Archive Page | Sakshi
Sakshi News home page

Orissa

  • సైబర్

    కొరాపుట్‌: సైబర్‌ నేరాలపై అవగాహన కోసం నబరంగ్‌పూర్‌ జిల్లా ఎస్పీ సందీప్‌ సంపత్‌ మడకర్‌ స్వయంగా ప్రచారం చేశారు. ఆదివారం నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో సైకిల్‌ తొక్కుతూ పర్యటించారు. ప్రతి జంక్షన్‌ వద్ద సైకిల్‌ను నిలిపి బాటసారులతో మాట్లాడారు. ప్రాడ్‌ కాల్స్‌కి రిప్‌లై ఇవ్వొద్దని, ఫోన్‌కు వచ్చే ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని, అకౌంట్లలో డబ్బులు మాయమైతే వెంటనే సైబర్‌ సెల్‌కి ఫోన్‌ చేయాలని సూచించారు. అవగాహన కల్పించేందుకు కర పత్రాలు అందజేశారు. పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    రాయఘడలో..

    పర్లాకిమిడి: సైబర్‌ నేరాలు, ప్రజల భద్రతపై జిల్లాలోని రాయఘడ పోలీస్‌ స్టేషన్‌ నుంచి మార్కెట్‌, బస్టాండ్‌ వరకు అవగాహన ర్యాలీని రాయఘడ ఐఐసీ, పి.ఎం.శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించారు. సైబర్‌ నేరాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి అమితాబ్‌ పండా సూచించారు. ఆర్‌.ఉదయగిరి బ్లాక్‌లోని చెలిగడ వారపు సంత వద్ద సైబర్‌ నేరాలపై షార్ట్‌ ఫిల్ములు, మొబైల్‌ స్క్రీన్‌పై ప్రసారం చేసి ప్రజలను చైతన్య పరిచారు. సైబర్‌ మోసాలకు గురైనవారు టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కు తక్షణమే ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్‌ సురక్షిత ప్రచారం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియజేశారు.

  • బస్సు

    టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం దంత గ్రామానికి చెందిన చాకిపల్లి సుందరమ్మ(62) అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుందరమ్మ కుమార్తె రాడ నీలవేణి శనివారం దంత గ్రామంలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. ఆమెను తిరిగి వారి గ్రామానికి పంపించేందుకు కొత్తమ్మ తల్లి గుడి వద్దకు సుందరమ్మ కూడా వెళ్లింది. ఈ క్రమంలో టెక్కలి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గ్రామం వద్దకు వచ్చి రిటర్న్‌ చేస్తున్న క్రమంలో సుందరమ్మను ఢీకొట్టింది. బస్సుకు, వెనుక ఉన్న బండరాయికి మధ్య ఇరుక్కుపోవడంతో నడుముకి తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కోటబొమ్మాళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    నీలమణిదుర్గ సన్నిధిలో విదేశీయులు

    పాతపట్నం: ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారిని లండన్‌కు చెందిన మహిళలు రీటా, ఫ్లేలు శుక్రవారం దర్శించుకున్నారు. కుంకుమ పూజలు నిర్వహించారు. స్నేహితుల పెళ్లి కోసం భారత్‌ వచ్చామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు టి.రాజేష్‌ పాల్గొన్నారు.

    రేపటి నుంచి సిక్కోలు పుస్తక మహోత్సవం

    శ్రీకాకుళం/శ్రీకాకుళం కల్చరల్‌: సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలలో భాగంగా శ్రీకాకుళం ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఈ నెల 11 నుంచి 20 వరకు సిక్కోలు పుస్తక మహోత్సవాలు నిర్వహించనున్నామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ అన్నారు. శ్రీకాకుళం యూటీఎఫ్‌ భవన్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక మహోత్సవం సందర్భంగా ఆదివారం బైక్‌ ర్యాలీ, పోస్టర్‌ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన ప్రతి రోజు సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ నెల 15 నుంచి 17 తేదీలలో ఉత్తరాంధ్ర స్ధాయి మ్యాజిక్‌ వర్క్‌ షాప్‌ను శ్రీకాకుళంలోని యూటీఎఫ్‌ భవన్‌లో నిర్వహించనున్నామన్నారు. ఔత్సహితులైన సైన్సు ఉద్యమ అభిమానులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 23న జిల్లా స్థాయి చెకుముకి సైన్సు సంబరాలు శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, 83 మంది మండల స్ధాయి విజేతల బృందంతో నిర్వహించనున్నామని వివరించారు. కార్యక్రమంలో చెకుముకి జిల్లా కన్వీనర్‌ పి.కూర్మారావు, గౌరవ అధ్యక్షుడు బి.మోహనరావు, ఎం.ప్రదీప్‌, ఎం.వాగ్ధేవి, హెచ్‌ మన్మధరావు, బి.వెంకటరావు, సీహెచ్‌ ఉమామహేశ్వర్‌, ఎస్‌ సంజీవరావు, పి.జగదీశ్వరరావు, టి.ఎర్రమ్మ, కృష్ణారావు పాల్గొన్నారు.

  • స్వచ్

    అదనపు కలెక్టర్‌ నవీన్‌ చంద్ర నాయక్‌

    రాయగడ: స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలను తరచూ నిర్వహిస్తు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా అదనపు కలెక్టర్‌ నవీన్‌ చంద్ర నాయక్‌ అన్నారు. ఆదివారం స్థానిక లయన్స్‌ క్లబ్‌, సంబాద్‌ సంస్థలు సంయుక్తంగా లయన్స్‌ క్లబ్‌ సమావేశం హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థల పనితీరును ఆయన ప్రశంసించారు. శిబిరాల ద్వారా కొత్త దాతలు వచ్చేలా కృషి చేస్తే రక్త యూనిట్ల సేకరణ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు . జిల్లా కేంద్రాసుపత్రిలో రోజూ ఎంతోమంది రక్తం అవశ్యకతతో సతమతమవుతున్నారని అటువంటి వారికి ఈ తరహా రక్తాన్ని సకాలంలొ అందించే ప్రయత్నం అభినందించాల్సిన విషయమని అన్నారు . యువకులు అపొహాలు వీడి రక్తదాన శిబిరాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు లాల్‌ బిహారి లెంక, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఏవీఎస్‌ గిరి, డాక్టర్‌ డీకే మహాంతిల ఆధ్వర్యంలో జరిగిన శిబిరానికి డాక్టర్‌ వి.లోక్‌నాథ్‌ రాజు, డాక్టర్‌ గౌతం పట్నాయక్‌ పర్యవేక్షించారు. శిబిరంలో 50 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సంబాద్‌ సంస్థ ప్రతినిధి శివ ప్రసాద్‌ దొర రక్తదానం చేయడంతోపాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనను లయన్స్‌ సభ్యులు అభినందించారు.

  • మానవత

    మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో బిబిగూడ పాఠశాలలో శనివారం ఆర్‌ఐ పరీక్ష రాసేందుకు ఓ బాలింత వచ్చింది. రెండు నెలల పాపను అక్కడి అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదని చెప్పారు. దీంతో పాపకు పాలు ఇవ్వడం కష్టమవుతుందని, పరీక్ష రాయనని అంటున్న భైరవి మండాల్‌ దగ్గరకు రజనీ మాఝి అనే మహిళా కానిస్టేబుల్‌ వచ్చింది. తాను బిడ్డను చూస్తానని, పరీక్ష రాసి రావాలని ఆమెను ప్రోత్సహించింది. రజినీ చూపిన మానవత్వం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాపకు పాలు ఇచ్చి తల్లి వచ్చేవరకు బాగా చూసింది. ఆమెకు తోటి ఉద్యోగులు సహకరించారు. రజినీకి కూడా 9 నెలల బాబు ఉన్నాడు. అందువల్లే మరో తల్లి బాధను అర్థం చేసుకుంది. రజినీ సహకారంతో తాను పరీక్ష బాగా రాశానని భైరవి మండాళ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Komaram Bheem

  • ఆరోగ్య యోగం!

    ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం జిల్లాలో ఎంపిక చేసిన పీఎంశ్రీ పాఠశాలల్లో యోగా తరగతులు నిర్వహిస్తోంది. ఆయా పాఠశాలల్లో శిక్షకులను నియమించి.. ప్రతిరోజూ గంటపాటు బాలికలతో సాధన చేయిస్తున్నారు. విద్యార్థినుల్లో జ్ఞాపక శక్తి పెరిగి చదువుతోపాటు ఇతర అంశాల్లో చురుగ్గా రాణిస్తారని శిక్షకులు చెబుతున్నారు.

    బాలికలకు యోగా

    విద్యార్థులను ఒత్తిడిని నుంచి దూరం చేసేందుకు ప్రస్తుతం జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో యోగా శిక్షకులను నియమించారు. ప్రతిరోజూ సాయంత్రం వీరు యోగా సాధన చేయిస్తున్నారు. చదువుతోపాటు బాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆయా స్కూళ్లకు సంగీత వాయిద్య పరికరాలు కూడా అందించారు. నిత్య జీవనంలో యోగాతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని శిక్షకులు పేర్కొంటున్నారు. గంటపాటు బాలికలు ఉత్సాహంగా ఆసనాలు వేస్తున్నారని చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా యోగా, క్రీడాశిక్షకులకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం అందిస్తున్నారు. సంబంధిత నిధులు మొదట పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఖాతాల్లో జమ అవుతుండగా, వారు శిక్షకులకు అందిస్తున్నారు.

    ఎంపికై న పాఠశాలలు ఇవే..

    పీఎంశ్రీ పథకానికి జిల్లాలో 18 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆసిఫాబాద్‌ మండలంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, బెజ్జూర్‌లోని ఎంపీపీఎస్‌ సలుగుపల్లి, చింతలమానెపల్లిలోని ఉన్నత పాఠశాల బాబాసాగర్‌, దహెగాంలో చిన్న రాస్పెల్లి, జైనూర్‌లోని ఆశ్రమ పాఠశాల, కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ జీహెచ్‌ఎస్‌ ఓల్డ్‌ స్కూల్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గన్నారం మైనార్టీ గురుకులం, కెరమెరిలోని సావర్‌ఖేడా, కౌటాలలోని యూపీఎస్‌ బండలెట్టి, పెంచికల్‌పేట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రెబ్బెనలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సిర్పూర్‌(టి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సిర్పూర్‌(యూ) తెలంగాణ మోడల్‌ స్కూల్‌, తిర్యాణిలోని యూపీఎస్‌ గంభీరావుపేట్‌, వాంకిడిలో కస్తూరిబా గాంధీ విద్యాలయం, వాంకిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో 16 చోట్ల యోగా తరగతులు నిర్వహిస్తుండగా, రెండుచోట్ల మాత్రం అమలు కావడం లేదు.

    18 పీఎంశ్రీ పాఠశాలలు

    ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) అమలు చేస్తోంది. పీఎంశ్రీ పథకానికి జిల్లాలోని 18 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో 16 బడుల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయా స్కూళ్లలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అధునాతన బోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో తరగతి గదులు, లైబ్రరీలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పీఎంశ్రీ కింద ఎంపికై న స్కూళ్లకు రానున్న ఐదేళ్లలో ఒక్కో పాఠశాలకు రూ.3 కోట్ల చొప్పున మంజూరు చేయనున్నారు. విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పన కోసం వీటిని ఖర్చు చేయనున్నారు.

  • కొనుగోలు కేంద్రాల్లో   వసతులు కల్పించాలి

    బెజ్జూర్‌(సిర్పూర్‌): రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటి అన్నారు. బెజ్జూర్‌, బారేగూడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్థలాలను ఆదివారం పరిశీలించారు. రైతులు సులభంగా ధాన్యం విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయా.. లేదా.. అని ఆరా తీశారు. మార్కెటింగ్‌ స్థలాన్ని పరిశీలించారు. వర్షం, రద్దీ, ఇతర వసతుల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు. డీఏవో మాట్లాడుతూ రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రం ఇన్‌చార్జి జె.రంగయ్య, వీవోఏ పి.సంతోష్‌, ఏపీఎం ఆర్‌.మోహన్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

  • అబ్జర్వర్‌గా విద్యాసాగర్‌

    ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా పోటీలకు టాలెంట్‌ ఐడెంటిఫికేషన్‌ అబ్జర్వర్‌గా జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడాపాఠశాలలో అథ్లెటిక్స్‌ శిక్షకుడిగా విధులు నిర్వర్తిస్తున్న విద్యాసాగర్‌ నామినేటెడ్‌ అయినట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ సారంగపాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఖేల్‌ ఇండియా ఆధ్వర్యంలో జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌లో పోటీలకు అబ్జర్వర్‌గా పనిచేస్తారని పేర్కొన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌ లెవల్‌ 2 కోర్స్‌ పూర్తి చేసినందుకు ఈ అవకాశం లభించిందన్నారు. గిరిజనశాఖ డీడీ రమాదేవి, క్రీడల అధికారి షేకు, హెచ్‌ఎం జంగు తదితరులు విద్యాసాగర్‌ను అభినందించారు.

  • ఆయిల్

    లక్ష్మణచాంద: అన్నదాతలకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటల సాగుపై కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఒకసారి నాటితే 30 ఏళ్లు ఆదాయం వచ్చే ఈ పంటపై రైతుల్లో ఇంకా సరైన అవగాహన లేకపోవడంతో సాగు ఆశించిన స్థాయిలో జరగలేదు. వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్‌) భాగస్వామ్యంతో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల పీఏసీఎస్‌ సీఈవోలతో సమీక్ష నిర్వహించారు.

    ఒక్కో సొసైటీకి 100 ఎకరాలు..

    ఒక్కో పీఏసీఎస్‌ పరిధిలో కనీసం 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మల్‌ జిల్లా సహకార అధికారి నర్సయ్య తెలిపారు. సొసైటీలో సభ్యులైన రైతులతో సమావేశాలు నిర్వహించి పంట లాభాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 17 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి 40 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సంఘం తమ పరిధిలో లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలని సూచించారు.

    ఉమ్మడి జిల్లాలో ప్రగతి

    ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో 8,786 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 3,092 ఎకరాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 2,505 ఎకరాలు, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 1,187 ఎకరాల్లో సాగవుతోంది. ఉమ్మడి జిల్లాలో 15,570 ఎకరాలు ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు. ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం వివిధ రకాలు రాయితీలు అందిస్తోంది. ఒక ఆయిల్‌పామ్‌ మొక్క ధర రూ.193 ఉండగా, సబ్సిడీపై కేవలం రూ.20కే అందిస్తుంది. ఎకరంలో సగటుగా 50–55 మొక్కలు నాటేందుకు అవసరమైన రూ.10,615 విలువైన మొక్కలను కేవలం రూ.1,100లకే రైతులకు అందిస్తోంది. అలాగే బిందు సేద్యం పరికరాలను రాయితీతో అందిస్తూ, ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు నగదు ప్రోత్సాహకం ఇస్తోంది. అదనంగా పవర్‌ టిల్లర్లు, బ్రష్‌ కట్టర్లు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, బీసీ రైతులకు 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు.

    లక్ష్యం పూర్తికి చర్యలు

    ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒక్కో పీఏసీఎస్‌కు నిరేశించిన లక్ష్యం 100 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును చేరేందుకు త్వరలో రైతులతో సమావేశాలు నిర్వహిస్తాం. ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించి, లక్ష్యం పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం.

    – నర్సయ్య, జిల్లా సహకార అధికారి, నిర్మల్‌ జిల్లా

    సాగు విస్తీర్ణం పెంపునకు కృషి

    ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రాథమిక సహకార సంఘాల సమన్వయంతో సాగు విస్తీర్ణం పెంచడానికి చర్యలు చేపడతాం. రైతులను ప్రోత్సహిస్తాం.

    – బీవీ రమణ,

    జిల్లా హార్టికల్చర్‌ అధికారి, నిర్మల్‌

  • ‘గుర్

    కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మిల్లు పునఃప్రారంభమైన తర్వాత ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతాయని ఆశించిన కార్మి కులకు నిరాశే మిగులుతోంది. ఎస్పీఎంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు మిల్లు యాజమాన్యం మొదటి నుంచి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందనే క్రమంలో మరోసారి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మళ్లీ ఎన్నికల నిర్వహణకు బ్రేక్‌ పడింది.

    అక్టోబర్‌ 28న సమావేశం

    గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం అక్టోబర్‌ 28న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆదిలాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ రాజేశ్వరి కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తొమ్మిది సంఘాలు హాజరయ్యాయి. కానీ ఎస్పీఎం యాజమాన్యం నుంచి ప్రతినిధులె వ్వరూ హాజరు కాలేదు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికా రి ఎస్పీఎం ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడి ఈ నెల 3లోగా కార్మికుల ఓటరు జాబితాను పంపించాలని చెప్పడంతో అంగీకరించారు. కానీ యాజ మాన్యం కార్మిక శాఖకు ఓటరు జాబితా అందించకుండానే గత నెల 27 తేదీనే కోర్టుకు వెళ్లింది. మిల్లు లీగల్‌ ఛీప్‌ మేనేజర్‌ కేఎన్‌ శేషగోపాల్‌ ఎన్నికల నిర్వహణకు ముందుగానే అర్హత కలిగిన సంఘాలను గుర్తించాలని, ఆ తర్వాతే ఎన్నికల ప్రక్రియకు ముందుకెళ్లాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మిల్లులోని 15 కార్మిక సంఘాలతోపాటు జాయింట్‌ కమిషనర్‌ లేబర్‌, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ను కూడా ప్రతివాదులుగా చేర్చారు.

    సకాలంలో అందని నోటీసులు

    మిల్లు యాజమాన్యం వేసిన పిటిషన్‌పై అభ్యంతరాలు ఉన్న కార్మిక సంఘాలు ఈ నెల 3న వ్యక్తిగతంగా గానీ, వారి తరఫు న్యాయవాది హైకోర్టులో హాజరుకావాలని నోటీసులను పంపించారు. కానీ ఈ నోటీసులు తెలుగునాడు సిర్పూరు పేపర్‌మిల్స్‌ కార్మిక పరిషత్‌(ఈ–734)సంఘానికి మాత్రమే సకాలంలో అందాయి. మిలిగిన సంఘాలకు అందలేదు. విషయం తెలుసుకున్న సీఐటీయూ అనుబంధ సిర్పూర్‌ పేపరు మిల్స్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఈ 3510) హైకోర్టులో వకాలత్‌ వేసింది. దీంతో కోర్టు ఈ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది. ఆ రోజు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది.

    ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్ర

    ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలను అడ్డుకునేందుకు యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎన్నికలను అడ్డుకోవడం అప్రజాస్వామి కం. మిల్లు యాజమాన్యం వెంటనే పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలి.

    – అంబాల ఓదెలు, ఉపాధ్యక్షుడు,

    ఎస్పీఎం ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈ–966)

    నోటీసులు అందకుండా..

    యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికలను అడ్డుకునేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేస్తోంది. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన కార్మిక శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఒక్క యూనియన్‌కు కూడా నోటీసులు అందకుండా చేసింది. ఈ నెల 3న హైకోర్టులో హాజరుకాకపోతే యాజమాన్యానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. దీంతో తమ యూనియన్‌ నాయకులు కోర్టులో వకాలత్‌ వేశారు.

    – కూశన రాజన్న, ప్రధాన కార్యదర్శి,

    మజ్దూర్‌ యూనియన్‌(ఈ–2510)

  • కుముర

    7

    మామిడిలో జాగ్రత్తలు తప్పనిసరి

    మామిడిలో పూతకు ముందు, కాయదశలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని హెచ్‌వో కళ్యాణి సూచించారు. సస్యసంరక్షణ చర్యలను వివరించారు.

    వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి ఉష్ణోత్రలు సాధారణం కన్నా తగ్గుతాయి. సాయంత్రం నుంచే చలి ప్రభావం మొదలవుతుంది. చల్లగాలి వీస్తుంది.

    ఒత్తిడి తట్టుకోలేక..!

    ఇటీవల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేక, పరిష్కా ర మార్గం కనుగొనే ఆలోచన రాక కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

  • ఎస్టీపీపీలో మరో ప్లాంట్‌

    జైపూర్‌: మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లిలో 800 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి కొత్త విద్యుత్‌ ప్లాంటు నిర్మిస్తామని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాంనాయక్‌ తెలిపారు. ఇందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎస్టీపీపీ(సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌)ను ప్లాంట్‌ ఈఅండ్‌ఎం తిరుమల్‌రావుతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈడీ చిరంజీవి, జీఎంలు నరసింహారావు, మదన్‌మోహన్‌ సీఎండీకి స్వాగతం పలికారు. అనంతరం బలరాం నూతనంగా నిర్మించే ప్లాంట్‌ ప్రదేశంతోపాటు ప్లాంట్‌లో నూతనంగా చేపట్టిన మిథనాల్‌ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ను పరిశీలించారు. ప్లాంట్‌ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఇందారం ఓపెన్‌కాస్ట్‌ గనిని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున బొగ్గు, ఓబీ వార్షిక లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎండీ వెంట ఎస్‌ఓటూ జీఎం సత్యనారాయణ, పీవో వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు హరినారాయణ, రాజన్న, జక్కారెడ్డి ఉన్నారు.

  • రద్దీకి అనుగుణంగా   పటిష్ట బందోబస్తు

    కౌటాల(సిర్పూర్‌): కౌటాల కంకలమ్మ జాతరకు రద్దీకి అనుగుణంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌ తెలిపారు. కౌటాల కంకలమ్మ ఆలయం వద్ద జాతర ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న నిర్వహించే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని, రద్దీ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు. ఆయన వెంట సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సై చంద్రశేఖర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ సుల్వ కనకయ్య, పోలీస్‌ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • గురుకుల విద్యార్థినుల ప్రతిభ

    ఆసిఫాబాద్‌అర్బన్‌: మండలంలోని బాబాపూర్‌ మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు క్రీడల్లో సత్తా చాటారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి అండర్‌– 17 విభాగం పోటీల్లో క్రీడాకారులు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించారు. వాలీబాల్‌లో స్మృతి, ఖోఖోలో కావ్య, కబడ్డీలో వైష్ణవి, చెస్‌లో సహస్ర, డిస్క్‌త్రోలో హిమబిందు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని పీఈటీ ఫౌసియా తెలిపారు. అలాగే రన్నింగ్‌లో బిక్కుబాయి, షార్ట్‌పుట్‌లో సుజాత ద్వితీయస్థానంలో నిలిచారని పేర్కొన్నారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్‌ సుకన్య, అధ్యాపకులు అభినందించారు.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) తుదిశ్వాస విడిచారు (Ande Sri Death). ఆదివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  సోమవారం ఉదయం 7:25 గంటలకు అందెశ్రీ చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.  

    ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాంలోని రేబర్తిలో జూలై 18, 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీకి ముగ్గరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నగదు పురస్కారం అందుకున్నారు. 

    కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తెలంగాణ, ప్రకృతి వంటి అంశాలపై అందెశ్రీ గేయరచన చేశారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచనలు ప్రజలలో చైతన్యం నింపాయి. ఆయన రచనలు, పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

    2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో నకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌ నాయక్‌ పురస్కారం, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి అందెశ్రీ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

     

     

Khammam

  • కౌలు
    ● పత్తి అమ్మకంలో అన్నీ అవాంతరాలే.. ● ప్రత్యేక సైట్‌ ఏర్పాటు చేసినా అమలులో జాప్యం ● భూభారతిలో నమోదు కాకున్నా, ఫోన్‌ నంబర్‌ మారినా తప్పని ఇక్కట్లు

    ఖమ్మంవ్యవసాయం: కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) జిన్నింగ్‌ మిల్లుల్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతులకు పంట అమ్మకానికి అవకాశం కల్పించటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పంటల సాగులో పట్టాదారుల(భూ యజమానులు) కన్నా కౌలుదారుల పాత్ర కీలకంగా ఉంది. రైతుల నుంచి ప్రాంతాన్ని, నీటివనరులు, నేలల రకాలను బట్టి ఎకరాకు ఏడాదికి రూ. 20 వేల నుంచి రూ.50 వేల వరకు కౌలు చెల్లిస్తున్న పలువురు.. ఏడాదికి రెండు పంటలు సాగు చేస్తున్నారు. అయితే పంటల విక్రయాల్లో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు అమ్మాలంటే ప్రభుత్వం షరతులు విధించింది. పట్టాదారు పాస్‌ బుక్‌ ఆధారంగా పండించిన పంటలనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునే అవకాశం ఉండగా కౌలు రైతులు అది కోల్పోతున్నారు. గతంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ విధానంలో కౌలు రైతులకు పంట విక్రయాలకు అవకాశం కల్పించారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకోవడంతో ఈ ఏడాది కౌలు రైతులకు పత్తి విక్రయానికి ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు నోచడం లేదు. దీంతో పాటు నాన్‌ డిజిటల్‌ విధానంలో పంటలు నమోదైన వారు, ఫోన్‌ నంబర్లు మారిన రైతులు కూడా పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించలేక ఇబ్బంది పడుతున్నారు.

    యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ లేదు..

    పత్తి అమ్మకానికి కౌలు రైతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా సైట్‌ కేటాయించింది. ఈ సైట్‌ అమలుకు యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌లను ఏఈఓలకు కేటాయించలేదు. దీంతో సీసీఐ రూపొందించిన కపాస్‌ కిసాన్‌ యాప్‌లో కౌలు రైతులకు స్లాట్‌ బుక్‌ కాకపోవడంతో వారు ఏఈఓల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ సైట్‌ను ఏ శాఖ ద్వారా అమలు చేస్తోందనేది స్పష్టత లేదు. గతంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్లను మాత్రం మార్కెటింగ్‌ శాఖ ద్వారా అమలు చేసింది. ప్రస్తుతం రూపొందించిన నూతన సైట్‌కు యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌లు కల్పించకపోవడంతో ఏఈఓలు చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోనే లక్ష మంది కౌలు రైతులు దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మకానికి అవకాశం లభించ లేదు. ఇక నాన్‌ డిజిటల్‌ విధానంలో పంట నమోదైన రైతులదీ ఇదే పరిస్థితి. పత్తి విక్రయానికి కపాస్‌ కిసాన్‌ యాప్‌ ఓపెన్‌ కాక ఆయా రైతులు సీసీఐలో పత్తి అమ్మలేకపోతున్నారు.

