వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు! | Gold Falls as Strong Dollar Gains Amid US Iran Tensions | Sakshi
Sakshi News home page

వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!

Apr 13 2026 11:11 PM | Updated on Apr 14 2026 12:03 AM

Gold Falls as Strong Dollar Gains Amid US Iran Tensions

పెరుగుదల దిశగా అడుగులు వేసిన గోల్డ్ రేటు ఈ రోజు (సోమవారం) తగ్గుదల వైపు పయనించింది. దీంతో బంగారం ధర కొంతమేర తగ్గింది. దీనికి కారణం యూఎస్ డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు అని తెలుస్తోంది. అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడం కూడా బంగారం ధరలు పెరుగుదలకు మరో కారణం అయింది.

శాంతి చర్చలు విఫలమైన తర్వాత, ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా - ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఈ సంఘటనల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్లు దాటాయి.

చమురు ధరలు పెరగడం అంటే రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం. దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్, వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇష్టపడవు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులు తగ్గుతాయి. అందువల్ల బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉంది.

2026 ప్రారంభంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే కియోసాకి వంటి విశ్లేషకులు గోల్డ్ రేటు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడి పెడితే ధనవంతులవుతారని చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement