బంగారం వెండి ధరలు ఎప్పుడెలా ఉంటాయో ఊహకందకుండాపోయింది. ఈ రోజు తగ్గితే.. రేపు పెరిగిపోతున్న పరిస్థితులు వారం రోజుల్లో కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (మే 3 నుంచి మే 9 వరకు) పసిడి ధరలు ఎలా మారాయి. ప్రస్తుతం ఏ మార్క్ దగ్గర ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.
హైదరాబాద్, విజయవాడ నగర్లో మే 3న (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం గోల్డ్ రేటు నేటికి (శనివారం) 1,52,350 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.1420 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల ధర ఈ సమయంలోనే 1,38,350 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,650 వద్దకు (రూ.1300 పెరిగింది) చేరింది.
ఇక చెన్నై నగరంలో వారం రోజుల్లో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. మే 3న రూ.152730 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు..154370 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,40,000 రూపాయల దగ్గర నుంచి 141500 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతలా పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో 1,51,230 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 1,52,500 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,38,500 నుంచి రూ.1,39,800 వద్దకు చేరింది.
వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. మే 3న రూ.2.70 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ రోజు రూ.2.80 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు వారం రోజుల్లో రూ.10 వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది.


