గడ్డిమందు
క్షణికావేశంలో తాగి ఆత్మహత్య
ప్రాణం తీస్తున్న
సాక్షి, మహబూబాబాద్: మారుతున్న కాలంతోపాటు అందిపుచ్చుకున్న శాస్త్ర విజ్ఞానం రైతులు, రైతు కుటుంబాలకు శాపంగా మారింది. పంటపొలాల్లో కలుపు నివారణకు వినియోగించే గడ్డిమందు ప్రజల ప్రాణాలు తీసేందుకు ఉపయోగపడుతోంది. రైతులకు అందుబాటులో ఉండే ఈ మందు తాగితే కోలుకోవడం కష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే గడ్డి మందు తాగిన వారిలో 99శాతం మృతి చెందడం గమనార్హం. అయితే ఇంతటి ప్రమాదకరమైన గడ్డి మందును ప్రభుత్వం నిషేధిస్తే తప్ప.. ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య తగ్గదని, ప్రభుత్వం దీనిని నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.
40 గంటలకో ఆత్మహత్య..
గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లా మహబూబాబాద్. ఇక్కడ డైబ్బె శాతానికి మించి ప్రజలు వ్యవసాయం చేస్తుంటారు. చిన్న చిన్న కమతాలను నమ్ముకొని వ్యవసాయం చేయడం, అప్పు ల పాలు కావడం సహజం. దీనికి తోడు సున్నిత మనస్సు గలవారు ఎక్కువగా ఉండడంతో చిన్న చిన్న సమస్యలకు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అధికంగా ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఇళ్లలో ఉన్న గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకోవ డం.. లక్షలు ఖర్చుచేసినా బతికిన వారు లేరని ఇక్క డి ప్రజలు చెబుతుంటారు. ఇలా ఐదేళ్లలో 1,172 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఏడాదికి సగటున 234మంది చనిపోగా ప్రతీ 40 గంటలకు ఒక ఆత్మహత్య కేసు నమోదు అవుతోంది. జిల్లాలో కేసముద్రం, గూడూరు, తొర్రూరు, డోర్నకల్, కొత్తగూడ, బయ్యారం, గార్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం.
గడ్డిమందు తాగే అధికంగా..
జిల్లాలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వారు అధికం. గత ఐదేళ్లలో 905 మంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా అంటే 800పైగా గడ్డి మందులు గ్లైకోసెడ్, పండిమిథాలిన్, ప్రిటిల్లాక్లోర్, నామినీ గోల్డ్, ఆల్‌మిక్స్ తాగారు. ఈ మందులు తాగిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయే వరకు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబ సభ్యులు పేషెంట్‌ను బతికించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలైనప్పటికీ ప్రాణాలు కాపాడుకోలేని సంఘటనలు ఉన్నాయి. ఇంతటి ప్రమాదకరమైన ఈ గడ్డి మందు రైతుల ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ పెట్టడం.. ఫర్టిలైజర్ షాపు యజమానులు ఎవరికి పడితే వారికి విక్రయాలు జరపడంతో అందుబాటులో ఉంటుంది. ఆవేశం వచ్చిన వెంటనే తాగి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మందు ప్రభావంతో పంటలు కూడా విషతుల్యం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధికంగా గడ్డి మందు వినియోగించి పండించిన పంటలు తింటే కేన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతటి ప్రమాదకరమైన గడ్డి మందు విక్రయాలే కాదు.. అసలు తయారీనే నిషేధించాలని ప్రజా సంఘాలు, డాక్టర్లు కోరుతున్నారు.
ఐదేళ్లలో ఆత్మహత్యల వివరాలు
సంవత్సరం మృతులు
2021 218
2022 244
2023 224
2024 248
2025 238
(ఇప్పటివరకు)
తాగితే కోలుకోవడం కష్టమే
ఏడాదికి 234 మంది తనువు చాలించారు
గడ్డి మందు నిషేధించాలని ప్రజల డిమాండ్
ఆత్మహత్య చేసుకున్న విధానం
క్రిమిసంహారక
మందు తాగి 905
ఉరివేసుకొని 331
నీటిలో పడి 65
బర్నింగ్ 19
గడ్డిమందు
గడ్డిమందు


