భారతదేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (ఏప్రిల్ 19 నుంచి 25 వరకు) పసిడి ధరలు ఎంత తగ్గాయి?, ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 19 (ఆదివారం) 1,55,780 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు శనివారం (ఏప్రిల్ 25) నాటికి 1,54,040 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఏడు రోజుల్లో 1,42,800 రూపాయల నుంచి రూ.1,41,200 వద్దకు చేరింది.
దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర వారం రోజుల్లో 1,55,930 రూపాయల దగ్గర నుంచి రూ.1,54,190 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,42,950 రూపాయల నుంచి 1,41,350 రూపాయల వద్దకు చేరింది.
చెన్నైలో బంగారం ధరలు తగ్గాయి. గత ఆదివారం (ఏప్రిల్ 19) రోజు రూ.1,56,660 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి.. ఏప్రిల్ 25 నాటికి 1,54,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 143600 రూపాయల వద్ద నుంచి 142000 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ధరలు ఎంతలా తగ్గాయో స్పష్టంగా తెలుస్తుంది.
వెండి ధరలు ఇలా..
బంగారం బాటలోనే.. వెండి కూడా అడుగులు వేసింది. ఏప్రిల్ 19న రూ.2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ ఏప్రిల్ 25 (శనివారం) నాటికి రూ.2.70 లక్షల వద్దకు చేరింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?


