ఉచిత న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: పేద ప్రజలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ న్యాయవాది యాసాడి చెన్నమల్లారెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి నాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం న్యాయ సేవల దినోత్సవం నిర్వహించారు. వాకర్స్ సభ్యులను అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీమార్గంతో సత్వరమే పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌లలో కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో పోక్సోకేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య, న్యాయవాదులు మోహన్, శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి, వాకర్స్ సభ్యులు మల్లయ్య, వెంకట్‌రెడ్డి, వాసుదేవ్, చంద్రయ్య, రాము, పారాలీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.


