ప్రైవేట్ చేతుల్లో పెడుతూ స్కామ్‌లకు తెర తీస్తున్నారని పేర్కొంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అన్నీ ప్రభుత్వ పరిధిలో నడిచేలా ఏకంగా 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. అదే ప్రణాళిక ప్రకారం అవన్నీ అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో చేతి నుంచి రూపాయి ఖర్చు చేసే పని లేకుండా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అయ్యేవి. అలాంటిది పీపీపీ పేరిట చంద్రబాబు సర్కారు 10 కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతోంది. దీంతో ఆయా కళాశాలలపై 63 ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు హక్కులు ఉంటాయి. వారి ఆధీనంలోనే బోధనాస్పత్రులు నడుస్తాయి. ఆ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు, మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితం కాదు. డబ్బులు చెల్లించి ప్రజలు సేవలు పొందాల్సి ఉంటుంది. ఓవైపు ఆరోగ్యశ్రీ సేవలు బీమా రూపంలో ఎండమావిగా మారుస్తున్నారు. మరోవైపు వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు. దీంతో దురదృష్టవశాత్తూ జబ్బుల బారిన పడితే పేదల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం నెలకొంది. పేదలకు ఉచిత వైద్యం కలే! ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడంతో పాటు ఆరోగ్యశ్రీలో బీమా విధానం అమలుకు పచ్చజెండా ఊపడం ద్వారా 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ భరోసా కల్పించిన దేశంలోనే అత్యుత్తమ పథకానికి కూటమి సర్కారు ఉరి బిగించింది. బీమా కంపెనీలు చెల్లించిన ప్రీమియంలో వీలైనంత ఎక్కువ లాభం పొందేలా లెక్కలేనన్ని కొర్రీలు వేసి చికిత్సలకు అనుమతులు, క్లెయిమ్‌లను తిరస్కరిస్తుంటాయి. ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐబీఏఐ) ప్రకారం దేశంలో 20 ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీలు నమోదైన క్లెయిమ్‌ల మొత్తంలో 55 నుంచి 80 శాతం మేర మాత్రమే చెల్లిస్తున్నాయి. దీన్నిబట్టే ఆరోగ్య శ్రీలో బీమా విధానం ప్రవేశపెడితే ఏం జరుగుతుందో ఊహించవచ్చు. ఇలాంటి వ్యవస్థలను ప్రభుత్వ ఆరోగ్య రంగంలోకి చొప్పిస్తే పేదలకు ఉచిత వైద్యం కలేనని నిపుణులు పేర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.2.5 లక్షల వరకు చికిత్సలను మాత్రమే బీమా రూపంలో అందించనుంది. అంతకంటే ఎక్కువ ఖర్చయితే ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని చెబుతున్నారు. అంటే బీమా కంపెనీ దయాదాక్షిణ్యాల ఆధారంగానే ప్రజలకు చికిత్సలు అందుతాయన్నమాట. ‘ఆసరా’ ఎగరగొట్టి... ఆరోగ్యశ్రీ అంటేనే ప్రజలకు గుర్తుకొచ్చేది మాజీ సీఎంలు వైఎస్సార్, వైఎస్ జగన్. వారి ముద్రను చెరిపేయాలనే కక్షతో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలి పీఠం ఎక్కిస్తుండటం నివ్వెరపరుస్తోంది. గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రలకు దిగింది. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా వాటి యాజమాన్యాలు సేవలు నిలిపేసి సమ్మెకు దిగేలా చేసింది. శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు ఇచ్చే ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ సాయాన్ని నిలిపేశారు. బీ‘మాయ’ వద్దంటూ... దేశంలో బీమా విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు సైతం కంపెనీల సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాటి పనితీరుపై విసుగు చెంది ట్రస్ట్ విధానంలోకి మారుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బీమా విధానం నుంచి ఇప్పటికే బయటకు వచ్చేసింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే జన్ ఆరోగ్య యోజన (ఎంజేపీజేఏవై)ను తొలుత అమలు చేసింది. దీనికింద 95.47 లక్షల కుటుంబాలకు రూ.లక్షన్నర బీమా కవరేజీ ఉండేది. కానీ, ఆస్పత్రులకు క్లెయిమ్‌ల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, వైద్య సేవల్లోనూ ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు, పలుసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో రూ.3 వేల కోట్ల కాంట్రాక్టును రద్దు చేసింది. అనంతరం నేరుగా ప్రభుత్వమే స్టేట్ హెల్త్ అష్యూరెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తోంది. మహారాష్ట్రలాగే బీమా నుంచి ట్రస్ట్విధానంలోకి మారాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. చికిత్సల్లో జాప్యం.. ప్రజల ప్రయోజనాలను కాలరాస్తూ బీమా వైపే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రస్తుతం హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ అమలు చేస్తుండగా కొత్త విధానంలో రాష్ట్రంలోని జిల్లాలను రెండు భాగాలుగా చేసి రెండు క్లస్టర్లుగా కుటుంబాలు/లబ్ధిదారుల వారీగా ప్రీమియం చెల్లించనుంది. అంటే ప్రభుత్వ నిధులను మళ్లీ మధ్యవర్తి చేతిలో పెడుతున్నారు. ఇవన్నీ చెల్లించిన ప్రీమియంలో ఎక్కువ మిగుల్చుకుని తక్కువ ఖర్చు చేయడమే పరమావధిగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఆస్పత్రుల నుంచి చికిత్సల అభ్యర్థనలను రకరకాల కారణాలు చూపి తిరస్కరిస్తాయి. రోగులకు వైద్యం అందడంలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ప్రస్తుత విధానంలో ట్రస్ట్ పర్యవేక్షణలో ఉన్న నెట్వర్క్ ఆస్పత్రులపై పూర్తి అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్ సీఈవోకు ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకునే అధికారం ఉంది. బీమా పద్ధతిలో నెట్వర్క్ ఆస్పత్రులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండదు. బీమా కంపెనీ చెప్పుచేతల్లోకి ఆస్పత్రులు వెళతాయి. ఆ కంపెనీ నియమ నిబంధనల ప్రకారమే వైద్యం అందిస్తాయి. ఆరోగ్యశ్రీతో వైఎస్ జగన్ ఆపన్నహస్తంపేద, మధ్య తరగతి ప్రజలు గుండె, మెదడు, కాలేయ, కేన్సర్ వంటి ఎంత పెద్ద జబ్బు బారినపడినా చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టనివ్వకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చంద్రబాబు పాలనలో నిర్వీర్యమైన ఈ పథకం బలోపేతానికి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. 2019 ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చారు వైఎస్ జగన్. 2019కి ముందు వెయ్యి లోపు మాత్రమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా ఏకంగా 2,371 ఆస్పత్రులకు విస్తరించారు. చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు పెంచారు. ⇒ టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను వైఎస్ జగన్ ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించారు. రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. శస్త్రచికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లకు పైగా సాయం చేశారు. ఇక దేశంలోనే తొలిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి మహమ్మారి విజృంభణ వేళ ప్రజలకు కొండంత భరోసా కల్పించారు. వైఎస్ జగన్ హయాంలో రూ.25 లక్షల వరకూ చికిత్సలను ప్రజలు పూర్తి ఉచితంగా పొందే వీలు కల్పించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ జగన్ రాష్ట్రంలోని మధ్య తరగతి కుటుంబాలకు సైతం ఆరోగ్య భద్రత కల్పించారని నీతి ఆయోగ్ సైతం ప్రశంసించింది.వైద్య విద్య ‘ప్రైవేట్’ పరంవాస్తవానికి గత విద్యా సంవత్సరమే పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని మెడికల్ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం కుట్రపూరితంగా పులివెందులకు మంజూరైన అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయించింది. గతేడాది నిలిచిన నాలుగు కళాశాలలకు అనుమతులు ఈ దఫా అయినా వస్తాయని, ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు సమకూరతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశించారు. విద్యార్థుల భవిష్యత్, పేదల ఆరోగ్యం ఏమైపోతే మాకేంటన్నట్టుగా ‘పీపీపీ విధానంపై ముందుకే వెళ్లాలి’ అని నిర్ణయించిన ప్రభుత్వం కళాశాలలకు అనుమతుల దరఖాస్తు సమర్పించనేలేదు. గత విద్యా సంవత్సరం ఐదు కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం కక్షపూరిత విధానాలతో కేవలం 50 సీట్లతో పాడేరు వైద్య కళాశాలకు మాత్రమే అనుమతులు దక్కాయి. దీంతో 700 ఎంబీబీఎస్ సీట్లు గతేడాది మన విద్యార్థులు నష్టపోయారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే, వైద్య కళాశాలల నిర్మాణాలన్నింటినీ గద్దెనెక్కిన రోజు నుంచే చంద్రబాబు నిలిపివేయించారు. గతేడాది ప్రారంభానికి నోచుకోని 4 కళాశాలలతోపాటు, ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఏడింటిలో ఏ ఒక్క కళాశాలకు అనుమతుల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయలేదు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చిది. -
మురళీకృష్ణంరాజును ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: నర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు మురళీకృష్ణంరాజును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. 86 ఏళ్ల వయసున్న మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజుపై తప్పుడు కేసు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. అక్రమ కేసులపై భయపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.పింఛన్లు పంపిణీ సందర్భంగా ఈనెల 1వ తేదీన ధర్మవరంలో మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్ళిన సచివాలయం మహిళ సంరక్షణ కార్యదర్శి రాధిక.. జగన్నాధరాజు అనే పింఛన్ దారుని చిరునామా కోసం రామరాజును ఆమె వివరాలు అడిగారు. ఈ సమయంలో తనను 86 ఏళ్ల రామరాజు లైగింకంగా వేధించారని ఆరోపిస్తూ ప్రత్తిపాడు పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. రాధిక ఫిర్యాదు మేరకు ఆగమేఘాలపై పోలీసులు లైగింక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
జగన్ తోనే అభివృద్ధి నిజం ఒప్పుకున్న బాబు
-
ఇక చాలు.. చలనం లేదా నీకు! బాబుపై జగన్ సీరియస్
-
రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే మీలో చలనం లేదా చంద్రబాబూ?
-
కామిరెడ్డి నానిని పరామర్శించిన వైఎస్ జగన్
-
బాబూ.. ఈ ఫొటో నకిలీ అని నిరూపించే దమ్ముందా?: వైఎస్సార్సీపీ సవాల్
సాక్షి, అమరావతి: రైతులకు యూరియా సహా ఎరువులను సరఫరా చేయలేని సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు బారులు తీరిన ఫొటోలను పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇవి నకిలీవని నిరూపించగలరా? అని సవాల్ విసిరింది.‘రైతులకు ఎరువుల సరఫరా విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం ఆక్రోశం! రాష్ట్రంలో ఎరువుల కొరత లేదంట! ప్రెస్మీట్లో బొంకుల బాబు ఫస్ట్రేషన్! మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ ఫోటో ఫేక్ అంటూ పచ్చ సైకోల సర్క్యులేషన్! మరి ఈ ఫోటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోనే కాదు.. రైతులు క్యూలు కట్టిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రజల పరిశీలనకు ఇక్కడ పెడుతున్నాం. చంద్రబాబు నిజాలకు పాతర వేసి, బుల్డోజ్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటశాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ఇవాళ్టి దృశ్యాలివీ! చేతనైతే వీటిని నకిలీవని నిరూపించండి..!’ అని సవాల్ విసిరింది. రైతులకు ఎరువుల విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం @ncbn ఆక్రోశం. రాష్ట్రంలో ఎరువుల కొరతే లేదంట. ప్రెస్మీట్లో బొంకుల బాబు ఫ్రస్టేషన్. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిగారు చేసిన ట్వీట్ ఫొటో ఫేక్ అంటూ పచ్చసైకోల సర్క్యులేషన్. ఈ ఫొటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోయే… https://t.co/dkFKyEEYAv pic.twitter.com/HILCefZooJ— YSR Congress Party (@YSRCParty) September 3, 2025 -
YS జగన్ పై ట్వీట్.. అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
-
ఇసుక.. సర్కారు మస్కా!
ఉచితం ముసుగులో అడుగడుగునా ఉల్లంఘనలు.. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా కూటమి పార్టీల నేతల జేబులు మాత్రం నిండుతున్నాయి.. మరోవైపు రెట్టింపు ధర చెల్లించి ప్రజలు ఇసుకను కొనుక్కోవాల్సి వస్తోంది.. కాదు, కూడదంటే ఎదురు దాడి.. వేధింపులు.. తప్పుడు కేసులు.. రాష్ట్రంలో ఇసుక విషయంలో జరుగుతున్నది ఇదే. ఈ విషయం ప్రజల్లో చర్చకు వస్తుండటంతో ఎప్పటిలాగే తమదైన శైలిలో కూటమి ప్రభుత్వ పెద్దలు విష ప్రచారానికి తెర లేపారు. దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లు రూ.100 కోట్ల జరిమానా సంగతి కప్పిపుచ్చుకోవడానికి కుప్పిగంతులేస్తున్నారు. ఇసుక ఎక్కడ ఉచితంగా ఇస్తున్నారో చెప్పండన్న ప్రజల ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. సాక్షి, అమరావతి: ఉచితం ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి దిగింది. వేల కోట్ల రూపాయల విలువైన ఇసుకను ఎక్కడికక్కడ దోచేస్తూ మూడు జేసీబీలు.. ముప్పై టిప్పర్లుగా దందాను కొనసాగిస్తూ గతంలో అక్రమాలు జరిగాయంటూ విష ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఉచితంగా ఇసుక లభించక పోయినా, ప్రభుత్వానికి ఏమాత్రం ఆదాయం రాకపోయినా తన దందాను సమర్థించుకుంటోంది. పైగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ).. జేపీ వెంచర్స్ తమ వద్ద రూ.18 కోట్లు ఉంచాలని చెప్పిన విషయాన్ని చిలవలు పలువలుగా వక్రీకరించి జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేస్తోంది. నిజానికి 2014–19 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం జరిగాయి. నాటి సీఎం చంద్రబాబు నివాసం వెనక భాగంలో కృష్ణా నదిని కొల్లగొట్టి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని 2019 ఏప్రిల్ 4వ తేదీన ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ధృవీకరించింది. ఈ అక్రమాలకు కళ్లెం వేస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా సైతం విధించడం తెలిసిందే.నాడు అక్రమ తవ్వకాలను బయటపెటి్టన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాఅప్పట్లో ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్నాయని, వాటిని వెంటనే నివారించాలని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ ఎన్జీటీలో పిటీషన్ వేశారంటే ఇసుక అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో స్పష్టమవుతోంది. ఆయన స్వయంగా ఇక్కడ పర్యటించి అక్రమాలను కళ్లారా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కృష్ణా నది ప్రమాదంలో పడిందని ఆ తర్వాత ఎన్జీటీలో స్వయంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. స్థానిక పర్యావరణ వేత్త అనుమోలు గాంధీ ఇంకా పలువురు కూడా సీఎం చంద్రబాబు నివాసం వెనుక వెంకటపాలెం సమీపంలో కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల కృష్ణా నది ప్రమాదకరంగా మారిందని పిటీషన్లు వేశారు. అక్రమ తవ్వకాలు నిర్ధారణకృష్ణా నదిలో అక్రమ తవ్వకాలను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ఎన్జీటీ ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఉండవల్లి కరకట్టతోపాటు పలు ప్రాంతాలను పరిశీలించి, ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. చంద్రబాబు నివాసం పక్కనే కృష్ణా నది కరకట్టపై నుంచి నదిలోకి వెళ్లి నదీ గర్భంలో 25 మీటర్ల లోతుకు భారీ యంత్రాలతో తవ్వి ఇసుకను తీస్తున్నారని స్పష్టం చేసింది. డ్రెడ్జింగ్ ముసుగులో నిషేధించిన భారీ డ్రెడ్జర్లు, పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల నది కోర్సు ప్రమాదభరితంగా మారిందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అక్రమంగా తవ్విన ఇసుక నిత్యం 2,500 ట్రక్కుల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతోందన్న పిటీషనర్ల వాదన నిజమేనని తేల్చింది. 25 టన్నుల సామర్థ్యం గల ట్రక్కులో 40 టన్నుల ఇసుకను లోడ్ చేసి అమ్ముకుంటున్నారని స్పష్టం చేసింది. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట పడాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా వేయాలని కమిటీ సూచించడంతో ఎన్జీటీ న్యాయమూర్తి రూ.100 కోట్ల జరిమానా విధించారు. ఎన్జీటీ జరిమానా వేసిన కొద్ది రోజులు తవ్వకాలు ఆగినా, మళ్లీ యథావిధిగా ఇసుక తవ్వకాలు సాగించి దందా కొనసాగించారు. వైఎస్ జగన్ హయాంలో పారదర్శక విధానం.. ప్రభుత్వానికి ఆదాయం 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇసుక అక్రమాలను నిరోధించేందుకు పటిష్టమైన విజిలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఇసుకపై ఒక్క రూపాయి ఆదాయం రాని పరిస్థితుల్లో పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేలా చేసింది. ఐదేళ్లలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.3,750 కోట్ల ఆదాయం లభించింది. ఆదాయం రావడమే కాకుండా ఇసుక తవ్వకాలు క్రమబద్ధంగా జరిగి ప్రజలకు సులభతరంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధరలు కూడా టీడీపీ ప్రభుత్వం కంటే బాగా తగ్గాయి. ఉచితం మాటున అడ్డగోలు దోపిడీ ప్రస్తుతం ఉచితం మాటునే ఇసుక అమ్మకాలు జరుగుతుండగా, టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఇసుక దోపిడీ అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదు. అదేమంటే ఇది ఉచిత ఇసుక విధానం, డబ్బు కడితేనే ఉచిత ఇసుక ఇస్తామని చెబుతున్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబళ్లలో ఇసుకను స్థానికులు ఉచితంగా తీసుకెళ్లవచ్చని చెప్పినా, టీడీపీ నేతలు అసలు ఎవరినీ రీచ్ దగ్గరకే రానీయడం లేదు. ఇప్పుడు ఉచిత ఇసుక వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలు కంటే కూడా అధిక ధరకు అమ్ముతుండడం గమనార్హం. విజయవాడలో 22 టన్నుల లారీ ఇసుక రూ.40 వేల నుంచి రూ.50 వేలకు అమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వ రాకతో మళ్లీ అక్రమాలు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా రీచ్‌ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై పడిన టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఆయా ఇసుక యార్డులను స్వాధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా అమ్ముకున్నారు. అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి తవ్వకం చార్జీలు, లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1,000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్‌లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. తవ్విన ఇసుకలో కొంత స్థానికంగా అమ్ముతూ, మిగిలిన ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి పెద్ద నగరాలకు తరలిస్తున్నారు.రూ.100 కోట్ల జరిమానా విధించిన చోటే మళ్లీ అక్రమ తవ్వకాలు 2019 ఏప్రిల్‌లో చంద్రబాబు హయాంలో ఆయన ఇంటి వెనుక భాగంలో కృష్ణా నదిలో అక్రమాలకు పాల్పడినట్లు ఎన్జీటీ నిర్ధారించి, జరిమానా విధించిన చోటే ప్రస్తుతం అదే రీతిలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి. బల్లకట్టు నావిగేషన్ ఛానల్ ముసుగులో డ్రెడ్జింగ్ చేస్తూ అప్పటి మాదిరిగానే ఒక అనామక సంస్థకు టెండర్ కట్టబెట్టి చినబాబు మనుషులు నిత్యం వేలాది టన్నుల ఇసుకను కరకట్ట మీదుగా భారీ వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. రూ.వందల కోట్ల ఇసుకను తవ్వి అమ్మేసుకుంటున్నా అడిగే నాథుడే లేకుండాపోయాడు. అదేమంటే అంతా సక్రమంగానే జరుగుతున్నట్లు గనుల శాఖ దబాయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అదే దందాూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక ముసుగులో అక్రమాల పర్వం యథేచ్చగా కొనసాగుతోంది. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు.. నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఇష్టానుసారం సాగిస్తున్నారు. » గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు సూచనలను సైతం లెక్క చేయకుండా అనుమతి లేని రీచ్‌ల్లోనూ ఇసుకను తోడేస్తున్నారు. కార్మికులతోనే తవ్వకాలు చేయాల్సి ఉండగా ప్రతిచోటా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచితం అంటూనే 18 టన్నుల లారీ ఇసుక రూ.30 వేల నుంచి 60 వేల వరకు అమ్ముతున్నారు. » ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు నుంచి హైదరాబాద్‌కు, అనంతపురం జిల్లా సరిహద్దు నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అన్ని చోట్లా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. వారి ఆధ్వర్యంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. కమీషన్లు చినబాబుకు ఠంఛనుగా చేరిపోతున్నాయి. చినబాబుకు కప్పం కట్టి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు నదులు, వాగులను కొల్లగొట్టేస్తూ రూ.వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను కప్పిపుచ్చేందుకే జేపీ వెంచర్స్‌కు ఎన్జీటీ జరిమానా విధించిందంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. -
తప్పుడు ట్వీట్ చేసి అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
సాక్షి, అమరావతి: దగుల్భాజీ పోస్ట్‌తో మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై లోకేష్ పైశాచిక ప్రచారానికి తెరతీశారు. తల్లి విజయమ్మను వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ ఫేక్ ప్రచారం చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మను వైఎస్ జగన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే, విజయమ్మను వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ లోకేష్ దుష్ప్రచారానికి ఒడిగట్టారు.తప్పుడు ట్వీట్ చేసి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. నీతులు చెప్పబోయిన నారా లోకేష్.. గోతిలో పడ్డారు. లోకేష్‌ది సైకో మనస్తత్వం అంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల మండిపడతున్నాయి. -
కామిరెడ్డి నానిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానితో ఆయన ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.తనపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ గూండాలు ఎలా దాడిచేశారనేది కామిరెడ్డి నాని.. వైఎస్ జగన్‌కు వివరించారు. తనపై దాడి తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడకు కూడా వచ్చి దాడి చేశారని నాని చెప్పారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను దారుణంగా ఇబ్బందులు పెట్టడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ సూచించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అర్థమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ది చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నానికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు. -
కమలమ్మ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కమలమ్మ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో నాన్నతో పాటు మృతి చెందిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అద్దంకి సాల్మన్ కేరి వెస్లీ వర్ధంతి రోజునే ఆయన మాతృమూర్తి కమలమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.హెలికాప్టర్ ప్రమాదంలో నాన్నతో పాటు మృతి చెందిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అద్దంకి సాల్మన్ కేరి వెస్లీ వర్ధంతి రోజునే ఆయన మాతృమూర్తి కమలమ్మ మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025 -
ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారని మండిపడ్డారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు పంటలకు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజూ ఆదుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం కలగడం లేదెందుకు? ⇒ ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. అందుకు అనుగుణంగా ఏమేరకు ఎరువులు పంపిణీ చేయాలి.. ఈ విషయాలపై ప్రతి ఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే కదా అర్థం? ⇒ ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. బస్తా యూరియా రేటు రూ.267 అయితే, దీనికి మరో రూ.200 అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు)లకు, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు గారూ.. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పీఏసీఎస్‌ల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50 తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారూ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా? ⇒ మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400–500కు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35తో అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేలతో అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు. ⇒ ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు పెట్టి.. ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు పట్టించుకోవడం లేదెందుకు చంద్రబాబు గారూ? నిద్ర నటించే వాళ్లని ఎవరైనా లేపగలరా?.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025⇒ మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్ టైం డేటా సీఎంఏపీపీ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ను మూలన పడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు. ఏ సీజన్లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్‌లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. అది కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. -
లోకేష్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు: అంబటి
-
‘జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్‌కు భయం’
సాక్షి,గుంటూరు: 9వ తేదీన రైతుల తరుఫున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో అన్నీ ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుల తరుఫున వైఎస్సార్సీపీ వినతి పత్రాలు సమర్పిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. లోకేష్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. వైఎస్ జగన్ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియో లోకేష్ పోస్టు చేసి ప్రేలాపనలు పేలుతున్నారు.లోకేష్.. మీ బాబాయిని సంకెళ్లతో కట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్ భయం. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన తల్లిని కూడా తిట్టించాడు. వీకెండ్లో లోకేష్ మాయమై ఎక్కడ తేలుతాడు కూడా చెబుతా. ఏపీలో నాదే రాజ్యమని లోకేష్ అనుకుంటే చాలా పొరపాటు. దౌర్భాగ్యమైన పద్దతుల్లో చంద్రబాబు,లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోకుండా వైఎస్ జగన్‌పై మీరు బురదజల్లే పనిలో ఉన్నారు. లోకేష్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. అధికారం శాశ్వతం కాదు. వైఎస్ జగన్ మీద బురదజల్లడం మానుకోవాలి. దౌర్భాగ్యమైన పరిస్థితిలో చంద్రబాబు,లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. -
జగన్ కృషి.. కొప్పర్తిలో టెక్నోడోమ్, టెక్సానా సంస్థల కార్యకలాపాలు ప్రారంభం
-
బాబు డైవర్షన్ డ్రామా.. జగన్ ప్రజల్లోకి వెళ్తే నా పరిస్థితి అంతే
-
అంబకపల్లెలో కృష్ణమ్మకు వైఎస్ జగన్ జల హారతి (ఫొటోలు)
-
ఏ పంటకూ ‘మద్దతు’ లేదు. చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ ధ్వజం
-
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
‘ఈ రోజు రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకునే దిక్కు లేదు. సూపర్ సిక్స్ హామీలంటూ అక్కచెల్లెమ్మలను మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతోంది..’ – పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్ ‘2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. ఆ తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ 27వేల మెజార్టీతో గెలిస్తే ఆ తర్వాత కొట్టుకుపోయింది. అదే నంద్యాలలో వైఎస్సార్సీపీ 35వేల మెజార్టీతో గెలిచింది’ – వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేకనే ఓటు వేసుకునే స్వేచ్ఛను ప్రజలకు టీడీపీ కల్పించడం లేదని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అది మరోసారి స్పష్టమైందని చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతల అరాచకాలు.. ఓటర్లను అడ్డుకుని టీడీపీ గూండాలు బెదిరింపులకు పాల్పడటాన్ని ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ చెబుతున్నారన్నారు.మూడు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం పులివెందుల నుంచి అంబకపల్లె వెళ్తూ నల్లపురెడ్డిపల్లె వద్ద తన కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులను కలిశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ గూండాల దౌర్జన్యంతో ఓటు వేయలేకపోయిన నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులు పోలింగ్ రోజు అక్కడ నెలకొన్న దారుణమైన పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. అధికార పక్ష నేతల అరాచకాలను కళ్లకు కడుతూ గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఇలాగే చేశారు.. ఆ తర్వాత టీడీపీ కొట్టుకుపోయింది..‘ఆ రోజు.. నల్లపురెడ్డిపల్లెలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజలకు ఓట్లు వేసుకునే స్వేచ్ఛ లేకుండా చేసి పోలీసులను వాడుకుని టీడీపీ గూండాలు ఎలా జులుం చేశారో, ఏ రకంగా అన్యాయం చేశారో గ్రామంలో ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న పరిస్థితుల్లో... నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ మీ జగన్ రుణపడి ఉంటాడు. మీ ఆప్యాయత, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.గతంలో 2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. ఆ తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ 27వేల మెజార్టీతో గెలిస్తే ఆ తర్వాత కొట్టుకుపోయింది. అదే నంద్యాలలో వైఎస్సార్సీపీ 35 వేల మెజార్టీతో గెలిచింది. అన్యాయం చేసినా, దౌర్జన్యం చేసినా దేవుడు అన్నీ చూస్తాడు. టీడీపీకి గట్టిగా బుద్ధి చెబుతాడు. ఈ రోజు రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకునే దిక్కు లేదు. సూపర్ సిక్స్ హామీలంటూ అక్కచెల్లెమ్మలను మోసం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతోంది’ అంబకపల్లె చెరువు వద్ద జలహారతి.. వైఎస్సార్సీపీ కృషితో అంబకపల్లెకు కృష్ణా జలాలు చేరుకున్న నేపథ్యంలో అక్కడి చెరువు వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ జలహారతి ఇచ్చారు. ‘పాడా’ నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు. పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్‌పురం వద్ద భారీ సంపు ఏర్పాటు చేసి 4.5 కి.మీ. మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేయించారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తంచేశారు.అక్కడకు వచ్చిన వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రహదారిపై పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. క్రేన్ సహాయంతో వైఎస్ జగన్‌కు భారీ గజమాల వేశారు. బాణాసంచా కాలుస్తూ డప్పుల దరువుతో గ్రామస్తులంతా రోడ్డుపైకి చేరి అభిమాన నేతకు స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. కృష్ణా జలాల మ్యాప్‌ను వైఎస్ జగన్ పరిశీలించి చెరువు శిలాఫలకాన్ని ప్రారంభించారు. తరలివచ్చిన పులివెందుల పల్లెలు.. 47 కి.మీ. ప్రయాణానికి 6 గంటలుఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ నుంచి అంబకపల్లెకు వైఎస్ జగన్ వస్తున్నట్లు తెలియడంతో ఆ మార్గంలోని పులివెందుల పల్లెలన్నీ రోడ్డుపైకి వచ్చి ఆయన కోసం వేచి చూశాయి. వీరన్నగట్టుపల్లెతో మొదలు పెడితే కుమ్మరాంపల్లె, చింతరాంపల్లె, వేంపల్లె, నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్నగారిపల్లె, అయ్యవారిపల్లె, గొందిపల్లె, వి.కొత్తపల్లె, వేముల, భూమయ్యగారిపల్లె, వేల్పుల, బెస్తవారిపల్లె, కె.వెలమవారిపల్లె, నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె తదితర గ్రామాల ప్రజలంతా సమీపంలోని రోడ్డుపైకి వచ్చి నిరీక్షించారు.దారి పొడవునా గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ అందరినీ ఉత్సాహపరుస్తూ జగన్ ముందుకు కదిలారు. 47 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 6గంటలు పట్టడం గమనార్హం. ఇడుపులపాయ నుంచి ఉ.9గంటలకు బయలుదేరిన వైఎస్ జగన్ అంబకపల్లెకు చేరుకునేందుకు సా.3 గంటలైంది. -
వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని ఘాట్ వద్ద ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కోడలు వైఎస్ భారతీరెడ్డి, సోదరుడు వైఎస్ సు«దీకర్‌రెడ్డి, దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సమీప బంధువు వైఎస్ యువరాజ్రెడ్డిలతోపాటు పలువురు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి స్మరించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు..వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు చేరుకుని ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద పాస్టర్లు బెన్హర్ నరేష్ బాబు, మృత్యుంజయరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున సమాధి ప్రాంగణానికి చేరుకుని నివాళులర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో వైఎస్సార్ ఘాట్ ప్రాంగణం నిండిపోయింది. అందరినీ పలుకరిస్తూ..వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం తండ్రిని స్మరించుకుంటూ వైఎస్ జగన్ కొద్దిసేపు మౌనంగా కూర్చున్నారు. సమాధి ప్రాంగణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడికి వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులను పలకరిస్తూ ముందుకు కదిలారు. ఆయన వెంట మాజీ డిప్యూటీ సీఎంలు అంజాద్‌బాషా, నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, విరూపాక్షి, పలువురు ఎమ్మెల్సీలు తదితరులున్నారు. నినాదాలతో హోరెత్తిన ఘాట్ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పోటెత్తిన అభిమానులు, కార్యకర్తల నినాదాలతో ఇడుపులపాయ హోరెత్తింది. ఉదయం ఘాట్ ప్రాంతానికి వైఎస్ జగన్ చేరుకోగానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా వైఎస్సార్‌ను స్మరించుకుంటూ నినదించారు. తల్లి విజయమ్మతో వైఎస్ జగన్నాన్నా... నిన్ను చాలా మిస్ అవుతున్నాను వైఎస్సార్‌కు నివాళులర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఘన నివాళులర్పించారు. ‘నాన్నా... నిన్ను చాలా మిస్ అవుతున్నాను’ అంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వైఎస్సార్‌తో తాను కలిసి ఉన్న ఫొటోలు, వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పిస్తున్న ఫొటోలను పోస్టుకు ట్యాగ్ చేశారు. -
ఏ పంటకూ ‘మద్దతు’ లేదు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మంగళవారం పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం తాళ్లపల్లె వద్ద ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో పంటలకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నదాతలు ఆవేదన వెలిబుచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం తమను ఆదుకుందని, ఇప్పుడు పంటలకు రేటు లభించక అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. వైఎస్ జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణం కళ్లు తెరిచి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... హెరిటేజ్‌లో కిలో రూ.35.. రైతులకు ఇస్తున్నది రూ.6 ‘ఈ రోజు చీనీ రేటు క్వింటాలు రూ.12వేల నుంచి రూ.6వేలకు పతనమైనా కొనుగోలు చేసే నాథుడు లేడు. ఇందులో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. అదే వైఎస్సార్సీపీ హయాంలో క్వింటాల్ కనీసం రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉల్లి క్వింటాల్ కనీసం రూ.4 వేలనుంచి రూ.12 వేలు చొప్పున అమ్ముడుపోయింది. ప్రస్తుతం రైతుల నుంచి క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి రూ.800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. లేదంటే క్వింటాలు రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటాలుకు నాలుగైదు వందలు కూడా రేటు రావడం లేదు. ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2,500 చొప్పున ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలి. ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు గానీ రైతుబజార్ల ద్వారా గానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరిటేజ్‌లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. కానీ ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. రైతులకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్‌లో లాభాలు తగ్గకూడదు.. చంద్రబాబు వ్యాపారాలు జరగాలి.. ఇదీ పరిస్థితి! అరటి దుస్థితి కూడా ఇలాగే ఉంది. రూ.3వేలకు కూడా కొనేవారు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30 వేలకు రైతులు అమ్ముకున్నారు. యూరియా కూడా అందించలేకపోతున్నారు వైఎస్సార్సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్‌లో విక్రయాలు జరిగిన పరిస్థితి లేదు. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నాం. కమీషన్లు, బ్లాక్‌లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశాం. ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్‌లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు? మా హయాంలో రూ.265కి యూరియా బస్తా లభించేది. తమ గ్రామంలోనే రైతన్నలు యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు వారికి అందుబాటులో ఉంటూ పనిచేశాయి. నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వాటి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు రావని బ్లాక్ మార్కెట్‌ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము.. ఇలా ఏ పంట చూసినా రేటు లేని పరిస్థితిలో ఇవాళ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం చూస్తే.. అన్నదాతా సుఖీభవ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్లకుగానూ చంద్రబాబు ఒక్కో రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉన్నా, ఇంతవరకు ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. మా హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, నరేన్ రామాంజులరెడ్డి, సంబటూరు ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. -
ఫలితం చూపుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవ
సాక్షి, అమరావతి: కొప్పర్తిలో టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు ఏర్పాటు చేసిన పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థలు 2022–23లో పరిశ్రమల నిర్మాణ పనులు ప్రారంభించి అత్యంత వేగంగా పూర్తి చేసి, వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన తరుణంలో వాటి యాజమాన్యాలకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. » రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం పరిశ్రమల పురోగతి ఎంతో అవసరమన్న విషయాన్ని గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచి్చంది. ఆ దిశలోనే పలు చోట్ల మెగా ఇండ్రస్టియల్ హబ్‌లు, ఈఎంసీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా కొప్పర్తిలో మెగా ఇండ్రస్టియల్ హబ్‌కు 2019 ఆగస్టులో ప్రతిపాదన చేసింది. » అక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) ఏర్పాటుకు సంబంధించి 2021 మార్చిలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) నుంచి అనుమతి వచి్చంది. దాంతో అదే ఏడాది.. 2021 డిసెంబరులో వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో ఈఎంసీతో కూడిన మెగా ఇండస్ట్రియల్ హబ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది. » అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సదుపాయాలు కల్పించడంతో, పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో కొప్పర్తి మెగా ఇండ్రస్టియల్ హబ్ పారిశ్రామిక రంగంలో జిల్లా రూపురేఖలనే మార్చేసింది. ఈ క్రమంలో కొప్పర్తి మెగా ఇండ్రస్టియల్ హబ్‌కు 2022–23లో వచ్చిన టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు, వెంటనే తమ పనులు ప్రారంభించాయి. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఉత్పత్తిని మొదలు పెడుతున్నాయి. ఈ సందర్భంగా టెక్నోడోమ్, టెక్సానా సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులందరికీ అభినందనలు. వాణిజ్య పరంగా రెండు సంస్థలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందాలి. » గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల 2019–24 మధ్య రాష్ట్ర జీడీపీలో ఉత్పాదక రంగం వాటా 11.12 శాతం సగటు వృద్ధి (సీఏజీఆర్) సాధించింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ రంగంలో నమోదైన వృద్ధి (సీఏజీఆర్) 6.9 శాతం మాత్రమే. -
కష్టాలు వింటూ.. భరోసానిస్తూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. రెండో రోజు కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు.ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. -
అంబకపల్లె చెరువుకు చేరిన కృష్ణమ్మ.. వైఎస్ జగన్ జలహారతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అంబకపల్లె చెరువు దగ్గర వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలహారతి ఇచ్చారు. అంబకపల్లెకు కృష్ణా జలాలు వచ్చి చేరాయి. పాడా నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు.ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్‌పురం గ్రామం వద్ద భారీ సంప్‌ను ఏర్పాటు చేసి 4.5 కి.మీ మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేశారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు. -
టెక్నోడోమ్, టెక్సానా కార్యకలాపాలు ప్రారంభం.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: కొప్పర్తిలో టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ హయాంలో కొప్పర్తి పారిశ్రామికవాడలో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టాయని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 2019 ఆగస్టులో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను ప్రతిపాదించగా.. 2021 మార్చిలో STPI అనుమతి పొందిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటయ్యాయి. కొప్పర్తిలో ఏర్పాటయిన పరిశ్రమలు జిల్లాకే పేరు ప్రఖ్యాతలను తెచ్చాయి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు 2022–2023లో నిర్మాణ పనులను ప్రారంభించి చాలా త్వరగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించటం హర్షణీయం. ఈ సందర్భంగా ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నా. మా హయాంలో రాష్ట్రానికి స్థిరమైన అభివృద్ధిని సాధించాం...ముఖ్యంగా తయారీ రంగం ఎంతో కీలకమని నమ్ముతూ దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే 2019–2024 మధ్య ఏపీలో తయారీ రంగం GSDP 11.12% వార్షిక వృద్ధి రేటుని సాధించింది. దేశ సగటు వృద్ధిరేటు 6.9% మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్ర వృద్ధిరేటు ఎక్కువగా సాధించగలిగాం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారుI am very pleased to learn of the commencement of operations in the manufacturing facilities established by Teknodome and Texana in Kopparthy. The Mega Industrial Hub at Kopparthy was proposed in August 2019, the EMC at Kopparthy could secure approval from STPI in March 2021, and… pic.twitter.com/EjaN09Kmgu— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2025 -
Ys Jagan: రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడంలేదు
-
ఆ ధైర్యం చంద్రబాబుకు లేదు
-
నల్లపురెడ్డి పల్లెలో Y.S జగన్ కు ఘనస్వాగతం పలికిన YSRCP శ్రేణులు
-
దివంగత మహానేత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్
-
ఆ ధైర్యం టీడీపీకి లేదు: వైఎస్ జగన్
పులివెందుల: వైఎస్సార్ జిల్లాలోని నల్లపురెడ్డిపల్లెలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాన్ని నల్లపురెడ్డి గ్రామస్తులు.. వైఎస్ జగన్‌కు వివరించారు. ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటర్లపై కూటమి ప్రభుత్వం కుట్రలు అంటూ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైఎస్ జగన్ స్పందించారు. ‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపే ధైర్యం టీడీపీకి లేదు. ప్రజలకు ఓట్లు వేసే అవకాశం కూడా ఇవ్వలేదు. పోలీసులను అడ్డంపెట్టుకుని దౌర్జన్యం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారు’ అని మండిపడ్డారు. ఇదీ చదవండి: చంద్రబాబు వ్యాపారాల కోసం రైతులతో ఆడుకుంటారా:: వైఎస్ జగన్ -
హెరిటేజ్‌లో ఉల్లిరేటు.. రైతుల్ని దగా చేసిన బాబుపై జగన్ ఆగ్రహం (ఫోటోలు)
-
రైతుకు పీకల్లోతు నష్టం.. నీ హెరిటేజ్ కి మాత్రం కోట్లలో లాభం..
-
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు (ఫోటోలు)
-
బాబు వ్యాపారాల కోసం రైతులతో ఆడుకుంటారా?: వైఎస్ జగన్
కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.సాక్షి, వైఎస్సార్: కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం ఉదయం వేముల మండలం దుగ్గన్నగారి పల్లి వద్ద ఉల్లి, చీనీ బత్తాయి రైతులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు.గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమను సర్కార్ ఆదుకున్నదని, నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పంటలకు రేటు లభించక, అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. పొలంలోకి వెళ్లి ఉల్లి పంటను పరిశీలించిన అనంతరం రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. ‘‘రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటోంది. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. అరటి రైతులు కూడా నష్టపోతున్నారు. ప్రభుత్వమే ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను ప్రొత్సహిస్తోంది. కానీ, మా హయాంలో ఏనాడూ ఎరువులు బ్లాక్‌లో అమ్మలేదు. ఇప్పుడు రైతులకు కూలీ ఖర్చు కూడా రావడం లేదు. ప్రభుత్వమే రైతుల వద్ద ఉల్లి కొనుగోలు చేయాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులను పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ రోజు చీనీ రేటు క్వింటా రూ.6 వేల నుంచి రూ.12 వేలకు అమ్ముడుపోతోంది. ఈ రేటుకు కూడా కొనుగోలు చేసే నాధుడు లేడు. దీనిలో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. ఇదే గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మినిమమ్ క్వింటా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. ఉల్లికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మినిమమ్ రూ.4 నుంచి రూ.12 వేలు క్వింటాల్ అమ్ముడుపోయింది. నేడు రైతుకు క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి కనీసం రూ.800 లకు కొనుగోలు చేస్తున్నారు. గ్రేడ్ బాగలేకపోతే క్వింటా రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటా నాలుగైదు వందలకు కూడా రేటు రావడం లేదు. ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2500 చొప్పున ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు కానీ, రైతుబజార్ల ద్వారా కానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరటేజ్లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. ఇదే రైతుకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి, చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35 కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్‌లో లాభాలు తగ్గకూడదు, చంద్రబాబు వ్యాపారాలు జరగాలి, ఇదీ ప్రభుత్వ పరిస్థితి. అరటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కనీసం రూ.3వేలకు కూడా కోసే వారు కనిపించడం లేదు. గత వైయస్ఆర్సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30వేలకు రైతులు అమ్ముకున్నారు.యూరియా కూడా అందించలేకపోతున్నారువైయస్ఆర్సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్‌లో అమ్ముకునే పరిస్థితి లేదని.. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నామని.. తద్వారా కమీషన్లు, బ్లాక్ లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ‘ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్‌లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రెండు వందల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మా హయాంలో రూ.265 రూపాయలకు యూరియా బ్యాగ్ లభించేది. తమ గ్రామంలోనే యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు రైతుకలు అందుబాటులో ఉండి పనిచేశాయి. నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వీరి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వంలోని పెద్దలకు కమీషన్లు రావని, బ్లాక్ మార్కెట్‌ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము ఇలా ఏ పంటచూసినా రేటు లేని స్థితిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. రైతుకు పెట్టుబడి సాయం చూస్తే, చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్ళకు ఇరవై వేల చొప్పున రూ.40 వేలు ఇవ్వాల్సి వున్నా ఇంత వరకు ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే. గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు’’ అని జగన్ మండిపడ్డారు. -
ఇడుపులపాయలో వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ విజువల్స్
-
Y.S.R ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొననున్న Y.S జగన్
-
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
వైఎస్సార్ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం(సెప్టెంబర్ 2వ తేదీ) కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు వైఎస్ జగన్. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు. వైఎస్సార్‌కు వైఎస్సార్సీపీ నాయకుల నివాళులుఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎంలు నారాయణ స్వామి, అంజాద్ బాషా , మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్, ఎమ్మెల్యే ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి ,రఘు రామ్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు తదితరులు వైఎస్సార్‌కు నివాళులర్పించారు. -
ధైర్యంగా ఉండండి... అండగా నిలుస్తా: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. సోమవారం మధ్యాహ్నం పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూటమి ప్రభుత్వంలో పడుతున్న బాధలు, సమస్యలను ప్రజలు వివరించారు. ప్రజల బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ ‘నేనున్నాను...’ అంటూ భరోసా ఇవ్వడంతోపాటు ధైర్యాన్ని నింపారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి వెన్నుదన్నుగా ఉంటానని మాటిచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ... ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైఎస్ జగనమండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలిగానీ కీడు చేయకూడదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని ఆయన గుర్తుచేశారు.కక్ష సాధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది.ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్‌యాదవ్, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎస్బీ అంజాద్‌బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయ ప్రజాబాంధవుడు!
వైఎస్సార్ మన నుంచి దూరమై నేటికి 16 సంవత్సరాలు. సంక్షేమం, అభివృద్ధి, దూరదృష్టి, విలువలు, విశ్వసనీయత, ఆదర్శ రాజకీయాలు వంటి మాటలు విన్నప్పుడల్లా ఆయనే గుర్తొస్తారు. ఆయన దూరదృష్టితో తీసుకున్న అనేక నిర్ణయాలు అద్భుత ఫలితాలనిచ్చాయి. జలయజ్ఞం అందుకు ఒక మంచి ఉదాహరణ. పోల వరం ప్రాజెక్టుకు నేడు జాతీయ హోదా రావడానికి నాడు అన్ని అనుమతులూ సాధించడం, కుడి– ఎడమ కాల్వల నిర్మాణం ప్రారంభించడం వల్లనే సాధ్యమయ్యింది. నేటి ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే పట్టిసీమ కూడా వైఎస్ కుడి కాలువను సింహభాగం పూర్తి చేసినందు వల్లే సాధ్యం అయ్యింది. దక్షిణ తెలంగాణ కోసం పాలమూరు– రంగారెడ్డి, దిండి; రాయల సీమ కోసం శంకుస్థాపనకి మాత్రమే పరిమితం అయిన గాలేరు– నగరి, హంద్రీ–నీవా, పోతిరెడ్డి పాడు వెడల్పు; ప్రకాశం జిల్లా కోసం వెలుగొండ; కృష్ణా డెల్టా కోసం పులిచింతల; హైదరాబాద్ శాశ్వత నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి నీటి సరఫరా; ఉత్తరాంధ్ర కోసం ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టులు రూపకల్పన చేశారు కాబట్టే నేడు ప్రభుత్వాలు వాటి కోసం నిధులు ఖర్చు చేయడం, ప్రజలు అడగడం సాధ్యమవుతోంది.సంక్షేమం – అభివృద్ధివైఎస్సార్ అనగానే గుర్తుకు వచ్చేది సంక్షేమ పథకాలు. వాటిని రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల తాయిలాలని విమర్శించారు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికీ ఒక శాస్త్రీయ పరిశీలన, హేతుబద్ధమైన కారణం కనిపిస్తుంది. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల ఆత్మహత్యలకు కారణాలు, నివా రణ చర్యలు సిఫార్సు చెయ్యమని ‘ఆచార్య జయతీ ఘోష్ కమిషన్’ను నియమించారు. రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయ సమస్యలే కారణం కాదనీ, విద్య, వైద్యం వంటివి కార్పొరేట్ల చేతుల లోకి వెళ్లడం వల్ల రైతులు మరిన్ని అప్పులు చేయవలసివచ్చి ఆత్మ హత్యలకు పాల్పడ్డారనీ కమిషన్ పేర్కొంది. దీంతో వైఎస్సార్ ‘ఫీజు రీయింబర్స్మెంట్’, ‘ఆరోగ్య శ్రీ’ పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్సార్ తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ‘రైతు భరోసా’, ‘అమ్మ ఒడి’, ‘నాడు–నేడు’ వంటి పథకాలు అమలు చేశారు. ఇవి చూడటానికి సంక్షేమ పథకాలు అనిపిస్తున్నా, ఈ పథ కాల వల్ల రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి.వైఎస్సార్ ఐదు సంవత్సరాల (స్వల్ప కాలపు) పాలనలోనే అనేక దీర్ఘకాలిక ఆలోచనలు మనకు ప్రతి అంశంలోనూ కనిపి స్తాయి. భవిష్యత్తు మొత్తం నగరాల చుట్టూ ఉంటుందని నాడే ఆయన గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విశాఖ, గుంటూరు – విజయవాడ, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ తిరుపతి ఏర్పాటు ఆలోచన వైఎస్సార్‌దే! ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పారిశ్రామిక మార్పులను గమనంలో ఉంచుకుని ‘సెజ్’లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విదేశాలకు మనం వెళ్ళడం కాదు, మనం తగిన వాతావరణం సృష్టిస్తే విదేశీ కంపెనీలు మన దగ్గరకు వస్తాయని భావించి పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు. ‘శ్రీ సిటీ’ ఆయన కలకు ప్రతిరూపమే!భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి కూడా తన పాలనలో ప్రజలకు అత్యంత కీలకమైన విద్య, వైద్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యారంగంలో ‘నాడు–నేడు’ పేరుతో వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ విద్యకు నాణ్యతా ప్రమాణాలు కల్పించారు. ఆంగ్ల మాధ్యమాల్లో చదువులు ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ అవకాశాలను మన యువత అందుకుంటారని జగన్ భావించారు. వైద్యం పేదలకు అందుబాటులోకి రావాలంటే వైద్యశాలలను మెరుగు పరచడంతో పాటు, డాక్టర్ల నియామకం అత్యంత కీలకం అని గుర్తించారు. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కళాశాల, దానికి అనుబంధంగా హాస్పిటల్ ఏర్పాటు జరిగితే డాక్టర్ల కొరత తీరి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించవచ్చని భావించారు. ఆ దిశగానే నాడు వైఎస్సార్, నేడు జగన్ అడుగులు వేశారు. ప్రజలకు ఎనలేని సేవ చేశారు.మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరంసమన్వయ కర్త -
దేవుడి ముందూ రాజకీయమేనా బాబు!
కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్భం ఏదైనా రాజకీయం మాట్లాడకుండా మాత్రం ఉండలేరు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను విమర్శించకుండానూ ఉండలేరు. ఎందుకీ మాట అనాల్సి వస్తోందంటే.. వినాయక చవితి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజలు జరిగాయి. సంప్రదాయబద్ధంగా భక్తి పూర్వకంగా నేతలు పూజలు నిర్వహించారు.చంద్రబాబు నాయుడు విషయానికొస్తే.. ఆయన ఇంట్లో పూజలు చేశారో లేదో తెలియదు కానీ.. విజయవాడలో ఏర్పాటైన ఒక మండపం వద్ద వినాయకుడిని దర్శించుకుని దండం పెట్టుకున్నారు. తప్పేమీ లేదు కానీ.. ‘దొంగ దండాలు పెట్టిన వారిని వినాయకుడు క్షమించడు. వాళ్ల సంగతి చూస్తాడు’ అన్నారట. ఎవరు దొంగ దండాలు పెడతారు?. జనాన్ని మోసం చేసేవారు కదా!. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని నేరవేర్చకుండా ప్రజలను ఆయన మోసం చేస్తుంటారని జగన్ తరచుగా చెబుతుంటారు.కొద్ది రోజుల క్రితం దివ్యాంగుల పెన్షన్ల కోతపై ఒక కామెంట్ చేస్తూ చంద్రబాబు జీవితం అంతా మోసాల మయం అని, మాట మీద నిలబడని వ్యక్తి అని ధ్వజమెత్తారు. బహుశా వాటిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఇలా విమర్శించి ఉండవచ్చు. ఎల్లో మీడియా ఈ కథనాన్ని కాస్తా చాలా ప్రముఖంగా ప్రచురించింది. వెళ్లిందేమో దైవ దర్శనానికి.. మాట్లాడిందేమో ఇలాంటి మాటలు! ఆయన ధోరణే అంత. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా కాకుండా వ్యక్తిత్వ హననం కోసం ప్రయత్నిస్తూంటారు. అందుకే సమయం, సందర్భం ఏదీ లేకుండా ఎక్కడపడితే అక్కడ జగన్ నామ జపం చేస్తుంటారు. అవి అభ్యంతరకరమైన పదాలతో ఉండకపోతే ఆయనకు తృప్తిగా అనిపించదేమో మరి. పారిశ్రామికవేత్తల వద్ద కూడా జగన్‌ను భూతం అనడం చూస్తుంటే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తాడేమో అన్న భయం చంద్రబాబును పీడిస్తున్నట్లు ఉంది. చిత్రమైన విషయం ఏమిటంటే.. సీఎం హోదాలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్రానికి నష్టమని తెలిసినా ఆయన పట్టించుకోకపోవడం!.గత ఏడాది ఎన్నికల్లో ఏదో రకంగా గెలిచినప్పటికీ.. చంద్రబాబు ఆ మరుసటి రోజు నుంచే జగన్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో మాయ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. పోలైన ఓట్ల కంటే ఏకంగా 49 లక్షల ఓట్లను అదనంగా లెక్కించారన్న విషయం బయటపడింది. ఈవీఎంలతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడకుండా.. కేవలం జగన్‌పై విమర్శలకు మాత్రమే పరిమితం కావడాన్ని చూస్తే.. ఆ వ్యవహారాలన్నీ నిజమే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అలా చేసే అవకాశం ఉండదేమో అన్న ఆందోళనతో జగన్‌ను బద్నాం చేయడానికి యత్నిస్తున్నారా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. వైఎస్ జగన్ ఎప్పుడూ తను ఇచ్చిన మాట మీద నిలబడాలనుకునే మనిషి. ఆ క్రమంలో కొన్నిసార్లు నష్టపోయినా అలాగే ముందుకు సాగారు. ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్‌తో సహా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు 150 హామీలు ఇచ్చినప్పుడు వాటి అమలు సాధ్యం కాదని జగన్ కుండబద్ధలు కొట్టారు. అలాంటి హామీలు తాను ఇవ్వలేనని కూడా స్పష్టం చేశారు. దీనివల్ల కూడా ఆయనకు నష్టం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో దాదాపు వంద శాతం నెరవేర్చిన ఘనత జగన్‌ది. అందువల్ల ఆయన ధైర్యంగా మేనిఫెస్టో గురించి మాట్లాడేవారు. కానీ చంద్రబాబు, పవన్‌లు ఎప్పుడూ మేనిఫెస్టో ఊసే తీసుకురారు. పైగా హామీలు నెరవేర్చుతున్నామంటూ జనాన్ని మోసం చేస్తున్నారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. ఉచిత బస్ ప్రయాణం అంటూ మహిళలను ఊరించారు. తీరా చూస్తే కేవలం ఐదు రకాల సర్వీసులకే పరిమితం చేశారు.అదే టైమ్‌లో ఈ స్కీమ్ వల్ల నష్టపోతున్న ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. దాంతో వారంతా ఆందోళనలకు దిగుతున్నారు. దివ్యాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పారు. అలాగే చేసినట్లు చేసి, దివ్యాంగుల వైకల్య శాతం అంటూ కండీషన్లు పెట్టి లక్షల మంది పెన్షన్లు కట్ చేయడంతో వారంతా వీధులలోకి వచ్చి పోరాడారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబును మోసకారిగా అభివర్ణించారు. వీటిని ఖండించలేకపోయిన చంద్రబాబు పరోక్షంగా దొంగ దండాలు అంటూ విమర్శించినట్లు కనిపిస్తుంది. జగన్‌కు దొంగ దండాలు పెట్టవలసిన అవసరం ఏముంది?. ఆయన ఏ మతం అన్న దానితో నిమిత్తం లేకుండా ఎక్కడకు వెళ్లినా పవిత్ర భావంతోనే ఉంటారు. చివరికి ఎవరి నుంచైనా ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా చెప్పులు విడిచి తీసుకుంటారు.అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఏకంగా తిరుపతి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి హిందూ మతం ఆచరించే వారి విశ్వాసాన్ని దెబ్బతీశారు. అందువల్ల దైవ దర్శనానికి ఎవరు వెళ్లినప్పుడు చిత్తశుద్దితో నమస్కారాలు చేస్తారు? ఎవరు దొంగ దండాలు పెడతారన్నది అర్థం చేసుకోవడం కష్టం కాదు. చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా జగన్ ప్రార్థనలకు మాత్రమే పరిమితం అవుతారు. రాజకీయ వ్యాఖ్యలు చేయరు.చంద్రబాబు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు హిందూయేతర మతాల వారిని అవమానించేలా మాట్లాడిన ఘట్టాలు ఉన్నాయి. పోనీ హిందూ మతాన్ని పూర్తిగా గౌరవిస్తారా అంటే అదీ అంతంత మాత్రమే. కొన్నిసార్లు బూట్లు తీయకుండానే పూజలు చేసిన వీడియోలు, ఫోటోలు కనిపిస్తుంటాయి. చర్చికి వెళ్లి ఏసును నమ్మితే విజయమే అని అనగలరు. మళ్లీ ఆ మతాచారాలను పాటించే వారిలో కొంతమందిని ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, మతం పేరు పెట్టి విమర్శించగలరు. గతంలో ఒక డీజీపీని క్రిస్టియన్ అని కామెంట్ చేశారు. ఇక జగన్ పై మతపరంగా ఎన్ని అరాచకపు విమర్శలు చేశారో చెప్పనవసరం లేదు. జగన్ టైమ్‌లో టీడీపీ వారు కొందరు దేవాలయాలపై దాడులు జరిపి పట్టుబడ్డారు. అలాంటివారిలో కొందరికి ఈ మధ్య చంద్రబాబు ఆర్థిక సాయం చేశారని వార్తలు వచ్చాయి. అంటే రాజకీయం కోసం దేవుళ్లను, మతాలను కూడా నిర్మొహమాటంగా వాడుకోగల నేర్పరితనం ఆయన సొంతమనే కదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.. -
వినాయక శోభాయాత్రలో విషాదం.. YS జగన్ దిగ్భ్రాంతి
-
వినాయక నిమజ్జనాల్లో విషాదం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/గంగవరం/నరసాపురం రూరల్/సాక్షి, అమరావతి: గణపతి విగ్రహ నిమజ్జనం ఊరేగింపుల్లో ఆదివారం మూడు జిల్లాల్లో అపశృతులు చోటుచేసుకోవడంతో మొత్తం ఎనిమిది మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో ట్రాక్టర్ అదుపుతప్పి భక్తుల మీదకెళ్లడంతో నలుగురు.. ఊరేగింపును వీక్షిస్తున్న గిరిజనులపైకి కారు దూసుకువెళ్లడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. అలాగే.. చిత్తూరు జిల్లాలో ప్రమాదవశాత్తూ చెరువులో విగ్రహం కింద పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాలివీ.. ‘పశ్చిమ’లో అదుపుతప్పిన ట్రాక్టర్.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళు గ్రామంలో గణేష్ నిమజ్జనంలో ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ట్రాక్టర్ అదుపు తప్పి భక్తజనం మీదకు దూసుకెళ్లడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో పది నిమిషాల్లో నిమజ్జనం పూర్తవుతుందనగా ఈ ప్రమాదం జరిగింది. విగ్రహాన్ని ఉంచిన ట్రాక్టర్ డ్రైవర్ మంచినీళ్లు తాగుదామని ఇంజన్ ఆఫ్ చేయకుండా కిందకు దిగి వెళ్లాడు. అదే సమయంలో ట్రాక్టర్‌పై యువకులు తోసుకోవడంతో అనుకోకుండా ఎక్స్‌లేటర్‌పై కాలువేయడంతో వెంటనే ట్రాక్టర్ ఊరేగింపులో ఉన్న వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో గ్రామానికి చెందిన కడియం దినేష్ (9), గురుజు మురళి (38), ఈవన సూర్యనారాయణ (58), తిరుమల నర్శింహమూర్తి (35) మృతిచెందారు. కంచర్ల ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాలను, క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా తూర్పుతాళ్లు గ్రామంలో ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ గిరిజనులపైకి దూసుకెళ్లిన కారు.. అల్లూరి జిల్లా చింతలవీధి జంక్షన్‌లోని జాతీయ రహదారిపై చింతలవీధి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కొర్రా సీతారాం (65), గుంట కొండబాబు (35) గణేష్ నిమజ్జన ఊరేగింపు చూస్తుండగా అదే సమయంలో ఓ కారు ఊరేగింపుపైకి దూసుకొచ్చింది. దీంతో.. తీవ్రగాయాలతో వారిరువురూ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు మహిళలు వంతాల మొత్తి, గుంట దొస్సు, కొర్రా గౌరమ్మ, వంతాల దాలిమా, పాంగి మొత్తి, కొర్రా ఈశ్వరిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. చెరువులో మునిగి ఇద్దరు.. ఇక చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ, చిన్నమనాయనిపల్లి గ్రామస్తులు వినాయక విగ్రహాన్ని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేస్తుండగా గ్రామానికి చెందిన భార్గవ్ (28), చరణ్ (27) ప్రమాదవశాత్తూ నీటిలో విగ్రహం కింద పడి ప్రాణాలు కోల్పోయారు. మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. వినాయకుడి శోభాయాత్రలో పశ్చిమ గోదావరి, అల్లూరి, చిత్తూరు జిల్లాల్లో ఎనిమిది మంది మృత్యువాతపడటంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళులో వినాయక నిమజ్జనోత్సవం ఊరేగింపులో భక్తులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మరణించడం అత్యంత విచారకరమన్నారు. ప్రమాదం కారణంగా యువకులు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అలాగే, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు చింతలవీధిలో వినాయక నిమజ్జనోత్సవం పైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో మరో ఇద్దరు భక్తులు మరణించిన ఘటనపైనా మాజీ సీఎం విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. -
వైఎస్ జగన్‌కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టీస్ సుదర్శన్‌రెడ్డి ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటనకు ముందే ఎన్డీఏ నేతలు తమతో మాట్లాడారని బదులిచ్చారు. ఎన్డీఏ అభ్యర్థన మేరకు ముందుగానే వారికి మాట ఇచ్చినట్లు చెప్పారు. వ్యక్తిగతంగా సుదర్శన్‌రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉందన్న జగన్..న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అపారమైన సేవలు అందించారని కితాబు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించ వద్దని విజ్ఞప్తి చేశారు. -
థాంక్యూ జగన్ గారు.. అల్లు అర్జున్ ట్వీట్
-
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
-
‘థాంక్యూ జగన్ గారు’.. అల్లు అర్జున్ ట్వీట్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్నమ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ మృతి విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు.(చదవండి: పాడె మోసిన అల్లు అర్జున్, చిరంజీవి, రామ్‌చరణ్..)‘దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.వైఎస్ జగన్ సంతాప ప్రకటనపై అల్లు అర్జున్(Allu Arjun ) స్పందించాడు. ‘సంతాపం ప్రకటించినందుకు థ్యాంక్యూ జగన్ గారు. మీ మంచి మాటలు, మద్దతుకు మేము నిజంగా కృతజ్ఞులం’ అని బన్నీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బన్నీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. -
పులివెందులలో వైయస్ జగన్ మూడు రోజుల పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెపె్టంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 2వ తేదీ ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లి చేరుకుని గంగమ్మ కుంట వద్ద జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 3వ తేదీ ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్సీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. -
అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
-
అల్లు అరవింద్ తల్లి మృతి.. వైఎస్ జగన్ సంతాపం
దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ‘దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.కాగా, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న బాధపడుతున్న కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2025 -
ఎల్లోమీడియాకు బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుంది!
ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పగలగాలి. ముఖ్యమంత్రి లేదా మంత్రి, తదితరల అధికారులైనా ఈ పని చేయాలి. వివరణైనా ఇవ్వాలి. కానీ ఏపీలో ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ఎల్లోమీడియా నుంచి సమాధానాలు వస్తూండటమే వింత. విమర్శించేవారిని దూషించి అక్కసు తీర్చుకోవడం వీరి ప్రత్యేకత కూడా. ఇక రాసే మురికి వార్తలంటారా? వాటికి అంతేలేదు. నిజాలను వక్రీకరించి ప్రభుత్వాన్ని భుజాలకెత్తుకుని మరీ ఎదురుదాడి చేస్తూంటుంది ఇది. విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ సమాచారంతో కూడిన ఒక ప్రకటననను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వివిధ మీడియాలలో ప్రముఖంగా వచ్చిన ఆ వ్యాఖ్యలను ప్రభుత్వ పెద్దలెవరూ ఖండన ఇవ్వలేకపోయారు. అవకాశం చిక్కినప్పుడల్లా జగన్‌ను విమర్శించేందుకు రెడీగా ఉండే చంద్రబాబు కూడా ఈ ఆర్థికాంశాలపై పెదవి విప్పితే ఒట్టు. దీంతో ఎల్లో మీడియా ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది. తెలుగుదేశం పార్టీకి బాండ్ వాయించే ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. జగన్ ప్రకటన సాక్షిలో 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం’’ అన్న హెడింగ్ తో వచ్చింది. కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిందన్న వివరమూ అందులో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో ఇది 56 శాతం అని జగన్ చెప్పారు. అవినీతి వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఆరోపించారు. ఐదేళ్ల తన హయాంలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే అందులో 56 శాతం అప్పు చేసిందని జగన్ వివరిచారు. ఇది నిజమా? కాదా? అన్నదానిపై ప్రభుత్వం సాధికారికంగా జవాబు ఇవ్వాలి. ముఖ్యమంత్రి కాని, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గాని, ఆర్థిక శాఖ అధికారులు కాని కిమ్మనలేదు. ఆంధ్రజ్యోతి మాత్రం స్పందించింది. టీడీసీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి బాగా డామేజీ అయిందని, చంద్రబాబు పరువు దెబ్బతిందని భావించిన ఆ మీడియా తన పత్రిక, టీవీ ఛానెల్ ద్వారా గుండెలు బాదుకుంటూ ఒక స్టోరీని ప్రచారంలో పెట్టింది. దానికి వారు పెట్టిన హెడింగ్ ‘నాడు అరాచకం-నేడు అభివృద్ధి’ అని. అలాగని అప్పట్లో జరిగిన అరాచకం ఏమిటో చెప్పారా అంటే అదేమీ కనిపించలేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని వివరించిందీ రొటీన్ ఊకదంపుడు వ్యవహారమే. జగన్ ప్రభుత్వం అప్పు చేసింది కాని రోడ్లు వేయలేదట. ఇప్పుడు రోడ్లు వేసేశారట. ఏ ప్రభుత్వంలో అయినా రోడ్లు వేయడం నిరంతరం ప్రక్రియ. అప్పట్లో ఎక్కడ ఏ చిన్న రోడ్డు పాడైనా భూతద్దంలో చూపుతూ ప్రజలను మోసం చేసింది ఎల్లో మీడియా. అలాగని అన్ని రోడ్లు బాగా ఉన్నాయని చెప్పడం లేదు. కాని ఎల్లో మీడియా రాసినంత దారుణంగా పరిస్థితి లేదు. పైగా అప్పట్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త రోడ్ల మన్నిక పెంచేందుకు ప్రయత్నం చేశారు. ఆ విషయాలను దాచిపెట్టి ఇప్పుడే రోడ్లు వేసేసినట్లు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం కూడా అనేక రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని సచిత్ర సమేతంగా వార్తలు వస్తున్నాయి. పాడైన రోడ్లు పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అయినా రోడ్లు అనేకం ఎందుకు అధ్వాన్నంగా ఉన్నాయి? ఏలూరు వద్ద ఒక రోడ్డును చూస్తే అంతా గోతులమయంగానే ఉంది. ఏజెన్సీలో రోడ్ల కోసం జనం గుర్రాలెక్కి ఎందుకు నిరసన చెబుతున్నారు? మిగిలిన రూ.1.84 లక్షల అప్పును ఏమి చేశారో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరో ఈ మీడియా చెప్పి ఉండాల్సింది. అమరావతిలో పనులు జరిగిపోతున్నాయట. అవును! వరద నీటిని తోడే మోటార్లు నిత్యం పని చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్, హడ్కో వంటి సంస్థల నుంచి అప్పులు తెచ్చారు. ఆ నిధులు ఖర్చు చేస్తున్న తీరు, అందులో జరుగుతున్న అవినీతిపై వస్తున్న కథనాలు మాటేమిటి? భూమి ఖర్చు లేకపోయినా, చదరపు అడుగుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలకు ఎన్నడైనా జవాబిచ్చారా? పోలవరం పనులు జరుగుతున్నాయట. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే, ఏపీ తెస్తున్న అప్పులు దాని కోసం ఎందుకు ఖర్చు చేస్తారు? పాఠకుల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇందులో ఏమైనా నిజం ఉందా? ఐదేళ్లలో జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేసినా, కొన్ని హామీలలో మాట తప్పారని ఈ పత్రిక అంటున్నది. కొన్ని విస్మరించారని చెబుతోంది. ఏ హామీ అమలు చేయలేదో ఎందుకు ఉదహరించలేక పోయింది? అదే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈ ఎల్లో మీడియా బుకయింపు. ఎన్నికల హామీలు దాదాపుగా నెరవేర్చిందట. జగన్ హామీలకు సంబంధించి రూ.2.70 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా వారి ఖాతాలలో వేశారన్నది వాస్తవం.దాని గురించి చెప్పలేదు. సంక్షేమానికి ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లను వెచ్చించిందో కూటమి ప్రభుత్వం వివరించగలదా? ఒకటి, రెండు తప్ప, మిగిలిన అన్ని ఎన్నికల హామీలను ఒక ఏడాది ఎగవేసింది నిజం. ఈ ఏడాది ఇస్తున్నప్పటికీ కోతలు పెడుతుండడం, ప్రజలు ఆందోళలనకు దిగుతుండడం నిత్యం చూస్తేనే ఉన్నాం. జగన్ టైమ్‌లో అలాంటివి కనిపించాయా? జగన్ 98 శాతం హామీలను నెరవేర్చారు. ఆయన తన మానిఫెస్టోని ధైర్యంగా జనం ముందుంచి చేసిన వాటి గురించి చెప్పగలరు. మరి చంద్రబాబు అలా తన మానిఫెస్టోలోని వాగ్దానాలు చదువుతూ ఎంతవరకు అమలు చేసింది వివరించగలుగుతారా? నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, బీసలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను ఏమి చేశారో ఆంధ్రజ్యోతి వివరించి ఉండాల్సింది. అలాగే దేవుడి సాక్షిగా పండగ రోజు వలంటీర్లకు ఓట్టేసినట్లు ఇచ్చిన హామీ ఏమిటి? ఆ తర్వాత మాట మార్చిన సంగతేమిటి? రైతు భరోసాపై అప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. తల్లికి వందనంలో ఏమి ప్రామిస్ చేశారు? ఇప్పుడు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్ లకు ఎందుకు లింక్ పెడుతున్నారు? ఉద్యోగుల సీపీఎస్ ఏమి చేశారు? వారి పీఆర్సీ హామీ ఏమైంది?అవన్నే కాదు. వారి డీఏ బకాయిలను ఇస్తున్నారా? ఇన్ని పెట్టుకుని ఏదో ఒకటి దబాయించి చంద్రబాబు తరపున ప్రచారం చేస్తే జనం నమ్మేస్తారా? జగన్ అభివృద్ధి చేయలేదట. ఆయన హయాంలో కుప్పంకు నీరు తెచ్చారా. లేదా? ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్‌ను చంద్రబాబు ప్రారంభించారా? లేదా? ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, ఇలా వేలాది భవనాలు నిర్మిస్తే అది అభివృద్ది కాదా? నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండ్ సెంటర్ల నిర్మాణం ఆరంభించింది ఆయన కాదా? రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాటేమిటి? జగన్ తెచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని ఎల్లో మీడియా చెబుతోందా? జగన్ నాడు-నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేయలేదా? ఆరవై నాలుగు లక్షల మందికి ఫించన్లు, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అలాంటి స్కీములు, ఫించన్లు ఇవ్వడం రాష్ట్ర వికాసం అని ఆంధ్రజ్యోతి రాసింది. ఇలాంటి మీడియాను జనం నమ్మవచ్చా? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గొప్ప విషయం అని ఈ పత్రిక చెబుతోంది. అన్ని బస్ సర్వీస్‌లలో ఈ స్కీమ్ అమలు చేయకపోవడం మోసం కిందకు వస్తుందా? రాదా? ఉచిత ప్రయాణానికి మహిళలు ఎక్కువమంది వస్తుండడంతో బస్ సర్వీసులను తగ్గించేశారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల స్త్రీలు గొడవలు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక చోట అలాంటి ఘటన పోలీస్ కేసు కూడా అయింది. అదే టైమ్‌లో ఫ్రీబస్ కారణంగా నష్టపోతున్న ఆటోలవారు ఈ బస్సులలో భిక్షాటన చేస్తూ నిరసన చెబుతున్నారు. వారికి ఇచ్చిన ప్రామిస్ ఏమైంది. అసలు ఇదే మీడియా యజమాని పలుమార్లు ఈ స్కీములన్నీ వృథా అన్నట్లుగా మాట్లాడిన సంగతేమిటి? జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే గొప్ప అన్న చందంగా ప్రచారం చేస్తుంటారే. కరెంటు చార్జీలు పెంచను, పైగా తగ్గిస్తాను అని చంద్రబాబు పలుమార్లు అన్నారు కదా? ఆ మాటమీద ఎందుకు నిలబడలేకపోయారు? దానిని వదలిపెట్టి గత ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని ప్రచారం చేయడంలో అర్ధం ఉందా? జగన్ టైమ్ లో రూ.3.32 లక్షల కోట్ల అప్పే చేశారన్న విషయం తేలినా, కేంద్రం కూడా చెప్పినా, టీడీపీతోపాటు ఈ ఎల్లో మీడియా వైసీపీపై విషం చిమ్ముతుంది. జగన్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వంలో ఆదాయం తగ్గిందా? లేదా? కేంద్ర ప్రభుత్వం సొంత ఆదాయ వృద్ది 12 శాతం ఉండగా, రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుదల కేవలం మూడు శాతమే అని జగన్ చెప్పింది నిజమా? కాదా? ఆదాయాలు తగ్గి, అప్పులు పెరగడం ఆందోళనకరమని జగన్ అన్నారు. దానిని అంగీకరిస్తారా?లేదా? ఎల్లో మీడియాగా పేరొంది టీడీపీకి మద్దతుగా నిలిచే ఈనాడు, ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రిక ఆర్థిక ప్రయోజనాలను పుష్కలంగా నెరవేరుస్తూన్నప్పుడు రాష్ట్రం అతా బ్రహ్మాండంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈటీవీ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ప్రకటనల రూపంలో రూ.92 లక్షలు ఇచ్చిందట. ఆంధ్రజ్యోతికి విశాఖలో మళ్లీ కోట్ల రూపాయల విలువైన భూమి ఇస్తున్నారట. వీరిద్దరికి ప్రచార ప్రకటనల రూపంలో కోట్ల రూపాయలు గిట్టుబాటు అవుతున్నాయి. అందుకే ప్రజల పక్షాన కాకుండా , ప్రభుత్వం తరపున ఇలాంటి అరాచకపు, అబద్దపు రాతలు రాస్తుంటారు! జగన్ చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగానే ఉండవచ్చు కాని, ఎల్లో మీడియా పంట మాత్రం బాగానే పండుతోందన్న సంగతి ప్రజలందరికి తెలుస్తూనే ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత -
అభిమాన నేతతో ఫొటోలు దిగేందుకు పోటెత్తిన జనం
సాక్షి, చైన్నె: చైన్నెలోని అభిమానుల్లో గుండె నిండా ఆనందాన్ని నింపి రెండు రోజుల పర్యటనను ముగించి శుక్రవారం బెంగళూరుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరి వెళ్లారు. తన కోసం వచ్చిన అభిమానులందరినీ ఆప్యాయంగా పలకరించారు. వారందరికి తనతో ఫొటోలు దిగేందుకు అవకాశం కల్పించారు. జగనన్నతో ఫొటోలు దిగామన్న సంబరంలో అభిమానులు మునిగారు.కుటుంబ కార్యక్రమం నిమిత్తం రెండు రోజుల పర్యటనగా గురువారం సతీమణి వైఎస్ భారతీరెడ్డితో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి చైన్నెకి వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజున బోట్‌క్లబ్ రోడ్డులోని ఇండియా సిమెంట్స్ చైర్మన్ శ్రీనివాసన్ నివాసానికి వెళ్లారు. ఇంజంబాక్కంలోని సోదరుడు వైఎస్ అనిల్‌రెడ్డి నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం తేనాంపేటలోని మురుగప్పా గ్రూప్స్ యాజమాన్యం నివాసంలో మరో సోదరుడు వైఎస్ సునీల్‌రెడ్డి కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడి నుంచి రాత్రి వైఎస్ అనిల్‌రెడ్డి నివాసానికి మళ్లీ వెళ్లారు. రాత్రి తొమ్మిదిన్నర, పది గంటల సమయంలో సైతం అభిమానులు, వైఎస్సార్సీపీ, వైఎస్సార్ సేవాదళ్ వర్గాలు తన కోసం రావడంతో వారందర్నీ పలకరించారు. వారందరికి ఫొటోలను దిగేందుకు అవకాశం కల్పించారు. జగనన్నతో ఫొటో దిగే అవకాశం రావడంతో అభిమానుల ఆందానికి అవధులు లేవు.ఆనందోత్సాహంశుక్రవారం ఉదయం సైతం పెద్ద సంఖ్యలో అభిమానులు వీజీపీ లేఔట్‌లోని అనిల్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. గంటన్నరకు పైగా అభిమానులు ఆ ఇంటి వద్ద జగనన్న కోసం ఎదురుచూశారు. తమ అభిమాన నేతను ఒక్క సారైనా చూసి వెళ్లేందుకు వచ్చిన వారందరికి ఆయనతో ఫొటోలు దిగే అవకాశం రావడంతో ఆనందానికి అవధులు లేవు. తన కోసం వచ్చిన వారందరినీ అప్యాయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పలకరించారు. యువతులు, మహిళలు, పిల్లలు, యువకులు తరలివచ్చి ఆనందంతో కేరింతలు కొట్టారు. వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్, కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధి కృతికతోపాటు ఇతర నిర్వాహకులు తమ అధినేతను కలిశారు. మధ్యాహ్నం ఉత్తండి ప్రాంతంలోని సునీల్‌రెడ్డి నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్కడి నుంచి చైన్నె విమానాశ్రయానికి ఒంటి గంట సమయంలో చేరుకున్నారు. వైఎస్ అనిల్‌రెడ్డితోపాటు సేవాదళ్ వర్గాలు అధినేతకు వీడ్కోలు పలికారు. ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. పూర్తిగా కుటుంబ కార్యక్రమం నిమిత్తం చైన్నెకు వచ్చినప్పటికీ, తమను పలకరించి ఆప్యాయతను చాటుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభిమానులు ఆనందంతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. -
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
‘సుగాలి ప్రీతి కుటుంబానికి సాయం.. పవన్ క్రెడిట్ ఏమీ లేదు’
సాక్షి,తాడేపల్లి: సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది. ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?’అని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ క్రెడిట్ తనదేనంటూ పవన్ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై పోతిన మహేష్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ మాట మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఒకమాట మాట్లాడటం ఆయనకే చెల్లింది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసిందే జగన్. పవన్ వైజాగ్ వెళ్లి పెట్టిన మీటింగ్ వలన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా?.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం దోపిడీ గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు?.సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీని గురించి జనసేన ఎమ్మెల్యేలు అడుగుతారనే పవన్ కళ్యాణ్ వారికి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నేతల జోక్యం గురించి మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని సొంత ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వలేదు.సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది.ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?. వైఎస్ జగన్ మాత్రమే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు. పొలం, నగదు, ఉద్యోగం ఇచ్చింది జగనే. కానీ ఆ క్రెడిట్ ని కూడా పవన్ నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. అసలు ఆ కేసును త్వరగా ఎందుకు తేల్చటం లేదో పవనే సమాధానం చెప్పాలి?.విచారణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?.చంద్రబాబు హయాంలో డీఎన్ఏలు మార్చి ఉంటారు.దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?పవన్ కళ్యాణ్ చంద్రబాబు చొక్కా పట్టుకుని ఎందుకు నిలదీయలేదు?.సోషల్ మీడియా ని అడ్డం పెట్టుకుని సుగాలి ప్రీతి అంశం మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాని నియంత్రించాలని చట్టం తెస్తారట. హోంమంత్రి పదవిని తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును విచారించాలి.వచ్చే 15ఏళ్లు చంద్రబాబు పల్లకి మోయాలని పవన్ అంటున్నారు. జనసైనికులు దీనిపై ఆలోచించుకోవాలి. జనసేన సైనికులందరినీ పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్మేశారు.రుషికొండ భవనాలు ప్రభుత్వానివేనని పవన్ అంగీకరించారు. అమరావతిలో భూములు లాక్కోవటం వలనే పర్యావరణం దెబ్బ తిన్నదని పవన్ నర్మగర్భంగా చంద్రబాబును అన్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించే అన్నారని’ పోతిన మహేష్ స్పష్టం చేశారు. -
