Gold
-
కఠిన పొదుపు దిశగా కదలండి
న్యూఢిల్లీ: కఠిన పొదుపు దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలు) మళ్లాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ప్రజలు పెట్రోల్/డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ సూచన చేసింది. బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, విదేశీ పర్యటనలు మానుకోవాలని, ఇంటి నుంచే పనిచేయాలని, కార్లలో ఒంటరిగా వెళ్లకుండా ఇతరులతో కలసి ప్రయాణించాలంటూ ప్రధాని దేశ ప్రజలను కోరడం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధంతో క్రూడ్, బంగారం ధరలు భారీగా ఎగబాకి.. దిగుమతి బిల్లు భారమవుతోంది. ఫలితంగా రూపాయి నేలచూపులు చూస్తోంది. దీంతో ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, బీమా, ఆర్థిక సంస్థల అధికారులు, సిబ్బందిని ఈవీల్లో ప్రయాణించాలని కోరింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలను అద్దెకు తీసుకోవాలని సూచించింది. తప్పనిసరి అయితే తప్పించి అన్ని సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించుకోవాలని కూడా ఆర్థిక శాఖ కోరింది. -
తగ్గిన బంగారం, పెరిగిన వెండి: కొత్త రేట్లు ఇవే!
బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు పతనమైంది. అయితే వెండి రేటు మాత్రం రూ.10 వేలు పెరగడంతో.. కేజీ సిల్వర్ రేటు రూ. మూడు లక్షలకు చేరుకుంది. ఇక్కడ లేటెస్ట్ పసిడి ధరలు ఎక్కడ, ఎలా.. ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం. -
గోల్డ్ కొనాలా.. వద్దా..
‘కొంతకాలం బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ పిలుపుతో కొనుగోళ్లు ఆపాలని కొందరు , ఏడాది పాటు వాయిదా వేయాలని మరికొందరు చర్చలకు దిగారు ఇప్పటికే కొనేశాంగా మరి అమ్మేయాలా అని అనేకమంది సందిగ్ధంలో పడ్డారు. సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో ఈటీఎఫ్‌లుగా కొంటున్నవారు ఏంచేయాలో తోచక అయోమయంలో పడ్డారు. అయితే ప్రధాని పిలుపు ఒక రకమైన కొనుగోలుదారులకు పూర్తిగా వర్తిస్తుంది. మరొక వర్గం కొనుగోలుదారులకు అంతగా సంబంధం ఉండకపోవచ్చు. కానీ చాలా మందికి తాము ఏ రకమైన బయ్యర్లో తెలీదు. అది తెలిస్తే మీరు బంగారం కొనాలో, అమ్మాలో, కొనసాగించాలో నిజంగా ఏంచేయాలో స్పష్టమవుతుంది. క్రూడ్, చమురు దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యంపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని మోదీ గత వారం చేసిన బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలన్న పిలుపును బాధ్యత గల పౌరులుగా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. పతనమవుతున్న రూపాయి , పశ్చిమ ఆసియాలో అస్థిర పరిస్థితి, పెరుగుతున్న దిగుమతి బిల్లు వంటి కారణాలను ప్రధాని ప్రస్తావించారు. అయితే ఈ పిలుపునకు అందరూ ఒకేరకంగా స్పందించాల్సిన అవసరంలేదు. సరదాగా, ఆడంబరం కోసం, ఫ్యాషన్‌గా ప్రదర్శించుకునేందుకు మీరు నగలు కొనేవారైతే ఈ పిలుపు మీకు పూర్తిగా వర్తిస్తుంది. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలి అనుకుంటే ఆపడానికి ఆలోచించాల్సిందే. అదెలాగో తెలుసుకుందాం...ప్రధాని పిలుపు అసలు అర్థం ఏమిటి?భారతదేశం వినియోగించే బంగారంలో 99 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే వస్తుంది. దేశంలో గణనీయమైన స్థాయిలో బంగారం తవ్వకం జరగదు. నగలు, నాణేలు, బార్లు ఏ రూపంలో అయినా బంగారం కొనడానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి డాలర్ల రూపంలో దిగుమతులకే వెళ్తుంది. డాలరు మారకంలో రూపాయి విలువ 96 స్థాయికి పతనమై ఒకవైపు దిగుమతి బిల్లు పెరుగుతున్న సమయంలో బంగారం డిమాండ్ పెరగడం ఆర్థిక పరిస్థితిని మరింత కఠినతరం చేస్తోంది. ఎందుకంటే బంగారం దిగుమతులకు ప్రభుత్వం డాలర్లలోనే చెల్లిస్తుంది. డిమాండ్ పెరిగితే డాలర్లు భారీగా బయటకు వెళ్తాయి. దాంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే కీలకమైన దిగుమతులైన చమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు అన్నీ ఖరీదవుతాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అది చివరికి సాధారణ కుటుంబాలపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రధాని పిలుపులో భావోద్వేగం కన్నా గణాంకాలకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి.ఎవరి కోసం...ఈ పిలుపు అత్యంత ప్రభావం చూపేది జ్యువెలరీ కొనుగోలుదారులపైనే. ఎందుకంటే నగలలో బంగారం విలువతో పాటు 10 నుంచి 15 శాతం వరకు మేకింగ్ చార్జీలు, జీఎస్టీ కూడా ఉంటాయి. ఇవి తిరిగి రికవర్ కాని ఖర్చులు. అంటే నగలను పెట్టుబడిగా భావించే వారు , కొనుగోలు చేసిన క్షణం నుంచే తమ సంపదను అంతకన్నా ఎక్కువ శాతంగా అంచనా వేస్తారు. నగలు అనేవి వినియోగం కోసమే. పెట్టుబడి కోసం కాదు. అందుకే ప్రధాని పిలుపు వీరిని ఉద్దేశించి చేసిందిగా గమనించాలి.బంగారం పని సంపద పెంచడం కాదు ...రక్షణ ఇవ్వడంప్రధాని పిలుపును పాటించాలా వద్దా అనుకునే ముందు, మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం అసలు ఏ పని చేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి. బంగారంపై పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు ఉండటం సరైనదిగా పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు భావిస్తారు. అది సంపదను వేగంగా పెంచడానికి కాదు. ఒక రకమైన ఇన్సూరెన్స్‌లా పనిచేయడానికి. ఈక్విటీలు దీర్ఘకాలంలో సంపదను పెంచుతాయి. డెట్ ఇన్స్ట్రుమెంట్లు మూలధనాన్ని కాపాడి వడ్డీ ఇస్తాయి. బంగారం పని మాత్రం వేరు. రూపాయి బలహీనపడినప్పుడు లేదా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు, బంగారం సాధారణంగా తన విలువను నిలబెట్టుకుంటుంది. ఆసమయంలో ఇతర పెట్టుబడులను కాపాడేది బంగారం. ఆ పరిస్థితులకు హెడ్జింగ్‌గా బంగారాన్ని అలొకేషన్‌లో ఉంచుతారు.నగలు, ఈటీఎఫ్‌లు ఎస్‌జీబీలు పూర్తిగా భిన్నందిగుమతుల స్థాయిలో చూస్తే బంగారం అంటే బంగారమే. దేశంలో జ్యువెలరీ తయారీ దారులు గోల్డ్ బార్లు దిగుమతి చేసుకుని నగలుగా మారుస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌లు , గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా తమ యూనిట్లకు బ్యాకింగ్‌గా ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి దిగుమతి భారంలో పెద్ద తేడా ఉండదు. ఇక్కడ అసలు తేడా దిగుమతుల్లో కాదు. దానికి చేసే వ్యయంలో ఉంది.గోల్డ్ఈటీఎఫ్లు – మ్యూచువల్ ఫండ్లు గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా ఫిజికల్ గోల్డ్ దిగుమతులపైనే ఆధారపడతాయి. వీటి విషయంలో మేకింగ్ చార్జీలు ఉండవు. గోల్డ్ విలువపై జీఎస్టీ ఉండదు. తిరిగి అమ్ముకోవడం కూడా తేలిక.ఎస్జీబీలే నిజమైన మినహాయింపుసావరిన్ గోల్డ్ బాంండ్ల (ఎస్జీబీ)కు మాత్రమే నిజమైన ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. బాండ్ల విషయంలో ప్రభుత్వం బంగారం ధరలకు అనుసంధానమైన ఒక పేపర్ ఇన్స్ట్రుమెంట్ను జారీ చేస్తుంది. ఇందులో ఫిజికల్ గోల్డ్ కొనుగోలు లేదా దిగుమతి అవసరం ఉండదు. ఇష్యూ సమయంలో కొనుగోలు చేసిన వారు ఎనిమిదేళ్లు హోల్డ్ చేస్తే, 2.5 శాతం వార్షిక వడ్డీతో పాటు మెచ్యూరిటీ సమయంలో ట్యాక్స్ ఫ్రీ లాభాన్ని పొందేవారు. అయితే ఇప్పుడు కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూలు ఆగిపోయాయి. చివరిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సంవత్సరాల క్రితం కొత్త ట్రాంచ్ను విడుదల చేసింది.ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?మీ గోల్డ్ ఈటీఎఫ్‌లు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లను కలిపి లెక్కించండి. నగలను లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే అవి వినియోగానికి ఉద్దేశించినవి. మొత్తం పెట్టుబడుల్లో బంగారం శాతం ఎంత ఉందో చూడండి. అది 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 శాతం కంటే తక్కువైతే పోర్ట్‌ఫోలియో సమతుల్యత కోసం కొంత కొని పెంచుకోవచ్చు.10 శాతం దాటితే కొంత తగ్గించి ఆవచ్చే డబ్బును ఈక్విటీ, డెట్ లేదా క్యాష్ వైపు మార్చడం మంచిది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మార్కెట్ టైమింగ్ వల్ల ఈ పనిచేయడంలేదు. రీబ్యాలెన్సింగ్ మాత్రమే చేస్తున్నాం. బంగారాన్ని ఇన్సూరెన్స్‌లా చూడండి. ఇన్సూరెన్స్‌ను ఎవరైనా అవసరం వచ్చినప్పుడు కాదు, ముందుగానే కొనుగోలు చేస్తారు. బంగారంపై పెట్టుబడి కూడా అంతే.. పెరుగుతున్నపుడు కొనడం సరైన పెట్టుబడి విధానం కాదు. ప్రధాని పిలుపు బంగారం వినియోగం కోసం కొనేవారి విషయంలో సరైనదే. ముఖ్యంగా నగలు కొనేవారు దానిని సీరియస్‌గానే తీసుకోవాలి. ఇప్పటికే 5 నుంచి 10 శాతం సరైన గోల్డ్ అలొకేషన్ కలిగిన పెట్టుబడిదారు తన పోర్ట్‌ఫోలియోను కదిలించాల్సిన పనిలేదు. మొదటి నుంచి పెట్టుబడి ప్రణాళిక సరైనదైతే ఇప్పుడు చేయాల్సింది దానికి కట్టుబడి ఉండటమే.చరిత్ర ఏం చెబుతోంది?2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తమ బాండ్ కొనుగోళ్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. దాంతో రూపాయి సహా అనేక ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలు బలహీనపడ్డాయి. 2020 కరోనా సంక్షోభం, 2022 ఎనర్జీ క్రైసిస్ సమయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి సందర్భంలో రూపాయి బలహీనపడగా, ఈక్విటీలు నష్టపోగా, గోల్డ్ ధరలు మాత్రం పెరిగాయి. ఆ సమయంలో కొంత బంగారం కలిగి ఉన్న పోర్ట్‌ఫోలియోలు మాత్రమే సంక్షోభాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఇక్కడ గమనించాల్సింది ఒకటే బంగారం మిమ్మల్ని ధనవంతులను చేయడానికి కాదు, మీ సంపద పెంచడానికి కాదు మార్కెట్ కష్టకాలంలో మీ ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని.– సాక్షి, వెల్త్ డెస్క్ -
బంగారం ధరలు - ఊహకందని మార్పులు!
బంగారం ధరలు భారీగా పెరుగుతూ.. తగ్గుతూ ఊహకందని మార్పులకు లోనవుతున్నాయి. వారం మధ్యలో పెరిగిన గోల్డ్ రేటు, వారాంతంలో ఒక్కసారిగా పడిపోయాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో జరిగిన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.మే 10న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,52,350 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర, మే 16 నాటికి 1,56,930 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,650 వద్ద నుంచి 1,43,850 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతగా మార్పు చెందాయో స్పష్టంగా అర్థమవుతోంది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఏడురోజుల్లో 1,54,370 రూపాయల నుంచి 1,60,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,500 వద్ద నుంచి రూ.1,47,500 వద్దకు చేరింది. ఈ మార్పు కేవలం వారం రోజులలో జరిగింది.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరలు, వారం రోజుల్లో భారీ పెరుగుదలను నమోదు చేసాయి. మే 10న 1,52,500 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం రేటు మే 16నాటికి 1,57,080 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,39,800 నుంచి 1,44,000 రూపాయల వద్దకు చేరింది.ధరలు పెరుగుదలకు కారణాలుబంగారం ధరలు పెరగడానికి సాధారణంగా అనేక ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు ఉంటాయి. బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు లేదా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు షేర్లు, బాండ్లు వంటి రిస్కీ ఆస్తుల నుంచి డబ్బును తీసి బంగారంలో పెట్టడం పెరుగుతుంది. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఎగుస్తాయి.అలాగే అమెరికా డాలర్ విలువ కూడా కీలకం. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కూడా బంగారం ధరలు పెరుగుతాయి. కరెన్సీ విలువ తగ్గిపోతున్నప్పుడు ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం వైపు మొగ్గుతారు.ఇంకో కారణం వడ్డీ రేట్లు. బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బంగారం ఆకర్షణ పెరుగుతుంది, ఎందుకంటే ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే లాభం తగ్గిపోతుంది. అదే విధంగా.. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఆభరణాల డిమాండ్ (వివాహ సీజన్లు, పండుగలు), అలాగే మార్కెట్ స్పెక్యులేషన్ కూడా ధరల పెరుగుదలకు కారణమవుతాయి.ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే! -
నమ్మలేని నిజం.. దేశాన్ని కాపాడిన బంగారం!
బంగారం అనేది భారతదేశంలో కేవలం విలువైన లోహం మాత్రమే కాదు,.. అది కుటుంబ గౌరవానికి ప్రతీక, భద్రతకు సంకేతం, కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆస్తిగా పరిగణిస్తారు. అలాంటి బంగారాన్ని.. ప్రభుత్వం రహస్యంగా దేశం దాటించింది అంటే?.. ఎవరైనా నమ్ముతారా?, కానీ 1991లో ఇదే జరిగింది. ఇంతకీ మన దేశం బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చింది?, ఎంత బంగారం పంపింది? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1991లో దేశం దివాలా తీసే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారాన్ని బ్రిటన్‌కు తరలించింది. సుమారు 46,910 కేజీల బంగారాన్ని రహస్యంగా తరలించి.. బదులుగా 405 మిలియన్ డాలర్ల అత్యవసర రుణం సమీకరించింది. భారత ఆర్థిక చరిత్రలో అత్యంత కీలక మలుపుగా నిలిచిన ఈ సంఘటన, తరువాత దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం చేసింది.రుణాలు ఇవ్వడానికి నిరాకరించిన విదేశీ బ్యాంకులు!1980ల చివరి దశ నుంచి 1990ల ప్రారంభం వరకు భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు కూడా గణనీయంగా తగ్గిపోయింది.ఫలితంగా భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా క్షీణించి, 1991 మే నాటికి కేవలం ఒక వారం రోజుల దిగుమతులకు సరిపడే డాలర్లు మాత్రమే మిగిలాయి. ఈ పరిస్థితిని గమనించిన అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించేశాయి. దీంతో విదేశీ బ్యాంకులు భారత్‌కు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభ అంచుకు చేరుకుంది.సాహసోపేతమైన నిర్ణయం!దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కున్న సమయంలో.. అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం, ఆర్బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ నాయకత్వంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రతిష్ట కంటే ముందు ఆర్థికంగా దివాలా తీయకుండా ఉండటం అవసరమని భావించిన ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారు నిల్వలను తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను రెండు దశల్లో అమలు చేశారు.మొదటి దశలో.. 1991 మే నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల స్వాధీనం చేసిన బంగారాన్ని స్విట్జర్లాండ్‌లోని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారు 215 మిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని సమీకరించారు. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో.. రెండో దశలో 1991 జూలైలో ఆర్బీఐ తన సొంత నిల్వల నుంచి 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు రహస్యంగా తరలించి అత్యవసర రుణాన్ని పొందింది.రహస్యంగా తరలింపు!1991 జూలై 4న బంగారం రవాణా విమానం ముంబైలోని శాంతాక్రూజ్ విమానాశ్రయం నుంచి రహస్యంగా బయలుదేరింది. ఆర్బీఐ భద్రగారాల నుంచి ప్రత్యేక భద్రత మధ్య భారీ ట్రక్కులలో బంగారాన్ని విమానాశ్రయానికి తరలించారు. ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించేందుకు కస్టమ్స్ నిబంధనల్లో కూడా ప్రత్యేక మినహాయింపులు పొందారు.సాయుధ భద్రతా బలగాల పర్యవేక్షణలో బంగారాన్ని కార్గో విమానాల్లో ఎక్కించి విదేశాలకు పంపించారు. అయితే ఈ రహస్య ఆపరేషన్ ఎక్కువకాలం దాచిపెట్టలేకపోయారు. 1991 జూలై 8న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ ఈ వార్తను ప్రధాన శీర్షికగా ప్రచురించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. భారతదేశం తన బంగారాన్ని విదేశాలకు పంపాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆ నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ!ఆ సమయంలో దేశాన్ని ఆర్థిక పతనం నుంచి కాపాడిన ఈ కఠిన నిర్ణయం, తరువాత భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు పునాది వేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేస్తూ చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను అమలు చేసింది. విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడం, మార్కెట్ ఆధారిత విధానాలను ప్రవేశపెట్టడం వంటి చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ లభించింది.బంగారాన్ని విదేశాలకు పంపాల్సి రావడం అప్పట్లో చాలామందికి అవమానంగా అనిపించినప్పటికీ, ఆ నిర్ణయం తీసుకోకపోతే భారత్ అంతర్జాతీయ అప్పులు చెల్లించలేని పరిస్థితికి చేరుకునేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ రోజున చేపట్టిన ఆ రహస్య గోల్డ్ ఆపరేషన్నే.. నేటి భారత ఆర్థిక పురోగతికి కీలక మలుపు అని చెబుతున్నారు.మోదీ పిలుపు1991లో గల్ఫ్ యుద్ధం కారణంగా భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లే, ప్రస్తుతం 2026లో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ చమురు ధరలను పెంచుతూ భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం విదేశీ మారకద్రవ్యంపై మరింత భారం మోపుతోంది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలను ఉద్దేశించి అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని, ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. కాబట్టి దేశ పౌరులు కూడా.. 1991 నాటి సంఘటన గుర్తు చేసుకుంటూ, నేటి తరం ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
నష్టాల్లో గోల్డ్ మార్కెట్.. భారీగా తగనున్న బంగారం ధరలు..?
-
కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఒక చీకటి సందర్భం.. పాఠాలు నేర్పిన 1991 సంక్షోభం
-
రూ.4400 తగ్గిన గోల్డ్ రేటు.. కొత్త ధరలు ఇలా!
గురువారం ఉదయం రూ.2240 తగ్గిన పసిడి ధర, సాయంత్రానికి రూ.4420 తగ్గింది. దీంతో బంగారం రేటు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (మే 15) ఉదయం 2050 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర, సాయంత్రానికి 4050 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల ధర ఉదయం 2240 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో రూ.2180 (మొత్తం రూ.4420 తగ్గింది) తగ్గింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధర భారీ పతనం చవిచూసిందని స్పష్టంగా అర్థమవుతోంది.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.4,050 తగ్గి రూ.1,44,900 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.4200 తగ్గి 1,58,060 రూపాయల వద్ద నిలిచింది.చెన్నైలో కూడా బంగారం ధరల్లో మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,650 (2850 రూపాయలు తగ్గింది). 24 క్యారెట్ల ధర రూ.3100 తగ్గి 1,61,080 రూపాయల వద్దకు చేరింది. అయితే వెండి ధరల్లో సాయంత్రానికి చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. కాబట్టి సిల్వర్ రేటు ఉదయం ఎలా ఉందో.. అలాగే ఉంది.మొత్తం మీద.. వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటుకు బ్రేకులు పడినట్లు అనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా భారీ ధరల తగ్గుదల నమోదైంది. అయితే.. రానున్న రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
మోదీ చెప్పినా వినట్లేదు.. బంగారం కొనేందుకు ఎగబడుతున్న జనం..
-
కేంద్రం మరో కీలక నిర్ణయం పైపైకి బంగారం ధరలు..!
-
డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా
పశ్చిమాసియా యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలపైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డబ్బు విలువ తగ్గితే.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.మొదటిది, ఇరాన్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు పెరగడం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, ఉత్పత్తి ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు అన్నీ పెరుగుతాయి. ఫలితంగా ప్రతి వస్తువు ఖరీదవుతుంది. ఈ పరిస్థితినే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగితే నగదు విలువ తగ్గిపోతుంది.ఇక రెండో కారణం.. దేశాలపై పెరుగుతున్న జాతీయ అప్పులు. ప్రభుత్వాలు భారీ అప్పులు తీసుకున్నప్పుడు వాటిని తీర్చడానికి మరింత కరెన్సీ ముద్రించాల్సి వస్తుంది. ఎక్కువ డబ్బు మార్కెట్లోకి వస్తే కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే.. కియోసాకి ప్రభుత్వం ముద్రించే డబ్బును ఫేక్ మనీ అంటారు.TAKE ACTION: 2 reasons why inflation will steal your money1: As long as the war in Iran rising oil prices will cause inflation and your fist money to decline in purchasing power.2: Nation Debt will cause governments to print more fake money.Please protect your self,…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 13, 2026డబ్బును కాపాడుకోవాలంటే.. ప్రతివ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కాబట్టి బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథేరియం వంటివాటితో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇవి కష్టకాలంలో మిమ్మల్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయగలవు. బంగారం, వెండి వంటి విలువ కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరిం త పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?గోల్డ్, సిల్వర్ వంటివి కొనుగోలు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, అని చాలామంది అనుకుంటారు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించినవాళ్లు మాత్రం.. బంగారం ఎలా కొనాలి?, అని ఆలోచిస్తారు. ఈ ఆలోచన మనిషిలో కొత్త అవకాశాలను వెతకడానికి ప్రేరణ ఇస్తుంది. ధనవంతుల ఆలోచన సమస్యలపై కాకుండా పరిష్కారాలపై ఉంటుందని కియోసాకి స్పష్టం చేశారు. -
ఒక్క రోజులోనే రూ.15వేలు, భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
-
దిమ్మతిరిగేలా షాకిచ్చిన బంగారం ధర.. కొనాలా? వద్దా?
-
బంగారమా.. ఈరోజు కొంటామా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
వామ్మో.. అసలు బంగారం కొనగలమా..?
-
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
-
బంగారానికి ఇక దుబాయే దిక్కు!
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా దుబాయ్ నుంచి పసిడి, వెండి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ సంస్థ (జీటీఆర్ఐ) తెలిపింది. 2022లో 120 టన్నులతో మొదలైన కోటా 2027లో 200 టన్నులకు పెరగనుంది. ఇది భారత్ పసిడి దిగుమతుల్లో నాలుగో వంతుకు సమానం. కొత్త ఎంఎఫ్ఎన్ టారిఫ్ 15 శాతంగా ఉండగా, దుబాయ్ నుంచి దిగుమతులకి 14 శాతానికి పరిమితమవుతుందని జీటీఆర్ఐ పేర్కొంది. ఒక్క శాతం వ్యత్యాసం ప్రయోజనం పొందేందుకు దుబాయ్ మార్గం ద్వారా వ్యాపారులు పసిడిని మరింతగా దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వివరించింది. సుంకాలు ఇలా .. 2012కి ముందు విలువతో సంబంధం లేకుండా 10 గ్రాములకు రూ. 300 చొప్పున సుంకం ఉండేది. 2012 జనవరిలో బంగారం విలువలో 2 శాతం కస్టమ్స్ సుంకం విధించారు. అదే ఏడాది మార్చిలో బడ్జెట్లో 4 శాతానికి పెంచారు. 2013లో రుపాయి మారకం, విదేశీ మారకం నిల్వలు పడిపోయిన కారణాలతో పసిడిపై దిగుమతి సుంకాలు మూడు సార్లు పెరిగాయి. మొదట 4 నుంచి 6 శాతానికి, తర్వాత 8 శాతానికి, ఆ పైన 10 శాతానికి పెరిగాయి. 2014–18 మధ్యకాలంలో 10 శాతమే అమల్లో ఉండగా, 2019లో దాన్ని 12.5 శాతానికి పెంచారు. 2021 బడ్జెట్లో 10.75 శాతానికి తగ్గించి, మళ్లీ 2022లో 15 శాతానికి పెంచారు. 2024లో దేశీయంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 6 శాతానికి తగ్గించారు. ప్రత్యామ్నాయాల్లేవా..?2014లో మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ సర్కారు కొలువైన తర్వాత భౌతిక రూపంలో పసిడి దిగుమతులు తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది అవేంటంటే..ప్రభుత్వ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఇళ్లలో ఉన్న నిరుపయోగ బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నది ఈ పథకం లక్ష్యం. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, ఆ విలువపై 2.25–2.5 శాతం రాబడిని ఆఫర్ చేశారు. భౌతిక బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ వల్ల ఆశించిన స్పందన రాలేదు. దీంతో 2025లో ఈ పథకాన్ని నిలిపివేశారు. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2015లో సార్వభౌమ బంగారం బాండ్లకు శ్రీకారం చుట్టింది. 8 ఏళ్ల కాలవ్యవధి. బాండ్ కొనుగోలు ధరపై ఏటా 2.5 శాతం వడ్డీ ఎనిమిదేళ్ల పాటు రాబడిగా అందుతుంది. దీంతో ఈ పథకం విజయవంతమైంది. 8 ఏళ్ల కాలవ్యవధి తర్వాత నుంచి బాండ్లు క్రమంగా మెచ్యూరిటీకి రావడం.. ఈ కాలంలో పసిడి ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రభుత్వంపై చెల్లింపుల భారం భారీగా పెగిపోయింది. పెట్టుబడిపై 150–200 శాతం అధికంగా చెల్లించాల్సి వచి్చంది. దీంతో 2025 నుంచి అనధికారికంగా ఈ పథకానికీ ప్రభుత్వం గుడ్‌బై చెప్పింది. ఈటీఎఫ్‌లు బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), డిజిటల్ గోల్డ్ తదితర డిజిటల్ సాధనాల్లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, కొనుగోలు విలువకు సరిపడా భౌతిక లోహాలను ఫండ్స్ సంస్థలు సమకూర్చుకుని ఖజానాల్లో భద్రపరచాల్సి ఉంటుంది. కనుక ఒక రకంగా భౌతికంగా ఆ మేరకు కొనుగోలు చేయాల్సిందే. కానీ, ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు దేశీయంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న బంగారాన్ని బ్యాకెండ్‌గా వినియోగించుకుంటే విదేశాల నుంచి అదనంగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బంగారం, వెండి డిజిటల్ రూపంలో ఉంటే కావాల్సినప్పడు విక్రయించి, కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. దీంతో చలామణి పెరుగుతుంది. పసిడిపై సుంకాల విధింపు దేశీయంగా గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లకి సానుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
గోల్డ్ స్మగ్లింగ్ ఇంకా పెరుగుతుందేమో!!
సాక్షి, బిజినెస్ డెస్క్: పసిడి, వెండిపై సుంకాల మోతతో ఆభరణాల మార్కెట్ గందరగోళంలో పడింది. దిగుమతులు తగ్గి విదేశీ మారకం నిల్వలను నిలబెట్టుకునేందుకు, తద్వారా రూపాయి విలువ పడిపోకుండా చూసుకునేందుకు ఇది దోహదపడనుంది. అలాగే, కొత్త కొనుగోళ్ల కోసం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పాత వాటిని కొత్త వాటికి మార్చుకునేలా ప్రోత్సహించడం ద్వారా రీసైక్లింగ్‌కి ఊతమివ్వనుంది.అయితే, అదే సమయంలో స్మగ్లింగ్ రిస్కులు పెరుగుతాయని, ఆభరణాల వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పసిడి, వెండి దిగుమతులపై సుంకాల మోత పలు సమస్యలకు దారి తీస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనితో వజ్రాభరణాల పరిశ్రమ మరింత గడ్డుకాలం ఎదుర్కొనాల్సి వస్తుందని ఎగుమతిదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ రిస్కులు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.పరిశ్రమకు వెన్నెముకలాంటి లఘు, చిన్న, మధ్యతరహా తయారీదార్లు ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటూ ఉండగా, తాజా పరిణామం అశనిపాతంలా మారుతుందన్నారు. దిగుమతి సుంకాలను పెంచడం వల్ల సాధారణంగానే ధరలు పెరుగుతాయని, కాకపోతే కొనుగోళ్లను తగ్గించడానికి ఉపయోగపడకపోవచ్చని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పసిడి రేట్లు రెట్టింపైనప్పటికీ దిగుమతులు అదే నిష్పత్తిలో తగ్గకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ నేపథ్యంలో సుంకాల పెంపులాంటి చర్యల వల్ల స్మగ్లింగ్‌కి ఊతం లభిస్తుందని, ఎగుమతి వ్యయాలు పెరిగిపోతాయని ఎగుమతిదార్లు తెలిపారు.‘పొదుపు చర్యలు, బులియన్ దిగుమతులపై సుంకాల పెంపు వల్ల వ్యాపారం మరింత కష్టతరం అవుతుంది. గ్రే మార్కెట్, స్మగ్లింగ్ పెరిగి, ఎకానమీలో సమాంతర వ్యవస్థ ఏర్పాటుకు దారి తీసే ముప్పు ఉందని పరిశ్రమ ఆందోళన చెందుతోంది’ అని అఖిల భారత రత్నాభరణాల మండలి (జీజేసీ) చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. కస్టమ్స్ సుంకం, జీఎస్టీ, వ్యవసాయ సెస్సులన్నీ కలగలిసిన దిగుమతి సుంకాల పెంపుతో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 27,000 మేర భారం అవుతుందని చెప్పారు. సుంకాలను పెంచడం వల్ల బంగారం రేట్లు మరింత పెరగడం తప్ప దిగుమతులకు అడ్డుకట్ట పడటం చాలా అరుదని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కిరీట్ భన్సాలీ వ్యాఖ్యానించారు. రీసైక్లింగ్‌కి దన్ను.. పసిడి దిగుమతి సుంకాల పెంపుతో స్వల్పకాలికంగా ఆభరణాల విక్రయ పరిమాణం తగ్గుతుందని జ్యుయలర్లు తెలిపారు. అయితే, డిమాండ్ స్థిరంగానే ఉండొచ్చని వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, భారీ క్రూడాయిల్ ధరలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే వరకు పెంచిన సుంకాలు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈవో సువంకర్ సేన్ చెప్పారు. పరిమాణంపరంగా 10–15% ప్రభావం పడినప్పటికీ, విలువపరంగా లావాదేవీలు అధిక స్థాయిలోనే ఉంటాయన్నారు.వినియోగదారులు తేలికపాటి ఆభరణాలను కొనేందుకు మొగ్గు చూపొచ్చన్నారు. మరో వైపు, సంస్కృతి, పెట్టుబడులపరంగా బంగారానికి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు, పండుగల సందర్భంగా కొత్తగా కొనుగోలు చేసే వారి కారణంగా పసిడికి డిమాండ్ కొనసాగుతుందని తెలిపారు. సుంకాల పెంపు వల్ల గోల్డ్ రీసైక్లింగ్ పెరుగుతుందన్నారు. ప్రధాని పిలుపుతో ‘నేషన్ ఫస్ట్ గోల్డ్4 ఇండియా’ కార్యక్రమాన్నిఆవిష్క రించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఎండీ కల్యాణరామన్ తెలిపారు. -
మోదీ కామెంట్స్ వేళ బంగారం వ్యాపారులు ఏం చేస్తున్నారంటే?
పాత బంగారం మార్పిడి పథకాలపై నగల వ్యాపారులు దృష్టి సారించారు. భారత్‌లో విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవడానికి బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి విషయం తెలిసిందే. దీంతో ఆభరణాల రంగం బంగారం రీసైక్లింగ్, మార్పిడి పథకాల వైపు అడుగులు వేస్తోంది. డిమాండ్‌ను పూర్తిగా తగ్గించే బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.“దిగుమతి సుంకం సవరణ అనేది అతిపెద్ద విధాన మార్పు. ఇది సరఫరా వ్యవస్థ మొత్తం ఖర్చులను పెంచుతుంది. కానీ వినియోగదారులు బంగారాన్ని ఎలా వినియోగించాలో మళ్లీ ఆలోచించే అవకాశాన్ని కూడా ఇది ఇస్తోంది. పాత బంగారం తీసుకొచ్చి కొత్త నగలతో మార్చుకోవాలని మా వినియోగదారులను బలంగా ప్రోత్సహిస్తున్నాం’’అని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించుకుంటూ కొత్త డిజైన్లు పొందేందుకు ఇది ఉత్తమ మార్గాల్లో ఒకటని అంటున్నారు.పాత బంగారం మార్పిడిలో ఆఫర్లు తనిష్క్ సంస్థ తన పాత బంగారం మార్పిడి కార్యక్రమాన్ని #ఓల్డ్గోల్డ్న్యూఇండియా ప్రచారంతో పెంచుకుంది. కల్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇటీవల ‘నేషన్ ఫస్ట్ - గోల్డ్4ఇండియా ఇనిషియేటివ్’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. పాత బంగారం మార్పిడి, తక్కువ బరువు ఉన్న 18 క్యారెట్ నగల వినియోగం, గోల్డ్ మానిటైజేషన్ పథకాలు, బంగారం పునర్వినియోగ కార్యక్రమాలపై సంస్థ దృష్టి పెట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థకు చెందిన 342 దుకాణాల్లో వినియోగదారులు వాడని, పాడైన, పాత నమూనాల నగలను మార్చుకునేలా ప్రోత్సహిస్తారు. దీంతో కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన బంగారం అవసరం తగ్గుతుంది.ఇటీవల ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం దిగుమతి ఖర్చులు, ప్రస్తుత ఖాతా లోటు, బంగారం ధరల పెరుగుదలపై ఆందోళనలు మరింత పెంచింది. ప్రస్తుత ఖాతా లోటు అంటే.. విదేశాలకు చెల్లింపులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయం మధ్య తేడా వల్ల ఏర్పడే లోటు. భారత్ దిగుమతి బంగారంపై ఎక్కువగా ఆధారపడటంతో, కొత్తగా కొనుగోలు చేయడానికి బదులు ఇళ్లలో వాడని బంగారాన్ని కొత్త నగలుగా మార్చుకోవాలని వ్యాపారులు వినియోగదారులకు సూచిస్తున్నారు.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక సుంకం తాత్కాలికంగా బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపొచ్చు. కానీ, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వొచ్చు. “భారత్‌లో బంగారం దిగుమతి సుంకం పెంపు స్థానిక ధరలను పెంచి, కొంతకాలం కొనుగోళ్లు తగ్గించే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచ అనిశ్చితి, దేశీయ కరెన్సీ ఒత్తిళ్ల సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుంది” అని నిపుణులు తెలిపారు.గతంలో దిగుమతి సుంకం 15 శాతం ఉన్నప్పుడు కనిపించినట్లే.. అక్రమ రవాణా మళ్లీ పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో దిగుమతి బిల్లు తగ్గి విదేశీ మారక నిల్వలకు తాత్కాలిక మద్దతు లభించొచ్చని చెబుతున్నారు.భారత్ మొత్తం దిగుమతి బిల్లులో బంగారం వాటా దాదాపు 9-10 శాతం ఉండటంతో, కొత్త దిగుమతుల బదులు దేశంలో ఇప్పటికే ఉన్న బంగారాన్ని పునర్వినియోగం చేయడం, మానిటైజేషన్‌పై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలకు ఆభరణాల రంగం అనుగుణంగా ముందుకు సాగుతోంది.“భారత్‌లో ఇళ్లలో దాదాపు 25,000 టన్నుల వాడని బంగారం ఉందని అంచనా. అందులో కొంత భాగాన్నైనా నమ్మకమైన మానిటైజేషన్ వ్యవస్థ ద్వారా వినియోగంలోకి తీసుకొస్తే దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది” అని నిపుణులు తెలిపారు. -
వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్
-
మోదీ వ్యాఖ్యలపై గోల్డ్ షాప్ ఓనర్స్ రియాక్షన్
-
మీ ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్?
న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు కేంద్రం శుభవార్త. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కేంద్రం కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు. భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా. గోల్డ్ పాలసీలో కీలక మార్పులకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. -
బంగారం బ్లాస్ట్.. ఒక్కరోజే 13 వేలకు పైగా..
-
ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్‌గా మార్చింది..
మెట్‌గాలా 2026లో ఎందరో ట్రెండ్ సెట్టింగ్, రికార్డ్ మేకింగ్ లుక్స్‌ని అందించారు. చాలామంది వివిధ రకాల ఫ్యాషన్ వేర్లతో సందడి చేశారు. ఎందరో సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించిన యాక్సెసరీలు, కళాత్మక డిజైనర్ వేర్లు చర్చనీయాంశంగా మారాయి. వారిలో ఒక మహిళ మాత్రం అందర్నీ ఆకర్షించేలా సన్సేషన్‌గా మారింది. ఈ అమ్మాయి లుక్‌ని చూడగానే టాలీవుడ్ మూవీ మురారీలోని "బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో" అనే పాట ఠక్కున గుర్తుస్తోంది. అయితే ఆమె కథ తెలిస్తే మాత్ర కన్నీళ్లు జలజల వచ్చేస్తాయ్. ఆ బాధను దిగమింగి అజేయంగా నిలబడి ఎదగాలన్న ఆమె తపన చూస్తే స్థైర్యం అంటే ఇది కదా అనిపిస్తుంది. చిన్నచిన్న సమస్యలకే సతమతమై ప్రాణాలకు తీసుకునే యవతకు ఆమె కథ ఓ స్ఫూర్తి.ఆ ధీర మహిళే అమెరికన్ మోడల్ లారెన్ వాసర్. ఆమె మే4న న్యూయార్క్ నగరంలోని మెట్ గాలా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో బంగారు రంగు ప్రబల్ గురుంగ్ సూట్ ధరించి వచ్చింది. ఇందులో పెద్ద సన్సేషన్ ఏముంది అనుకోకండి. ఆమె ఈ వేడుకలో నిజమైన బంగారు కృత్రిమ కాళ్లతో వచ్చింది. అందరు ఈ వేడుకలో ఆర్టిఫిషయల్ యాక్సెసరీలతో రెడ్‌కార్పెట్‌పైకి రాగా ఆమె మాత్రం నిజమైన "బంగారు కాళ్ల"తో వచ్చి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. అంతేగాదు దీని కారణంగానే లారెన్‌కు "బంగారు కాళ్ల అమ్మాయి" ముద్దు పేరు కూడా వచ్చింది.లారెన్ వాసర్ ఎవరు?లారెన్ వాసర్ అమెరికాలో ప్రసిద్ధిగాంచిన మోడల్. 38 ఏళ్ల లారెన్ వోగ్, గ్లామర్ అండ్ హార్పర్ బజార్ వంటి ఫ్యాషన్ పత్రికల ముఖచిత్రంగా ఫోజులిచ్చింది కూడా. అంతేగాదు 2017లో ఫోర్బ్స్ అండర్ 30 పురస్కార గ్రహీతగా కూడా ఎంపికైంది అలాగే 2023లో గ్లామర్ జర్మనీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా నిలిచారామె. 2023లో 'ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..లారెన్ తన కథను పంచుకోవడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. సడెన్‌గా ఒక రోజు నిద్రలోనే కోమాలోకి వెళ్లి మృత్యువు అంచులదాక వెళ్లింది. సకాలంలో ఆమె కుటుంబ సభ్యులు చూడకపోతే లారెన్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయుండేవి. ఏం జరిగిందో తెలియదు. లారెన్ గదిలోకి వచ్చేప్పటికీ అపస్మారక స్థితలో బెడ్‌పై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా...అక్కడ ఆమె బతికే అవకాశాలు చాల తక్కువని తేల్చేశారు వైద్యులు. పాదాలు నల్లగా మారిపోవడం వంటి ఆకస్మిక మార్పులన్నీ లారెన్స్ శరీరంలో చూస్తుండగానే చోటుచేసుకోవడం మొదలైంది. ఆమె పాదాలు నల్లగా అయిపోవడం ప్రారంభించింది. కానీ ఆమె తల్లిదండ్రుల తమ కూతర్ని ఏదోలా బతికించమని వైద్యులని వేడుకోవడంతో డాక్టర్లు తమ సాయశక్తులా కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రాణం కాపాడేందుకే మొదట నీలం రంగులోకి మారిపోతున్న కుడికాలుని తొలగించారు. ఆమెకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్(టీఎస్ఎస్)గా పిలిచే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు వైద్యులు. ఇది ఒక నిర్ధిష్టమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థాల వల్ల కలిగే అరుదైన ప్రాణాంతక వ్యాధి. ఆ తర్వాత ఆమె శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి కొన్ని రకాల ద్రవాలను పంపించారు వైద్యులు. దాంతో జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎడమ కాలుని కూడా తొలగించారు వైద్యులు. దాంతో సుదీర్ఘంగా ఎనిమిది నెలల పాలు వీల్‌చైర్‌కి పరిమితమైపోయిందది. జీవితం ముగిసిపోయింది ఇంకేమి లేదనుకున్న నైరాశ్యంలో ఉన్న లారెన్‌కు 14 ఏళ్ల తమ్ముడిని చూడగానే కొత్త ఆశ రేకెత్తింది. కనీసం వాడి బాగోగులు చూసుకోవడం కోసమైన బతకాలని నిర్ణయించుకుని తన సమస్యను అంగీకరించడం మొదలుపెట్టింది. అలా మోడల్లో నెమ్మది నెమ్మదిగా రాణిస్తూ..దివ్యాంగుల్లో స్ఫూర్తిని రగులుస్తోందామె. ఇంతకీ లారెన్‌కి సోకిన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే..టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే?టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (టీఎస్ఎస్) అంటే టాంపోన్ వాడకంతో సంబంధం కలిగి వ్యాధి. ఇక్కడ టాంపోన్ అంటే టాంపోన్ (Tampon) అనేది ఋతుస్రావం సమయంలో (Periods) వెలువడే రక్తాన్ని పీల్చుకోవడానికి యోనిలోకి చొప్పించే ఒక చిన్న, పత్తి లేదా ఇతర శోషక పదార్థాలతో చేసిన స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తి. ఇది ప్యాడ్లకు భిన్నంగా, ఇది శరీరం లోపల ఉంటుంది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది గంటలకు మించి ఉంచకూడదు. లేదంటే దీనిలో ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్ బాక్టీరియా రక్తప్రవాహంలో విషపదార్థాలను విడుదల చేసి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికారణంగా తీవ్రమైన అవయవ నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.🇬🇧🩸🦿 Beaucoup l’ont vue au Met Gala sans savoir qu’elle a PERDU ses 2 jambes à cause d’un TAMPON HYGIÉNIQUE.Lauren Wasser était une mannequin de 24 ans en pleine ascension lorsqu’un simple tampon a failli lui coûter la vie. En octobre 2012, elle s’est couchée fiévreuse et a… pic.twitter.com/bJcysI84Ah— Cultination (@Cultination1) May 11, 2026 ఈ సిండ్రోమ్ లక్షణాలు:తక్కువ రక్తపోటుతల తిరగడం, మగతగా ఉండటం లేదా స్పృహ కోల్పోవడంనీళ్ల విరేచనాలుఅకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలువికారం లేదా వాంతులుపాదాల అరికాళ్ళు లేదా చేతుల అరచేతులపై చర్మం పొట్టులా ఊడిపోవడంకళ్ళు, గొంతు ఎర్రబడటంతీవ్రమైన ఎండదెబ్బలాంటి దద్దుర్లు లేదా చర్మంపై ఎర్రటి చుక్కలుఆ ఘటనతో రాబిన్ డేనియల్సన్ చట్టంఆ వ్యాధి తన జీవితాన్ని మార్చేయడంతో లారెన్ రాబిన్ డేనియల్సన్ అనే ఋతుస్రావ సంరక్షణ ఉత్పత్తుల భద్రతా చట్టాన్ని తీసుకొచ్చేలా పాటుపడింది. పైగా దానికి మద్దతుదారిగా మారింది. ఇది ఋతుస్రావ ఉత్పత్తులలో తరచుగా కనిపించే రసాయనాలు, సింథటిక్ ఫైబర్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై పరిశోధన చేయమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)ను ఆదేశించే లక్ష్యంతో ప్రతిపాదించబడిన ఒక US బిల్లు.(చదవండి: అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?) -
కేంద్రం బిగ్ షాక్.. సుంకాలు డబుల్.. భారీగా పెరగనున్న ధరలు
-
మోదీ బంగారం కొనొద్దు అనటానికి ముఖ్య కారణాలు ఇవే..!
-
కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. ఆంక్షలు రాబోతున్నాయా?
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఎగదోసిన చమురుసంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారతీయులు సైతం తమ వంతు బాధ్యతగా పొదుపు మంత్రం పఠించాలని గత రెండ్రోజుల్లో ఇటు తెలంగాణలో, అటు గుజరాత్లో ప్రధాని మోదీ హితబోధ చేశారు. మోదీ ‘పొదుపు’ ప్రసంగాల వేళ బుధవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీకానున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చనే వార్తలు ఇప్పుడు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెట్రో ధరల పెంపుతో పాటు మరికొన్ని పొదుపు చర్యలపై ప్రధాని బుధవారం ప్రకటన చేసే అవకాశముంది. రెండ్రోజులుగా ప్రధాని పొదుపు మంత్రం ఉపదేశిస్తుండటంతో విపక్షాల నుంచి వెల్లువెత్తిన విమర్శలపై ప్రభుత్వం తరఫున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) మంగళవారం దీటుగా స్పందించింది. చమురు సంక్షోభం దెబ్బకు డజన్ల కొద్దీ దేశాలు అనుసరిస్తున్న పొదుపు చర్యలనే ప్రధాని సూచించారని సోదాహరణంగా వివరించింది. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) ఇటీవల ఇచ్చిన నివేదికలను బహిర్గతంచేసింది. దీనిప్రకారం 40 దేశాలు ఇంధన వినియోగం, ప్రజల వాహనాల అతి వాడకం, ఇతర రాకపోకలపై ఆంక్షలు విధించాయి. మూడు దేశాలు తమ ప్రజలకు ఎల్పీజీ వాడకం తగ్గించుకోవాలని, సిలిండర్‌ను సగం వరకే నింపుకోవాలని సూచించాయి. ఎలక్ట్రిక్ లేదా పీఎన్జీకి మారాలని హితబోధ చేశాయి. 18 దేశాలు ప్రజల రవాణాపై పరిమిత ఆంక్షలు విధించాయి. ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రం హోం)చేయాలని 13 దేశాలు సూచించాయి. ఇల్లు, ఆఫీసుల్లో తక్కువ లైట్లు ఆన్‌చేయాలని, ఏసీలను 25 డిగ్రీసెల్సియస్ కంటే తక్కువ పాయింట్లకు పెట్టుకోవద్దని పలు దేశాలు ప్రజలకు సూచించాయి. స్కూళ్లు, కాలేజీలు మూసేసి విద్యార్థులకు కేవలం ఆన్లైన్లోనే పాఠాలు బోధించాలని, తద్వారా విద్యార్థులు, సిబ్బంది, టీచర్ల ప్రయాణాలకు ఇంధనం ఆదా అవుతుందని పలు దేశాలు సూచించాయి.పలు దేశాల్లో పొదుపు చర్యలు ఇలా..ఇంధన వినియోగంపై సూచనలుపెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది కార్యాలయాలకు రాకుండా ఆపాలని పలు దేశాలు నిర్ణయించాయి. అందుకోసం పాకిస్తాన్ వారంలో నాలుగు రోజులు వర్క్ ఫ్రమ్ హోంను ప్రవేశపెట్టింది. మొత్తం సిబ్బందిలో సగం మంది ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. ఇండోనేసియాలో శుక్రవారాలు ఇంటి నుంచే పనిచేయాలి. కాంబోడియా, లావో, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, పెరూ, ఈజిప్ట్ సైతం ఇలాంటి చర్యలే చేపట్టాయి.ఏసీ కూలింగ్పై పరిమితులుప్రైవేట్ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఏసీలను 25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ పాయింట్ పెట్టొద్దని బంగ్లాదేశ్ కరాకండీగా చెప్పేసింది. సింగపూర్(25), కాంబోడియా (24–25), మలేసియా(25), శ్రీలంక(26), థాయిలాండ్(26) అదే బాటలో పయనించాయి. జోర్డాన్ ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వాడకంపై నిషేధం విధించింది.విద్యాసంస్థల నిర్వహణపై..బంగ్లాదేశ్‌లో అన్ని విశ్వవిద్యాలయాలనూ మూసేశారు. శ్రీలంకలో బుధవారం సెలవులు అమలుచేస్తున్నారు. పాకిస్తాన్లో స్కూళ్లు, కాలేజీల్లో 100 శాతం ఆన్లైన్ విధానం అమలుచేస్తున్నారు.విద్యుత్ వాడకం తగ్గింపు..5స్టార్ రేటింగ్ వంటి అత్యంత తక్కువ విద్యుత్‌తో పనిచేసే ఉపకరణాలనే వాడాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. వంట, స్నానం కోసం గ్యాస్‌తో నడిచే బాయిలర్లకు బదులు సోలార్‌తో పనిచేసే వ్యవస్థలను వాడాలని నెదర్లాండ్స్ ప్రజలకు సూచించింది. థాయిలాండ్‌లో తక్కువ అంతస్తులున్న ఆఫీసుల్లో లిఫ్ట్‌లను ఆపేసి మెట్లు ఎక్కాలని సూచిస్తున్నారు. వీధి దీపాల విద్యుత్ కోతలను పెంచారు. ఎల్పీజీ ఆధారిత గీజర్లకు బదులు సోలార్ గీజర్లు వాడాలని బ్రిటన్ సూచించింది. రవాణాపై ఆంక్షలు..దక్షిణకొరియాలో వాహనాలను సరి, బేసి సంఖ్య ఆధారంగా వేర్వేరు రోజుల్లో అనుమతిస్తున్నారు. శ్రీలంకలో ఆరోజుకు క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన వాహనమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. రోజు విడిచి రోజు వాహనం రోడ్డు మీదకు తేవాలని మయన్మార్ సూచించింది. బయోడీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలనే రోడ్లపైకి అనుమతిస్తామని ఇండోనేసియా తెలిపింది. సోలార్ వ్యవస్థల వినియోగం..సోలార్ వ్యవస్థలను ఇళ్లు, కార్యాలయాలపై బిగించుకోవాలని, ఎల్ఈడీ లైట్లను వాడాలని బ్రిటన్, నెదర్లాండ్స్ సూచించాయి. సోలార్ ఎనర్జీ బిగించుకుంటే ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తామని స్పెయిన్ ప్రకటించింది. పొదుపు చర్యలు..ఎల్పీజీ సిలిండర్లను సగమే నింపి ఇస్తామని నేపాల్, మాల్దీవుల ప్రభుత్వాలు స్పష్టంచేశాయి. పాకిస్తాన్ రాత్రి 8 గంటల తర్వాత మార్కెట్ సముదాయాలకు కరెంట్‌ను కట్ చేస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత ఆహారం, తినుబండారాల దుకాణాలకు విద్యుత్ సరఫరాను నిలిపేస్తోంది. భారీ ప్రకటనలు ఉండే హోర్డింగ్, బిల్‌బోర్డ్‌లకు రాత్రిళ్లు ఈజిప్ట్, శ్రీలంక కరెంట్‌ను నిలిపేస్తున్నాయి. -
బంగారం, వెండిపై కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, వెండి విషయంలో కేంద్రం షాకిచ్చింది. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ (మే 13) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల బంగారం, వెండి, ఫ్లాటినం.. ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగనున్నాయి. భారత్ ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 6 శాతంగా ఉంది. అయితే తాజా నిర్ణయంతో దాన్ని 16 శాతానికి పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం బంగారం ధర రూ. 1,53,990 ఉంది. కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాప్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటి వాటిపైనా సుంకాలు పెరిగాయి. బంగారం, వెండి ఫైండింగ్స్‌పై 5% కస్టమ్స్ సుంకం, ప్లాటినం ఫైండింగ్స్‌పై 5.4% సుంకం విధించారు. అదే సమయంలో, రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగించిన ఉత్ప్రేరకాలు, బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. అయితే ఇందుకు నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాలి.2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24% పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9 శాతంగా ఉంది. ఇక బంగారం సరఫరాలో స్విట్జర్లాండ్ 40% వాటాతో మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ 16%, దక్షిణాఫ్రికా దాదాపు 10% వాటాతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
మోదీ వార్నింగ్‌తో వణికిన మార్కెట్లు
(సాక్షి, బిజినెస్): ‘ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. ఎలక్ట్రిక్ వాహనాలను, ప్రజా రవాణాను మరింతగా ఉపయోగించుకోండి. వంట నూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ వస్తువులు వద్దు... స్వదేశీయే ముద్దు’ అంటూ ప్రధాని మోదీ తాజాగా ఎత్తుకున్న పొదుపు రాగంతో మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగబాకటం.. రూపాయి విలువ పాతాళానికి జారిపోతుండటం.. ద్రవ్యోల్బణం సెగలు రేగటంతో ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లలో ‘బేర్’ బాజా మోగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మోదీ పొదుపు సూచనలతో ప్రజల వినిమయం పడిపోయి జీడీపీ వృద్ధికి చిల్లు పడొచ్చని ఆర్థిక నిపుణుల వార్నింగ్‌లు మొదలయ్యాయి. ఇవన్నీ కలిసి మార్కెట్లను వణికిస్తుండటంతో గత రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి కావడం ఇన్వెస్టర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడిచమురు, బంగారం, ఎరువులతో సహా అనేక కమోడిటీల ధరలు ఇప్పటికే భారీగా ఎగిశాయి. ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ముడి చమురు రేటు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతోంది. డాలర్లను అధికంగా వెచ్చించాల్సి రావడంతో మన చేతి ‘చమురు’ వదులుతోంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో రూపాయి ఇంకా పడిపోతోంది. మన దిగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా క్రూడ్, పసిడి, ఎరువులు, వంటనూనెలదే కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే మోదీ వీటి కొనుగోళ్లు, వాడకాన్ని తగ్గించేందుకు పొదుపు మంత్రాన్ని జపించారు. ఎకానమీలో నెలకొన్న బలహీనతలకు ఇది అద్దం పడుతోందన్నది నిపుణుల మాట. మార్కెట్లకు షాక్...: మోదీ సూచనలను జరగబోయే పరిణామాలకు వార్నింగ్‌గా భావించిన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. సోమవారం రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరికాగా, మంగళవారం మరో రూ.10 లక్షల కోట్లు ఎగిరిపోయాయి. మోదీ సూచనల ప్రభావానికి తోడు ఇరాన్‌తో సీజ్ఫైర్ గాల్లో దీపమంటూ.. ట్రంప్ చేసిన ప్రకటనతో మడిచమురు ధరలు భగ్గుమనడం ఈ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం. గోల్డ్ రిటైల్ సంస్థలు, ట్రావెల్, వినియోగ వస్తువుల షేర్లు వరుసగా రెండో రోజూ పడిపోవడం గమనార్హం. పసిడి కొనుగోళ్లపై గందరగోళం... బంగారాన్ని ఏడాది పాటు కొనొద్దంటూ స్వయంగా మోదీయే చెప్పడంతో జనానికి ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో తులం రూ.1.85 లక్షల ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకిన పుత్తడి. ఇప్పుడు రూ.1.5 లక్షల స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగానూ ఔన్స్ 5,600 డాలర్లను తాకి ప్రస్తుతం 4,600 డాలర్ల వద్ద ఉంది. అయితే, రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడంతో దేశీయంగా పసిడి రేట్లు పెద్దగా దిగిరాలేదు. భారతదేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు 9 శాతం. మనం వినియోగించే బంగారంలో దిగుమతుల వాటా ఏకంగా 90 శాతం. అంటే ఏటా 700–800 టన్నులు. దీనికి భారీగా డాలర్లు వెచ్చించాల్సి రావటంతో మన ఫారెక్స్ నిల్వలకు గండి పడుతోంది. గడిచిన రెండు నెల్లల్లో దాదాపు 38 బిలియన్ డాలర్లు తగ్గి మన నిల్వలు 690.69 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది రూపాయి పతనాన్ని పెంచుతోంది. దీనికి అడ్డకట్టవేయడానికే మోదీ పొదుపు మంత్రం ఎత్తుకున్నారు. కాకపోతే రేటు మరింత పెరిగితే కొనలేమేమోనన్న ఆందోళనలో ఉన్న సామాన్యుల్లో ప్రధాని ప్రకటన గందరగోళాన్ని పెంచింది. యుద్ధం మళ్లీ తీవ్రమైతే బంగారం దూసుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొనుగోళ్లకు బ్రేక్ వేసేందుకు అవసరమైతే దిగుమతి సుంకాన్ని (ప్రస్తుతం 6 శాతం) కూడా ప్రభుత్వం పెంచవచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా చేస్తే బంగారం రేట్లు దేశీయంగా మరింత భగ్గుమంటాయి. మరోపక్క, పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరిస్తే ఆభరణాల పరిశ్రమపై ప్రభావం పడి, లక్షల మంది ఉపాధి కోల్పోవచ్చన్న ఆందోళనలూ ఉన్నాయి. క్రూడ్ పైపైకి.. త్వరలో పెట్రో వాత! కాల్పుల విరమణ తర్వాత కాస్త శాంతించిన క్రూడ్ రేట్లు మళ్లీ యుద్ధ భయాలతో భగ్గుమన్నాయి. మంగళవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 109 డాలర్లను తాకింది. చమురు సెగతో ఎఫ్ఎంసీజీతో సహా ఇప్పటికే దేశీయంగా పలు ఉత్పత్తుల ధరలు ఎగబాకుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ నష్టాల నేపథ్యంలో నేడోరోపో పెట్రో వాత ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ రెండు రోజుల క్రితం జపించిన పొదుపు మంత్రం నేపథ్యంలో బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఏం నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. పెట్రో రేట్లను పెంచితే ద్రవ్యోల్బణం మరింత ఎగబాకి, వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందని.. ఎకానమీ మరింత మందగమనంలోకి జారిపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మోదీ పొదుపు సూచనలు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తాయని.. క్రూడ్ రేట్లు 100 డాలర్ల పైన ఎక్కువ కాలం ఉంటే జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌తో సహా పలు రేటింగ్ ఏజెన్సీలు ఈ ఏడాది వృద్ధి రేటుకు కోత వేయటం తెలిసిందే. 6– 6.5 శాతానికే వృద్ధి పరిమితమవుతుందన్న అంచనాల నేపథ్యంలో మోదీ పొదుపు పిలుపు ప్రభావంతో 6 శాతం కిందికి పడిపోవచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. రూపాయి విలవిల.. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ రూపాయి జారుడుబల్లపైనే ఉంది. చమురు రేట్ల దెబ్బతో దిగుమతుల బిల్లు పెరగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క, విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా దేశీ కరెన్సీని వణికిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా రూ.2 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు విక్రయించడం గమనార్హం. 2025 చివర్లో డాలర్‌తో 90 స్థాయిలో ఉన్న రూపాయి... ఇపుడు 95కి చేరింది. ఏడాది కాలంలో దాదాపు 10 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఆసియాలో దారుణంగా పడిపోయిన కరెన్సీ మనదే. కాగా, మంగళవారం మరో 40 పైసలు పడ్డ రూపాయి.. సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టమైన 95.68కి జారిపోయింది. రూపాయి ఇలా పతనమవటం దిగుమతుల బిల్లు మరింత పెరిగేలా చేస్తోంది. ఎందుకంటే దిగుమతుల కోసం డాలర్ల రూపంలో చెల్లించడానికి మనం మరిన్ని రూపాయలు ఖర్చు చేయాలి కదా!!. ఎరువులు, వంట నూనెల మంట! యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో రవాణా ఆగిపోవటంతో దేశంలో ఎరువుల రేట్లకు రెక్కలొస్తున్నాయి. మన యూరియా దిగుమతుల్లో 75 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి. ఇక డీఏపీ దిగుమతుల్లో సౌదీ వాటా 40 శాతం. 2025–26లో భారత్ ఏకంగా 14.5 బిలియన్ డాలర్ల విలువైన ఎరువులను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు సరఫరాపరమైన ఇక్కట్లు.. రూపాయి తీవ్ర పతనంతో ఈ దిగుమతులు మరింత భారమై, దేశీయంగా రేట్లు ఎగబాకుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌కు సమాయత్తమవుతున్న రైతులు రేట్ల పెరుగుదలకు తోడు తగినంత సరఫరా ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, వంటింట్లో వంటనూనెల మంట మండుతోంది. భారత్ వంటనూనెల అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2025–26లో 19.5 బిలియన్ డాలర్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంది. రూపాయి వాతతో దేశీయంగా రేట్లు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఎరువులు, వంట నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ మోదీ పిలుపునివ్వడం గమనార్హం. -
బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో.. దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో 1967లో కూడా ఇందిరా గాంధీ ఇలాంటి ప్రకటన చేశారని, సూచించే ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో ఇటీవల.. ఒక పాత న్యూస్ ఫ్రంట్ పేజీ అంటూ ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో 1967 జూన్ 6 తేదీకి చెందిన 'ది హిందూ' పత్రికలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ''బంగారం కొనొద్దు, జాతీయ క్రమశిక్షణ పాటించండి'' అని పిలుపునిచ్చినట్లు చూపించారు. కానీ ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే, డిజిటల్‌గా మార్పు చేసిన ఫోటో అని స్పష్టమైంది.నిజం ఏమిటంటే?సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ ఫోటోపై ది హిందూ స్వయంగా స్పందించింది. ''జూన్ 6, 1967 నాటి ‘ది హిందూ’ పత్రిక ముఖపత్రం అని చెప్పుకుంటున్న, డిజిటల్‌గా మార్పులు చేసిన ఒక చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇది మా ఆర్కైవ్స్‌లోని అసలైన పేజీ కాదని మేము స్పష్టం చేస్తున్నాము. పాఠకులు జాగ్రత్త వహించాలని, షేర్ చేసే ముందు సరిచూసుకోవాలని ‘ది హిందూ’ కోరుతోంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.📢 A digitally altered image purporting to be a front page of The Hindu from June 6, 1967, is currently circulating on social media. We wish to clarify that this is not an authentic page from our archives. The Hindu urges readers to exercise caution and verify before sharing.— The Hindu (@the_hindu) May 12, 2026అసలు 1967 జూన్ 6 నాటి పత్రికలో ఉన్న ప్రధాన వార్త ఏమిటంటే.. ''అప్పట్లో మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు''. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ అని ది హిందూ క్లారిటీ ఇచ్చింది.ఇందిరా గాంధీ బంగారంపై నియంత్రణలు పెట్టారా?వైరల్ అవుతున్న ఫోటో నకిలీదే అయినప్పటికీ.. అప్పటి ప్రభుత్వం బంగారంపై నియంత్రణలు పెట్టిందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే 1960లలో భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం, బంగారం స్మగ్లింగ్ సమస్యలు ఉండేవి. ఆ పరిస్థితుల్లో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ''గోల్డ్ కంట్రోల్ యాక్ట్'' ప్రవేశపెట్టినట్లు సమాచారం.ఈ చట్టం.. ప్రజలు బంగారు బార్లు, నాణేలు కలిగి ఉండటాన్ని పరిమితం చేసింది. బంగారం కొనుగోలు, నిల్వపై కఠిన నియంత్రణలు అమలు చేసింది. స్మగ్లింగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంది. అయితే 1990లో ఈ యాక్ట్ రద్దు అయింది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది! -
బంగారం కొనాలా.. వద్దా.! అయోమయంలో మా వెన్నెల
-
బంగారం కొనకండి ఎందుకంటే..
