అందెశ్రీకి నివాళి
కాగజ్‌నగర్‌టౌన్:ప్రముఖ రచయిత అందెశ్రీ కి నివాళులర్పిస్తూ సోమవారం రాత్రి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వర కు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ అందె శ్రీ మరణం తీరని లోట ని, తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా, రచయితగా రాణించి ఎన్నో అవార్డులను అందుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ముంజం ఆనంద్‌కుమార్, రాజ్‌కమలాకర్‌రెడ్డి, ఈర్ల సునీల్ కుమార్, విస్తారు, డోంగ్రి సంతోష్ తదితరులు పాల్గొన్నా రు.


