కాల్వలో పడి ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కాల్వలో పడి ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం

Nov 11 2025 7:25 AM | Updated on Nov 11 2025 7:25 AM

కాల్వ

కాల్వలో పడి ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం

కొత్తకోట రూరల్‌: కొత్తకోట మండలంలోని అమడబాకుల సమీపంలో గల వాగులో పడి మైనార్టీ గురుకుల పాఠశాల (దేవరకద్ర–1) కళాశాల విద్యార్థి మృతి చెందిన ఘటన ఆది వారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపి న వివరాల మేరకు.. మహబూబ్‌నగర్‌కు చెంది న ఆది నవీన్‌కుమార్‌(16) మైనార్టీ కళాశాలలో సీఈసీ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతు న్నాడు. రోజు వారీ లాగానే ఆదివారం సాయంత్రం లెక్చరర్‌ రాజశేఖర్‌ విద్యార్థుల హాజరు తీసుకునే క్రమంలో ఆది నవీన్‌కుమార్‌ కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రాత్రికి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యా దు చేశా రు. సోమవారం కళాశాల సమీపంలో ని పొ లాలకు వెళ్లే రైతులకు కాల్వలో మృత దే హం కనిపించడంతో పోలీసులకు సమాచా రం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మైనార్టీ స్కూల్‌, కళాశాల ప్రిన్సిపాల్‌కు సమా చారం అందించారు. ఘటన స్థలానికి చేకుకు న్న వారు తమ కళాశాలకు చెందిన ఆది నవీన్‌కుమార్‌గా గుర్తించారు. ఆదివారం సెలవు దినం కావడంతో బయటకు వెళ్లి ఈత నేర్చుకునే క్రమంలో కాల్వలో నీటి ఉధృతి ఎ క్కువగా ఉండటంతో విద్యార్థి మృతి చెంది ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అదుపులోకి

ఆరుగురు అకతాయిలు

మహబూబ్‌నగర్‌ క్రైం:షీ టీం బృందాలు సోమ వారం జిల్లాలో ఆరుచోట్ల తనిఖీ చేసి మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురి చేయ డానికి ప్రయత్నం చేసిన ఆరుగురు యువకులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. జడ్చర్ల మండల పరిధిలో జెడ్పీహెచ్‌ఎస్‌ గంగాపూర్‌, పోలీస్‌ లైన్‌ హైస్కూల్‌ మహబూబ్‌నగర్‌, పిల్లల మర్రి ప్రాంతం, బా య్‌ హాస్టల్‌ క్రిస్టియన్‌పల్లిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రద్దీ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేసి వేధింపులకు గురిచేసే ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో సందర్శించి అనుమానితులను పరిశీలించారు. వేధింపులకు గురైన మహిళలు, అమ్మాయిలు ఉంటే డయల్‌ 100 లేదా షీటీం హెల్ప్‌లైన్‌ 112కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

అడ్డాకుల: మండలంలోని బలీదుపల్లికి చెందన ఎర్రంశెట్టి సత్యనారాయణ (45) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు.. గ్రామా నికి చెందిన సత్యనారాయణ హైదరాబాద్‌లో నివాసముంటూ ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 21న కోకాపేట వద్ద బైక్‌పై వెళ్తుండగా ట్యాంకర్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ 20 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసు కొచ్చారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ట్రాక్టర్‌ రొటవేటర్‌లో

పడి విద్యార్థి దుర్మరణం

బల్మూర్‌: పాఠశాలకు వెళ్లాల్సిన ఓ విద్యార్థి ట్రాక్టర్‌ వెంట వ్యవసాయ పొలానికి వెళ్లి డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా రొటవేటర్‌లో పడి మృతి చెందిన ఘటన మండలంలోని కొండనాగులలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్‌, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కొండనాగుల గ్రామానికి చెందిన స్వామి, ఉసేనమ్మ దంపతుల కుమారుడు శ్రీహరి (12) స్థానిక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. శ్రీహరి సోమవారం అనారోగ్యంతో ఇంటి వద్దే ఉండగా తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. గ్రామానికి చెందిన శివకోటి ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్న మహేష్‌ రైతు రాంచంద్రయ్యగౌడ్‌ పొలాన్ని దున్నేందుకు వెళ్తూ.. శ్రీహరితో పాటు అతడి మిత్రుడు రామును వెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలో భూమి చదును చేస్తుండగా ట్రాక్టర్‌ వెనకాలే ఉన్న విద్యార్థి శ్రీహరి రోటవేటర్‌పై ఎక్కేందుకు ప్రయత్నించగా కాలుజారి అందులో పడిపోయాడు. ఇది గమనించని డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను ముందుకు తీసుకెళ్లడంతో శ్రీహరి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంపై తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వారి నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

కాల్వలో పడి ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం 
1
1/2

కాల్వలో పడి ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం

కాల్వలో పడి ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం 
2
2/2

కాల్వలో పడి ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement