వణుకు మొదలాయె!
బషీరాబాద్: చలిపులి జనాన్ని వణికిస్తోంది. జిల్లాలో ఐదు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో జనం ఉదయం వేళల్లో బయటికి రావడానికి జంకుతున్నారు. నవంబర్ మొదటి వారం వరకు వర్షాలు కురవడంతో చలి గాలులు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఆదివారం జిల్లాలో పగటి ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీలుగా నమోదైంది. గ్రామాల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. జనం ఉన్ని దుస్తులు ధరించి బయటికి వస్తున్నారు.
క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
జిల్లాలో 15 డిగ్రీల కనిష్ట స్థాయికి..
పగలు 27 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదు
ఉన్ని దుస్తులకు పెరిగిన డిమాండ్
ఐదు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో..)
తేదీ పగలు రాత్రి
5 28 21
6 27 20
7 27 19
8 26 18
9 27 15