    భూభారతిలో లేకపోయినా అంతే..

    ప్రభుత్వం రూపొందించిన భూభారతిలో భూ వివరాలు నమోదు కానివారికి కూడా సీసీఐలో పంట విక్రయానికి అనుమతులు లేవు. ఈ విధానంలో కూడా రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రతి గ్రామంలో 50 మందికి పైగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

    ఫోన్‌ నంబర్లు మారితే ఖతమే..

    ప్రభుత్వం వద్ద డేటాలో ఉన్న రైతు ఫోన్‌ నంబర్‌ మారినా పత్తి విక్రయానికి అవకాశం చేజారుతుంది. కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో నమోదు చేసే ఫోన్‌ నంబర్‌, డేటాలో ఉన్న ఫోన్‌ నంబర్‌కు తేడా ఉంటే స్లాట్‌ బుకింగ్‌ను తిరస్కరిస్తుంది. తిరిగి నమోదుకు అవకాశం ఉన్నా.. రోజుల తరబడి సమయం పడుతోంది. దీని కోసం రైతులు ఏఈఓల చుట్టూ తిరగక తప్పడం లేదు. ఇలా పత్తి విక్రయాల్లో అడుగడుగునా రైతులు ఆటంకాలు ఎదుర్కొంటున్నారు.

    మూడెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశా. ప్రైవేటు మార్కెట్‌లో పత్తికి ధర లభించడం లేదు. సీసీఐలో విక్రయానికి స్లాట్‌ బుక్‌ కోసం ప్రయత్నం చేశా. ఏఈఓ సైట్‌ ఓపెన్‌ కావడం లేదన్నారు. వారం రోజులు ప్రయత్నించినా ఫలితం లేక ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చి క్వింటా రూ.6వేల చొప్పున విక్రయించా.

    – బాదావత్‌ కృష్ణమూర్తి, రాజుతండా,

    మహబూబాబాద్‌ జిల్లా

    కౌలు రైతుకు కేటాయించిన సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో సీసీఐలో పత్తి విక్రయించలేకపోతున్నాం. 20 రోజులుగా ఏఈఓ చుట్టూ తిరుగుతున్నా. 8 ఎకరాల్లో పత్తి సాగు చేశా. వ్యాపారులు రూ. 6,500కు మించి ధర పెట్టడం లేదు. సీసీఐ కేంద్రంలో పంట విక్రయానికి అవరోధాలు ఉన్నాయి. తగిన తేమశాతంతో పంటను సిద్ధం చేశాం. సీసీఐ అవకాశం కల్పిస్తే విక్రయించుకుంటాం.

    – దారగాని బాబు, గంధసిరి, ముదిగొండ మండలం

  • ఆమె చేతిలో విద్యుత్‌!

    ఎర్రుపాలెం: జిల్లాలోని ఎర్రుపాలెం మండలం వెంకటాపురం, నారాయణపురం ఐకేపీ సంఘాల ద్వారా త్వరలోనే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం పలు పథకాలు అమలుచేస్తోంది. ఈ క్రమంలోనే సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్రంలోనే తొలిసారి పైలట్‌ ప్రాజెక్టుగా వెంకటాపురం, నారాయణపురం సంఘాలను ఎంపిక చేశారు. ఇప్పటికే మండల ఐకేపీ(చైతన్య) సమాఖ్య ద్వారా రూ.36లక్షలతో బస్సు కొనుగోలు చేసి ఇల్లెందు ఆర్టీసీ డిపోకు అద్దె ప్రాతిపదికన ఇచ్చారు. తద్వారా ప్రతీ నెల సమాఖ్యకు రూ.69,468 అద్దె రూపంలో లభిస్తోంది. ఇందులో రుణం పోగా కొంత ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కూడా ఈ మండలంలోని సమాఖ్యలను ఎంపిక చేయడం విశేషం.

    రోజుకు 4వేల యూనిట్లు

    ఎర్రుపాలెం మండలం రాజుపాలెం రెవెన్యూ పరిధి వెంకటాపురంలోని సర్వే నంబర్‌ 102లో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు నాలుగు ఎకరాల భూమి కేటాయించారు. ఇందులో ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.3 కోట్లు బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయించింది. అలాగే, నిర్మాణ పనులను సాయి బాపూజీ ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ టెండర్‌ ద్వారా దక్కించుకోగా.. నిర్మాణం పూర్తయ్యాక ఏడాది పాటు ఈ సంస్థే నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఇక 25 ఏళ్ల పాటు వారంటీతో కూడిన సోలార్‌ పలకలు ఏర్పాటుచేస్తారు. ప్లాంట్‌ ద్వారా రోజుకు 4వేల యూనిట్ల చొప్పున నెలకు 1.20లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారు. ఈ విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్‌ యూనిట్‌కు రూ.3.13 చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరింది. కాగా, ప్లాంట్‌ నుంచి వెంకటాపురం సబ్‌స్టేషన్‌ వరకు లైన్‌ వేసి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌నుగ్రిడ్‌కు అనుసంధానిస్తారు. ఈ ప్లాంట్‌ పనులకు త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు.

    ముమ్మరంగా పనులు

    వెంకటాపురంలో సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన నాలుగెకరాల భూమిలో ఏర్పా ట్లు చకాచకా జరుగుతున్నాయి. ఇప్పటికే భూమిని చదును చేయించి చుట్టూ పిల్లర్లు వేసేందుకు కందకాలు తవ్విస్తున్నారు. అంతేకాక వెంకటాపురం నుంచి ప్లాంట్‌ వరకు రూ.46 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపానలు పంపించారు. త్వరలోనే శంకుస్థాపన జరిగితే, డిసెంబర్‌ నెలాఖరు నాటికి ప్లాంట్‌ ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

    సోలార్‌ ప్లాంట్‌ ద్వారా వెంకటాపురం, నారాయణపురం గ్రామాల్లోని శ్రీకృష్ణ, ఉషోదయ సమాఖ్యల్లో సభ్యులుగా ఉన్న 400 మంది మహిళలకు ఆర్థికంగా చేయూత దక్కనుంది. ప్లాంట్‌ ద్వారా నెలకు ఉత్పత్తి అయ్యే 1.20లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్‌ యూనిట్‌కు రూ.3.13 చొప్పున కొనుగోలు చేస్తుంది. తద్వారా నెలకు రూ.3.75 లక్షలు, ఏడాదికి రూ.45.07లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో కొంత రుణం చెల్లిస్తే 6 – 7 ఏళ్లలో బకాయి తీరుతుంది.

    ఐకేపీ సంఘాల ద్వారా సోలార్‌ ప్లాంట్‌

  • ఖమ్మంగాంధీచౌక్‌: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని శ్రీ గుంటు మల్లన్న ఆలయంలో ఆదివారం స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం సహస్ర నామార్చన, సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలు జరిపించారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతులు వెలిగించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చుండూరు రామకోటేశ్వరరావు పర్యవేక్షణలో అర్చకులు దాములూరి వీరభద్రశర్మ, దాములూరి కృష్ణశర్మ సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకలు నిర్వహించారు.

    రామయ్యకు

    సువర్ణ పుష్పార్చన

    భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి ఆదివారం వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కాగా, కార్తీక మాసం.. వారాంతపు సెలవులు కావడంతో రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం క్యూలైన్ల ద్వారా స్వామివారి మూలమూర్తులను దర్శించుకున్నారు.

    ఘనంగా సత్యనారాయణస్వామి వ్రతం

    కార్తీక మాసం సందర్భంగా చిత్రకూట మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అర్చకులు ఘనంగా జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి పూజలు చేశారు. అర్చకులు, వ్రత మహత్యాన్ని, భద్రగిరిలో వ్రత కల్ప న విశిష్టతను వివరించారు.

    వాలీబాల్‌ జట్ల ఎంపిక

    ఖమ్మం స్పోర్ట్స్‌ : జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వార్యంలో ఆదివారం నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్‌ జట్లను ఎంపిక చేశారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు ఈనెల 13 నుంచి 16 వరకు మేడ్చల్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి బి.గోవిందరెడ్డి తెలిపారు. ఈ ఎంపికల ప్రక్రియలో సంఘం బాధ్యులు నాగేంద్రకుమార్‌, రాజు రత్నాకర్‌, సీహెచ్‌.సుధాకర్‌రెడ్డి, సువర్ణబాబు, భద్రయ్య, ఉస్మాన్‌, వపన్‌, నెహ్రూ, మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

    నేడు మంత్రి సీతక్క రాక

    పినపాక: రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం మండలంలో పర్యటించనున్నారు. బయ్యారం జెడ్పీఎస్‌ఎస్‌ హైస్కూల్‌లో రాష్ట్రస్థాయి అండర్‌–17 కబడ్డీ పోటీలు సోమవారం ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఆదివారం వివరాలు వెల్లడించారు.

    శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు

    పాల్వంచరూరల్‌: మండల పరిధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చా రు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. తలనీలాలు, ఒడి బియ్యం, చీరలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కులు చెల్లించారు. అర్చకులు అభిషేకం చేశారు. ఈఓ ఎన్‌ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.

  • పోరు

    పినపాక: రాష్ట్రస్థాయి అండర్‌–17 కబడ్డీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం కూడా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందర్శించి క్రీడాకారుల వసతి, భోజన ఏర్పాట్లపై ఆరా తీశారు. క్రీడాకారులకు భోజనం వడ్డించారు. భోజనం అందిస్తున్న కంది చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులను అభినందించారు. మెదక్‌ జట్టుకు చెందిన బాలికకు మ్యాచ్‌లో దెబ్బ తగలగా, అధికారులు 108 ద్వారా పినపాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

    రెండోరోజు పోటీలు ఎలా జరిగాయంటే..

    బాలుర విభాగంలో కరీంనగర్‌ జట్టుపై నల్లగొండ, నిజామాబాద్‌పై ఖమ్మం విజయం సాధించాయి. మరికొన్ని మ్యాచ్‌ల్లో కరీంనగర్‌పై వరంగల్‌, నిజామాబాద్‌పై నల్లగొండ, వరంగల్‌పై ఖమ్మం, మెదక్‌పై ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌పై హైదరాబాద్‌, ఆదిలాబాద్‌పై హైదరాబాద్‌, మెదక్‌పై రంగారెడ్డి, మెదక్‌పై మహబూబ్‌నగర్‌ జట్లు గెలుపొందాయి.

    బాలికల విభాగంలో..

    కరీంనగర్‌పై నిజామాబాద్‌, మెదక్‌పై మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌పై ఆదిలాబాద్‌, ఖమ్మంపై నల్లగొండ, మెదక్‌పై కరీంనగర్‌, రంగారెడ్డిపై ఖమ్మం, మెదక్‌పై ఆదిలాబాద్‌, హైదరాబాద్‌పై వరంగల్‌, రంగారెడ్డిపై నల్లగొండ, వరంగల్‌పై ఖమ్మం, హైదరాబాద్‌పై రంగారెడ్డి, ఖమ్మంపై నల్ల గొండ జట్లు విజయం సాధించాయి.

  • ఏజెంట
    ● ఎల్‌ఐసీ ఏఓఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.జి.దిలీప్‌ ● ముగిసిన మహాసభలు

    ఖమ్మంమయూరిసెంటర్‌ : ఎల్‌ఐసీని కార్పొరేట్ల పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా ఏజెంట్లు అడుగడుగునా అడ్డుపడుతున్నారని, దీంతో ఏజెంట్లను నష్టపరచడమే లక్ష్యంగా కేంద్రం కుట్ర పన్నుతోందని ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఓఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి పి.జి.దిలీప్‌ విమర్శించారు. ఖమ్మంలో రెండు రోజుల పాటు జరిగిన ఏఓఐ సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ 6వ మహాసభలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్టాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దిలీప్‌ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల పొదుపు విధానానికి ఎల్‌ఐసీ ఎనలేని కృషి చేస్తోందని తెలిపారు. అలాంటి సంస్థను కొందరు కార్పొరేట్‌ సంస్థల కోసం ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఐఆర్‌డీఏఐని అడ్డుపెట్టుకుని ఏజెంట్లకు నష్టం కలిగించే పనులు చేస్తోందన్నారు. ఏజెంట్ల కమీషన్‌ తగ్గింపు, బీమా సుగం పోర్టల్‌ ప్రతిపాదన, పాలసీ పోర్టబిలిటీ, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల వలె కమీషన్‌ విధానం ఉండాలనే ప్రతిపాదన వంటివి ఇందులో భాగమేనని విమర్శించారు. ఇలాంటి పరీక్షా సమయంలో ఏజెంట్లు ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న యూనియన్‌ సభ్యత్వాన్ని మూడు రెట్లు పెంచుకోవాలన్నారు. ఎల్‌ఐసీ ప్రైవేటీకరణతో కలిగే నష్టాలను పాలసీదారులకు వివరించాలని కోరారు. సభలో యూనియన్‌ ఆలిండియా అధ్యక్షుడు సురజిత్‌ కుమార్‌ బోస్‌, జోనల్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.మంజునాథ్‌, పీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లూరి శ్రీనివాసరావు, తన్నీరు కుమార్‌, నవీన్‌ పాల్గొన్నారు.

    నూతన కమిటీ ఎన్నిక

    మహాసభల ముగింపు సందర్భంగా ఎల్‌ఐసీ ఏఓఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.జ యరామ, ప్రధాన కార్యదర్శిగా పి.ఎల్‌.నరసింహరావు ఏకగ్రీవంగాతో పాటు మూడు రాష్ట్రాల నుంచి 141 మందితో నూతన కౌన్సిల్‌ను, 69 మందితో కమిటీని, 27 మంది ఆఫీస్‌ బేరర్లను ఎన్నుకున్నారు. కోశాధికారిగా వలీ మొహిద్దీన్‌, ఉపాధ్యక్షులుగా టి.కోటేశ్వరరావు, డి.సి.శివమూర్తి, తాళ్లూరి శ్రీనివా సరావు, టి.నాగరత్నమ్మ, జి.శ్రీనివాస్‌, కె.రామనర్సయ్య, ఎం.నాగరాజు, ఆర్‌.శివ రుద్రమ్మ, ఎస్‌.లింగ వాడియా, ఎ.ఎస్‌.లోకేష్‌ షెట్టర్‌, కార్యదర్శులుగా కె.కృష్ణారెడ్డి, జి.రవి కిషోర్‌, సి.ప్రదీప్‌, తన్నీరు కుమార్‌, ఎన్‌.ఆర్‌.ఠాగూర్‌, జి.జి.సవిత, ఎం.అరుణ, జి.ఉదయలక్ష్మి, బి.వెంకట్రావు ఎన్నికయ్యారు.

  • తెలుగు సాహిత్యంలో కవిత్వానికి విశిష్ట స్థానం

    ఖమ్మంగాంధీచౌక్‌: తెలుగు సాహితీరంగంలో కవిత్వానికి, కథలకు విశిష్ట స్థానం ఉందని పలువురు సాహితీవేత్తలు అన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం ఈస్తటిక్స్‌ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ ఎల్‌ఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ప్రతిమ, వేంపల్లి షరీఫ్‌, వెల్దండి శ్రీధర్‌ మట్లాడుతూ.. సాహిత్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈస్తటిక్స్‌ సాహితీ సంరంభం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సంస్థ అధ్యక్షుడు రవిమారుత్‌ మాట్లాడుతూ.. సాహిత్య పోటీలకు కథలను, కవిత్వ సంపుటాలను ఆహ్వానించగానే స్పందించిన కవులకు కృతజ్ఞతలు తెలిపారు. 90కి పైగా కవితా సంపుటులు, 140కి పైగా కథలు రాగా కవిత్వం విభాగంలో పలమనేరు బాలాజీ కవితా సంపుటి ‘లోలోపలేదో కదులుతున్నుట్టు’ రూ. 40 వేల బహుమతి, రేణుక అయోల కవితా సంపుటి ‘రవిక’, పాయల మురళీకృష్ణ కవిత ‘గచ్చేం చెట్టుకు అటూ ఇటూ’ ప్రత్యేక ప్రశంసా ప్రోత్సాహక అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ కథగా వీఆర్‌ రాసాని ‘తేనెకల్లు’ రూ. 25 వేలు గెలుచుకోగా, ద్వితీయ ఉత్తమ కథగా ఆలూరి కిరణ్‌కుమార్‌ ‘అంజమ్మ’ రూ.15 వేలు గెలుచుకున్నాయి. తృతీయ ఉత్తమ కథగా యాములపల్లి నర్సిరెడ్డి రూ.10 వేల బహుమతి గెలుచుకున్నారు. అనంతరం ‘అసూయ’ కథల సంకలనంతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు, కమిటీ సభ్యులు ప్రసేన్‌, సీతారాం, వంశీకృష్ణ, మువ్వా శ్రీనివాస రావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఫణిమాధవి కన్నోజుల పాల్గొన్నారు.

    ఈస్తటిక్స్‌ పురస్కారాల సభలో

    సాహితీవేత్తలు

  • అందరికీ న్యాయం దక్కేలా కృషి

    ఖమ్మం లీగల్‌ : ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను రూపుమాపి అందరికీ న్యాయం దక్కేలా న్యాయ సేవా సంస్థలు పని చేస్తున్నాయని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం.అర్చనాకుమారి తెలిపారు. ఆదివారం నిర్వహించిన న్యాయ సేవల దినోత్సవంలో ఆమె మాట్లాడారు. దేశంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో సమానంగా న్యాయవ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. భార్యాభర్తలు తరచూ కలహించుకుంటే సమాజంలో చెడు ప్రభావం కనిపిస్తుందని హెచ్చరించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కల్పన మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో పారా లీగల్‌ వలంటీర్ల పాత్ర కీలకమని అన్నారు. న్యాయ సేవా సంస్థ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను వివరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతీ పౌరుడికి హక్కులు కల్పిస్తే, వాటి సంరక్షణకు న్యాయస్థానాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సభ్యురాలు సంధ్యారాణి, బార్‌ కార్యదర్శి దిలీప్‌, ఇమ్మడి లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఖండే వెంకటేశ్వరరావు, న్యాయవాదులు శ్రీనివాస్‌ శర్మ, మారగాని శ్రీనివాస్‌, వీరేందర్‌, పద్మావతి, పద్మ ప్రసూన, అనురాధ, రవీంద్ర స్వామి, జాలావతి, రమాదేవి, లక్ష్మి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

  • సులభం

    ఖమ్మంసహకారనగర్‌: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించేందుకు గతంలో నానా తంటాలు పడాల్సి వచ్చేది. అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ సమర్పించే అవకాశాన్ని కల్పించింది. జిల్లా ట్రెజరీ కార్యాలయం (ఖమ్మం డీటీఓ)తో పాటు ఒక అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీస్‌(ఏటీఓ), నాలుగు సబ్‌ ట్రెజరీ కార్యాలయాలు(ఎస్‌టీఓ)ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తంగా 12,984 మంది పెన్షనర్లు ఉన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు ఏటా ఒకసారి జీవన ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. ఈ పత్రం సమర్పిస్తేనే ఆ తర్వాత పెన్షన్‌ను ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే, రిటైర్డ్‌ అయిన వారిలో 61 ఏళ్లు దాటిన వారు, వయోవృద్ధులు ఉంటారు. వీరంతా శ్రమకోర్చి ఎస్‌టీఓ, మీ సేవ కేంద్రాలకు వెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. కొందరు నడిచే పరిస్థితిలో కూడా ఉండరు. దీంతో వీరు జీవన ధ్రువీకరణ పత్రం సమర్పించాలంటే ఎవరో ఒకరి సాయం తీసుకోవాల్సిన పరిస్థితుతులు నెలకొన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పెన్షన్‌దారులు లైఫ్‌ సర్టిఫికెట్‌ (జీవన ధ్రువీకరణ పత్రం) సమర్పించేందుకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా సెల్‌ఫోన్‌లోనే మీ సేవ యాప్‌, జీవన ప్రమాణ్‌ ద్వారా, ఐఎఫ్‌ఎంఐఎస్‌ యాప్‌ ద్వారా సమర్పించే వీలు కల్పించింది.

    జీవన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి..

    పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్‌ పొందాలంటే ఏటా నవంబర్‌ ఒకటి నుంచి మార్చి 31లోపు జీవన ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. పెన్షన్‌ తీసుకుంటున్న వ్యక్తి బతికే ఉన్నాడని గెజిటెడ్‌ ఉద్యోగి సంతకంతో కూడిన సర్టిఫికెట్‌ను ఎస్‌టీఓల్లో సమర్పించాలి. ఇలాంటి సమయాల్లో పలు సాంకేతిక సమస్యలు వస్తున్న క్రమంలో అలాంటి వాటిని అధిగమిస్తూ మొబైల్‌ యాప్‌లోనే లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించే అవకాశం ఉంది.

    ఇలా చేయాలి

    ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో తొలుత మీ సేవ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందులో ప్రధానంగా వివిధ రకాల ఆప్షన్లు వస్తాయి. అందులో పెన్షన్‌దారు జీవన ధ్రువీకరణ అనే దగ్గర ప్రెస్‌ చేయాలి. అనంతరం డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ను ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ (నమోదు), రిజిస్ట్రేషన్‌ స్థితి తనిఖీ, జీవన ధ్రువీకరణపత్రం సమర్పణ, రశీదులు అనే అంశాలు చూపిస్తాయి. ఇందులో రిజిస్ట్రేషన్‌ నమోదు అనే ఆప్షన్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్‌ ఓపెన్‌ చేసిన తర్వాత బ్యాంక్‌ ఖాతా నంబర్‌ లేదంటే పీపీఓ ఐడీ (8 అంకెలు), మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేసి కొనసాగించండి అనే నెంబర్‌ను ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత లైవ్‌ ఫొటో.. ఫొటోను క్లిక్‌ చేయండి అనే ఆప్షన్లు వస్తాయి. ఫొటోను క్లిక్‌ చేయండి అనే ఆప్షన్‌ నొక్కాలి. ఆ తర్వాత ఫొటో దిగి సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ తర్వాత సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఉన్న వివరాలను సరిచూసిన తర్వాత అక్కడ సిబ్బంది ఓకే చేస్తారు. వెంటనే పెన్షన్‌దారుడి ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. ఈ మెసేజ్‌ రావటానికి ఆలస్యమైతే ట్రెజరీ కార్యాలయంలో వివరాలు తెలుసుకోవచ్చు. మెసెజ్‌ వచ్చిన వారు ఆ మెసేజ్‌ ఆధారంగా తిరిగి జీవన ధ్రువీకరణపత్రం సమర్పణ అని వస్తుంది. అందులో యథావిధిగా పెన్షన్‌దారుల వివరాలు సమర్పించి సెల్ఫీ ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత పెన్షన్‌దారుల వివరాలు సబ్‌మిట్‌ చేసినట్లు రశీదు సైతం తీసుకోవచ్చు. ఒక ఫోన్‌లో యాప్‌ నుంచి ఎంతమంది పెన్షన్‌దారుల వివరాలైనా నమోదు చేయొచ్చు.

    75 ఏళ్లు దాటితే రావాల్సిందే..

    పెన్షనర్లలో 75 సంవత్సరాలు దాటిన వారంతా తప్పకుండా నేరుగా ఎస్‌టీఓ, డీటీఓల కార్యాలయాలకు వెళ్లి లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అదే విధంగా మెంటల్లీ డిజార్డర్స్‌, డైవర్స్‌ పెన్షనర్లు, విడో పెన్షనర్లు, అవివాహితులు పెన్షన్‌ పొందుతున్నట్లయితే నేరుగా ఎస్‌టీఓ, డీటీఓల్లో గెజిటెడ్‌ ఆఫీసర్‌చే ధ్రువీకరించిన లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

    ఖమ్మం డీటీఓ 9,043

    వైరా, ఏటీఓ 453

    మధిర, ఎస్‌టీఓ 1,293

    నేలకొండపల్లి, ఎస్‌టీఓ 644

    సత్తుపల్లి, ఎస్‌టీఓ 1,551

    మొత్తం 12,984

    రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు మీ సేవ యాప్‌, జీవన ప్రమాణ, పెన్షనర్లు ఐఎఫ్‌ఎంఐఎస్‌ యాప్‌ ద్వారా నేరుగా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే, 75 ఏళ్లు దాటిన వారు మాత్రమే నేరుగా ఎస్‌టీఓ, డీటీఓలకు వెళ్లి లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. –వెంటపల్లి సత్యనారాయణ,

    ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌, ఖమ్మం

Mahabubnagar

  • వామ్మ

    ఒకే నోటును కలర్‌ జిరాక్స్‌ తీసి చెలామణి

    చిన్న వ్యాపారులే లక్ష్యంగా

    డబ్బుల మార్పిడి

    రద్దీ వేళల్లో వస్తుండటంతో సవాల్‌గా మారిన కట్టడి వ్యవహారం

    పోలీసుల అదుపులో

    నిందితుడు..?

    జడ్చర్ల: వ్యాపార, వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన జడ్చర్ల పట్టణం దొంగనోట్ల చెలామణికి అడ్డాగా మారింది. గతంలోనూ అనేక సార్లు నకిలీ నోట్లతో పలువురు మోసపోయిన ఘటనలు చోటుచేసుకున్నా.. తాజాగా దొంగనోట్ల చెలామణిపై ఓ వ్యాపారి అప్రమత్తంగా వ్యవహరించడంతో నిందితుడు పట్టుబడ్డాడు. ప్రస్తుతం పోలీసులు ఈ దొంగనోట్ల వ్యవహారానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కాగా.. జడ్చర్లలో తరచుగా దొంగనోట్ల బారిన ప్రజలు పడుతున్నారు. అయినా నిత్యం ఎక్కడో ఓ దగ్గర నకిలీ నోట్ల ముఠా చేతిలో ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి స్టేషన్ల చుట్టూ తిరిగేందుకు ఇష్టపడని బాధితులు చాలామందే ఉన్నారు. మరికొందరు ఒకటో.. రెండో నోట్లు తమ చేతికి రావడంతో గుట్టుగా చింపివేసి సరిపెట్టుకుంటున్నారు.

    కిలీ నోట్లను చెలామణి చేసే వ్యక్తులు చిన్న చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని అడపాదడపా గుట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా కల్లు కాంపౌండ్లు, మద్యం దుకాణాలు, వీధివ్యాపారుతోపాటు చిన్నపాటి కిరాణ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లను మార్పిడి చేస్తున్నారు. బాగా రద్దీ ఉన్న సమయంలో నోట్లను చెలామణి చేస్తున్నారు. ప్రధానంగా రూ.500, 100 నకిలీ నోట్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అసలు నోట్లకు తీసిపోని విధంగా నకిలీ నోట్లు ఉండడంతో అంతగా గుర్తించే సామర్థ్యం లేని చిన్న చితక వ్యాపారులు వారి బారినపడి మోసపోతున్నారు. పెద్ద వ్యాపార వర్గాల వారు నోట్ల లెక్కింపు యంత్రాలను వినియోగిస్తుండడంతో దొంగనోట్లు బయట పడే అవకాశం ఉండడంతో చిన్న వ్యాపారులను ఎంచుకుని నోట్లను చెలామణి చేస్తున్నారు. కొందరు అనుమానం రాకుండా మైనార్టీ తీరని బాలురను కూడా నోట్ల మార్పిడిలో వినియోగిస్తున్నారు.

    డ్చర్లలోని సిగ్నల్‌గడ్డ ప్రాంతంలో టీ పాయింట్‌ నిర్వహించే వ్యాపారి వద్దకు ఓ యువకుడు చీకటి పడుతున్న సమయంలో వచ్చాడు. సిగరెట్‌ తీసుకుని టీ తాగిన తర్వాత తన వద్ద ఉన్న రూ.500 నోటు తీసి ఇవ్వగా.. టీకొట్టు యజమాని సరిపడా చిల్లర ఇవ్వడంతో వెళ్లిపోయాడు. మరుసటి రోజు సిగరెట్లు, టీ పొడి కొనుగోలు చేసే సమయంలో తన దగ్గర ఉన్న నోటును తీసి ఇవ్వగా అది నకిలీ నోటుగా తేలడంతో లబోదిబోమన్నాడు.

    ● జడ్చర్లలోని హౌసింగ్‌ బోర్టు కాలనీలో ఓ వృద్ధురాలు చిన్న కిరాణ కొట్టు నిర్వహిస్తుంది. రాత్రివేళ బైక్‌పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మంచినూనె, సబ్బులు ఇతర సరుకులు కొనుగోలు చేశాడు. ఇందుకు అయిన బిల్లు మొత్తం రూ.700 చెల్లించి సరుకులు తీసుకుని వెళ్లాడు. సదరు వ్యక్తి రూ.100 నోట్లు 7 ఇవ్వగా సదరు వృద్ధురాలు నోట్లను పెద్దగా గమనించలేదు. ఉదయం పాల ప్యాకెట్లను కొనుగోలు చేసిన సందర్భంలో రూ.వంద నోట్లను పాల వ్యాపారికి ఇవ్వగా నోట్లను సరిచూసిన నకిలీవిగా తేల్చాడు. అన్ని నోట్లపై ఒకే సిరీస్‌ నంబర్లు ఉండడంతోపాటు నోటు కాగితంలో తేడా ఉన్నట్లు గమనించి చెప్పడంతో బాధితురాలు నోరెల్లబెట్టింది. ఆయా నోట్లు కలర్‌ జిరాక్స్‌ తీసినట్లుగా గుర్తించారు.

    ● గతంలోనూ కొత్త బస్టాండ్‌లో నకిలీ నోట్లు చెలామణి చేస్తుండగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టుబడ్డారు. అదేవిధంగా కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో ఇంటిలో నకిలీ నోట్లను ముద్రిస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్‌ నుంచి పోలీసులు వచ్చి సోదాలు నిర్వహించిన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా శనివారం స్థానిక శ్రీవేంకటేశ్వరకాలనీలో కిరాణ కొట్టు నిర్వహిస్తున్న వ్యాపారి నకిలీ నోటును గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదరు బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొంగనోట్లు చెలామణి చేసే వారిపై నిఘా ఉంచి కట్టడి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

    నకిలీ నోట్లను గుర్తించకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. గిరాకీ ఎక్కువ ఉన్న సమయంలో నకిలీ నోట్ల మార్పిడి జరుగుతుంది. ఆ సమయంలో తాము బిజీగా ఉండడంతో నకిలీ నోట్లను పెద్దగా గుర్తించలేకపోతున్నాం. పోలీసులు నకిలీ నోట్లను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి.

    – వెంకట్రాములు, కిరాణ వ్యాపారి, జడ్చర్ల

    నకిలీ నోట్ల మార్పిడికి పాల్పడే వారి పట్ల తాము చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు వ్యాపార వర్గాలు, ప్రజలు కూడా సహకరించాలి. వ్యాపార కేంద్రాలు, ఇతర దుకాణాల వద్ద సీసీ కెమెరాలు బిగించుకోవాలి. అనుమానాస్పద వ్యక్తుల గురించి 100కు డయల్‌ చేసి ఫిర్యాదు చేయాలి. నోట్లను స్వీకరించే వారు జాగ్రత్తగా అసలు నోటుతో పోల్చుకోవాలి. అనుమానం వస్తే నోట్లను తిరస్కరించి తమకు ఫిర్యాదు చేయాలి.

    – కమలాకర్‌, సీఐ, జడ్చర్ల

  • అమ్రా

    జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగనున్న ప్రక్రియ

    ఈసారి లెక్కింపులో

    ఔత్సాహిక యువకులకు అవకాశం

    స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల నుంచి

    దరఖాస్తుల ఆహ్వానం

    ఈ నెల 22తో ముగియనున్న

    స్వీకరణ గడువు

    అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్‌ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్‌ వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు.

    ప్రతి వలంటీర్‌ అటవీ సిబ్బందితో కలిసి 7 రోజులపాటు అడవిలో కాలినడకన నడుస్తూ.. పులుల జాడలు, పాదముద్రలు, మల విసర్జితాలు, ఇతర అవశేషాలను సేకరించి జంతువుల గణన చేపడతారు. ఈ లెక్కల ఆధారంగానే భవిష్యత్‌లో పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో గణన జరుగుతుంది. ప్రతి బీట్‌కు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున లెక్కింపులో పాల్గొంటారు. అమ్రాబాద్‌ అభయారణ్యంలోని 11 రేంజ్‌ల పరిధిలో 220 బీట్లలో పులుల లెక్కింపునకు అటవీశాఖ సిబ్బంది 150 మందితోపాటు మరో 50 మంది వాచర్లు ఉన్నారు. వీరితోపాటు సుమారు 460 మంది వలంటీర్లు అవసరమవుతారు. ఈ నెల 4 నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. ఇప్పటి వరకు 700 పైగా వచ్చాయి. వీటిలో అర్హత మేరకు వలంటీర్లను తీసుకుంటారు.

    దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్‌ 45వ స్థానంలో ఉండగా.. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్‌ రిజర్వు ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ.. బఫర్‌ జోన్‌. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల అడవులను అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంగా పరిగణిస్తారు. అమ్రాబాద్‌, మద్దిమడుగు, మన్ననూర్‌, దోమలపెంట, అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జునసాగర్‌ రేంజ్‌లను 270కి పైగా బీట్లుగా విభజించి గణన చేపడుతున్నారు. కెమెరా ట్రాప్‌ ద్వారా సేకరించిన ప్లగ్‌ మార్కులు, గుర్తులను అక్కడికక్కడే ఎకనామికల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పులుల మనుగడకు ఆవశ్యకతగా ఉండే శాఖాహార జంతువుల సంఖ్య పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనే వివరాల మేరకు పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటారు.

    మ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో జీవవైవిధ్యంతోపాటు పులుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో వాటి సంతతి పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర కీలకం. ఒకప్పుడు కేవలం మూడు పులులకు నిలయంగా ఉన్న ఏటీఆర్‌లో ఇప్పుడు వాటి సంఖ్య 36కు పెరిగింది. 2017 వరకు కూడా పులుల సంఖ్య అరకొరగానే ఉండేది. అమ్రాబాద్‌ అభయారణ్యంలో కేవలం 10 పులులే ఉండేవి. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించి.. వాటి పరిరక్షణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఫలితంగా ఆరేళ్లలో అమ్రాబాద్‌లో పులుల సంఖ్య 36కు పెరిగింది.

    ల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు పుట్టినిల్లుగా మారుతోంది. 200పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (ఏటీఆర్‌) ఉంది. ఇక్కడ ఆరేళ్లుగా పులుల సంతతి పెరుగుతోంది. 2017 లెక్కల ప్రకారం 6 పులులు ఉండగా.. 2024– 25 జూలై వరకు 36కు పెరిగింది. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని పులి కూనలతో కలిసి సంచరిస్తున్న ఫరాహా ఎఫ్‌–6 ఆడపులి, ఫరాహా ఎఫ్‌–6, తారా ఎఫ్‌–7, భౌరమ్మ ఎఫ్‌–18, ఎఫ్‌–26, ఎఫ్‌–53 ఆడపులులు వాటి సంతతి పెంచేందుకు తోడ్పడటంతోపాటు నల్లమలలో జీవవైవిధ్యానికి పాటుపడుతున్నాయి.

    ఈసారి పులులు, ఇతర జంతువుల గణన పకడ్బందీగా కొనసాగుతుంది. గతంలో అరకొర సిబ్బందితో చేపట్టగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అటవీ సిబ్బంది 150 మందితోపాటు సమర్థవంతంగా పనిచేసే 50 మంది వాచర్లు ఉన్నారు. అలాగే వలంటీర్ల కోసం ఆన్‌లైన్‌లో 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. అటవీ, పులులపై అవగాహన కలిగిన అర్హులు, పనితీరు మెరుగ్గా ఉన్న యువతను వలంటీర్లుగా తీసుకుంటాం. – రోహిత్‌ గోపిడి, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్‌

  • ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

    జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల భద్రత కోసం ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేదాక పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వంలో రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమ చాలీచాలని జీతాలు ఇస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి పర్మనెంట్‌ పద్ధతిలో ఉద్యోగులను భర్తీ చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం అనేక రకాలుగా పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇచ్చే జీతాలు కూడా క్రమం తప్పకుండా ఇవ్వడం లేదని, నెలల తరబడి జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన 15 వేల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు పోస్ట్‌ కార్డు ఉద్యమం చేపడుతామన్నారు. జిల్లా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు కర్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను, నాయకులు సురేందర్‌గౌడ్‌, వనిత, కవిత, జితేంద్రుడు, శ్రీనివాసచారి, భరత్‌, వినోద్‌, రాంగోపాల్‌వర్మ, అనిల్‌, విజయలక్ష్మి, కామేష్‌, రవితేజ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  • 12న ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపికలు

    మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో బుధవారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి జిల్లా అండర్‌–14, అండర్‌–17 విభాగం బాల, బాలికల అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ శారదాబాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల, బాలికలు ఒరిజినల్‌ స్కూల్‌ బోనోఫైడ్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో ఉదయం 9 గంటలకు పీడీ ఆనంద్‌కుమార్‌గౌడ్‌కు రిపోర్టు చేయాలన్నారు. పూర్తి వివరాల కోసం సెల్‌ నం.98497 06360ను సంప్రదించాలని ఆమె సూచించారు.

    13న జిల్లా క్రికెట్‌ ఎంపికలు

    మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని ఎండీసీఏ మైదానంలో గురువారం జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–14 బాలుర క్రికెట్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్‌ బోనోఫైడ్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో పీడీ అబ్దుల్లాకు రిపోర్టు చేయాలని, మిగతా వివరాల కోసం సెల్‌ నం.90005 74651ను సంప్రదించాలని కోరారు. క్రీడాకారులు వైట్‌ డ్రెస్‌ కోడ్‌, పూర్తి కిట్‌తో ఎంపికలకు హాజరుకావాలని సూచించారు.

  • సర్వీస్‌ ఉపాధ్యాయులకు ‘టెట్‌’ పెట్టొద్దు

    మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా చూస్తామని టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీపీఆర్టీయూ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెట్‌ అనేది కేవలం ఉపాధ్యాయులకు ఒక అర్హత పరీక్ష అని, కేంద్ర ప్రభుత్వం చెప్పిందని వెంటనే టెట్‌ అర్హత సాధించాలని రాష్ట్రం కూడా చెప్పడంతో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. పరీక్ష అవసరం లేకుండా ఉండాలంటే ఆర్టీఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, అందుకోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. అధికారంలోనికి వచ్చిన వెంటనే పీఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జీఓ 317లో భాగంగా వేరే జిల్లాలకు వెళ్లిన స్కూల్‌ అసిస్టెంట్‌లు సొంత జిల్లాలకు వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించి.. 40 వేల పోస్టులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని, పండిట్‌, పీఈటీలను కూడా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, హెల్త్‌కార్డులు సైతం వెంటనే ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌, నాయకులు శ్యాంబాబు, భూపతిసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

    టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య

  • ఎన్‌ఎంఎంఎస్‌ స్క్రీనింగ్‌  పరీక్షకు 600 మంది హాజరు

    మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం రెండు కేంద్రాల్లో నిర్వహించిన నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) స్క్రీనింగ్‌ పరీక్షకు సుమారు 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని మోడ్రన్‌ హైస్కూల్‌ పరీక్ష కేంద్రంలో 400 మంది, అలాగే హన్వాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో 200 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారని మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ కోఆర్డినేటర్‌ గుండా మనోహర్‌ తెలిపారు. ఈ పరీక్షలో మెరిట్‌ సాధించిన వందమంది విద్యార్థులకు జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి శ్రీలలితాంబికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 12 నుంచి 22 వరకు పది రోజులపాటు ప్రత్యేక శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహించనున్నామన్నారు. ఫైనల్‌ పరీక్ష ఈ నెల 23న జరుగుతుందన్నారు. కాగా, ఆ యా పరీక్షా కేంద్రాలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఏఎంఓ శ్రీనివాస్‌, వందేమాత రం ఫౌండేషన్‌ కోఆర్డినేటర్‌ రవీందర్‌రెడ్డి, హన్వాడ ఎంఈఓ గోపాల్‌నాయక్‌, హెచ్‌ఎంలు దత్తు, రవి, బాలుయాదవ్‌, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

  • నీటిగ

    బిజినేపల్లి: నీటిగుంత లో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పాలెం గ్రా మం సుబ్బయ్య కాలనీ లోని ప్రాథమిక పాఠశా ల సమీపంలో శనివారం సాయంత్రం జరగ్గా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రా మానికి చెందిన మంజుల తన కుమారుడు శశిధర్‌(3)ను ఇంటి వద్దనే ఉంచి కూలీ పనికి పో యింది. సాయంత్రానికి వచ్చి కుమారుడి కో సం వెతకగా కనిపించలేదు. ఇటీవల పాఠశాల సమీపంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్‌ గుంతలు తీయడంతో వాటిలో వర్షపు నీరు చేరింది. ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ గుంతలో పడి మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి సంవత్సరం క్రితమే చనిపోయాడు. భర్త, కుమారుడు ఇద్దరు చనిపోవడంతో తాను ఒంటరిదాన్ని అయ్యాయని మంజుల పడుతున్న వేదన స్థానికులను కంటతడి పెట్టించింది.

    పాము కాటుతో

    వ్యక్తి మృతి

    వనపర్తి రూరల్‌: పాముకాటుతో వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన కుమ్మరి జయరాములు(44) వృత్తిరీత్యా వ్యవసాయం. భార్య పద్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆదివారం సొంత పొలంలో ఆయిల్‌ పాం తోటలో గెళలు తెంపుతుండగా 4గంటల ప్రాంతంలో పాముకాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో భార్య, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

    కాల్వలో వ్యక్తి గల్లంతు

    కొత్తకోట రూరల్‌: మండలంలోని అమడబాకుల సమీపంలో జాతీయ రహదారి 44 పక్కన గల కాల్వలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వినుకొండ మండలం దర్గాపేట గ్రామానికి చెందిన ఎండీ ఖలీల్‌ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. లారీ హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు వెళ్తున్న క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కొత్తకోట మండలం అమడబాకుల సమీపంలో గల కాల్వ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడి గల్లంతయ్యాడు. లారీ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ కుర్మయ్య గౌడ్‌ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకు ని గాలింపు చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో అదృశ్యమైన వ్యక్తం ఆచూకీ లభ్యం కాలేదని, ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి కాల్వకు నీటి విడుదల చేయిస్తామన్నారు. అనంతరం సిబ్బందితో పా టు గ్రామస్తుల సహకారంతో గాలింపు చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

    శుభకార్యానికి

    వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం

    అక్క దుర్మరణం, ఇద్దరు చెల్లెళ్లు,

    కవలలకు గాయాలు

    మిడ్జిల్‌: మండలంలోని బోయిన్‌పల్లి సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అక్క దుర్మరణం చెందగా.. ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు కవలలకు గాయాలైన ఘటన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మల్లేశ్వరి(30) ఆదివారం సాయంత్రం తన తల్లిగారి గ్రామమైన కొత్తపల్లికి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి మల్లాపూర్‌లో తమ అక్క ఇంట్లో శుభకార్యం ఉండడంతో బంతిపూలు, ఇతర సామగ్రి తీసుకొని ఇద్దరు చెల్లెళ్లు మానస, మమతతోపాటు తన కవల పిల్లలతో ఆటోలో వెళ్తుండగా.., మార్గమధ్యంలో బోయిన్‌పల్లి సమీపంలో పత్తి లోడ్‌తో వస్తున్న బొలేరో ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టడంతో మల్లేశ్వరి అక్కడికక్కడే మృతిచెందగా.. మానస, మమతతోపాటు మల్లేశ్వరికి చెందిన ఇద్దరు కవలలు, ఆటో డ్రైవర్‌ ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

    రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

    జడ్చర్ల: స్థానిక నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బైక్‌ అదుపు తప్పి కిందపడటంతో బైక్‌పై వెనుక కూర్చున్న మహిళ తీవ్రగాయాలపాలై దుర్మరణం చెందింది. సీఐ కమలాకర్‌ కథనం మేరకు.. మండల పరిధిలోని నసరుల్లాబాద్‌ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పోనెమోని వనజ(38), వెంకటేశ్‌ ఆదివారం బైక్‌పై జడ్చర్లకు వస్తుండగా నిమ్మబాయిగడ్డ వద్ద బైక్‌ అదుపుతప్పి రోడ్డుపై పడింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన వనజను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన అక్క వనజ మరణానికి కారణమైన బావ వెంకటేశ్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు సదానందం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

  • ‘దక్కన్‌’ గొర్రెల పరిశోధన కేంద్రం తరలింపు తగదు

    మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకే కాకుండా యావత్‌ తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దక్కన్‌ జాతి గొర్రెల పరిశోధన స్థానం తరలింపును విరమించుకోవాలని తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్‌ డిమాండ్‌ చేశారు. పరిశోధన నిమిత్తం మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బండమీదిపల్లి పరిశోధన కేంద్రంలో ఉన్న 150 దక్కన్‌ జాతి గొర్రెలను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ వెటర్నరీ కేంద్రానికి తరలించడం సరైంది కాదన్నారు. ఆదివారం శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో ప్రచురితమైన శ్రీదక్కనీశ్రీ గుర్తింపు అనే కథనం ఆధారంగా ఆయన స్పందిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొర్రెల కాపరులకు ఎంతో చేయూతనందించారని గుర్తుచేశారు. వైఎస్సార్‌ హయాంలో ఇక్కడ పరిశోధన కేంద్రం ఏర్పాటు అయిందని చెప్పారు. దక్కన్‌ జాతి గొర్రెలు సమాజానికి రుచికరమైన మాంసం అందిస్తాయని పేర్కొన్నారు. దక్కన్‌ జాతిని సంరక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రాన్ని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నించడం తగదన్నారు. సదరు పరిశోధన కేంద్రానికి ప్రభుత్వాలు ఇచ్చిన వందల ఎకరాల భూములను పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కేటాయింపులు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం తన ఆలోచన విరమించుకోకపోతే సబ్బండ వర్గాలను కూడగట్టి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

    ఉత్సాహంగా వాలీబాల్‌ జట్ల ఎంపికలు

    మహబూబ్‌నగర్‌ క్రీడలు: మహబూబ్‌నగర్‌లోని మెయిన్‌ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా సీనియర్‌ పురుష, మహిళా జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలకు ముఖ్య అతిథిగా జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.శాంతికుమార్‌ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాలీబాల్‌ టోర్నమెంట్‌లో కోచ్‌లు అందజేసిన శిక్షణ ప్రదర్శిస్తే విజయాలు సాధింవచ్చన్నారు. టోర్నీలో క్రీడాస్ఫూర్తిని చాటాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మహ్మద్‌ హనీఫ్‌, ఉపాధ్యక్షులు బాలస్వామి, కార్యనిర్వాహక కార్యదర్శులు చెన్నవీరయ్య, సమద్‌ఖాన్‌, గులాం యాసిన్‌ఖాన్‌, డీఎస్‌ఏ వాలీబాల్‌ కోచ్‌ పర్వేజ్‌పాష తదితరులు పాల్గొన్నారు.

    బస్సులు ఆపడం లేదని ఆందోళన

    మన్ననూర్‌: శ్రీశైలం–హైదరాబాద్‌ ప్రధాన రహదారిలో మన్ననూర్‌ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని మహిళలు ఆందోళన చేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు మన్ననూర్‌ స్టేజీ నుంచి వివిధ డిపోల నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సులు అధికంగా రాకపోకలు సాగిస్తాయి. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పరిసర ప్రాంతాల నుంచి ప్రయాణికులు మద్దిమడుగు తదితర బస్సుల ద్వారా మన్ననూర్‌ స్టేజీ వరకు వచ్చి, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లేందుకు బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం, ముఖ్యంగా కార్తీక మాసం పర్వదినాలు కావడంతో మహిళలకు ఫ్రీ చార్జీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు అప్పటికే నిండడంతో మన్ననూర్‌ స్టేజీ వద్ద ఆపకుండా వెళ్లాయి. దీంతో కోపోద్రిక్తులైన మహిళలు బస్సులు ఎందుకు ఆపడం లేదని రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఇది ఇలా ఉండగా డీలక్స్‌, సూపర్‌ డీలక్స్‌, ఏసీ బస్సులు మన్ననూర్‌ స్టేజీ వద్ద ఉన్న ప్యాసింజర్‌ను చూసి ఆపితే ఏ ఒక్కరూ ఎక్కకపోవడం గమనార్హం. ఎంతసేపు ఆధార్‌ ఆధారిత ఫ్రీగా ఉండే బస్సులను మాత్రమే ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

    బీసీ కులాల ఐక్య వేదిక

    రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్‌

  • బోగస్‌ పత్రాలతో దౌర్జన్యం

    పట్టించుకోని పోలీసులు

    హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన

    స్మాట్‌ సంస్థ చైర్మన్‌

    న్యాయం చేయాలని వేడుకోలు

    గద్వాలటౌన్‌: సామాజిక బాధ్యతతో ప్రజలకు తాగునీరు అందించే సంస్థ స్మాట్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌శ్రీ ఆస్తులపై కొందరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. తప్పుడు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ పొందడం కలకలం రేపుతోంది. దీనిపై స్మాట్‌ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కరుణాకర్‌రెడ్డి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సంస్థ చైర్మన్‌ వివరించారు. గద్వాలలో ఉన్న స్మాట్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ఆస్తులను 2022లో వ్యాపార అవసరాల కోసం రాజశేఖర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డిలకు లీజుకు ఇచ్చామన్నారు. లీజు గడువు ముగిసిన తర్వాత ఆస్తులను ఖాళీ చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. దీంతో పాటు నకిలీ లీజు ఒప్పందం పత్రాలను సృష్టించి.. దాన్ని ఆధారంగా బోగస్‌ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ పత్రాలను పొందారని ఆరోపించారు. బోగస్‌ పత్రాలపై ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే బంధువులం, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తనపై బెదిరింపులకు దిగారని చెప్పారు. తమ ఆస్తులపై దౌర్జన్యం చెలాయిస్తూ.. బెదిరింపులకు పాల్పడిన రాజశేఖర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డిలపై స్థానిక రూరల్‌, టౌన్‌ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. కేసు విషయంపై రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు దౌర్జన్యం చేసిన వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. కేసు విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. న్యాయం కోసం తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను సంప్రదించాల్సిన అవసరం వచ్చిందన్నారు. హెచ్‌ఆర్సీ త్రీవంగా స్పందించి.. ఎస్పీకి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. తమ సంస్థ ద్వారా 15 ఏళ్లుగా గ్రామాలకు తాగునీరు, ఉపాధి, సాంకేతికతను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాంటి సంస్థకు చెందిన ఆస్తులను కాజేయాలని ప్రయత్నించడం.. వారికి పోలీసులు వంత పాడటం బాధాకరమన్నారు. ఇప్పటికై నా ఎస్పీ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

  • ‘మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తేవాలి’

    జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): సమాజం నుంచి మూఢ నమ్మకాలను రూపుమాపేందుకు మూఢ న మ్మకాల నిర్మూలనచట్టం తేవాలని తెలంగాణ విద్యా వంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య డి మాండ్‌ చేశారు. ఆదివారం టీఎన్‌జీఓ భవన్‌లో నాస్తిక సమాజం, బీటీఎఫ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మూఢ విశ్వాసాలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో సైన్స్‌ వేగంగా ముందుకు పోతున్న తరుణంలో మూఢనమ్మకాలతో సమాజం వెనుకబడుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఇప్పటికీ అమలులో ఉందన్నారు. అక్కడ ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. మూఢనమ్మకాల వల్ల సమాజంలో అమానవీక ఘటనలు కొనసాగుతున్నాయన్నారు. అందుకు ప్రతిఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. మారుతున్నకాలంతో తామూ మారాలన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మరూపంలో కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం భారత సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రలో అవలక్షణాలను సనాతన ధర్మం రూపంలో కొనసాగిస్తూ ప్రజలను విడదీస్తూ మెజారిటీ మతోన్మాదాన్ని ఎక్కిస్తూ పాసిజాన్ని సమాజంపై రుద్దుతున్నారన్నారు. వారి ఆధిపత్యం చెలా యి స్తూ ఇదే ప్రజాచైతన్యం.. ఇదే దేశభక్తి అని చాటుతున్నారన్నారు. కార్యక్రమంలో నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌, భారత నాస్తిక సమాజం జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మైత్రియాదయ్య, బహుజన టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు చెన్న య్య, భాస్కర్‌, జయకుమార్‌, పద్మావతి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌, కార్యదర్శి విజయ్‌కుమార్‌, బాలరాజు, వామన్‌ కుమార్‌, పాలమూరు అధ్యయన వేదిక కార్యదర్శి రాఘవాచారి, జక్కగోపాల్‌, ఇందిరా,రవికుమార్‌, యాదయ్య, హనుమంతు, సుధాకర్‌, సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్‌ సింగిరెడ్డి పరమేశ్వర్‌, ప్రవీణ్‌, రామదాసు పాల్గొన్నారు.

  • హ్యాండ్‌బాల్‌ టోర్నీ విజేత వరంగల్‌, ఆదిలాబాద్‌

    రన్నర్‌గా నిలిచిన

    పాలమూరు బాలబాలికల జట్లు

    కోస్గి: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ ఆదివారం ముగిసింది. అండర్‌–17 బాలబాలికలకు మూడు రోజులపాటు కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బాలుర విభాగంలో జరిగిన ఫైనల్‌లో మహబూబ్‌నగర్‌ జట్టుపై వరంగల్‌ జట్టు 22–15 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ జట్టుపై ఆదిలాబాద్‌ జట్టు 16–07 పాయింట్ల తేడాతో విజేతగా నిలవగా.. మహబూబ్‌నగర్‌ బాలబాలికల జట్లు రన్నర్‌గా నిలిచాయి. కరీంనగర్‌ బాలబాలికల జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. టోర్నీ ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు బెజ్జు రాములు, పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్‌ హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఆసీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Mahabubabad

  • రంగుల
    సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

    ఇండియన్‌

    జెజెబెల్‌

    కెమెరాలో సీతాకోక చిలుకలను బంధిస్తున్న అధ్యయన బృందం

    టానీ రాజు రకం

    బారోనెట్‌

    రెక్కలు విప్పిన

    80 రకాల జాతులు గుర్తించాం..

    ములుగు జిల్లా అడవుల్లో జరిగిన సర్వేలో 80 రకాల సీతాకోక చిలుకల జాతులను గుర్తించాం. అత్యాధునిక కెమెరాల సాయంతో వాటి సంఖ్య, అరుదైన జాతులను గుర్తించాం. వీటితోపాటు రాత్రి పూట సంచరించే చిమ్మటలు (మాత్‌) గుర్తించడం, వాటికి కావాల్సిన నివాసం, రక్షణ చర్యలపై అటవీశాఖ అధికారులకు వివరించాం.

    భవిష్యత్‌ తరాల కోసమే..

    భవిష్యత్‌ తరాలకు జీవరాశులు, కీటకాల గురించి తెలియజేసేందుకే తెలంగాణలో మొదటిసారి అధ్యయనం చేశాం. ప్రకృతితో మమేకమై మా పరిశోధన జరిగింది. ఈ అధ్యయనం మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది.

    – చిత్రశంకర్‌,

    సైంటిస్ట్‌, ఎంటమాలజిస్ట్‌

    ఏటూరునాగారం: పూల గనిపై మధుబనిని పీల్చుకునే సప్తవర్ణాల సొగసులు. పట్టుకునేలోపే జారిపోయే పగడాల జీవులు.. ఇంద్రధనస్సు ఇలపై విహరిస్తోందా అన్నట్లుండే సీతాకోక చిలుకలు. పచ్చని వనాల నడుమ మకరందాలు ఆరగిస్తుండగా.. ప్రకృతితో మమేకమైన పరిశోధకులు కెమెరాల్లో క్లిక్‌మనిపించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ములుగు జిల్లా లక్నవరం, మేడారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి అడవుల్లో చేసిన అధ్యయనం ఆదివారంతో ముగిసింది. ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, వరల్డ్‌ వైల్డ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌తోపాటు మరికొంత మంది అధ్యయన బృందం సభ్యులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు సర్వే చేశారు. 80 రకాల నూతన జాతుల సీతాకోక చిలుకలు ఉన్నట్లు ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌కు నివేదిక అందజేశారు. సీతాకోక చిలుకలు మనుగడ కొనసాగించేందుకు పూల మొక్కలు సైతం పెంచాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు.

    – ఇందారం నాగేశ్వర్‌రావు,

    ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

    ములుగు జిల్లాలో 80 నూతన జాతుల గుర్తింపు

    లక్నవరం, మేడారం, తాడ్వాయి అడవుల్లో మూడు రోజులు సర్వే

    సెలయేర్ల చాటున దాగి ఉన్న సీతాకోక చిలుకలు

    తెలంగాణలో మొట్టమొదటి అధ్యయనం

  • గడ్డి
    క్షణికావేశంలో తాగి ఆత్మహత్య

    ప్రాణం తీస్తున్న

    సాక్షి, మహబూబాబాద్‌: మారుతున్న కాలంతోపాటు అందిపుచ్చుకున్న శాస్త్ర విజ్ఞానం రైతులు, రైతు కుటుంబాలకు శాపంగా మారింది. పంటపొలాల్లో కలుపు నివారణకు వినియోగించే గడ్డిమందు ప్రజల ప్రాణాలు తీసేందుకు ఉపయోగపడుతోంది. రైతులకు అందుబాటులో ఉండే ఈ మందు తాగితే కోలుకోవడం కష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే గడ్డి మందు తాగిన వారిలో 99శాతం మృతి చెందడం గమనార్హం. అయితే ఇంతటి ప్రమాదకరమైన గడ్డి మందును ప్రభుత్వం నిషేధిస్తే తప్ప.. ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య తగ్గదని, ప్రభుత్వం దీనిని నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.

    40 గంటలకో ఆత్మహత్య..

    గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లా మహబూబాబాద్‌. ఇక్కడ డైబ్బె శాతానికి మించి ప్రజలు వ్యవసాయం చేస్తుంటారు. చిన్న చిన్న కమతాలను నమ్ముకొని వ్యవసాయం చేయడం, అప్పు ల పాలు కావడం సహజం. దీనికి తోడు సున్నిత మనస్సు గలవారు ఎక్కువగా ఉండడంతో చిన్న చిన్న సమస్యలకు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అధికంగా ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఇళ్లలో ఉన్న గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకోవ డం.. లక్షలు ఖర్చుచేసినా బతికిన వారు లేరని ఇక్క డి ప్రజలు చెబుతుంటారు. ఇలా ఐదేళ్లలో 1,172 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఏడాదికి సగటున 234మంది చనిపోగా ప్రతీ 40 గంటలకు ఒక ఆత్మహత్య కేసు నమోదు అవుతోంది. జిల్లాలో కేసముద్రం, గూడూరు, తొర్రూరు, డోర్నకల్‌, కొత్తగూడ, బయ్యారం, గార్ల పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం.

    గడ్డిమందు తాగే అధికంగా..

    జిల్లాలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వారు అధికం. గత ఐదేళ్లలో 905 మంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా అంటే 800పైగా గడ్డి మందులు గ్లైకోసెడ్‌, పండిమిథాలిన్‌, ప్రిటిల్లాక్లోర్‌, నామినీ గోల్డ్‌, ఆల్‌మిక్స్‌ తాగారు. ఈ మందులు తాగిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయే వరకు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబ సభ్యులు పేషెంట్‌ను బతికించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలైనప్పటికీ ప్రాణాలు కాపాడుకోలేని సంఘటనలు ఉన్నాయి. ఇంతటి ప్రమాదకరమైన ఈ గడ్డి మందు రైతుల ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ పెట్టడం.. ఫర్టిలైజర్‌ షాపు యజమానులు ఎవరికి పడితే వారికి విక్రయాలు జరపడంతో అందుబాటులో ఉంటుంది. ఆవేశం వచ్చిన వెంటనే తాగి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మందు ప్రభావంతో పంటలు కూడా విషతుల్యం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధికంగా గడ్డి మందు వినియోగించి పండించిన పంటలు తింటే కేన్సర్‌ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతటి ప్రమాదకరమైన గడ్డి మందు విక్రయాలే కాదు.. అసలు తయారీనే నిషేధించాలని ప్రజా సంఘాలు, డాక్టర్లు కోరుతున్నారు.

    ఐదేళ్లలో ఆత్మహత్యల వివరాలు

    సంవత్సరం మృతులు

    2021 218

    2022 244

    2023 224

    2024 248

    2025 238

    (ఇప్పటివరకు)

    తాగితే కోలుకోవడం కష్టమే

    ఏడాదికి 234 మంది తనువు చాలించారు

    గడ్డి మందు నిషేధించాలని ప్రజల డిమాండ్‌

    ఆత్మహత్య చేసుకున్న విధానం

    క్రిమిసంహారక

    మందు తాగి 905

    ఉరివేసుకొని 331

    నీటిలో పడి 65

    బర్నింగ్‌ 19

  • రాబట్టరు.. రాబందులు!

    సాక్షిప్రతినిధి, వరంగల్‌:

    కీలక శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న కొందరి కక్కుర్తి సర్కారు ఖజానాకు గండి పెడుతోంది. అవినీతికి మరిగిన కొందరు అధికారులు ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గం పట్టిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ తరచూ దాడులు నిర్వహిస్తున్నా వారి వైఖరి మారడం లేదు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల వైఖరి ప్రభుత్వ సొమ్మును వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది. రైతులను నుంచి సేకరించిన రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద సరఫరా చేస్తూ.. తిరిగి రాబట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సర్కారు ధాన్యాన్ని బయట అమ్ముకుంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి ఏసీకే (290 క్వింటాళ్లకు ఒక ఏసీకే)కు రూ.25 వేల వరకు వసూలు చేస్తూ మిన్నకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవల కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడు ఏసీకేల బియ్యం ఎగవేసిన ఓ వ్యాపారి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటూ సివిల్‌ సప్లయీస్‌ డీఎం జీవీ నర్సింహారావు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.

    ఏసీకేల వారీగా వసూళ్లు..

    31 మంది రైస్‌మిల్లర్ల నుంచి రూ.217 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం రాబట్టాల్సిన అధికారులు.. వాటి జోలికెళ్లడం లేదు. గత సీజన్‌లో అక్కడక్కడా ఆ డిఫాల్టర్లకే మళ్లీ సీఎంఆర్‌ ఇచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, ఆయా జిల్లాల కలెక్టర్లకు వరకూ వెళ్లినా విచారణ స్థాయి దాటలేదు. దీంతో సీఎంఆర్‌ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్‌ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్‌, ములుగు, జేఎస్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఇదిలా ఉంటే బకాయిదారుల నుంచి బియ్యం, ధాన్యం రాబట్టాల్సిన ఉన్నతాధికారులు.. ధాన్యం ఎగవేతదారులతో సంప్రదింపులు జరిపి ఏసీకేకు రూ.25 వేల చొప్పున కొందరి వద్ద ఇటీవల వసూలు చేసినట్లు తెలిసింది. వరంగల్‌కు చెందిన ఇద్దరు రైస్‌మిల్లర్ల లావాదేవీలు నిలిపివేసి పిలిపించిన పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు.. వారం రోజులకే మిల్లును తెరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో మూడు రైసుమిల్లులకు నోటీసులు ఇచ్చి.. ఐదు రోజుల వ్యవధిలోనే లావాదేవీలకు అనుమతి ఇవ్వడం అప్పట్లో ఆ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఈ సీఎంఆర్‌ దందాలో హస్తలాఘవం చూపుతున్న ఇద్దరు డీఎంలు, ముగ్గురు డీఎస్‌ఓలపై ఏసీబీ అడిషనల్‌ డీజీపీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదులు వెళ్లడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సీఎంఆర్‌లో అక్రమాలపై ఓ వైపు ఏసీబీ మరో వైపు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రంగంలోకి దిగి ఆరా తీస్తుండడం ఆ శాఖ అధికారుల్లో చర్చనీయాంశమవుతోంది.

    పౌరసరఫరాల శాఖలో వివాదాస్పదంగా ఇద్దరు డీఎంలు, ఇద్దరు డీఎస్‌ఓల తీరు

    సీఎంఆర్‌ రాబట్టడంలో మీనమేషాలు.. మిల్లర్లను వెనకేసుకొస్తూ భారీగా నజరానాలు

    ఒక్కో ఏసీకేకు రూ.25 వేలకు పైనే.. మిల్లర్ల వద్దే 1.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం

    ప్రభుత్వానికి చేరని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌.. నాలుగేళ్లుగా పెండింగ్‌

    ఏసీబీ అడిషనల్‌ డీజీ వరకు ఫిర్యాదులు.. కమిషనర్‌ పేషీకి సీఎంఆర్‌ దందా

    రంగంలోకి విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. అక్రమార్కులపై ఏసీబీ ఆరా

    ఏళ్లు గడుస్తున్నా ఉదాసీనతే..

    ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్‌ రాబట్టడంలో కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సీఎంఆర్‌ దందాపై పత్రికల్లో వచ్చినప్పుడో.. లేదా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినప్పుడో స్పందిస్తున్న పౌరసరఫరాల శాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇదే క్రమంలో సీఎంఆర్‌ ఇవ్వని మిల్లుల్లో ఉండే ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు 1,83,985 మెట్రిక్‌ టన్నులు రాబట్టారు. ఇదే సమయంలో ఇంకా రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యం 31 మంది రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.

  • ‘ప్రప

    హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ తెలంగాణ రచయితల సంఘం, మిత్రమండలి ఆధ్వర్యంలో

    కవిత్వంతో కలుద్దాం కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. హనుమకొండలోని భీమారం చాణక్యపురిలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవి, డాక్టర్‌ లంకా శివరామప్రసాద్‌ రచించిన ‘ప్రపంచ ప్రసిద్ధ కథలు’ సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాళోజీ పురస్కార గ్రహీత నెల్లుట్ల రమాదేవి ‘చావుకు కళ లేదు’ అనే కవితను వినిపించారు. కార్యక్రమంలో తెరసం రాష్ట్ర ఉపాధ్యక్షులు గణపురం దేవేందర్‌, బాలబోయిన రమాదేవి, మాదారపు వాణిశ్రీ, అనితారాణి, నాగవెల్లి జితేందర్‌, రాములు, రామ బ్రహ్మచారి, గోవర్ధన్‌రెడ్డి, మైస ఎర్రన్న, బిటవరపు శ్రీమన్నారాయణ తదితర కవులు పాల్గొని తన కవితలను వినిపించారు. అనంతరం కవులను ఘనంగా సత్కరించారు.

    భద్రకాళికి ట్రెయినీ ఐఏఎస్‌ల పూజలు

    హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం ట్రెయినీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లతోపాటు సినీ హీరో రాజ్‌తరుణ్‌ దర్శించుకున్నారు. వారికి ఆలయ పరిశీలకుడు క్రాంతికుమార్‌, ధర్మకర్తలు ఓరుగంటి పూర్ణచందర్‌, తొనుపునూరి వీరన్న స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.

    విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి

    విద్యారణ్యపురి: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని మైసూర్‌ ఆర్‌ఐఈ విద్యావిభాగం ప్రొఫెసర్‌ బుర్ర రమేశ్‌ సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా డాక్టర్‌ ఎ. సంజీవయ్య విధులను నిర్వర్తించి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అధ్యాపకులు హనుమకొండలోని డైమండ్‌హిల్స్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆదివా రం నిర్వహించిన విద్యాసదస్సు, సంజీవయ్య అభినందన సభలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని అభిప్రాయపడ్డారు. టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్‌, రాష్ట్ర మాజీ కార్యదరి భోగేశ్వర్‌, అధ్యాపకులు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌, సోమయ్య, అ ధ్యాపకుల జ్వాల సంపాదకుడు గంగాధర్‌రె డ్డి, డాక్టర్‌ ఎం.శంకర్‌నారాయణ, ఆసనాల శ్రీ నివాస్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ నర్సింహారెడ్డి మాట్లాడుతూ సంజీవయ్య అధ్యాపకుడిగా అందించిన సేవలను కొనియాడారు.

  • కమ్యూనిస్టులంతా ఏకం కావాలి

    నెహ్రూసెంటర్‌: దేశంలో కమ్యూనిస్టులంతా ఏకం కావాలని, మనం బలంగా లేకపోవడంతో మతో న్మాదం, పెట్టుబడిదారి వ్యవస్థలు పెరుగుతున్నాయ ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వీరభవన్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసి ఒకే పార్టీగా ఏర్పడి పాలన సాగిస్తున్నాయని, దేశంలో నిత్యం పేదల పక్షాన పోరాడే ఎర్రజెండాలు ఒకే గొడుగు కిందకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వందేళ్లు ప్రజల పక్షాన పోరాటాలు సాగించిన రాజకీయ పార్టీగా సీపీఐకి ఘనత దక్కుతుందన్నారు. డిసెంబర్‌ 26న సీపీఐ వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది సభను ఖమ్మంలో నిర్వహిస్తున్నామని, సభకు 40 దేశాలు, తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి ప్ర తినిధులు హాజరవుతునారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కుటుంబ, దోపిడీ పాలన సాగించిందని అందుకే ప్రజలు ఆ పార్టీని ఓడించారని విమర్శి ంచారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ లను అమలు చేయాలని, మంత్రులు అంతర్గత కుమ్ములాటలు మానుకోవాలని హితవుపలికారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ప్రచారం నిర్వహించామని ఆయన చెప్పారు.

    కమ్యూనిస్టులతో కలిసి పని చేయాలి..

    మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు బయటకు వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరా టాలు చేయాలని శ్రీనివాసరావు అన్నారు. అనంతరం జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి కౌన్సిల్‌ సమావేశంలో సభ విజయవంతం, రాజకీయ పరిస్థితులు, ఎన్నికలపై సమీక్షించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, రాష్ట్ర సమితి సభ్యులు అజయ్‌సారథిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు కుమార్‌, వెంకన్న, వరిపెల్లి వెంకన్న, రాజన్న, జిల్లా సమితి సభ్యులు పాల్గ్గొన్నారు.

  • ఉచిత న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలి

    మహబూబాబాద్‌ అర్బన్‌: పేద ప్రజలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్‌ న్యాయవాది యాసాడి చెన్నమల్లారెడ్డి, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ దాసరి నాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఆదివారం న్యాయ సేవల దినోత్సవం నిర్వహించారు. వాకర్స్‌ సభ్యులను అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీమార్గంతో సత్వరమే పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక లోక్‌ అదాలత్‌లలో కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో పోక్సోకేసు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంపెల్లి వెంకటయ్య, న్యాయవాదులు మోహన్‌, శ్రీనివాస్‌, ప్రభాకర్‌రెడ్డి, వాకర్స్‌ సభ్యులు మల్లయ్య, వెంకట్‌రెడ్డి, వాసుదేవ్‌, చంద్రయ్య, రాము, పారాలీగల్‌ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

  • భార్య కాపురానికి రావడం లేదని..

    కురవి: భార్య కాపురానికి రావడంలేదనే కారణంతో భర్త సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం రాజోలులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. డోర్నకల్‌ మండలం పెరుమాళ్లసంకీసకు చెందిన శెట్టి వెంకటేశ్వర్‌రావుకు కొన్ని సంవత్సరాల క్రితం రాజోలుకు చెందిన పుష్పతో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం కూడా జరగడంతో పుష్ప తల్లిగారింటికి వచ్చింది. తన భార్యను కాపురానికి పంపించడం లేదని వెంకటేశ్వర్‌రావు శనివారం రాజోలుకు వచ్చి గొడవ చేసినట్లు సమాచారం. ఆదివారం గ్రామంలోని సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని టవర్‌పై నుంచి దించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ విషయమై ఎస్సై సతీశ్‌ను వివరణ కోరగా వెంకటేశ్వర్‌రావు తన భార్యను కొట్టడంతో ఆమె తల్లిగారింటికి వచ్చిందని, భార్య కావాలని టవర్‌ ఎక్కగా కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించినట్లు తెలిపారు.

    సెల్‌టవర్‌ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

    రాజోలులో ఘటన

  • బుగులోని జాతర ఆదాయం రూ.12.22 లక్షలు

    రేగొండ: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర ఆదాయం రూ.12.22 లక్షలు వచ్చినట్లు ఈఓ బిల్లా శ్రీనివాస్‌, చైర్మన్‌ గంగుల రమణారెడ్డి తెలిపారు. ఆదివారం దేవాదాయ పర్యవేక్షణ అధికారి కవిత ఆధ్వర్యంలో జాతరలో హుండీలను లెక్కించినట్లు పేర్కొన్నారు. హుండీల ద్వారా రూ.5,99,709, బంగారం 2 గ్రాములు, మిశ్రమ వెండి 280 గ్రాములు, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,39,900, గండ దీపం రూ.3,890, కేశఖండన రూ.18,250, అర్చన రూ.17,750, తైబజార్‌ రూ.22,150, టెండర్స్‌ ద్వారా రూ.3,18,000, విరాళాలు రూ.3,021 వచ్చాయి. మొత్తం జాతర ఆదాయం రూ.12.22 లక్షలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు నిమ్మల విజేందర్‌, గంట గోపాల్‌, పన్నాటి శ్రీనివాస్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య

    హసన్‌పర్తి: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన హసన్‌పర్తిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కమలాపూర్‌ మండలం వంగపల్లికి చెందిన అరుణకు హసన్‌పర్తికి చెందిన కాలె తిరుపతి(41)తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం తిరుపతి ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వర్షానికి ఇల్లు కూలిపోవడంతోపాటు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపానికి గురై శనివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • చాలా

    నేను హైకోర్టులో అడ్వకేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు రైలులో వస్తుంటా. ఇక్కడ సెల్ఫ్‌ డ్రైవ్‌ కారు తీసుకుని నగరంలో పనులన్నీ పూర్తి చేసుకుంటా. అనంతరం కారు అప్పగించి తిరిగి హైదరాబాద్‌ వెళ్తా.

    దేవులపల్లి మల్లికార్జున్‌రావు, అడ్వకేట్‌

    యువతే ఆసక్తి చూపుతోంది

    ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితోపాటు నగరానికి చెందిన యువ త ఎక్కువగా కార్ల ను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిబంధనల మేరకు కార్లను అద్దెకు ఇస్తున్నాం.

    ఎస్‌. విజయ్‌కుమార్‌,అద్దెకార్ల షాపుల యజమాని, వరంగల్‌

  • రెజోనెట్‌కు అనూహ్య స్పందన

    హన్మకొండ: రెజోనెన్స్‌ విద్యాసంస్థ నిర్వహించిన రెజోనెట్‌ టాలెంట్‌ టెస్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఆదివారం హనుమకొండలోని రెజోనెన్స్‌ జూనియర్‌ కళాశాల సెంటర్‌లో నిర్వహించిన టాలెంట్‌ టెస్ట్‌కు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఫీజులో 10 నుంచి 100 శాతం రాయితీ కల్పించనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. దీంతో వరంగల్‌ మహానగరంతోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. టాలెంట్‌ టెస్ట్‌కు హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులకు రెజోనెన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లెక్కల రాజిరెడ్డి, డైరెక్టర్లు లెక్కల మహేందర్‌రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, లెక్కల రమ్య రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

  •  ఆనందంగా చుట్టొద్దాం!
    ● వరంగల్‌లో అందుబాటులో అద్దె కార్లు.. ● ఆసక్తి చూపుతున్న పర్యాటకులు, నగర వాసులు

    ఖిలా వరంగల్‌ : అభిరుచి, అవసరాల మేరకు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ బైక్‌తో పాటు కారు ఉంటోంది. అయితే రైళ్లు, బస్సుల ద్వారా మాత్రమే చేరుకునే పట్టణాలు, ప్రాంతాలకు తమ సొంత వాహనాలను తీసుకెళ్లడం సాధ్యం కాదు. అలాంటి సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో కారు ఉంటే బాగుంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి వారికి శుభవార్త. వివిధ పనుల నిమిత్తం వరంగల్‌ నగరానికి వచ్చే వారికి అద్దె కార్లు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు, నగరవాసుల అవసరం, ఆసక్తి మేరకు ప్రస్తుతం వరంగల్‌, హనుమకొండ ట్రైసిటీలో 10 వరకు సెల్ఫ్‌ డ్రైవ్‌, అద్దె కార్ల షాపులు ఉన్నాయి.

    అద్దె కారులో సంతోషంగా

    పర్యాటక ప్రాంతాల సందర్శన..

    ఆదివారం, ప్రభుత్వ సెలవు వచ్చిందంటే మేడారం,మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి, హైదరాబాద్‌, యాదగిరి గుట్ట, పాలకుర్తి, వేములవాడ, కొ మ్మాల, పాకాల, రామప్ప, లక్నవరం సరస్సుకు సెల్ఫ్‌ డ్రైవ్‌తో కుటుంబంతో కలిసి వెళ్లాలనే ఆశ అందరిలోనూ ఉంటుంది. వారి ఆశలను వరంగల్‌ నిరుద్యోగ యువత తీరుస్తోంది. సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్లను అందుబాటులో ఉంచుతోంది. వీటిని పర్యాటకులు, నగర వాసులు వినియోగించుకుంటూ కారులో సంంతోషంగా ప్ర యాణిస్తూ తమ ఆశలను నెరవేర్చుకుంటున్నారు.

    అద్దెకు అన్ని రకాల కార్లు..

    నగరంలో నిరుద్యోగ యువత ఉపాధే మార్గంగా సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్లు, రెంటల్‌ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల కార్లను అద్దెకు ఇస్తున్నారు. ఫలితంగా నగరానికి వచ్చే పర్యాటకులు, వ్యాపారులకు ఇది ఎంతో ప్రయోజన కరంగా ఉంది. హుందాగా కారులో షికారు చేస్తూ పనులు పూర్తి చేసుకుని తిరిగి కారు అప్పగించి వెళ్లిపోయే సౌలభ్యం అందుబాటులోకి వచ్చేంది. యువత, వ్యాపారులు, పర్యాటకులు ఈ సౌలభ్యాన్ని ఎక్కువ వినియోగించుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వాహనాన్ని బుక్‌ చేసుకోవాలంటే నేరుగా కారు సెల్ఫ్‌ డ్రైవ్‌, రెంటల్స్‌ కేంద్రాలకు వెళ్లి తమ డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ కాపీలు, ఒరిజనల్‌ డ్రైవింగ్‌ జతచేసి పూరించిన ఫార్మట్‌ అందజేయాల్సి ఉంటుంది.

    అద్దె రుసుము ఇలా..

    ఈకేంద్రాల్లో 12 గంటల కన్నా తక్కువ సమయానికి కారు అద్దెకివ్వరు. 24 గంటల సమయానికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కారు సీట్లను బట్టి ధర నిర్ణయిస్తారు. 24 గంటలకు ఐదు సీట్ల కారుకు రోజుకు రూ. 1,300 నుంచి రూ.1,600 వరకు వసూలు చేస్తారు. అదే ఏడు సీట్ల కారు అయితే రూ.1,900 నుంచి రూ.2,000 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కారు కంపెనీ బట్టి రెంటల్‌ ధర నిర్ణయిస్తారు. దీనిని బుక్‌ చేసుకోవాలంటే నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి గాని, సంస్థ ఫోన్‌ నంబర్‌కు గాని కాల్‌ చేయాలి.

  • రేపు

    వరంగల్‌ స్పోర్ట్స్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14,17 బాలబాలికల అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వి.ప్రశాంత్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు భీమారం సమీపంలోని కిట్స్‌ కళాశాలలో ప్రారంభమయ్యే ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు రజినీకాంత్‌ 93910 29491, పార్థసారథి 98497 60799 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

    ముగిసిన ‘సర్జన్స్‌’

    రాష్ట్రస్థాయి సదస్సు

    ఎంజీఎం: నగరంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సర్జన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. కాళోజీ క్షేత్రంలో నిర్వహించిన ముగింపు సదస్సులో లాప్రోస్కోపి శస్త్రచికిత్సలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్జన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ సదస్సు విజయవంతం కావడానికి కేఎంసీ పోస్టు గ్రాడ్యుయేట్‌ విదార్థులు, సర్జన్ల కృషి ఉందన్నారు. సదస్సులో పాల్గొన్న అతిథులతో పాటు సదస్సు విజయవంతం చేసిన వారిని అసోసియేషన్‌ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సదస్సులో సర్జన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ మోహన్‌దాస్‌, కూరపాటి రమేశ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నాగేందర్‌ పాల్గొన్నారు.

    చిట్‌ఫండ్‌ యజమానిపై కేసు

    కాజీపేట: కాజీపేట పట్టణంలో 30 మంది చిరు వ్యాపారుల నుంచి దాక్షాయణి చిట్‌ఫండ్‌ పేరుతో రూ.30 లక్షలు వసూలు చేసిన గుండ్ల శ్రావణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. కాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఎస్సై నవీన్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హనుమకొండకు చెందిన గుండ్ల శ్రావణ్‌కుమార్‌ ఫైనాన్స్‌ సంస్థను స్థాపించి వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేశాడు. పది రోజులుగా శ్రావణ్‌కుమార్‌ డబ్బుల కోసం రాకపోవడంతోపాటు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోంది. దీంతో బాధితులు ఇంటి వద్దకు వెళ్లగా ఆచూకీ లభించలేదు. బాధితులతో కలిసి వచ్చి బుడిమే రమేశ్‌ ఫిర్యాదు చేయగా శ్రావణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ వివరించారు.

    14న బహిరంగ వేలం

    పాలకుర్తి టౌన్‌ : శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునే హక్కు కోసం (అభిషేకం, వాహనపూజ సామగ్రి మినహాయించి) తలనీలాలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్‌ కోసం సీల్డ్‌ టెండర్‌ కం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఈనెల 13న సాయంత్రం 5 గంటలోపు బుకింగ్‌ కార్యాలయంలో రూ. 1000 చెల్లించి టెండర్‌ షెడ్యూల్‌ పొందాలని కోరారు.

  • మాకు న్యాయం చేయాలి..

    కన్నాయిగూడెం : తమ కుమారుడి మృతికి వైద్యులు, సిబ్బందే కారణమని, ఈ విషయంలో ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చే యాలని పాముకాటుతో మృతి చెందిన బాలుడి త ల్లిదండ్రుల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం పీహెచ్‌సీ ఎదుట బాలుడి మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బా ధిత తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని గుర్రేవులకు చెందిన తిరునగరి రాజు కుమారుడు హరినాథ్‌(7) శనివారం ఇంటి ఎదుట ఆడుకుంటుండండగా పాముకాటు వేసింది. గమనించిన బంధువులు వెంటనే బాలుడిని స్థానిక పీహెచ్‌సీకీ తరలించగా పాము కాటుకు సంబంధించిన యాంటీడోస్‌ లేదని, డాక్టర్‌కు ఫోన్‌ చేయాలని, తాను చికిత్స చేయలేనని స్టాఫ్‌ నర్సు చెప్పింది. దీంతో వెంటనే ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తుండగా బాలుడు మృతి చెందాడు. దీనికి కారణం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వైద్యుడు అందుబాటులో ఉండి ఇక్కడి పీహెచ్‌సీలోనే వైద్యం చేసి ఉంటే తమ కుమారుడు బతికేవాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే వైద్యులు, సిబ్బందిని విధుల నుంచి తొలగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన సమాచారం అందుకున్న ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సర్వర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అప్సర్‌ పాషా ఘటనాస్థలికి చేరుకుని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్కకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీనికి మంత్రి స్పందిస్తూ బాలుడి వైద్యంపై నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిని, డ్యూటీకి రాకుండా తప్పుడు సమాచారం ఇచ్చి మీడియా ప్రతినిధులను తప్పుతోవ పట్టించిన వైద్యుడిని తక్షణమే సస్పెండ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఏటూరునాగారం తరలించారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    పాముకాటుతో మృతి చెందిన

    బాలుడి తల్లిదండ్రుల డిమాండ్‌

    తమ కుమారుడి మృతికి వైద్యులు, సిబ్బందే కారణం

    వారిని వెంటనే విధుల నుంచి

    తొలగించాలి

    పీహెచ్‌సీ ఎదుట బాలుడి

    మృతదేహంతో ఆందోళన

  • నకిలీ బంగారం ముఠా అరెస్ట్‌

    కాటారం: మండల కేంద్రంలోని ఓ సూపర్‌ మార్కెట్‌ యజమానికి నకిలీ బంగారం అంటగట్టి ఆర్థికంగా మోసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులతో కూడిన ముఠాను అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి కాటారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన రాజు సోలంకి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పుణ్య బాలచంద్‌ రాథోడ్‌, మీనాపుణ్య రాథోడ్‌, కారేగావ్‌కు చెందిన శాంతివిజయ సోలంకి, స్వప్నఈశ్వర్‌ సోలంకి జల్సాలకు అలవాటు పడి చోరీలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో వారం రోజుల క్రితం ఐదుగురు ముఠా సభ్యులు కాటారం మండల కేంద్రానికి చెందిన ఓ సూపర్‌ మార్కెట్‌ యజమాని వద్దకు వెళ్లి తమ వద్ద బంగారం ఉందని తక్కువ ధరకు ఇస్తామని ఆశ చూపారు. దీంతో సదరు దుకాణం యజమాని కొంత నగదు చెల్లించి బంగారం తీసుకోగా నకిలీ అని గుర్తించాడు. మోసపోయినట్లు గ్రహించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఈ ముఠా సభ్యులు కాటారం మండల పరిధిలోని నస్తూర్‌పల్లి సమీపంలో ఓ వ్యక్తిని బెదిరించి దాడి చేసి దారి దోపిడీకి పాల్పడినట్లు ఫిర్యాదు ఉంది. దీంతో జిల్లా ఎస్పీ కిరణ్‌ఖరే ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి చింతకాని గ్రామశివారులో ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు మహిళలు మేడారం వైపునకు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నకిలీ బంగారం అంటగట్టి సూపర్‌ మార్కెట్‌ యజమానిని మోసం చేయడంతోపాటు వ్యక్తిపై దాడి చేసి దారి దోపిడీకి పాల్పడినట్లు సదరు నిందితులు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.3.48 లక్షల నగదుతోపాటు ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. కేసును అత్యంత ప్రతిభతో ఛేదించిన కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సైలు శ్రీనివాస్‌, మహేశ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రవీణ్‌, కానిస్టేబుళ్లు రాజు, నాగరాజు, రామారావు, జంపన్న, ఐటి కోర్‌ వేణును ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి వాటి బారినపడి మోసపోవద్దని డీఎస్పీ ఈ సందర్భంగా సూచించారు.

    రూ.3.48 లక్షల నగదు,

    6 సెల్‌ఫోన్లు స్వాధీనం

    వివరాలు వెల్లడించిన

    కాటారం డీఎస్పీ సూర్యనారాయణ

  • రోడ్డ

    ఎల్కతుర్తి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళపల్లి–ముల్కనూరు రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మంగళపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి శ్రీనివాస్‌(48) తన మనవళ్లు రిషి, రక్షిత్‌ను తీసుకొని ద్విచక్రవాహనంపై మంగళపల్లి నుంచి ముల్కనూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వైపు వస్తున్న టిప్పర్‌ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. ద్విచక్ర వాహనంపై ఉన్న బసిరెడ్డి శ్రీనివాస్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని రహదారిపై ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ పులి రమేశ్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వంగర ఎస్సై దివ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    మంగళపల్లి–ముల్కనూరు రోడ్డుపై బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌

    ఎల్కతుర్తి–సిద్దిపేట రహదారిపై

    మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన

    న్యాయం చేస్తామని ఏసీపీ

    ప్రశాంత్‌రెడ్డి, సీఐ రమేశ్‌ హామీతో

    ధర్నా విరమణ

  • కోటలో

    ఖిలా వరంగల్‌: కాకతీయుల రాజధాని ఖిలావరంగల్‌ కోటలో ఆదివారం పర్యాటకులు సందడి చేశా రు. విదేశీయులు, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తు న తరలొచ్చి అద్భుత శిల్ప సౌందర్యాన్ని తిలకించారు. కోటలోని స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలోని శిల్ప సంపద, ఖుష్‌ మహల్‌, ఏకశిల గుట్ట, రాతి, మట్టికోట అందాలను తిలకించారు. పర్యాటక శాఖ గైడ్‌ రవి యాదవ్‌ విదేశీయులకు కాకతీయుల విశిష్టత గురించి వివరించారు. అనంతరం పర్యాటకులు ఏకశిల చిల్డ్రన్‌ పా ర్క్‌లో సేదదీరారు. కార్యక్రమంలో టీజీటీడీసీ కోట ఇన్‌చార్జ్‌ గట్టికొప్పుల అజయ్‌, కేంద్ర పురావస్తుశాఖ కోట ఇన్‌చార్జ్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

  • జనగామ ఫ్లైఓవర్‌పై రిటైర్డ్‌ హెచ్‌ఎం..

    జనగామ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ మృతి చెందాడు. ఈ ఘటన జనగామలోని ఫ్లై ఓవర్‌పై చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన భూపల్లి నతాని యేలు(65) జనగామ ప్రిస్టన్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాడు. ఈక్రమంలో ఆదివారం బైక్‌పై ఫ్లై ఓవర్‌పై వస్తున్న క్రమంలో మరో బైక్‌ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యేలును జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం పోస్టుమార్టం పూర్తయిన తర్వాత స్వగ్రామంలో యేలు అంత్యక్రియలు జరగనున్నట్లు ప్రిస్టన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ బక్క ప్రవీణ్‌ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రిటైర్డ్‌ ప్రధాన ఉపాధ్యాయుడి మృతిపై పూర్వ విద్యార్థులతో పాటు జనగామ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

    బుర్హాన్‌పురం సమీపంలో యువకుడు..

    మరిపెడ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుర్హాన్‌పురం సమీపంలోని జాతీయ రహదారి –365పై ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం ఇటిక్యాలపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి చందు(25), ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన రాములు బుర్హాన్‌పురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలకు బంధువు ఇంటికి వెళ్లారు. బుర్హాన్‌పురం గ్రామం నుంచి ఇద్దరు ద్విచక్రవాహనంపై మరిపెడ మండల కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన రాములును 108లో మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు.

Business

  • దేశంలో వ్యవస్థీకృత పన్ను ఎగవేత నెట్‌వర్క్‌పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సంచలన విషయాలు బయటపెట్టింది. రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు (RUPP), చార్టర్డ్ అకౌంటెంట్లు (CA), మధ్యవర్తుల సహకారంతో రూ.9,169 కోట్ల విలువైన నిధులను లాండరింగ్ చేస్తూ పన్ను ఎగవేత కోసం రాజకీయ విరాళాలుగా మళ్లిస్తున్న ఒక భారీ రాకెట్‌ను సీబీడీటీ వెలుగులోకి తీసుకొచ్చింది.

    అదనపు పన్ను మినహాయింపులు

    సీబీడీటీ చర్యకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 2022–23, 2023–24 సంవత్సరాల్లో చట్టబద్ధంగా ప్రకటించిన రాజకీయ రసీదులతో పోలిస్తే రూ.9,169 కోట్లు అదనపు పన్ను మినహాయింపులు క్లెయిమ్ అయ్యాయి. అందులో..

    • 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి రూ.6,116 కోట్లు

    • 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి రూ.3,053 కోట్లు

    భారత ఎన్నికల సంఘం ఇటీవల 800 RUPPలను రద్దు చేసిన తర్వాత రాజకీయ విరాళ చట్టాల్లోని లొసుగులను RUPPలు దుర్వినియోగం చేస్తున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీబీడీటీ దర్యాప్తు చేసినట్లు తెలిసింది.

    మోసపూరిత పద్ధతులు

    దర్యాప్తులో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సీబీడీటీ బృందాలు 420 బ్యాంక్ స్టేట్‌మెంట్లు, 200 కేసు ఫైళ్లు, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ సందేశాలతో సహా కీలకమైన ఆధారాలను పరిశీలించాయి. ఇందులో కొందరు దాతలు మధ్యవర్తులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా RUPPలకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని పన్ను రహిత రాజకీయ విరాళాలుగా క్లెయిమ్ చేస్తున్నారు. దీనికి బదులుగా ఆయా పార్టీల్లో కీలక వ్యక్తులుగా ఉన్న ఆదే దాతలకు నగదు ట్యాక్స్‌ లేకుండా వాపసు వెళ్తుంది. ఈ ప్రక్రియలో మధ్యవర్తులు కమీషన్లు పొందుతున్నారు.

    ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29ఏ కింద నమోదు చేసుకున్న RUPPలు జాతీయ లేదా రాష్ట్ర పార్టీ గుర్తింపు పొందని రాజకీయ సంస్థలు. ఇవే ఈ అక్రమ కార్యకలాపాలకు వేదికగా మారాయి. కేవలం 36 RUPPలు మాత్రమే రూ.5,591 కోట్లను అక్రమంగా మళ్లించినట్లు గుర్తించారు. మొత్తం బోగస్ రాజకీయ నిధులలో 60 శాతం కేవలం 10 పార్టీల్లో కేంద్రీకృతమై ఉండటం గమనార్హం.

    నకిలీ పత్రాలు

    సీబీడీటీ నిర్వహించిన సోదాల్లో నకిలీ విరాళాల రసీదులు, నకిలీ దాతల జాబితా, నకిలీ బ్యాంక్ రసీదు పుస్తకాలు వంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆడిట్ ట్రయల్స్‌ను చెరిపివేయడానికి, పెద్ద ఎత్తున పన్ను మినహాయింపులను గుర్తించకుండా ఉండేందుకు ఈ దస్త్రాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపు విధానాల్లో పారదర్శకతను మెరుగుపరచడానికి, పన్ను ఎగవేతను అరికట్టడానికి RUPPల ఆర్థిక లావాదేవీలపై కఠినమైన నిబంధనలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?

Medak

  • చిట్ట

    ఈ చిత్రంలోని బాధితుడి పేరు గజవెల్లి కుమారస్వామి. చిన్నశంకరంపేట మండలం శేరిపల్లి గ్రామం. 15 ఏళ్ల క్రితం రామాయంపేటకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. గడిచిన 6 ఏళ్ల నుంచి రామాయంపేటలో ఓ వ్యక్తి వద్ద తనతో పాటు కుటుంబీకుల పేర్లపై నాలుగు చిట్టీలు వేశాడు. అందుకు రూ. 24 లక్షలు రావాల్సి ఉంది. కాగా చిట్టీల నిర్వాహకుడు ఏదో కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పెద్దలు పంచాయితీ నిర్వహించి రూ. 24 లక్షలకు బదులు కేవలం రూ. 2.60 లక్షలు మాత్రమే ఇప్పించారు. ఈ వ్యవహారంలో కుమారస్వామితో పాటు చాలా మంది పోలీసులను ఆశ్రయించారు.

    హవేళిఘణాపూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పద్మ కూతురు పెళ్లి కోసం 2015 నుంచి మెదక్‌లోని ఓ చిట్‌ఫండ్‌ కంపెనీలో రూ. 10 లక్షల చిట్టీ వేసింది. దీంతో పాటు మరో రూ. 7.50 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది. తీరా సదరు చిట్‌ఫండ్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ సిబ్బందిని కలిస్తే నెలకు రూ. లక్ష చొప్పున బ్యాంకులో తీసుకోవాలని చెక్‌లు ఇచ్చారు. ఆశతో బ్యాంకుకు వెళితే అకౌంట్‌లో మాత్రం డబ్బులు లేవు. ఇదేంటని ప్రశ్నిస్తే డబ్బులకు బదులు మనోహరాబాద్‌ వద్ద ప్లాట్లు తీసుకోవాలని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇచ్చింది లేదు. కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులు రాకపోవడంతో బాధిత కుటుంబం ఆందోళన చెందుతుంది.

    మెదక్‌జోన్‌: మెతుకుసీమలో కొన్ని చిట్‌ఫండ్స్‌ కంపెనీలు చీటింగ్‌కు కేరాఫ్‌గా మారాయి. ఎంతో నమ్మకంతో చిట్టీలు వేస్తే మోసాలకు తెగబడుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు, ఇల్లు కట్టుకునేందుకు ఉపయోగపడతాయనే ఆశతో పైసాపైసా కూడబెట్టి జమ చేస్తే రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేస్తున్నారు. వేలాది మంది నుంచి రూ. కోట్లు వసూలు చేసి బోర్డులు తిప్పేశారు. అలాగే ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్‌ వ్యక్తులు అక్రమంగా చిట్టీల వ్యాపారం నిర్వహించి అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు. జిల్లా కేంద్రంలో 2017 నుంచి 2024 వరకు 7 చిట్‌ఫండ్‌ కంపెనీలు మూసివేయ డం ఇందుకు నిదర్శనం. కొంతమంది తమకున్న పలుకుబడితో డబ్బులు వసూలు చేసుకోగా, మరికొందరు నిలువునా మునిగారు. చేసేదిలేక ఇప్పటికీ పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా రు. జిల్లా కేంద్రంలో రెండేళ్ల క్రితం మూతపడిన ఓ చిట్‌ఫండ్‌ కంపెనీలో సుమారు 450 మంది డబ్బులు జమ చేస్తే బోర్డు తిప్పేసి ఉడాయించారు. ఇందులో బాధితులతో పాటు ఎంతో మంది ఏజెంట్లు మోసపోయారు. డబ్బులకు బదులు కొంతమందికి ప్లా ట్లు ఇచ్చినట్లు తెలిసింది. మిగితా వారికి నేడు, రేపు అంటు తిప్పుతున్నారు.

    అధిక వడ్డీలకు పేట అడ్డా!

    జిల్లాలో ముఖ్యంగా అధిక వడ్డీ, రోజువారీ ఫైనాన్స్‌కు రామాయంపేట అడ్డాగా మారింది. చిరు వ్యాపారులు, గిరిజనులకు రూ. 10 వేలు అప్పు కావాలంటే రూ. 9 వేలు మాత్రమే ఇచ్చి, రూ. వెయ్యి కమీషన్‌ తీసుకుంటున్నారు. వసూలు మాత్రం రూ. 10 వేలు చేస్తున్నారు. రూ. లక్ష అవసరం ఉన్న వారికి రూ. 90 వేలు ఇచ్చి, రోజుకు రూ. 500 చొప్పున.. రెండు వందల రోజుల్లో రూ. లక్ష వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన వడ్డీ వందకు రూ. 10కి పైగా వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా గిరిజనులకు నూటికి రూ. 5 నుంచి రూ. 10 చొప్పున అప్పులిచ్చి వారి పట్టాదారు పాస్‌ పుస్తకాలను షూరిటీగా పెట్టుకుంటున్నారు. బాండ్‌ పేపర్లు రాసుకొని అమాయకులను నిలువునా ముంచుతున్నారు. ఇందులో చాలా మంది చిట్టీల నిర్వాహకులు ప్రభుత్వ అనుమతి లేకుండా వ్యాపారం కొనసాగించటం గమనార్హం.

    రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

    చిట్టీల వ్యాపారం నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. రిజిస్టర్‌ అయిన చిట్‌ఫండ్స్‌ కంపెనీలు, చిట్టీ వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే కోర్టుకు లాగవచ్చు. అను మతి లేకుండా అక్రమంగా చిట్టీలు నడిపితే శాఖాపరమైనా చర్యలు శతీసుకునే అధికారం ఉంది. – రాంమోహన్‌,

    సబ్‌ రిజిస్ట్రార్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా

    చోద్యం చూస్తున్న అధికారులు

    ఇప్పటికే జిల్లాలో ఏడు చిట్‌ఫండ్స్‌ కంపెనీల మూత

    కొందరు ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్‌ వ్యక్తుల ఇష్టారాజ్యం

    బాధితులను కదిలిస్తే కన్నీళ్లే..

  • పోరాట

    నర్సాపూర్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్‌ కోడ్‌లు అమలులోకి రాకముందే పలు కంపెనీల యాజమాన్యాలు కార్మికుల నడ్డి విరుస్తున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు ఆరోపించారు. ఆదివారం నర్సాపూర్‌– తూప్రాన్‌ రూట్‌ ఆటో యూనియన్‌ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్రం అమలు చేయడం లేదని, కంపెనీల యాజమాన్యాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సీఐటీయూ పలు పోరాటాలు చేసి అవి అమలులోకి రాకుండా కృషి చేసిందన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు మెదక్‌లో జరిగే సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఆయన వెంట ఆటో యూనియన్‌ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్‌, అనిల్‌, నర్సింలు, సురేశ్‌ తదితరులు ఉన్నారు.

    ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పద్యం పదికాలాల పాటు నిలుస్తుందని, ధారణతో కూడిన అవధా నం తెలుగు సాహిత్యంలోనే ఉందని అవధాని గౌరిభట్ల రఘురామశర్మ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర క్షేత్రం మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పూజలు, హోమాలు, వైధిక కార్యక్రమాలతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశపతి శ్రీనివాసశర్మ, రుక్మాభట్ల కొదండరామశర్మలు సంగీతంతో అలరించారు. అష్టావధానం అవధాని డాక్టర్‌ గౌరిభట్ల రఘురామశర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పండరి రాధకృష్ణ, కవులు, రచయితలు, సాహితీ ప్రియులు తదితరులు పాల్గొన్నారు.

    వర్గల్‌(గజ్వేల్‌): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి భక్తులతో పోటెత్తింది. కార్తీకమాసం ఆదివారం సెలవురోజు కార్తీక వ్రతాలు, దీపారాధనలతో శోభిల్లింది. హరిద్రానది వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో కార్తీక సత్యదే వుని వ్రతం జరిపించుకున్నారు. రాత్రి సహస్ర కార్తీక దీపోత్సవంలో భాగస్వాములై కార్తీక దీపాలు వెలిగించారు. గర్భగుడిలో నృసింహస్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని త రించారు. క్షేత్రంలో 198 సత్యదేవుని వ్రతా లు జరగగా, ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు.

    కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలిరావడంతో సందడిగా మారింది. మట్టికుండలో మల్లన్నకు బెల్లం పాయసం తయారు చేసి బోనం నివేదించారు. చెలక, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకున్నారు. గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టారు. కొండపై ఉన్న ఎల్లమ్మ ను దర్శించుకుని తమపిల్లా పాపలను చల్లంగా చూడలని వేడుకున్నారు.

  • విద్యుత్‌ అధికారుల పల్లెబాట

    నారాయణఖేడ్‌: క్షేత్రస్థాయిలో విద్యుత్‌ ఇబ్బందులు తీర్చేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు పల్లెబాట పట్టారు. టీజీఎస్పీడీసీఎల్‌ పరిధిలో జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఆయా విద్యుత్‌ సమస్యలతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను తక్షణం పరిష్కరించనున్నారు. ఇంజనీర్లు మొదలుకుని ఆర్టీజన్‌ స్థాయి సిబ్బంది వరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి సమస్యలు తీర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలోనూ అధికారులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నారాయణఖేడ్‌ విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో 7, జోగిపేటలో 5, సంగారెడ్డిలో 4, సదాశివపేట్‌లో 4, జహీరాబాద్‌లో 7, పటాన్‌చెరులో 9, ఇస్నాపూర్‌లో 2 చొప్పున 38 సెక్షన్లు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో సుమారు 158కి పైగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లున్నాయి. ఈ సబ్‌స్టేషన్ల పరిధిలో గ్రామా లు, పట్టణాలు, కాలనీల్లో ఉన్న విద్యుత్‌ సమస్యలను అధికారులు తక్షణం పరిష్కారం చేసే చర్యలను ప్రారంభించారు.

    వారంలో మూడు రోజులు

    ప్రతీవారంలో మూడు రోజుల అధికారులు ‘విద్యుత్‌ అధికారుల ప్రజాబాట’కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో వీరు గ్రామాలను పర్యటిస్తారు. ఎస్‌ఈ, ఏడీఈ, ఏఈ, లైన్‌మెన్‌ మొదలుకుని ఆర్టీజన్‌ స్థాయి సిబ్బంది వరకు అందరూ పర్యటించనున్నారు. నేరుగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి నెట్‌వర్క్‌ తనిఖీలు చేయనున్నారు. వినియోగదారుల నుంచి సలహాలు, ఫిర్యాదులను సైతం స్వీకరిస్తారు. విద్యుత్‌ అధికారులు నేరుగా గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకు విద్యుత్‌ సరఫరా పరంగా ఉన్న ఇబ్బందులు తెలుసుకోనున్నారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో ప్రజలు వివరించిన ఆయా సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తారు. గ్రామానికి వెళ్లిన సందర్భంగా రెండు ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో ఈ పనులు చేపడతారు. అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టే పనులు చేస్తూ ఖర్చుతో కూడుకొని ఉన్న పనులు, ఉన్నతాధికారులకు నివేదించే పనులు ఏమైనా ఉంటేపై అధికారులకు నివేదించనున్నారు. మొత్తమ్మీద నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. స్థానికంగా ప్రజలు, కాలనీల వాసులు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే వీలుంది. సమస్యల పరిష్కారంతోపాటు విద్యుత్‌ పరంగా ఫిర్యాదులు కూడా తగ్గి నెట్‌వర్క్‌ బలపడి విద్యుత్‌ నష్టాలు తగ్గుతాయని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు.

    సమస్యల పరిష్కారం

    ఏబీ స్విచ్‌, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పొందల తొలగింపు, ఎర్తింగ్‌ లోపాల సవరణ, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందికరంగా మారిన చెట్ల కొమ్మల నరికివేత, లైన్ల మరమ్మతులు, ఇళ్లకు విద్యుత్‌ సరఫరా పరంగా ఉన్న వైర్లలో ఇబ్బందులు ఉంటే సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంబాల వద్ద ఉన్న విద్యుత్‌ డబ్బాలు, ఫీజులు మరమ్మతులు లాంటి సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తారు.

    ఉన్నతాధికారి నుంచి కింది సిబ్బంది వరకు పర్యటన

    ప్రజల నుంచి ఫిర్యాదులూ స్వీకరణ

  • ●ఆలయా

    శివ్వంపేట(నర్సాపూర్‌): ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. సికింద్లాపూర్‌ లక్ష్మీనర్సింహస్వామి, చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి, దొంతి వేణుగోపాలస్వామి, శివ్వంపేట బగలాముఖి శక్తిపీఠం, గూడూర్‌ శ్రీ గురుపీఠంలోని దత్తాత్రేయస్వామి, సాయిబాబా ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దేవతామూర్తులను దర్శించుకొని కార్తీక దీపోత్సవం నిర్వహించి వన భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఆలయాల ఈఓలు శ్రీనివాస్‌, శశిధర్‌, పూజారులు తదితరులు పాల్గొన్నారు.

  • ఇసుక కొరత.. తప్పని వెత

    ఇందిరమ్మ లబ్ధిదారుల ఆందోళన

    ముందుకు సాగని నిర్మాణాలు

    పట్టించుకోని అధికారులు

    నర్సాపూర్‌: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఇసుక కొరత అడ్డంకిగా మారింది. లబ్ధిదారుల నుంచి రవాణ చార్జీలు తీసుకొని ఇసుక సరఫరా చేసేందుకు ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న నర్సాపూర్‌లో శాండ్‌ బజార్‌ను మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించింది. ప్రస్తుతం అధికారుల ముందు చూపు కరువై ఇసుక కొరత ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. నర్సాపూర్‌ డివిజన్‌లోని ఐదు మండలాలకు 2,649 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,689 ఇళ్లు నిర్మించేందుకు సంబంధిత అధికారులు ముగ్గు పోసి మార్కింగ్‌ ఇచ్చారు. మిగిలిన 960 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. మార్కింగ్‌ ఇచ్చిన ఇళ్లలో సైతం 542 మంది నిర్మాణ పనులు ప్రారంభించలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

    ఇప్పటికీ రెండుసార్లు కొరత

    శాండ్‌ బజార్‌లో ఇప్పటివరకు రెండుసార్లు ఇసుక కొరత ఏర్పడటం గమనార్హం. అక్టోబర్‌లో ఒకసారి ఇసుక లేకపోవడంతో సుమారు వారం రోజుల పాటు లబ్ధిదారులు ఎదురుచూడాల్సి వచ్చింది. తాజాగా గత నెల 31 నుంచి (పది రోజులుగా) ఇసుకను తెప్పించడంలో ఆ శాఖ అధికారులు విఫలం అయ్యారు. గత నెలలో వర్షాలు జోరుగా కురవడంతో నిర్మాణాలు సాగలేదని, ప్రస్తుతం వా తావరణం అనుకూలంగా ఉండగా, ఇసుక కరువై పనులు నిలిచిపోతున్నాయని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఇసుక బజార్‌కు స్టాక్‌ ఎప్పుడు వస్తుందని ఇన్‌చార్జి రాకేశ్‌ను వివరణ కోరగా, త్వరలోనే ఇసుక వస్తుందని, రాగానే ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు అందజేస్తామని పేర్కొన్నారు.

  • ఐబీ భవనం అంతేనా?

    శివ్వంపేట(నర్సాపూర్‌): మండల కేంద్రంలోని తూప్రాన్‌– నర్సాపూర్‌ హైవే పక్కన నిరుపయోగంగా ఉన్న ఐబీ భవనం నిరుపయోగంగా ఉంది. ప్రజా అవసరాలకు ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనంపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. భవనాన్ని బస్‌స్టేషన్‌ కోసం వినియోగిస్తే ప్రయాణికుల ఇబ్బ ందులు తీరడంతో పాటు వినియోగంలోకి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Kamareddy

  • బోల్తాపడిన ఆటో: పలువురికి గాయాలు

    తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి శివారులో ఆదివారం ఓ ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామానికి చెందిన 12మంది ఒక శుభకార్యక్రమంలో పాల్గొనడానికి ఆటోలో సంతాయిపేట్‌ నుంచి తాడ్వాయికి బయలుదేరారు. తాడ్వాయి శివారులోకి రాగానే ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి చేయి విరుగగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

  • మక్కలను వదలని  కోతుల దండు

    బాల్కొండ: వనంలో ఉండాల్సిన కోతులకు ఆహరం లభించక జనంలోకి వచ్చి ఆహార ఆన్వేషణ చేస్తూ, కంటికి కనిపించిన పదార్థాలను తింటున్నాయి. ఈక్రమంలో ముప్కాల్‌ మండలం నల్లూర్‌ శివారులో జాతీయ రహదారి 44 పక్కన ఆదివారం ఓ రైతు ఆరబెట్టిన మక్కలను సైతం వానరాలు తిన్నాయి. ఈ చిత్రాన్ని సాక్షి ‘క్లిక్‌’మన్పించింది. ముప్కాల్‌ మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి పండ్లను ఇచ్చే చెట్లు లేకపోవడంతో కోతులు గ్రామంలోకి వస్తున్నాయి. ఆకలి, దప్పికలను తట్టుకోలేక కనిపించిన వస్తువులను తింటూ ఆకలిని తీర్చుకుంటున్నాయి. ఆహరం లభించక కోతులు చేసే చేష్టలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోతుల బెడద నుంచి కాపాడలని ప్రజలు కోరుతున్నారు.

  • క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలి

    జక్రాన్‌పల్లి: క్రీడాపోటీల్లో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులాల జాయింట్‌ సెక్రెటరీ తిరుపతి అన్నారు. మండలంలోని మునిపల్లిలో గల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం అండర్‌ 14, 19 జిల్లా స్థాయి క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో క్రీడాకారులు తమ సత్తా చాటాలన్నారు. డీసీవో శ్రీకర్‌, ఆర్‌సీవో సత్యనాథ్‌, ప్రిన్సిపాల్‌ అనూష, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

  • బాన్సువాడలో గంజాయి స్వాధీనం

    బాన్సువాడ: బాన్సువాడ ఎకై ్సజ్‌ సర్కిల్‌ పరిధిలోని దుర్కి శివారులో గంజాయి అమ్ముతున్న ముగ్గురి అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ దిలీప్‌ తెలిపారు. దుర్కి శివారులో శంభుకుమార్‌, కార్తీక్‌గౌడ్‌, నందు, ఫరూఖ్‌ అనే వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా, పోలీసులకు విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు చేశారు. గంజాయిని విక్రయిస్తున్న నలుగురిని పట్టుకునే ప్రయత్నం చేయగా, ముగ్గురు పోలీసులకు పట్టుబడగా, ఫరూఖ్‌ పరారీ అయ్యారు. వారి నుంచి 225 గ్రాముల ఎండు గంజాయిని, మూడు సెల్‌పోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రావణ్‌, కానిస్టేబుళ్లు శ్రీకాంత్‌, షరుబోద్దీన్‌, రూపేష్‌, స్నేహా, సుదీప్‌, నాగరాజు ఉన్నారని ఆయన అన్నారు.

  • చెరువులో పడి ఒకరి మృతి

    జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్‌ గ్రామంలోగల చెరువులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందాడు. ఎస్సై మహేష్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా..డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి గ్రామానికి చెందిన తీట్ల ప్రభాకర్‌ (50) అనే వ్యక్తి ఆదివారం అర్గుల్‌ చెరువులో గాలం వేసి చేపలు పడుతున్నాడు. ఈక్రమంలో చెరువు నీటిలో గాలం తట్టుకోవడంతో దానిని తీయడానికి నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో కాళ్లకు గడ్డి చుట్టుకోవడంతో బయటకు రాలేక ఊపిరాడక ప్రభాకర్‌ మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి ఎస్సై తన సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

  • జాడలే

    ధర్పల్లి: ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి, వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎప్పుడు వర్షం వ స్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను కాపాడు కునేందుకు టార్పాలిన్లు రైతులకు ఇప్పుడు అత్యవసరం. దీంతో గతంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లను రైతులకు సరఫరా చేసేది. కానీ గత ఏడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం టార్పాలి న్ల పంపిణీని నిలిపివేసింది. మార్కెట్లో టార్పాలిన్ల ధరలు అధికంగా ఉండటంతో కొనలేక టాపర్లను రైతులు అద్దెకు తెచ్చుకుంటూ పంటను కాపాడుకుంటున్నారు.

    2018 వరకు పంపిణీ..

    వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయ శాఖ గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేది. మార్కెట్లో రూ. 2500కు లభించే టార్పాలిన్లను 50 శాతం సబ్సిడీ తో రూ.1250కే ప్రభుత్వం రైతులకు అందించేది. ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే టార్పాలిన్లు నాణ్యతతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉండేవి. ఈవిధంగా 2018 వరకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లను పంపిణీ చేసింది. రైతులు కూడా వాటిని తీసుకోవడానికి పోటీపడేవారు. ప్రతి సారి ఆశించిన మేర టార్పాలిన్లు రాకపోవడంతో ఉన్నంత మేరలో అధికారులు రైతులకు అందించేవారు. కానీ 2018 తర్వాత సబ్సిడీ టార్పాలిన్ల జాడే లేదు. వాటికోసం రైతులు ఏడేళ్లుగా ఎదురుచూపులు చూస్తూనేఉన్నారు.

    ప్రస్తుతం ధాన్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. పంట కోస్తే ధాన్యం ఆరబెట్టడానికి టార్పాలిన్లు లేకపోవడంతో అద్దెకు తీసుకుంటున్నాం. ఒక రైతు సుమారు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు టార్పాలిన్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గతంలో మాదిరిగా టార్పాలిన్లను సబ్సిడీపై అందించాలి.

    –తిరుపతి, రైతు, కార్నల్‌ తండా

    రోజుకు అద్దె రూ.25..

    జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణ శివా రులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పలువురు వ్యక్తులు టార్పాలిన్లను అద్దెకిచ్చి ఉపాధి పొందుతున్నారు.ఒక్క టార్పాలిన్‌కు రోజుకు రూ.15 నుంచి రూ.25 వరకు చెల్లించి అద్దె ప్రతిపాదికన రైతులు తీసుకుంటున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి సాధారణంగా ప్రతి రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం అవుతుండగా, వాటిపై ప్రతిరోజు సుమారు రూ.100నుంచి రూ. 250 వరకు భారం పడుతుంది.ఇలా రోజుల త రబడి టార్పాలిన్లను అద్దైపె తీసుకువస్తే రైతుల పై రూ.వెయ్యికి పైగా ఖర్చవుతోంది. దీంతో టా ర్పాలిన్ల అద్దె భారం మోయలేకపోతున్నట్లు రైతు లు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గతంలో మాదిరిగా టార్పాలిన్లను సబ్సిడీపై అందజేయాలని రైతులు కోరుతున్నారు.

    ఏడేళ్లుగా రైతుల ఎదురుచూపులు

    బహిరంగ మార్కెట్లో

    అధిక ధరలు

    కొనలేక అద్దెకు తెచ్చుకుంటున్న

    అన్నదాతలు

  • ఆత్మీ

    పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు

    ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో

    భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు

    నందిపేట్‌/ఆర్మూర్‌టౌన్‌/బాన్సువాడ/దోమకొండ/లింగంపేట(ఎల్లారెడ్డి): ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆత్మీయంగా పలుకరించుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. నందిపేట మండలంలోని తల్వేద ప్రాథమికోన్నత పాఠశాలలో 1996–97లో 7వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే లింగంపేట మండలంలోని పోతాయిపల్లి ఉన్నత పాఠశాలలో 2006–07 నుంచి 2019–20 వరకు బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థులంతా ఒకే చోట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

  • నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని నాలుగోటౌన్‌ ఎస్‌హెచ్‌వోగా సతీష్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఈ పోలీస్‌ స్టేషన్‌కు ఎస్సైస్థాయి అధికారి కొనసాగారు. స్టేషన్‌ పరిధి ఎక్కువగా ఉండడం, కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఇటీవల దీని పరిధిని ఎస్‌హెచ్‌వోగా విస్తరించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వో స్థాయి అధికారిని నియమించగా, సతీష్‌ బాధ్యతలు స్వీకరించారు.

    బాన్సువాడ రూరల్‌: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా హరితహారం కార్యక్రమంలో భా గంగా నాటిన మొక్కలు ఎదిగి చెట్లుగా మారా యి. కాగా రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగి బాటసారులకు నీడనిస్తున్న చెట్లను కొందరు నిరక్షరాస్యులైన రైతులు నరికి వేస్తున్నారు. పోచారం తండా శివారులో కొన్నేళ్లుగా ఉపాధి హామీలో భాగంగా పెంచిన సుమారు 10 చెట్లను నరికివేశారు. నరికివేతకు గురైన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటడంతో పాటు చెట్లను నరికి వేసిన వారిని గుర్తించి చట్టప్రకారం శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

    సుభాష్‌నగర్‌ : స్వదేశీ, స్వాభిమానము, స్వావలంబనతో కూడిన సమాజ నిర్మాణమే రాష్ట్రీయ స్వ యంసేవక్‌ సంఘ్‌ లక్ష్యమని.. అందుకోసం 100 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందూరు విభాగ్‌ ప్రచారక్‌ నర్రా వెంకట శివకుమార్‌ అన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశంలోని ప్రతి హిందూ గృహానికి వెళ్లి వారి కర్తవ్యా న్ని గుర్తు చేయడమే లక్ష్యంగా రానున్న నెల రోజులపాటు స్వయం సేవకులు పర్యటించనున్నారని తెలిపారు. ఇందూరు నగర పథ సంచలన్‌ కార్యక్రమా న్ని చంద్రశేఖర్‌ కాలనీలోని హెచ్‌పీఎస్‌ పాఠశాల నుంచి ప్రారంభించి కంఠేశ్వర ప్రాంతంలోని వివిధ కాలనీల గుండా కదిలిన వందలాది మంది స్వయం సేవకులు తిరిగి అక్కడికే వచ్చి ప్రార్థనతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ.. దేశ సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పాత్ర ఎంతో కీలకమన్నారు. సమాజ నిర్మాణంలో, సాంస్కతిక విలువల పరిరక్షణలో ఆర్‌ఎస్‌ఎస్‌ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. పథ సంచలన్‌ సందర్భంగా దేశభక్తి గీతాలు, నినాదాలతో నగరం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. జిల్లా సంఘచాలకులు డాక్టర్‌ కాపర్తి గురు చరణం, విభాగ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్‌ నగర కార్యవాహ అరుగుల సత్యం, సహకార్యవాహలు సుమిత్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

  • క్రీడల్లో ఉన్నతస్థాయికి ఎదగాలి

    నిజామాబాద్‌నాగారం: క్రీడాకారులు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా మైనారిటీ సంక్షేమాధికా రి కృష్ణవేణి అన్నారు. నగరంలోని నాగారంలోని రా జారాం స్టేడియంలో ఖైసర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న టోర్నమెంట్‌ ఆదివారం ముగిసింది. ఈ కారక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ మొదటి విద్యా శాఖమంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జన్మదినం పురస్కరించుకుని, మైనారిటీ ఎడ్యుకేషన్‌ డే సందర్బంగా అథ్లెటిక్‌ టోర్నమెంట్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం స్పోర్ట్స్‌ అకాడమీ చైర్మన్‌ సయ్యద్‌ ఖైసర్‌ మాట్లాడుతూ... ప్రతి ఏడాది ఈటోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అండర్‌–12, 16, 19 విభాగాల నుంచి బాలబాలికలకు పోటీలు జరిగాయి. 80మీటర్లు, 100మీ,150మీ, 200మీ, 300మీ, 400మీ, 600మీ, 800 మీటర్లలో పోటీల్లో పాల్గొన్న విన్నర్‌, రన్నర్‌లకు మెడల్స్‌ సర్టిఫికెట్లు, టీషర్టులు అందజేశారు. పోటీల్లో ఓవరల్‌ చాంపియన్‌గా నిలిచిన నాగారంమైనారిటీ బాలుర గురుకుల పాఠశాల క్రీడాకారుల కు క్యాష్‌అవార్డుతో పాటు మెడల్స్‌, సర్టిఫికెట్లు అందజేశారు. బాలికల్లో చాంపియన్‌గా నిలిచిన మైనారి టీ బాలికల–4 జట్టుకు సైతం అందజేశారు. గురుద్వార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సోరన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షులు రేవతి, కరాటే రమేష్‌, సర్దార్‌ నరేందర్‌ సింగ్‌, షేక్‌ హుస్సేన్‌, ఉషు రాష్ట్ర కార్యదర్శి ఉమర్‌, నాయకులు ప్రవీణ్‌ పాల్గొన్నారు.

  • పొలాన్ని ప్లాట్‌గా మార్చుకోవచ్చు
    మీకు తెలుసా..

    రామారెడ్డి: సాధారణంగా సాగు చేయని లేదా బంజరు భూమి మాత్రమే మార్పిడికి అనుకూలంగా ఉంటుంది. సారవంతమైన వ్యవసాయ భూమి మార్పిడికి కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉండదు. లేదా నిబంధనలు కఠినంగా ఉంటాయి. కొన్ని నిబంధనలతో వ్యవసాయ భూమిని ప్లాట్‌గా మార్చుకోవచ్చు.

    ● నివాస (రెసిడెన్షియల్‌) లేదా వాణిజ్య (కమర్షియల్‌) ప్రయోజనాల కోసం సదరు భూమిని ఉపయోగించాలంటే, ముందుగా దానిని ప్రభుత్వ అనుమతితో వ్యవసాయేతర భూమి (నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ )గా మార్చాలి. ఇందుకోసం చేయవల్సినవి ఇలా..

    ● నాలా చట్టం ప్రకారం వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా వినియోగ మార్పిడి (కన్వెన్షన్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ టు నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ నాలా) ప్రక్రియను పూర్తి చేయాలి.

    ● మొదట దరఖాస్తును స్థానిక రెవెన్యూ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో (మీసేవ లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ ద్వారా) చేసుకోవాలి.

    ● కావాల్సిన పత్రాలు: భూమి టైటిల్‌ డీడ్‌ కాపీ, పట్టాదార్‌ పాస్‌ పుస్తకం కాపీ

    ● భూమి ప్రాథమిక విలువ ధ్రువీకరణ పత్రం

    ● దరఖాస్తుదారుడి గుర్తింపు పత్రాలు (ఆధార్‌, ఇతర పత్రాలు మొదలైనవి) అవసరం.

    ● వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూ మిగా మార్చినందుకు ప్రభుత్వానికి నిర్దిష్ట మొ త్తంలో నాలా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

    ● లేఅవుట్‌ అనుమతి లేఅవుట్‌ అప్రూవల్‌ నా లా మార్పిడి పూర్తయిన తర్వాత, మీరు ఆ భూ మిని చిన్న ప్లాట్లుగా విభజించడానికి రోడ్లు, డ్రె యినేజీ వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి లే–అవుట్‌ అనుమతి పొందాలి.

    ● రాష్ట్రంలో హెచ్‌ఎండీఏ/డీటీసీపీ సంస్థలు ఈ అనుమతులను ఇస్తాయి.

    ● ప్రాజెక్ట్‌ రిజిస్ట్రేషన్‌ (రేరా): రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లయితే, ప్రాజెక్ట్‌ను తప్పనిసరిగా రేరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులారిటీ అథారిటీ )లో నమోదు చేయాల్సి ఉంటుంది

  • రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

    రుద్రూర్‌: మండల కేంద్రంలో శనివారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. అలాగే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు వివరించారు.

    ఆగని ఇసుక అక్రమ రవాణా

    పోతంగల్‌ మండలంలోని మంజీరా నది నుంచి ని త్యం ఇసుక అక్రమ రవాణ కొనసాగుతూనే ఉంది. అక్రమార్కులు ఇసుక రీచ్‌ల నుంచి విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిపి పట్టణ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కోటగిరి, పోతంగల్‌, రుద్రూర్‌ మండలాల్లో రహస్య ప్రాంతాల్లో డంప్‌ చేసి నిబంధనలకు విరుద్దంగా రాత్రివేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పత్రికల్లో వార్తలు వచ్చినపుడు మాత్రమే ఒకటి, రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

    ఎల్లారెడ్డి: మండలంలోని బ్రాహ్మణపల్లి పరిసరప్రాంతంలోగల పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.12,510 నగదుతోపాటు నాలుగు ఫోన్లు, మూడు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

    వృద్ధురాలి అదృశ్యం

    మోపాల్‌: మోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముదక్‌పల్లి గ్రామానికి చెందిన కంజర్ల రాజవ్వ ఈనెల 6 నుంచి కనిపించడం లేదని ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. గురువారం మధ్యాహ్నం రాజవ్వ చందూరు గ్రామంలోని తన చిన్న కుమార్తె ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లింది. ఇప్పటికీ ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుమారుడు కంజర్ల భూమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఆదివారం తెలిపారు. రాజవ్వ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్‌ స్టేషన్‌కి లేదా మోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.

  • తప్పిపోయిన వ్యక్తి అప్పగింత

    కామారెడ్డి క్రైం: లింగంపేట మండలం సూరాయిపల్లి గ్రామానికి చెందిన పాకాల పెంటయ్యకు కొంతకాలంగా మతిస్థిమితం సక్రమంగా ఉండటం లేదు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆయన ఆచూకీ కోసం సామాజిక మా ధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ఆదివారం పెంటయ్య కామారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఎదుట కూర్చుని ఉండటాన్ని గమనించిన అవుట్‌పోస్ట్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణ్‌ అనుమానం వచ్చి ఆరా తీశారు. విషయం తెలుసుకుని అతని కుటుంబ స భ్యులకు సమాచారం ఇచ్చారు. వారు రాగానే పెంటయ్యను అప్పగించారు. పెంటయ్య కుటుంబ స భ్యులు హెడ్‌ కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

  • వ్యవసాయ వ్యర్థాలతో భూసారం!

    పెర్కిట్‌(ఆర్మూర్‌): పొలంలోని వ్యవసాయ వ్య ర్థాలను తగులబెట్టడం వల్ల భూసారం కోల్పో యి దిగుబడులు తగ్గుతాయి. కానీ చాలామంది రైతులు పంట చేతికొచ్చిన తర్వాత వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టి తర్వాత సాగుకు సిద్ధమవుతున్నారు. ఇలా వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా వాతావరణ కాలుష్యంతో పాటు భూమి వేడెక్కి భూసారం దెబ్బతింటుంది. అలాకాకుండా వ్యవసాయ వ్యర్థాలను దమ్ముచేయడంతో భూసారాన్ని పెంచుకోవచ్చని ఆర్మూర్‌ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు నలిమెల చిన్నారెడ్డి తెలియజేస్తున్నారు. పొలం కోసిన తర్వాత కొంత నీరు పెట్టి ఎకరాకు రెండు 50 కేజీల సూపర్‌ పాస్పేట్‌ మందును చల్లి దమ్ము చేసుకోవడం వల్ల వ్యర్థాలు భూమిలో కలిసి పోతాయి. నెల రోజుల పాటు అలాగే ఆరబెట్టిన అనంతరం చిన్న నాగలితో దున్నుకుని భూమిని మరో పంటకు సిద్దం చేసుకోవచ్చు. పంట నిడివి కాలం తక్కువగా ఉంటే పొలంలో నీటిని అలాగే ఉంచడం వల్ల వ్యర్థాలు కుళ్లిపోయి భూమిలో కలిసి పోతాయి. ఇలా వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియబెట్టడం వల్ల భూసారం పెరుగుతుంది. అలాగే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.

Kurnool

  •   రూ.1.54 లక్షలు రావాల్సి ఉంది

    నేను నాలుగు ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టా. సెప్టెంబరు 8న కర్నూలు మార్కెట్‌కు ఉల్లిని తీసుకెళ్తే ఒక లాట్‌ క్వింటాలు ధర రూ,359, మరో లాట్‌ క్వింటాలుకు రూ.409 ధరతో వ్యాపారులు కొన్నారు. మద్దతు ధర రూ.1200 ఉండగా.. వ్యాపారులు కొన్న ధరను మినహాయించి బ్యాలెన్స్‌ అమౌంటు నేరుగా బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని అధికారులు చెప్పారు. మాకు మద్దతు కింద రూ.1.54 లక్షల వరకు రావాల్సి ఉంది. రెండు నెలలు గడచినప్పటికీ బ్యాలెన్స్‌ మొత్తం బ్యాంకు ఖాతా జమ కాలేదు. – చిన్నమద్దిలేటి, ఈర్లదిన్నె, సి.బెళగల్‌ మండలం

  •   రెండు నెలలైనా డబ్బు జమ కాలేదు

    ఆరు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో 4.50 ఎకరాల్లోని ఉల్లి పంటను దున్నేశాం. మిగిలిన ఎకరన్నర భూమిలో పండిన 72 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను గత సెప్టెంబర్‌ 8న కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అమ్మకానికి తీసుకెళ్లాం. వ్యాపారులు క్వింటా రూ.198 ప్రకారం కొన్నారు. మద్దతు ధర రూ.1,200 కాగా.. వ్యత్యాసం రూ.1,002 ప్రకారం రూ.72,144 బ్యాంకు ఖాతాకు 10 రోజుల్లో విడుదలవుతాయని చెప్పారు. ఇప్పటికి రెండు నెలలవుతున్నా ఆ ఊసే లేదు. రైతులను మోసం చేయడం సరికాదు. – బి.రామలింగడు, లింగందిన్నె, గోనెగండ్ల మండలం

  • మంత్ర

    మంత్రాలయం రూరల్‌: శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంత్రాలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. కల్పతరు క్యూలైన్‌ దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీ మఠం మధ్వ కారిడార్‌ వేలాదిమంది భక్తులతో కిక్కిరిసి కనిపించింది.

    నేటి నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు

    కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో ఎస్‌ఏ–1 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు 6,7 తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఎస్‌సీఈఆర్‌టీ జిల్లా సాధారణ పరీక్షల విభాగానికి పంపించారు. అక్కడి నుంచి హైస్కూల్‌ విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఎంఈఓ ఆఫీస్‌కు పంపుతారు. ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్ల విద్యార్థులకు ఆయా క్లస్టర్‌ స్కూళ్ల నుంచి ప్రశ్నపత్రాలను తీసుకపోవాల్సి ఉంటుంది.

    ఈజీ మనీ కోసం ఆశపడొద్దు

    ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

    కర్నూలు (టౌన్‌): ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈజీ మనీ కోసం ఆశపడితే బ్యాంక్‌ ఖాతా ఖాళీ అవుతుందని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగామ్‌, టెలిగ్రామ్‌లో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. రూ. లక్ష పెడితే రూ. కోట్లు వస్తాయంటే కచ్చితంగా మోసమే అని తెలిపారు. ఎపీకే ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ చేయవద్దని, అలాగే అపరిచిత లింక్స్‌ క్లిక్‌ చేయవద్దని పేర్కొన్నారు.

    నేడు డయల్‌ యువర్‌ ‘సీఎండీ’

    కర్నూలు (టౌన్‌): విద్యుత్‌ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈనెల 10 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివశంకర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 సెల్‌ నంబర్‌ను ఫోన్‌ చేసి విద్యుత్‌ సమస్యలు తెలియజేయాలని తెలిపారు. అలాగే వినియోగదారులు విద్యుత్‌ శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు, 1800425 155333కు కాల్‌ చేయవచ్చని పేర్కొన్నారు. వాట్సప్‌ నంబర్‌ 9133331912కు చాట్‌ చేసి విద్యుత్‌ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

  • ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం

    12న కర్నూలులో ప్రజా ఉద్యమ ర్యాలీ

    వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

    ఎస్వీ మోహన్‌ రెడ్డి

    కర్నూలు (టౌన్‌): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజల పక్షాన వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న కర్నూలు నగరంలో నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్లను ఆదివారం సాయంత్రం గిప్సన్‌ కాలనీలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయకూడదంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. కర్నూలులో నగరంలో పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడతున్నట్లు చెప్పారు. ఆర్‌డీవో కార్యాలయంలో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ప్రజలు, మహిళలు, విద్యార్థినీ, విధ్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో తమకు అనుకూలమైన టీడీపీ నాయకులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నారు. ప్రజాభీష్టం మేరకు పాలకులు పనిచేయాలని, అందుకు విరుద్ధంగా చేస్తే ప్రజలు సహించబోరన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి, కార్పొరేటర్‌ వి. అరుణ, నాయకులు షరీఫ్‌, కిషన్‌, పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి, కంటూ, రామాంజనేయులు , లాజరస్‌ తదితరులు పాల్గొన్నారు.

  • కూటమి పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయం

    ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

    ఆలూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి పేదలకు అన్యాయం చేస్తోందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు కష్టాలతో జీవనం సాగించేలా పాలన సాగుతోందని ఆరోపించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా, తన అనుచరులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వ వైద్యకళాశాలను ప్రైవేట్‌ పరం చేస్తూ సీఎం చంద్రబాబు పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న ఆలూరులో నిర్వహించే ర్యాలీకి సంబంధించి వాల్‌పోస్టర్లును ఆదివారం ఆలూరులోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహ ఆవరణలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందేలా తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 17 మెడికల్‌ కాలేజీలు సాధించి, అందులో ఐదు పూర్తి చేశారన్నారు. మిగిలిన వాటిని పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గం అన్నారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేసినా ప్రభుత్వంలో కనీసం స్పందనలేదన్నారు. ప్రభుత్వమే మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసి, పేద విద్యార్థులకు మెడికల్‌ సీట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు తాము, తమ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గిరి, బీసీసెల్‌ కార్యదర్శులు శ్రీనివాసులు, భాస్కర్‌, వీరేషప్ప, ఈరన్న, మార్కెట్‌ యార్డు మాజీ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎంపీపీలు దేవరాజ్‌, బాషా, బోయ ఎల్లమ్మ, మోతి ఎల్లమ్మ, నాగమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కిశోర్‌, ఎస్‌సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

  • పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

    కర్నూలు(అగ్రికల్చర్‌): క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. నవంబరు మొదటి పక్షంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగైదు రోజులుగా రాత్రి 8 గంటల నుంచే చలి ప్రభావం మొదలై తెల్లవారుజాముకు తీవ్రత పెరుగుతోంది. పొగమంచు కూడా జిల్లాను ఆవరిస్తోంది. ఈ సారి చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టు నుంచి వరుసగా అధిక వర్షాలు కురుస్తుండటంతో జలాశయాలు, వాగులు, వంకలు, కాలువలు నీటితో నిండి ఉన్నాయి. గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఈ ప్రభావంతో పగటిపూట ఎండతో పొడి వాతావరణం ఉంటున్నప్పటికీ రాత్రి చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 21 డిగ్రీల వరకు ఉంటున్నా..పలు ప్రాంతాల్లో 18 నుంచి 19 డిగ్రీల వరకు పడిపోయాయి. వెల్దుర్తి, కోసిగి, మంత్రాలయం, బండిత్మకూరు, అవుకు, వెలుగోడు తదితర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల వరకే నమోదు అవుతున్నాయి. ఈ సారి రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలోపునకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ద్రోణి కారణంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. పగలు ఎండ, రాత్రి చలి. మరోవైపు వానలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వాతావరణంలో వచ్చిన మార్పులతో కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. అలర్జీ, అస్తమా, డెంగీ, విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

  • పేదలందరికీ ఉచిత న్యాయ సహాయం

    శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌

    వెంకట హరినాథ్‌

    కర్నూలు(సెంట్రల్‌): సమాజంలో ఆర్థింగా వెనుకబడిన ప్రతి ఒక్కరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌ తెలిపారు. ఆదివారం జిల్లా కోర్టులోని న్యాయ సదన్‌లో జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..1987లో రూపొందించిన లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్ట్‌ను 1995 నవంబర్‌ 9వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39ఏ ప్రకారం ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలన్నారు. లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరామ్‌ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌కౌన్సిల్‌ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ శారద మాట్లాడుతూ..మహిళా శిశు సంక్షేమ శాఖ, లీగల్‌ సర్వీసెస్‌ సంయుక్తంగా మహిళలు, పిల్లలకు, ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కర్నూలు మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ అనురాధ, ప్యానెల్‌ లాయర్లు, న్యాయ విద్యార్థులు, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

  • వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతానికి కృషి

    ఎమ్మిగనూరుటౌన్‌: కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్తగా తనను నియమించినందున బాధ్యత పెరిగిందని, వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని మాజీ ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఎమ్మిగనూరులో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తనపై జగనన్నకు మంచి నమ్మకం ఉందని, పార్టీలో ఉన్న వారంతా కుటుంబసభ్యులమేనన్నారు. కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్తగా నియమించినందున జిల్లా కేంద్రంలో ఒక కార్యాలయం ఉంటుందని, అదేవిధంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మిగనూరులో ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని అలానే కొనసాగించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో బుట్టాఫౌండేషన్‌ అధినేత బుట్టాశివనీలకంఠ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • విద్యార్థులతో మాట్లాడి.. కూరగాయలు పరిశీలించి!

    మద్దికెరలో కలియతిరిగిన ట్రైనీ కలెక్టర్లు

    మద్దికెర: మండలకేంద్రమైన మద్దికెరకు ఆదివారం ట్రైనీ ఐఏఎస్‌ కలెక్టర్లు అంకిత్‌ రాజుపుత్‌, మోహిత్‌ మంగల్‌, భరత్‌ దత్‌ తివారి, తన్మయి మెగ్వాల్‌, అమర్‌ బాగిల్‌, అతుల్‌సోని వచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా విద్యాలయానికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ప్రధాన కూడలిలో ఉన్న కూరగాయల మార్కెట్‌ను పరిశీలించి ధరల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి, గ్రామంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి.. తదితర వివరాలు తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీపీ అనిత, సర్పంచ్‌ సుహాసిని, తహసీల్దార్‌ గుండాలనాయక్‌, ఎంపీడీఓ కొండయ్య, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ మయాంక్‌, ఎంఈఓ రంగస్వామి, ఏఓ రవి, ఏపీఓ నర్సిరెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ త్రివేణి ఉన్నారు.

  • బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

    కర్నూలు (టౌన్‌): బీటెక్‌ విద్యార్థి కుమ్మరి భరత్‌ కుమార్‌ (20) ఉరివేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కల్లూరు విఠల్‌ నగర్‌కు చెందిన ఈ విద్యార్థి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఐదో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. తండ్రి కుమ్మరి శ్రీరాములు మెడికల్‌ ఏజెన్సీకి, తల్లి మాధవి పనిమీద ఆదివారం బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమ్మరి భరత్‌ బెడ్‌రూమ్‌లో ఉన్న సిలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. ఇంటికి వచ్చి తల్లి ఉరి వేసుకున్న కుమారుడిని చూసి బోరున విలపిస్తూ భర్త శ్రీరాములుకు ఫోన్‌ ద్వారా తెలియజేసింది. వెంటనే ఇంటికి వచ్చిన తండ్రి కుమారుడిని ఉరి నుంచి తప్పించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. తమ కుమారుడు చనిపోవడానికి ఎవరూ కారణం కాదని తల్లిదండ్రులు తెలిపారు.

  • ఆనందం

    కుల సంఘాల ఆధ్వర్యంలో

    వన భోజనాలు

    ఆటపాటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో

    పాల్గొన్న ప్రజలు

    గంగపుత్రుల వన భోజన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న ఎస్వీ మోహన్‌రెడ్డి

    కాటసాని రాంభూపాల్‌రెడ్డిని సన్మానించిన దృశ్యం

    కర్నూలు కల్చరల్‌: కార్తీక వన భోజన కార్యక్రమాలు ఆదివారం ఆనందంగా, ఆధ్యాత్మికంగా సాగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పలు కుల సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వనసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. తులసి చెట్టు, ఉసిరి చెట్టుకు పూజలు, గోమాత పూజలను భక్తి శ్రద్ధలతో చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, మహిళలకు ఆటల పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కళాకారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. కుల ప్రముఖుల సందేశాలిచ్చారు. ఆయా రంగాల్లో ప్రతిభావంతులకు అభినందనలు తెలుపుతూ సత్కారాలు చేశారు.

    ● కర్నూలు రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్‌లో రెడ్ల కార్తీక మాస వన భోజన మహోత్సవం జరిగింది. వేలాది మంది కుల సంఘీయులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు పుల్లకుర్తి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. దాతల సహకారంతో రెండు వృద్ధాశ్రమాలు, పేద రెడ్డి విద్యార్థులకు విద్యానిధి ద్వారా విద్యాభ్యాసానికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడారు. సిని కళాకారుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌ శివారెడ్డి తన మిమిక్రీతో సందడి చేశారు. సంఘం అధ్యక్షులు ప్రభాకర రెడ్డి, ఉపాధ్యక్షులు దొనపాటి ఎల్లారెడ్డి, దామోదర్‌ రెడ్డి, విక్రమ్‌ సింహారెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి, జి.పుల్లారెడ్డి ట్రస్ట్‌ సభ్యులు రాఘవ రెడ్డి, ఏకాంబర్‌ రెడ్డి, సుబ్బారెడ్డి, కేజే రెడ్డి కేవీ సుబ్బారెడ్డి, సరేష్‌ రెడ్డి, హనుమంత రెడ్డి, చంద్రమోహన్‌ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • కొత్త

    పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సినీ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి పూజలు చేశారు. అతనొక్కడే, అశోక్‌, అతిథి, కిక్‌, ఊసరవెల్లి, రేసుగుర్రం, ధ్రువ, సైరా వంటి చిత్రాలకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. పలువురు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు.

    పాల కోసం వస్తూ..

    మహానంది: జీవనోపాధి నిమిత్తం వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన గాజులపల్లె రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని అఫదిమడూరి గ్రామానికి చెందిన పవన్‌(26) గాజులపల్లె రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న నవగ్రహాల ఆలయంలో పనిచేస్తున్నాడు. ఆలయానికి దగ్గరలోని ఎంసీఫారం వద్ద ఆదివారం ఉదయం పాలు తెచ్చేందుకు బైక్‌పై వెళ్తుండగా బుక్కాపురం గ్రామానికి చెందిన షేక్‌ జమాల్‌ బాషా బొలొరో ఢీకొంది. ఈ ఘటనలో పవన్‌ తీవ్రంగా గాయపడటంతో కోలుకోలేక మృతి చెందాడు. మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    మహిళ అదృశ్యం

    కోడుమూరు రూరల్‌: కొత్తూరు గ్రామానికి చెందిన 33 సంవత్సరాల వితంతువు మల్లెపూలు లక్ష్మి కన్పించకుండా పోయినట్లు ఆమె తల్లి బైరిపోగు తిరుపాలమ్మ కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. మల్లెపూలు లక్ష్మీ అనే మహిళకు 11 ఏళ్ల కిందట భర్త చనిపోవడంతో కొత్తూరు గ్రామాన్ని వదిలి పుట్టినిల్లైన గూడూరు మండలం మునుగాల గ్రామానికి వెళ్లిపోయింది. అయితే ఆరు నెలల కిందట లక్ష్మి తిరిగి కొత్తూరు చేరుకుని అక్కడే కుమారిడితో పాటు నివాసముంటోంది. ఈ నేపథ్యంలో గత శనివారం కోడుమూరుకు సంతకు వచ్చిన లక్ష్మి తిరిగి ఇంటికి పోలేదు. అయితే కోడుమూరులోని కొత్తబస్టాండ్‌ పిండి గిర్ని వద్ద నుంచి ఆడబిడ్డ భర్తకు ఫోన్‌చేసి తనను ఇద్దరు వ్యక్తులు వెంటాడుతున్నారని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసింది. విషయం తెలుసుకున్న లక్ష్మి తల్లి బైరిపోగు తిరుపాలమ్మ తన కుమార్తె కన్పించకుండా పోయిన విషయాన్ని ఆదివారం కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

    మూడో అంతస్తు పై నుంచి పడి యువకుడు మృతి

    కర్నూలు: నగర శివారు నంద్యాల చెక్‌పోస్ట్‌ కేంద్రీయ విద్యాలయంకు ఎదురుగా ఉన్న ధనలక్ష్మి నగర్‌లో ఇంటి నిర్మాణం పనులు చేస్తూ కె.కిరణ్‌ (24) ప్రమాదవశాత్త్తూ కింద పడి మృతి చెందాడు. కర్నూలు మండలం పడిదంపాడు గ్రామానికి చెందిన బక్కన్నకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. బక్కన్న.. ధనలక్ష్మి నగర్‌లో శ్రీనివాసులు ఇంటి నిర్మాణం వద్ద వాచ్‌ మెన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి వెళ్లా డు. ఇంటి నిర్మాణానికి సంబంధించి క్యూరింగ్‌ కోసం నీళ్లు కొట్టేందుకు కుమారుడు కిరణ్‌కు చెప్పి ఊరికి వెళ్లాడు. మూడో అంతస్తులో నీళ్లు కొడుతుండగా పైపు కాలికి తగులుకొని అదుపు తప్పి పై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి బక్కన్న ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.

  • సమస్య

    ఎల్‌పీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌

    సుభాష్‌ చంద్రబోస్‌

    కర్నూలు(అర్బన్‌): సమస్యలపై ప్రజల గొంతుకగా న్యాయవాదుల ప్రజాకూటమి ప్రశ్నిస్తుందని ఎల్‌పీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. న్యాయవాదుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. నూతనంగా లాయర్స్‌, పబ్లిక్‌ ఫ్రంట్‌(ఎల్‌పీఎఫ్‌) న్యాయవాదుల ప్రజా కూటమి ఆవిర్భవించింది. ప్రతిష్టాత్మకంగా వెలసిన న్యాయవాదుల ఎల్‌పీఎఫ్‌కి రాష్ట్ర కన్వీనర్‌గా మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులు కూడా నియమితులయ్యారు. ఆదివారం కర్నూలు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, కర్నూలు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మిదేవి, దేవపాల్‌, సుబ్బయ్య, ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాదులు రవీందర్‌చౌదరిలతో పాటు పెద్ద ఎత్తున న్యాయవాదులు హాజరై ఏకగ్రీవంగా లాయర్స్‌, పబ్లిక్‌ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టారు.

    చట్టాలపై అవగాహన కల్పిస్తాం

    సామాన్య ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించే కార్యాక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతామని ఎల్‌పీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌పీఎఫ్‌ పని చేస్తుందని, ఎవ్వరికి అన్యాయం జరిగినా పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రి మారెప్ప మట్లాడుతూ.. ప్రజా ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వారు ప్రజాసమస్యలు పట్టించుకోకుండా రూ.కోట్లు కూడబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న లోపాలను సవరించేందుకు ఎల్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కర్నూలు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మిదేవి, పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. న్యాయవాదుల ప్రజా కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. న్యాయవాదులు గాలిరాజు, గౌతంశేఖర్‌, ఉపేంద్ర, సువర్ణకుమారి, సుమలత, జ్యోతి లావణ్య, శ్రావణ్‌కుమార్‌, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

    లాయర్స్‌, పబ్లిక్‌ ఫ్రంట్‌ కమిటీలో

    సభ్యులు..

    ఎల్‌పీఎఫ్‌ రాష్ట్ర కో–కన్వీనర్‌గా ముప్పసాని గాలిరాజు, కర్నూలు జిల్లా కన్వీనర్‌గా గౌతంశేఖర్‌, కో–కన్వీనర్‌లుగా న్యాయవాదులు కె.సుమతల, డి.లావణ్య, జీఎన్‌జ్యోతి, వై.ఉపేంద్ర, ఎం.శ్రావణ్‌కుమార్‌, మహేంద్రరెడ్డి, వినోద్‌కుమార్‌ ఎన్నికయ్యారు.

Vikarabad

  • 26 కిలోల గంజాయి పట్టివేత

    అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలో ఆదివారం ఎకై ్సజ్‌ పోలీసులు 26 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతంలో గంజాయి రవాణా జరుగుతుందని సమాచారం వచ్చింది. విశాఖపట్నం నుంచి వచ్చే రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్నారని ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం స్టేషన్‌ సమీపంలోని అనుమానంగా ఉన్న మూడు బ్యాగులను గుర్తించారు. వాటిని విచారించగా ఎవరు కూడా తమదని ముందుకు రాలేదు. దీంతో బ్యాగులను తెరిచి చూడగా బ్రౌన్‌ కలర్‌ టేప్‌తో చుట్టబడిన పాకెట్స్‌ ఉన్నాయి. వాటిలో ఎండు గంజాయి ఉంది. వాటిని లెక్కించగా 13 ప్యాకెట్‌లలో 26 కిలోల ఎండు గంజాయి ఉంది. స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది విష్ణువర్ధన్‌రెడ్డి, రవికిరణ్‌, శివప్రసాద్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • లారీ ఢీ.. నేలకూలిన విద్యుత్‌ స్తంభం

    మంచాల: లారీ ఢీకొట్టడంతో విద్యుత్‌ స్తంభం నేలకూలింది. ఈ సంఘటన మండల పరిధి ఆరుట్ల ఎస్సీ కాలనీ ఎలమ్మగుడి కూడలిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం రాఘవేంద్ర ఫర్టిలైజర్‌ దుకాణ యాజమాన్యానికి చెందిన లారీ(టీఎస్‌ 29టీఏ 0896) గ్రామంలో సిమెంట్‌ బస్తాలు అన్‌లోడ్‌ చేసింది. అనంతరం తిరుగు ప్రయాణంలో కూడలిలో కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టగా.. అది కూలిపోయింది. గమనించిన స్థానికులు విద్యుత్‌ సరఫరాను నిలిపి వేశారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. ఎవరికీ ఏమీ కాలేదు. ఘటనకు లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని, ప్రమాదం అనంతరం వాహనంతో పరారయ్యాడని కాలనీ వాసులు తెలిపారు. అధికారులు స్పందించి, డ్రైవర్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

  • అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

    పూడూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కంకల్‌ గ్రామానికి చెందిన ఉవగుంట కృష్ణ(36) పరిగిలో ఫుడ్‌ డెలవరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆయన శనివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఫోన్‌ చేసినా స్పందన లేదు. తెలిసిన వారికి వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదని లభ్యం కాలేదు. ఈ క్రమంలో ఆదివారం మన్నెగూడ–చన్గోముల్‌కు వెళ్లే రోడ్డు సమీపంలో అనుమానాస్ప స్థితిలో ఓ మృతదేహం కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పరిశీలించి మృతుడు కృష్ణగా గుర్తించారు. మృతుడి ఒంటిపై బలమైన గాయాలు కన్పిస్తుండటంతో హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు మృతుడి భార్య లలిత ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  • వేతనా

    క్షేత్రస్థాయిలో పశువులకు

    ప్రథమ చికిత్స చేస్తున్న గోపాలమిత్రలు

    ఎనిమిది నెలలుగా జీతాలు అందని వైనం

    కొడంగల్‌ రూరల్‌: పశు సంపద రక్షణలో కీలకపాత్ర పోషించే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గోపాలమిత్రలు కోరుతున్నారు. గౌరవ వేతనంతో సేవలందిస్తుండగా ఎనిమిది నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే వేతనం రాకపోవడంతో అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని పేర్కొంటున్నారు.

    పోషకులకు చేయూత

    2000 సంవత్సరంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డిస్ట్రిక్ట్‌ లైవ్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజన్సీ(డీఎల్డీ) ద్వారా గోపాలమిత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాలమిత్రలు పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంతోపాటు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి పశువులకు కృత్రిమ గర్భధారణ టీకాలు, నట్టల నివారణ మందులు వేయడం, గర్భకోశ వ్యాధులు, జబ్బువాపు, గొంతువాపు నివారణకు హెచ్‌ఎస్‌ టీకాలు వేయడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన, విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తారు.

    గోపాల మిత్రలకు టార్గెట్‌

    గోపాలమిత్ర సిబ్బంది నెలకు 60 నుంచి 80 పశువులకు కృత్రిమ గర్భధారణ(సెమన్‌) చేయాలి. దీనికి రూ.40 చొప్పున రైతుల నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి. ప్రతి నెలా నిర్దేశించిన లక్ష్యాన్ని గోపాలమిత్రలు పూర్తి చేయాలి. లేదంటే నెల జీతంలో కోత తప్పదని వాపోతున్నారు.

    ఆర్థిక ఇబ్బందులు

    గ్రామీణ ప్రాంత పశు సంపద, పాడి అభివృద్ధికి రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖలో 1530 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నామని, క్షేత్రస్థాయిలో రైతులు తమను సంప్రదించిన వెంటనే పశువులకు ప్రథమ చికిత్స చేయిస్తారని పేర్కొంటున్నారు. వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ వేతనాలను విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2018లో రూ.3,500 నుంచి రూ.8,500 వరకు వేతనాలు పెరిగాయని, 2022 అక్టోబర్‌లో రూ.11,050లకు పెంచారని పేర్కొంటున్నారు. అయితే గత ఎనిమిది నెలలుగా వేతనాలు లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం లేకుండాపోతుందని వాపోతున్నారు.