-
ఎదుటివారికి చెప్పేటందుకేనా ప్రధాని నీతులు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి అంతా ఊహిస్తున్న సందేశం ఇచ్చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత మోదీ కొన్ని చర్యలు చేపడతారని ,అవి ప్రజలపై భారం మోపేవిగా ఉండక తప్పదని భావించారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పలు అంశాలు ప్రస్తావించి అసలు సమస్య కూడా చెప్పేశారు. ఆయన చెప్పినవి సూచనలుగా తీసుకుంటారా? లేక జరగబోయే పరిణామాలుగా తీసుకుంటారా అన్నది ప్రజల ఇష్టం.ఒక ఏడాదిపాటు బంగారం కొనవద్దని చెప్పడం నిజంగా సంచలనమైన సంగతే. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పడం అసాధారణమేమీ కాకపోయినా, భవిష్యత్తులో వీటి ధరలు పెంచుతారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, యూరియా వాడకం నియంత్రించాలని ఇలా తొమ్మిది పాయింట్లపై ప్రజలకు సలహాలు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.వీటన్నిటిని దేశ భక్తితో ముడిపెట్టడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజలకు వివరించడం తప్పు కాదు. కాని ఆయన కూడా సాధారణ రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారన్నదే బాధ. ఇంతకాలంగా ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న నేతగా ఆయన రాజనీతిజ్ఞుడుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. కాని ఆలా చేయలేకపోతున్నారే అన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడుతోంది.దాదాపు మూడు నెలలుగా గల్ఫ్ లో యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు, ఇరాన్ కు మద్య సాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచం అంతటా పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఇతరత్రా అంతర్జాయతీయ పరిణామాలు అందరిని కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను అమాంతం పెంచాల్సి వచ్చింది. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని ఊహించారు.కాని శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు ఆ ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. కేంద్రం తరపున అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చారు. కానీ.. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన వారం రోజులకే అసలు రంగు బయటపడింది. ప్రధాన మంత్రే ఆర్థిక సంక్షోభం గురించి స్వయంగా వివరించారు. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చన్నది ఎక్కువ మంది అంచనాగా ఉంది.ఇక ఈ పొదుపు సూత్రాలు చెప్పడానికి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక సరైనదేనా అన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. పెట్రోల్ ,డీజిల్ వాడకం తగ్గించుకోండని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని చెప్పారు. సొంత వాహనాలను వదలి మెట్రో,బస్ లను వాడాలని చెప్పారు. ఆక్షేపణ లేదు. ఈ సమస్య గురించి ఆయనకు ముందుగానే తెలుసు కదా! అలాంటప్పుడు ఇంత భారీ సభను నిర్వహించడం ఎంతవరకు సరి? లక్షల మందిని సమీకరించి, వారందరిని వాహనాలలో తీసుకురావడానికి ఎంత పెట్రోల్, డీజిల్ అవసరం అవుతాయో ఆయనకు తెలియదా?ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి, తామేమో ఇలా జనాన్ని పోగు చేయడానికి చమురును వాడవచ్చా! రెండున్నరేళ్ల తర్వాత జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకోసమో, లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసమో ఈ సభ పెట్టినట్లు లేదా? అలాగే తెలంగాణలో ఆయన పలు శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి రిమోట్ ద్వారానే జరిపారు. ఆ పని ఢిల్లీ నుంచి కూడా చేసి ఉండవచ్చు కదా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. దేశంలోని ఆయా నగరాలలో ప్రజా రవాణా అంత మెరుగ్గా లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా!ముందుగా దానిని మెరుగు చేయకుండా బస్సుల్లో వెళ్లండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది. మోదీ చెప్పిన సూత్రాలలో బంగారం కొనుగోలు చేయవద్దని చాలా ముఖ్యమైన ప్రకటనగా కనిపిస్తుంది. ఇది మహిళల సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రత్యేకించి హిందూమతం అంటూ నిత్యం జపం చేసే బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా బంగారం షాపులపై ఉంటుంది. నిజంగానే ప్రజలు బంగారం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మానివేస్తే దాని విపరిణామాలు కూడా గణనీయంగానే ఉంటాయి. కొన్నివేల గోల్డ్ షాపులు దెబ్బతింటాయి.వేలాది మంది ఉద్యోగాలకు గండం ఏర్పడుతుంది. ఇన్నేళ్లుగా ఆత్మనిర్భర్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న విధానాలు పెద్దగా ఫలించడం లేదని ఆయన చెప్పినట్లుగా ఉంది. గోల్డ్ బాండ్ల పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ కూడా ఫలితం ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని అన్నారు. బాగానే ఉంది. కాని తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో ఎన్నివేల కోట్ల అప్పు చేస్తున్నది మోదీకి తెలియదా? అక్కడ నిర్మాణాల కోసం ఈ మధ్య కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ ను మళ్లించే యత్నం చేయడంపై కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టి, పొదుపుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పి ఉంటే బాగుండేది కదా!హైదరాబాద్‌లో స్వయంగా చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు కదా! ఆ సందర్భంగా ఏపీలో జరుగుతున్న దుబారా గురించి కూడా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదేమో! చదరపు అడుగుకు రూ.18 వేల వరకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వంగా ఏపీ రికార్డు సాధిస్తోంది.ఈ నిర్మాణాలలో ఎన్ని రకాల సరుకులను విదేశాల నుంచి తెప్పిస్తోందో తెలియదు. ఒక్క అద్దాలకే రూ.2540 కోట్లు వెచ్చించబోతున్నారే. అవన్ని ఇండియాలో తయారయ్యేవా? లేక దిగుమతి చేసుకోవల్సి ఉంటుందా? వంట నూనెలు తగ్గించుకోవాలని కూడా మోడీ సలహా ఇచ్చారు.ఇన్నేళ్ల పాలనలో వంట నూనెల విషయంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోవడం అవమానమే. రైతులు యూరియా వాడకం తగ్గించాలని అన్నారు. ఉక్రెయిన్,రష్యా యుద్దం మూడేళ్లుగా జరుగుతోంది. త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. ఈ దశలో యూరియా గురించి మోడీ జాగ్రత్తలు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు తప్పనిసరిగా మార్చుతారు. అది చేయకుండా యూరియా వాడవద్దంటే, పంటలు సరిగా పండకపోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. ఇదేదో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి ఉండాల్సింది. ఈ మధ్య కాలంలో చిత్రమైన శిక్షణల పేరుతో మంత్రులు, అధికారులను బృందాలుగా సింగపూర్ పంపుతున్నారు. దీనివల్ల ఏపీకి కలిసి వచ్చేది ఏమి ఉందో ఎవరికి తెలియడం లేదు.ప్రభుత్వ ఖజానా పై కోట్ల భారం పడుతోంది.వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగుల గురించి కూడా ప్రధాని సూచన చేశారు. ఇప్పటికే అలాంటివి జరుగుతున్నాయి. కాని వాటివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలు రోజుల్లో ప్రధాని ప్రజలకు ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటే తప్పక చిత్తశుద్ది అర్ధం అవుతుంది.కాని ఎన్నికల సమయంలో ఒక రకంగా ,ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడమే విమర్శలకు దారి తీస్తుంది.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు డాలర్‌తో రూపాయి విలువను పోల్చి విమర్శలు చేసిన మోడీ, అప్పటికన్నా విలువ దాదాపు రెండు రెట్లు తగ్గినా ఇంతవరకు మాట్లాడలేదు.ప్రధాని చెప్పిన నవ సూత్రాలపై లోక్ సభ లో విపక్ష నేత రాహోల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం అని, ప్రధాని అయిన 12 ఏళ్లకు ఈ స్థితికి దేశాన్ని దిగజార్చారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ యుద్దం, కరువు పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు వారానికి ఒక పూట ఉపవాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. దానిని ఆయన తొలుత తన కుటుంబం నుంచే ఆచరించి చూపారు.తద్వారా దేశభక్తి అంటే ఏమిటో తెలియచేశారు. అలాగే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు దేశభక్తిని నిజమైన రీతిలో ఆచరించి,అప్పుడు ప్రజలకు చెబితే ఆదర్శవంతంగా ఉంటుంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సెగ పుట్టిస్తున్న పసిడి.. వెండి మళ్లీ రికార్డు దిశగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పెట్రోల్.. డీజిల్.. బంగారంపై మోదీ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఇదే..
-
బంగారం కొనొద్దు..ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇదే..
-
వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యం!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశ ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు భారతీయులందరూ ఆర్థిక దేశభక్తిని చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన రాబోయే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పౌరులను కోరారు. విదేశీ మారక ద్రవ్యాన్ని (ఫారెక్స్) ఆదా చేయడం ద్వారా రూపాయి విలువను స్థిరీకరించి దేశ ఆర్థిక పునాదులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విజ్ఞప్తి చేశారు.సంక్షోభ సమయం.. అప్రమత్తత అవసరంపశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతరాయం కలుగుతున్న సరఫరా గొలుసు వ్యవస్థలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘సరఫరా గొలుసుపై ఒత్తిడి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడం మనందరి బాధ్యత’ అని ప్రధాని పేర్కొన్నారు.ముఖ్యంగా భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధ మేఘాల వల్ల ఎరువులు, చమురు ధరలు పెరగడం వల్ల డాలర్ అవుట్‌ఫ్లో పెరిగి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో బంగారం వంటి ‘అంతగా అవసరం లేని’ (డిస్క్రీషనరీ) దిగుమతులను తగ్గించడం వల్ల వాణిజ్య లోటును అదుపులో ఉంచవచ్చని ఆయన ఆకాంక్షించారు.బలమైన స్థితిలో ఫారెక్స్ నిల్వలుప్రధాని ఈమేరకు విజ్ఞప్తి చేసినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాల ప్రకారం, భారత్ ప్రస్తుతం అత్యంత పటిష్టమైన స్థితిలో ఉంది. మార్చి 2026 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 691.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నిల్వలు దాదాపు 11 నెలల పాటు దేశ దిగుమతి అవసరాలను తీర్చగలవు. భారత్ వద్ద ప్రస్తుతం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇందులో 680.05 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్బీఐ ఇప్పటికే విదేశాల నుంచి స్వదేశానికి రప్పించి భద్రపరిచింది. ఆర్బీఐ వైవిధ్య వ్యూహం వల్ల విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా సెప్టెంబర్ 2025లో 13.92% ఉండగా, అది మార్చి 2026 నాటికి 16.7 శాతానికి పెరిగింది.ప్రధాని సూచించిన మార్గదర్శకాలువిదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి కేవలం బంగారం వాయిదా వేయడమే కాకుండా జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాలని ప్రధాని సూచించారు.పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు మెట్రో రైలు, కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి.సాధ్యమైన చోట ఇంటి నుంచే పని విధానాన్ని అనుసరించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చు.విదేశీ వస్తువుల కంటే స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి.వ్యక్తిగత వాహనాల కంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థలను, రైల్వే సరుకు రవాణా సేవలను వినియోగించుకోవాలి.రసాయన ఎరువుల దిగుమతి భారాన్ని తగ్గించేందుకు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి.‘మనం చేసే ప్రతి చిన్న పొదుపు, దేశాన్ని ప్రపంచ ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతుంది’ అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రయోజనాలే పరమావధిగా పౌరులు స్పందించాలని ఆయన కోరారు.ఇదీ చదవండి: నిప్పులపై నీళ్లు చల్లినట్లు.. బంగారం ధరలు -
మోదీ చెప్పినవి.. మనతో అయ్యే పనేనా??
ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి.. వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యం ఇవ్వండి.. కూరల్లో వంటనూనెకు తగ్గించి వాడండి.. విదేశీ ప్రయాణాలు చేయొద్దని.. ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలోనే ఆయన చేసిన సూచనలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఇవి అసలు ఆచరణ సాధ్యమేనా? అనేదానిపై ఆర్థిక నిపుణులు స్పందించారు. హైదరాబాద్ సభలో మోదీ ఏం మాట్లాడారు?.. కరోనా టైంలో అలవాటు అయిన వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్ విధానాలను మళ్లీ ఆచరించడం ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గించవచ్చు. ఈవీలను ప్రొత్సహిస్తే మరీ మంచిది. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం పాటు ఆపితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి కుటుంబం వంటనూనె వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు లాభం. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. రైతులు సహజ వ్యవసాయానికి మారితే దిగుమతులపై ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అని అన్నారు. మోదీ సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనవని ఆర్థిక నిపుణులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో అవి ఆచరణ సాధ్యమా? అంటే కష్టమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా బంగారం భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతకు ప్రతీక. అలాంటి దానిని ఏడాదిపాటు కొనుగోలు నిలిపివేయడం అనేది భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఆచరణలో సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. ఎనర్జీ నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గడం సాధ్యమే. ఇది కొంత వరకు సాధ్యమే. కానీ ఇది ప్రధానంగా ఐటీ రంగం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. తయారీ, రవాణా రంగాల్లో ఇది అసాధ్యమంటున్నారు. అలాగే రైతులు సహజ వ్యవసాయం వైపు మారడం మంచి ఆలోచనే అయినప్పటికీ.. వాళ్లకు ప్రోత్సాహకాలు, మరింత శిక్షణ అవసరమని.. ప్రభుత్వాలు ఆ భారం భరించే స్థితిలో ఉందా? అని వ్యవసాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక వంటనూనె వినియోగం తగ్గించడంపైనా ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మోదీ పిలుపు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనదే. కానీ ప్రజల జీవనశైలిలో మార్పులు తేవడం సులభం కాదు. దీని కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు అవసరం. ఇంధన సంక్షోభం వంటి జాతీయ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రజల సహకారం కీలకమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ రియాక్షన్స్మోదీ పొదుపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కు పెట్టింది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తోంది. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. మోదీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు గుప్పించారు. అది దూరదృష్టితో కూడిన నిర్ణయమని అన్నారాయన. -
ఏడాదిపాటు బంగారం కొనొద్దు.. నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు
-
అప్పటి వరకు బంగారం కొనుగోలు చేయొద్దు : ప్రధాని మోదీ
సాక్షి,హైదరాబాద్: బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం అత్యంత ఖరీదైందిగా మారింది. అందుకే ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోవడం మంచిదన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు.ఈ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డిజీల్ ధరలు తీవ్రంగా పెరిగాయి.గ్యాస్,యూరియా ధరలు అమాంతం పెరిగినప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ధరలు పెంచడం లేదు. "ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వినియోగించాలి. ప్రజా రవాణానే అధికంగా వాడాలి" అని మోదీ అన్నారు.ప్రజలంతా ఎలక్టిక్ వాహనాల వైపు మళ్లాలని, వాటినే వినియోగించాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని ఉక్రెయిన్- రష్యా యుద్ధం, పశ్చిమాసియా యుద్ధాలతో సరఫరా చైన్ దెబ్బతింది అని మోదీ అన్నారు. ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తోందని తెలిపారు. వంట నూనెలు ఎరువుల మందులను పూర్తిగా తగ్గించాలని పురుగుల మందులు, ఎరువుల వినియోగాన్ని తక్కువ చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
బంగారం, వెండి ధరలు: వారం రోజుల్లో ఊహించని మార్పు!
బంగారం వెండి ధరలు ఎప్పుడెలా ఉంటాయో ఊహకందకుండాపోయింది. ఈ రోజు తగ్గితే.. రేపు పెరిగిపోతున్న పరిస్థితులు వారం రోజుల్లో కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (మే 3 నుంచి మే 9 వరకు) పసిడి ధరలు ఎలా మారాయి. ప్రస్తుతం ఏ మార్క్ దగ్గర ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగర్లో మే 3న (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం గోల్డ్ రేటు నేటికి (శనివారం) 1,52,350 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.1420 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల ధర ఈ సమయంలోనే 1,38,350 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,650 వద్దకు (రూ.1300 పెరిగింది) చేరింది.ఇక చెన్నై నగరంలో వారం రోజుల్లో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. మే 3న రూ.152730 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు..154370 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,40,000 రూపాయల దగ్గర నుంచి 141500 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతలా పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.దేశ రాజధాని నగరం ఢిల్లీలో 1,51,230 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 1,52,500 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,38,500 నుంచి రూ.1,39,800 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. మే 3న రూ.2.70 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ రోజు రూ.2.80 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు వారం రోజుల్లో రూ.10 వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
బంగారం కొనాలనుకునేవారికి ఛాన్స్.. ఒక్కసారిగా పడిపోయిన ధరలు
-
Hyderabad: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణహత్య
బంజారాహిల్స్ (హైదరాబాద్): బంగారు నగలు, నగదు కోసం నేపాలీ గ్యాంగ్ ఘాతుకానికి పాల్పడింది. హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే...జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రశాసన్‌నగర్ రోడ్ నం.7లో ప్లాట్ నం. 46లో జైళ్లశాఖలో అదనపు డీజీగా పనిచేసి రిటైర్ అయిన వినయ్ రంజన్‌రాయ్ కుటుంబం ఉంటోంది. ఈ నెల 1వ తేదీన వినయ్ రంజన్‌రాయ్ చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లారు. ఇంట్లో ఆయన భార్య తనూజ రంజన్ (60) మొదటి అంతస్తులో ఉండగా, రెండో అంతస్తులో ఆమె ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల క్రితం ఈ ఇంట్లో పనిమనిషిగా నేపాల్‌కు చెందిన కల్పన చేరింది. నమ్మకంగా పనిచేస్తున్నట్టు నటిస్తూ తనూజ ఆలనాపాలనా చూసేది.తండ్రి బెంగళూరుకు వెళ్లడంతో మొదటి అంతస్తులో తల్లి ఒక్కరే ఉంటారని, బెడ్రూమ్ ముందు హాల్లో పడుకోవాలని పెద్దకూతురు సునంద గురువారం రాత్రి 9 గంటలకు కల్పనకు చెప్పి పైఅంతస్తుకు వెళ్లింది. అంతకుముందే పథకం వేసుకున్న కల్పన రాత్రి 1 గంట సమయంలో ఇంటి బయటకు వచ్చింది. అప్పటికే ఇంటి పక్కన మున్సిపల్ పార్కులో వేచి చూస్తున్న ముగ్గురు నేపాలీలను ఇంట్లోకి తీసుకెళ్లింది. ఆమె బయట కాపలా ఉండగా, ఆ ముగ్గురూ మొదటి అంతస్తులోకి వెళ్లి నిద్రిస్తున్న తనూజను లేపి కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె ఒంటిమీద ఉన్న నగలతోపాటు అల్మారాలో ఉన్న నగదు, రూ. కోట్ల విలువ చేసేబంగారు వజ్రాభరణాలను మూటగట్టుకొని 3.30 గంటల ప్రాంతంలో నలుగురు కలిసి ఉడాయించారు.శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పెద్ద కూతురు సునంద బయట కార్పెంటర్ వెయిట్ చేస్తుండగా ఇంట్లోకి పిలిచి మొదటి అంతస్తులోకి తీసుకెళ్లింది. ఆమె వెళ్లేసరికి తల్లి బెడ్రూమ్లో నేల మీద కాళ్లు చేతులు కట్టేసి ఉండటంతోపాటు నోట్లో గుడ్డలు కుక్కి ఉండి అచేతనంగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే తన సోదరి, డ్రైవర్ సహాయంతో అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ విభాగ ఐజీ, సీసీఎస్ డీసీపీ తదితరులు అంతా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. జరిగిన ఘటనపై సునంద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో తనూజ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆమె ఒంటిమీద ఎలాంటి గాయాలు లేకపోవడం చూస్తే ఆమెపై దాడి జరగలేదని కేవలం నోట్లో గుడ్డలు కుక్కడం వల్ల ఊపిరాడక చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తమ బెడ్రూమ్లోని అలమారాలో భారీగా నగదు, నగలు ఉన్నాయని అవి ఎంత అనే విషయం తెలియదని మృతురాలి భర్త వినయ్ రంజన్‌రాయ్ పోలీసులకు ఫోన్లో చెప్పారు. సీసీ ఫుటేజీలో నలుగురు నేపాలీ గ్యాంగ్ ఇంట్లోకి వస్తున్న, బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పని మనిషి బయటికి వచ్చి వారిని పిలవగా చేతుల్లో కత్తులు, రాడ్లతో ముగ్గురు ఆగంతకులు లోపలికి రావడం కనిపించింది. సరిగ్గా 3.30 గంటల ప్రాంతంలో వీరంతా బంగారు, నగదు ఉన్న బ్యాగుతో ఉడాయించారు. అంతకుముందు రోజు రాత్రి కూడా ఇక్కడ ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గడిచిన నెల రోజుల నుంచి వీరు ఈ ఇంట్లో దొంగతనానికి పథకం వేసినట్లు తెలుస్తున్నది. కల్పన పనిలో చేరేముందు ఎలాంటి ఆధారాలు యజమానులకు ఇవ్వలేదు. వీరి కోసం ముమ్మర గాలింపు జరుగుతోంది. వీరు నేపాల్‌లోకి ప్రవేశించకముందే పట్టుకోవాలని వేర్వేరు చోట్ల బృందాలు నిఘా పెట్టాయి. -
మళ్లీ ఎంఎంటీసీ.. రూ.10కే డిజిటల్ గోల్డ్, సిల్వర్!
డిజిటల్ రూపంలో బంగారం, వెండిని నేరుగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఎంఎంటీసీ–పీఏఎంపీ ప్లాట్‌ఫామ్ తిరిగి ప్రారంభమైంది. ఎంఎంటీసీపీఏఎంపీ వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ నుంచి, అలాగే గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే యాప్స్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.ఈ సంస్థ డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను మొదటిసారి 2017లో, డిజిటల్ వెండి కొనుగోళ్లకు 2023లో అవకాశం కల్పించింది. మరింత మెరుగైన అనుభవానికి వీలుగా వెబ్‌సైట్‌ను నవీకరించేందుకు 2024 చివర్లో ఈ సేవలను నిలిపివేసింది. ఈ కాలంలో థర్డ్ పార్టీ (ఫోన్‌పే తదితర) యాప్స్ ద్వారా కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. నవీకరించిన వెబ్‌సైట్‌ను తాజాగా ప్రారంభించినట్టు సంస్థ ప్రకటించింది.కనీసం రూ.10 నుంచి డిజిటల్ గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతీ కొనుగోలు విలువకు సరిపడా భౌతిక బంగారం, వెండిని బీమా రక్షణతో కూడిన ఖజానాల్లో ఎంఎంటీసీ–పీఏఎంపీ భద్రపరుస్తుంది. బంగారం, వెండిపై పెట్టుబడులకు ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో ఎంఎంటీసీ తిరిగి ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడం గమనార్హం. -
రాత్రికి రాత్రే దూసుకెళ్లిన గోల్డ్ రేట్... భారీగా పెరిగిన బంగారం ధర
-
గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!
మే 2026 ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. ఈ రోజు 24 గంటల వ్యవధిలోనే గోల్డ్ ధరలు మరోమారు ఎగబాకాయికి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.ఈ రోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 1,39,750 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,250 వద్దకు చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,52,460 నుంచి 1,53,000 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటలు గడవకముందే పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,53,150 వద్దకు, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,400 వద్దకు చేరింది. అయితే చెన్నైలో మాత్రం ధరలు కేవలం తులం మీద 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే? -
2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎలాంటి ఆస్తులు స్థిరంగా ఉంటాయనే విషయాన్ని చర్చించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా మంది జీవితకాలంగా కూడబెట్టుకున్న సేవింగ్ కొన్ని వారాల్లోనే కరిగిపోవడం నేను చూశాను. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా 40 శాతం నుంచి 60 శాతం వరకు పడిపోయాయి. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వంటి భౌతిక ఆస్తులు స్థిరంగా నిలిచాయని కియోసాకి పేర్కొన్నారు.పేపర్ ఆస్తులుకియోసాకి ప్రకారం.. స్టాక్‌లు, బాండ్లు, నగదు వంటివాటిని ''పేపర్ ఆస్తులు''. ఇవి నిజంగా భౌతికంగా ఉండే వస్తువులు కావు, ఇవి కొన్ని వాగ్దానాలపై ఆధారపడతాయి.➤స్టాక్ అంటే ఒక కంపెనీ లాభదాయకంగా కొనసాగుతుందనే నమ్మకం➤బాండ్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ అప్పు తిరిగి చెల్లిస్తుందనే నమ్మకం➤డబ్బు అంటే కేంద్ర బ్యాంక్ దాని విలువను స్థిరంగా ఉంచుతుందనే నమ్మకంఅంటే.. ఇవన్నీ మన నియంత్రణలో కాకుండా, వ్యవస్థపై ఆధారపడిన ఉంటాయన్నమాట. రియల్ ఆస్తులురాబర్ట్ కియోసాకి దృష్టిలో భూమి, ఇళ్లు, బంగారం, వెండి వంటి వాటిని రియల్ ఆస్తులు. ఇవి భౌతికంగా ఉండే వస్తువులు కాబట్టి, ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ వాటి విలువ పూర్తిగా తగ్గే అవకాశం లేదు.భూమి ఎప్పుడూ ఉంటుంది, బంగారం అనేక శతాబ్దాలుగా విలువను నిలుపుకుంది. అద్దె ఇల్లు ఉంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది. కాబట్టి సంక్షోభ సమయాల్లో ఇవి నిలకడగా ఉంటాయి.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకిప్రతి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. స్టాక్స్, పేపర్ ఆస్తులు వేగంగా పడిపోతాయి. ఎందుకంటే ప్రజల్లో భయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు భయంతో స్టాక్స్ అమ్మేస్తారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ నష్టపోతారు. రియల్ ఆస్తులు మాత్రం స్థిరంగా ఉండడం లేదా పెరగడం జరుగుతుంది. అందుకే.. అనుభవజ్ఞులు సంక్షోభం రాకముందే తమ పెట్టుబడులను భౌతిక ఆస్తుల వైపు మార్చుకుంటారు.ఏ ప్రభుత్వం ఏర్పడక ముందే భూమి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉంది. ఒక బంగారు నాణెం రోమన్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, వాటి మధ్య వచ్చిన ప్రతి కరెన్సీ సంక్షోభాన్ని తట్టుకుని నిలిచింది. కాబట్టి నిజమైన వస్తువులకు ఉండే శాశ్వతత్వం కాగితపు వస్తువులకు ఎప్పటికీ ఉండదని రాబర్ట్ కియోసాకి విశ్వసిస్తున్నారు. -
సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!
-
వేడి పెంచుతున్న పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
అందుకేనా.. బంగారం ఇంతలా పెరిగింది!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం సాధ్యమవుతుందనే ఆశలు పెరగడంతో, డాలర్ విలువ, చమురు ధరలు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణ భయం తగ్గింది. గోల్డ్ రేటు ఊపందుకుంది.స్పాట్ గోల్డ్ ధర 3.4 శాతం పెరిగి ఔన్సుకు సుమారు 4,708 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది గడిచిన వారం రోజుల్లో అత్యధికం అనే చెప్పాలి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల అంచనాలు ప్రధాన కారణాలు.చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెరుగుతాయి. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదే సమయంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కూడా చమురు ధరలు తగ్గడంతో పెరుగుదల చూపాయి. ఇది పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచింది. మరోవైపు డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం ఇతర కరెన్సీలు కలిగిన వారికి మరింత చౌకగా మారింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు కూడా పెరగడం గ్లోబల్ మార్కెట్లో బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి -
ఇక బంగారం కొనడం ఈజీ.. EGR గురించి తెలుసా?
భారతీయులకు బంగారంపై మక్కువ కొంత ఎక్కువ. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టడం అంత సులభం కాదు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేస్తే దాని నిల్వ, భద్రత, స్వచ్ఛత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ).. ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది.ఈజీఆర్ అంటే ఏమిటి?ఈజీఆర్ అనేది సెబీ గుర్తింపు పొందిన వాల్ట్ మేనేజర్ వద్ద జమ చేసిన భౌతిక బంగారానికి బదులుగా జారీ చేసే ఒక ఎలక్ట్రానిక్ రసీదు. ఇవి డీమ్యాట్ రూపంలో ఉండే సెక్యూరిటీస్ కాబట్టి, స్టాక్‌ల మాదిరిగా ఎక్స్చేంజ్లో సులభంగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. అంటే, బంగారం ఇప్పుడు డిజిటల్ రూపంలో కూడా ట్రేడ్ చేయగలిగేలా మారిందన్నమాట.EGRలు ఎలా పనిచేస్తాయి?ప్రతి ఈజీఆర్ వెనుక నిజమైన ఫిజికల్ గోల్డ్ ఉంటుంది. ఉదాహరణకు.. ఎన్ఎస్ఈ ఒక 1000 గ్రాముల బంగారు గడ్డిని EGRగా మార్చింది. దీని ద్వారా భౌతిక బంగారం.. డిజిటల్ ఆస్తిగా మారుతుంది. పెట్టుబడిదారులు ఈ EGRలను స్టాక్‌ల మాదిరిగా ట్రేడ్ చేయవచ్చు. పెట్టుబడిదారులు తమ EGRలకు తగిన పరిమాణంలో భౌతిక బంగారాన్ని కూడా పొందవచ్చు.EGR ప్రయోజనాలుబంగారాన్ని భద్రపరచడం కోసం బ్యాంక్ లాకర్ అవసరం లేదుదొంగతనం లేదా నష్టం ఉండదుబంగారం స్వచ్ఛతపై సందేహం ఉండదు (ఎందుకంటే ఇది ప్రమాణిత సంస్థల ద్వారా ద్రువీకరిస్తారు)చిన్న మొత్తాల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చుమార్కెట్లో సులభంగా కొనుగోలు/అమ్మకం చేయవచ్చుఇదీ చదవండి: బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం! -
బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం!
పసిడి ప్రియులకు శుభవార్త, ఎందుకంటే గోల్డ్ రేటు గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూనే ఉంది. ఈ రోజు (మంగళవారం) కూడా పసిడి ధరలు ఇదే బాటలో అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రూ.1200 తగ్గిన గోల్డ్: కొత్త ధరలు ఇవే..
ఈ రోజు (సోమవారం) ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప, మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,350 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, సాయంత్రానికి రూ.1,200 తగ్గి, రూ.1,37,150 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో ధరల తారుమారు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర 1,50,930 రూపాయల నుంచి 1,49,620 రూపాయల (రూ.1310 తగ్గింది) వద్దకు వచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 1200 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేటు 1,37,300 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల ధర రూ.1460 తగ్గి 149770 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఒక రోజు కూడా పూర్తికాక ముందే.. ధరల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు.చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,000 (తులం), 24 క్యారెట్ల ధర రూ.1,52,730 (10 గ్రామ్స్) వద్దనే ఉన్నాయి. కాగా వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి సిల్వర్ రేటు రూ.2.70 లక్షల వద్ద ఉంది.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా! -
'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!
బంగారం ధరల్లో ఊహకందని మార్పు జరుగుతున్న సమయంలో జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు (డాయిష్ బ్యాంక్) ఓ సంచనల ప్రకటన చేసింది. ఇది పసిడి ప్రియులలో భయాన్ని కలిగించింది.డాయిష్ బ్యాంక్ ప్రకారం.. ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ రిజర్వులలో బులియన్ వాటా ప్రస్తుతం ఉన్న సుమారు 30% నుంచి 40%కి పెరగవచ్చని సమాచారం. దీన్నిబట్టి చూస్తే రాబోయే ఐదేళ్లలో (2031 నాటికి) బంగారం ధరలు ఔన్సుకు 8,000 డాలర్లకు చేరవచ్చు. అంటే 80% పెరుగుదల ఉంటుందని అంచనా.దేశాలు తమ రిజర్వులను.. యూఎస్ డాలర్ నుంచి బులియన్ వైపు మళ్లిస్తున్నందున, రోజురోజుకు విచ్ఛిన్నమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల బంగారం అతిపెద్ద లబ్ధిదారులలో ఒకటిగా మారవచ్చు. కాబట్టి బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రియం అవుతుంది.పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి రక్షణ పొందటానికి.. ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు మరింత బంగారాన్ని జోడించనున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర బ్యాంకులు 225 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని తమ నిల్వలకు చేర్చాయని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. ఇదే కాలంలో.. ప్రపంచ నిల్వలలో యూఎస్ డాలర్ల వాటా 2000ల ప్రారంభంలో 60% కంటే ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 40%కి పడిపోయింది.బంగారం కొనుగోళ్లు ఇకపై చైనా, రష్యా, భారత్, టర్కీ వంటి ప్రధాన దేశాలకే పరిమితం కాలేదని డాయిష్ బ్యాంక్ తెలిపింది. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు కూడా కొనుగోళ్లు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితులు బంగారం ధరలను భారీ పెంచనున్నాయి.ఈ అంచనా ప్రకారం.. భారతదేశంలో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతాయు. ప్రస్తుతం మన దేశంలో గోల్డ్ రేటు రూ.1,50,930 వద్ద ఉండగా.. ఇది భవిష్యత్తులో రూ.2.5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇదే నిజమైతే బంగారం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందనేది వాస్తవం.ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు! -
ఒక్కరోజులోనే కుప్పకూలిన బంగారం ధరలు..తులం ఎంతంటే..
-
భారీగా తగ్గిన బంగారం ధరలు: కొత్త రేట్లు ఇవే!
గత కొన్నిరోజులు బెంబేలెత్తించిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుతూ, ఒక్కసారిగా భారీ పతనం చవిచూశాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.2,350 తగ్గి, రూ.1,50,380 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 2,150 రూపాయలు తగ్గి, రూ.1,37,850 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా ఉంటాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రేటు 2450 రూపాయలు తగ్గింది. దీంతో దేశ రాజధాని నగరంలో తులం పసిడి ధర రూ.1,50,430 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 2150 రూపాయలు తగ్గి, 1,38,000 రూపాయల వద్ద నిలిచింది.చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం రేటు రూ.1,51,860 (రూ.1960 తగ్గింది) వద్ద, 22 క్యారెట్ల తులం ధర రూ. 1,39,200 (రూ.1800 తగ్గింది) వద్ద ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. పసిడి ధరలు క్రమంగా పడిపోతున్నట్లు తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు! -
కాసింత చల్లబడిన బంగారం వేడి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
రూ.3 వేలు తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర తులం ఎంతంటే
-
పసిడి ధరల పతనం.. ఊహకందని రీతిలో ఇలా!
భారతదేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఈ రోజు భారీ పతనాన్ని చవి చూసింది. దీంతో ఒక్కసారిగా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉంది?, సిల్వర్ ధరల్లో ఏమైనా మార్పు కనిపించిందా? అనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2780 తగ్గి 1,50,930 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 2550 రూపాయలు తగ్గి రూ.1,38,350 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో గోల్డ్ రేటు వరుసగా రూ.1420, రూ.1300 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 153820 రూపాయల వద్ద, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.141000 వద్ద నిలిచాయి. ఈ ధరలు నిన్నటి (మంగళవారం)తో పోలిస్తే చాలా తక్కువ.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు పతనమయ్యాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,51,080 (రూ.2780 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,38,500 (రూ.2550 తగ్గింది) వద్ద ఉంది.వెండి ధరలు ఇలాబంగారం మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేటు రూ.2.65 లక్షలు (రూ.5000 తగ్గింది) వద్ద, ఢిల్లీలో రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా! -
వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్
ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు చిరపరిచితమైన పేరు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki). 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad)పుస్తకంతో ఆర్థిక పాఠాలు నేర్పిన ఆయన, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026-27 మధ్య కాలంలో ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని, బహుశా ఒక గొప్ప ఆర్థిక మాంద్యాన్ని (Great Depression) ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు.సంక్షోభంలో చిక్కుకుంటారా.. లాభపడతారా?తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కియోసాకి స్పందిస్తూ.. రాబోయే ఈ భారీ క్రాష్‌లో ప్రజలు రెండు రకాలుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఒక వర్గం వారు ఆర్థికంగా చితికిపోతే, మరో వర్గం వారు అదృష్టవంతులుగా మారి భారీగా లాభపడతారని ఆయన విశ్లేషించారు.సంక్షోభాల్లోనే ధనవంతుడినయ్యాను..గతంలో జరిగిన ఆర్థిక పతనాలను గుర్తు చేసుకుంటూ.. "1987, 2000, 2008, 2015, 2019, 2022 సంవత్సరాల్లో వచ్చిన సంక్షోభాల్లో నేను పేదవాడిని కాలేదు, ఇంకా ధనవంతుడిని అయ్యాను. రాబోయే 2026-27 క్రాష్‌లో కూడా నేను మరింత సంపదను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాను" అని కియోసాకి ధీమా వ్యక్తం చేశారు.ఆస్తులు చౌకగా దొరికే సమయం ఇదే!ఆర్థిక మాంద్యం సమయంలో సామాన్యులు భయపడి ఆస్తులు అమ్ముకుంటే, తెలివైన వారు పెట్టుబడులు పెడతారని కియోసాకి సూచించారు. "మార్కెట్ పతనం (Crash) అయినప్పుడు, గొప్ప ఆస్తులన్నీ తక్కువ ధరకే 'సేల్'లో లభిస్తాయి. ఆ సమయంలో వాటిని కొనుగోలు చేయడం ద్వారానే ధనవంతులు కావచ్చు" అని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని వాడుకొని అందరూ ఆర్థికంగా ఎదగాలని, ఎవరూ నష్టపోకూడదని ఆయన ఆకాంక్షించారు.అయితే కియోసాకి అంచనాలు భారతీయ ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరిక వంటివి. ఒకవైపు ప్రపంచ మార్కెట్ల ప్రభావం భారతదేశంపై పడే అవకాశం ఉండగా, మరోవైపు బంగారం (Gold), వెండి (Silver) లేదా రియల్ ఎస్టేట్ (Real Estate) వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది గొప్ప అవకాశంగా మారవచ్చు. కానీ, తగిన ఆర్థిక ప్రణాళిక లేకుండా మార్కెట్లోకి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లోకి దూసుకొస్తున్న ‘జెన్-జీ’IN THIS COMING CRASh possibly a Grest Drpression…. Will you be “FU’CD UP or LU’CD UP.”So far….in the crashes of 1987, 2000, 2008, 2015, 2019, 2022 I got richer not poorer.And again in coming giant crash of 2026-27….I plan on growing richer not poorer.I wish the same for…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 28, 2026 -
బంగారం ఇక అలంకారం కాదు.. ఆస్తి
పసిడి కొనుగోళ్లలో ఆభరణాల వినియోగమే పెద్ద మొత్తంలో ఉంటోంది. కానీ, ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో బాగా ర్యాలీ చేయడం తెలిసిందే. దీంతో వినియోగం కంటే పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశంలో మొత్తం బంగారం కొనుగోళ్లలో పెట్టుబడుల వాటా 40 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ఇక ఆభరణాల వినియోగం వాటా 60 శాతం లోపునకు దిగొస్తుందని పేర్కొంది. మన దేశంలో బంగారం కొనుగోళ్లలో దీర్ఘకాలం నుంచి ఆభరణాల వాటా 70 శాతంగా ఉంటుంటే, మిగిలిన 30 శాతం పెట్టుబడుల నుంచి ఉంటోంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ఆభరణాల వాటా పసిడి కొనుగోళ్లలో 50 శాతమే కావడం గమనార్హం. నిర్మాణాత్మక మార్పు.. దేశంలో బంగారం కొనుగోళ్లలో వస్తున్న నిర్మాణాత్మక మార్పునకు ఇది నిదర్శనమని కేర్ఎడ్జ్ డైరెక్టర్ అఖిల్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచంలో పసిడి వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో చైనా, భారత్ కలసి సగం వాటా కలిగి ఉండడం విశేషం. ‘‘భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బంగారం ధరల్లో కదలికలు, పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం అన్నవి పసిడిపై పెట్టుబడుల డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయి. 2026–27లో మొత్తం బంగారం వినియోగంలో పెట్టుబడి వాటా 35–40 శాతానికి చేరుతుంది. ఇక 60 శాతం ఆభరణాల వాటా అన్నది ప్రపంచ సగటు 50 శాతం కంటే ఎక్కువే’’అని అఖిల్ గోయల్ తెలిపారు. గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ.. పెట్టుబడుల్లో అధిక శాతం గోల్డ్ ఈటీఎఫ్‌ల రూపంలో ఉంటున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక తెలిపింది. ఒక్క గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లే 37.5 టన్నులు ఉంటాయని.. గత పదేళ్లలో మొత్తం పెట్టుబడుల కంటే ఇది ఎక్కువని పేర్కొంది. ఆ తర్వాత బంగారం కాయిన్లు, కడ్డీల రూపంలోఉంటోంది. స్వల్పకాల స్పెక్యులేటివ్ అవసరాలు కాకుండా.. డిమాండ్ ధోరణుల్లో నిర్మాణాత్మక మార్పుల నేపథ్యంలో బంగారం అధిక ధరల శ్రేణిలో కొనసాగనున్నట్టు కేర్ఎడ్జ్ తెలిపింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ 2025లో ఆభరణాల వినియోగం బలంగా ఉందని, 10 శాతం పెరిగి రూ.4.8 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ఆభరణాల కొనుగోళ్ల విలువ మాత్రం 15 శాతం తగ్గడం గమనార్హం. 2026లో ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉండొచ్చని కేర్ఎడ్జ్ అంచనా వేసింది.‘‘సంస్థాగత జ్యుయలరీ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి ఆభరాణాలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. కంపెనీల స్థూల మార్జిన్లు 170–200 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని అంచనా. 2026–27లో స్థూల మార్జిన్లు 14–14.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఎబిట్డా మార్జిన్లు 6.5–7 శాతం మేర ఉండొచ్చు’’అని తెలిపింది. వెండికి యువతరం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి పెరుగుతున్నప్పటికీ సమీప కాలంలో బంగారాన్ని అది భర్తీ చేయలేదని పేర్కొంది. -
కొనసాగుతున్న బంగారం ధరల పతనం... గోల్డ్ కొన్నవారికి వరుస షాక్స్
-
బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..
భారతదేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (ఏప్రిల్ 19 నుంచి 25 వరకు) పసిడి ధరలు ఎంత తగ్గాయి?, ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 19 (ఆదివారం) 1,55,780 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు శనివారం (ఏప్రిల్ 25) నాటికి 1,54,040 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఏడు రోజుల్లో 1,42,800 రూపాయల నుంచి రూ.1,41,200 వద్దకు చేరింది.దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర వారం రోజుల్లో 1,55,930 రూపాయల దగ్గర నుంచి రూ.1,54,190 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,42,950 రూపాయల నుంచి 1,41,350 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో బంగారం ధరలు తగ్గాయి. గత ఆదివారం (ఏప్రిల్ 19) రోజు రూ.1,56,660 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి.. ఏప్రిల్ 25 నాటికి 1,54,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 143600 రూపాయల వద్ద నుంచి 142000 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ధరలు ఎంతలా తగ్గాయో స్పష్టంగా తెలుస్తుంది.వెండి ధరలు ఇలా..బంగారం బాటలోనే.. వెండి కూడా అడుగులు వేసింది. ఏప్రిల్ 19న రూ.2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ ఏప్రిల్ 25 (శనివారం) నాటికి రూ.2.70 లక్షల వద్దకు చేరింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా? -
భారీగా బంగారం అమ్మేసిన రష్యా!
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగిపోతుంటే.. ప్రపంచంలోని చాలా దేశాలు మరింత ఎక్కువ గోల్డ్ కొనుగోలు చేయడానికికి పూనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా ఏకంగా 22 టన్నుల బంగారం విక్రయించింది.2026 ప్రారంభం నుంచి రష్యా సుమారు 22,000 కేజీల గోల్డ్ విక్రయించింది. దీంతో ఏప్రిల్ 1 నాటికి దేశంలోని బంగారు నిల్వలు 0.7 మిలియన్ ట్రాయ్ ఔన్సులు తగ్గి 74.1 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విక్రయానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక పరిస్థితి.పాశ్చాత్య దేశాల ఆంక్షలురష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆదాయ వనరులు తగ్గిపోయాయి, ముఖ్యంగా చమురు.. గ్యాస్ రంగం తీవ్ర ప్రభావం ఎదుర్కొంది. ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గిపోవడంతో బడ్జెట్ లోటు భారీగా పెరిగింది.లోటు బడ్జెట్!2026 మార్చి నెలాఖరు నాటికి రష్యా బడ్జెట్ లోటు 61.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5.8 లక్షల కోట్లు) పెరిగిన నేపథ్యంలో బంగారం విక్రయించాల్సి వచ్చింది. బడ్జెట్ లోటు సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం లోటుకంటే కూడా చాలా ఎక్కువ. ఈ లోటును తగ్గించడానికి ప్రభుత్వం బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది. అయితే.. రష్యా బంగారం అమ్మినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశ బంగారు నిల్వల మొత్తం విలువ పెరిగింది. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. అంటే పరిమాణం తగ్గినా, విలువ పెరగడం జరిగింది.ఏటా 300 టన్నుల బంగారం ఉత్పత్తిప్రపంచంలో ఎక్కువ బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో.. రష్యా కూడా ఒకటి. ప్రతి ఏటా ఈ దేశం 300 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ దేశ ఆర్ధిక పరిస్థితిలో జరిగిన మార్పుల కారణంగా.. రష్యా 22 టన్నుల బంగారం విక్రయించాల్సి వచ్చిందని తెలుస్తోంది.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా! -
భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
-
ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. శవంపై బంగారం మాయం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. చనిపోయిన వృద్ధురాలికి ఉన్న బంగారు కమ్మలు మాయమయ్యాయి. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను బంధువులు.. ఐసీయూలో చేర్చారు.చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం వృద్ధురాలు ఉదయం మృతి చెందింది. వృద్ధురాలి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కమ్మలు కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిపై వృద్ధురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందే తీసేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. -
పసిడి ప్రియులకు గుడ్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
-
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు 2026లో సురక్షితమైన ఆస్తుల గురించి వివరించారు.కియోసాకి ప్రకారం.. అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ డబ్బు “నిజమైన సంపద కాదు”, ఎందుకంటే ప్రభుత్వం అవసరమైతే ఎక్కువ డబ్బు ముద్రించగలదు. ఇలా డబ్బు ముద్రించడం వల్ల దాని విలువ తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. అందుకే ఆయన దీనిని “ఫేక్ మనీ” అని అంటారు.ప్రస్తుతం అమెరికా జాతీయ రుణం చాలా ఎక్కువగా ఉందని, రోజుకి బిలియన్ల డాలర్ల రుణం పెరుగుతుందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రమాదంలో పడవచ్చని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన సురక్షితమైన ఆస్తులుబంగారం (Gold)వెండి (Silver)చమురు (Oil)ఆహారం (Food)బిట్‌కాయిన్ (Bitcoin)ఈథీరియం (Ethereum)కియోసాకి అభిప్రాయం ప్రకారం.. పరిమితంగా ఉండే వనరులు విలువైనవి. ఎందుకంటే వాటిని అంత సులభంగా తయారు చేయలేము. కాబట్టి వీటి విలువ క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు.బంగారం, వెండిబంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగింది. ప్రపంచంలో ఆర్ధిక అనిశ్చితి పెరిగినప్పుడు వీటి విలువ పెరుగుతుంది. కాబట్టి దీనిపై పెట్టె పెట్టుబడులు ప్రజలను ధనవంతులను చేస్తుంది. లేదా కష్టకాలంలో ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తుంది.క్రిప్టో కరెన్సీకియోసాకి బిట్‌కాయిన్, ఈథీరియంను భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా చూస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వ నియంత్రణలో లేవు కాబట్టి సంప్రదాయ డబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే కొంత రిస్క్ కూడా ఎదుర్కోవాలి ఉంటుంది.చమురు, ఆహారంచమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మౌలిక అవసరం. యుద్ధాలు లేదా సరఫరా సమస్యలు దెబ్బతింటే ధరలు పెరుగుతాయి. అదే విధంగా ఆహార ధరలు కూడా ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవి కూడా 'అవసరమైన ఆస్తులు' అని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన ఈ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు విమర్శించారు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి అంచనా నిజం కాలేదు కాబట్టి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆర్ధిక నిపుణులు ఒకే రకమైన పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడకూడదని సూచిస్తారు.ఇదీ చదవండి: ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు! -
ఉలుకు పలుకు లేని ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అందుకే.. గోల్డ్ రేటు తగ్గింది!
గత కొంత కాలంగా.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు (ఏప్రిల్ 20) కొంత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. దీనికి కారణం ఏమిటి?, ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలపడటం. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే.. ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేసే వారు మరింత వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతాయి.భారతదేశంలో ఇలా..భారతదేశంలో కీలకమైన పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో జువెలరీ డిమాండ్ తగ్గింది. అయితే పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోలు కొంత పెరిగింది. ఇతర లోహాల విషయానికి వస్తే, వెండి ధర 1.7% తగ్గింది. ప్లాటినం, పల్లాడియం కూడా స్వల్పంగా తగ్గాయి.ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు..మరోవైపు.. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు సరిగ్గా ముందుకు సాగకపోవడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు ధరలు పెరిగాయి. చమురు సరఫరా అంతరాయం కలగవచ్చనే భయం పెట్టుబడిదారుల్లో కనిపించింది. దీని వల్ల స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనయ్యాయి.అమెరికా ఒక ఇరానియన్ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకోవడం, దానికి ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించడం వంటి పరిణామాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఇప్పటికే అమలులో ఉన్న తాత్కాలిక ఒప్పందం కూడా ఎక్కువకాలం నిలవకపోవచ్చనే అనుమానాలు పెరిగాయి. అంతే కాకుండా.. ఇరాన్ తదుపరి చర్చల్లో పాల్గొనబోమని ప్రకటించడం కూడా అనిశ్చితిని పెంచింది.ద్రవ్యోల్బణ భయం!అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారి క్రిస్టోఫర్ వాలర్ మాట్లాడుతూ.. ఈ యుద్ధ పరిస్థితులు తాత్కాలికంగా ద్రవ్యోల్బణం పెంచవచ్చని చెప్పారు. అయితే పరిస్థితి త్వరగా సద్దుమణిగితే భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని సూచించారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
ఇవి తెలియకుండా బంగారం కొంటే మీకే నష్టం!
భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం ఎంతవరకు స్వచ్ఛమైనది? ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక దాగున్న నాణ్యత లోపాలను ఎలా గుర్తించాలి? అనే సందేహం కలుగుతుందా? బంగారం కొనుగోలు చేసేటప్పుడు బీఐఓఎస్ హాల్‌మార్కింగ్, ఆరు అంకెల హెచ్‌యూఐడీ నంబర్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. మీ పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పించే పక్కా బిల్లు రహస్యాలు, ఆధునిక పరీక్షల గురించి మరిన్ని వివరాలు చూద్దాం.హాల్‌మార్కింగ్: ఈ మూడు గుర్తులు ఉన్నాయా?ప్రస్తుతం విక్రయించే ప్రతి బంగారు ఆభరణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనల ప్రకారం హాల్‌మార్కింగ్ తప్పనిసరి. మీరు కొనే నగపై ఈ మూడు గుర్తులు ఉన్నాయో లేదో పరీక్షించండి.బీఐఎస్ లోగో: త్రిభుజాకారంలో ఉండే ఈ గుర్తు ఆ ఆభరణం ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరిస్తుంది.బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు.22K916: అంటే అది 22 క్యారెట్ల బంగారం, అందులో 91.6% స్వచ్ఛత ఉంటుంది.18K750: వజ్రాలు లేదా ఇతర విలువైన రాళ్లు పొదిగిన నగలకు సాధారణంగా 75% స్వచ్ఛత కలిగిన ఈ బంగారాన్ని వాడతారు.హెచ్‌యూఐడీ నంబర్ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్): ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఆభరణానికి ఆరు అంకెలతో కూడిన ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (ఉదా: AZ1234) ఉంటుంది.బీఐఎస్ కేర్ యాప్‌తో డిజిటల్ వెరిఫికేషన్మీరు కొన్న నగ అసలైనదో కాదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రభుత్వ అధికారిక బీఐఎస్ కేర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్‌లోని ‘Verify HUID’ సెక్షన్లోకి వెళ్లి నగపై ఉన్న ఆరు అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి. వెంటనే ఆ నగను ఏ జ్యువెలర్ రిజిస్టర్ చేశారు? ఏ హాల్‌మార్కింగ్ సెంటర్ పరీక్షించింది? నగ స్వచ్ఛత ఎంత? వంటి వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. షాపు వారు ఇచ్చే ట్యాగ్‌తో ఈ వివరాలను సరిపోల్చుకోండి.క్యారెట్ మీటర్, మ్యాగ్నెట్ టెస్ట్నగలను కట్ చేయకుండానే వాటిలోని లోహాల శాతాన్ని (బంగారం, వెండి, రాగి) తెలుసుకోవడానికి ఎక్స్ఆర్ఎఫ్ (X-Ray Fluorescence) మెషీన్లు వాడతారు. చాలా మంది పెద్ద వ్యాపారుల వద్ద ఇవి ఉంటాయి. కేవలం 30 సెకన్లలోనే ఇది రిజల్ట్ ఇస్తుంది. నగలను మీ ముందే స్కాన్ చేయమని అడగడం మీ హక్కు.మ్యాగ్నెట్ పరీక్ష: బంగారం అయస్కాంత పదార్థం కాదు. ఒకవేళ నగ అయస్కాంతానికి ఆకర్షితమైతే అందులో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి ఇతర లోహాల కల్తీ ఉందని అర్థం.ట్యాక్స్ ఇన్వాయిస్ తప్పనిసరికొనుగోలు చేసిన తర్వాత వివరణాత్మకమైన టాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ బిల్లులో వివరాలు స్పష్టంగా ఉండాలి.ప్రతి వస్తువు హెచ్‌యూఐడీ నంబర్.బంగారం బరువు, దాని స్వచ్ఛత.ఆ రోజు ఉన్న మార్కెట్ రేటు.తయారీ ఖర్చులు, జీఎస్టీ.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా! -
సరిగా కొంటేనే.. బంగారం!
ధర ఎంతన్నా ఉండనివ్వండి. బంగారమనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. తరతరాలుగా పుత్తడికి ప్రాధాన్యం పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఇంటింటా ఆభరణాల రూపంలో మురిపిస్తూనే, ఆర్థికంగా కూడా భరోసాను కల్పించే సాధనంగా పనికొస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల దెబ్బతో ఒకసారి అయిదు వేలు పెరిగితే, ఇంకోసారి పదివేలు పడిపోయి.. బంగారం రేట్లు సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఎమోషనల్ కారణంతోనో, పెట్టుబడి కోసమో ఆభరణాలు, నాణేల రూపంలో కొనుక్కుని పెట్టుకున్న వారిలోను, కొనుక్కోవాలనుకుంటున్న వారిలోనూ ఆందోళన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్రమంగా పుత్తడిని చూసే తీరు మారుతోంది. కేవలం ఆభరణంగానో లేదా భావోద్వేగాలతో ముడిపడిన ఆస్తిగానో చూడటం కాకుండా పెట్టుబడి కోణంలో చూసే ధోరణి పెరుగుతోంది. యువ ఇన్వెస్టర్లు తమ సౌకర్యార్థం, లిక్విడిటీ కోసం క్రమంగా ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. పుత్తడిని ఎమోషనల్‌గా కొనుక్కోవడం కాకుండా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే సరైన విధానమన్నది విశ్లేషకుల మాట.తయారీ.. తరుగుతో కోత..మార్కెట్లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది ఇన్వెస్టర్లు జ్యుయలరీ రూపంలో కొన్న బంగారాన్ని కూడా పెట్టుబడిగానే పరిగణిస్తుంటారు. అనుబంధం, సంప్రదాయాలపరంగా ఆభరణాలు, నాణేల రూపంలో బంగారానికి ఎంతో విలువ ఉన్నప్పటికీ, ఆర్థిక కోణంలో చూస్తే మాత్రం భౌతికరూపంలోని పసిడి కొనుగోలు విధానంలో లోటుపాట్లు ఎక్కువ. తయారీ చార్జీల కారణంగా వీటి విలువ కొనుక్కోగానే 10–15 శాతం తగ్గిపోతుంది. రూ. 1 లక్ష విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొన్నప్పుడు, సాధారణంగా రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు మేకింగ్ చార్జీల కింద పోతుంది. అంటే మనం వాస్తవానికి రూ. 85,000–90,000 విలువ చేసిన బంగారమే కొన్నట్లవుతుంది. ఇక మళ్లీ రీసేల్ చేయాలంటే తరుగు అంటూ తీసేస్తారు. దీంతో సదరు బంగారు ఆభరణంపై వచ్చే రాబడి మరింత తగ్గిపోయినట్లవుతుంది. ఇదిగాకుండా వీటిని సురక్షితంగా భద్రపర్చుకోవడం మరో ఎత్తు. ఇక తిరిగి విక్రయించినప్పుడు, రేట్లు భారీగా పెరిగితే తప్ప, రీసేల్ విలువ తక్కువే వస్తుంది. ఆ రకంగా పెట్టుబడుల కోణంలో చూస్తే ఇది అంత లాభసాటి వ్యవహారంగా ఉండదు.పసిడిపై మళ్లీ ఫోకస్దేశ, విదేశ పరిణామాలతో ఇటీవలి కాలంలో పసిడికి మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశి్చతి, ఈక్విటీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, కరెన్సీ బలహీనపడుతుండటంలాంటి అంశాలు మళ్లీ బంగారంపై ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనం పాత్రను పోషిస్తుంది. మిగతా ఆర్థిక సాధనాలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇది స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇదీ... నయా రూట్ఇలాంటివన్నీ చూశాకేనేమో... ఇపుడు పుత్తడిలో పెట్టుబడులు పెట్టే విధానంలో గణనీయంగా మార్పులొచ్చాయి. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చాయి. పసిడి ధరలకు అనుగుణంగా ఉండే ఈ ఈటీఎఫ్‌లను షేర్లలాగానే స్టాక్ ఎక్స్ఛేజీల్లో కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. వీటిని కావాల్సినప్పుడు కొనుక్కుని, అమ్ముకునేందుకు (లిక్విడిటీ) వీలు, పారదర్శకత ఉంటుంది. భౌతికంగా భద్రపర్చుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంత వెసులుబాటు ఉన్నందుకే ఇన్వెస్టర్లు వీటివైపు చూడటం పెరుగుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) కూడా గతంలో వచ్చాయి. పసిడి ధరను ట్రాక్ చేసే ఈ బాండ్లపై వార్షికంగా అదనంగా 2.5 శాతం వడ్డీ కూడా ఇవ్వడంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ నుంచి కూడా మినహాయింపు లభించేలా వీటిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు వచి్చ, కొత్త బాండ్ల జారీ ఆగినప్పటికీ, గతంలో జారీ చేసినవి అలాగే కొనసాగుతున్నాయి. పోర్ట్‌ఫోలియోకి భద్రతపోర్ట్ఫోలియోను సమతూకంతో ఉంచడంలో పసిడి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పసిడి పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే చాలా ఉపయోగకరం. ఈక్విటీల తరహాలో భారీ రిటర్నుల కోసం కాకుండా, స్థిరత్వానికి, డైవర్సిఫికేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా 10–15 శాతం పసిడికి, సుమారు 60 శాతం ఈక్విటీలకి, 25 శాతం డెట్ సాధనాలకు కేటాయిస్తే పోర్ట్‌ఫోలియో సమగ్రంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు రిసు్కలు తగ్గుతాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు లిక్విడిటీతో పాటు స్వల్పకాలిక అవసరాల కోసం, పోర్ట్‌ఫోలియోలో పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఉపయోగపడతాయి.నాణేలు, ఆభరణాలతో ప్రతికూలం..మేకింగ్ చార్జీల రూపంలో కొనగానే 10–15%తరుగుతో రీసేల్ విలువలోనూ కోతఆభరణం కొనుగోలు ధర: రూ. 1,00,000మేకింగ్ చార్జీలు : రూ. 10,000 15,000వాస్తవంగా బంగారం ధర: రూ.85,000-90,000పోర్ట్‌ఫోలియో కేటాయింపు ఇలా..ఈక్విటీ 60 శాతండెట్ 25 శాతంపసిడి 10-15 శాతంఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట! -
అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు
-
డిజిటల్ గోల్డ్‌కు అక్షయ తృతీయ మెరుపులు
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి ఆభరణాలు, నాణేలతో పాటు డిజిటల్ రూపంలో కూడా బంగారం కొనుగోళ్లపై కూడా గణనీయంగా ఆసక్తి నెలకొనే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ గోల్డ్‌ని మరింత సులభతరంగా, పారదర్శకంగా కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం ఇందుకు దోహదపడుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ విభాగం రీసెర్చ్ హెడ్ నవనీత్ దమానీ, అనలిస్ట్ మానవ్ మోదీ ఒక నివేదికలో తెలిపారు.పసిడి ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ వృద్ధి మందగించడం, మానిటరీ పాలసీ అంచనాల్లో మార్పులు తదితర అంశాల కారణంగా 2026లో బులియన్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోందని తెలిపారు. మధ్య మధ్యలో కరెక్షన్‌కి లోనైనప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనాలకు డిమాండ్ నెలకొనడంతో పసిడి, వెండి వరుసగా 10, 5 శాతం మేర పెరిగాయని వివరించారు. -
721 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొత్త రికార్డులకు చేరాయి. 71.98 బిలియన్ డాలర్ల (రూ.6,69,414 కోట్లు) విలువైన బంగారం దిగుమతి అయింది. 2024–25 సంవత్సరంలో 58 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోల్చి చూస్తే 24 శాతం పెరిగాయి. పరిమాణం పరంగా చూస్తే తగ్గుదల కనిపిస్తోంది. 2024–25లో 759.09 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.76 తక్కువగా 721.03 టన్నులకు పరిమితమయ్యాయి. బంగారం ధర గణనీయంగా పెరగడంతో, విలువ అధికంగా ఉన్నప్పటికీ పరిమాణం తగ్గినట్టు వాణిజ్య శాఖ గణాంకాల ఆధారంగా స్పష్టమవుతోంది. 2023–24లో 45.54 బిలియన్ డాలర్లు, 2022–23లో 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు నమోదయ్యాయి. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగ మార్కెట్‌గా ఉండడం గమనార్హం. ప్రధానంగా ఆభరణాల నుంచే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. → వెండి దిగుమతుల విలువ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 150 % పెరిగి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిమాణం పరంగానూ 42 % పెరిగి 7,335 టన్నుల మేర ఉంది. → బంగారం కిలో ధర 2024–25లో 76,617 డాలర్లుగా ఉంటే, 2025–26లో 99,825 డాలర్లకు చేరడం దిగుమతుల విలువ పెరిగేందుకు దారితీసింది. → అత్యధికంగా స్విట్జర్లాండ్ నుంచి 40 శాతం మేర బంగారం దిగుమతి కాగా, యూఏఈ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% చొప్పున వచ్చింది. దేశ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 5 శాతంగా ఉంటుంది. → స్విట్జర్లాండ్ నుంచి బంగారం దిగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 11.36 శాతం పెరిగి 24.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
ఈ ఆభరణాలూ సువర్ణాలే!
ప్రపంచం ఏమైనా సరే, యుద్ధాలు వచ్చినా, ఆర్థిక మాంద్యం తలుపు తట్టినా మన మధ్యతరగతిని వణికించేవి రెండు మాత్రమే! మొదటిది ఇంధన ధరలు, రెండోది బంగారం ధరలు. ఇప్పుడు బంగారం ధర ఆకాశానికెక్కి, అందని నక్షత్రంలా మెరుస్తోంది. బంగారం కేవలం లోహం మాత్రమే కాదు, తరతరాల సంప్రదాయం కూడా! నేటి ట్రెండ్, రేపటి భద్రత. ‘ఏమైనా సరే, నగలు కొనాల్సిందే!’ అనుకునే వారికి రంగు రంగుల్లో దొరికే బంగారు మిశ్రమ లోహాలు సహా పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా బడ్జెట్లోనే మెరిపించే బంగారు మార్గాల గురించిన ప్రత్యేక కథనం...బంగారానికి ప్రత్యామ్నాయ లోహాలు...బంగారం అంటే భారతీయులకు తగని మోజు. ముఖ్యంగా భారతీయులకు బంగారం చూసినప్పుడల్లా దాని మెరుపు మాయలో పడిపోవటం అలవాటు. కాని ఇప్పుడు దానిని తాకగానే, బడ్జెట్ ఒక్కసారిగా సీరియస్ అయి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త కథ మొదలైంది. ‘బంగారం మాత్రమే కాదు, మేమూ ఉన్నాం’ అని చెప్పే లోహాలు ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టాయి. పెరుగుతున్న ధరలు, రోజురోజుకీ మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, తేలికగా ఉండే డిజైన్లపై పెరుగుతున్న ఆసక్తి, ఇలా ఇవన్నీ కలిసి బంగారానికి ప్రత్యామ్నాయ ఆభరణాలుగా మారి చిన్న చిన్న తారల్లా తళుక్కుమంటున్నాయి.పైగా ఇవి సరసమైన ధరల్లో దొరుకుతుండటమే కాకుండా, స్టయిల్లో కూడా తగ్గేదే లేదంటూ సూపర్ మోడల్స్‌లా మెరిసిపోతున్నాయి. దీంతో అన్ని వయసుల వారూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు బంగారం మాత్రమే వివాహాది శుభకార్యాలకు తప్పనిసరి ఎంపికగా ఉండేది. ఇప్పుడు ఆ ఎంపికల ప్రపంచం పెద్దదైంది. అందుకే ఇప్పుడు ఈ ‘న్యూ హీరోస్’ గురించి తెలుసుకోవడం కూడా ఒక చిన్న ఫ్యాషన్ అడ్వెంచర్లాంటిదే!ప్లాటినమ్ – లగ్జరీ లెజెండ్ జ్యూలరీ ప్రపంచంలో ఒక సైలెంట్ కింగ్ ప్లాటినమ్. ఎక్కువ హడావిడి చేయకుండా, తన క్లాస్‌తోనే అందరినీ ఆకట్టుకుంటుంది. సహజంగా వెండిలాంటి తెల్లటి మెరుపుతో కనిపించే ఈ లోహం చాలా బలమైంది. కాలం గడిచినా తన అందాన్ని కోల్పోదు. అందుకే ‘ఒకసారి కొనిస్తే, సంవత్సరాలు గడిచినా కొత్తదానిలానే మెరిసిపోతుంది’ అంటారు. చరిత్రలో కూడా ప్లాటినమ్ రాజరికపు కథలతో నిండిపోయింది. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా దొరికే లోహం కావడం వల్ల రాజులు, ధనవంతులు మాత్రమే దీనితో నగలు చేయించుకునేవారు.ఆ కాలంలో ప్లాటినమ్ ధర కేవలం డబ్బుతో కాదు, ప్రతిష్ఠతో కూడా కొలిచేవారు. ఇప్పటికీ పెళ్లి ఉంగరాలు, ఎంగేజ్మెంట్ రింగ్స్, ప్రీమియం జ్యూలరీలో ప్లాటినమ్‌ను ఒక శాశ్వత బం«ధానికి గుర్తుగా భావిస్తారు. స్క్రాచ్‌లు వచ్చినా, వేడి, చెమట, నీరు ఏదైనా సరే తన మెరుపును అలాగే నిలబెట్టుకుంటుంది. అందుకే మెడికల్ పరికరాలు, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ రంగాల్లో కూడా ప్లాటినమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ధరలో సాధారణంగా బంగారంతో సమానంగా, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ ధరలో లభిస్తుంది. వెండి – బంగారానికి దగ్గరి బంధువుప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా లభించే విలువైన లోహం వెండి. ఇది బంగారానికి దగ్గరి బంధువు లాంటిది. మెరుపులో ఏమాత్రం తగ్గదు, కానీ ఖర్చులో మాత్రం మనసుకు కాస్త హాయినిస్తుంది. బంగారం కంటే ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వెండి తక్కువ ధరలో సులభంగా దొరుకుతుంది. అయితే వెండి కథ కేవలం ఫ్యాషన్ తోనే మొదలైపోలేదు; దానికి గొప్ప చరిత్ర, సంప్రదాయం కూడా ఉన్నాయి.పురాతన కాలంలో రాజులు, సంపన్నులు వెండి పాత్రల్లోనే భోజనం చేసేవారు. ఆరోగ్యానికి మంచిదని, నీటిని శుభ్రంగా ఉంచుతుందని నమ్మకం ఉండేది. అందుకే ఇప్పటికీ చాలా ఇళ్లలో చిన్నపిల్లలకు వెండి గ్లాస్, వెండి చెంచా వాడే సంప్రదాయం కొనసాగుతోంది. అంతేకాదు, వెండి సహజంగా బ్యాక్టీరియాను తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే పాతకాలంలో చిన్న గాయాలకు కూడా వెండి పూత వాడేవారు. అలాగే పండుగల సమయంలో, ముఖ్యంగా శుభకార్యాల్లో వెండి నాణేలను కానుకగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఇక పరిశ్రమల ప్రపంచంలో కూడా వెండి ఒక ట్రెండీ హీరోనే. ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ అడుగుపెట్టి రోజువారీ నగలు, స్టయిలిష్ అండ్ సింపుల్ గొలుసులు, మోడ్రన్ జ్యూలరీ డిజైన్ల రూపంలో అందరి చేతుల్లో మెరిసిపోతోంది. సింపుల్‌గా చెప్పాలంటే సంప్రదాయం, ఆరోగ్యం, స్టయిల్, అందుబాటు ఈ నాలుగు కలిసి వెండిని ఒక స్మార్ట్ చాయిస్‌గా నిలబెడుతున్నాయి.పలేడియమ్ – సైలెంట్ స్టార్పలేడియమ్ ప్లాటినమ్ కుటుంబానికి చెందిన అరుదైన లోహం. అందుబాటు కొంచెం తక్కువే, కానీ స్టయిల్లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది. మొదట్లో ఇది పెద్దగా ఫ్యాషన్ లో కనిపించలేదు. కాని, ఇప్పుడు వెడ్డింగ్ రింగ్స్, ప్రీమియం డైలీ వేర్ జ్యూలరీలో ఇది సైలెంట్‌గా ట్రెండ్ సెట్ చేస్తోంది. సహజంగా తెల్లటి మెరుపుతో ఉండటం వల్ల ప్రత్యేక కోటింగ్ అవసరం లేకుండా సింపుల్‌గా మెరిసిపోతుంది. మెయింటెనెన్స్ తక్కువ, బరువు తక్కువ, లుక్ మాత్రం హై–ఎండ్. ఇదే దీని అసలు స్టయిల్ సీక్రెట్. 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు.ఆ తర్వాత కాలక్రమేణా జ్యూలరీ ప్రపంచం దాని ప్రత్యేకతను గుర్తించింది. ముఖ్యంగా వైట్ గోల్డ్‌కు ఒక సులువైన ప్రత్యామ్నాయంగా దీనిని భావిస్తున్నారు. ధర విషయానికి వస్తే, పలేడియమ్కు కూడా కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. కొన్ని రోజులు బంగారంతో పోలిస్తే తక్కువ ధరలో ఉంటుంది, మరికొన్ని రోజులు ‘నేను కూడా లగ్జరీనే!’ అని అంటుంది. బడ్జెట్‌కి పెద్ద షాక్ ఇవ్వకుండా లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే స్మార్ట్ ఎంపికగా పలేడియమ్ నిలుస్తోంది.టైటానియమ్ – ఫ్యూచర్ మెటల్ టైటానియమ్ అంటే మోడర్న్ జ్యూలరీ ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్. బరువు తక్కువ, బలం ఎక్కువ. ఇదే దీని అసలైన స్టయిల్. చేతిలో పెట్టుకున్నప్పుడు లైట్‌గా అనిపించినా, మన్నికలో మాత్రం స్టీల్‌కే చాలెంజ్ చేస్తుంది. అందుకే స్పోర్టీ లుక్ కోరుకునే వారికి టైటానియమ్ బెస్ట్ చాయిస్. అయితే, టైటానియమ్ మొదట విమానాలు, రాకెట్ల తయారీలో ఉపయోగించారు.అక్కడ తన దారుఢ్యాన్ని నిరూపించుకున్న తర్వాతే ఇది ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మెన్స్ జ్యూలరీ, స్మార్ట్ వాచ్ స్ట్రాప్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్‌లో ఇది ఫుల్ స్పీడ్‌తో ట్రెండ్ అవుతోంది. ఇది తుప్పు పట్టదు, స్క్రాచ్‌లు తక్కువగా పడతాయి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. పైగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి కూడా సేఫ్. దీంతో, అలెర్జీ సమస్యలు తక్కువగా ఉంటాయి. అందుకే రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతుంది. ఇది బంగారంతో పోలిస్తే చాలా తక్కువ ధరలో లభిస్తుంది.బంగారం రంగుల రహస్యం.. బంగారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దాని పసుపు రంగు మెరుపు. అయితే, బంగారం కేవలం ఒక రంగు కథ మాత్రమే కాదు, అది ఒక రంగుల పండుగ. శతాబ్దాలుగా మనుషులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ విలువైన లోహం, కాలంతో పాటు కొత్త కొత్త అవతారాలు తీసుకుంటూ ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్స్‌ను సృష్టిస్తోంది. పసుపు నుంచి తెలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఇంకా నీలం, నలుపు వరకు ఇలా ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేక కథ, ప్రత్యేక మిశ్రమం, ప్రత్యేక స్టయిల్ దాగి ఉంది.యెల్లో గోల్డ్ – సంప్రదాయానికి చిరునామా..బంగారం అసలైన రూపం యెల్లో గోల్డ్. ఇది శతాబ్దాలుగా సంపద, రాజసం, శుభం అనే భావాలకు ప్రతీకగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం అత్యంత శుద్ధమైన రూపం. దాదాపు 99.9 శాతం బంగారం ఉంటుంది. కానీ అది చాలా మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారెట్లు, 18 క్యారెట్లు లాంటి మిశ్రమాలను ఎక్కువగా వాడుతారు. పెళ్లి నగలు, గొలుసులు, సంప్రదాయ ఆభరణాలు తదితరమైన వాటన్నింటికీ ఇప్పటికీ ఇది మొదటి ఎంపిక. అలెర్జీ సమస్యలు తక్కువగా ఉండటం, మెరుపు ఎక్కువ కాలం నిలవడం, సింపుల్‌గా మెయింటైన్ చేయగలగడం దీని ప్రధాన ప్లస్ పాయింట్స్. అయితే ఎక్కువ క్యారెట్ల బంగారం కొంచెం సాఫ్ట్‌గా ఉండటం వల్ల సులభంగా గీతలు పడే అవకాశం ఉంటుంది. అయినా కూడా ‘క్లాసిక్ లుక్’ అంటే ఇప్పటికీ యెల్లో గోల్డ్‌నే.వైట్ గోల్డ్ – స్టయిల్‌కు సిల్వర్ టచ్ వైట్ గోల్డ్ అంటే మోడ్రన్ ఫ్యాషన్ కు సింబల్. సాధారణ పసుపు బంగారానికి భిన్నంగా, బంగారంలో నికెల్, పలేడియమ్ లేదా వెండిలాంటి ఇతర తెల్లటి లోహాలను కలిపి ఈ ప్రత్యేక రంగు బంగారాన్ని తయారు చేస్తారు. తర్వాత దీనిపై రోడియమ్ అనే మెటల్‌తో కోటింగ్ వేయడం వల్ల ఇది మరింత ప్రకాశవంతంగా, ప్లాటినమ్లా మెరిసే లుక్‌ను ఇస్తుంది. చరిత్రలో చూస్తే, 1920ల కాలంలో ప్లాటినమ్ చాలా ఖరీదుగా ఉండటంతో, తక్కువ ఖర్చులో అందించడానికి వైట్ గోల్డ్ ప్రాచుర్యం పొందింది.అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది మోడ్రన్ జ్యూలరీలో ఒక ముఖ్యమైన ట్రెండ్‌గా కొనసాగుతోంది. ఇది స్ట్రాంగ్‌గా ఉండటం, స్క్రాచ్‌లు తక్కువగా కనిపించడం దీని ప్రత్యేకత. అయితే రోడియం కోటింగ్ కొంతకాలానికి తగ్గిపోవచ్చు కాబట్టి అప్పుడప్పుడు మళ్లీ కోటింగ్ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా స్లీక్, స్మార్ట్, మోడ్రన్ లుక్ కోసం వైట్ గోల్డ్ బెస్ట్ చాయిస్.గ్రీన్ గోల్డ్ – అందాల ఆకుపచ్చ మెరుపుగ్రీన్ గోల్డ్ కొంచెం డిఫరెంట్ అండ్ రేర్. బంగారంలో ఎక్కువ శాతం వెండి కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. పాత కాలంలో దీనిని ‘ఎలెక్ట్రం’ అని పిలిచేవారు. ఇది మార్కెట్లో ఎక్కువగా కనిపించదు. కాని, ఫ్యాషన్‌లో చాలా పాత ట్రెండ్. ప్రాచీన రాజులు, కళాకారులు ప్రత్యేక ఆభరణాల కోసం ఈ మిశ్రమాన్ని వాడేవారు, ఎందుకంటే ఇది బంగారంతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపించేది.కొన్నిసార్లు రాగిలాంటి లోహాలను కూడా బంగారంలో కొద్దిగా కలిపి మరింత స్ట్రెంగ్త్ ఇస్తారు. ఇది కాస్త నేచురల్ గ్రీన్ టచ్‌లా సాఫ్ట్‌గా కనిపిస్తుంది. కాలక్రమేణా ఇందులో ఉన్న వెండి కారణంగా రంగు కొంచెం డార్క్ కావచ్చు, అదే దానికి ఒక యూనిక్ క్యారెక్టర్‌ను ఇస్తుంది. భారతీయ దుస్తులైనా, వెస్ట్రన్ ఔట్ఫిట్లైనా ఏ స్టయిల్కైనా ఇది మ్యాచ్ అవుతుంది. కొంచెం డిఫరెంట్, క్లాసీ లుక్ కావాలని అనుకునే వారికి గ్రీన్ గోల్డ్ ఒక బెస్ట్ చాయిస్.రోజ్ గోల్డ్ – ప్రేమకు గులాబీ మెరుపు స్టయిల్లో సాఫ్ట్‌నెస్ ఇచ్చేదే ఈ రోజ్ గోల్డ్. దీని రంగు కాస్త రొమాంటిక్ లుక్ ఇస్తుంది. బంగారంలో రాగి ఎక్కువగా కలిపితే ఈ అందమైన గులాబీ టోన్ వస్తుంది. అందుకే దీనిని ‘పింక్ గోల్డ్’ అని, పాతకాలంలో ‘రష్యన్ గోల్డ్’ అని పిలిచేవారు, ఎందుకంటే 19వ శతాబ్దంలో రష్యాలో ఇది మొదట ప్రాచుర్యం పొందింది. చరిత్రలో రాజ కుటుంబాలు, ప్రత్యేక సందర్భాల ఆభరణాల్లో ఈ రంగును ఉపయోగించేవారు.ఇది సాఫ్ట్‌గా కనిపించినా, రాగి కారణంగా ఇతర గోల్డ్ రకాల కంటే కొంచెం బలంగా ఉంటుంది. పైగా దీని రంగు కాలక్రమేణా తగ్గిపోకుండా స్థిరంగా ఉంటుంది. అన్నిరకాల చర్మానికి ఈ రంగు సూట్ అవ్వడం వల్ల యువతలో ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రింగ్స్, గిఫ్ట్ జ్యూలరీ, డైలీ వేర్ ఆభరణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రొమాంటిక్‌గా, ట్రెండీగా కనిపించాలనుకునే వారు రోజ్ గోల్డ్ ఎంచుకోవటం మంచిది.బ్లూ గోల్డ్ – అరుదైన నీలి మెరుపుజ్యూలరీలో రేర్ స్టార్ బ్లూ గోల్డ్. బంగారంలో ఇండియమ్ లేదా ఐరన్ వంటి లోహాలను కలిపి, నియంత్రిత ప్రక్రియలో ఆక్సిడేషన్ చేయడం వల్ల దీనికి నీలి రంగు వస్తుంది. ఈ షేడ్ గాఢంగా కాకుండా, మెటాలిక్ టచ్‌తో సాఫ్ట్‌గా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ రకం బంగారం ఎక్కువగా ఆధునిక కాలంలోనే అభివృద్ధి చెందింది, ముఖ్యంగా ప్రత్యేక డిజైన్లు, ఆర్టిస్టిక్ జ్యూలరీ కోసం దీనిని ఉపయోగించేవారు. ఇది మార్కెట్లో అసలు కనిపించదు; ఎక్కువగా స్టేట్మెంట్ జ్యూలరీ, కలెక్షన్ పీసెస్, ప్రత్యేక ఆర్డర్ డిజైన్లలో మాత్రమే కనిపిస్తుంది. తయారీ ప్రక్రియ క్లిష్టంగా ఉండటం, నైపుణ్యం అవసరం కావడం వల్ల దీని ధర కూడా ఎక్కువే. బ్లూ గోల్డ్ ఎక్కువగా కలెక్షన్ ఐటమ్స్ లేదా ప్రత్యేక సందర్భాల కోసం మాత్రమే తయారు చేస్తారు, అందుకే బ్లూ గోల్డ్ ఒక లగ్జరీ స్టేటస్‌గా నిలుస్తోంది.బ్లాక్ గోల్డ్ –బోల్డ్ స్టయిల్ బ్లాక్ గోల్డ్ అంటే బోల్డ్ స్టేట్మెంట్. ఇది సహజంగా ఏర్పడే రంగు కాదు. ప్రత్యేక టెక్నాలజీ, కోటింగ్ లేదా ట్రీట్మెంట్ ద్వారా తయారు చేసే మిశ్రమం. రోడియం ప్లేటింగ్, ఆక్సిడేషన్ లేదా లేజర్ ట్రీట్మెంట్ వంటి ఆధునిక పద్ధతులతో బంగారానికి ఈ నలుపు రంగు అందిస్తారు. ముఖ్యంగా మోడ్రన్ జ్యూలరీ ట్రెండ్స్ పెరిగిన తర్వాత ఎక్కువగా పురుషుల జ్యూలరీ, హై ఫ్యాషన్ డిజైన్లు, స్టేట్మెంట్ రింగ్స్, బ్రేస్లెట్స్లో ఇది కనిపిస్తుంది. జ్యూలరీతో అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే బ్లాక్ గోల్డ్ ఒక ట్రెండీ ఆప్షన్.కొత్త డిజైన్లు..బంగారం ధరలు రోజు రోజుకీ పైకి ఎగబాకుతున్నాయని, స్టయిల్లో తగ్గాల్సిన అవసరం లేదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం స్మార్ట్‌గా డిజైన్స్ ఎంపిక చేసుకుంటే, తక్కువ ఖర్చులోనే అందమైన నగలను పొందుతూ అందం, ఆనందం రెండింటినీ ఆస్వాదించవచ్చు.అవతారాలు ఎత్తే ఆభరణంఒకే నగను మూడు విధాలుగా మార్చుకునే డిజైన్లు ఇప్పుడు చాలా పాపులర్. పెద్ద హారం నుంచి చిన్న చైన్‌గా, లేదా లాంగ్ నెక్లెస్‌ను రెండు చిన్న నెక్లెస్లుగా మార్చుకోవచ్చు. ఒకసారి కొనుగోలు చేసి, మూడు సందర్భాల్లో వివిధ విధాలుగా వాడుకోవచ్చు.పాతకు కొత్త రూపం పాతకాలపు ఆభరణాలను కొత్తగా మార్చి, ఆధునిక డిజైన్స్ తో కలిపి తయారు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. దీంతో పాత బంగారం అమ్మి కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా, వాటినే కొత్తగా మార్చుకోవచ్చు. పెళ్లి కూతురి నగలలో కూడా కొత్త ఆకృతులు, కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు బంగారం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, సృజనాత్మకతకు కొత్త వేదిక.హాలో టెక్నిక్ ఈ టెక్నిక్ ఒక చిన్న మ్యాజిక్లాంటిది. నగ లోపల ఖాళీగా ఉండేలా తయారు చేస్తారు. బయట నుంచి చూస్తే మాత్రం పెద్దగా, ఘనంగా కనిపిస్తుంది. 40 గ్రాముల్లా కనిపించే నెక్లెస్ అసలు బరువు 20 నుంచి 25 గ్రాములే ఉండొచ్చు. పాతకాలపు భారీ టెంపుల్ జ్యూలరీ కూడా ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ లో వస్తోంది. అంటే స్టయిల్ డబుల్, ఖర్చు హాఫ్.రెండు మెరుపులు బంగారాన్ని ఇతర లోహాలతో కలిపి తయారు చేసే మిక్స్డ్ మెటల్ డిజైన్స్ ఇప్పుడు ఫ్యాషన్ లో టాప్‌లో ఉన్నాయి. ఒకే నగలో రెండు రంగుల మెరుపు కనిపించడం వల్ల అది కొత్తగా, మోడర్న్‌గా కనిపిస్తుంది. ఖర్చు తగ్గుతుంది, డిజైనర్ లుక్ కూడా వస్తుంది.పూత పరి^è యాలుఈ టెక్నిక్‌లో నగ పూర్తిగా బంగారంతో కాకుండా, పైపైన మాత్రమే బంగారం పొర వేస్తారు. దీంతో అది గోల్డ్‌లా మెరిసిపోతుంది, కానీ ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వన్ గ్రాము గోల్డ్ లాంటివే కనిపిస్తాయి, కానీ అసలు బంగారం కాదు. పార్టీలు, ఫంక్షన్ లలో గ్రేస్ చూపించడానికి ఇది సూపర్ చాయిస్.తక్కువలో ఎక్కువ అందం. ఇప్పటి యువత ఎక్కువ నగలు ధరించడం కన్నా, ఒకే నగతో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఒక చిన్న గొలుసు, ఒక అందమైన ఉంగరం, ఒక జత చెవిపోగులు. ఇవే ఇప్పుడు పూర్తి అలంకరణగా మారుతున్నాయి. సాదాసీదాగా, కానీ ఆకర్షణీయంగా కనిపించడం – అందానికి ఇదే నేటి కొత్త మంత్రం.సంప్రదాయం చిన్న ప్యాక్‌లో జ్యూలరీలో ‘లైట్ ఈజ్ రైట్’ అనే ట్రెండ్ సూపర్ హిట్‌గా మారింది. పెద్దగా కనిపించే హారం అయినా, చెవి రింగులు అయినా లోపల స్మార్ట్‌గా తక్కువ బంగారంతో డిజైన్ చేసి, బయటకు మాత్రం బీడ్స్, రంగురంగుల స్టోన్స్ , మెరిసే ముత్యాలు జోడించి ఫుల్ రిచ్ లుక్ తీసుకొస్తున్నారు. చేతిలో పెట్టుకుంటే బరువు తక్కువగా ఉంటుంది, కానీ చూసినవారికి మాత్రం ‘ఇది ఎంత గ్రాండ్‌గా ఉంది!’ అనిపించేలా మెరుస్తుంది.కాలం మారుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి, బంగారం ధర రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయినా మన ఇంట్లో ఒక మాట మాత్రం మారదు. ‘బంగారం కొంటేనే భద్రత’ అనే నమ్మకం. అందుకే, బంగారం ఎప్పటికీ ప్రత్యేకమే! ∙ దీపిక కొండి -
గోల్డ్ ధర.. గుండె దడ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం, వెండికి అమ్మకాల సెగ!
అమ్మకాల ఒత్తిడికి పసిడి, వెండి నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.5,700 తగ్గి (2.2 శాతం) రూ.2.53 లక్షలకు, బంగారం 10 గ్రాములకు రూ.1,600 (1 శాతం) నష్టపోయి రూ.1,56,200 స్థాయిలకు దిగొచ్చాయి. కాల్పుల విరమణ పరిణామాలకు సంబంధించి వారాంతంలో వచ్చే తాజా అప్డేట్లకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.తాజా సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో బంగారం స్థిరీకరణ దశలో కొనసాగినట్టు చెప్పారు. హార్ముజ్ జలసంధితి పూర్తిగా తెరుస్తునట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి దూసుకెళ్లాయి. గోల్డ్ ఔన్స్‌కు 2 శాతం పెరిగి 4,900 డాలర్ల పైకి చేరింది. సిల్వర్ ఔన్స్‌కు 5 శాతానికి పైనే పెరిగి 83 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. సానుకూల పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ గరిష్ట స్థాయిల్లో బంగారం నిలదొక్కుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
అక్షయ తృతీయ ముందు మహిళలకు గుడ్ న్యూస్...
-
పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!
భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్‌తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే, 2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.ఏడాదిలో 60 శాతం పెరుగుదలగత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్‌కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్‌తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు. -
వరుసగా మూడో రోజు పెరిగిన గోల్డ్ రేటు.. అక్షయ తృతీయ ముందు మహిళలకు షాక్
-
అక్షయ తృతీయ ముందు దెబ్బకొట్టిన గోల్డ్ రేట్...
-
గోల్డ్ ఈటీఎఫ్‌లు మెరిశాయ్
న్యూఢిల్లీ: బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు మార్చి త్రైమాసికంలో ఇన్వెస్టర్ల నుంచి బలమైన ఆదరణ కనిపించింది. రూ.31,561 కోట్ల తాజా పెట్టుబడులను ఇవి ఆకర్షించాయి. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులతో పోల్చితే ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం. అంతేకాదు 2025–26 డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ.23,132 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూసినా 36 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన డేటా ప్రకారం.. మార్చి నెలలో మాత్రం పెట్టుబడుల రాక బలహీనపడింది.మార్చి నెలలో కేవలం రూ.2,266 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో రూ.24,040 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,255 కోట్లతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. బంగారం ధరలు గత రెండేళ్లలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం తెలిసిందే. ఫలితంగా ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌లవైపు మొగ్గు చూపడం పెరిగింది. దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వీటిల్లోకి వచ్చాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు అమ్మకాల ఒత్తిడికి కొంత తగ్గిన నేపథ్యంలో, ఈటీఎఫ్ పెట్టుబడులపై ఇది ప్రభావం చూపించనట్టు తెలుస్తోంది. రూ.1.71 లక్షల కోట్ల ఆస్తులు గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) మార్చి చివరికి రూ.1.71 లక్షల కోట్లకు చేరాయి. 2025 మార్చి చివరికి వీటి విలువ రూ.58,888 కోట్లతో పోల్చితే మూడు రెట్లు పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోలు (ఒక ఈటీఎఫ్‌లో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) గత ఆర్థిక సంవత్సరంలో 54.28 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోలు 1.24 కోట్లకు చేరాయి. ‘‘జనవరిలో పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్ (మార్పులు, చేర్పులు), రిస్క్ తీసుకునే ధోరణి ఫలితంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు అధికంగా వచ్చాయి.దీంతో తర్వాతి నెలల్లో పెట్టుబడులు బలహీనంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మార్చి నెలలో సానుకూల పెట్టుబడులు నమోదవడం అన్నది మార్కెట్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో బంగారాన్ని వైవిధ్యమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారనేదానికి సంకేతం’’అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. బంగారంతో పోల్చితే ఈక్విటీల వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా మారినందున మార్చి నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు తగ్గడానికి కారణమని ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ సీఐవో (డెట్) ఉమేష్ శర్మ చెప్పారు. -
ఊహించని దెబ్బ కొట్టిన బంగారం.. కొనాలనుకునే వారికి బిగ్ షాక్..
-
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో తగ్గిన ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!
పెరుగుదల దిశగా అడుగులు వేసిన గోల్డ్ రేటు ఈ రోజు (సోమవారం) తగ్గుదల వైపు పయనించింది. దీంతో బంగారం ధర కొంతమేర తగ్గింది. దీనికి కారణం యూఎస్ డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు అని తెలుస్తోంది. అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడం కూడా బంగారం ధరలు పెరుగుదలకు మరో కారణం అయింది.శాంతి చర్చలు విఫలమైన తర్వాత, ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా - ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఈ సంఘటనల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్లు దాటాయి.చమురు ధరలు పెరగడం అంటే రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం. దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్, వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇష్టపడవు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులు తగ్గుతాయి. అందువల్ల బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉంది.2026 ప్రారంభంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే కియోసాకి వంటి విశ్లేషకులు గోల్డ్ రేటు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడి పెడితే ధనవంతులవుతారని చెబుతున్నారు. -
బంగారం ధరల్లో భారీ మార్పు: అంతలోనే ఇంతలా..
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వారాంతంలో కొంత పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పు జరిగింది. ఈ కథనంలో వారం రోజుల్లో బంగారం ధరలు పెరిగాయా?, తగ్గాయా?, అనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 5 (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,840 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ.. తగ్గుతూ, మొత్తం మీద 1910 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,350 రూపాయల నుంచి 1,40,100 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో పెరుగుదల దిశగానే అడుగులు వేసింది. ఏప్రిల్ 5న 1,52,180 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,53,820 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,39,500 రూపాయల నుంచి 1,41,000 రూపాయల (రూ.1500 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా ధరల పెరుగుదల కనిపించింది. ఏప్రిల్ 5న దేశ రాజధాని నగరంలో 1,51,080 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,990 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,500 రూపాయల నుంచి 1,40,250 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది. -
బంగారం ధరల్లో మార్పు.. అమాంతం తగ్గిన రేటు!
శుక్రవారం ఉదయం.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు సాయంత్రానికే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేటులో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ కథనంలో లేటెస్ట్ పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,40,250 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి 1,39,650 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే రేటు రూ.600 తగ్గినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.1,53,000 నుంచి రూ.152350 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు జరిగింది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల తులం బంగారం 1,53,150 రూపాయల నుంచి రూ.1,52,500 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,40,400 రూపాయల నుంచి 1,39,800 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల తులం రేటు 1,41,250 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,090 రూపాయల వద్ద ఉంది. అంటే ఈ రోజు ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎలాంటి తేడా లేదు.వెండి ధరలువెండి ధరలు ఈ రోజు పెరుగుదల దిశగా పయనించాయి. దీంతో కేజీ సిల్వర్ ధర హైదరాబాద్‌లో 2.65 లక్షలు. కాగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలు వద్ద ఉంది. -
బంగారం అమ్మేసుకుంటున్న దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ మేఘాలు దేశాల పసిడి నిల్వలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా భావించిన బంగారాన్ని ఇప్పుడు కొన్ని దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం, ముఖ్యంగా యుద్ధ వ్యయాల కోసం విక్రయిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వివిధ దేశాల పసిడి నిల్వల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం..యుద్ధం తెచ్చిన మార్పులేంటి?ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సాధారణంగా తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పటిష్టం చేసుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలు పసిడి నిల్వలను పెంచుకుంటుంటే, యుద్ధంలో చిక్కుకున్న కొన్ని దేశాలు మాత్రం నిల్వలను అమ్ముకుంటున్నాయి.బంగారం అమ్ముతున్న దేశాలు ఇవే..ఇటీవలి నివేదికల ప్రకారం.. మూడు ప్రధాన దేశాలు తమ పసిడి నిల్వలను విక్రయించడం లేదా తగ్గించుకోవడం చేస్తున్నాయి.రష్యా: ఉక్రెయిన్‌తో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా తన పసిడి నిల్వలను విక్రయించక తప్పడం లేదు. యుద్ధ వ్యయాలను భరించడానికి, పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి బయటపడటానికి రష్యా 2025 నుండి నిరంతరంగా బంగారాన్ని విక్రయిస్తోంది. ఫిబ్రవరి 2026 నాటికి రష్యా పసిడి నిల్వలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి (సుమారు 2,327 టన్నులకు) పడిపోయినట్లు తెలుస్తోంది.టర్కీ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన కరెన్సీ 'లిరా' విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి టర్కీ సుమారు 60 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు సమాచారం. దీని విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు.పోలాండ్: గతంలో పసిడి కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉన్న పోలాండ్, ఇప్పుడు తన రక్షణ బడ్జెట్ కోసం నిల్వలను వినియోగించుకోవాలని యోచిస్తోంది.భారత్ పరిస్థితి ఇలా..ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 880.18 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. దీని విలువ ఫిబ్రవరి 2026 నాటికి రికార్డు స్థాయిలో 131.63 బిలియన్ డాలర్లకు చేరింది.ర్యాంకుదేశంనిల్వలు (టన్నుల్లో)నిల్వల విలువ (బిలియన్ డాలర్లలో)1అమెరికా81331,250+2జర్మనీ33505623ఇటలీ24524204ఫ్రాన్స్24374085రష్యా23273806చైనా23073877స్విట్జర్లాండ్10401758జపాన్8461429భారత్88013110నెదర్లాండ్స్612102 -
ETFలో ఇన్వెస్ట్ చేసినవారికి పండగే... భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్
-
మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
-
గంటల వ్యవధిలో.. మారిపోయిన గోల్డ్, సిల్వర్ రేటు!
బంగారం ధరలు ఈ మధ్య కాలంలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మారిపోతున్నాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేట్లలో చాలా మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయం ఈ కథనంలో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు (ఏప్రిల్ 6) ఉదయం రూ.1,36,700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,38,100 రూపాయల వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,49,130 నుంచి రూ.1,50,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో బంగారం ఉదయం అమాంతం తగ్గి.. సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,50,660 రూపాయల దగ్గర నుంచి 1,52,620 రూపాయల వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,100 నుంచి రూ.1,39,900 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150810 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,38,250 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఉదయం ధరలు స్థిరంగా ఉండటం చేత రూ.2.55 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.2.60 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు మళ్లీ దూసుకెళ్తుందా అనే అనుమానం కలుగుతోంది. -
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు."బ్యాడ్ న్యూస్.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు1974 వరకు అమెరికా డాలర్‌కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్‌కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్‌తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అప్పుల ఊబిలో అమెరికాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం (Gold), వెండి (Silver), బిట్‌కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా.."1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్‌ను ముగించారు.BAD NEWS: History has ARRIVED.1974 was a future changing year. 1974 marked two massive changes in our world’s future.Our problem is….in 2026, our future is here.The two 1974 future changing events were:1974 the US dollar became the Petro dollar. Rather than backed by…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 4, 2026 -
దేవుని సొమ్ముకే ఎసరు.. ఆలయాల్లో బంగారం మాయం!
తిరువనంతపురం: శబరిమల తరహాలోనే కేరళలోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో స్వామివారి ఆభరణాలు కనుమరుగవుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సరైన పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ లేకపోవడంతో గుడిలోని దేవుని సొమ్ముకే రక్షణ లేకుండా పోయింది.కొచ్చికి చెందిన ఆర్టీఐ కార్యకర్త కె. గోవిందన్ నంబూతిరి దాఖలు చేసిన దరఖాస్తుకు.. కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిధిలోని త్రిస్సూర్ గ్రూప్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇచ్చిన సమాధానాలతో ఈ విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. గతంలో శబరిమల ఆలయంలో వెలుగుచూసిన ఆరోపణల మాదిరిగానే.. ఇప్పుడు త్రివేండ్రంలోని శ్రీవరాహం ఆలయం, కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిధిలోని పుల్లు భగవతి ఆలయం, త్రిపుణితుర పూర్ణత్రయీశన్ ఆలయాల నుంచి స్వామివారి బంగారం మాయమైనట్లు అధికారికంగా నిర్ధారణ అయింది.ఏ గుడిలో ఎంత మాయమైందంటే..పుల్లు భగవతి ఆలయం: కొచ్చిన్ దేవస్వం బోర్డు త్రిస్సూర్ గ్రూప్ కిందకు వచ్చే ఈ గుడిలో ఏకంగా 40.50 గ్రాముల బరువున్న ఏడు బంగారు గొలుసులు అదృశ్యమయ్యాయి.శ్రీవరాహం ఆలయం: ఇక్కడ 7.750 గ్రాముల బరువున్న రెండు పురాతన బంగారు గొలుసులు కనిపించలేదు. త్రిపుణితుర పూర్ణత్రయీశన్ ఆలయం: ఈ ప్రసిద్ధ ఆలయంలో స్వామివారి కిరీటం నుంచి 663 మిల్లీగ్రాముల బంగారం మాయమైంది.నిర్వహణలో డొల్లతనంపలు దేవస్వం బోర్డు ఆలయాల్లో స్వామివారి ఆభరణాలకు (తిరువాభరణం) సంబంధించి కనీస రిజిస్టర్లను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఈ ఆర్టీఐ నివేదిక ద్వారా వెల్లడయ్యింది. అధికారుల బాధ్యతారాహిత్యానికి, నిల్వల ట్రాకింగ్‌లో ఉన్న లోపాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. కాగా శబరిమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశ్ దర్శన్’ పథకం కింద మంజూరు చేసిన నిధుల వినియోగంపై కూడా నంబూతిరి కీలక వివరాలు వెల్లడించారు. ఆర్టీఐ పత్రాల ప్రకారం.. కేంద్రం రూ.46.53 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు కేవలం రూ.36.27 కోట్లు మాత్రమే వినియోగించినట్లు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: పాక్‌లో ‘పెట్రో’ మంట: ప్రధాని మాస్టర్ ప్లాన్ ఇదే! -
గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే?
వారం రోజులుగా బంగారం ధరల హెచ్చు తగ్గులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే వారాంతంలో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు జరిగాయి, ధరలు ఎక్కడకు చేరాయి అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 29న 1,48,090 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ రోజుకి (శనివారం) 1,50,930 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 2840 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది. 22 క్యారెట్ల తులం రేటు 1,35,750 రూపాయల దగ్గర నుంచి 1,38,350 రూపాయల (రూ.2600 పెరిగింది) వద్ద నిలిచింది.చెన్నైలో స్వచ్ఛమైన తులం బంగారం (24 క్యారెట్స్) ధర 1,49,020 రూపాయల దగ్గర నుంచి రూ.1,52,180 వద్ద (రూ.3160 పెరిగింది) నిలిచింది. 22 క్యారెట్ల రేటు ఏడు రోజుల్లో 1,36,600 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,500 (రూ.2900 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వారం రోజుల్లో అమాంతం పెరిగాయి. మార్చి 29న 1,48,220 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు.. ఏప్రిల్ 4 నాటికి 1,51,080 రూపాయలు (రూ.2860 పెరిగింది) పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 135900 రూపాయల నుంచి 138500 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే బంగారం ధరలు వారం రోజుల్లో భారీగా పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు!
-
బంగారం vs వెండి: పెట్టుబడికి ఏది బెస్ట్?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు వంటి సందర్భాల్లో బంగారం ధరలు పెరగడం అనేది సర్వ సాధారణం. అయితే.. ఈ సంవత్సరం (ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం) పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, బంగారం ధరలు పెరగకపోవడం పెట్టుబడిదారులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.యుద్ధం సమయంలో బంగారం ధరలు పెరగకపోవడం వల్ల.. పెట్టుబడిదారులలో ఒక అనుమానం మొదలైంది. బంగారం కంటే వెండి మంచి పెట్టుబడిగా మారుతుందా?. దీనికి కారణం సిల్వర్ రేటు అమాంతం పెరగడమే.గోల్డ్-సిల్వర్ రేషియోఇక పెట్టుబడిదారుల ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ముందుగా గోల్డ్-సిల్వర్ రేషియో గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రేషియో ఒక యూనిట్ బంగారం ధరకు సమానంగా ఉండే వెండి పరిమాణాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ రేషియో 60 కంటే ఎక్కువగా ఉండటం వల్ల, వెండి.. బంగారంతో పోలిస్తే చవకగా ఉందని అర్థమవుతోంది.నిజానికి వెండి అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు. దీనిని పరిశ్రమల్లో కూడా కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి, ఇతర తయారీ రంగాలలో వెండికి మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా.. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు వెండి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంతమంది నిపుణులు వెండిపై పెట్టుబడి చాలా ఉత్తమం అని అంటున్నారు.వెండిపై పెట్టుబడి - జాగ్రత్త!ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. వెండిలో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సేఫ్ అని చెప్పలేము. ఎందుకంటే ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ.. ఒక్కసారిగా భారీగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పెట్టుబడిదారులకు పెద్ద నష్టాలను కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, వెండిపై పెట్టుబడి పెట్టే విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.బంగారం విలువను కోల్పోదు!ఇక బంగారం విషయానికి వస్తే.. ఇది చాన్నాళ్లుగా, ఇప్పటికీ ఒక విశ్వసనీయమైన, సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత, కరెన్సీ విలువ తగ్గడం వంటి పరిస్థితుల్లో బంగారం స్థిరత్వాన్ని అందిస్తుంది. కాబట్టి బంగారం ఎప్పుడూ.. దాని విలువను కోల్పోదు.సమతుల్యత ఉత్తమం!పెట్టుబడిదారులు ఎప్పుడూ కూడా.. ఒక లోహాన్ని పూర్తిగా వదిలి మరొకదానిలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. బంగారం స్థిరత్వాన్ని అందిస్తే, వెండి వృద్ధి అవకాశాలను అందిస్తుంది. కాబట్టి.. పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి బంగారం, వెండి మధ్య సమతుల్యతను పాటిస్తూ పెట్టుబడి పెట్టడం ఉత్తమం.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం! -
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..
నాలుగైదు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం ఓ మోస్తరుగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి భారీగా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఒకింత ఆనందాన్ని కలిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ.1,38,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి రూ.1,36,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,51,420 రూపాయల నుంచి 148970 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు ఎంతలా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర 149120 రూపాయల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద ఉంది. ఉదయం ఈ ధరలు వరుసగా రూ.151570, రూ. 138950 వద్ద ఉన్నాయి.చెన్నైలో కూడా సాయంత్రానికి బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,50,000 వద్ద ఉంది. 22 క్యారెట్ల రేటు 137500 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ రేటు రూ.10000 తగ్గడంతో సిల్వర్ రూ.2.55 లక్షల వద్దకు చేరింది. ఈ రేటు ఢిల్లీలో 2.50 లక్షల రూపాయల వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరంలో వెండి రేటు కొంత తక్కువే.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు! -
బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు
దేశంలో బంగారం, వెండిపై పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సెబీ (SEBI) తీసుకున్న కొత్త నిర్ణయాలు, పన్ను విధానాల్లో మార్పులు మీ లాభాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఆ మార్పులేంటో ఓసారి పరిశీలిద్దాం.అంతర్జాతీయ ధరలకు స్వస్తి! ఇప్పటి వరకు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల (ETF) ధరలను అంతర్జాతీయ ప్రమాణాల (LBMA) ఆధారంగా నిర్ణయించేవారు. కానీ ఏప్రిల్ 1 నుండి సెబీ (SEBI) కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఇకపై వీటి ధరలు భారతీయ ఎక్స్ఛేంజీల 'దేశీయ స్పాట్ ధర' (Domestic Spot Price) ఆధారంగానే నిర్ణయిస్తారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావం మన పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారులు భారత మార్కెట్ వాస్తవ ధరకే లావాదేవీలు జరపవచ్చు.గోల్డ్ బాండ్స్‌పై పన్ను పోటుఫిజికల్ గోల్డ్ కంటే సురక్షితమైనదిగా భావించే సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)విషయంలో ప్రభుత్వం పన్ను నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటి వరకు సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను మినహాయింపులు ఉండటంతో వీటిని ఉత్తమ పెట్టుబడిగా భావించేవారు. అయితే, కొత్త నిబంధనల ప్రకారం వీటిపై కూడా 'మూలధన లాభాల పన్ను' వర్తిస్తుంది.అయితే బాండ్లను జారీ చేసిన సమయంలో నేరుగా కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు ఉంచుకునే వారికి పన్ను మినహాయింపు కొనసాగుతుంది. అదే సెకండరీ మార్కెట్ (స్టాక్ మార్కెట్) ద్వారా బాండ్లను కొనుగోలు చేసిన వారు మాత్రం ఇకపై స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.డిజిటల్ గోల్డ్‌పై ప్రభుత్వ నిఘాడిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టే ప్రయోజనాలను పూర్తిగా పన్ను వలయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ పెట్టుబడులపై కూడా పారదర్శకమైన పన్ను విధానాన్ని తీసుకురావడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. -
దుర్గగుడి సిబ్బంది మాయాజాలం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అమ్మలగన్న అమ్మ.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ కానుకలకు రెక్కలొచ్చాయి. అమ్మవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించే బంగారు కానుకలను తరలిస్తున్న ఘటన సోమవారం రాత్రి వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ పేరిట రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువుల్ని ఆలయ సిబ్బంది పక్కదారి పట్టిస్తూ ట్రస్ట్ బోర్డు సభ్యులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.ఈ వ్యవహారాన్ని ఆలయ అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ఘటనకు కారణమైన ఉద్యోగితోపాటు మరికొందరికి ఆలయ అధికారులు మెమోలు జారీ చేశారు. మంగళవారం దేవదాయ శాఖ గోల్డ్ వెరిఫికేషన్ అధికారి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మహా మండపం ఆరో అంతస్తులోని కానుకల లెక్కింపు ప్రాంతంతో పాటు సోమవారం నాటి సీసీ కెమెరా ఫుటేజీని సైతం పరిశీలించారు. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదిక అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. 20 రోజులకు ఒకసారి లెక్కింపు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో 20 రోజులకొకసారి కానుకల లెక్కింపు జరుగుతుంది. హుండీలలో నగదుతో పాటు భక్తులు బంగారు, వెండి వస్తువులను కానుకగా సమరి్పస్తుంటారు. వీటిలో గ్రాము బరువు గల మంగళ సూత్రాలు, నాణేలు హుండీలో వస్తుంటాయి. కానుకల లెక్కింపు సమయంలో ఆలయ సిబ్బంది వాటిని వేరుచేసి దేవస్థానం లాకర్లో భద్రపరుస్తుంటారు. కొందరు రోల్డ్‌గోల్డ్ ఆభరణాలను సైతం హుండీలో వేస్తుంటారు. ఆలయ సిబ్బంది, పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది వాటిని గుర్తించి దగ్ధం చేస్తుంటారు. గోల్డ్‌ను రోల్డ్‌గోల్డ్‌లో కలిపేసి సోమవారం జరిగిన హుండీ లెక్కింపులో రోల్డ్‌గోల్డ్ వస్తువులతో పాటు బంగారు రేకుతో తయారు చేసిన మంగళసూత్రాలు, నాణేలను ఆలయ సిబ్బంది గుర్తించారు. అధికారులెవరికి అనుమానం రాకుండా బంగారు ఆభరణాలను రోల్డ్‌గోల్డ్ వస్తువుల్లో కలిపివేయడాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు గుర్తించారు. కొన్ని దఫాలుగా కానుకల లెక్కింపులో సదరు ఉద్యోగి తీరుపై అనుమానంతో నిఘా పెట్టారు. సోమవారం రోల్డ్‌గోల్డ్ వస్తువులలో బంగారు ఆభరణాలు, వస్తువులను వేయడంతో పక్కా ఆధారాలతో ఆ ఉద్యోగిని పట్టుకున్నారు.ఈ వ్యవహారం బయటకు రాకుండా కొందరు ఉద్యోగులు ప్రయత్నించినట్టు సమాచారం. మంగళవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆలయ వర్గాలు కలవరపడ్డాయి. కొన్ని నెలల క్రితం భక్తులు అమ్మవారికి సమర్పించిన ఆభరణాల్లో డైమండ్స్, విలువ కలిగిన రాళ్లను సైతం ఆలయ సిబ్బంది మాయం చేశారని జోరుగా ప్రచారం జరిగింది. బంగారాన్ని కరిగించే సమయంలో రాళ్లను పగులగొట్టి బంగారాన్ని వేరు చేశామని చెప్పడం గమనార్హం. మట్టీ మాయమవుతోంది ప్రతి 20 రోజులకు ఒకసారి జరిగే కానుకల లెక్కింపులో వచ్చిన రోల్డ్‌గోల్డ్ వస్తువులను మహా మండపం దిగువన ఆలయ సిబ్బంది, పోలీసు, సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో పెట్రోల్ పోసి దగ్ధం చేస్తారు. అయితే.. రోల్డ్‌గోల్డ్ వస్తువులను దగ్ధం చేసిన మట్టిని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లారేసరికి మాయం చేస్తున్నారు. ఈ మట్టి బంగారం శుద్ధిచేసే వారి వద్దకు చేరుతోంది. అంటే రోల్డ్‌గోల్డ్ ముసుగులో అసలైన బంగారు వస్తువుల్ని కూడా దగ్ధం చేసి.. మట్టిలో కరిగిపోయిన బంగారాన్ని మాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్రైజర్‌పై చర్యలు దుర్గగుడి గోల్డ్ అప్రైజర్ డి.షమ్మీపై చర్యలు తీసుకుంటూ ఆలయ ఈవో శీనానాయక్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలికంగా తొలగించినట్లు పేర్కొన్నారు. విధుల్లో అలసత్వంగా కారణంగా దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగిందని భావించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ]సీసీ కెమెరాలు, అధికారులు ఉన్నా..దుర్గగుడిలో కానుకల లెక్కింపును 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. లెక్కింపు జరుగుతున్నంత సేపు ఆలయ ముఖ్య అధికారులు, సిబ్బంది అక్కడే ఉన్నా చాకచక్యంగా బంగారు వస్తువులను రోల్డ్‌గోల్డ్ పేరిట బయటకు తరలించడం వెనుక ఆలయ అధికారుల పాత్ర, భద్రతా సిబ్బంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బంగారం ధరలు.. ఊహకందని మార్పులు!
ఇటీవల కాలంలో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే ఊహకందని విధంగా మారిపోతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే.. సాయంత్రానికి మరో రేటు ఉంది. ఈ రోజు కూడా ఇదే బాటలు గోల్డ్ రేటు అడుగులు వేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 136850 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 137050 రూపాయల వద్దకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి ధర రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ. 149290 నుంచి 149510 రూపాయల వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల ధర 10 గ్రాముల బంగారం ధర 149660 రూపాయల వద్దకు చేరగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 137200 రూపాయాల వద్దకు చేరింది. ఈ రేట్లు ఉదయానికి, సాయంత్రానికి చాలా తేడా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.అయితే.. చెన్నై నగరంలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర 149130 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుకేజీ వెండి ధర రూ.250000 వద్ద ఉంది. ఈ రోజు (మంగళవారం) కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గడంతో రూ.2.5 లక్షల వద్ద నిలిచింది. అయితే ఢిల్లీలో వెండి రేటు రూ.5000 పెరిగింది. దీంతో అక్కడ కేజీ సిల్వర్ ధర రూ.2.5 లక్షల వద్ద ఉంది. -
బంగారం ఒక్కరోజులో మళ్లీ భగ్గుమంది! వెండి మాత్రం..!
-
గంటల వ్యవధిలో.. ఊహకందని గోల్డ్ రేటు!
సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వెండి రేటు కూడా గరిష్టంగా రూ.5000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాలలో ఉదయం రూ.1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ.1,35,900 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే గంటల వ్యవధిలో రూ.900 పెరిగినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల తులం రేటు 1,47,280 రూపాయల దగ్గర నుంచి 1,48,260 రూపాయల (రూ.980 పెరిగింది) వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,48,370 రూపాయల నుంచి 1,50,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు 1,36,050 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీలో ఉదయం 1,35,150 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,36,050 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 147430 రూపాయల దగ్గర నుంచి రూ.148410 వద్దకు చేరింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిన మార్పు.వెండి ధరఈ రోజు (సోమవారం) ఉదయం రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉన్న వెండి రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ.2.55 లక్షల వద్దకు చేరింది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ఉంది. -
భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..
-
యుద్ధం ఆగదు.. వాళ్లంతా నష్టపోక తప్పదు: కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రోబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. తాజా ‘ఎక్స్’ పోస్ట్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడ్డగోలుగా ముద్రిస్తున్న డబ్బును 'ఫేక్ మనీ'గా అభివర్ణించిన ఆయన (Robert Kiyosaki), రాబోయే రోజుల్లో సంప్రదాయ పెట్టుబడులు నష్టపోక తప్పదని హెచ్చరించారు.డాలర్ విలువ పతనం - పెరుగుతున్న అప్పులుప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రిస్తుండటం వల్ల దేశాల జాతీయ అప్పులు (National Debt) విపరీతంగా పెరుగుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుందని, డాలర్లను పొదుపు చేసేవారు కాలక్రమేణా తమ సంపదను కోల్పోతారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా అమెరికా బాండ్లు సురక్షితమైనవనేది ఒక "పెద్ద అబద్ధం" అని ఆయన కుండబద్దలు కొట్టారు.చమురు సెగ.. అంతం లేని యుద్ధంప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలను ఆయన ఒక 'పవిత్ర యుద్ధం'గా అభివర్ణించారు. ఈ వివాదాలు త్వరలో ముగిసేవి కావని, దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పాత పద్ధతులకు కాలం చెల్లింది!సాధారణంగా ప్రజలు నమ్మే "చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, 401k లేదా మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయి" అనే సూత్రం ఇప్పుడు పనికిరాదని కియోసాకి కొట్టిపారేశారు. ఈ పద్ధతిని అనుసరించేవారే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఎంబీఏ (MBA) వంటి ఉన్నత డిగ్రీలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ముందు పనికిరావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.2026కు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్లు ఇవే..ఏవైతే ముద్రించడానికి వీలుపడవో అవే నిజమైన ఆస్తులని కియోసాకి నమ్ముతారు. ఆయన ప్రకారం 2026లో పెట్టుబడిదారులను కాపాడేవి బంగారం, వెండి (Real Gold & Silver), చమురు (Oil), ఆహార ధాన్యాలు (Food), క్రిప్టో కరెన్సీ (Bitcoin & Ethereum) మాత్రమే."మీ మెదడులో మీరు నింపుకునే ఆర్థిక విద్య (Financial Education) మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేనిని నమ్మాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. INVESTOR SECRET: “lf you want to be a rich investor you have to see the future.”Seeing the future today is EASY for two reasons.1: The National Debt will only go up because governments will only keep printing fake money. That means inflation will keep going up which…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 30, 2026 -
ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. చాలామంది పెట్టుబడిదారులు విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఫండ్స్ఇండియా గ్రూప్ సీఈఓ అక్షయ్ సప్రూ భవిష్యత్ పరిణామాల గురించి విశ్లేషించారు.భౌగోళిక రాజకీయ పరిణామాలను నియంత్రించడం చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. భవిష్యత్తులోనూ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనల కారణంగా.. పెట్టుబడిదారుడి తత్వం దారి తప్పకూడదని అక్షయ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం పాత పద్దతులను వదిలిపెట్టి.. కొత్త విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు.బంగారం ర్యాలీ చాలా వరకు పూర్తయింది. రాబోయే ఐదేళ్లలో.. ఇది గత సైకిల్ మాదిరిగా రాబడులను అందించకపోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం ఇప్పటికే 5-10 శాతం ఉంటే, ఆ కేటాయింపును కొనసాగించవచ్చు, కానీ పెట్టుబడిని గణనీయంగా పెంచడం మంచిది కాదు. గోల్డ్ సిప్‌లను కొనసాగించవచ్చు, కానీ కొత్తగా చేసే ఏకమొత్తం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వెండి విషయానికొస్తే, దాని అధిక అస్థిరత, నిలకడలేని రాబడుల కారణంగా సాధారణంగా చాలామంది దానికి ప్రాధాన్యత ఇవ్వరు అని అక్షయ్ సప్రూ పేర్కొన్నారు.2030 నాటికి గోల్డ్ రేటుఇప్పుడు రూ.1,48,000 వద్ద బంగారం ధర 2030 నాటికి రూ.1.68 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్యకు చేరుకుంటుందని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఏర్పడే ఆర్థిక అనిశ్చితి అని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు' -
బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!
-
ఫ్యాషన్ షోలో నగధగలు..అలరించిన మోడల్స్ (ఫోటోలు)
-
వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!
బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.వెండి ధరలువెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్‌లో సగం సెలవులే! -
ఒక్కసారిగా షాకిచ్చిన గోల్డ్..! రాత్రికి రాత్రే భారీ మార్పు..
-
వెండి మళ్లీ వెనక్కి
న్యూఢిల్లీ: వెండి, బంగారం మరోసారి అమ్మకాల ఒత్తిడికి కుదేలయ్యాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.11,250 నష్టపోయి రూ.2.3 లక్షలకు దిగొచ్చింది. బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,900 తగ్గి రూ.1,47,800 స్థాయికి చేరింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం బులియన్ మార్కెట్లు పనిచేయలేదు. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండడం, అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 37 డాలర్లు లాభపడి 4,416 డాలర్ల స్థాయి వద్ద, వెండి ఔన్స్‌కు స్వల్ప లాభంతో 68.12 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. ‘‘చమురు ధరలు బలహీనపడడంతో బంగారం ధర 4,420 డాలర్ల వరకు వెళ్లింది. కానీ, తర్వాత చమురు ధరల పెరుగుదలతో దిగొచ్చింది’’అని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్‌సింగ్ తెలిపారు. యూఎస్ ద్రవ్యోల్బణం డేటా సమీప కాలంలో బులియన్ ధరలను ప్రభావితం చేయొచ్చన్నారు. -
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చే కియోసాకి.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో 2026 క్రాష్?, అని పేర్కొంటూనే.. 1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారని వెల్లడించారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే క్షమాపణలు అంటూ మరో ట్వీట్ చేశారు. కియోసాకి ఎందుకిలా చేశారు?, దీనికి గల కారణం ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మొదటి ట్వీట్''1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారు. 1950లో ఎడ్గార్ కేస్ కూడా 2026లో ఒక భారీ పతనం సంభవిస్తుందని అంచనా వేశారు. మీరేమనుకుంటున్నారు?.. 2026లో ఒక భారీ పతనం సంభవిస్తే, మీరు ధనవంతులు అవుతారా లేక పేదవారు అవుతారా?, నేను ధనవంతుడిని కావాలని అనుకుంటున్నాను'' అని కియోసాకి ట్వీట్ చేశారు.2026 CRASH?FUTURISTS:Nostradamus in 1500 said disaster would hit the world in 2026.Edgar Cayce in 1950 also predicted a massive crash occurring in 2026.What do you think?You may want to tune into YouTube videos for more details on these two famous futurist predictions.…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026రెండో ట్వీట్క్షమించండి అని పేర్కొంటూ.. మొదటి పోస్ట్‌లో, 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుందని భవిష్యత్ శాస్త్రవేత్తలైన నోస్ట్రాడమస్ (1500) మరియు ఎడ్గార్ కేసీ (1940) చేసిన అంచనాను నేను వెల్లడించాను. ఆ తరువాత ఒక స్నేహితుడు నన్ను సంప్రదించాడు.. 2026 సంక్షోభ సమయంలో నేను ధనవంతుడిని అవుతానని చెప్పినందుకు అతను నాపై కోపంగా ఉన్నాడని పేర్కొన్నారు.అతని సమస్య ఏమిటంటే.. మీలో చాలామంది అనుసరించినట్లుగా అతను నా పోస్ట్‌ను ఎప్పుడూ అనుసరించలేదు. అంతే కాకుండా.. ఒక సంక్షోభంలో ధనవంతులు కావాలని మీరు, నేను ప్రణాళిక వేసుకున్న విషయం అతనికి తెలియదు.నన్ను అనుసరించే అందరికీ.. నేను S&P 500, యూఎస్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టనని, లేదా నగదును పొదుపు చేయనని ఇప్పటికే తెలుసు. ప్రభుత్వం, బ్యాంకులు లేదా వాల్ స్ట్రీట్ ముద్రించే దేనిలోనూ నేను పెట్టుబడి పెట్టను. అంతే కాకుండా.. నన్ను అనుసరించే వారికి నేను KISS (కీప్ ఇట్ సూపర్ సింపుల్) సూత్రాన్ని పాటిస్తానని కూడా తెలుసు.MY APOLOGIES:In my previous X I quoted futurists Nostradamus’ 1500 and Edgar Caycees 1940 prediction that a global economic crisi would begin in 2026. A friend contacted me. He was upset with me because I stated I was going to richer during the 2026 crisis.His problem was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026నేను పశువులను పెంచి అమ్ముతాను, టెక్సాస్, నార్త్‌లోని నా చమురు బావుల నుంచి చమురును అమ్ముతాను, అప్పుతో కొనుగోలు చేసిన 1500 అద్దె యూనిట్లను నెలవారీగా అద్దెకు ఇస్తాను, నేను అసలైన బంగారం, వెండి, బిట్‌కాయిన్, మరియు ఎథేరియంలను పొదుపు చేస్తాను. మీలో చాలా మందిలాగే, నా దగ్గర కూడా మొదట్లో డబ్బు లేదు. కానీ చిన్న చిన్న ఆస్తులను కొని సంవత్సరాల తరబడి ఉంచుకున్నాను, వాటిని ఎప్పుడూ అమ్మలేదు. మీలో చాలా మందికి నేను నా మొదటి 6 బిట్కాయిన్లను $600కి కొన్నానని తెలుసు, నా దగ్గర ఉన్న డబ్బంతా అదే, మరియు నేను కొన్ని రోజుల పాటు ఏమీ తినలేదు.ఇక చివరగా.. నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ చెప్పినట్లు 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?, రాదా అని నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైతే.. నా మాట విన్న మీరు, నేను ధనవంతులమవుతామని నాకు గట్టి నమ్మకం ఉంది. అదే సమయంలో లక్షలాది మంది పేదలుగా మిగిలిపోతారు.ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!భవిష్యత్తును చూడగలిగే పెట్టుబడిదారులే ధనవంతులవుతారు. నాకు నిజమైనవి (విలువైన లోహాలు) ఇష్టం. నకిలీవి (కరెన్సీ) అంటే ద్వేషం. నువ్వేం చేయబోతున్నావు?. ఆలోచించి.. ఏమీ చేయని లక్షలాది మందిలా ఉండకు. అలోచించి నిర్ణయం తీసుకో అని కియోసాకి ట్వీట్ చేశారు. -
మన బంగారాన్ని ప్రభుత్వం సీజ్ చేయొచ్చా?
భారతీయ కుటుంబాలకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. కష్టకాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. కానీ ఇప్పుడున్న ఉద్రిక్త యుద్ధ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మన ఇళ్లలో, బీరువాల్లో, లాకర్లలో భద్రంగా దాచుకున్న బంగారాన్ని బయటకు తీయాలని నిపుణులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్న అంశం తెర మీదకొచ్చింది. అసలు ఎందుకు మన బంగారంపై ప్రభుత్వానికి లేదా ఆర్థిక నిపుణులకు అంత ఆసక్తి? సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం భారతీయుల ఇళ్లలో, దేవాలయాల్లో నిద్రాణంగా ఉందని అంచనా. ఈ భారీ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఎలా తీసుకురావాలి? అసలు వ్యక్తుల నుంచి బంగారం సేకరించడం సాధ్యమేనా? దీనికి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం.ఇటీవల మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరి వంటి ఆర్థిక నిపుణులు ఒక కీలక ప్రతిపాదన చేశారు. భారతీయుల వద్ద ఉన్న బంగారాన్ని "డెడ్ అసెట్" (అంటే నిద్రాణమైన ఆస్తి) అన్నారు. అంటే అది బీరువాలో లేదా బ్యాంకులో ఉంటే కేవలం భద్రతను ఇస్తుంది తప్ప, దేశ అభివృద్ధికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఒకవేళ ఇదే బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి లేదా ఫైనాన్షియల్ అసెట్స్‌గా మార్చగలిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల బంగారం దిగుమతులు తగ్గి, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.ప్రతి ఏటా మీకు వడ్డీ చాలామందికి వచ్చే సందేహం.. "నా బంగారంపై నాకే కదా హక్కు ఉంటుంది, ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది?" అని. నిజానికి, ప్రభుత్వం మీ దగ్గర ఉన్న బంగారాన్ని బలవంతంగా లాక్కోదు. దానికి బదులుగా "గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్స్" వంటి పథకాలను ప్రవేశపెడుతుంది. దీని ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని (బిస్కెట్లు లేదా పాత ఆభరణాలు) బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను బట్టి మీకు బాండ్లు లేదా డిపాజిట్ సర్టిఫికేట్లు ఇస్తారు. దీనిపై మీకు ప్రతి ఏటా మీకు వడ్డీ లభిస్తుంది. గడువు ముగిసిన తర్వాత, మీరు అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదును లేదా తిరిగి బంగారాన్ని పొందవచ్చు. అంటే, ఇక్కడ మీ బంగారం మీదే అయి ఉంటుంది, కానీ అది ఫిజికల్ రూపంలో కాకుండా డిజిటల్ లేదా పేపర్ రూపంలో మారుతుంది.భారతదేశంలో ఒక వ్యక్తి ఎంత బంగారం ఉంచుకోవచ్చనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, మీరు కొనుగోలు చేసిన బంగారానికి సరైన ఆధారాలు బిల్లులు రూపంలో ఉంటే, ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. కానీ అదే ఆదాయ ఆధారాలు చూపలేనప్పుడు కొన్ని పరిమితులు వర్తిస్తాయి అవి ఏంటంటే, ఒక వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. అలాగే అవివాహిత మహిళ 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇదే విధంగా పురుషులు కేవలం 100 గ్రాముల వరకు మాత్రమే పరిమితి కలిగి ఉంటారు.ఐటీ దాడుల వేళ పరిస్థితి ఏంటి?ఐటీ దాడులు జరిగినప్పుడు ఈ పరిమితి లోపు ఉన్న బంగారాన్ని అధికారులు సీజ్ చేయరు. అంతకు మించి ఉండి, ఆదాయ వనరులు చూపకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ తన అవసరాల కోసం విదేశాల నుంచి టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం (Forex) ఖర్చవుతోంది. ఒకవేళ మన ఇళ్లలో ఉన్న బంగారమే మార్కెట్లోకి వస్తే, దిగుమతులు తగ్గి దేశానికి ఎంతో లాభం చేకూరుతుంది.అందుకే నిపుణులు పదే పదే "పాలసీ షిఫ్ట్" కావాలని కోరుతున్నారు. బంగారాన్ని కేవలం బీరువాలో దాచుకోవడం కంటే, దానిని ఒక పెట్టుబడిగా మార్చుకోవడం వల్ల వ్యక్తిగతంగా మనకు వడ్డీ వస్తుంది, దేశానికి ఆర్థిక బలం చేకూరుతుంది. అయితే, మన దేశంలో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా, పాత ఆభరణాలను కరిగించడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే, ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. -వెబ్‌డెస్క్ -
4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..
-
సిల్వర్ హిట్.. బంగారం ధగధగలు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనైన పసిడి, వెండి బుధవారం దేశీ మార్కెట్లో మంచి ర్యాలీని చూశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.11,250 ర్యాలీ చేసి రూ.2.41 లక్షలకు చేరుకుంది. బంగారం వరుసగా రెండో రోజూ కొనుగోళ్లతో మెరిసింది. 10 గ్రాములకు రూ.4,900 పెరిగి రూ.1,49,700 స్థాయిని అందుకుంది.భౌగోళిక రాజకీయ సెంటిమెంట్ కాస్త మెరుగుపడడం ఫలితంగా చమురు ధరలు దిగిరావడం బంగారం, వెండి ధరలు కోలుకునేందుకు దోహదపడినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 2 శాతం పెరిగి 4,556 డాలర్లకు, స్పాట్ వెండి ఔన్స్‌కు 2 శాతం లాభపడి 72.67 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. -
ఆర్థిక వ్యవస్థలోకి ‘బంగారం’ తేవాలి
న్యూఢిల్లీ: దేశంలో గృహాలు, ఆలయాల్లో ఉన్న 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌధరి అన్నారు. భౌతిక బంగారాన్ని నిల్వ (స్టోర్) రూపంలో ఉంచడం వల్ల అది ఆర్థిక వృద్ధికి పెద్దగా ఉపయోగపడటం లేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ స్థాయి సంఘం (ఆర్థిక) సభ్యుడైన చౌధరి, బంగారానికి బదులు ఆర్థిక సాధనాల వైపు వినియోగదారులను మళ్లించాలని సూచించారు. దీనివల్ల బంగారం దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడి దిగొస్తుందని అన్నారు. అసోచామ్ నిర్వహించిన ఒకకార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్.. దేశంలోని గృహాలు, దేవాలయాల వద్ద సుమారు 50,000 టన్నుల బంగారం ఉందని, దీని విలువ 10 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ బంగారం అంతా అధికారిక ఆర్థిక వ్యవస్థకు బయటే ఉందని చెప్పారు. ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) ద్వారా బంగారాన్ని డీమ్యాట్ చేసి షేర్ల మాదిరి ట్రేడ్ చేయడానికి దేశంలో అవసరమైన సాంకేతికత, వేదికలు ఉన్నాయని కృష్ణన్ తెలిపారు. అయితే, ఈజీఆర్ సమయంలో బంగారం డిపాజిట్‌పై విధించే 3 శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకిగా ఉన్నట్టు చెప్పారు. దీనిపై తాము పరిష్కారాన్ని సూచించినట్టు తెలిపారు. ఈజీఆర్ అన్నది సెబీ ఆమోదిత పథకం. వినియోగదారులు తమవద్దనున్న భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో షేర్ల మాదిరి ట్రేడ్ చేసుకోవచ్చు. -
ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. బంగారం కొనుగోలు చేయొచ్చా?
వాష్టింగన్: ఇరాన్‌పై యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే, ఈ ఒడిదుడుకుల్లో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలతో బంగారం పెట్టుబడి దారుల్లో అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడుల్ని ముగించేలా ట్రంప్ సంకేతాలు పంపించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా 4శాతం పెరిగింది. కానీ దీని వెనుక ఉన్న అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళంలోకి నెడుతోంది. అమెరికా అధ్యక్షుడు హర్మూజ్ జలసంధి అంశంలో ఇరాన్ తమకు ఓ బహుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రకటనతో ఇరాన్‌పై యుద్ధం అంశంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫలితంగా బంగారం ధర ఔన్స్‌కి 4,550 డాలర్లను దాటిందిదీంతో తొమ్మిది రోజుల వరుస నష్టాల తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయి ఔన్స్ బంగారం 5,626 డాలర్ల ధర దాదాపు 20శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కారణంగా బంగారంలో పెట్టుబడులు సురక్షితమేనా అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారుబెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెట్ నిపుణులు నవీన్ పీఎంటీ బంగారం పెరుగుదలని ‘హెడ్లైన్ రిస్క్ వోలాటిలిటీ’గా అభివర్ణించారు. ‘మార్కెట్ యుద్ధ భయాల నుంచి శాంతి వైపు అడుగులు పడేలా చేస్తోంది. ఇది నిజమైన నమ్మకం కాదు ఒక రీలీఫ్ ర్యాలీ మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనిషా భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయి. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావంచమరు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.కేంద్ర బ్యాంకుల ధోరణిగత రెండు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత విరామం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో డాలర్‌పై ఆధార పడటాన్ని తగ్గించి బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత అస్థిరత బంగారం స్వభావాన్ని మార్చడం లేదు. తాత్కాలికంగా లిక్విడిటీ ఒత్తిడి కారణంగా బంగారం రిస్క్ ఆస్తిలా ప్రవర్తించినా, పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల, వ్యవస్థాపక ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణగా నిలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు రక్షణా ఆస్తిగానే కొనసాగుతుంది. కానీ తక్షణ లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ధరలలో మార్పులు కొనసాగుతాయి. -
కోలుకున్న పసిడి... అక్కడే వెండి
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో 4 రోజుల వరుస నష్టాల నుంచి పసిడి బయటపడింది. మంగళవారం 10 గ్రాములకు రూ.1,200 పెరిగి రూ.1.44లక్షలకు (పన్నులు సహా) చేరుకుంది. వెండి ధర మాత్రం పెద్దగా మార్పు లేకుండా కిలోకి రూ.2.30 లక్షల వద్దే ఉన్నట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లలో రికవరీకితోడు, కనిష్ట స్థాయిల్లో కొనగోళ్ల మద్దతుతో బంగారం ధర పెరిగినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు.అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్స్‌కు 17 డాలర్ల వరకు పెరిగి 4,423 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి సైతం 1% పుంజుకుని ఔన్స్‌కు 69.86 డాలర్ల స్థాయిని చేరుకుంది. ‘9 రోజుల క్షీణత తర్వాత స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,420 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇరాన్ పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో అప్రమత్తతతో కూడిన ఆశావహధోరణి కనిపించింది’ అని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. -
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?, ఉదయం ధరలకు.. సాయంత్రం ధరలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో.. ఈ రోజు (మార్చి 24) ఉదయం 1,40,350 రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ధర.. సాయంత్రానికి 1,42,910 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర 1,28,650 రూపాయల నుంచి 1,31,000 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తులం 24 క్యారెట్ల రేటు రూ.1,40,500 నుంచి రూ.143060 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 128800 రూపాయల నుంచి రూ.131150 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు గంటల వ్యవధిలో ఎంతలా మారిందో స్[స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నై విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.970 తగ్గి.. 144560 రూపాయలు వద్ద, 22 క్యారెట్ల రేటు 900 రూపాయలు తగ్గి, రూ.132500 వద్దకు చేరింది. మొత్తం మీద పడిపోతున్నాయన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.వెండి ధరలు ఇలాబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. ఉదయం కేజీపైన రూ.10000 తగ్గి రూ.2.40 లక్షల వద్ద ఉన్న సిల్వర్.. సాయంత్రానికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. అంటే వెండి కూడా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. -
పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!
-
గంటల వ్యవధిలో కుప్పకూలిన పసిడి.. కొత్త ధరలు ఇవే!
భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఉదయం రూ.5000 తగ్గిన రేటు.. సాయంత్రానికి రూ.10 వేలకు చేరింది. అంటే తులం గోల్డ్ రేటు రూ. పదివేలు తగ్గిందన్నమాట. దీంతో ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఈ కథనంలో తాజా ధరలు ఏ నగరంలో.. ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10,320 తగ్గి.. రూ.1,35,650 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి రూ. 1,23,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పసిడి ధరలు ఎంత వరకు పతనమైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నైలో కూడా గోల్డ్ రేటు బాగా తగ్గింది. దీంతో ఉదయం ధరల కంటే.. సాయంత్రం ధరలు చాలా తగ్గుముఖం పట్టింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,39,200 వద్దకు (రూ.9380 తగ్గింది). 22 క్యారెట్ల తులం రేటు రూ.1,27,600 వద్ద (రూ.8600 తగ్గింది) నిలిచింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,35,800 (రూ.10,320 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి 1,24,500 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్! -
బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్!
సాధారణంగా యుద్దాలు జరిగినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అమాంతం పెరుగుతాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ కూడా ఇదే. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైపోయిందని కోబేస్సీ లెటర్ చేసిన ట్వీట్ ద్వారా వెల్లడైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుతం బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ రెండు లోహాల మార్కెట్ విలువలో సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల మేర తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం.యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు.. బంగారం ధరలు పెరగాలి. అయితే.. ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గడానికి కారణం బాండ్ మార్కెట్లో వచ్చిన మార్పులు. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బంగారం వంటి వడ్డీ ఇవ్వని ఆస్తులతో పోలిస్తే, బాండ్లు ఇప్పుడు ఆదాయం అందించే సురక్షిత మార్గంగా మారాయి. అందువల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తీసుకుని బాండ్లలో పెట్టడం ప్రారంభించారు.Something very strange is happening in precious metals right now:In just 3 hours, gold and silver just erased a combined -$2 TRILLION in market cap.Meanwhile, oil prices have erased their gains on the day and US stock market futures are nearly green.Since the Iran War… pic.twitter.com/zP43wSr9wE— The Kobeissi Letter (@KobeissiLetter) March 23, 2026ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అమెరికన్ డాలర్ బలపడటం. యుద్ధ పరిస్థితుల్లో డాలర్ కూడా సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతుంది. డాలర్ విలువ పెరిగితే, బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఇదే సమయంలో మార్కెట్లో లీవరేజ్ అధికంగా ఉండటం పరిస్థితిని మరింత తీవ్రమైంది చేసింది. ప్రస్తుతం లోహాల మార్కెట్లలో ఏదో జరుగుతోందని.. కోబేస్సీ లెటర్ వెల్లడించింది.గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడంతో, చాలా మంది ట్రేడర్లు అధిక రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టారు. ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైనప్పుడు, స్టాప్ లాస్ ఆర్డర్లు అమల్లోకి వచ్చాయి, మార్జిన్ కాల్స్ వచ్చాయి, పెట్టుబడిదారులు తమ పొజిషన్లను బలవంతంగా విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల ధరలు మరింత వేగంగా క్షీణించాయి.భారతదేశంలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఇతర లోహాలు కూడా ఇదే దిశగా కదిలాయి. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లు ఎప్పుడూ సాంప్రదాయ సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించవు. పరిస్థితులు మారినప్పుడు సురక్షితమైనవిగా భావించే ఆస్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు, డాలర్ బలం, లిక్విడిటీ వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది. -
బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..
ఎప్పుడైనా ప్రపంచ యుద్దాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఈ సమయంలో బంగారం, వెండి వంటి లోహాలకు విలువ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం.. గోల్డ్, సిల్వర్ రేటు దీనికి విరుద్ధంగా ఉంది.అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం జరుగుతున్నా సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణం.. డాలర్ విలువ బలపడటమే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో.. ఆ సమయంలో పసిడికి డిమాండ్ కొంత తగ్గుతుంది. అంతే కాకుండా.. బంగారం రేటు పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తారు. కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు పతనమవుతాయి.వారం రోజుల్లో రూ.13 వేలు డౌన్!బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.బంగారం ధరలు తగ్గుతాయా?బంగారం ధరలు తగ్గుతాయా? అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుదల, తగ్గుదల అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల మాదిరిగానే.. ధరలు తగ్గితే, గోల్డ్ రేటు పతనమవుతుందని చెప్పవచ్చు. కానీ కియోసాకి వంటి నిపుణులు బంగారం ధర పెరుగుతుందనే చెబుతున్నారు. -
వారం రోజుల్లో రూ.13 వేలు తగ్గిన బంగారం: కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా భారీ తగ్గడంతో పసిడి ప్రియులలో సంతోషం నెలకొంది. ఇంకా తగ్గే అవకాశం ఉందా? అన్నట్లు కొందరు వేచి చూస్తున్నారు. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటులో ఎంత వ్యత్యాసం ఉండనే విషయాలను తెలుసుకుందాం.మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (శనివారం) 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,47,600 రూపాయల నుంచి 136200 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 161020 రూపాయల నుంచి 1,48,580 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారం రోజుల్లో ఎంత తగ్గిందనే విషయం స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా వారం రోజుల్లో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. మార్చి 15న రూ.1,59,810 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు, మార్చి 21 నాటికి రూ.1,46,120 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,500 రూపాయల దగ్గర నుంచి రూ. 1,33,950 వద్దకు చేరింది. -
తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ.. ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉంటాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ రోజు (మార్చి 20) బంగారం ధర 0.6% పెరగగా, వెండి ధర 1.7% ఎందుకు తగ్గింది. ఇటీవలి తగ్గుదలల తర్వాత, సాంకేతిక కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతు ఇవ్వడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలమైన అమెరికన్ డాలర్ ఒత్తిడి, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వస్తున్న సంకేతాల కారణంగా, గోల్డ్ వరుసగా మూడవ వారం కూడా పతనం దిశగా పయనించింది. అదే సమయంలో, మార్కెట్లో బలహీనమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వెండి ధరలు తగ్గాయి.భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల కదలికలు, భారతదేశం.. చైనాలలో భౌతిక డిమాండ్‌లో మార్పులతో సహా ప్రపంచ కారకాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి తగ్గుదలల తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ధరలు సాంకేతిక మద్దతు జోన్లను నిలబెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, భౌతిక డిమాండ్ తగ్గడం మరియు కొనసాగుతున్న అమ్మకాల కార్యకలాపాల కారణంగా వెండి ధరలు పడిపోయాయి.ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 0.6% పెరిగి ఔన్సుకు 4,675.23 డాలర్లకు చేరుకుంది. గత సెషన్లో దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ లోహం కోలుకుంది. వెండి 1.7% తగ్గి ఔన్సుకు 71.66 డాలర్లకు చేరింది. ఇతర లోహాలు మిశ్రమ కదలికలను కనబరిచాయి. ప్లాటినం 0.2% పెరిగి 1,974.45 డాలర్లకు చేరగా, పల్లాడియం 1% పెరిగి 1,461.36 డాలర్లకు చేరింది.బంగారం ధరల పెరుగుదల ఎప్పుడుబంగారం వంటి విలువైన లోహాల విలువ ఎలాంటి సమయంలో అయినా భారీగా క్షిణించే అవకాశం ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవచ్చు, ఆర్ధిక మాంద్యం రావచ్చు. అలంటి సమయంలో కూడా మీకు బంగారం, వెండి వంటివి చాలా ఉపయోగపడతాయని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు. -
నిన్న ₹7,000 పతనం.. ఇవాళ మళ్లీ పెరిగిన బంగారం ధర!
-
గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి నష్టం తప్పదు
-
ఆ బుడగ పేలిందా!! 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తుచేసుకోండి..
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి నడుస్తున్న నేపథ్యంలో, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే చరిత్రలోనే అతిపెద్ద ఆస్తుల బుడగ (బబుల్ బస్ట్) పగిలిపోతుందని, దాని తర్వాత బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఈథేరియం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన పేర్కొన్నారు.కియోసాకి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన తాజా సందేశంలో, "బబుల్ పగిలే 'పిన్' ఏదైనా ఈవెంట్ త్వరలోనే జరగనుంది. అది ఏ సంఘటన అయినా.. ఇప్పుడే బిట్‌కాయిన్, బంగారం, వెండి, ఈథేరియం ఎక్కువగా సేకరించాలి" అని సూచించారు. క్రాష్ తర్వాత ఒక సంవత్సరంలో బంగారం ఒక ఔన్స్‌కు 35,000 డాలర్లు, వెండి 200 డాలర్లు, బిట్‌కాయిన్ ఒక్కో కాయిన్ 750,000 డాలర్లు, ఈథేరియం 95,000 డాలర్లకు చేరుతాయని ఆయన ధీమాగా అంచనా వేశారు."మీ లాభం అమ్మేటప్పుడు కాదు.. కొనేటప్పుడే వస్తుంది" అనే తన 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కొనుగోలు చేసి భవిష్యత్తులో ధనవంతులు కావాలని, లేకపోతే చాలామంది పేదలవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర సుమారు 74,000–75,000 డాలర్ల మధ్య ఉండగా, ఈథేరియం 2,300–2,400 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. -
గోల్డ్ రూ.21 వేలు, వెండి లక్షన్నర పతనం.. తులం బంగారం ఎంతంటే..!
-
పసిడి ప్రియులకు ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సాయంత్రానికి సగం తగ్గిన గోల్డ్ రేటు!
రోజురోజుకి తగ్గుతున్న గోల్డ్ రేటు ఈ రోజు (మంగళవారం) కొంత పెరిగింది. అయితే 24 గంటలు కూడా గడవకముందే.. పెరిగిన రేటులో సగం తగ్గిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం లేటెస్ట్ ధరల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,45,400 రూపాయల వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల బంగారం ధర సాయంత్రానికి రూ.1,44,900 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.500 తగ్గిందన్నమాట. 24 క్యారెట్ల ధర 1,58,620 రూపాయల నుంచి రూ.1,58,080 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో లేటెస్ట్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 158230 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 145050 రూపాయల వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం ఉన్న ధరల కంటే తక్కువ కావడం గమనార్హం.చెన్నైలో గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ధరలు ఉదయం ఎలా ఉన్నాయో, సాయంత్రానికి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,46,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,59,820 వద్ద ఉంది. -
కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పెట్టుబడికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో ట్వీట్ చేసారు. చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' ఉందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' (ఒక ఆస్తి విలువ.. అసలు విలువ కంటే చాలా ఎక్కువగా పెరగడం) జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు, అని కియోసాకి పేర్కొన్నారు. ''అది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అన్నదే ప్రశ్న'' అని అన్నారు.బబుల్ బస్ట్ సంఘటన జరిగినప్పుడు.. ఒక ఏడాది తరువాత గోల్డ్ ధర ఔన్సుకు 35,000 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బిట్‌కాయిన్ ధర 7,50,000 డాలర్లకు, ఇథీరియం ధర 95,000 డాలర్లకు చేరుకుంటుంటుందని కియోసాకి వెల్లడించారు.ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులు (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, ఇథీరియం) మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి అలోచించి ఇన్వెస్ట్ చేయండి. ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయమా? అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.BIGGEST BUBBLE BUSTI do not know what pin, what event will pop the biggest bubbles in histor. What ever the event, the pin is near.It’s not IF. It’s WHEN.When the bubbles go bust I predict gold will hit $35,000 an ounce one year after the gold bubble goes pop..I predict…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 16, 2026 -
బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!
ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన దాడులు 18వ రోజుకు చేరుకున్నాయి. సాధారణంగా యుద్ధం, లేదా సంక్షోభ సమయాల్లో చమురు, బంగారం, అమెరికన్ డాలర్ బాగా పెరుగుతాయి. అలాగే స్టాక్‌మార్కెట్లు కూడా పెట్టుబడుదారుల ప్యానిక్ అమ్మకాలతో కుప్పకూలుతాయి. కానీ ప్రస్తుత ఇరాన్ యుద్ధ సమయంలో మాత్రం మార్కెట్ సమీకరణాలు మారుతున్నాయి. బంగారం, డాలర్‌ను మించి దూసుకుపోతోంది. అదేంటో తెలుసుకుందాం ఈ కథనంలో మారుతున్న పెట్టుబడి ధోరణికి అనుగుణంగా ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి బిట్‌కాయిన్ విలువ 74 వేల డాలర్ల మార్కును దాటింది. అంటే సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. బంగారం ఔన్సుకు దాదాపు 5,035 డాలర్ల వద్ద ఉంది. గతంలో బిట్‌కాయిన్ పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారంగా భావించేవారు. కానీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, ఇది సేఫ్‌గా మారుతుండటం విశేషం.బిట్ కాయన్‌పై ఎందుకింత ఆసక్తి?INRGrid స్టేబుల్ వ్యవస్థాపకుడు అనుజ్ చౌదరి అభిప్రాయం ప్రకారం.. బిట్‌కాయిన్‌ను బ్యాంకులు లేదా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తక్షణమే సరిహద్దులు దాటించి తరలించ వచ్చు. యుద్ధం వంటి సమయాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించినా, బిట్‌కాయిన్ నియంత్రణ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటుంది. బంగారం లేదా సాంప్రదాయ మార్కెట్ల వలె కాకుండా, బిట్‌కాయిన్ 24/7 ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా సంప్రదాయ మార్కెట్లు మూసి ఉన్నప్పుడు, భౌగోళిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పెట్టుబడిదారులు తక్షణమే స్పందించడానికి వీలు కల్పిస్తుంది. వేగంగా మారుతున్న ప్రపంచ సంఘటనల సమయంలో ఇదొక ప్రాధాన్య సాధనంగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ?!ఇన్వెస్ట్పీడియా నివేదిక ప్రకారం, ఇరాన్‌పై దాడులు మొదలైనప్పటి నుంచీ ఐషేర్స్ బిట్‌కాయిన్ ట్రస్ట్ ,ఫిడిలిటీ వైజ్ ఆరిజిన్ బిట్‌కాయిన్ ఫండ్‌తో సహా బిట్‌కాయిన్‌కు 1.1 బిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులు వచ్చాయంటేనే బిట్‌కాయన్ క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.బిట్‌కాయిన్ నిజంగా సురక్షితమేనా?ఇరాన్ యుద్ధం సద్దుమణిగే సూచనలు కనిపించకపోవడంతో, కొంతమంది పెట్టుబడిదారులు క్రిప్టో పెట్టుబడుల వైపు మళ్లవచ్చు. అయితే, ఒక రక్షణ సాధనంగా (హెడ్జ్‌గా) బిట్‌కాయిన్‌ను బంగారంతో పోల్చడంపై నిపుణుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. బిట్ కాయిన్లో పెట్టుబడులు అంత సులువు కాదు. దీనిపై నిపుణులు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం భౌతికంగా అందుబాటులో ఉంటుంది కానీ దాన్ని జప్తు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బిట్‌కాయిన్ డిజిటల్‌గా ఉండటం వల్ల దాన్ని ఎవరూ సీజ్ చేయలేరు. కానీ అయితే, దీని ధరల్లో ఉండే తీవ్రమైన హెచ్చుతగ్గుల (Volatility) చాలా తీవ్ర స్థాయిల్లో ఉంటుంది. అందుకే లాభనష్టాలను బేరీజు వేసుకోనొ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం, లేదా కోవిడ్-19 సంక్షోభం వంటి భౌగోళిక-రాజకీయ సంక్షోభాల సమయంలో క్రిప్టోకరెన్సీ పెరగవచ్చు. అయినా వ్యాపారులు/ పెట్టుబడిదారులు బిట్‌కాయిన్‌ను నమ్మదగిన సురక్షిత ఆశ్రయ ఆస్తిగా పరిగణించ కూడదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర బ్యాంకులు బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేసే అవకాశం లేనందున, రిజర్వ్ ఆస్తిగా దాని పాత్ర పరిమితం. మరోవైపు, గత కొన్నేళ్లుగా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకున్నాయనేది గమనించాలి. -
మళ్లీ బంగారం కొనే టైమొచ్చింది..! ఐదో రోజు పతనమైన గోల్డ్ రేట్
-
కట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దు
వరకట్నం.. వివాహ సమయంలో వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబా నికి నగదు, బంగారం, ఆస్తుల రూపేణ బదిలీ చేసే ఒక సామాజిక దురాచారం. ఆడపడుచు కుటుంబా నికి ఇబ్బందిగా మారిన దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చట్టాలెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోని దుస్థితి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన ఆదివాసీ తెగలు వరకట్నం నిషేధం వైపు మొగ్గు చూపుతున్నాయి. కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు అని గ్రామాల్లో తీర్మానాలతో పాటు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ‘హైరి కీవల్ సిల్లే’ ‘కట్నం ఇదే కాద్ తోద్’ వంటి తీర్మానాలతో ముందడుగు వేస్తున్న ఆయా తెగలపై ఈ వారం సండే స్పెషల్. కట్నం ఇడే కాద్ తోద్.. అంటున్న ‘కొలాం’సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా సాయంసిరికొండ: ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లంటే ఆ కుటుంబంపై ఆర్థిక భా రం చెప్పనవసరం లేదు. కట్నా లు, కానుకలు, ఆర్భాటాలు వంటివి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతోంది. అలాంటిది తమ గూడెంలో అమ్మాయి పెళ్లిని ఆర్భాటం లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఊరి పెద్దలు భావించారు. ఈనెల 9న సమావేశమయ్యారు.‘హైరి కీవల్ సిల్లే’ వరకట్నం నిషేధించడంతో పాటు పెళ్లి కూతురు కుటుంబానికి తలా కొంత ఆర్థికంగా చేదోడుగా నిలవాలని నిర్ణయించారు. వెంటనే అమలులోకి తెచ్చారు సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడవాసులు.కొలాం సంస్కృతిలో లేదువరకట్నం అనేది కొలాం సంస్కృతిలో లేదు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. – దేశ్‌ముఖ్ లేతు, టెంబ్రీగూడ పటేల్తల్లిదండ్రులకు భారం కావద్దని..ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో వరకట్నాన్ని నిషేధించాం. ఇకపై కొలాం సమాజంలో జరిగే వివాహాలు సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాం. వరకట్న నిర్మూలనలో సమాజంలో సమానత్వం పెరిగి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. – కొడప సోనేరావు, కొలాం సంఘ రాష్ట్ర అధ్యక్షుడుకట్నమియ్యలే.. మొన్ననే నా బిడ్డ పునేశ్వరి లగ్గం చేసిన. ఉట్ను ర్ మండలం సుద్దగూడ కు ఇచ్చిన. వరకట్నం మాత్రం ఇయ్యలే. నేను కూలీ పని చేస్తుంటా. బిడ్డ పెండ్లీడుకు రావడంతో గుబులు పడ్డా. అయితే గ్రా మస్తులంతా కలిసి వరకట్నం నిషేధించడంతో పాటు లగ్గానికి రూ.20 వేలు సాయం కూడా చేశారు. – పెందుర్ జంగుబాయి,కోసుపటేల్ గూడవరకట్నం నిషేధించాం..మా గూడెంలో అంతా పేదవారే. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి చేయలంటే చాలా కష్టంగా మారింది. దీంతో మేము ఇటీవల సమావేశమయ్యాం. వరకట్నం నిషేధించాం. అలాగే అమ్మాయి కుటుంబానికి తలా కొంత జమ చేసి రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.– కుమురం రావుజీ, పటేల్, కోసుపటేల్గూడపెళ్లింటికి.. ఆర్థిక చేయూతఇంద్రవెల్లి: ఆదివాసీ, గోండు తెగల్లోనూ చాలామంది వరకట్నాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే అమ్మాయి, అబ్బాయి పెళ్లి ఎవరిదైనా ఆయా గ్రామాల్లో కులస్తులు కానుకలు ఇవ్వకుండా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పెళ్లింటికి చేదోడుగా నిలుస్తున్నారు. మండలంలోని వడగామ్ గ్రామంలో కనక కోసేరావ్ పెళ్లి రెండు రోజుల క్రితం జరిగింది. ఈమేరకు గ్రామస్తులంతా కలిసి రూ.25 వేలు అందించారు. కేస్లాపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కూతురు ఆత్రం రోష్ణకు గ్రామస్తులు రూ.26 వేలు అందించారు. మండలంలోని పిప్రి గ్రామంలో ఆదివారం పెళ్లి పీటలు ఎక్కనున్న ఆత్రం సుజాతకు గ్రామస్తుల ఆధ్వర్యంలో రూ.7,100 అందించారు. ఇలా ఆదివాసీలు తలా కొంత నగదు సేకరించి పెళ్లి కుటుంబాలకు అందించి ఆర్థికంగా మద్ధతిస్తున్నారు. -
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
బంగారం ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గడచిన వారం రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేటు గణనీయంగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో, పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేట్లలో జరిగిన మార్పు గురించి, నేటి ధరల గురించి తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 9(సోమవారం)న 1,61,680 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఈ రోజుకి (మార్చి 15) 1,59,660 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 2020 తగ్గిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,48,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,46,350 వద్దకు (రూ.1850 తగ్గింది) చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో గణనీయంగా తగ్గింది. మార్చి 9న.. అంటే సోమవారం రోజు 1,61,830 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నేటికి (మార్చి 15) రూ.1,59,810 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడు రోజుల్లో రూ.2020 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి రేటు 1,48,350 రూపాయల నుంచి రూ.1850 తగ్గి 1,46,500 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర వారం రోజుల్లో 1,63,090 రూపాయల దగ్గర నుంచి 1,61,020 రూపాయల దగ్గరకు చేరింది. వారం రోజుల్లో రూ. 2070 తగ్గిందన్నమాట. తులం 22 క్యారెట్ల బంగారం రేటు 1,49,500 రూపాయల నుంచి రూ. 1,47,600 వద్దకు (రూ.1900 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. మార్చి 9న రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు నేటికి (మార్చి 15) రూ.2.80 లక్షలకు చేరింది. వారం మధ్యలో రేట్ల పెరుగుదల, తగ్గుదల ఉన్నప్పటికీ.. మొత్తం మీద కేజీ రేటు 10,000 రూపాయలు తగ్గిందని తెలుస్తోంది. -
మహిళలకు ఇదే లక్కీ ఛాన్స్.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..!
-
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 14) పసిడి ధర గరిష్టంగా రూ.1030 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం బాటలోనే నేను కూడా అన్నట్టు.. వెండి అడుగులు వేసింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలను గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. -
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రోజు (మార్చి 13) 24 గంటలు గడవక ముందే గోల్డ్ రేటు మరోమారు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు మారిపోయింది. ఈ కథనంలో పసిడి ధరలు ఏ నగరం ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1530 తగ్గి.. రూ.1,60,690 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 1400 రూపాయలు తగ్గి.. రూ. 147300 వద్ద నిలిచింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 1530, రూ.1400 తగ్గింది. దీంతో తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 1,60,840 & రూ. 1,47,450 వద్ద ఉన్నాయి.చెన్నైలో మాత్రం గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఉదయం ఎంత ధర ఉందో, సాయంత్రానికి కూడా అదే ధర వద్ద నిలిచింది. దీంతో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 162560 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,49,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్లు క్రాష్.. కియోసాకి సంచలన ట్వీట్!
చమురు ధరల పెరుగుదల.. స్టాక్ మార్కెట్ క్రాష్ వంటివి జరుగుతున్న సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో..పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంతో, ప్రైవేట్ క్రెడిట్ ఫండ్లు భయాందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. కొన్నిసార్లు పెద్ద మార్పులు జరుగుతాయి. స్టాక్ మార్కెట్ క్రాష్, బ్యాంకులు.. ఫైనాన్షియల్ సంస్థలు కష్టాల్లో పడటం వంటివి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో తమ డబ్బును వెనక్కి తీసుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనిని ఆర్థిక క్రాష్ లేదా మాంద్యం అని అంటారు. కొందరు ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని కొత్త మాంద్యం లేదా డిప్రెషన్ ప్రారంభమవుతోందని కూడా చెబుతారు.ప్రజలు తమ పెట్టుబడులను అమ్మేస్తారు లేదా బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకుంటారు. దీన్ని బ్యాంక్ రన్ అని అంటారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు ఎప్పుడూ పూర్తిగా మాయం కాదు. అది ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతుంది. అంటే బ్యాంకుల నుంచి బయటకు వెళ్లే డబ్బు, మరో ఆస్తి లేదా పెట్టుబడి వైపు వెళ్తుంది.CRASH ACCELERATES:Private credit funds are panicked as investors withdraw their money.Major big name banks and brand name financial institutions are in trouble.Jim Rickards formally declares the US in the New Depression.What are you going to do?If you have followed my X…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 13, 2026కొంతమంది పెట్టుబడిదారులు ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకుని తెలివిగా తమ డబ్బును.. చమురు, వెండి, బంగారం, డిజిటల్ కరెన్సీలు అయిన బిట్‌కాయిన్, ఈథీరియం వంటి వాటిలో పెట్టుబడిగా పెడుతుంటారు. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి సమయంలో ఈ ఆస్తులు కొన్నిసార్లు విలువను నిలుపుకుంటాయి.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలుమార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. పడిపోయే సమయంలో కూడా తెలివైన పెట్టుబడిదారులు లాభాలు పొందగలరని. కానీ దీనికి సరైన సమాచారం, విశ్లేషణ & ఆలోచన అవసరం. భయంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలగవచ్చు. కాబట్టి ఆర్థిక సంక్షోభ సమయంలో భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఏ రంగాలు ఎదుగుతున్నాయి, ఏ పెట్టుబడులు భద్రంగా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతాము. -
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధర... ఒక్క రోజులో జంప్..
-
2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
ఒకవైపు ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు భారీగా పతనమవుతున్న మార్కెట్లు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం వస్తుందని ఇందులో హెచ్చరించారు.చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం గురించి నేను రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో హెచ్చరించాను. అది రాబోతోంది. 2008లో ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనిని గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని పిలుస్తారు. ఆ సమయంలో చాలా బ్యాంకులు & ఆర్థిక సంస్థలు కూలిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోని పెద్ద పెట్టుబడి బ్యాంక్ అయిన లెమాన్ బ్రదర్స్ దివాళా తీసింది. భవిష్యత్తులో ఇంకా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 2026లో మరో పెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉంది. ఈ పతనం ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థలలో ఒకటైన 'బ్లాక్ రాక్'తో సంబంధం ఉన్న.. ప్రైవేట్ క్రెడిట్ వ్యవస్థ కారణంగా రావచ్చని ఆయన భావిస్తున్నారు.REPEATING A WARNINGIn Rich Dad’s Prophecy (2013) I warned the biggest stock market crash in history….was STILL coming.In 2026, I hope I am wrong…. Yet I am afraid that crash is now arriving.Why did I make that prediction?Because the cause of the 2008 crash, the GFC,…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 10, 2026ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భారీ అప్పుల్లో ఉన్నాయని, ఆ అప్పులను తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధుల సేవింగ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం.. డబ్బును కాపాడుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం, ఆయిల్ వెల్స్ వంటి సహజ వనరులలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెబుతున్నారు.నాకు వెండి అంటే చాలా ఇష్టమని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఎందుకంటే తక్కువ డబ్బుతో కూడా వెండిని కొనుగోలు చేయవచ్చని ఆయన అభిప్రాయం. కాబట్టి మీరు కూడా కేవలం 10 డాలర్లతో వెండి నాణేలు లేదా చిన్న ముక్కలు కొనుగోలు చేయండి. అవసరమైతే ఒక రోజు తినడం ఆపేసి.. వెండిపై పెట్టుబడి పెట్టండి. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారని, జాగ్రత్త వహించండి, అని కియోసాకి తన ట్వీట్ పూర్తి చేశారు. -
Gold Prices: మహిళలు గుడ్ న్యూస్.. మళ్లీ పడిపోయిన పసిడి ధరలు..
-
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం, వెండి!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. తులం గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1960 తగ్గింది. కేజీ వెండి రేటు రూ.5000 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ నగరంలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. -
గోల్డ్ మార్కెట్ లో భారీ ట్విస్ట్.. ఒక్కరోజులోనే అమాంతం పెరిగిన బంగారం ధరలు..
-
బాతు కడుపులో బంగారం.. యజమానిలో అంతులేని సంతోషం
-
పాత బంగారు లోకం
సాక్షి, బిజినెస్ డెస్క్: వరుస యుద్ధాల ప్రభావంతో బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి. పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ ఆభరణాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఒక తులం బంగారం ధర రూ.1.7 లక్షల మార్కును దాటేయడంతో సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. కానీ, ధరలు ఇంకా పెరుగుతాయన్న భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్త పడుతున్నారు.మధ్యతరగతి జనం ఇప్పుడు కొత్త నగలు కొనడానికి బదులు, ఇంట్లో ఉన్న పాత బంగారాన్నిజువెలరీ షాపుల్లో ఇచ్చి (ఎక్స్ఛేంజ్) కొత్తవి చేయించుకుంటున్నారు. లాకర్లలో దాచిన పాత నగలను బయటకు తెచ్చి కొత్త నగలుగా మార్చుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర ఇంకా పెరుగుతుందనే భయంతో అవసరాల కోసం ముందుగానే కొనుగోళ్లు చేయడం మొదలెట్టారు. పాత పసిడికి కొత్త మెరుగులు దిద్దుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బంగారం అమ్మకాల్లో సగానికి పైగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ద్వారానే సాగుతున్నట్లు జువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. ప్యూర్ వద్దు.. లైట్ ముద్దు! పెరిగిన ధర వద్ద బంగారు ఆభరణాలు కొనడం సామాన్యుడికి కలగా మారింది. దీని ప్రభావం ముఖ్యంగా జీతభత్యాలపై ఆధారపడే మధ్యతరగతి పై ఎక్కువగా పడుతోంది దీంతో మార్కెట్లో మరో కొత్త ట్రెండ్ మొదలైంది. తక్కువ బరువు, తక్కువ ధరలో లభించే 18 క్యారెట్ల నగలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. డైమండ్స్‌లో కూడా 9 క్యారెట్, 14 క్యారెట్ వంటి తక్కువ రేంజ్ ఆభరణాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సహజ వజ్రాల రేటు భరించలేని మధ్యతరగతి వినియోగదారులు తక్కువ ధరకే మెరిసే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్‌వైపు మళ్లుతున్నారు. ల్యాబ్–గ్రోన్ డైమండ్స్ ధరలు సహజ డైమండ్స్ కంటే చాలా తక్కువ గ్లోబల్ డైమండ్ మార్కెట్లో ప్రస్తుతం 12 శాతం ఉన్న ల్యాబ్ గ్రోన్ డైమండ్ల వాటా 2029 నాటికి 16 శాతానికికి చేరుతుందని నిపుణుల అంచనా.ఇన్వెస్ట్మెంట్ అంటే ‘కాసే’ కేవలం అలంకరణకే కాకుండా, పెట్టుబడి కోసం చూసేవారు ఇప్పుడు గోల్డ్ కాయిన్స్‌పైనే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగితే ఇవే లాభాలను ఇస్తాయని నమ్ముతున్నారు. రేటు పెరిగినా ఇన్వెస్టర్లు బంగారు నాణేలు కొనడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ‘రేట్లు ఎంత పెరిగినా బంగారంపై భారతీయులకు ఉన్న నమ్మకం వేరు. అది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక భద్రత’ – అరుణ్ నారాయణ్, సీఈఓ టైటాన్ జువెలరీ


