బంగారం ధరలు భారీగా పెరుగుతూ.. తగ్గుతూ ఊహకందని మార్పులకు లోనవుతున్నాయి. వారం మధ్యలో పెరిగిన గోల్డ్ రేటు, వారాంతంలో ఒక్కసారిగా పడిపోయాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో జరిగిన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.
మే 10న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,52,350 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర, మే 16 నాటికి 1,56,930 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,650 వద్ద నుంచి 1,43,850 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతగా మార్పు చెందాయో స్పష్టంగా అర్థమవుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఏడురోజుల్లో 1,54,370 రూపాయల నుంచి 1,60,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,500 వద్ద నుంచి రూ.1,47,500 వద్దకు చేరింది. ఈ మార్పు కేవలం వారం రోజులలో జరిగింది.
ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరలు, వారం రోజుల్లో భారీ పెరుగుదలను నమోదు చేసాయి. మే 10న 1,52,500 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం రేటు మే 16నాటికి 1,57,080 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,39,800 నుంచి 1,44,000 రూపాయల వద్దకు చేరింది.
ధరలు పెరుగుదలకు కారణాలు
బంగారం ధరలు పెరగడానికి సాధారణంగా అనేక ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు ఉంటాయి. బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు లేదా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు షేర్లు, బాండ్లు వంటి రిస్కీ ఆస్తుల నుంచి డబ్బును తీసి బంగారంలో పెట్టడం పెరుగుతుంది. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఎగుస్తాయి.
అలాగే అమెరికా డాలర్ విలువ కూడా కీలకం. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది.
ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కూడా బంగారం ధరలు పెరుగుతాయి. కరెన్సీ విలువ తగ్గిపోతున్నప్పుడు ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం వైపు మొగ్గుతారు.
ఇంకో కారణం వడ్డీ రేట్లు. బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బంగారం ఆకర్షణ పెరుగుతుంది, ఎందుకంటే ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే లాభం తగ్గిపోతుంది. అదే విధంగా.. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఆభరణాల డిమాండ్ (వివాహ సీజన్‌లు, పండుగలు), అలాగే మార్కెట్ స్పెక్యులేషన్ కూడా ధరల పెరుగుదలకు కారణమవుతాయి.
ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే!


