ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. శవంపై బంగారం మాయం | Gold Earrings Missing From Deceased Woman At Jagtial Government Hospital, Family Alleges Theft | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. శవంపై బంగారం మాయం

Apr 23 2026 1:06 PM | Updated on Apr 23 2026 3:00 PM

Gold On The Body Disappeared At Jagtial Government Hospital

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. చనిపోయిన వృద్ధురాలికి ఉన్న బంగారు కమ్మలు మాయమయ్యాయి. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను బంధువులు.. ఐసీయూలో చేర్చారు.

చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం వృద్ధురాలు ఉదయం మృతి చెందింది. వృద్ధురాలి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కమ్మలు కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిపై వృద్ధురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందే తీసేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement