ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. బంగారం కొనుగోలు చేయొచ్చా? | Can You Still Trust Gold Or Are Trump Mood Swings Turning It Into A Trap? | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. బంగారం కొనుగోలు చేయొచ్చా?

Mar 25 2026 2:15 PM | Updated on Mar 25 2026 2:39 PM

Can You Still Trust Gold Or Are Trump Mood Swings Turning It Into A Trap?

వాష్టింగన్‌: ఇరాన్‌పై యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే, ఈ ఒడిదుడుకుల్లో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.     

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వరుస ప్రకటనలతో బంగారం పెట్టుబడి దారుల్లో అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడుల్ని ముగించేలా ట్రంప్‌ సంకేతాలు పంపించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా 4శాతం పెరిగింది. కానీ దీని వెనుక ఉన్న అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళంలోకి నెడుతోంది. అమెరికా అధ్యక్షుడు హర్మూజ్‌ జలసంధి అంశంలో ఇరాన్‌ తమకు ఓ బహుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రకటనతో ఇరాన్‌పై యుద్ధం అంశంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్‌లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫలితంగా  బంగారం ధర ఔన్స్‌కి 4,550 డాలర్లను దాటింది

దీంతో తొమ్మిది రోజుల వరుస నష్టాల తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.  ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయి ఔన్స్ బంగారం 5,626 డాలర్ల ధర దాదాపు 20శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కారణంగా బంగారంలో పెట్టుబడులు సురక్షితమేనా అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారు

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెట్‌ నిపుణులు నవీన్ పీఎంటీ బంగారం పెరుగుదలని ‘హెడ్‌లైన్‌  రిస్క్ వోలాటిలిటీ’గా అభివర్ణించారు. ‘మార్కెట్ యుద్ధ భయాల నుంచి శాంతి వైపు అడుగులు పడేలా చేస్తోంది. ఇది నిజమైన నమ్మకం కాదు  ఒక రీలీఫ్ ర్యాలీ మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనిషా భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.  భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయి. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.  

వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావం
చమరు  ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.

కేంద్ర బ్యాంకుల ధోరణి
గత రెండు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత విరామం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో డాలర్‌పై ఆధార పడటాన్ని తగ్గించి బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత అస్థిరత బంగారం స్వభావాన్ని మార్చడం లేదు. తాత్కాలికంగా లిక్విడిటీ ఒత్తిడి కారణంగా బంగారం రిస్క్ ఆస్తిలా ప్రవర్తించినా, పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల, వ్యవస్థాపక ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణగా నిలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు రక్షణా ఆస్తిగానే కొనసాగుతుంది. కానీ తక్షణ లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ధరలలో మార్పులు కొనసాగుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement