బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్! | Something Very Strange is Happening in Precious Metals Right Now | Sakshi
Sakshi News home page

బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్!

Mar 23 2026 3:12 PM | Updated on Mar 23 2026 3:50 PM

Something Very Strange is Happening in Precious Metals Right Now

సాధారణంగా యుద్దాలు జరిగినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అమాంతం పెరుగుతాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ కూడా ఇదే. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైపోయిందని కోబేస్సీ లెటర్ చేసిన ట్వీట్ ద్వారా వెల్లడైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్‌ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ రెండు లోహాల మార్కెట్ విలువలో సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల మేర తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం.

యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు.. బంగారం ధరలు పెరగాలి. అయితే.. ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గడానికి కారణం బాండ్ మార్కెట్‌లో వచ్చిన మార్పులు. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బంగారం వంటి వడ్డీ ఇవ్వని ఆస్తులతో పోలిస్తే, బాండ్లు ఇప్పుడు ఆదాయం అందించే సురక్షిత మార్గంగా మారాయి. అందువల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తీసుకుని బాండ్లలో పెట్టడం ప్రారంభించారు.

ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అమెరికన్ డాలర్ బలపడటం. యుద్ధ పరిస్థితుల్లో డాలర్ కూడా సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతుంది. డాలర్ విలువ పెరిగితే, బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఇదే సమయంలో మార్కెట్‌లో లీవరేజ్ అధికంగా ఉండటం పరిస్థితిని మరింత తీవ్రమైంది చేసింది. ప్రస్తుతం లోహాల మార్కెట్లలో ఏదో జరుగుతోందని.. కోబేస్సీ లెటర్ వెల్లడించింది.

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడంతో, చాలా మంది ట్రేడర్లు అధిక రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టారు. ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైనప్పుడు, స్టాప్ లాస్ ఆర్డర్లు అమల్లోకి వచ్చాయి, మార్జిన్ కాల్స్ వచ్చాయి, పెట్టుబడిదారులు తమ పొజిషన్లను బలవంతంగా విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల ధరలు మరింత వేగంగా క్షీణించాయి.

భారతదేశంలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఇతర లోహాలు కూడా ఇదే దిశగా కదిలాయి. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లు ఎప్పుడూ సాంప్రదాయ సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించవు. పరిస్థితులు మారినప్పుడు సురక్షితమైనవిగా భావించే ఆస్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు, డాలర్ బలం, లిక్విడిటీ వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement