వారం రోజుల్లో రూ.13 వేలు తగ్గిన బంగారం: కొత్త ధరలు ఇలా.. | Gold Prices Drop Sharply This Week Know The Latest Rates | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో రూ.13 వేలు తగ్గిన బంగారం: కొత్త ధరలు ఇలా..

Mar 21 2026 6:06 PM | Updated on Mar 21 2026 6:13 PM

Gold Prices Drop Sharply This Week Know The Latest Rates

బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా భారీ తగ్గడంతో పసిడి ప్రియులలో సంతోషం నెలకొంది. ఇంకా తగ్గే అవకాశం ఉందా? అన్నట్లు కొందరు వేచి చూస్తున్నారు. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటులో ఎంత వ్యత్యాసం ఉండనే విషయాలను తెలుసుకుందాం.

మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (శనివారం) 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.

చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,47,600 రూపాయల నుంచి 136200 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 161020 రూపాయల నుంచి 1,48,580 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారం రోజుల్లో ఎంత తగ్గిందనే విషయం స్పష్టమవుతోంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా వారం రోజుల్లో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. మార్చి 15న రూ.1,59,810 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు, మార్చి 21 నాటికి రూ.1,46,120 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,500 రూపాయల దగ్గర నుంచి రూ. 1,33,950 వద్దకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement