భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఉదయం రూ.5000 తగ్గిన రేటు.. సాయంత్రానికి రూ.10 వేలకు చేరింది. అంటే తులం గోల్డ్ రేటు రూ. పదివేలు తగ్గిందన్నమాట. దీంతో ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఈ కథనంలో తాజా ధరలు ఏ నగరంలో.. ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.
హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10,320 తగ్గి.. రూ.1,35,650 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి రూ. 1,23,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పసిడి ధరలు ఎంత వరకు పతనమైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
చెన్నైలో కూడా గోల్డ్ రేటు బాగా తగ్గింది. దీంతో ఉదయం ధరల కంటే.. సాయంత్రం ధరలు చాలా తగ్గుముఖం పట్టింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,39,200 వద్దకు (రూ.9380 తగ్గింది). 22 క్యారెట్ల తులం రేటు రూ.1,27,600 వద్ద (రూ.8600 తగ్గింది) నిలిచింది.
ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,35,800 (రూ.10,320 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి 1,24,500 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది.
ఇదీ చదవండి: బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్!


