‘మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తేవాలి’
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సమాజం నుంచి మూఢ నమ్మకాలను రూపుమాపేందుకు మూఢ న మ్మకాల నిర్మూలనచట్టం తేవాలని తెలంగాణ విద్యా వంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య డి మాండ్ చేశారు. ఆదివారం టీఎన్‌జీఓ భవన్‌లో నాస్తిక సమాజం, బీటీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మూఢ విశ్వాసాలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో సైన్స్ వేగంగా ముందుకు పోతున్న తరుణంలో మూఢనమ్మకాలతో సమాజం వెనుకబడుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఇప్పటికీ అమలులో ఉందన్నారు. అక్కడ ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. మూఢనమ్మకాల వల్ల సమాజంలో అమానవీక ఘటనలు కొనసాగుతున్నాయన్నారు. అందుకు ప్రతిఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. మారుతున్నకాలంతో తామూ మారాలన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మరూపంలో కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం భారత సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రలో అవలక్షణాలను సనాతన ధర్మం రూపంలో కొనసాగిస్తూ ప్రజలను విడదీస్తూ మెజారిటీ మతోన్మాదాన్ని ఎక్కిస్తూ పాసిజాన్ని సమాజంపై రుద్దుతున్నారన్నారు. వారి ఆధిపత్యం చెలా యి స్తూ ఇదే ప్రజాచైతన్యం.. ఇదే దేశభక్తి అని చాటుతున్నారన్నారు. కార్యక్రమంలో నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షుడు జనార్దన్, భారత నాస్తిక సమాజం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మైత్రియాదయ్య, బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్న య్య, భాస్కర్, జయకుమార్, పద్మావతి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి విజయ్‌కుమార్, బాలరాజు, వామన్ కుమార్, పాలమూరు అధ్యయన వేదిక కార్యదర్శి రాఘవాచారి, జక్కగోపాల్, ఇందిరా,రవికుమార్, యాదయ్య, హనుమంతు, సుధాకర్, సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ సింగిరెడ్డి పరమేశ్వర్, ప్రవీణ్, రామదాసు పాల్గొన్నారు.


