వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా! | Gold and Silver Price Update in India | Sakshi
Sakshi News home page

వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!

Mar 28 2026 8:41 PM | Updated on Mar 28 2026 9:22 PM

Gold and Silver Price Update in India

బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.

చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.

ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.

వెండి ధరలు
వెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.

ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో సగం సెలవులే!

Advertisement
 
Advertisement
Advertisement