పొలాల్లోనే బేరం
64,476 మెట్రిక్ టన్నులు అవసరం
వికారాబాద్: సన్నరకం వడ్లకు బహిరంగ మార్కె ట్‌లో ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. అధిక ధర పలుకుతోంది. వ్యాపారులు పొలాల వద్దే కొనుగోలు చేస్తు న్నారు. నూర్పిడి కాకముందే బయానా ఇచ్చే పంట తమదేనని ఖాయం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సన్నాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే రెండింతలైంది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో సన్న రకం వరి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. క్వింటాలు సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించిన నేపథ్యంలో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం దిగుబడి కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తమ వ్యాపారం దెబ్బతింటుందని హైరా నా పడుతున్నారు. ఈ క్రమంలో పొలాల వద్దకు పరుగులు పెడుతున్నారు. నూర్పిడులు అవుతుండగానే బేరాలకు దిగుతున్నారు. జిల్లాలో 1.52 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా 25 శాతం వరకు సన్నాల సాగు చేస్తున్నారు. దిగుబడిలో ఎక్కువ శాతాన్ని బహిరంగ మార్కెట్ లేదా బియ్యంగా మా ర్చి విక్రయిస్తున్నారు. దీంతో రైతులకు మంచి ధర లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఐదు శాతానికి మించి రావడం లేదు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి పక్క జి ల్లాపై ఆధార పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జి ల్లాలోని దిగుబడినంతా సేకరించడం తప్పని సరిగా మారింది. గతేడాది బోనస్ డబ్బు ఇంకా చెల్లించకపోవడంతో ఈ సారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తుందా? రాదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
పెరిగిన సన్నాల సాగు
జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 93 వేల ఎకరాలు కాగా ఈ ఏడాది 1.52 లక్షల ఎకరాల్లో పంట వేశారు. పరిగి వ్యవసాయ డివిజన్‌లో అత్యధికంగా.. ఆ తర్వాత తాండూరు, కొడంగల్ డివిజన్లలో భారీగా సాగు చేశారు. గతేడాది 14 వేల ఎకరాల్లో పంట వేయగా ఈ సారి 38 వేల ఎకరాల్లో సాగు చేశారు.
సన్న రకం వడ్లకు ఫుల్ డిమాండ్
ఈ ఏడాది సాగు విస్తీర్ణం 38వేల ఎకరాలు
ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు మూడు లక్షల టన్నుల దిగుబడి
కొనుగోలు కేంద్రాలకు వస్తోంది ఐదు శాతం లోపే..
రూ.500 బోనస్ ప్రకటించినా ఆసక్తి చూపని రైతులు
జిల్లాలో మొత్తం 2.5లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా లబ్ధిదారులకు 5,373 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి 64,476 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 38 వేల ఎకరాల్లో సన్నరకం వడ్లు సాగు చేశారు. యాసంగిలో మరో 30 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సీజన్లలో కలిపి లక్ష నుంచి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాల ద్వారా 65 నుంచి 70 వేల మెట్రిక్ టన్నులు సమకూరే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లాలో మొత్తం ధాన్యాన్ని సేకరిస్తేనే రేషన్ దుకాణాలకు సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. లేకుంటే పొరుగు జిల్లాలైన సంగారెడ్డి, నిజామాబాద్, నారాయణ్‌పేట్, నాగర్‌కర్నూల్, ఏపీలోని కర్నూల్ జిల్లా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.