    ఉద్యోగ భద్రత కల్పించాలి

    గ్రామీణ ప్రాంత పశు సంపద, పాడి అభివృద్ధికి పనిచేస్తున్నాం. పశు సంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న ఓఎస్‌(అటెండర్‌) పోస్టులకు సీనియర్‌ గోపాలమిత్రలకు అవకాశం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలను కల్పించాలి.

    – రవీందర్‌, గోపాలమిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

  • విరిగ

    యాలాల: ఆర్టీసీ అద్దె బస్సు స్టీరింగ్‌ రాడ్డు విరడగంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్‌ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. తాండూరు–మహబూబ్‌నగర్‌లో ప్రతి రోజు సర్వీసులు నడిచే ఆర్టీసీ అద్దె బస్సు సుమారు 15 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యలో లక్ష్మీనారాయణపూర్‌ వద్దకు రాగానే స్టీరింగ్‌ రాడ్డు విరగడంతో డ్రైవర్‌ బస్సును రోడ్డుపైనే నిలిపివేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

    అదుపుతప్పి

    డివైడర్‌ ఎక్కిన కారు

    తాండూరు రూరల్‌: ఆటోను తప్పించబోయి ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో పెద్దేముల్‌ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మారేపల్లి రోడ్డు నుంచి తాండూరుకు ఓ కారు వస్తోంది. పెద్దేముల్‌ మండల కేంద్రంలోని బీసీ కాలనీ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారు అదుపు తప్పి డివైడర్‌ పైకి ఎక్కింది. కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు.

    నచ్చిన పార్టీకి

    స్వేచ్ఛగా ఓటేయాలి

    పంజగుట్ట: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, క్రైస్తవులు తమకు నచ్చిన పార్టీకి స్వేచ్ఛగా ఓటేయాలని క్రిస్టియన్‌ పొలిటికల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కన్వీనర్‌ జెరూషలేము మత్తయ్య పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీజేపీ హిందూ ఓటర్లను, కాంగ్రెస్‌ పార్టీ ముస్లిం ఓటర్లను మతపరంగా ప్రభావితం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆదివారంసోమా జిగూడలోని ఫ్రంట్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో ఉన్న సుమారు 80 వేల మంది దళిత క్రైస్తవులు, బీసీ, ఓసీ, మైనార్టీ కన్వర్టెడ్‌, క్యాథలిక్‌ క్రిస్టియన్‌ ఓటర్లు రాజకీయ పార్టీల విధానాలను, ఇస్తున్న హామీలను, సంక్షేమ పథకాల అమలు తీరును గమనించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్రైస్తవులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, పాస్టర్లకు జీతాలు, మైనార్టీ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ వంటి హామీలను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఉమ్రాకు బయలుదేరిన యాత్రికులు

    శంషాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మరో యాత్రికుల బృందం ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఉమ్రా యాత్రకు బయలుదేరింది. దాదాపు 60 మంది యాత్రికులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. యాత్రను అల్‌మిజాన్‌ సంస్థ నిర్వాహకులు ఫయాజ్‌ అలీ పర్యవేక్షిస్తున్నారు.

    కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి: సబితారెడ్డి

    శ్రీనగర్‌ కాలనీ: గత రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు తీవ్రంగా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం చివరిరోజు ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్‌కాలనీల్లో బీఆర్‌ఎస్‌ ర్యాలీ నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బీఆర్‌ఎస్‌ అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీతను నిలబెట్టిందని పేర్కొన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే చరిత్ర సృష్టిస్తారని సబితారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన మోసానికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కోరారు. ర్యాలీలో మాజీ కార్పొరేటర్‌ మహేష్‌ యాదవ్‌, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    పలు విమానాలు రద్దు

    శంషాబాద్‌: వివిధ గమ్య స్థానాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో మూడు విమానాలు కూడా రద్దయ్యాయి. ఇందులో 6ఈ 2027 ఢిల్లీ నుంచి హైదరాబాద్‌, జైపూర్‌ నుంచి హైదరాబాద్‌ రావల్సిన 6ఈ–816 రెండు విమానాలతో పాటు సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన 6ఈ –424 విమానం ఆపరేషనల్‌ కారణాలతో రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.

  • ఆలుకు

    సస్యరక్షణ చర్యలు పాటించాలి

    మూడు నెలల్లో పంట చేతికొచ్చే అవకాశం

    ఉద్యాన శాఖ అధికారి అక్షితరెడ్డి

    మోమిన్‌పేట: కూరగాయ పంటలలో అతి తక్కువ కాల పరిమితిలో కోతకు వచ్చేది ఆలు(బంగాళదుంప) పంట మాత్రమే. విత్తిన 90 రోజుల నుంచి 110 రోజులలో పంట కోతకు వస్తుంది. కానీ చాలా మంది రైతులు 70 రోజులకే మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఆలు పంటను సాగు చేసుకొనేందుకు శీతాకాలం అనువైనది. ఎంత చలి ఉంటే అంత ఎక్కవ దిగుబడులు ఆలులో సాధ్యమని మండల ఉద్యాన శాఖ అధికారి అక్షితరెడ్డి తెలిపారు. ప్రస్తుతం అలు సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు.

    ఎకరాకు 15 టన్నులు

    మండలంలోని కోల్కుంద, మోమిన్‌పేట, రావులపల్లి, ఎన్కతల, సయ్యద్‌అల్లిపూర్‌ గ్రామాలలో ఆలును విరివిగా సాగు చేస్తున్నారు. సరియైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. నాణ్యమైన విత్తన రకాలు ఎంచుకోవాలి. కుఫ్రీ పుకరాజ్‌(166), కుఫ్రీ క్యాథి, కుఫ్రీ మోహన్‌(302) లాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. భూమిని బాగా రెండు నుంచి మూడు సార్లు లోతుగా దున్నుకోవాలి. ఎకరాకు 12టన్నుల బాగా మాగిన సేంద్రియ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకొని కలియ దున్నాలి. కొంత మంది రైతులు పచ్చిరొట్ట ఎరువులైన జినుగ, జనుములను సాగు చేసి ఏపుగా పెరిగిన తర్వాత కలియ దున్ని ఆలును సాగు చేస్తున్నారు. ఎకరాకు ఏడు క్వింటాళ్ల విత్తనం సరిపోతుంది. బోదెలను ఏర్పాటు చేసుకొని విత్తుకొవాలి. ఎరువుల యాజమాన్యం పాటించి డ్రిప్‌ ద్వారా నీటిని అందించాలి. ఆలు తెలుతున్న సమయంలో మట్టితో కప్పాలి, లేనిచో ఆలుగడ్డలు పచ్చగా మారుతుంది. దీంతో రైతులకు నష్టం వాటిల్లుతుంది. విత్తుకొన్న 90 రోజుల నుంచి 110రోజులలో పంట కోతకు వస్తుంది. అప్పుడే మార్కెట్‌కు తరలించాలి. ఎకరాకు 9టన్నుల నుంచి 15టన్నుల వరకు దిగుబడులు వస్తాయి.

    విత్తన రాయితీ ఇవ్వాలి

    విత్తనం క్వింటాళుకు రూ.3,600 నుంచి రూ.4వేల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. చాలా మంది పెట్టుబడి అధికం కావడం వలన సాగుకు దూరంగా ఉంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే అధిక సంఖ్యలో రైతులు సాగుకు ముందుకు వస్తారు. విత్తనాలను ఆగ్రా నుంచి తీసుకువచ్చేందుకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంది. అందుకు ప్రభు త్వం విత్తన రాయితీ ఇవ్వాలని కర్షకులు కోరుతున్నారు.

  • ఇంటి నిర్మాణంతో ఉపాధి

    పనులకు ఉపాధి హామీ కింద కూలీలు

    లబ్ధిదారులకు తగ్గనున్న ఆర్థిక భారం

    దౌల్తాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ కింద అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జాబ్‌కార్డు ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇది ఆర్థికంగానే కాక కూలీల కొరత అధిగమించడానికి తోడ్పడనుంది. ఇంటి నిర్మాణంలో ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పాటు పనులు చేసేందుకు అనుమతి ఉంది. ఒక ఇంట్లో ఇద్దరికి ఆపైన జాబ్‌కార్డులు ఉంటే వారిలో ఒకరికి మత్రమే పథకం వర్తిస్తుంది. ప్రస్తుతం ఉపాధి కూలీలకు రోజుకు రూ.307 వేతనం చెల్లిస్తున్నారు. ఈ లెక్కన జాబ్‌కార్డు ఉన్న ఇంటి లబ్ధిదారుడికి రూ.27,630 ప్రయోజనం కలగనుంది.

    290 ఇళ్లు మంజూరు

    ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు బేస్‌మెంట్‌ స్థాయి నిర్మాణం వరకు 40 రోజులు, పైకప్పు స్థాయి వరకు 50 రోజుల పనిదినాలు వినియోగించుకునే వెసులుబాటు ఉంది. రెండు మూడు దశల్లో మంజూరయ్యే ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఉపాధి హామీ జాబ్‌కార్డులు 8వేలు ఉండగా 22వేల మంది కూలీలు ఉన్నారు. మండలంలో మొత్తం 290 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పథకంతో లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గుతుంది.

    అర్హుల ఎంపిక ఇలా

    అర్హులైన లబ్ధిదారుల జాబితాలను ఎంపీడీఓలు రూపొందిస్తారు. ఈ కసరత్తు పూర్తయ్యాక జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతి తీసుకుని గృహ నిర్మాణ శాఖ పీడీకు పంపుతారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అనుసంధానమైన కూలీలు ఇతర పనులకు వెళ్లడానికి అవకాశం ఉండదు. మూడు స్థాయిల్లో పనుల ఫొటోలను లబ్ధిదారుల ఫొటోతో పాటు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. పనులు పూర్తయ్యాక పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరిస్తూ చెల్లింపులకు అనుమతించడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

  • రైలు పట్టాల పక్కన  మృతదేహం లభ్యం

    తాండూరు టౌన్‌: రైలు పట్టాల పక్కన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వికారాబాద్‌ రైల్వే పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం బషీరాబాద్‌ మండలం మంతట్టి రైల్వే స్టేషన్‌ సమీపంలోని రైలు పట్టాల పక్కన మృతదేహం పడి ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని సుమారు 30 ఏళ్ల ఓ మగ మనిషి మృతదేహం పడి ఉందని, ఒంటిపై నీలి రంగు చొక్కా, నారింజ రంగు నిక్కర్‌ ఉందన్నారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 7702629707, 8712513584 ఫోన్‌ నంబర్‌లకు సమాచారం ఇవ్వాలన్నారు.

    ‘డబుల్‌’ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దు..

    హిమాయత్‌నగర్‌: రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(ఆర్‌డబ్ల్యూఏ) పేరుతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టొద్దని మేడ్చల్‌– మల్కాజిగిరి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఆదివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్లు నర్సింగరావు, పెంటయ్య, వినోద్‌ కుమార్‌, శేఖర్‌, శ్రీశైలం యాదవ్‌, శ్రీనివాస్‌చారి, వెంకటేష్‌, నరేష్‌ గౌడ్‌ మాట్లాడారు. ఇటీవల అహ్మద్‌గూడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను జిల్లా కలెక్టర్‌ సందర్శించి 18 సమస్యలను గుర్తించారని, వాటిని పరిష్కరిస్తామని చెప్పి ఇంతవరకూ పట్టించుకోలేదని అన్నారు. భూగర్భ డ్రైనేజ్‌, మంచినీటి పైపుల మరమ్మతు, నిర్వహణ, వీధిదీపాల కరెంట్‌ బిల్లు, పార్క్‌, ఎస్‌టీపీ మెయింటెనెన్స్‌ చార్జీలను లబ్ధిదారులపై విధిస్తే ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు భారం పడుతుందని తెలిపారు. ఈ జిల్లాలో అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు 13 కాలనీల్లో 27 వేల 472 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించిందన్నారు. బహదూర్‌పల్లి, అహ్మద్‌గూడ, మురహరపల్లిలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. కొంతమందికి పట్టాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఇళ్లు కేటాయించలేదన్నారు.

  • కదలివ

    మంచాల: కార్తీక మాసంను పురస్కరించుకొని బుగ్గరామ లింగేశ్వర స్వామి ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారు మోగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పారుతున్న సెలయేరు, షవర్ల వద్ద స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారికి భక్తిశ్రద్ధలతో వ్రతాలు, పూజలు చేశారు. మహిళలు కార్తీక దీపారాధన, తులసి పూజ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు తగిన చర్యలు తీసుకున్నారు.

    రామలింగేశ్వరుడి సన్నిధిలో సేదతీరిన భక్తజనం

  • కంకర రోడ్లు.. ఏళ్లుగా వెతలు

    మర్పల్లి: అధ్వాన రోడ్లతో పదేళ్లుగా మండలవాసులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలోని మర్పల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి రావులపల్లి వరకు వెళ్లే పంచాయతీ రాజ్‌శాఖ రోడ్డు, కోట్‌మర్పల్లి నుంచి ఇజ్రాచిట్టంపల్లి వెళ్లే రహదారి, మర్పల్లి నుంచి సయ్యద్‌ అల్లీపూర్‌ వెళ్లే రోడ్లు పాదచారులు సైతం నడువ లేని స్థితిలో దర్శనమిస్తున్నాయి. ఇక ఇజ్రాచిట్టం పల్లి నుంచి తోర్మామిడి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతుల కోసం సంవత్సరం కిత్రం నిధులు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఇంతవరకు పనులు ప్రారంభించ లేదు. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారుల బాధ వర్ణనాతీతం. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

    కుడుగుంట– రావులపల్లి వెళ్లే రోడ్డు దుస్థితి

  • ఆయిల్‌ మిల్లు.. ఆరోగ్యానికి చిల్లు

    కాలుష్య కారక సంస్థపై చర్యలకు గ్రామస్తుల డిమాండ్‌

    మంచాల: ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఆయిల్‌ మిల్లుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నోముల గ్రామ పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. ఆదివారం గ్రామంలో మిల్లుకు సంబంధించిన లారీని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థాల వలన కాలుష్యం బారిన పడుతున్నామన్నారు. దుమ్ము, ధూళితో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని తెలిపారు. 25 టన్నుల లోడుతో రావాల్సిన లారీలు 60 నుంచి 70 టన్నులతో వస్తున్నాయని ఆరోపించారు. అధిక బరువు వలన రహదారులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శి సుభద్ర దేవికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు జయాసందం, నాయకులు వి.ఆంజనేయులు, ఎర్ర అశోక్‌, చక్రపాణి, రవిందర్‌, యాదయ్య, జంగయ్య, జైపాల్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, అరుణ్‌కుమార్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, గంట తదితరులు పాల్గొన్నారు.

Siddipet

  • వీధుల
    జిల్లాలోని పట్టణాల్లో జనం పాట్లు

    మున్సిపాలిటీల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. రాత్రి అయిందంటే చాలు జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వీధి దీపాలు ఫెయిలైతే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో పట్టణాలకు వీధి దీపాలను సరఫరా చేసిన సంస్థ టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో కొత్త సంస్థలకు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది.

    గజ్వేల్‌: జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీల్లో ప్రస్తుతం వీధి దీపాల సమస్య తీవ్రంగా మారింది. గతంలో ఎక్కడైనా లైట్లు ఫెయిలైతే వెంటనే వాటి స్థానంలో కొత్తవి బిగించేవారు. కానీ నేడు నెలలు గడిచినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ వైశాల్యం ప్రస్తుతం 43 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. పట్టణంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ విలీనం కావడంతో వైశాల్యం గణనీయంగా పెరగడానికి కారణమైంది. ఇకపోతే ఈ పట్టణానికి కంఠహారంగా 24కిలోమీటర్ల మేర రింగు రోడ్డు ఉంది. మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, ముట్రాజ్‌పల్లి, సంగుపల్లి, సంగాపూర్‌, రాజిరెడ్డిపల్లి, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీతోపాటు రింగు రోడ్డు కలుపుకొని ఇక్కడ 7126 వీధి దీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు ఏటా రూ.20లక్షలకుపైగానే ఖర్చవుతోంది. ఇది సాధారణ నిర్వహణ మాత్రమే. ఒకవేళ కొత్త స్తంభాలు, వైరు వేయాలనుకున్నా బడ్జెట్‌ పెరిగే అవకాశముంటుంది.

    ఏడాదిన్నర క్రితం వరకు వీధి దీపాల నిర్వహణ సజావుగానే సాగింది. గతంలో పనిచేసిన ఈఎస్‌ఎల్‌ సంస్థ టెండర్‌ రద్దు కావడంతో కొత్తగా మున్సిపాలిటీల స్థాయిలో టెండర్‌లు నిర్వహించుకొని వీధి దీపాలు వేయించుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాల నేపథ్యంలో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో టెండర్లు పిలువగా..ఓ వ్యక్తి టెండర్‌ను దక్కించుకున్నారు. కానీ ఇప్పటివరకు అగ్రిమెంట్‌ చేసుకోలేదు. పనులు మొదలు పెట్టలేదు. ఈక్రమంలోనే మూడుసార్లు నోటీసులు ఇచ్చినా...ఫలితం లేకుండా పోయింది.

    ఒక్క గజ్వేల్‌లోనే కాదు...సిద్దిపేట మున్సిపాలిటీలోనూ ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ కొంత కాలంగా ప్రధాన ప్రదేశాల్లో చీకట్లు ముసురుకొని జనం ఇబ్బందిపడుతున్నారు.

    బాలికలకు ఇబ్బందులు

    గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో వీధిలైట్లు సక్రమంగా వెలగడంలేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి గజ్వేల్‌లోని బాలికల ఎడ్యుకేషన్‌ హబ్‌, రింగు రోడ్డు వద్ద ఈ సమస్య తీవ్రంగా ఉంది. వెంటనే పరిష్కరించాలి.

    – బారు అరవింద్‌, గజ్వేల్‌

    సమస్యను పరిష్కరిస్తాం

    మున్సిపాలిటీలో వీధి లైట్లకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. టెండర్‌ దక్కించుకున్న వ్యక్తి అగ్రిమెంట్‌ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అతనికి నోటీసులు ఇచ్చాం. ఇప్పటికీ రాకపోతే ఇతర మార్గాల ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

    – బాలకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌,

    గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌

    పలు ప్రధాన కాలనీల్లో..

    పట్టణంలోని పలు ప్రధాన కాలనీల్లో, బాలికల వసతి గృహాల వద్ద, రింగు రోడ్డుపై లైట్లు ఫెయిలై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల రాత్రివేళల్లో దొంగతనలకు ఆస్కారం కలుగుతుండగా, అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. మరోవైపు రోడ్లపై లైటింగ్‌ లేక తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి రూ.341కోట్ల వ్యయంతో నిర్మించిన గజ్వేల్‌ రింగు రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఎక్కడికక్కడా సర్కిళ్లు, అందమైన గార్డెనింగ్‌తో తీర్చిదిద్దారు. కానీ నేడు లైట్లు వెలగక రాత్రివేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది.

  • రైతన్
    ఇంకా నేలవాలిన పంటలే దర్శనం
    ● భారీ వర్షాలతో కోలుకోని అన్నదాతలు ● ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు

    వానాకాలం సీజన్‌లో జిల్లాలో 5,20,672 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 3.63 లక్షల ఎకరాల్లో వరి, సుమారు లక్ష ఎకరాల్లో పత్తి, 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలతో పాటు కంది, పెసర, ఇతర పంట లు సాగయ్యాయి. జిల్లాలో 3,916 మంది రైతులకు చెందిన 5,483 ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యవసా యాధికారుల అంచనా ఉండగా ఇంతకు రెట్టింపు గానే నష్టం వాటిల్లినట్లు కనబడుతోంది.

    ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మల్లుగారి నర్సింహారెడ్డి. దుబ్బాకకు చెందిన ఇతను వానాకాలంలో తన సొంత పొలంతోపాటు కౌలుకు తీసుకొని మొత్తం 20 ఎకరాల్లో వరి వేశారు. రూ.4 లక్షలకు పైగా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. తీరాపంట చేతికొచ్చేవేళ వర్షాలు దంచికొట్టడంతో పొలంలోనే పంటంతా నేలవాలింది. పైగా గొలలు మొలకలొస్తూ తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. పంటంతా నేలవాలడంతో కోసేందుకు సైతం వీలుకావడంలేదు. సగం పంటైనా దక్కుతుందో లేదో అంటూ రైతు ఆవేదన చెందుతున్నారు. ఈ ఒక్క రైతుదే కాదు చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది.

    దుబ్బాక: రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా తయారైంది. పగబట్టినట్లుగా వరణుడు రైతులను కోలుకోలేకుండా చేశాడు. సరిగ్గా పంటలు చేతికొస్తాయనుకున్న దశలోనే భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. వరిపంటలు కోసిన రైతులు కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ యార్డులు, రోడ్లపై ఆరబెట్టగా వానలు దంచికొట్టడంతో ధాన్యం తడిసిముద్దవడం, కొట్టుకుపోవడంతో తీరని నష్టం ఏర్పడింది. చాలా చోట్ల కోతకొచ్చిన వరిపంటలు పొల్లాల్లోనే నేలవాలి ఉన్నాయి. దీంతో కోసేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.

    కన్నీటిపర్యంతం

    ఆరుగాలం రెక్కలు ముక్కలు జేసుకొని పండించిన పంటలు తీరా నోటికాడికొచ్చే సమయంలో నాశనం కావడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. పంటల నష్టంతో తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని ప్రభుత్వమే సమగ్రంగా పంటల నష్టంపై సర్వే జరిపించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు.

    అధైర్యపడొద్దు

    మోంథా తుపాన్‌తో జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు నష్టం వాటిల్లింది. జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం అందిస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు. –స్వరూపరాణి,

    జిల్లా వ్యవసాయ అధికారి

  • డబుల్
    ● ఖాళీ గదుల్లో అసాంఘిక కార్యక్రమాలు ● జోరుగా గంజాయి, మద్యం సేవనం ● రోజూ కొత్త వ్యక్తుల సంచారం ● చోద్యం చూస్తున్న అధికారులు

    డబుల్‌బెడ్రూం గృహాలు

    దుబ్బాకరూరల్‌: పట్టణంలోని ఖాళీ డబుల్‌ బెడ్రూంల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. మద్యం, గంజాయి వంటివి సేవించడమేకాకుండా ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, పోలీసులు అటువైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. దుబ్బాకలో ఇల్లు లేని పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. 900వందల వరకు ఇళ్లు ఉంటాయి. మూడేళ్ల క్రితం కొందరికి పంపిణీ చేశారు. సుమారు 800వందల ఇళ్లల్లో ప్రజలు తమ కుటుంబీకులతో ఉంటున్నారు. ఇందులోనూ మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులే ఉండాలి. కానీ స్థానికేతరులే అధికంగా ఉంటున్నారు. కేటాయించని వాటిలోనూ కొందరు అక్రమంగా నివసిస్తున్నారు. కొంత మంది యువకులు మత్తు పదార్థాలు సేవిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారు. శని, ఆదివారాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

    ఇళ్ల సమీపంలోనే బెల్ట్‌ షాపు

    డబుల్‌ బెడ్రూంల వద్ద బెల్ట్‌ షాపు ఉండడంతో విచ్చల విడిగా విక్రయాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలుదాటినా విక్రయాలు జరుగుతున్నా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్‌ బెడ్రూంల్లో రోజూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్తున్నాయి. పోలీస్‌లు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపిస్తున్నారే తప్ప అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడంలేదు. మరోవైపు కొందరు మృత్యువాత పడుతున్న ఘటనలు సైతం జరుగుతున్నాయి. ఇవి ఆత్మహత్యలా? లేక హత్య లా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. డబుల్‌ బెడ్రూంల వద్ద సీసీ కెమెరాలు సైతం పూర్తి స్థాయిలో లేకపోవడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారని స్థానికులు వాపోతున్నారు.

  • మల్లన

    కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలిరావడంతో సందడిగా మారింది. మట్టికుండలో మల్లన్నకు బెల్లం పాయసం తయారు చేసి బోనం నివేదించారు. చెలక, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకున్నారు. గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టారు. కొండపై ఉన్న ఎల్లమ్మను దర్శించుకుని తమ పిల్లాపాపలను చల్లంగా చూడలని వేడుకున్నారు.

    చెత్త ఆటోలకు తుప్పు

    చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామాల్లో చెత్తను వెంట వెంటనే తరలించడానికి ప్రతి పంచాయతీకి స్వచ్ఛ భారత్‌ ఆటోలు అందజేశారు. ట్రాక్టర్లు వెళ్లలేని కానీలలో చెత్తను తీసుకెళ్లడానికి ఆటోలను కేటాయించారు. చాలా గ్రామాల్లో చెత్త ఆటోలను మూలన పడేశారు. అవి తుప్పు పట్టిపోతున్నాయి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చే ఆటోలకు ఈదుర్గతి పట్టడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    ‘పద్యం’ చిరస్మరణీయం

    ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పద్యం పదికాలాల పాటు నిలుస్తుందని, ధారణతో కూడిన అవధానం తెలుగు సాహిత్యంలోనే ఉందని అవధాని గౌరిభట్ల రఘురామశర్మ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర క్షేత్రం మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పూజలు, హోమాలు, వైధిక కార్యక్రమాలతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశపతి శ్రీనివాసశర్మ, రుక్మాభట్ల కొదండరామశర్మలు సంగీతంతో అలరించారు. అష్టావధానాన్ని డాక్టర్‌ గౌరిభట్ల రఘురామశర్మ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు పండరి రాధకృష్ణ, కవులు, రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.

    తాగునీటి సరఫరాలో

    నేడు అంతరాయం

    సిద్దిపేటజోన్‌: లోయర్‌ మానేరు డ్యామ్‌ మరమ్మతుల నేపథ్యంలో సోమవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇల్లంతకుంట శివార్లలో పైపులైన్‌ లీకేజీ వల్ల అత్యవసర మరమ్మతులు నిర్వహిస్తున్నారని, దీంతో 18, 19, 20, 21, 36వ వార్డుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు. ఆయా వార్డుల ప్రజలు సహకరించాలని కోరారు.