12న ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–14, అండర్–17 విభాగం బాల, బాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల, బాలికలు ఒరిజినల్ స్కూల్ బోనోఫైడ్, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో ఉదయం 9 గంటలకు పీడీ ఆనంద్‌కుమార్‌గౌడ్‌కు రిపోర్టు చేయాలన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నం.98497 06360ను సంప్రదించాలని ఆమె సూచించారు.
13న జిల్లా క్రికెట్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని ఎండీసీఏ మైదానంలో గురువారం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 బాలుర క్రికెట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ బోనోఫైడ్, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో పీడీ అబ్దుల్లాకు రిపోర్టు చేయాలని, మిగతా వివరాల కోసం సెల్ నం.90005 74651ను సంప్రదించాలని కోరారు. క్రీడాకారులు వైట్ డ్రెస్ కోడ్, పూర్తి కిట్‌తో ఎంపికలకు హాజరుకావాలని సూచించారు.


