కార్మిక సమస్యలు పరిష్కరించండి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్
అనంతగిరి: మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కార్మిక సమస్యల పరిష్కారం కోసం పట్టణంలోని ప్రధాన కూడలిలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎఫ్ పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. రెండు సంవత్సరాల యూనిఫారాలు, నూనె, సబ్బులు ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగణంగా వేతనాలను రూ.26 వేలకు పెంచాలన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను వెంటనే రెగ్యూలర్ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బుచ్చయ్య, శంకర్, జంగమ్మ, లక్ష్మమ్మ, రాములు తదితరులు పాల్గొన్నారు.


