బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో సగం సెలవులే! | List of Bank Holidays in April 2026 | Sakshi
Sakshi News home page

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో సగం సెలవులే!

Mar 28 2026 7:33 PM | Updated on Mar 28 2026 7:48 PM

List of Bank Holidays in April 2026

మార్చి నెల దాదాపు ముగిసింది. ఇక రానున్నది ఏప్రిల్. ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితాను ఈ కథనంలో చూసేద్దాం.

ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సర ముగింపు కారణంగా.. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 2: మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే సందర్భంగా.. అగర్తలా, చండీగఢ్, గౌహతి, జైపూర్, జమ్మూ, శ్రీనగర్ మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 5: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 11: రెండవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 12: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ వంటి పండుగల సందర్భంగా ఐజ్వాల్, భోపాల్, చండీగఢ్, ఇటానగర్, కోహిమా, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సర దినం (నబబర్ష)/బోహాగ్ బిహు/విషు/హిమాచల్ దినం కారణంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కొచ్చి, కోల్‌కతా, సిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 16: బోహాగ్ బిహు సందర్భంగా గువహటిలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 19: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 20: బసవ జయంతి / అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా అగర్తలా బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 25: నాల్గవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 26: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)

అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement