ఎక్కడా మలుపులు ఉండొద్దు
తాండూరు: హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిలో ఎక్కడా మలుపులు లేకుండా విస్తరణ పనులు జరిగేలా కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇటీవల మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌కుమార్‌తో కలిసి పరామర్శించారు. పిల్లల చదువుకు సాయం చేస్తామని తల్లి రేహానా బేగంకు హామీ ఇచ్చారు. అనంతరం రూ.20 వేలు నగదు అందజేశారు. వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందుతుందని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల క్రితం నగరంలోని పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి విస్తరణకు రూ.1,000 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వివిధ కారణాల వల్ల పనులు సాగలేదన్నారు. మలుపులు లేని రహదారి నిర్మాణం కోసం అఖిల పక్ష నేతలు కలిసి వస్తే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి సమస్యను పరిష్కరించుకుందామని తెలిపారు. యాలాల మండలం హాజీపూర్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలకు నగరంలో ఐఏఎస్ అధికారులు నిర్వహించే ఆశ్రమంలో చేర్పిస్తామన్నారు. అక్కడే చదువు చెప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, నాయకులు మల్లేశం, సందీప్‌కుమార్, కిరణ్, రజినీకాంత్, వీరేశం, జగన్ ముదిరాజ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నారుల బాధ్యత నాదే
యాలాల: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాధ్యత తాను తీసుకుంటానని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హాజీపూర్‌లో చిన్నారులు శివలీల, భవానీని పరామర్శించి రూ.30 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం లక్షీనారాయణపూర్‌లో అఖిలారెడ్డి, పేర్కంపల్లిలో ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట యాలాల మాజీ ఎంపీపీ, బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్‌గుప్తా, జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్ ఉన్నారు.
కనుచూపు మేర రోడ్డు కనిపించాలి
మీర్జాగూడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి


