చట్టాలపై అవగాహన అవసరం
అనంతగిరి: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వికారాబాద్ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల నిరోదక చట్టం, ఫోక్సో చట్టం, గృహ హింస, వృద్ధుల సంరక్షణ చట్టం వాటి ఉద్దేశాలు, శిక్షల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని సూచించారు. 18 సంవత్సరాల నిండిన తర్వాతనే అమ్మాయిలకు వివాహం చేయాలన్నారు. బాల్యవివాహాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను పనిలో పెట్టుకోరాదని సూచించారు. బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహబూబ్ ఫాతిమా, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేష్, రాము, శ్రీనివాస్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి వెంకటేశ్వర్లు


