రూ.4400 తగ్గిన గోల్డ్ రేటు.. కొత్త ధరలు ఇలా! | Gold Price Crash Rates Plunge Within Hours in Hyderabad Vijayawada and Delhi | Sakshi
Sakshi News home page

రూ.4400 తగ్గిన గోల్డ్ రేటు.. కొత్త ధరలు ఇలా!

May 15 2026 7:28 PM | Updated on May 15 2026 7:59 PM

Gold Price Crash Rates Plunge Within Hours in Hyderabad Vijayawada and Delhi

గురువారం ఉదయం రూ.2240 తగ్గిన పసిడి ధర, సాయంత్రానికి రూ.4420 తగ్గింది. దీంతో బంగారం రేటు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (మే 15) ఉదయం 2050 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర, సాయంత్రానికి 4050 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల ధర ఉదయం 2240 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో రూ.2180 (మొత్తం రూ.4420 తగ్గింది) తగ్గింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధర భారీ పతనం చవిచూసిందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.4,050 తగ్గి రూ.1,44,900 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.4200 తగ్గి 1,58,060 రూపాయల వద్ద నిలిచింది.

చెన్నైలో కూడా బంగారం ధరల్లో మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,650 (2850 రూపాయలు తగ్గింది). 24 క్యారెట్ల ధర రూ.3100 తగ్గి 1,61,080 రూపాయల వద్దకు చేరింది. అయితే వెండి ధరల్లో సాయంత్రానికి చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. కాబట్టి సిల్వర్ రేటు ఉదయం ఎలా ఉందో.. అలాగే ఉంది.

మొత్తం మీద.. వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటుకు బ్రేకులు పడినట్లు అనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా భారీ ధరల తగ్గుదల నమోదైంది. అయితే.. రానున్న రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

Advertisement
 
Advertisement
Advertisement