గిడుగు జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ జగన్ పోస్ట్ చేశారు.గిడుగు వెంకట రామమూర్తి పంతులు వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమానికి ఆద్యుడు. గ్రాంధిక భాషను వదిలి ప్రజలకు అర్థమయ్యే భాషలో విద్య, సాహిత్యాన్ని అందించాలన్న సంకల్పంతో కృషి చేశారు. తెలుగు భాష తియ్యదనాన్ని ప్రజల మధ్యకు తీసుకురావడంలో ఆయన పాత్ర అపూర్వమైనది. ఆయన సేవలకు గుర్తుగా.. ఆగస్టు 29న ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగు భాష పరిరక్షణ, ప్రాచుర్యం కోసం ప్రజల్లో చైతన్యం కలిగించే రోజుగా ఆయన జయంతికి ఓ ప్రత్యేకత సంతరించుకుంది.తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/3EI9MHuY2O— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2025 -
జగన్ విజన్ ను మెచ్చుకున్న దేశవిదేశీ పారిశ్రామికవేత్తలు
-
చంద్రబాబు మోసాలపై.. జగన్ సంచలన పోస్ట్
-
చెన్నైలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, చెన్నై: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం చెన్నై పర్యటనకు వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జాహీర్ హుస్సేన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం ఆవరణలో పార్టీ వర్గాల అభివాదాలు అందుకున్న అనంతరం సతీమణి వైఎస్ భారతి రెడ్డి, సోదరుడు అనిల్‌రెడ్డితో కలిసి వైఎస్ జగన్ చెన్నై బోట్ క్లబ్ రోడ్డుకు వెళ్లారు. మార్గమధ్యంలో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన కాన్వాయ్‌తో కలిసి ముందుకు సాగారు.బోట్ క్లబ్ రోడ్డులోని ఇండియా సిమెంట్స్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాసన్ నివాసానికి వెళ్లారు. అనంతరం ఇంజంబాక్కంలోని వీజీపీ లే అవుట్ లోని వైఎస్ అనిల్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇక్కడికి కూడా అభిమానులు తరలిరావడంతో స్థానిక పోలీసులు వారిని కట్టడి చేశారు. సాయంత్రం తేనాంపేటలో సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు నిశ్చితార్థ వేడుకకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. రాత్రి ఇంజంబాక్కంలో బస చేశారు. శుక్రవారం ఉదయం ఉత్తండిలో సునీల్ రెడ్డి నివాసంలో జరిగే కుటుంబ కార్యక్రమానికి జగన్ హాజరుకానున్నారు. -
మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : గత ఎన్నికల్లో మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఇచ్చి.. ఆ చిన్న హామీని కూడా మీరు చెప్పినట్టుగా అమలు చేయడం లేదంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్–7 అంటూ మహిళలందరినీ నమ్మించి.. గత ఏడాది జూన్ నుంచే వాటిని అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి.. 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తకుండా వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. సవాలక్ష ఆంక్షలు పెట్టి.. హామీలకు కోతలు పెడుతున్నారు.. ఇది మోసం కాదా? దగా కాదా? అంటూ నిలదీశారు. అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అంటూ వ్యంగోక్తులు విసిరారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ చంద్రబాబు గారూ.. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్న హామీని కూడా మీరు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్ –7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచారు. 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు. ⇒ ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?⇒ చంద్రబాబు గారూ.. మీరు ఇంత మోసం చేసి కూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014–19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరకు వడ్డీ సైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్ల కాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు. ⇒ మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు.⇒ చంద్రబాబు గారూ.. కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బ తీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?⇒ మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్ల మీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నా వడ్డీ కింద మరో రూ.5 వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మహిళల స్వయం ఉపాధి కోసం చేయూత కింద ప్రతి ఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750 చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చాం. అమూల్, పీ అండ్ జీ, హిందుస్థాన్ లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం.ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. మా చిత్త శుద్ధికి నిదర్శనం.⇒ మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్ల కోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ! -
కుప్పానికి కృష్ణాభిషేకం జగన్ హయాంలోనే
పలమనేరు, మదనపల్లె: తన సొంత నియోజక వర్గానికి కృష్ణా జలాలు తరలించానని నమ్మబలుకుతున్న సీఎం చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ అసలు కుప్పం ఉప కాలువ పనులే పూర్తి చేయించలేదు. 2014–19 టీడీపీ పాలనలో చుక్క నీరైనా కుప్పం సరిహద్దును తాకలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే కుప్పం ఉప కాలువ పనులకు మోక్షం కలిగింది. పనులు పూర్తి చేయించి కృష్ణా జలాలను కుప్పానికి తరలించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. 2024 ఫిబ్రవరి 26న నాటి సీఎం వైఎస్ జగన్ స్వయంగా కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేశారు. రామకుప్పం మండలంలోని మద్దికుంట, వెరశిచెరువు, శాంతిపురం మండలంలోని చిట్టివానికుంటలకు కృష్ణా జలాలను తరలించి నింపారు. 2021లో వి.కోట మండలం వరకు నీటిని తరలించగా 2024లో కుప్పం వరకు నీటిని పారించి ప్రజలకు అంకితం చేశారు. ఉమ్మడి చిత్తూరుకు 6.4618 టీఎంసీల కృష్ణా జలాలు..కుప్పానికి కృష్ణా జలాలను అందిస్తామని మాట ఇచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమేరకు హంద్రీ–నీవా కాలువ ద్వారా నీరందించి 91 చెరువులను సైతం నింపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 6.4618 టీఎంసీల కృష్ణా జలాలను తరలించింది. శ్రీశైలం నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లె రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె జలాశయానికి చేరిన కృష్ణా జలాలను పుంగనూరు ఉపకాలువ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా దాహార్తి తీర్చారు. పుంగనూరు, కుప్పం ఉపకాలువల నిర్మాణం, ఎత్తిపోతలు, భారీ మోటార్లు.. ఇవన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే. టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేయగా.. వాటిని గత ప్రభుత్వం మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించి పనులు పూర్తి చేయించింది. భూ సేకరణకు రూ.40 కోట్లు కేటాయించి 4.8 కి.మీ. పెండిగ్ కాలువ, 103 స్ట్రక్చర్స్ నిర్మాణాలు, 1,43,130 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు, 22,933 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు నిర్మాణ పనులు, గుడిపల్లె మండలంలో రైల్వే క్రాసింగ్ సొరంగం పనులు 45 మీటర్లు మేర పూర్తి చేయించి నీటిని తరలించింది.వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వడివడిగా ఈ పనులన్నీ పూర్తి చేసి కుప్పానికి నీళ్లను అందించింది.చెర్లోపల్లెలో నిల్వ చేసిన నీటిని వదులుతూ..సిమెంట్ లైనింగ్ పేరిట నిధులు కొల్లగొట్టడం మినహా టీడీపీ కూటమి సర్కారు కుప్పానికి చేసిందేమీ లేదు. అంచనాలను అమాంతం పెంచేసి సీఎం రమేష్‌కు చెందిన కంపెనీకి లైనింగ్ పనులను అప్పగించింది. కుప్పం ఉపకాలువకు సంబంధించి బైరెడ్డిపల్లి మండలం తీర్థం నుంచి రామనపల్లి కాలువ మార్గంలో రాళ్లున్న చోట సిమెంట్ చల్లి వదిలేయడంతో అదంతా రాలిపోతోంది. ఇదే మార్గంలో బ్రిడ్జిలపై నిర్మించిన పైప్ లైన్లలో లీకేజీలు కనిపిస్తున్నాయి. తాతిరెడ్డిపల్లి వద్ద ఇంకా లైనింగ్ పనులు సాగుతున్నాయి. ఓ వైపు కాలువలో నీరు ప్రవహిస్తుంటే ఈ పనులు ఎంత నాసిరకంగా జరుగుతున్నాయో ఊహించవచ్చు. వి.కోట మండలం పోతనపల్లి వద్ద అటవీ ప్రాంతంలో నీరు లీకవుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని చెర్లోపల్లి జలాశయ సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా ఆ నీటినే ఇప్పుడు కుప్పానికి వదులుతూ శ్రీశైలం నుంచి సీఎం చంద్రబాబు విడుదల చేసిన జలాలు వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. గతేడాది అందాల్సిన నీటిని కాంక్రీట్ పనుల పేరుతో అడ్డుకుని వాటినే ప్రస్తుతం కుప్పం తరలిస్తున్నారు. -
సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మోసం.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి, 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు.ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?చంద్రబాబు ఇంతమోసం చేసికూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరికి వడ్డీసైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్లకాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తొలిఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోతపెట్టారు.మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్లమీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నావడ్డీ కింద మరో రూ.5వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మహిళల స్వయం ఉపాధికోసం చేయూత కింద ప్రతిఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750ల చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చి, అమూల్, పీ అండ్ జీ, హిందుస్థాన్‌లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం. ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం, మా చిత్త శుద్ధికి నిదర్శనం.చంద్రబాబు మీరు… కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?అంతేకాదు మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్లకోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ!’ విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్. .@ncbn గారూ మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 28, 2025 -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు (ఫొటోలు)
-
Tadepalli: గణపతి పూజలో వైఎస్ జగన్
-
వినాయక చవితి పూజల్లో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేషుడికి హారతి ఇచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం.. బుధవారం ఉదయం విజయవాడ రాణిగారితోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయ్యింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. -
చంద్రబాబు బతుకంతా మోసమే అంటూ వైఎస్ జగన్ ట్వీట్
-
YS Jagan: వినాయక చవితి శుభాకాంక్షలు
-
సకల శుభాలు, విజయాలు సిద్ధించాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు వినాయకచవితి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.వినాయకచవితి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్..‘రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి. సకల శుభాలు కలగాలి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలి. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలి. గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలి’ అని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#VinayakaChaturthi2025— YS Jagan Mohan Reddy (@ysjagan) August 27, 2025 -
నేడు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. వినాయక చవితి సందర్భంగా విజయవాడ రాణిగారి తోటలో జరిగే గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ రాణిగారి తోట (దేవుళ్ళ ఆంజనేయులు స్ట్రీట్, శాంపిల్ బిల్డింగ్) వద్ద జరగనున్న గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.వైఎస్ జగన్‌ను వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావులు తాడేపల్లిలో మంగళవారం కలిశారు. చవితి వేడుకలను పురస్కరించుకుని వినాయకుడి మట్టి ప్రతిమను అందజేశారు. రాణిగారితోటలో నిర్వహించే చవితి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. -
మీ బతుకంతా మోసమేనా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టీడీపీ నాయకత్వంలోని కూటమి సర్కారు దివ్యాంగుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పెన్షన్లను రద్దు చేస్తూ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వారికి దివ్యాంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులను సైతం లంచాలు తీసుకున్నారంటూ దారుణంగా అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తూ మంగళవారం ‘ఎక్స్’లో చంద్రబాబును ట్యాగ్ చేస్తూ నిలదీశారు.⇒ సీబీఎన్ గారూ.. మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని మీ పాలనా కాలంలో రోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలే కాదు.. అంతకు మించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు. కానీ ఇదివరకే ఉన్నవాటికి మంగళం పాడేయడమే కాదు.. తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటికీ కోతలు పెడుతున్నారు.⇒ చంద్రబాబుగారూ.. పెన్షన్లలో కోత లేకుండా, ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచారసభల్లో ఊదరగొట్టారు, ఊరూరా మీ వాళ్లతో చెప్పించారు. 2024 మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వ హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కానీ మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472 మాత్రమే. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ఇది మోసం కాదా? దగా కాదా?⇒ విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు.. చేస్తున్నారు. రీ వెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?⇒ దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికెట్ల కోసం గతంలో ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి, మా ప్రభుత్వ హయాంలో వారికోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు చేశాం. 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు మేం పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచాం.కానీ, మీరు వారిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి, వారి జీవనాడిని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు గారూ ఆరోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఇదే గవర్నమెంటు డాక్టర్లే అయినప్పుడు, మరి అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి? పైగా లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా? దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా? ఇది మోసం కాదా? మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దగా కాదా?⇒ వీటి పరిస్థితి ఇలాఉంటే.. ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ మీరు చేసింది మరో అతి పెద్దమోసం. అది దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ అంటే.. మోసం గ్యారంటీ! -
చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వికలాంగుల పెన్షన్ కోతపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబూ.. మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సెవెన్ అన్నారు. కానీ ఇదివరకే ఉన్నవాటికి మంగళం పాడేయడమేకాదు, తప్పక ఇవ్వాల్సిన వాటికి కూడా కోతలు పెడుతున్నారు. చంద్రబాబూ.. పెన్షన్లలో కోత లేకుండా, ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచారసభల్లో ఊదరగొట్టారు, ఊరూరా మీ వాళ్లతో చెప్పించారు. 2024, మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వం హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కాని, మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472. అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్కూడా మంజూరు చేయలేదు. ఇది మోసం కాదా? దగా కాదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు...విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు.. చేస్తున్నారు. రీ వెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికెట్లకోసం ఉన్న దారుణమైన పద్ధతులను మార్చి, మా ప్రభుత్వ హయాంలో వారికోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు మంజూరుచేసి, 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు మేం పెన్షన్లు ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచాం. కాని, మీరు వీరిని దొంగలుగా చిత్రీకరిస్తూ ఇందులో లక్షల మందికి నోటీసులు ఇచ్చి, వారికి వారి జీవనాడిని కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారు..@ncbn గారూ… మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్… pic.twitter.com/VUKFqePO92— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2025..చంద్రబాబూ.. ఆరోజు సర్టిఫికెట్లు ఇచ్చింది ఈ గవర్నమెంటు డాక్టర్లే అయినప్పుడు, అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి? పైగా లంచాలకోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా? దివ్యాంగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారు బలవన్మరణాలకు పాల్పడేలా చేయడం దుర్మార్గం కాదా? ఇది మోసం కాదా? మీ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎన్నుకున్న దారి అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దగా కాదా? వీటి పరిస్థితి ఇది అయితే, ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ మీరు చేసింది మరో అతిపెద్దమోసం. ఇది దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ!’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
రేపు వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) విజయవాడలో పర్యటించనున్నారు. వినాయకచవితి సందర్భంగా నగరంలోని రాణీగారి తోటలో జరిగే గణనాథుని పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ రాణీగారి తోట (దేవుళ్ళ ఆంజనేయులు స్ట్రీట్, శాంపిల్ బిల్డింగ్) వద్ద జరగనున్న గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతారు.వినాయక చవితి సందర్భంగా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని.. ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: వినాయక చవితి పర్వదిన్నాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని.. ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
మదర్ థెరిసా జయంతి సందర్భంగా జగన్ నివాళులు
-
వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ముద్రగడ పద్మనాభం లేఖ
-
మదర్ థెరిసాకు వైఎస్ జగన్ నివాళి
ప్రేమ, దయ, సేవ అనే మూల్యాలను పాటిస్తూ.. జీవితమంతా పేదలకు, అనాథలకు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అండగా నిలిచారు మదర్ థెరిసా. భారతరత్న, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ థెరిసా జయంతి నేడు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆమెకు నివాళులర్పించారు.ప్రేమతో చేసిన చిన్న పనులు(సేవలు) కూడా ప్రపంచాన్ని మార్చగలవు. ఈ విషయాన్ని మదర్ థెరిసా జీవితం మనకు గుర్తు చేస్తుంది. ఆమె జన్మదినాన్ని స్మరించుకుంటూ, ఆమె సేవా మార్గాన్ని మనం గౌరవించాలి అని ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన.Mother Teresa’s life reminds us that even small acts of love can make a big difference. Remembering her on her birth anniversary.#MotherTeresa pic.twitter.com/OqlR4K5y6E— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2025 -
వైఎస్ జగన్‌పై బీఆర్ నాయుడు ఛానల్ విష ప్రచారం చేస్తోంది: భూమన
సాక్షి,తిరుపతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బీఆర్ నాయుడు ఛానల్ విషప్రచారం చేస్తోందని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం కంటే వైఎస్సార్,జగన్ పాలనలోనే కొన్ని వేల రెట్లు హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది. జగన్ ఐదేళ్లు సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీనివాస దివ్య హోమం జగన్ పాలనలోనే ప్రారంభమైంది’ అని స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్ @గన్నవరం ఎయిర్ పోర్ట్
-
నీ క్రమశిక్షణ దేశానికే గౌరవం తెచ్చింది.. నీ భవిష్యత్తు బాగుండాలి
-
చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్పై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: క్రికెటర్ చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. పుజారా భవిష్యత్ బాగుండాలని.. మెరుగైన విజయాలు సాధించాలన్నారు. పుజారా క్రమశిక్షణ, ఆటతీరు దేశానికి మరింత గౌరవాన్ని పెంచాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.టీమిండియా దిగ్గజం చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించాడు. టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పేరొందిన ఛతేశ్వర్ పుజారా.. అక్టోబర్ 9, 2010న భారత తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు.బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 103 టెస్టులు ఆడిన పుజరా 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.As Cheteshwar Pujara announces his retirement wishing him all success in his future endeavours.His discipline, and focus brought immense pride to the nation.@cheteshwar1 pic.twitter.com/Jxe5JcaZOo— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2025 -
సంపద సృష్టి అని అప్పుల ఏపీగా మార్చేశారు..!
-
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ నమ్మబలికిన టీడీపీ, జనసేన కూటమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేసిందని తూర్పారబట్టారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు కూటమి సర్కార్ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే.. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య అప్పటి విపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీ లు పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేశాయి. ప్రభుత్వ విధానాల వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు కీలక రంగాల్లో మూల ధన వ్యయం బాగా తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం దారుణంగా తగ్గుతోందని.. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని, అది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని నిందించాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని చాలా వేగంగా పెంచడంతో పాటు, అప్పులు పెరగకుండా చూస్తామని గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ లు హామీ ఇచ్చాయి.⇒ కానీ.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒకసారి పరిశీలిస్తే, కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాది (2023–24)తో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అదే సమయంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే, కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 12.04 శాతం పెరుగుదల నమోదైంది. మరి ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 12.02 శాతం ఉంటే, ప్రభుత్వ సొంత ఆదాయం అత్యల్పంగా 3.08 శాతం వృద్ధికే ఎందుకు పరిమితమైంది? ⇒ గత ఏడాది రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అదే ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయంతో, ఇప్పుడు 2025–26లో మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి వచి్చన ఆదాయాన్ని (సీఎజీఆర్) పరిగణనలోకి తీసుకుంటే అది కేవలం 2.39 శాతం మాత్రమే పెరిగింది. వాస్తవానికి అది కనీసం 10 శాతం ఉండాల్సి ఉంది. ⇒ మరో అత్యంత ఆందోళకర అంశం రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడం. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు (పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్కౌంట్, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ల అప్పులు) రూ.3,32,671 కోట్లు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లో చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,86,361 కోట్లు. అంటే గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పులో 56 శాతం రుణాలను కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే చేసింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అప్పులు ఆకాశాన్ని అంటే విధంగా పెరగడం అత్యంత ఆందోళనకరం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తమ విధానాలను పునరాలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ విధానాల వల్ల తీవ్ర అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా దగండి పడింది. -
బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ రియాక్షన్
-
బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళ వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరిగిపోవడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి, అప్పులు పెరిగి పోతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019–24 మధ్య మా ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదేపదే అబద్దాలు చెప్పాయి. రాష్ట్రంలో ఆదాయ వృద్ది తగ్గిందనీ, అభివృద్ది అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయి. 𝙏𝙝𝙚 𝘾𝘼𝙂 𝙛𝙞𝙜𝙪𝙧𝙚𝙨 𝙧𝙚𝙫𝙚𝙖𝙡 𝙘𝙤𝙣𝙩𝙞𝙣𝙪𝙞𝙩𝙮 𝙤𝙛 𝙛𝙞𝙨𝙘𝙖𝙡 𝙨𝙩𝙧𝙚𝙨𝙨During the five year period, 2019-24, the then opposition parties TDP and JSP continuously lied that the then Government’s policies were resulting in unchecked growth in liabilities and… pic.twitter.com/X0JeWvpxVE— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025 తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04% పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఏపీ ఆర్థిక వృద్ధి 12.02% ఉంటే, మరి ఆదాయం పెరుగుదల 3.08% దగ్గరే ఎందుకు ఆగిపోయింది?, గతేడాదితో పోల్చితే ఈఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ది పది శాతం ఉండాల్సి ఉండగా, కేవలం 2.39% మాత్రమే ఉంది. మా హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,32,671 కోట్లు మాత్రమే. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల్లోనే ఏకంగా రూ. 1,86,361 కోట్లు అప్పు చేసింది. అంటే మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పుల్లో ఇప్పటికే 56% చేశారు. ఆదాయాలు తగ్గి, అప్పులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అన్ని స్థాయిల్లో పెరిగిన అవినీతిని అరికట్టాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
జగన్ చెప్పిందే నిజమైంది.. అమ్మకానికి స్టీల్ ప్లాంట్!
-
తాడిపత్రి YSRCP నేత స్వర్ణలతను ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్
-
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు వైఎస్ జగన్ నివాళి
-
నేడు ప్రకాశం పంతులు జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు . తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి నేడు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/cPB3xrhlKv— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025