గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు! | Gold Prices Surge Within Hours Latest Rates in Hyderabad Vijayawada Delhi | Sakshi
Sakshi News home page

గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!

May 7 2026 9:24 PM | Updated on May 7 2026 9:29 PM

Gold Prices Surge Within Hours Latest Rates in Hyderabad Vijayawada Delhi

మే 2026 ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. ఈ రోజు 24 గంటల వ్యవధిలోనే గోల్డ్ ధరలు మరోమారు ఎగబాకాయికి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

ఈ రోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 1,39,750 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,250 వద్దకు చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,52,460 నుంచి 1,53,000 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటలు గడవకముందే పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది.

ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,53,150 వద్దకు, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,400 వద్దకు చేరింది. అయితే చెన్నైలో మాత్రం ధరలు కేవలం తులం మీద 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.

ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement