జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు క్రీడాకారులు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని వాలీబాల్ అకాడమీకి చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గదర్‌వర్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ పోటీలకు నరేష్ ఎంపికయ్యాడు. ఉత్తర్రపదేశ్ రాష్ట్రం బరేరిలో నేటి (మంగళవారం) నుంచి ఈనెల 15 వరకు జరిగే అండర్–17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ వాలీబాల్ పోటీలకు చందు, మైత్రిలు ఎంపికయ్యారు. క్రీడాకారులను జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఎస్.శ్రీనివాస్, కోచ్ పర్వేజ్‌పాష అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
చందు
నరేష్
మైత్రి
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు క్రీడాకారులు
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు క్రీడాకారులు


