కమ్యూనిస్టులంతా ఏకం కావాలి
నెహ్రూసెంటర్: దేశంలో కమ్యూనిస్టులంతా ఏకం కావాలని, మనం బలంగా లేకపోవడంతో మతో న్మాదం, పెట్టుబడిదారి వ్యవస్థలు పెరుగుతున్నాయ ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వీరభవన్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసి ఒకే పార్టీగా ఏర్పడి పాలన సాగిస్తున్నాయని, దేశంలో నిత్యం పేదల పక్షాన పోరాడే ఎర్రజెండాలు ఒకే గొడుగు కిందకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వందేళ్లు ప్రజల పక్షాన పోరాటాలు సాగించిన రాజకీయ పార్టీగా సీపీఐకి ఘనత దక్కుతుందన్నారు. డిసెంబర్ 26న సీపీఐ వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది సభను ఖమ్మంలో నిర్వహిస్తున్నామని, సభకు 40 దేశాలు, తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి ప్ర తినిధులు హాజరవుతునారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కుటుంబ, దోపిడీ పాలన సాగించిందని అందుకే ప్రజలు ఆ పార్టీని ఓడించారని విమర్శి ంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ లను అమలు చేయాలని, మంత్రులు అంతర్గత కుమ్ములాటలు మానుకోవాలని హితవుపలికారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ప్రచారం నిర్వహించామని ఆయన చెప్పారు.
కమ్యూనిస్టులతో కలిసి పని చేయాలి..
మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు బయటకు వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరా టాలు చేయాలని శ్రీనివాసరావు అన్నారు. అనంతరం జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశంలో సభ విజయవంతం, రాజకీయ పరిస్థితులు, ఎన్నికలపై సమీక్షించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, రాష్ట్ర సమితి సభ్యులు అజయ్‌సారథిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కుమార్, వెంకన్న, వరిపెల్లి వెంకన్న, రాజన్న, జిల్లా సమితి సభ్యులు పాల్గ్గొన్నారు.


