బంగారం ధరలు.. ఊహకందని మార్పులు! | Latest Gold And Silver Rates In India, Prices Fluctuate Rapidly Across Cities, Check Out Price Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం ధరలు.. ఊహకందని మార్పులు!

Mar 31 2026 7:48 PM | Updated on Mar 31 2026 8:01 PM

Latest Gold and Silver Rates in India Prices Fluctuate Rapidly Across Cities

ఇటీవల కాలంలో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే ఊహకందని విధంగా మారిపోతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే.. సాయంత్రానికి మరో రేటు ఉంది. ఈ రోజు కూడా ఇదే బాటలు గోల్డ్ రేటు అడుగులు వేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 136850 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 137050 రూపాయల వద్దకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి ధర రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ. 149290 నుంచి 149510 రూపాయల వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో కూడా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల ధర 10 గ్రాముల బంగారం ధర 149660 రూపాయల వద్దకు చేరగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 137200 రూపాయాల వద్దకు చేరింది. ఈ రేట్లు ఉదయానికి, సాయంత్రానికి చాలా తేడా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

అయితే.. చెన్నై నగరంలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర 149130 రూపాయల వద్ద ఉంది.

వెండి ధరలు
కేజీ వెండి ధర రూ.250000 వద్ద ఉంది. ఈ రోజు (మంగళవారం) కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గడంతో రూ.2.5 లక్షల వద్ద నిలిచింది. అయితే ఢిల్లీలో వెండి రేటు రూ.5000 పెరిగింది. దీంతో అక్కడ కేజీ సిల్వర్ ధర రూ.2.5 లక్షల వద్ద ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement