భారతదేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఈ రోజు భారీ పతనాన్ని చవి చూసింది. దీంతో ఒక్కసారిగా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉంది?, సిల్వర్ ధరల్లో ఏమైనా మార్పు కనిపించిందా? అనే విషయాలను తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2780 తగ్గి 1,50,930 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 2550 రూపాయలు తగ్గి రూ.1,38,350 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.
చెన్నైలో గోల్డ్ రేటు వరుసగా రూ.1420, రూ.1300 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 153820 రూపాయల వద్ద, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.141000 వద్ద నిలిచాయి. ఈ ధరలు నిన్నటి (మంగళవారం)తో పోలిస్తే చాలా తక్కువ.
ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు పతనమయ్యాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,51,080 (రూ.2780 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,38,500 (రూ.2550 తగ్గింది) వద్ద ఉంది.
వెండి ధరలు ఇలా
బంగారం మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేటు రూ.2.65 లక్షలు (రూ.5000 తగ్గింది) వద్ద, ఢిల్లీలో రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.
ఇదీ చదవండి: అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా!


