26 కిలోల గంజాయి పట్టివేత
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో ఆదివారం ఎకై ్సజ్ పోలీసులు 26 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో గంజాయి రవాణా జరుగుతుందని సమాచారం వచ్చింది. విశాఖపట్నం నుంచి వచ్చే రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్నారని ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ బృందం స్టేషన్ సమీపంలోని అనుమానంగా ఉన్న మూడు బ్యాగులను గుర్తించారు. వాటిని విచారించగా ఎవరు కూడా తమదని ముందుకు రాలేదు. దీంతో బ్యాగులను తెరిచి చూడగా బ్రౌన్ కలర్ టేప్‌తో చుట్టబడిన పాకెట్స్ ఉన్నాయి. వాటిలో ఎండు గంజాయి ఉంది. వాటిని లెక్కించగా 13 ప్యాకెట్‌లలో 26 కిలోల ఎండు గంజాయి ఉంది. స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది విష్ణువర్ధన్‌రెడ్డి, రవికిరణ్, శివప్రసాద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


