ఇక బంగారం కొనడం ఈజీ.. EGR గురించి తెలుసా? | NSE Introduces Electronic Gold Receipts Know The Details Here | Sakshi
Sakshi News home page

ఇక బంగారం కొనడం ఈజీ.. EGR గురించి తెలుసా?

May 5 2026 1:27 PM | Updated on May 5 2026 1:56 PM

NSE Introduces Electronic Gold Receipts Know The Details Here

భారతీయులకు బంగారంపై మక్కువ కొంత ఎక్కువ. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టడం అంత సులభం కాదు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేస్తే దాని నిల్వ, భద్రత, స్వచ్ఛత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ).. ఎల్రక్టానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌) అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది.

ఈజీఆర్‌ అంటే ఏమిటి?
ఈజీఆర్‌ అనేది సెబీ గుర్తింపు పొందిన వాల్ట్ మేనేజర్‌ వద్ద జమ చేసిన భౌతిక బంగారానికి బదులుగా జారీ చేసే ఒక ఎలక్ట్రానిక్ రసీదు. ఇవి డీమ్యాట్ రూపంలో ఉండే సెక్యూరిటీస్ కాబట్టి, స్టాక్‌ల మాదిరిగా ఎక్స్చేంజ్‌లో సులభంగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. అంటే, బంగారం ఇప్పుడు డిజిటల్ రూపంలో కూడా ట్రేడ్ చేయగలిగేలా మారిందన్నమాట.

EGRలు ఎలా పనిచేస్తాయి?
ప్రతి ఈజీఆర్‌ వెనుక నిజమైన ఫిజికల్ గోల్డ్ ఉంటుంది. ఉదాహరణకు.. ఎన్ఎస్ఈ ఒక 1000 గ్రాముల బంగారు గడ్డిని EGRగా మార్చింది. దీని ద్వారా భౌతిక బంగారం.. డిజిటల్ ఆస్తిగా మారుతుంది. పెట్టుబడిదారులు ఈ EGRలను స్టాక్‌ల మాదిరిగా ట్రేడ్ చేయవచ్చు. పెట్టుబడిదారులు తమ EGRలకు తగిన పరిమాణంలో భౌతిక బంగారాన్ని కూడా పొందవచ్చు.

EGR ప్రయోజనాలు

  • బంగారాన్ని భద్రపరచడం కోసం బ్యాంక్ లాకర్ అవసరం లేదు

  • దొంగతనం లేదా నష్టం ఉండదు

  • బంగారం స్వచ్ఛతపై సందేహం ఉండదు (ఎందుకంటే ఇది ప్రమాణిత సంస్థల ద్వారా ద్రువీకరిస్తారు)

  • చిన్న మొత్తాల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు

  • మార్కెట్‌లో సులభంగా కొనుగోలు/అమ్మకం చేయవచ్చు

ఇదీ చదవండి: బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement