‘ప్రపంచ ప్రసిద్ధ కథలు’ ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: వరంగల్ తెలంగాణ రచయితల సంఘం, మిత్రమండలి ఆధ్వర్యంలో
కవిత్వంతో కలుద్దాం కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. హనుమకొండలోని భీమారం చాణక్యపురిలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవి, డాక్టర్ లంకా శివరామప్రసాద్ రచించిన ‘ప్రపంచ ప్రసిద్ధ కథలు’ సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాళోజీ పురస్కార గ్రహీత నెల్లుట్ల రమాదేవి ‘చావుకు కళ లేదు’ అనే కవితను వినిపించారు. కార్యక్రమంలో తెరసం రాష్ట్ర ఉపాధ్యక్షులు గణపురం దేవేందర్, బాలబోయిన రమాదేవి, మాదారపు వాణిశ్రీ, అనితారాణి, నాగవెల్లి జితేందర్, రాములు, రామ బ్రహ్మచారి, గోవర్ధన్‌రెడ్డి, మైస ఎర్రన్న, బిటవరపు శ్రీమన్నారాయణ తదితర కవులు పాల్గొని తన కవితలను వినిపించారు. అనంతరం కవులను ఘనంగా సత్కరించారు.
భద్రకాళికి ట్రెయినీ ఐఏఎస్‌ల పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం ట్రెయినీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లతోపాటు సినీ హీరో రాజ్‌తరుణ్ దర్శించుకున్నారు. వారికి ఆలయ పరిశీలకుడు క్రాంతికుమార్, ధర్మకర్తలు ఓరుగంటి పూర్ణచందర్, తొనుపునూరి వీరన్న స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని మైసూర్ ఆర్‌ఐఈ విద్యావిభాగం ప్రొఫెసర్ బుర్ర రమేశ్ సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ ఎ. సంజీవయ్య విధులను నిర్వర్తించి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అధ్యాపకులు హనుమకొండలోని డైమండ్‌హిల్స్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివా రం నిర్వహించిన విద్యాసదస్సు, సంజీవయ్య అభినందన సభలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని అభిప్రాయపడ్డారు. టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, రాష్ట్ర మాజీ కార్యదరి భోగేశ్వర్, అధ్యాపకులు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్, సోమయ్య, అ ధ్యాపకుల జ్వాల సంపాదకుడు గంగాధర్‌రె డ్డి, డాక్టర్ ఎం.శంకర్‌నారాయణ, ఆసనాల శ్రీ నివాస్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ సంజీవయ్య అధ్యాపకుడిగా అందించిన సేవలను కొనియాడారు.
‘ప్రపంచ ప్రసిద్ధ కథలు’ ఆవిష్కరణ


