అబ్జర్వర్‌గా విద్యాసాగర్
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా పోటీలకు టాలెంట్ ఐడెంటిఫికేషన్ అబ్జర్వర్‌గా జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడాపాఠశాలలో అథ్లెటిక్స్ శిక్షకుడిగా విధులు నిర్వర్తిస్తున్న విద్యాసాగర్ నామినేటెడ్ అయినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సారంగపాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఖేల్ ఇండియా ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌లో పోటీలకు అబ్జర్వర్‌గా పనిచేస్తారని పేర్కొన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ లెవల్ 2 కోర్స్ పూర్తి చేసినందుకు ఈ అవకాశం లభించిందన్నారు. గిరిజనశాఖ డీడీ రమాదేవి, క్రీడల అధికారి షేకు, హెచ్‌ఎం జంగు తదితరులు విద్యాసాగర్‌ను అభినందించారు.


