కోలుకున్న పసిడి... అక్కడే వెండి | Gold prices in Delhi rose Rs 1200 to Rs 1. 44 lakh per 10 grams | Sakshi
Sakshi News home page

కోలుకున్న పసిడి... అక్కడే వెండి

Mar 25 2026 4:49 AM | Updated on Mar 25 2026 7:48 AM

Gold prices in Delhi rose Rs 1200 to Rs 1. 44 lakh per 10 grams

రూ.1,200 పెరుగుదల 

ఫ్లాట్‌గానే వెండి ధరలు

న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో 4 రోజుల వరుస నష్టాల నుంచి పసిడి బయటపడింది. మంగళవారం 10 గ్రాములకు రూ.1,200 పెరిగి రూ.1.44లక్షలకు (పన్నులు సహా) చేరుకుంది. వెండి ధర మాత్రం పెద్దగా మార్పు లేకుండా కిలోకి రూ.2.30 లక్షల వద్దే ఉన్నట్టు ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లలో రికవరీకితోడు, కనిష్ట స్థాయిల్లో కొనగోళ్ల మద్దతుతో బంగారం ధర పెరిగినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో పసిడి ఔన్స్‌కు 17 డాలర్ల వరకు పెరిగి 4,423 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి సైతం 1% పుంజుకుని ఔన్స్‌కు 69.86 డాలర్ల స్థాయిని చేరుకుంది. ‘9 రోజుల క్షీణత తర్వాత స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు 4,420 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇరాన్‌ పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో అప్రమత్తతతో కూడిన ఆశావహధోరణి కనిపించింది’ అని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ కమోడిటీస్‌ హెడ్‌ ప్రవీణ్‌ సింగ్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement